‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?


Olympic ad‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార ప్రకటనను రూపొందించింది బ్రిటన్ కంపెనీయేనని తెలియడంతో అసలు ఒలింపిక్స్ ని రాజకీయం చేస్తున్నది అర్జెంటీనా దేశమా లేక బ్రిటన్ దేశమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బ్రిటన్ కి వేల మైళ్ళ దూరంలో దూరంలోనూ, అర్జెంటీనాకి అత్యంత సమీపంలోనూ ఉన్న ‘మాల్వియన్స్’ ద్వీపకల్పాన్ని తన భూభాగంగా లండన్ చెప్పుకుంటోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనీ, తన వలస ఆక్రమణలోని మాల్వియన్ ద్వీపాలనుండి బ్రిటన్ బైటికి రావాలనీ ఐక్యరాజ్య సమితి చేసిన హెచ్చరికలను కూడా బ్రిటన్ పెడ చెవిన పెడుతోంది. ఇపుడు తగుదునమ్మా అని క్రీడలను కూడా తన వలస ప్రయోజనాలకు వాడుకుంటోదని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

బుధవారం, మే 2 న అర్జెంటీనా టెలివిజన్ ఒక ప్రకటనను ప్రసారం చేసింది. అందులో అర్జెంటినా జాతీయ హాకీ టీం కెప్టెన్ ‘ఫెర్నాండో జిల్బర్ బర్గ్’ ఒలింపిక్ క్రీడలకు తయారవుతున్న దృశ్యం ఉన్నది. మాల్వియన్స్ రాజధాని స్టాన్లీ లో ఆయన రన్నింగ్ చేస్తున్న దృశ్యాలు ప్రకటనలో ఉన్నాయి. ద్వీపంలోని అనేక స్మారక స్ధలాల గుండా ఫెర్నాండో రన్నింగ్ చేస్తుంటాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన బ్రిటన్ సైనికుల స్మారకార్ధం నిర్మించిన ‘గ్రేట్ వార్ మెమోరియల్’ మెట్లపైన ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉంటాడు. “ఇంగ్లీష్ గడ్డ పై పోటీ పడడానికి మేము అర్జెంటీనా గడ్డపై శిక్షణ తీసుకుంటాము” అని ఫెర్నాండో చెప్పడంతో ప్రకటన ముగుస్తుంది.

ఈ ప్రకటన పైన బ్రిటన్ మంత్రులు గొడవ మొదలు పెట్టారు. టి.వి ప్రకటన ‘విచారకరమైన స్టంట్’ గా బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ అభివర్ణిస్తూ “ప్రపంచంలో ఎవరూ దీనిని మెచ్చరు” అని అన్నాడు. మాల్వియన్స్ ద్వీప కల్పం ముమ్మాటికీ తమదే అని మరొకసారి చెప్పుకోవడానికి అర్జెంటీనా ఒలింపిక్స్ క్రీడల ప్రకటనను వినియోగించుకున్నాడు.

ఇక రక్షణ మంత్రి ఫిలిప్ హెమ్మండ్ క్రీడా వ్యాఖ్యాత అవతారం ఎత్తాడు. “అభిరుచి లేని”, “అవమానకరమైన” అర్జెంటీనా ప్రకటన మీద చర్య తీసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సలహా పడేశాడు. “ఒలింపిక్స్ కి సంబంధించిన మౌలిక సూత్రాలను ఇది ఉల్లంఘించడమే. రాజకీయాలను పక్కన పెట్టాలనీ, ఒలింపిక్ లోగోనూ ఒలింపిక్ సందేశాన్నీ రాజకీయాల కోసం వినియోగించరాదన్న సూత్రాన్ని ఉల్లంఘించడమే” అని స్కై న్యూస్ తో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించాడు.

తీరా చూడబోతే ఈ ప్రకటన రూపొందించింది బ్రిటన్ కంపెనీయే. బ్రిటన్ కి చెందిన ప్రఖ్యాత ప్రకటనల కంపెనీ డబ్ల్యూ.పి.పి కి అతి పెద్ద అనుబంధ సంస్ధ ‘యంగ్ అండ్ రూబికాం’ కంపెనీ ఈ ప్రకటనను తయారు చేసింది. ప్రకటన రూపొందించింది తామేనని సదరు కంపెనీ కూడా అంగీకరించింది. అర్జెంటీనా ప్రభుత్వ కోరిక మేరకు తమ ఏజంటు ఈ ప్రకటన నిర్మించాడని కంపెనీ తెలిపింది. అయితే, ‘యంగ్ అండ్ రూబికాన్’ కంపెనీకి ప్రకటన తయారు చేయమని తాము చెప్పామనడాన్ని అర్జెంటీనా ప్రభుత్వం తిరస్కరించింది. ప్రకటన నిర్మించమని తామేవరికీ చెప్పలేదని తెలిపింది.

వలస కాలంలో ఆక్రమించిన అర్జెంటీనా భూభాగాలని తమ భూభాగాలుగా చెప్పుకోవడానికి లండన్ సిగ్గుపడదు గానీ తమ గడ్డపై తాము శిక్షణ పొందుతున్నామని అర్జెంటీనా క్రీడాకారుడు చెప్పుకుంటే మాత్రం అవమాన పడిపోతుందన్నమాట. పరాయి దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం తగదన్న అంతర్జాతీయ ప్రజాస్వామిక సూత్రాలని ఏ మాత్రం గౌరవించని బ్రిటన్ ‘అభిరుచి’ గురించీ, ‘అవమానం’ గురించీ మాట్లాడడమే వింత.

5 thoughts on “‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

  1. good one, teliyani place gurunchi chepparu…konchem prapancham lo list of islands gurunchi, i mean money laundering jarige place lu gurunchi oka post rastara?

  2. సుభాష్ గారూ, మనీ లాండరింగ్ రిస్క్ ఉన్న దేశాల జాబితా చాలా పెద్దది. ఆ రిస్క్ లేని దేశాలు రెండేనని (నార్వే, ఎస్తోనియా) బేసెల్ జాబితా చెబుతోంది. 32 దేశాల్లో హై రిస్క్ ఉంటే మిగిలినవన్నీ, అమెరికా, ఇండియాల తో సహా మీడియం రిస్క్ ఉన్నవని ఆ జాబితా చెబుతున్నది. జాబితా లింక్ కింద ఇస్తున్నాను. మీరు చూడండి.

    ఇండియాకి సంబంధించి మారిషస్ ద్వారా మనీ లాండరింగ్ ఎక్కువగా జరుగుతోంది. హావాలా రూట్ ఉండనే ఉంది. ఒక్క హవాలా రూట్ లోనే 683 బిలియన్ డాలర్లు (రు.34 లక్షల కోట్లు) నల్లధనం ప్రవహించిందని అంచనా. మనీలాండరింగ్ రిస్క్ జాబితా రూపొందించడంలో రాజకీయాలు కూడా జరుగుతాయి. ఉదాహరణకి ఇరాన్ అత్యధిక రిస్క్ ఉన్న దేశమని అమెరికా చెబుతుంది.

    http://index.baselgovernance.org/Index.html#ranking

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s