క్లుప్తంగా…. 30.04.2012


జాతీయం

లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు

Dow_Chemicals“డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని సంజయ్ ఆరోపించాడు. భోపాల్ గ్యాస్ లీక్ ప్రభావంతో తాను గుండె జబ్బు సమస్య ఎదుర్కొంటున్నట్లు సంజయ్ తెలిపాడు. తల్లిదండ్రులతో పాటు బంధువులను, ఇరుగు పొరుగువారినీ తాను కోల్పోయానని ఆయన తెలిపాడు. భోపాల్ బాధితులకి వీసమెత్తు న్యాయం కూడా జరగలేదనీ, లండన్ ఒలింపిక్స్ నిర్వాహకుడు భోపాల్ వస్తే ఆ సంగతి తెలుసుకోవచ్చని సంజయ్ అన్నాడు. గ్యాస్ లీక్ ప్రాంతాన్ని శుభ్రపరిచి, బాధితులకు పునరావాసం కల్పించవలసి ఉండగా ఇంకా అది జరగలేదనీ, సరైన వైద్యం కూడా అందలేదని సంజయ్ తెలిపాడు. సంజయ్ ఆక్రందన చెవిటి వాడి ముందు శంఖమే. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతామంటే ఆనందంతో గెంతులేస్తున్న భారత పాలకులు సంజయ్ డిమాండ్ ని కనీసం ఆలకించే అవకాశం కూడా లేదు.

అంతర్జాతీయం

ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ కి జెల్ల కొట్టిన సలాఫిస్టులు

ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ (ఎం.బి) కి అనుకోని అవాంతరం ఎదురయింది. మరో మతవాద గ్రూపు అయిన సలాఫిస్టులు ముస్లిం బ్రదర్egypt_elections_01 హుడ్ బలపరిచిన అభ్యర్ధికి కాకుండా మోడరేట్ అభ్యర్ధిగా భావిస్తున్న ‘అబ్దెల్ మొనీం ఆబోల్ ఫోతౌ’ కి మద్దతు ప్రకటించడమే ఈ అవాంతరం. మే 22, 23 అధ్యక్ష ఎన్నికలకు మొత్తం 13 మంది అభ్యర్ధులను మిలట్రీ ప్రభుత్వం ఫైనలైజ్ చేయగా వారిలో ముబారక్ ప్రభుత్వంలో విదేశీ మంత్రి గా ఉన్న అమీర్ మౌసా ఫ్రంట్ రన్నర్ గా భావిస్తున్నారు. సలాఫిస్టుల మద్దతుతో అధ్యక్ష పీఠాన్ని అధిస్టించాలన్న ఎం.బి ఆశకు సలాఫిస్టులు ప్రారభంలోనే గండి కొట్టారు. అబ్దుల్ ఫోతౌ కూడా పూర్వాశ్రమంలో ఎం.బి సభ్యుడే. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎం.పి నిర్ణయించాక ఫోతౌ ఎం.బి నుండి బైటికి వచ్చి పోటీలో నిలిచాడు. ఆయనా బైటికి వచ్చాక ఎం.బి కూడా పోటీ చేయాలని నిర్ణయించినా దాని ప్రధాన అభ్యర్ధిని మిలట్రీ అనర్హుడిగా చేయడంతో డమ్మీ అభ్యర్ధి మహమ్మద్ ముర్సీ ప్రధాన అభ్యర్ధిగా మారాడు. ఎం.బి తర్వాత సలాఫిస్టులకే పార్లమెంటులో ఎక్కువ స్ధానాలుండడం గమనార్హం. ఈజిప్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారిలో ఎవరూ అమెరికా మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ విష పరిష్వంగం నుండి ఈజిప్టును బయటపడేయాలన్న డిమాండ్ కి స్పందించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమిని ఎదిరించకుండా ఈజిప్టు ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు లేనే లేవు. 

సి.ఐ.ఏ తో రాజీ పడిన కుటుంబంలో మహిళల హత్య

సి.ఐ.ఏ చేతిలో హత్యకు గురయిన బాధితుల్లో ఒకరి భార్య, ఆమె తల్లి పాక్ లో హత్యకు గురయ్యారు. రేమండ్ డేవిస్ అనే సి.ఐ.కాంట్రాక్టర్

రేమండ్ డేవిస్

ఒకరు గత సంవత్సరం ఇద్దరు పాక్ జాతీయులను కాల్చి చంపాడు. ఆ ఘటనపై పాక్ వ్యాపితంగా నిరసనలు పెల్లుబుకాయి. ప్రజల నిరసనలు పట్టించుకోకుండా పాక్ ప్రభుత్వం డేవిస్ ని వదిలి పెట్టడానికి పూర్తి సహకారం అందించింది. హంతకుడిని క్షమించినట్లుగా చనిపోయినవారి కుటుంబీకులు కోర్టులో చెప్పడంతో రేమండ్ డేవిస్ ని కోర్టు గుట్టు చప్పుడు కాకుండా వదిలి పెట్టింది. క్షమించినందుకు బాధితుల కుటుంబీకులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందని పత్రికలు తెలిపాయి. అలా తీసుకున్న డబ్బు ఇప్పుడు తల్లీ కూతుళ్ల హత్యకు దారి తీసింది. సోమవారం లాహోర్ లో ఈ హత్య జరిగిందని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. బాధితుల్లో ఒకరైన ఫైజన్ హైదర్ భార్య జహ్రా తన భర్త సోదరుడినే వివాహం చేసుకోవాలని ఫైజన్ తండ్రి శాహ్జాద్ బట్ కోరాడు. దానిని జహ్రా, ఆమె తల్లీ వ్యతిరేకించారు. జహ్రా అప్పటికే మరొకరిని వివాహం చేసుకుందని బట్ కి తెలియడంతో భార్యా, కూతుళ్ళు ఇద్దరినీ కాల్చి చంపాడని పత్రిక తెలిపింది. 2.3 మిలియన్ డాలర్లను ఇరు కుటుంబాలకు చెల్లించారని కోర్టు అఫిడవిట్ ద్వారా తెలిసిందని పత్రికలు వెల్లడించాయి. ఈ డబ్బు తమ కుటుంబంలోనే ఉండాలని బట్ భావించడంతో వేరొకరిని వివాహం చేసుకోవడం సహించలేకపోయాడు. ఇద్దరు అమాయక పాక్ యువకుల్ని చంపిన సి.ఐ.ఏ, తన పాపపు సొమ్ముతో మరో ఇద్దరు మహిళలు అన్యాయంగా చనిపోవడానికి కారణం అయింది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s