యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి.
నరేంద్ర మోడి 2003 లో బ్రిటన్ సందర్శనకు వెళ్ళినపుడు పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 2005 లో మరో సారి వెళ్లాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో మోడి తన పర్యటనను రద్దు చేస్తుకున్నాడు. బ్రిటన్ వచ్చాక మోడిని అరెస్టు చేయించాలని మానవ హక్కుల సంస్ధలు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో మొత్తంగా పర్యటనను రద్దు చేసుకున్నాడు. కనీసం ఇప్పుడయినా కొత్త చట్టాన్ని మోడీకి వర్తింపజేయాలని ‘సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్’ డిమాండ్ చేస్తోంది.
“ఇతర దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను బ్రిటన్ మానిటర్ చేయడానికి మేము అనుకూలం కాదు. కానీ అలాంటి చట్టం ఏదయినా రూపొందితే నరేంద్ర మోడి రాకని నిషేధించడానికి దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ‘ఆమ్నెస్టీ (ఇంటర్నేషనల్)’ తో సహా అనేక మానవ హక్కుల గ్రూపులు, స్వతంత్ర సంస్ధలు గుజరాత్ హత్యాకాండలో ఆయన పాత్రను ఎత్తి చూపాయి. మోడి విషయంలో రాజకీయ పరిగణనలు ఈ కేసును ప్రభావ శూన్యం చేయబోవని నమ్ముతున్నాం” అని సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూపు ప్రతినిధి అమృత్ విల్సన్ అన్నాడు.
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం బ్రిటన్ జాతీయ భద్రత కు ప్రమాదం ఉన్న వ్యక్తులను మాత్రమే దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉందనీ, కానీ సోమవారం ‘ప్రభుత్వ మానవ హక్కుల నివేదిక’ వెలువరించడంలో భాగంగా ప్రకటించనున్న కొత్త నిబంధనల ప్రకారం మంత్రులు “మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు విశ్వసనీయమైన సాక్ష్యం ఉన్న ఏ వ్యక్తినయినా” దేశంలోకి రాకుండా వీసా నిరాకరించే అధికారం కలిగి ఉంటారనీ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. చిత్ర హింస, హత్య, చట్ట విరుద్ధంగా నిర్భంధించడం లాంటి తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలో ఉన్నవారు బ్రిటన్ కి రావాలంటే ‘ఓపెన్ టికెట్ పొందలేరు’ అని బ్రిటన్ అధికారినొకరిని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. విదేశాంగ శాఖ నుండి ఇంకా కొత్త నిబంధనల పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
అయితే కొత్త నియమ నిబంధనలు ఎంతవరకు ప్రభావితంగా ఉంటాయన్న విషయంలో అనుమానాలు లేకపోలేదు. మానవ హక్కుల పేరుతోనో, మత స్వేఛ్ఛ పేరుతోనో, లేదా టెర్రరిజం నిర్మూలన పేరుతోనో పశ్చిమ దేశాలు చేసే చట్టాలు ఆ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే రూపొందించడం అనుభవంలో ఉన్న విషయం. వాస్తవంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న చోట ఆవేప్పుడూ జోక్యం చేసుకోలేదు. అదీ కాక స్వయంగా ఆ దేశాలు అనేక దేశాల్లో చొరబడి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి.
అంతర్జాతీయ చట్టాలను త్రోసి రాజని ఇరాక్, ఆఫ్ఘన్ లపై దురాక్రమణ యుద్ధాలకు తెగబడిన దేశాలవి. అను నిత్యం ఇప్పటికీ ఆఫ్ఘన్ గ్రామాలపై రాత్రి పూట దాడులు నిర్వహిస్తూ ఆఫ్ఘన్ పౌరులను పొట్టన బెట్టుకుంటున్నాయి. అలాంటి దేశాల్లో ఒకటయిన బ్రిటన్ మంత్రులు మోడి ని తమ దేశం రాకుండా చేస్తారని పూర్తిగా నమ్మ లేని విషయం. ఏదయినా పెద్ద కాంట్రాక్టు బ్రిటన్ కంపెనీలకి అప్పజెప్పడానికి మోడి సిద్ధపడితే బ్రిటన్ ప్రభుత్వ పెద్దలు ఆగ మేఘాల పైన వీసా ఇవ్వడానికి పరుగులు పెడతారు కూడా.
“మానవ హక్కుల ఉల్లంఘన ను సీరియస్ గా తీసుకొనే ప్రయత్నం కంటే అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టపడని వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యమే ఇందులో కనిపిస్తోంది” అని ఒక మానవ హక్కుల కార్యకర్త అన్నాడని ‘ది హిందూ’ పేర్కొంది కూడా.
విశేఖర్ గారూ,
ఈ కథనంకి మీరు వాడిన చిత్రం నిజమైనది కాదని, ఎక్కడో మోర్ఫింగ్ చేసిందని అనిపిస్తోంది. నా సందేహమే నిజం కావాలనుకుంటున్నాను. నిజం చెప్పండి. ఇది మోర్ఫింగ్ కత్తా, ఒరిజనల్ కత్తా? నిజమైన కత్తే అయితే పొడవాటి వీరకంకణం లాంటిది పట్టుకుంటారు కాని ఇదేమిటి.. కసాయి కొట్టు వద్ద శంకర శాస్త్రి గారికి గడ్డం తొడిగి టోపీ పెట్టి, కసాయి కత్తిని చేత బట్టించినట్లు. కొంపదీసి ఇది నిజం చిత్రమేనా? లేక గుజరాతీ కసాయి సంప్రదాయంలో ఇదీ ఒక ప్రముఖ సంకేత ప్రదర్శనా?
రాజుగారూ, మళ్లీ ఇంటర్నెట్ వెతికి చూసాను. ఫొటో మార్ఫింగ్ కాదు. మోడి ఒక్కడే కత్తి పట్టుకుని నిల్చున్న మరో ఫోటో చూడండి.

విశేఖర్ గారూ..
ఓ.. సరే.. A butcher and his own knife… చాలా బాగుంది. కసాయివాడి చేతి కత్తి.. ఈ శాల్తీ గురించి చెప్పడానికి ప్రపంచానికి మరే కొత్త కథనాలు అవసరం లేదు.
“ఏదయినా పెద్ద కాంట్రాక్టు బ్రిటన్ కంపెనీలకి అప్పజెప్పడానికి మోడి సిద్ధపడితే బ్రిటన్ ప్రభుత్వ పెద్దలు ఆగ మేఘాల పైన వీసా ఇవ్వడానికి పరుగులు పెడతారు కూడా.”
కసాయి వాడు కారుణ్య మూర్తి అయిపోతున్న క్రమం ఇప్పటికే మొదలైపోయిందనుకుంటాను. ఈ మధ్యే అమెరికా కాస్త సీన్ రివర్స్ చేసినట్లుంది. అంత పెద్దన్నే జావకారిపోగా ఇక మన చిన్నన్న కథ దేనికి లెండి… ఈరోజు కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరొక రోజు. అంతే.
ఇక పిల్లలకు బూచోడు అంటే ఎవరో ప్రత్యేకించి చూపవలసిన అవసరం లేదులెండి. కనిపిస్తున్నాయిగా.. నిద్రలో కూడా దడుచుకునేలాగా..
*ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని *
రాజశేఖర్ రాజు గారు,
ఇంత కన్నా కామేడి వార్త ఎమైనా ఉందా? ఆయన ఎప్పుడో భవిషత్లో రావాలనుకొంటె అప్పుడు నిరోధించటానికి వీరు ఇప్పుడు గలభా చేయటమేమిటి? దానిని పెద్ద వార్తలా పేపర్లలో రాయటమేమిటి. ఆయన ఎమైనా లండంకి ఇప్పుడు పోతున్నాడా. ఆలు లేదు చూలు లేదు సామేతలాగా, ఎమీ లేక పోయినా పనిపాటాలేని వారు హక్కుల సంస్థలు పెట్టుకొని దాని మనుగడకొరకు ఇటువంటి గలభాలు చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా తమాషా లండన్ వాళ్లు మోడి మీద చర్య తీసుకోవటమనేది. ఆ సంస్థలకి యురప్ ఆర్ధిక పరిస్థితి తెలిసినట్లు లేదు. స్విస్ లో డబ్బులు లేక 16సం|| అమ్మాయీలకే వ్యభిచారం చేసుకోవటానికి లైసేన్స్ ఇచ్చింది. ఇటలి, దాని పక్కన ఉన్న దేశాల పరిస్థితి ఇంచుమించు ఇదే. ఇక బోడి అమేరికాకు మోడి వేళ్లకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమిలేదు. గుజరాత్ నే అమేరికా కన్నా ఎక్కువగా అభివృద్ది చేసి చూపుతాడు. ఈ క్రింది వీడీయొ చూస్తే ఆసంగతి మనకే తెలుస్తుంది.
Ahmedabad BRTS – JanMarg
వాసుగారూ,
మీరు ఉటంకించిన వాక్యం శేఖర్ గారు పోస్ట్ చేసింది కదూ. ఆయనే సమాధానమిస్తే బాగుంటుంది. కాని ఆయన ఇవ్వాళ నెట్లో లేనట్లుంది. పైగా మీరు నన్ను ఉద్దేశించి రాశారు కాబట్టి నా అభిప్రాయం చెప్పడానికి పూనుకుంటున్నాను. ముందుగా….
“ఏమీ లేక పోయినా పనిపాటాలేని వారు హక్కుల సంస్థలు పెట్టుకొని దాని మనుగడకొరకు ఇటువంటి గలభాలు చేస్తున్నారు.”
మీ వ్యాఖ్యలో పై వాక్యాన్ని నేను స్వీకరించలేను. హక్కుల సంస్థల పనితీరు పట్ల మీ తీవ్రమైన నిరసన లేక వ్యతిరేకభావాన్ని ఇది సూచించడం తప్ప దీనివల్ల మరే ప్రయోజనమూ కలగదనుకుంటాను.
పోతే.. ఒక కోణం నుంచి మీ వ్యాఖ్య సారాంశంతో ఏకీభవిస్తాను. గుజరాత్ ముఖ్యమంత్రి లండన్‌కి పోయినా పోకపోయినా, అమెరికాకు పోయినా పోకపోయినా… ఒక భారతీయ రాజకీయనేతను అందునా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడనే కారణంతో, హక్కుల కోణం నుంచైనా సరే నిషేధించడం, వీసా ఇవ్వకపోవడం చేస్తున్న వారి నైతిక ఔన్నత్యం విలువ ఏమిటో మన ప్రపంచానికి బాగానే తెలుసు. నిజంగా పాశ్చాత్య దేశాలు మానవాళి హక్కుల పట్ల అంత నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నట్లయితే ఈ రకం నిషేధాన్ని సానుకూలంగా తీసుకోవచ్చేమో..
వాళ్ల విలువలు, ప్రమాణాలు అలా పక్కన బెడితే ఇలాంటి నిషేధాలు వందల సంవత్సరాలుగా మన దేశంలో అమలవుతున్న అస్పృశ్యతకు ఆధునిక రూపమే తప్ప మరొకటి కాదు. మనిషి ప్రయాణాన్ని కూడా నిషేధిస్తున్న ఇలాంటి కొత్త తరహా అస్పృశ్యతను నేను సమర్థించడం లేదు. మోడీ రాజకీయ విశ్వాసం, ఆచరణ పట్ల వ్యతిరేకత ఉంటే దాన్ని రాజకీయ కోణంలో ఎదుర్కోవడమే సరైనదనుకుంటున్నాను.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కసాయి కత్తిని ఆవిధంగా విజయచిహ్నంగా పట్టుకోవడాన్నే నా వ్యాఖ్యలో వ్యతిరేకించాను. మనవాళ్లు సాధించిన, సాధించనున్న విజయాలకు చిహ్నంగా వీరఖడ్గాన్ని పైకెత్తుతుంటారు.. అలా గుజరాతీ సంప్రదాయంలో భాగంగా వాళ్లు కసాయి కత్తిని అలా పైకెత్తి పట్టుకుంటారా లేదా దీనికి మరొక నేపథ్యం ఏమైనా ఉందా అనే సందేహాన్ని కూడా నా వ్యాఖ్యలో వ్యక్తపరిచాను. అది వాళ్ల సంప్రదాయంలో భాగమో కాదో తెలీదు కాని నాకయితే ఆ బొమ్మను చూస్తూనే కసాయివాడి చేతిలోని కసాయికత్తే కనిపించింది. అది తప్పితే నా వ్యాఖ్యలో మరే ప్రత్యేకతా లేదు.
“ఆ సంస్థలకి యురప్ ఆర్ధిక పరిస్థితి తెలిసినట్లు లేదు. స్విస్ లో డబ్బులు లేక 16సం.ల అమ్మాయీలకే వ్యభిచారం చేసుకోవటానికి లైసేన్స్ ఇచ్చింది.”
మీ వ్యాఖ్య అభ్యంతరకరమనుకుంటున్నాను. యూరప్ ఆర్థిక పరిస్థితి బాగుంటే, పాశ్చాత్య దేశాల అభివృద్ధి క్షీణించకుంటే అప్పుడు అవి మోడీపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫరవాలేదా?
ఇకపోతే స్విస్‌లో డబ్బులు లేకపోవడానికి, 16 సంవత్సరాల అమ్మాయిలకు కూడా వ్యభిచరించడానికి లైసెన్స్ ఇవ్వడానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు నిజంగా అర్థం కాలేదు.
వ్యభిచారం అనేది యుగాలనుంచి సమాజంలో సార్వత్రిక ఆచరణగా కొనసాగుతున్నప్పడు వ్యభిచరించే పురుషులను, వ్యభిచారాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, సంస్థలను, గృహాలను చట్టం నుంచి మినహాయించి ఆ వృత్తిలో ఉన్న మహిళలను మాత్రమే నేరస్తులుగా పట్టుకుని చట్టానికి అప్పగించడంలోని అసంబద్ధత గురించి గత యాభై ఏళ్లుగా పాశ్చాత్య దేశాలలో సాగుతున్న చర్చలు, పోరాటాల ఫలితంగా స్విస్ అలాంటి చట్టం తీసుకొచ్చిందేమో నాకు స్పష్టంగా తెలీదు. మరికొన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యభిచారాన్ని చట్టబద్దం చేశారనుకుంటాను.
కాని స్విస్‌లో డబ్బులు లేక 16 సంవత్సరాల అమ్మాయిలకు కూడా వ్యభిచారం చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చారని మీరన్నదానికి ఆధారం చూపగలరా? అంటే అక్కడి ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ ఈవిధంగా చేసిన ప్రకటన, తీర్మానం, లేదా చట్టం వంటివి.. అలా కాక ఏదైనా వార్త లేదా విశ్లేషణలో భాగంగా వచ్చిన కథనాన్ని మీరు ప్రస్తావించి ఉంటే మీ ప్రకటన సరైంది కాదనుకుంటాను. డబ్బులు లేక మా దేశ అమ్మాయిలు వ్యభిచరించడానికి అనుమతిస్తున్నాను అని ఏ దేశమైనా చెప్పుకోగలదా. ప్రభుత్వం లేదా న్యాయ వ్యవస్థ ఇంత హీనంగా వ్యవహరించగలదా?
వాసుగారూ,
చివరగా.. మీరు “గుజరాత్ నే అమెరికా కన్నా ఎక్కువగా అభివృద్ది చేసి చూపుతాడు. ఈ క్రింది వీడియో చూస్తే ఆసంగతి మనకే తెలుస్తుంది.” అంటూ వీడియో లింకు కూడా ఇచ్చారు.
ఆద్యంతం దాన్ని చూశాను. భారతదేశంలోని మహానగరాల్లో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇది భిన్నంగా లేదు కదా. కాకుంటే అదనపు పెట్టుబడుల ప్రవాహ వెల్లువ వల్ల అక్కడేదో జరిగిపోతున్నట్లు కనబడవచ్చు. అహమ్మదాబాద్‌లో లేదా చెన్నయ్, బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ తదితర మహానగరాల్లో జరుగుతున్న అభివృద్ధి మొత్తంగా ప్రపంచీకరణలో భాగంగా నగరం కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి తప్ప దీనివల్ల నూటికి 65 శాతంపైగా ఉన్న గ్రామీణ సమాజానికి ఏదైనా మేలు ఉందా?
ఈ దేశంలో నిజంగా గాంధీ సూత్రాలకు విలువ అనేది ఉంటే గ్రామం కేంద్రంగా అభివృద్ధి జరగాలి. ఒక దేశం లేదా ఒక సమాజం వనరులను మొత్తంగా కొల్లగొడుతూ, పీక్కుతింటూ బతుకుతున్న నగర కేంద్రక అభివృద్ధిని మీరు అభివృద్ధిగా చెప్పడం ఏమిటి? ఈ వీడియోలో మీరు చూపించిన ఎసీ బస్సులను, అత్యాధునిక రోడ్, రైలు మార్గాలను, విమానాశ్రయాలను, కార్లను, సంపన్నుల విలాసాలను తీర్చే రాజప్రసాదాల్లాంటి హోటళ్లను, కళ్లు బైర్లు కమ్మించే మహా ఆసుపత్రులను మా చెన్నయ్‌లో వీధివీధిలో చూపగలను.
ఇవి మనకు ఆదర్శమా.. ఇది అభివృద్ధా? మీరు పల్లె జీవితం నుంచి వచ్చారో లేదో నాకు తెలీదు. రాకున్నా ఫరవాలేదు. కాని సంపదలు మొత్తంగా ఒకే చోట కేంద్రీకరించబడుతున్న ఇలాంటి రాక్షసాభివృధ్ధి కారణంగా మన పల్లెలు నిలువునా చస్తున్నాయి. లక్షలమంది చస్తున్నారు. ఊర్లు వల్లకాడులై పోతున్నాయి. మనం మహానగరాల్లో పోగుబడిన అన్ని సౌకర్యాలను కొల్లగొట్టవచ్చు. డబ్బు చేతబట్టుకుని భూమ్మీద అన్ని స్వర్గాలను అనుభవించవచ్చు.. కాని ఎన్ని కోట్లమంది సమిష్టి వనరులను కొల్లగొడితే ఈ స్వర్గాలు మహానగరాల్లో తయారయ్యాయో, ఎన్ని లక్షలమందికి ఇవి జీవితాలు లేకుండా చేస్తున్నాయో ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇదెంత బూటకపు అభివృద్దో..
ఇలాంటి ‘రాక్షసాభివృద్ధి’ని పట్టుకుని మీరు వీడియోలో చూపిస్తారేమిటి?
అభివృద్ధి అంటే ఎలా ఉండాలో.. ఈ వ్యవస్థ పరిమితుల్లో కూడా అభివృద్ధిని ఎలా చేయవచ్చో, గ్రామ కేంద్రక అభివృద్ధి ఈ దేశానికి ఎంత అవసరమో.. కొన్ని కోట్లమంది జీవితాలకు వెలుగు ఏ రకంగా తీసుకురావాలో కూడా ఈనాడులో ఈ ఆదివారం వచ్చిన కథనం చూపిస్తోంది చూడండి.
ప్రతిభావంతులు, మెరిట్‌ను ఆకాశానికెత్తి జబ్బ చరుచుకునే మహా మహా అగ్రకులాభిజాత్య మేధావులూ ఊర్లనుంచి నగరాలకు, నగరాలనుంచి దేశదేశాలకు సంపదల సృష్టి మార్గంలో పరుగులెత్తుతుంటే, జీవన పరుగుపందెంలో కన్న తల్లిదండ్రులకు మందులిచ్చే వాళ్లు కూడా లేకుండా పల్లెటూర్ల మూలాలు చస్తుంటే, ఒక విద్యాధిక దళితుడు గ్రామ కేంద్రక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తన జీవితాచరణ ద్వారా చూపిస్తున్నాడు. నిజంగా ఇది మన పల్లెను నిలబెట్టే అభివృద్ధి. మన గ్రామాల ఉనికిని నిలబెట్టే అభివృద్ధి. నిరుద్యోగం, నిరక్షరాస్యత, నీటికరువు, పూరిగుడిసె లేని గ్రామ స్వరాజ్యం మన కళ్లముందు ఒక దళిత విద్యాధికుడి అంకిత భావం కారణంగా కనిపిస్తోందిక్కడ. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ఇక్కడ పరవళ్లు తొక్కుతోంది. విషాదకరమైన విషయం ఏమిటంటే మన దేశానికి, నిజమైన అభివృద్ధికి అవసరమైన ఈ ఊరు చరిత్రను చూపడానికి వీడియోలు లేవు. నిజమే సంపదల ప్రదర్శనకు, కులాసాల ప్రదర్శనకు వీడియో ఆర్భాటాలు అవసరమవుతాయి తప్పితే ఇలాంటి నిరాడంబర జీవితాచరణకు ఆర్భాటాల అవసరం దేనికి?
కూరగాయలూ, పాలుతో సహా సమస్తమూ గ్రామాలనుంచే సరఫరా అవుతున్నప్పుడు పరాన్న జీవుల్లాంటి నగరాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి పల్లెలు మాత్రం అలానే ఎందుకు ఉంటున్నాయి అని ఆ దళిత విద్యాధికుడూ, ఆ ఊరూ మనల్ని ప్రశ్నిస్తున్నారు.
మనక్కావలిసింది మోడీ అభివృద్ధి, అహమ్మదాబాద్ అభివృద్ది, హైదరాబాద్ అభివృద్ది కాదు. మీకు ఓపిక, సమయం ఉంటే ఈ ఆదివారం ఈనాడులో వచ్చిన ఈ అద్భుత కథనం లింకు ఇక్కడ చూడండి.
తిరుగులేని పల్లె
http://eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1
రాజుగారూ, మీరు ప్రస్తావించిన ‘తిరుగులేని పల్లె’ ఆర్టికల్ చదివాను. ఇళంగో రంగస్వామి కృషి అద్భుతం. తాను పుట్టి పెరిగిన పల్లె పచ్చగా ఉండాలని ఆలోచించడమే కాక కార్యరంగంలోకి దూకి సాధించిన రంగస్వామి బహుధా అభినందనీయుడు.
ఐ.ఐ.టి చదువుతో వచ్చిపడే భోగ భాగ్యాలను తృణప్రాయం ఎంచి వదిలి పెట్టడం సామాన్య విషయం కాదు. ప్రజల కోసం రాజకీయాల్లోకి దూకుతున్నామని అనేకమంది చెప్పడం రాజకీయాల్లోకి చేరి స్వలాభం చూసుకోవడం నేటి వాస్తవం. నిజాయితీ ఉన్నవారికి రాజకీయ పార్టీలే అవసరం లేదని రంగస్వామి చాటి చెప్పాడు.
మరీ ముఖ్యంగా దళితుడుగా ఛీత్కారాలు ఎదుర్కొంటూ ఉన్నత చదువులు పూర్తి చేయడమే కాక తాను చదివిన చదువుకు సమున్నతమైన సార్ధకతను రంగస్వామి చేకూర్చాడు.
వ్యాపారుల ఆగ్రహానికి గురై సర్పంచిగా సస్పెండయినా, ప్రజల ఆగ్రహంతో సస్పెన్షన్ రద్దు చేయక తప్పని పరిస్ధితి ప్రభుత్వం ఎదుర్కోవడం ఇంకా అద్భుతంగా ఉంది.
“ప్రతిభావంతులు, మెరిట్‌ను ఆకాశానికెత్తి జబ్బ చరుచుకునే మహా మహా అగ్రకులాభిజాత్య మేధావులూ ఊర్లనుంచి నగరాలకు, నగరాలనుంచి దేశదేశాలకు సంపదల సృష్టి మార్గంలో పరుగులెత్తుతుంటే, జీవన పరుగుపందెంలో కన్న తల్లిదండ్రులకు మందులిచ్చే వాళ్లు కూడా లేకుండా పల్లెటూర్ల మూలాలు చస్తుంటే, ఒక విద్యాధిక దళితుడు గ్రామ కేంద్రక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తన జీవితాచరణ ద్వారా చూపిస్తున్నాడు. నిజంగా ఇది మన పల్లెను నిలబెట్టే అభివృద్ధి. మన గ్రామాల ఉనికిని నిలబెట్టే అభివృద్ధి.”
మీ ఈ వాక్కులు ప్రత్యక్షర సత్యం.
మంచి వార్తను అందించినందుకు కృతజ్ఞతలు.
విశేఖర్ గారూ,
అసలు ఈనాడులో వచ్చిన ఈ కథనాన్ని పరిచయం చేస్తూ నా చందమామలు లేదా నెలవంక బ్లాగులో పోస్ట్ చేయాలనుకున్నాను. అంతకుముందే వాసు గారి వ్యాఖ్య కనబడటంతో సందర్భోచితంగా ఉంటుందని ఇక్కడే దాని ప్రస్తావన తెచ్చాను.
మన దృష్టికి రాకుండా ఇలాంటి ఎన్నో అపురూప వ్యాసాలు, కథనాలు పక్కకు పోయే అవకాశముంటుంది కాబట్టే నా కొత్త బ్లాగులో ఇలాంటి వందల వ్యాసాలను లింకులతో సహా ప్రచురిస్తున్నాను. ఉద్యమ నెలబాలుడు శివసాగర్ పై గత పది రోజుల్లో వచ్చిన 50 పైగా అపూర్వ కథనాలు, వ్యాసాలను నా కొత్త బ్లాగులో ప్రచురించాను. మీ బ్లాగులో శివసాగర్ గురించి పెద్దగా ప్రస్తావించనట్లుంది. ఎందుకో తెలీలేదు. వీలయితే నా కొత్త బ్లాగులో ఆ కథనాలను చూడగలరు.
పోతే.. తిరుగులేని పల్లె కథనం చదువుతున్నప్పడు కళ్లు చెమర్చాయి. కమ్యూనిస్టు పార్టీలకు కూడా సాధ్యం కాని దళిత, ఇతర కులాల సహజీవనాన్ని రంగస్వామి గారు ఆచరణరూపంలోకి ఈ పల్లెలో తీసుకువచ్చారు. కులాంతర వివాహాలు, కులాంతర సహజీవనాలు అనేవి జరగనంతవరకు మన దేశంలో కుల సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాన్ని అంబేద్కర్ తన కుల నిర్మూలన పుస్తకంలో ఎంత గొప్పగా చెప్పారో..
శివసాగర్ పై కథనాలు గురించి మీకు నాలుగైదు రోజుల క్రితం నా కొత్త జీమెయిల్ ఐడీనుంచి ఈమెయిల్ పంపాను. యధాప్రకారంగా అది స్పామ్‌లోకి వెళ్లిపోయిందనుకుంటాను. అందుకే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
కృతజ్ఞతలు.
నేను రాసినదానిని మీరు వేరే విధంగా అర్థం చేసుకొన్నట్లున్నారు. మనదేశం 1970-1990 దశాబ్ద కాలం నాటి భారతదేశం కాదు. పరిస్థితులు చాలా మారాయి. భారతదేశం తనకాళ్ల మీద తాను నిలబడటమే గాక, ప్రగతి ని సాధిస్తున్నాది. ప్రపంచంలో దాని స్థానం అది తప్పక పొందుతుంది. ఇక బ్రిటన్ ,యురప్ వాళ్లు ఇంకా తామేదో గొప్ప స్థితిలొ ఉన్నామనుకొని, తమ గత చరిత్రను అతిగా ఊహించుకొంట్టున్నారు. పైన రాసిన వ్యాసం (మోడికి వీస ఇచ్చే) దానిని అద్దం పడుతున్నాది. బ్రిటిష్ వారి ఆర్ధిక వ్యవస్త మెరుగ్గా లేదు. వారు తీసుకొనే పాలసి మార్పుల వలన అది తెలిసి పోతుంది. అది వేరే విషయం. అసలికి వాళ్లదేశం లో చట్టం మార్పు చేసుకొంటే/కోవాలనుకొంటే చేసుకొమనండి. దానిని తీసుకు వచ్చి మోడికి వీస ఇవ్వకుడదు అని అక్కడివారంటే, వీళ్లు దానిని తగుదునమ్మా అని పేపర్లో ప్రచూరించటమేమిటి?
మచ్చుకి నేను నాకవసరమై ఒక ఇల్లు కొనుకొన్ని, బాడుగకు ఇవ్వాలను కొంట్టున్నానని బ్లాగులో రాస్తే, తెలిసిన వాళ్లందరు ఆ ఇల్లుని బాడిగకి రాజుకు మాత్రం ఇవ్వకు, అతను వామపక్ష మద్దతు దారుడు అని అంటే ఎమైనా అర్థం ఉందా? అసలికి ఈన ఇల్లుకొన్న విషయం రాజుకు తెలుసా? ఆయన ఎమైనా నేను మీ ఇంట్లొ వచ్చి చేరుతాను బాబు అని అడిగాడా? ఇటువంటి చేష్ట్టలు చేసేవారిని ఏమనాలి?
ఇన్నిరోజుల తమ ఆధిపత్యం అంతరించినా, అలవాటులో పొరపాటులు చేస్తున్నారు. అది వారు తెలుసుకోవటం ఎంతో మంచిది. తెలియ జెప్పవలసిన భాద్యత మనదేశం మీద ఉన్నా, కేంద్రంలో ఉన్న వారు ఆ పని చేయటంలేదు. ఇటలి వాళ్లు కేరళలోని బెస్త వారిని చంపితే కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ప్రతిస్పందిస్తున్నాదో చూస్తున్నాం.
మననోట..ఇటలీ మాట!
http://andhrabhoomi.net/content/mana-nota
రాజుగారూ, శివసాగర్ గారి గురించి ఏమీ రాయలేదేంటని నా మిత్రులు ఇంకా కొందరు అడిగారు. నాకు రాజకీయాలు పరిచయం అయ్యేసరికి శివసాగర్ రంగంలో లేరు. ఆయన దళితవాదిగానే నాకు తెలుసు. శివ సాగర్ గా ఆయన రాసిన కవిత్వం చాలా గొప్పదని మిత్రులు చెప్పారు. అవి చదివే అవకాశం నాకు దొరకలేదు. ఆయన చనిపోయాక ఆయన జీవితంపై వచ్చిన కధనాల పేపర్ కత్తిరింపులు కూడా మిత్రులు నాకిచ్చారు. పని ఒత్తిడి వల్ల వాటిని చూడలేకపోయాను. మీరు మళ్లీ గుర్తు చేసారు. మెయిల్ చూసి వీలయితే ఒక పోస్టు రాయడానికి ప్రయత్నిస్తాను.
మెయిల్ చూసే అలవాటు లేకపోవడం నాకొక లోపంగా కొనసాగుతోంది. ఈ మెయిల్ ద్వారా నాతో సంభాషించేవారు చాలా తక్కువ. అందువల్ల అదలాగే ఉంది.
వాసు గారు, మెట్రోల్లో మారినంతగా పల్లేల్లో పరిస్ధితులు మారలేదు. ముఖ్యంగా వారి ఆర్ధిక పరిస్ధితులు, దుర్భర దారిద్ర్యం అలాగే కొనసాగుతోంది. మీరంటున్న ప్రగతి ధనికవర్గాలకే పరిమితం తప్ప అందరికీ కాదు. ఉద్యోగులకి, కార్మికులకి కూడా గతం కంటె నిజవేతనాలు పడిపోయాయి. గతంలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల పరిస్ధితి కొంత మెరుగ్గా ఉండేది. ప్రభుత్వ కంపెనీలని ప్రవేటు వాళ్లకి అమ్మేస్తుండడంతో ఇప్పుడా ఉద్యోగాలు కూడా లేవు. ధనికుల సంపదం ఇంకా పెరగుతోందంటే దానికి కారణం కార్మికవర్గం వాటా వారికి తరలివెళ్లడమే.
యూరప్ దేశాల ఆర్ధిక పరిస్ధితి పడిపోతోంది. అందులో అనుమానం లేదు. కాని అక్కడ కూడా కంపెనీలు, ధనికుల పరిస్ధితి బాగానే ఉంది. సంక్షోభం ముందు కంటె ఎక్కువ లాభాలని అక్కడి కంపెనీలు ప్రకటిస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు కోత పెట్టి వాటిని లాభాలుగా ధనికులు, కంపెనీలు పోగేసుకుంటున్నారు. దానివల్ల కొనుగోలు శక్తి పడిపోయి ఉత్పత్తి పడిపోతున్నా లాభాలు మాత్రం పెంచుకుంటున్నారు. ఏ దేశంలోనైనా ప్రజల పరిస్ధితికీ ధనికవర్గాల పరిస్ధితికీ బాగా తేడా ఉంటుంది. అంటే ఒకే దేశంలో రెండు దేశాలన్నమాట. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించకపోతే దేశాల పరిస్ధితి అంచనా వేయడంలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది.
ఒక సామాన్యుడు ఇల్లు కొని అద్దెకి ఇవ్వడంతో మోడీ నిషేధాన్ని పోల్చడం సరిగ్గా నప్పలేదనిపిస్తోంది. మీరు చెప్పిన అర్ధంలో మోడీ పై నిషేధం సబబు కాదు. రాజుగారు ఈ విషయం చక్కగా చెప్పారు. ఈ అంశంలో ప్రధానంగా గుర్తించవలసింది మత మారణకాండలో మోడి పాత్రని ప్రపంచం అంతా గుర్తించిందన్న విషయాన్ని. ఆ పాత్రని ఇప్పటికీ చాలా మంది విస్మరించలేకపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలి. ఒక పాలకుడిగా ప్రజల్ని కన్నబిడ్డలవలే చూడాల్సి ఉండగా కనీసం దోపిడీ సమాజాలు పాటించే విలువల్ని కూడా పాటించకుండా ప్రజల్ని రెండు మతాల వారుగా గుర్తించి ఒకరిపై మరొకర్ని ఉసి గొలిపి హత్యాకాండకి దిగడం అత్యంత ఘోరం. మధ్య యుగాల్లో జరిగిందని చదువుకునే ఇలాంటి మారణకాండని ప్రజాస్వామ్య వ్యవస్ధలని చెప్పుకుంటున్న కాలంలో తిరిగి రేపడం అత్యంత అమానుషం. ప్రపంచ వ్యాపితంగా వ్యక్తమవుతున్న నిరసనలో ఎవరైనా ఆ విషయాన్ని ముందు గుర్తించాలి. తర్వాతే ఏదైనా.
*ఇలాంటి ‘రాక్షసాభివృద్ధి’ని పట్టుకుని మీరు వీడియోలో చూపిస్తారేమిటి?*
రాజు గారు,
నాకు పల్లెటూరితో ఏటువంటి సంబంధాలు లేవు. ఆ విషయానికి వస్తే నాకు స్వంత ఊరు అన్నా ప్రత్యేకమైన ప్రేమ ఏమిలేదు. నాకు భారతదేశమంతా ఒకటే. ప్రపంచంలో ఎక్కడికి వేళ్లినా ఉండేది మనుషులు అంతె. ఇంకొకచిన్న విషయమేమిటంటే మీరు చెన్నైనితీసుకువేళ్లి గుజరాత్ తో పొలుస్తున్నారు. నాలుగు ప్రముఖ మిద్దెలు మేడలు పోల్చవచ్చేమోగాని , చెన్నై కి గుజరాత్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చెన్నైలో అవుట్ స్కర్ట్స్ తప్పించి ఎగ్మురు, షావుకార్పేట్,మైలాపుర్, ట్రిప్లికేన్, మెహతా నగర్, అన్నానగర్, నుంగంబాకం,కాలేజి రోడ్, టి నగర్,వడపళని, సైదాపేట్,గిండి, కోడంబాకం, అడయార్, మొద|| ప్రదేశాలు ఐదేళ్లు ఉన్నపుడు విధి వీధి తిరిగాను. చెన్నై ప్రజల సైకాలజి తెలుసుకోవటనైకి, వారు ఎంత అవినితిని పరులో తెలుసు కోవటానికి, ఎక్కడికో వెళ్లకరలేదు అక్కడి ఆటో వారిని చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి గుజరాత్ కి వెళ్లి చూడండి. ప్రజలేలాంటివారో తెలుస్తారు. అవినీతి పరులైన రాజకీయ నాయకులతో అభివృద్ది చెందిన చెన్నైతో గుజరాత్ కి పోలికా?
రాజు గారు మీరు రాసిన దానిని మొత్తం చదివాను. మరి 1940-1990 ల వరకు మనదేశంలో ప్రతి ఒక్కరికి రష్యా,అమేరికా,యురప్ లాగా మనం అభివృద్ది చెందలేదని, దానికి ఆధునిక విద్య చదవలేదని, పైపేచ్చు పాత వేద విద్యలవలన వెనుకబడిపొయామని, తెగ బాధపడి చదివించిన ప్రభుత్వాలు,తల్లిదండృలు కాదా! తీర అభివృద్ది ఫలాలు చేతికొచ్చి ఆనందించాల్సిది పోయి ఇదా అభివృద్ది అంటే అర్థమేమి?
ఈ మధ్య ఒకసారి వేస్ట్ బెంగాల్, ఒరిస్సాలకి పోయాను, అక్కడ ఊరిని చూస్తే 1975సం|| కడపజిల్లలో ఉండే పుల్లంపేట గుర్తొచింది. మనదేశం లో ఇంకా కొన్ని ప్రాoతాలు అలా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా జీవితం విసుగెత్తితే ఆవూరికి వెళ్లి సేద తీరొచ్చు 🙂 అక్కడికెళ్లిన తరువాత వారిని అభివృద్ది చేస్తామని అనకండి 🙂
వాసు గారూ,
చూడటం కాస్త ఆలస్యమైంది.
ముందుగా మీ స్మైలీ గుర్తు దాని మధ్యలోని వాక్యం చూసి నాకూ నవ్వొచ్చింది.
అయితే దాదాపు మన గ్రామీణ ప్రాంతాలు వాటి జీవితం మీరు ప్రస్తావించిన పుల్లంపేట కంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అభివృద్ధి పలం మొత్తాన్ని నగరాల్లోనే కేంద్రీకరిస్తే ఇలాంటి పుల్లంపేట ఒకటి ఏమిటి? దాదాపు మన పల్లెలన్నీ మరో వందేళ్లవరకు ఇలాగే ఉంటాయి. పల్లెలో సంపన్న భూస్వాములు, ఉన్నత విద్య ద్వారా పైకివచ్చిన ఇళ్లలోకి ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు, ఎల్‌సిడీ టీవీలు, కంప్యూటర్లూ, ఇంటర్నెట్‌లూ వచ్చినంత మాత్రాన పల్లె రూపురేఖలు మొత్తంగా మారినట్లు కాదు కదా.. ఈ అసమానాభివృద్ధే దేశంలో అన్ని రకాల హింసాత్మక పోరాటాలకు ప్రేరణ అవుతోంది.
“ఇన్నిరోజుల తమ ఆధిపత్యం అంతరించినా, అలవాటులో పొరపాటులు చేస్తున్నారు. అది వారు తెలుసుకోవటం ఎంతో మంచిది. తెలియ జెప్పవలసిన భాద్యత మనదేశం మీద ఉన్నా, కేంద్రంలో ఉన్న వారు ఆ పని చేయటంలేదు.”
మీరన్నది ఎంతో నిజం. వెన్నెముక ఉన్న నాయకత్వం -కాంగ్రెస్, ఎన్డీఎ, తృతీయ కూటమి- అధికారంలో ఉంటే పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ మన దేశంపై, మన విధానాలపై చేస్తున్న కువ్యాఖ్యలకు, మన పట్ల పాటిస్తున్న తీరుకు నోరు మూయించే విధంగా వాతపెట్టేవారు. నాకు తెలిసి 1997-98 మధ్య అనుకుంటాను అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఐకె గుజ్రాల్ మాత్రమే ఒకే ఒక్కసారి భారతదేశంపై కించపాటు వ్యాఖ్య చేసిన బ్రిటిష్ పాలనాధికారిపై నోర్మూసుకో అనే రూపంలో మండిపడిన విషయం చదివాను. స్థాయి పడిపోయిన బ్రిటన్ పై ‘నువ్వెంత నీ బతుకెంత’ అనేంత ధిక్కార స్వరాన్ని ఆ సందర్భంలో మాత్రమే గుజ్రాల్ నుంచి విన్నాను. బ్రిటన్ పాలకులు బిత్తరపోయినంత పనయింది అప్పటి మన ప్రధాని వ్యాఖ్యతో. పైగా గుజ్రాల్ పది పార్టీల దన్నుతో ఆర్నెల్లపాటు ప్రధానిగా పనిచేశారు. పాపం ఆపద్ధర్మ ప్రధాని స్థాయిలో మాత్రమే ఉన్న ఆయనకు అప్పట్లో ఏ సామ్రాజ్య వాదులతోనూ వారి తైనాతీ కంపెనీలతోనూ ఆర్థిక, తదితర సంబంధాలు లేవనుకుంటాను అందుకే అంత ధైర్యంగా, ధాటిగా వాయించగలిగారు. ఆ ఒక్క సంఘటన తప్పితే మన నేతలు ఏ సందర్భంలోనూ పాశ్చాత్య దుర్నీతిని ధిక్కరించిన ఉదాహరణ నాకయితే తెలీదు.
“అభివృద్ది ఫలాలు చేతికొచ్చి ఆనందించాల్సిది పోయి ఇదా అభివృద్ది అంటే అర్థమేమి?”
ఇక్కడికే వస్తున్నా.. అభివృద్ధి ఫలాలు నిజంగానే ఈ దశాబ్దంపైగా మన మధ్యతరగతిలో కొంత భాగానికి అందాయి. కాని అవి సమాజంలోని అనేక ఇతర వర్గాల ప్రజల మాడుపగిలేంత అసమానంగా అందాయి. చిన్న ఉదాహరణ. మేం ఉంటున్న వీధిలోకి ఆ పక్క వీధిలోకి ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఒకరిద్దరు వచ్చి చేరారంటే ఆ ప్రాంతంలోని ఇంటి ఓనర్లలో ఏ పాడు బుద్ది పుడుతుందో, అద్దె ఎన్ని వందలు లేదా వేలు పెంచేస్తారో అని గుబగుబలాడుతుంటుంది మాకు. సంవత్సరానికి వెయ్యి రూపాయలు అద్దె పెంచారంటే చెన్నయ్‌లో పది నెలల అద్దెను అడ్వాన్స్ రూపంలో ప్రతి సంవత్సరం అదనంగా ఇంటి ఓనర్ అనే గృహ పెట్టుబడిదారుడికి చెల్లించవలసిందే మరి. నెలకు నాలుగు వేలు అద్దె అని ఒప్పందం కుదిరితే ముందుగా పది నెలల అద్దె మొత్తాన్ని ఓనర్‌కి ఇచ్చాకే ఇంటి తాళాలు ఇస్తారు. దేశంలో ఎక్కడయినా ఇలాంటి అద్దెలు, అడ్వాన్స్‌ల వ్యవస్థ ఉందేమో నాకయితే తెలీదు.
ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు పెరిగిన ప్రతి ప్రాంతంలోనూ ఇతర ఉద్యోగులు, ఇతర ఆదాయ వర్గాల వారి పరిస్థితులు గత పదేళ్లుగా దుర్భరంగా మారిపోయాయి. నిజంగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పేరెత్తితే చాలు.. చిన్నపాటి ఉద్యోగాలతో బతికేవారిలో చాలామందికి మంట పుడుతోంది నగరాల్లో. సమాజం లోని ఒక విభాగం అభివృద్ధి మహానగరంలోనే ఇంతమందిని దుంప నాశనం చేస్తోంది. ఆదాయంలో నూటికి 70 శాతం పైగా ఇంటి అద్దెలకు, తిండికి మిగతాది ఆరోగ్యానికి సర్దవలసిన పరిస్థితి ఇంతకుముందెన్నడూ లేదు. ఇది కూడా అభివృద్ధి పలమే. కొందరు ఆనందిస్తుంటే చాలామంది బాధలకు గురికావడం అంటే ఇదే. విస్తృతార్థంలోనే ఇలాంటి అభివృద్ధి సమాజానికి మంచిది కాదనిపిస్తోంది. పల్లె కన్నీరెందుకు పెడుతోందో దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు మనం.
ఈ తరహా అభివృద్ధి పలాలు వాటిని పొందుతున్న వారి కుటుంబ జీవితాలను కూడా చిధ్రం చేస్తున్నాయి. తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేసి పారేస్తున్నాయి. డబ్బు పోగుపడటం, కోరిన సుఖం కళ్లముందుకు వచ్చి చేరటం తప్ప ఏ ఇతర మానవీయ బంధాలూ లేకుండా పోతున్నాయిప్పుడు.
చెన్నయ్ గురించి మీరు చెప్పిన విషయాలు ఆలోచించదగ్గవే. తిరుపతి నుంచి చెన్నయ్‌కి 140 కిలోమీటర్లు సప్తగిరి రైలులో మామూలు టికెట్ తీసుకుని ప్రయాణిస్తే 47 రూపాయలు అవుతుంది. అదే మామూలు బస్సులో అయితే 70 నుంచి 85 రూపాయలు అవుతుంది. కానీ సెంట్రల్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చెన్నయ్‌లో ఆటోలో పోవాలంటే అక్షరాలా 100 నుంచి 125 రూపాయలు పెట్టవలసి వస్తోంది. దేశం మొత్తం మీద ఇది చెన్నయ్‌కి మాత్రమే పరిమిత మైన ప్రత్యేక స్థితి అన్నమాట. అప్ అండ్ డౌన్ చార్జీల కంటే ఎక్కువే వసూలు చేస్తారిక్కడ. పొరపాటున రాత్రి 10 దాటాక వచ్చారంటే మన జేబులు గల్లంతే. దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోంది. దేశంలో ఏ నగరంలో లేనంత ప్లోటింగ్ జనాభా చెన్నయ్‌కి ప్రతి రోజూ వస్తూ పోతుండటం కూడా ఈ ఆటో ధరల అసందర్భ పెరుగుదలకు కారణమేమో మరి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను మీ సాఫ్ట్ వేర్ వాళ్లు వచ్చాక మాత్రమే ఆటో ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి. -కొంపదీసి మీరు సాఫ్ట్‌వేరేతర ఉద్యోగి కాదు కదా- వాళ్లు సకాలంలో ఆఫీసుకు పోవాలంటే వంద రెండువందలు పెట్టి ఆటోలో పోవడానికి వెనుకాడరు.
అలాగని ఆటో కార్మికులు ఎవరూ ఇక్కడ మేడలు కట్టింది లేదు లెండి. 90లకు ముందు వాళ్లెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అయితే చెన్నై ప్రజల సైకాలజి మొత్తం ఆటో కార్మికుల అవినీతి ద్వారా మాత్రమే తెలుస్తుందంటే ఎలా? మనం మద్రాస్ వాళ్లంటే ముంచేసేవాళ్లని ఎంత భయపడతామో, తమిళులు కూడా హైదరాబాద్ వాళ్లను చూసి అంతగా భయపడుతుంటారు. మరి వీళ్లను ముంచేసేంత ఘనకార్యాలు అక్కడేం జరిగాయో మరి.
ప్రపంచీకరణ నిర్దేశిస్తున్న అభివృద్ధి చెన్నయ్‌ని తాకముందు ఇక్కడ బస్సు ప్రయాణచార్జీలు దేశంలో ఎక్కడా లేనంత తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఉన్నత వర్గాలకనుగుణమైన అభివృద్ధి వచ్చేశాక సాధారణ ప్రయాణీకులకు నిజంగా ఉపయోగపడే మామూలు బస్సులు దాదాపుగా మాయమై అన్నీ డీలక్స్ బస్సులే వచ్చాయి. అంతకుముందు నాలుగు రూపాయలు పెట్టి మైలాపూర్ నుంచి వడపళనికి వెళ్లేవారు -దాదాపు 12 కిలోమీటర్లు- ఇప్పుడు 13 రూపాయలు పెట్టవలసి వస్తోంది. ఆర్డినరీ బస్సులో ఇప్పుడూ 6 రూపాయలే కానీ వీటి సంఖ్య బాగా తగ్గిపోయిందిప్పుడు.
మీరు సరదాకు నా పేరెత్తి “ఇల్లుని బాడిగకి రాజుకు మాత్రం ఇవ్వకు, అతను వామపక్ష మద్దతు దారుడు అని అంటే ఎమైనా అర్థం ఉందా” అని పేర్కొన్నారు. కానీ మన మమతమ్మ పార్టీ అనేసింది కదా “కమ్యూనిస్టులతో మాట్లాడవద్దు. వాళ్లతో పెళ్లి సంబందాలకు దిగొద్దు.” తమిళనాడులో దాదాపుగా డిఎంకె అన్నాడిఎంకె వాళ్లు ఒకరినొకరు కలవరు. అన్నాడిఎంకె పార్టీకి చెందిన ఎమ్మెల్లే స్థాయి వ్యక్తి కూడా డిఎంకె వ్యక్తితో మాట్లాడితే పార్టీ సభ్యత్వమే పోతుందిక్కడ. పాలకవర్గ రాజకీయాల్లోనే ఎంత ద్వేషం పేరుకుపోయిందో కదా…
రాజు గారూ, మామూలు జనం తో పోలిస్తె కొంత ఎక్కువ సంపాదిస్తున్నవారి వల్ల మామూలు జన జీవనం ఎలా ప్రభావితమవుతోందో చక్కగ చెప్పారు. నిజంగా నాకింతవరకూ తట్టని కోణం ఇది.
ఆదాయ అంతరాల వల్ల ఉన్నత స్దాయి జీవనం గడిపేవారి ఖర్చుల ప్రభావం కింది స్ధాయి వారి జీవనంపై పడడం చిన్నప్పటి నుండీ చూస్తున్నదే అయినా అది ఇన్నాళ్లూ కొన్ని ఖర్చులవరకే పరిమితం అయిందనుకుంటా. నూతన ఆర్ధిక విధానాల వల్ల ఏర్పడిన కొత్త ధనికవర్గం సరికొత్త ప్రభావాల్ని కిందివారిపై పడేస్తోందని మీ వ్యాఖ్య ద్వారా అర్ధం అవుతోంది. ముఖ్యంగా అద్దెల కోసం మధ్య తరగతి వర్గం పెద్ద మొత్తంలో ఖర్చు చెయాల్సి రావడం చెన్నైకే పరిమితం కాదనుకుంటున్నాను.
గతంలో వివిధ ఆదాయవర్గాల వారికి తగ్గట్లుగా ఇళ్లూ, సౌకర్యాలూ ఉండేవి. అద్దేలు కూడా వారికి తగ్గట్టుగానే ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడంలా. ఒకరికొకరు సాయం చేసుకోవడం ద్వారా తీర్చుకునే అవసరాలు కూడా ఇప్పుడు వ్యాపారంగా మారడంతో ఇచ్చిపుచ్చుకునే అవసరాలకి కూడా డబ్బు పెట్టాల్సి వస్తోంది. ఇవి అల్పాయాదాయ వర్గాలని బాగా దెబ్బ కొడుతోంది.
నిన్న మొన్నటివరకూ స్వల్ప అవసరాలకి డబ్బు చేబదులుగా ఇచ్చి పుచ్చుకునే అలవాటు ఉండగా ఇప్పుడు అన్ని స్ధాయిల్లోనూ వడ్డీ వ్యాపారులు తయారయ్యారు. ఒకే ఆఫీసులో పని చేస్తూ కూడా తోటి ఉద్యోగికి వడ్డీ కి తప్ప కొద్ది మొత్తంలో ఐనా అప్పు ఇవ్వని పరిస్ధితి నెలకొని ఉంది. అంతెందుకు? అన్న దమ్ముల మధ్య కూడా డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం వ్యాపార సంబంధంగా మారిపోవడం నేను కళ్లారా చూసాను.
విప్లవ రాజకీయాలు కనీస స్ధాయిలో కూడా సాగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యామ్నాయ భావజాలం పత్రికలు, ఇతర మీడియా నుండి మాయమవుతోంది. ఫలితంగా కొత్తగా పుట్టుకొస్తున్న యువతరం లో ప్రగతిశీల భావజాలం కొరవడి వ్యాపార భావజాలానికే అగ్రపీఠం అందుతోంది. చాలా బాధాకరమైన పరిస్ధితి.
విశేఖర్ గారూ,
2003లో నేను విశాఖపట్నంలో చిన్న ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నప్పుడే ఐటీ సెగ అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. అప్పుడప్పుడే ఐటీ రంగంలో ఎదుగుతున్న విశాఖ నగరంలో ఆనాటికే ఒకటి రెండు ప్రాంతాల్లో ఐడీ హబ్‌లు ఏర్పడ్డాయి. ఒక రెండు మూడు వేలమంది ఐటీ ఉద్యోగులు ఒకేచోట వచ్చి పనిచేయడం జరిగేసరికి కొద్దినెలల లోపలే ఆ ప్రాంత ఆర్థిక, జన జీవన స్థితి గతులే మారిపోయాయి.
ఎంతగా అంటే చుట్టుపక్కల అయిదారు కిలోమీటర్ల పరిధిలో ఇంటద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు పక్కన టీ అంగళ్లలో ఉండే టీ రేట్లతో సహా అన్ని సరకుల ధరలూ అమాంతం పెరిగిపోయాయి. ఐటీ ఉద్యోగులను చూసి మామూలు ప్రజలు భయపడటాన్ని అప్పుడే చూశాను. దీనికి వ్యక్తులుగా ఐటీ ఉద్యోగులు కారణం కాదు కాని సంపదలో తారతమ్యత ఉన్నట్లుండి అసమానంగా పెరిగేసరికి అది ఎంతమందిని ఎన్నిరకాలుగా ప్రభావితం చేసిందో అప్పుడే చూశాను.
“స్వల్ప అవసరాలకి డబ్బు చేబదులుగా ఇచ్చి పుచ్చుకునే అలవాటు ఉండగా ఇప్పుడు అన్ని స్ధాయిల్లోనూ వడ్డీ వ్యాపారులు తయారయ్యారు.”
అవసరాలకు ఆదుకునే ఔదార్యం గతకాలం మాటే. చేబదుళ్లు తీసుకోవడం స్థానంలో వడ్డీవ్యాపారం వ్యక్తులు, సంస్థలలో కూడా మొదలైపోయిందనుకుంటాను. ఇంతకుముందు ఆఫీసులలో కార్పొరేట్ ఆఫీసులలో కూడా ఏదైనా అనుకోని అవసరం ఏర్పడి ముందస్తు లోన్ అడిగితే వడ్డీ లేకుండా నెలవారీగా చెల్లించేటట్లుగా కాస్త ఉదారంగా రుణసౌకర్యం కల్పించేవారు కొందరికయినా. కాని ఇప్పుడు పది వేల రూపాయలు అవసరం పడి రుణం తీసుకున్నా 9 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. బయట తీసుకునే రుణాలకు వడ్డీ శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువగానే ఉండవచ్చు. కాని ఈ కొత్త మార్పు మానవ వనరుల సంక్షేమానికి తోడ్పడేది కాదు.
దాదాపు ఏడేళ్ల క్రితం మా సహోద్యోగి ఒకరికి అత్యవసరమై పది వేలు ఇచ్చాను. మూడు నెలల తర్వాత తిరిగి ఇస్తూ వడ్డీ లెక్కవేసి ఇస్తే షాక్ తిని వ్యతిరేకించాను. నేను అప్పుగా ఇవ్వలేదు అవసరం కోసం ఇచ్చాను అని తీసుకోలేదు. కాని ఇవ్వాళ అలా ఇచ్చే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయనుకుంటాను.
కోర్టుజోలికి పోవద్దు. ఆస్పత్రి జోలికి పోవద్దు అనే సూత్రాలకు అదనంగా అప్పుజోలికి పోవద్దు అనే సూత్రం కూడా జీవితంలో తప్పనిసరి అవుతోంది. అప్పు తీసుకోకపోతే డబ్బు కూడదు అనే సామెత జన జీవితంలో ఉంది కాని ఇప్పుడు దాని జోలికి పోతే మాత్రం జీవితం గల్లంతే అనిపిస్తోంది.
రాజు గారు,
నాకేందుకో తమిళ ప్రజలు నచ్చరు. అధికారంలో ఉన్న వారికి అతి వినయంగా ఒదిగి ఉండటం. కనీస ప్రతిఘటన చూపకపోవటం చూస్తుంటం. ఎవరో ఒకరో ఇద్దరో సుబ్రమణ్య స్వామి, కారితికేయన్ ఐ.పి.యస్, చంద్రకళ లాంటి ఐ.ఏ.యస్. ఒకరిద్దరు వెన్నెముకగలవారున్నారు. ఇక వారి ఎన్నికల పేటర్న్ చూడండి. నచ్చితే తలనెత్తిన పెట్టుకోవటం, ఐదు సం|| వాళ్లు ఎన్ని చెత్తపనులు చేసినా నోరు మెదపకుండా అణగిమణగి నష్ట్టాన్ని భరిస్తూండటం. దీనివలన ప్రజల స్వభావంలో శాస్వతంగా చాలా మార్పులు వస్తాయి. ఎన్నికలపుడు ఒక్కసారిగా అవతలి పార్టీ వైపు ఓట్లు గుద్దేయటం. అక్కడ పనిచేసేటప్పుడు గమనించిది వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఇన్వేస్ట్ చేసి, పదో తారిఖు కల్లా పైసా డబ్బులు లేని పేదవారిలాగా మారిపోతారు. ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా లేని వారిలాగా కనిపిస్తారు. మా ఇంట్లొ పని చేసే పని మనిషి కుతురి పెళ్లికి 20సవర్ల బంగారం పెట్టింది. ఆమే మంచి గుడ్డలు వేసుకోకుండా, తినకుండా, వచ్చిన డబ్బంతా దాచిపెట్టి బంగారం కొంట్టుంటే ధనవంతులుగా ఎలా కనిపిస్తారు. ఇక జీవితం ఎప్పుడు అనుభవించేది? ఇలా చెపుతూపోతే ఎంతో వస్తుంది.
long time since I have seen a good debate like this. keep going 🙂
అదే సాఫ్ట్ వేర్ జీవితాల్లో మరో కోణం కూడా ఉంది.
ఈ దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతగా దోపిడి చెయ్యబడుతున్నంతగా బహుసా ఏ కార్మికులు లేరేమో!
ఇప్పటికీ అసంఘిటితంగానే ఉంటూ, కనీసపు చైతన్యం కూడా లేక ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు.
మరొక ముఖ్యమైన మార్పు. పైన చెప్పినట్టు వీళ్ళ వల్ల ఇతర ప్రజలకి ఇబ్బందులు వచ్చాయి. కాని ఇప్పుడు సాఫ్ట్ వేర్ వారి ఆదాయం కూడా inflation to normalize అయింది.
అంటే సగటు ఉద్యోగికి ఒక bank ఉద్యోగి, లేదా ప్రభుత్వ senior teacher, engineer etc వాళ్ళ జీతం కన్నా ఎక్కువ ఏమీ రావట్లేదు.
but because of the hype created around them, they are being looted.
whenever I go to a doctor,no matter whether it is for a child or for mother or father, the first question is where are YOU Working?
so many times I had a fight with the doctors asking them what it has to do with my job!
Why does a dentist need to know the profession of his patient! It makes sense if an eye speciliast or some one asks this question.
cons:
An entire generation of youth have been lead like sheep into the mania called software engineer job.
A chemical engineer, mechanical engineer and others(read 1000’s of them) from IIT,joins software! What purpose is he serving for his country, least what he is serving for himself?
Where will get the doctors and engineers for future?
The companies have all come to an understanding and normalized the pay packages.
Any company can remove any employee (HSBC recently) with 1 hour notice. But if employee want to resign he is need to give 3 months notice.
Unless one is above 15 years exp or working in google or MS, an avg employee gets 30-40K which is on par with govt officials.
వెంకట్ గారూ, చాలా ముఖ్యమైన సమాచారం మీరిక్కడ పొందు పరిచారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వేతనాల విషయంలో ఉన్న చీకటి కోణాన్ని పాక్షికంగానైనా మీరు ఆవిష్కరించారు. మీ ఈ వ్యాఖ్య ఆధారంగా ఓ పోస్ట్ రాయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాను. కృతజ్ఞతలు.
“An entire generation of youth have been lead like sheep into the mania called software engineer job.”
ఈ ఒక్క వ్యాక్యంలో మీరు ఒక తరం తరమే ఎంతగా జీవన విలువల్ని కోల్పోయిందో తెలియజేసారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని నిర్ణయించుకోగలిగే గొప్ప అవకాశాల్ని ‘సాఫ్ట్ వేర్ ఇంజనీరంగ్’ అన్న పిచ్చిలో పడి యువత కోల్పోయిన పరిస్ధితిని ఎత్తి చూపారు. మీ వ్యాఖ్యకి మరి కొంత సమాచారాన్ని జోడించి పోస్టు రాస్తాను.
వెంకట్ గారూ, రోజంతా సాగిన చర్చకు అద్భుతమైన ముగింపుతో వచ్చారు మీరు. మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.. అతిప్రధాన విషయాలు చెప్పారు మీరు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 1. దోపిడీ చేయబడుతున్నారు. 2 వీళ్లూ కార్మికులే. 3. వీళ్లు అసంఘటితంగా ఉన్నారు. 4. కనీస చైతన్యం కూడా లేక ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఐటీ ఫీల్డ్‌కి సంబంధించిన అత్యంత ప్రధాన అంశాలివి.
కాని తమ వాస్తవ పరిస్థితిని కూడా గమనించలేనంత భ్రమాత్మక ప్రపంచంలో వీరు కూరుకుపోయారు. తమ శ్రమ నుంచి పరాయికరణ పాలయిపోయారు. వేతన బానిసల్లో కెల్లా అతి పెద్ద వేతన బానిసల్లా చరిత్రలో మిగిలారు వీళ్లు. కాని వీటిలో ఏ ఒక్క అంశాన్నీ వీళ్లు అంగీకరించరు. తాము సమాజంలోని అన్ని వర్గాల వారికి భిన్నమైన వర్గానికి చెందిన వారమనే గర్వం ఒకటి అదనపు లక్షణం వీరికి.
సాప్ట్‌వేర్ అంటేనే కొమ్ములొచ్చిన చందాన పదేళ్ల పాటు వెలిగిపోగానే తమకిక తిరుగులేదని విర్రవీగిపోయారు. 2008 మహా సంక్షోభంతో మొట్టమొదటి దెబ్బ పడింది. ఇప్పటికీ కోలుకోలేదు ఈ దెబ్బనుంచి.
1997 లేదా 98లో బిల్‌గేట్స్ తొలిసారి భారత్ వచ్చిన సందర్బంగా దేశీయ పారిశ్రమాధికాధిపతులందరితో భేటీ వేసినప్పుడు టాటా సీఈఓ రతన్ టాటా అప్పుడే అంటే 15 సంవత్సరాల క్రితమే సాఫ్ట్ వేర్‌ను అమాంతంగా పైకెత్తుతున్న ధోరణిని గేలి చేస్తూ బిల్ గేట్ సమక్షంలోనే జోక్ చేశారు. సాప్ట్ వేర్ భూమ్మీద అన్ని రకాల సమస్యలకు పరిష్కారమట…. అని ఆయన ఎంత వెకిలిగా గేలి చేశారో అప్పట్లోనే… బిల్ గేట్స్ సమక్షంలో నవ్వలేక నవ్వారందరూ ఆ వ్యంగ్య ప్రకటనకు. మన చంద్రబాబు మాత్రం దాన్నేమాత్రం గుర్తించకుండా ఆలాగే ముందుకు వెళ్లి వెళ్లీ బొక్కబోర్లాపడ్డాడు.
ఒక బ్లాగ్ మిత్రుడు అశ్విన్ బూదరాజు అనుకుంటాను నేనూ నా నిషాకొఠారి (?) అనే పేరుతో ప్రచురించిన కథనంలో… ఈ సాఫ్ట్‌వేర్ మోజులో తల్లిదండ్రులు యువతరం బూజు పడుతున్న తీరును కడుపుబ్బ నవ్వించేలా నాలుగేళ్ల క్రితమే వర్ణించారు.
నాకు తెలిసి కాళహస్తి లాంటి చిన్న పట్టణాలనుంచి ఐటి రంగంలోకి వెళ్లిన వారు సైతం పదేళ్లు పనిచేసి ఇక ఎందుకూ పనికిరామనే విషయం బోధపడ్డాక మళ్లీ ప్రభుత్వ సర్వీసుల్లో చేరడానికి సివిల్ సర్వీస్ తదితర పరీక్షల్లోకి దూకేశారు. ఇప్పటికీ దూకుతున్నారు కూడా.
“A chemical engineer, mechanical engineer and others(read 1000′s of them) from IIT,joins software! What purpose is he serving for his country, least what he is serving for himself?
Where will get the doctors and engineers for future?”
వెంకట్ గారూ, సాఫ్ట్ వేర్ రంగం గురించి మరింత లోతుగా దాని వాస్తవ పరిస్థితి, అందులో పనిచేసే వారి మానసిక పరిస్థితి గురించి, దాని సానుకూల, ప్రతికూల అంశాలపై మీరే మరింత లోతుగా ఏదైనా కథనం రాయవచ్చు గదా. మీరు ఈ రంగంతో చాలా దగ్గరి సంబంధంలో ఉన్నట్టున్నారు కాబట్టే ఇలా అడుగుతున్నాను.
విశేఖర్ గారూ మీ మిత్రుడిని వదలొద్దండీ.
మా అమ్మగారు ఆంధ్రా బ్యాంక్‌లో ఉద్యోగి. జీతం నలభై వేలు. హైదరాబాద్‌లో సత్యం కంపెనీ మూత పడకముందు సత్యం కంపెనీలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీతం ఇరవై వేలు. అది బ్యాంక్ PO జీతంతో సమానం. పల్లెటూరిలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేసినా అంత జీతం వస్తుంది. గ్లోబలైజేషన్‌కి ప్రత్యామ్నాయం లేదని ఒక వర్గంవాళ్ళు ప్రచారం చెయ్యడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం తప్ప ఏ ఉద్యోగమూ అవసరం లేదనుకునే స్థితిలో కొంత మంది ఉన్నారు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/WMyg2e4A9Xu
ఆ వ్యాసం వ్రాసినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి: http://stalin-mao.net.in/-a
అయ్య బాబోయ్!
3 రోజులు నెట్ లేకపోయేసరికి చాలా జరిగినట్టున్నాయి 🙂
శేఖర్ గారు,
వ్యాసం రాస్తానని అన్నందుకు కృతఘ్నతలు.
రాజు గారు,
నాకు అంత ద్రుశ్యం లేదండి. edo alaa కడుపు మండి అంతె 🙂