ఢిల్లీ కోర్టు బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు నిచ్చాడు. శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడ్జి విధించిన శిక్ష, తదనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాపితంగా ఉన్న కోర్టులు పాటించినట్లయితే దాదాపు భారత దేశ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.
“మా ఉదాసీనతే అవినీతి నేరానికి సహకారిగా ఉంటున్నాడని తరచుగా వినబడుతోంది. ‘సబ్ చల్తా హై’ అన్న ధోరణి మనల్ని ఇప్పుడున్న స్ధితికి తీసుకొచ్చింది. చట్ట విరుద్ధంగా ఏదో ఒకటి సమర్పించుకోనిదే ఏ ఒక్కటీ కదలని పరిస్ధితి వచ్చింది. సరైన సమయంలో సరైన చర్య జరగడానికి కూడా ప్రజలు బలవంతంగా చెల్లించుకోక తప్పని పరిస్ధితి ఏర్పడింది” అని జడ్జి కన్వల్ జీత్ ఆరోరా వ్యాఖ్యానించాడు.
“సమాజమూ, దోషి ఇద్దరి ప్రయోజనాలూ సమతూకంతో పరిశీలించినపుడు సెక్షన్ 9 కింద దోషికి నాలుగు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తే న్యాయ ప్రయోజనం నెరవేరుతుందని నేను భావిస్తున్నాను” అని జడ్జి వ్యాఖ్యానించాడు.
అయితే భారత దేశ దళితులు, గిరిజనులు, ఇంకా అనేకమంది అణగారిన వర్గాలవారు వేస్తున్న ప్రశ్నలు వేరే ఉన్నాయి. భారత దేశంలో అవినీతి మధు కోడా, శిబూ సోరేన్ లతోనే మొదలయిందా? మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా తోనే ఊపందుకుందా? రక్షణ రంగంలో లంచాలు మామూలే అని సాక్ష్యాత్తూ మాజీ త్రివిధ దళాధిపతులే అంగీకరిస్తే వారినేవరూ ఎందుకు ప్రశ్నించరు? ఒకే కేసులో దోషులయినా కనిమొళి కి వచ్చే బెయిలు ఏ.రాజా కి ఎందుకు రాదు? బోఫోర్స్ కేసు లో దశాబ్దాలు విచారణ జరిగినా ఒక్కరూ దోషిగా ఎందుకు తేలలేదు? కామన్ వెల్త్ అవినీతి కేసులో సురేష్ కల్మాడీ జైల్లో ఉన్నా ఐ.ఓ.ఏ అధ్యక్షుడుగా ఎలా కొనసాగుతాడు? వందల మంది దళితులను ఊచకోత కోసిన రణవీర్ సేన అధిపతి అగ్రకుల దురహంకారి బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా సంవాత్సరాల తరబడి జైల్లో ఉన్నా పోలీసులకి ఆయన అడ్రస్ తెలియకుండా ఎలా పోతుంది? దళితుల ఊచకోత కేసులో దోషులకి శిక్ష పడితే పై కోర్టు నిర్దోషులని ఎలా వదిలిపెడుతుంది?
వేలమందిని చంపిన యూనియన్ కార్బైడ్ అధినేత యాండర్సన్ ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విమానం ఎక్కించి మరీ పారిపోయేలా సహకరించిన అర్జున్ సింగ్ ముఖ్య మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎలా కొనసాగుతాడు? అర్జున్ సింగ్ తో యాండర్సన్ కి సహకరించమని చెప్పిన రాజీవ్ గాంధీ దోషిగా ఎందుకు పరిగణించబడడు? ఒక్క గుడి కోసం రధ యాత్ర చేసి వేలమంది అమాయకులు మత కల్లోలాల్లో చావడానికి కారణమైనా అద్వానీ ఇప్పటికీ భారత దేశం రూపొందించుకున్న గొప్ప స్టేట్స్ మెన్ లో అగ్రగణ్యుడు.
హిందూ ప్రజలను ఉసి గోలిపి వెయ్యి మంది పైన రాష్ట్ర ప్రజల్ని ఊచకోత కోసిన నరేంద్ర మోడి ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత! మోడి ఏ మచ్చా లేకుండా, విచారణా శిక్షా తర్వాత సంగతి, తప్పించుకోవడానికే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమూ దానికి మందీ మార్బలమూ కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా! ఆ వజాన హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నారని బహిరంగంగా సమర్ధించినా అది వదరుబోతుతనం అవచ్చేమో గానీ పచ్చి నెత్తురు తాగే విశృంఖల నేర స్వభావం మాత్రం కాదు. ఒక గూండా రాజకీయ నాయకుడి పైన మచ్చ పడకుండా ఉండడానికి ఇన్ని వ్యవస్ధలూ, చట్టాలూనా? మత మారణకాండలో బలయిన వందల మంది అమాయకులకు ఒక్క చట్టమూ తోడు నిలవదా?
రిలయన్స్ కంపెనీ లాభాలు మోసపూరితంగా పెంచుకోవడానికి ముక్షేష్ అంబానీ తాను పెట్టని పెట్టుబడుల్ని పెట్టినట్లుగా దొంగ లెక్కలు వేసి చూపించాడు. భవిష్యత్తులో పెరిగే ధరల కోసం ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరిశ్రమలకి గ్యాస్ ఇవ్వ కుండా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కంపెనీలకి గ్యాస్ అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రజలేమో విద్యుత్ లేక నానా అగచాట్లూ పడాలి. మోటార్లు తిరక్క నీరు దొరక్క రైతులు నష్టాల పాలై ఆత్మహత్యలు చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలకి చెందాల్సిన సహజ వాయువుని విదేశాలకీ, ప్రవేటు కంపెనీలకి అమ్ముకుని లాభాలు సంపాదిస్తున్న ముఖేష్ అంబానీ పైన ఈగ కూడా వాలదు. ప్రజా ధనాన్ని మెక్కి వెయ్యి కోట్లతో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకునే ముఖేష్ అంబానీ గొప్ప పారిశ్రామిక వేత్త.
ఈ పంది కొక్కుల పాలనలో కాదా కోటి కోట్ల ప్రజాధనం స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది?
భారత రాజకీయ నాయకుల అవినీతిని శుభ్రపరిచే మహత్తర కృషిలో బంగారు లక్ష్మణ్ కేసే మొదటిది కావాలి అని ఫస్ట్ పోస్ట్ పత్రిక అంటోంది. మరి బోఫోర్స్ మొదటిది ఎందుకు కాగూడదు? తండ్రి అధికారంతో రాష్ట్ర ప్రజలకు చెందిన ప్రజాధనాన్ని బొక్కిన జగన్మోహన్ రెడ్డి కేసు ఎందుకు కాగూడదు? దేశప్రజల సహజ వనరు ఇనుప గనుల్ని విదేశాలకి తరలించి సొమ్ము చేసుకున్న గాలి జనార్ధన రెడ్డి కేసు ఎందుకు కాదు? అప్పటి కొచ్చేసరికి కాంగ్రెస్, బి.జె.పి ల ఎన్నికల అవకాశాలు పక్కకి వెళ్తాయి గనుక అవినీతిని సహించబోము అని చెప్పడానికి ఈ పార్టీలకి ఏ.రాజాలు, మధు కోడాలు, శిబూ సొరేన్ లూ కావాలి!
దేశంలో అవినీతి పెచ్చుమీరిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ అవినీతిపరుడికి శిక్షపడిందని సంతోషించాలో, లేక వందల వేలకోట్లు ప్రజాధనం అప్పణంగా మెక్కిన వారు ప్రజా నాయకులుగా, దేశ ప్రజలందరూ TVలలో చూస్తుండగానే ఓ పురాతన మసీదును కూలగొట్టి దేశంలో వైషమ్యాలకు బీజంపోసిన వారు కేంద్ర మంత్రులుగా,మతోన్మాదంతో వేల మంది అమాయకుల మరణాలకు ప్రత్యక్ష కారణమైన వారు ముఖ్యమంత్రులుగా ఎలాంటి విచారణలూ శిక్షలూ లేకుండా వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తుండగా..కేవలం లక్ష రూపాయల అవినీతికి పాల్పడిన ఓ దళితున్ని శిక్షించటంలో మాత్రం చట్టం సక్రమంగా పనిచేసిందుకు అతనిపై జాలిపడాలో తెలీని విచిత్ర స్థితి ప్రస్తుతం ఉంది..
ఈ రోజు ఆంధ్రజ్యొతిలో, ఇదే అంశంపై వచ్చిన కె.శ్రీనివాస్ గారి వ్యాసం వీలైతే చదవండి.
చీకటి గారూ, మీరన్నట్లు ఇది విచిత్ర పరిస్ధితే. ఈ పార్టీకి చెందిన అవినీతి పరులు మళ్లీ కేంద్ర మంత్రులు అవుతారు. మళ్ళీ అవినీతిని విశృంఖలంగా కొనసాగిస్తారు. అలాంటి అవినీతికి అధికారం కావాలి. ఆ అధికారం కోసం అవినీతిపై పోరాడుతున్నామన్న పేరూ కావాలి. ఆ పేరు కోసం వీళ్లకి బలిపశువులుగా దళితులే కనిపిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న పచ్చి మోసం ఇది.
మీరు సూచించిన జ్యోతి వ్యాసం చదువుతాను.
చీకటిగారూ, జ్యోతి ఎడిటోరియల్ చదివాను. చాలా గొప్పగా ఉంది. మిత్రులకు అందుబాటులో ఉండడానికి ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain
పాపం బంగారు లక్ష్మణ్ గారు మీడియా కన్నుకు అడ్డంగా దొరికిపోవడం అనే ఒకే ఒక కారణంతో చాలా ఆలస్యంగా చట్టానికి దొరికిపోయారనుకుంటాను. కాని పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కోట్లు ఆఫర్ చేసినవారు, సూట్ కేసులో కోటిరూపాయలను ఇలా పెట్టి ఇచ్చామని చెప్పినవారు ససాక్ష్యంగా వివరాలు తెలిపినప్పటికీ, కోర్టులకు, న్యాయమూర్తులంగారికి ఆ అవినీతి కనబడలేదనుకుంటాను.
వందలకోట్లు దిగమింగిన వారు కూడా బెనిపిట్ ఆఫ్ డౌట్ కింద సచ్చరితులుగా బయటకు వచ్చేస్తున్న దౌర్భాగ్య దేశంలో లక్షరూపాయలు లంచం పుచ్చుకున్న బంగారు లక్ష్మణ్ జైలుకు వెళ్లడం, ఉద్యోగులలో చిన్న చిన్న చేపలు మాత్రమే అవినీతిపరులుగా జైళ్లకు వెళ్లడం చూస్తే కోర్టుల వర్గ, కుల దృక్పధంపైనే అనుమానం బలమవుతోంది. ఎవరి అవినీతినయినా సమర్థించపనిలేదు. కానీ…
కోర్టుల వివక్షత, అంధత్వంపై చక్కని కథనం.. అభినందనలు.
రాజు గారూ, నాకయితే ఇక్కడ రాజకీయ జోక్యం కూడా ఉందన్న అనుమానం కలుగుతోంది. బి.జె.పి పరోక్ష మద్దతుతో సంవత్సరం నుండి జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, బోఫోర్స్ కేసు మళ్ళీ తలెత్తడం… ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి బి.జె.పి ప్రతిష్ట మసకబార్చాల్సిన అవసరం కనిపించి అర్జెంటుగా లక్ష్మణ్ కేసు పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఈనాటిది కాదు కదా.
Judiciary or courts must prove their potency by imposing same punishment of 4 years jail to Forward caste corrupted leaders not like weaker section people leaders like SC ST and OBCs. Does Judicature have that guts? However No SC ST and OBC people believe that Judicature is potent. It is very very shameful on part of Judaical.