ఏప్రిల్ 24 తేదీ నుండి ‘క్లుప్తంగా’ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాను. ప్రతిరోజూ “క్లుప్తంగా… ‘తేదీ'” హెడ్డింగ్ తో ఒక పోస్టు రాయడం జరుగుతుంది. ఈ పోస్టులో ఆ తేదీన వెలువడ్డ వార్తలలో కొన్ని ముఖ్యమైనవి ఎంచుకుని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇలాంటి పోస్టు ఒకటి ప్రతి రోజూ రాయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఎలా రాయాలో తెలియక మొదలు పెట్టలేదు. ఆ విధంగా ప్రతిరోజూ రాసిన క్లుప్త వార్తల పోస్టులకు హోం పేజీ నుండి లింక్ ఎలా ఉండాలో అర్ధం కాలేదు. మిత్రుల సలాహా తో కొత్త కేటగిరీ ద్వారా అలాంటి లింకు హోం పేజీ లో పెట్టవచ్చని తెలుసుకుని ప్రారంభిస్తున్నాను.
ఈ పోస్టును ఆ రోజులో “వీలు దొరికినప్పుడల్లా” అప్ డేట్ చేయడం జరుగుతుంది. ‘వీలు దొరికినప్పుడల్లా’ అంటే సమయానుకూలతను బట్టి అని అర్ధం. ఏ రోజన్నా మిస్ అయితే మరుసటి రోజయినా కిందటి రోజునాటి ముఖ్యమైన (ముఖ్యంగా నేను భావించినవి) వార్తలను ‘క్లుప్తంగా’ రాయడానికి ప్రయత్నిస్తాను.
-విశేఖర్
Shekar Garu! This is Very Very Good Idea, and its useful for just like recall the event/issue, ThanQ.
క్లుప్తంగా చెప్పాలంటే… ‘బాగుంది’!
🙂
sekhar garu..chala bagundhi. keep it up
Simply Superb idea for Daily viewers
🙂
?!
@చందు & ‘ఎందుకో’ గారూ ధన్యవాదాలు.