స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ ఇండియా రేటింగ్ ‘ఔట్ లుక్’ ని తగ్గించింది. ఇండియా అప్పు రేటింగ్ ఇప్పటివరకూ BBB+ గా ఉండగా ఇప్పుడు దానిని BBB- కి తగ్గించింది. BBB+ ‘స్ధిర’ (stable) రేటింగ్ ని సూచిస్తుంది. BBB- రేటింగు సమీప భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గించే అవకాశం ఉందన్న హెచ్చరికను సూచిస్తుంది. ఎస్&పి కేటాయించే ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్లలో BBB- అత్యంత తక్కువ రేటింగ్. AAA, AA, A, BBB తర్వాత BBB- చివరి ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ గా పరిగణిస్తారు. స్వదేశీ, విదేశీ ప్రవేటు పెట్టుబడుదారులు భారత దేశ బాండ్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఈ ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ లను ఒక ప్రామాణికంగా చూస్తారు. BBB- తర్వాత కూడా ఇంకా అనేక స్ధాయిలలో రేటింగ్ లు ఉన్నప్పటికీ అవన్నీ ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ లు కావు.
బాండ్ మార్కెట్ అంటే? మార్కెట్ ఎకానమీ లో ప్రభుత్వాలు వివిధ మొత్తాల్లో, వివిధ కాలపరిమితుల్లో బాండ్లను జారీ చేసి అప్పులను సేకరిస్తాయి. బాండ్లను కొనుగోలు చేసేవారు ప్రభుత్వానికి అప్పు ఇస్తున్నట్లు అర్ధం. బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. అత్యంత తక్కువ వడ్డీ రేటు పలికినవారికి బాండ్లను కేటాయిస్తారు. బాండ్ల వేలంలో అనేకమంది పాల్గొంటారు. స్వదేశీ, విదేశీ ప్రవేటు ద్రవ్య కంపెనీలు (బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు మొ.వి), వ్యక్తులు, సంస్ధలతో పాటు ప్రభుత్వ కంపెనీలు, బ్యాంకులు కూడా ఈ వేలంలో పాల్గొంటాయి. ఎస్&పి, ఫిచ్, మూడీస్ లతో పాటు ఇంక అనేక రేటింగ్ సంస్ధలు ఇచ్చే రేటింగ్ లపై ఆధారపడి వీరు ఆయా దేశాల ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చా, లేదా? పెట్టొచ్చనుకుంటే ఎంతవరకు పెట్టవచ్చు? అన్న దాన్ని నిర్ణయించుకుంటారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించాక రేటింగ్ సంస్ధల విశ్వసనీయత పడిపోయింది.
ఇప్పటి విషయానికి వస్తే, భారత దేశ ఆర్ధికాభివృద్ధి క్షీణిస్తుండడంతో అప్పు రేటింగ్ తగ్గించవలసి వచ్చిందని ఎస్&పి తెలిపింది. ఫిస్కల్ డెఫిసిట్ అధికంగా ఉందని కూడా ఎస్&పి భావిస్తోంది. రాజకీయ అనిశ్చితి దేశ ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆ సంస్ధ భావిస్తోంది. వీటన్నింటి వలన భారత దేశ ఋణాల ‘ఔట్ లుక్’ తగ్గించామని తెలిపింది. రానున్న రోజుల్లో భారత దేశ రేటింగ్ ను BB కి తగ్గించడానికి మూడింట ఒకవంతు అవకాశం ఉందనీ రెండు సంవత్సరాలలో అలాంటి అవకాశం ఉందనీ ఎస్&పి తెలిపింది.
రేటింగ్ సంస్ధలు రేటింగ్ లు కేటాయించేటపుడు ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోవు. ప్రజల జీవన ప్రమాణాల గురించీ, ఆర్ధిక స్ధితిగతులు గురించీ వాటిని అనవసరం. పెట్టుబడిదారీ కంపెనీల అవసరాలే వాటికి ముఖ్యం. భారత దేశం ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించలేకపోతోందని చెప్పడం అంటే ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించలేకపోతోందని చెబుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. కంపెనీలకి ఇచ్చే పన్ను రాయితీలు, పన్నుల రద్దు, టాక్స్ హాలిడేలు… ఇవన్నీ పెరగాలనీ, ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి ఇచ్చే సబ్సిడీలు తగ్గించాలనీ రేటింగ్ సంస్ధలు భావిస్తాయి. బడ్జెట్ లలో ప్రజానుకూల విధానాలు ఉంటే వాటిని పాపులిస్టు విధానాలన్న ముద్ర వేసి రేటింగ్ తగ్గించడానికి ఉద్యుక్తులవుతాయి. కంపెనీలపై పన్నులు పెంచితే పెట్టుబడివ్యతిరేక వాతావరణాన్ని ప్రభుత్వాలు పెంచుతున్నాయని చెప్పి రేటింగ్ తగ్గిస్తాయి. పెట్టుబడిదారీ కంపెనీలు, వ్యక్తులకు లాభాలు సమకూరడానికి మార్గదర్శకత్వం వహిస్తాయి.
mee analysis chalaa baagundandi… vividha rating company lu yeye amshaalu pariganichi rating yistaayi anna vishayaalanu vivariste inkaa chaalaa baguntumdi ani naa abhipraayayam…
S&P is pro-globalisation organisation. That organisation gave ratings against UPA government because of their dissatisfaction regarding implementation of liberalisation policies.
కిరణ్ గారూ రేటింగ్ కంపెనీల గురించి గతంలో ఒకసారి కొంత వివరంగా రాసాను. మళ్లీ ఒకసారి సందర్భం వచ్చినపుడు వివరించడానికి ప్రయత్నిస్తాను.
Exactly.
Most important thing! S&P dont even seem to remember something called CORRUPTION! Thousands and Lakhs of crores in swiss banks which could have made this super rich country!
US and Europe recession is due to the billions they are spending on WAR, NOT the PEANUTS lost to offshoring!!
Somehow S&P and others seem to conveniently forget!
You are correct. For them, corruption is the way of getting rich which people can’t learn to understand.