పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం


Plane crashపాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది. వాతావరణం బాగోలేకపోవడమే ప్రమాదానికి కారణంగా ప్రారంభ వార్తలు చెబుతున్నాయి.

పొలాల్లో కూలిన విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎవరూ బతికి ఉండడానికి అవకాశాలు లేవని ఐ.బి.ఎఫ్ లైవ్ వార్తలను బట్టి తెలుస్తోంది. రావల్పిండిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానం పూర్తిగా నాశనం అయిందని చానెళ్లు ప్రకటించాయి. రాజధాని నగరంలో వివిధ చోట్ల తీవ్రస్ధాయిలో వర్షం కురుస్తూ, తుఫాను గాలి వీస్తున్నదని ప్రమాదానికి అదే కారణమని చెబుతున్నారు. విమానం కూలాక మంటల్లోPlane crash02 చిక్కుకుందనీ, మాటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నామని ఎమర్జన్సీ అధికారి సైఫుర్ రహ్మాన్ ని ఉటంకిస్తూ జియో టి.వి తెలిపింది.

ఫ్లాష్ లైట్లతో మరణించినవారి కోసం విమానం కూలిన ప్రాంతంలో వెతుకుతున్నారు. జులై 2010 నెలలో ఇస్లామాద్ లో విమానం కూలి 152 మంది మరణించాక పాక్ లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఇదే. తుఫాను వాతావరణంలో విమాన పైలట్లు తన ప్రయాణ దిశను మార్చుకోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రభుత్వ ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. విమాన భాగాలు, ప్రయాణీకుల శరీర భాగాలు కి.మీ దూరం పరిధిలో చెల్లా చెదురుగా పడ్డాయని ప్రయాణీకుల మృత దేహాలను డి.ఎన్.ఏ ద్వారా తప్ప గుర్తించలేకపోవచ్చని తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s