కొలంబియాలో ఒబామా భద్రత కోసం వెళ్ళిన భద్రతా సిబ్బంది పన్నెండు మంది ‘ఎస్కార్ట్’ మహిళలతో ఉండగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ కాన్ఫరెన్స్ కోసం కొలంబియా లోని కార్టిజీనా నగరానికి కొద్ది రోజుల క్రితం ఒబామా వెళ్ళివచ్చాడు. స్ధానిక క్లబ్ లో తాగి అక్కడే మహిళలతో బేరం కుదుర్చుకుని తాము బస చేసిన హోటల్ కి తీసుకెళ్లారు. $800 ఇస్తానని చెప్పి ఉదయాన్నే $30 మాత్రమే ఇవ్వజూపడంతో ఒక మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఒబామా భద్రత కోసం వచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అని తెలియని మహిళలు వారి మోసాన్ని పోలీసుల ద్వారా ఎదుర్కోవాలని ప్రయత్నించారు. ఒకరు అసలు డబ్బులు ఇవ్వను పొమ్మనగా మరొకరు $47 డాలర్లు ఇచ్చి సరిపెట్టాడు. అమెరికా సీక్రెస్ సర్వీస్ ఏజెంట్ల పొదుపు లక్షణం గురించి వేసిన ఈ కార్టూన్ ని టౌన్ హాల్ డాట్ కామ్ వెబ్ సైట్ ప్రచురించింది.
–
ప్రభుత్వ వార్తలు
“ఎస్కార్ట్ లకు తక్కువ ఫీజు చెల్లింపు కోసం బేరసారాలు నిర్వహించడం ద్వారా పన్ను చెల్లింపు దారుల సొమ్ముని తమ ఏజెంట్లు ఆదా చేయడాన్ని సీక్రెట్ సర్వీస్ విభాగం జరిపిన జి.ఎస్.ఎ ఆడిట్ హర్షం వ్యక్తం చేసింది”
(జి.ఎస్.ఎ: జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్)