అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా


Moralesప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు చేశాడు.

కొలంబియా నగరం ‘కార్టిజీనా’ లో జరుగుతున్న ఒ.ఎ.ఎస్ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. పశ్చిమార్ధ గోళంలో ఉన్న ముప్ఫై దేశాలకు పైగా ఒ.ఎ.ఎస్ లో సభ్యులుగా ఉన్నాయి. ఒక్క క్యూబా మాత్రమే ఈ సంస్ధ నుండి మినహాయించబడింది. ప్రారంభంలో క్యూబా కూడా సభ్య దేశమే అయినప్పటికీ 1959 లో ఫెడరల్ కాస్ట్రో, ఎర్నెస్టో చేగువేరాల నాయకత్వంలో విప్లవం సంభవించాక ఆ దేశాన్ని అమెరికా పట్టుబట్టి సస్పెండ్ చేయించింది. అశేష ప్రజానీకం పాల్గొన్న విప్లవాలు విజయవంతమయిన దేశాల పట్ల అమెరికా ఇదే వైఖరిని తీసుకుంటుంది.

“మమ్మల్ని ఇంకా ప్రపంచం నుండి వేరు చేయాలని అమెరికా భావిస్తున్నట్లుంది. లాటిన్ అమెరికాను మేనిపులేట్ చేయవచ్చని అమెరికా ఇంకా భావిస్తోంది. కానీ ఆ శకం ముగిసింది” అని బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ వ్యాఖ్యానించాడు. “నేనేమనుకుంటున్నానంటే, అమెరికా కి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా దేశాలు చేస్తున్న తిరుగుబాటు ఇది” అని ఆయన అన్నాడు. సమావేశాలు ముగిసేనాటికి అమెరికా మునుపటికంటే ఎక్కువగా ఒంటరిగా మిగిలిపోయిందని ప్రెస్ టి.వి వ్యాఖ్యానించింది. ఒ.ఎ.ఎస్ నుండి క్యూబాను మినహాయించడాన్ని 30 దేశాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్యూబాతో కలిసి ఉమ్మడి డిక్లరేషన్ పై సంతకం చేయడానికి అమెరికా అంగీకరించకపోవడాన్ని అవి దుయ్యబట్టాయి.

ప్రపంచంలో అనేక మంది నియంతలకు మద్దతిచ్చి కాపాడుతూ వచ్చిన అమెరికా క్యూబాలో ప్రజాస్వామిక సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామిక సంస్కరణలు అంటే అమెరికా ఉద్దేశ్యంలో అమెరికా కంపెనీలకు అనుకూలమైన మార్కెట్ సంస్కరణలు అమలు చేయడమే. మార్కెట్ అనుకూల విధానాల వల్ల ఆయా దేశాల ప్రజల జీవనం నాశనమైనా సరే అమెరికాకి పర్వాలేదు. ప్రజల జీవనాన్ని అల్లకల్లోలం చేసే స్వేచ్చా మార్కెట్ విధానాలు ప్రజాస్వామికమైనవని అమెరికా ప్రబోధిస్తుంది.

క్యూబా విషయంలో అమెరికా చేస్తున్న డిమాండ్లను లాటిన్ అమెరికా దేశాలు తిరస్కరిస్తున్నాయి. ‘ప్రచ్చన్న యుద్ధం’ నాటి విధానాలను అమెరికా ఇంకా కొనసాగిస్తున్నదని భావిస్తున్నాయి. ‘సోషలిస్టు’ గా చెప్పుకుంటున్న ప్రభుత్వాలతో పాటు వివిధ కన్సర్వేటివ్ ప్రభుత్వాలు కూడా అమెరికా విధానాన్ని తిరస్కరిస్తున్నాయి. అయితే, మెక్సికో లాంటి దేశాలు గత అమెరికా అధ్యక్షుల కంటే ఒబామా కొంత నయమని భావిస్తున్నాయి. గత అమెరికా అధ్యక్షులంత చెడ్డవాడు ఒబామా కాదని భావిస్తున్నాయి.
“మొత్తం సమావేశాలు ముగిసేవరకూ సభలోనే ఒబామా ఇక్కడే ఉన్నాడు. ఇలాంటి అమెరికా అధ్యక్షుడిని ఇదే మొదటి సారి చూడడం. అన్నీ దేశాలకు చెందిన అన్ని సమస్యలను విన్న అధ్యక్షుడు ఈయనే” అని మెక్సికో అధ్యక్షుడు ఫిలిప్ కాల్డరాన్ వ్యాఖ్యానించాడు. “అధ్యక్షుడు ఒబామా నుండి వచ్చిన ఈ వైఖరి చాలా విలువైనది” అని ఆయన వ్యాఖ్యానించాడు. క్యూబా పట్ల తమ వైఖరిని సడలించుకున్నామని ఒబామా, కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంటోస్ తో కలిసి హాజరైన విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు. సంస్కరణలకు సిద్ధమయితే మరింత సడలించడానికి సిద్ధమేననీ అన్నాడు. గత కాలపు భారాన్ని ఇప్పటికీ తెచ్చేవాడ్ని తాను కాదనీ సమస్యలను తాజా దృక్పధంతో చూడాలని భావిస్తున్నాననీ ఒబామా అన్నాడు.

అయితే ‘కొత్త సీసాలో పాత సారా’ నింపడం అమెరికాకి అలవాటే. కొత్త తీపి పూసి అవే చేదు మాత్రలు మింగించడం అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య. దాని విధానాల సారాంశం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కి అమెరికా కంపెనీల మార్కెట్ ప్రయోజనాలను నెరవేర్చడమే.

ఇవే అంశాలను గుర్తు చేస్తూ బొలీవియా అధ్యక్షుడు, దక్షిణ అమెరికా, కరీబియన్ దేశాలపై అమెరికా నియంతృత్వాన్ని ఖండించాడు. “అమెరికా, క్యూబాలు ఒక విషయంలో ఉమ్మడి లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అవి రెండూ ఇతర దేశాలకు ట్రూప్స్ ని పంపుతాయి. క్యూబా వైద్య సాయం అందించే ట్రూప్స్ ని పంపిస్తే అమెరికా మాత్రం ప్రజల ప్రాణాల్ని హరించే సైనిక ట్రూప్స్ ని పంపుతుంది. అదే పెద్ద తేడా” అని ఇవా మొరేల్స్ వ్యాఖ్యానించాడు.

4 thoughts on “అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

 1. చీకటి గారూ, గూగుల్ ఎకౌంట్ నాకు లేదు. ఎప్పుడో ఉండేది కాని పాస్ వర్డ్ మర్చిపోయాను. అందువల్ల మీ బ్లాగ్ లో వ్యాఖ్య చేయలేకపోయాను.

  మీరు చెప్పింది వాస్తవం. గో హత్య వ్యతిరెకత లో ఉన్న మత దృక్పధాన్ని చక్కగా విశ్లేషించారు. అదే కాక దళితులకి సంబంధించిన ఆచార వ్యవహారాలపైనా, ఆహారపు అలవాట్లపైనా హీన దృష్టితో చూసే దృక్పధం ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్ధితిని ఎదుర్కోవడానికి ఉస్మానియా విద్యార్ధులు జరిపిన ‘బీఫ్ ఫెస్టివల్’ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది.

  ఫెస్టివల్ అనంతరం జరిగిన దాడులు, ప్రతిదాడుల సంగతి నాకు అర్ధం కాలేదు. సంఘటనల క్రమం మీకేమైనా తెలుసా? తెలిస్తే టూకీగా చెప్పగలరా?

 2. విశేఖర్ గారూ,
  చీకటి గారి వ్యాఖ్య చూశాక నేను సేకరించిన ఈ విలువైన లింకులు మీ ఈ టపాలో పోస్ట్ చేస్తున్నాను.

  నా వ్యాఖ్యతో పనిలేకుండా మీ పరిశీలనకోసం రెండు లింకులు పంపిస్తున్నాను. ఇంకా చూడనట్లయితే తప్పక చదవండి.

  పెద్దకూర పండుగ రాజకీయాలు
  http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=95734

  ఇది ఒక సాంస్కృతిక విప్లవం
  http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=95078

 3. రాజు గారూ, మీరు ఇచ్చిన లింక్ లు చూశాను. వాటితో పాటు ఫస్ట్ పొస్ట్ లో కూడా ఒక విశ్లేషణ ప్రచురితం అయింది. అది ఇది.

  http://www.firstpost.com/politics/beef-festival-organisers-are-foolish-lambs-to-the-slaughter-278662.html

  ఫస్ట్ పోస్ట్ విశ్లేషణ ఏకపక్షంగా సాగింది.

  మీరిచ్చిన లింక్ ని బట్టి ఫెస్టివల్ పైన ఏకపక్షంగా దాడి జరిగింది. ఆ దాడికి కారణంగా చీకటి గారు చేసిన విశ్లెషణ సరైనదిగా కనిపిస్తోంది. ఫెస్టివల్ వల్ల తెలంగాణ ఉద్యమానికి నష్టం అని చెప్పడం ఘోరంగా ఉంది. దాడికి తెగబడినవారిని వదిలి దాడికి గురయినవారిని విఛ్ఛిన్నకులుగా చెప్పడం దారుణం. తమ ఆహారపు అలవాట్లు తమకి గొప్పే అని చెప్పుకోవడం దళితులకి అవసరమే కదా. వారి ఆహారపు అలవాట్లు హీనంగా చూడబడుతున్నందున ఆ అవసరం వారికి తలెత్తింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s