ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు


RTE_Act_1భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు అని తేల్చి చెప్పింది. కేవలం డబ్బు లేనంత మాత్రాన పేద పిల్లలు ‘క్వాలిటీ’ విద్యను నిరాకరించడం చట్ట విరుద్ధమని తేల్చేసింది. విద్యా వ్యాపారాన్ని పరోక్షంగా నిరసించింది.

యు.పి.ఏ ప్రభుత్వం 2009 సంవత్సరంలో ఆర్.టి.ఇ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్య అందించాలని ఈ చట్టం నిర్దేశించింది. దేశ వ్యాపితంగా ఉన్న ప్రవేటు పాఠశాలలన్నీ 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలని నిర్దేశించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, మైనారిటీయేతర అన్ ఎయిడెడ్ పాఠశాలలన్నీ ఈ బిబంధనకు కట్టుబడి సీట్లు కేటాయించాలని నిర్దేశించింది. అయితే, ఈ చట్టాన్ని దేశ వ్యాపితంగా ఉన్న ప్రవేటు పాఠాశాలల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని చెబుతూ ప్రవేటు యాజమాన్యాల అసోసియేషన్లు కోర్టుకెక్కాయి. వారి వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఒక్క అన్ ఎయిడెడ్ మైనారిటీ పాఠశాలలు తప్ప మిగిలిన పాఠశాలలన్నీ ప్రభుత్వ, ప్రవేటు అన్న తేడా లేకుండా 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సిందేనని తీర్పునిచ్చింది.

చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా, జస్టిస్ స్వంతత్ర కుమార్, జస్టిస్ కె.ఎస్.రాధా కృష్ణన్ లతో కూడిన త్రిసభ్య బెంచి ప్రవేటు పాఠశాలలIndiaChildLabor450 యజామాన్యాల పిటిషన్ ను విచారించింది. వీరిలో జస్టిస్ రాధా కృష్ణన్ ప్రత్యేకంగా అసమ్మతి తీర్పు ప్రకటించాడు. అన్ ఎయిడేడ్ ప్రవేటు పాఠశాలలు నిర్భంధంగా 25 శాతం సీట్లు పేదలకు కేటాయించనవసరం లేదని ఆయన తీర్పు ప్రకటించాడు. మెజారిటీ తీర్పుని వ్యతిరేకించాడు.

మెజారిటీ తీర్పు ఇలా పేర్కొంది. “ఉచిత నిర్భంధ విద్య పొందేందుకు పిల్లలకు గల హక్కు రాజ్యాంగబద్ధమైనదేనని భావిస్తున్నాం. ప్రభుత్వం గానీ స్ధానిక సంస్ధ గానీ నిర్వహించే పాఠశాలలు, ప్రభుత్వ లేదా స్ధానిక సంస్ధల ఎయిడేడ్ పాఠశాలలు (ఎయిడెడ్ మైనారిటీ పాఠశాలతో సహా), నిర్ధిష్ట కేటగిరీకి చెందిన పాఠశాలలు, ప్రభుత్వ లేదా స్ధానిక సంస్ధల నుండి నిధులు పొందని అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ పాఠశాలలు అన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది.”

“ఈ రోజు నుండే ఈ చట్టం అమలులోకి వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే 2012-13 విద్యా సంవత్సరం నుండి వర్తిస్తుంది. అయితే, అన్ ఎయిడేడ్ మైనారిటీ పాఠశాలలు ఇచ్చిన అడ్మిషన్లను కోర్టు పరిశీలించదు” అని మెజారిటీ తీర్పు రాసిన చీఫ్ జస్టీస్ ఎస్.హెచ్.ఎస్ కపాడియా పేర్కొన్నాడు.

“న్యాయ నిర్ణయాల ప్రకారం ‘విద్యా హక్కు’ను ఆర్టికల్ 21 లో ప్రస్తావించిన ‘జీవన హక్కు’ లో భాగంగా గుర్తిస్తున్నాం. విద్య పొందే హక్కును ఒక్క పిల్లవాడికి నిరాకరించడం అంటే, అది ఆ పిల్లాడు గౌరవంగా జీవించడానికి గల హక్కుని నిరాకరించినట్లే. దానితో పాటు అది ఆర్టికల్ 19 (1) (ఏ) లో పొందుపరచబడిన ‘భావ ప్రకటనా హక్కునూ, స్వేచ్ఛగా మాట్లాడే హక్కునూ’ నిరాకరించినట్లే. బలహీన వర్గానికి, అవకాశాలు లేని వర్గానికి చెందిన పిల్లలు, పాఠశాలలో అడ్మిషన్ కోరుతున్నపుడు ఆర్ధిక, మానసిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అలాంటి అడ్డంకులన్నింటినీ తొలగించడానికి 2009 ఆర్.టి.ఇ చట్టం ఉద్దేశించబడింది” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

సుప్రీం బెంచి ఇలా పేర్కొన్నది. “టి.ఎం.ఏ పాయ్ ఫౌండేషన్ కేసులో గానీ, పి.ఏ.ఈనాందార్ తీర్పులో గానీ చెప్పినట్లుగా ఆర్టికల్ 19 (1) (జి)child-labor-india కింద ధార్మిక నిబంధనలకు లోబడి ఉన్నంతవరకూ, ఒక విద్యా సంస్ధను స్ధాపించడం, నిర్వహించడం ప్రాధమిక హక్కు అన్నది నిజమే. అయితే ఆ తీర్పుల్లో ఆర్టికల్ 21, 21 ఎ లకూ, ఆర్టికల్ 21, 19(1)(జి) లకూ మధ్య ఉన్న పరస్పర సంబంధం పరిగణించబడలేదు. అలాగే ఆర్టికల్ 21 ఎ లో ఉన్న అంశాలు ఆర్టికల్ 45 నుండి ప్రవహిస్తాయి. 2009 చట్టం ఆర్టికల్ 21 ఎ ను ప్రభావశీలం చేయడానికి రూపొందించబడినది. పై కారణాల వల్ల, ఆర్టికల్ 30 (1) లాగా ఆర్టికల్ 19 (1)(జి) అన్నది సంపూర్ణ (absolute) హక్కు కానందున 2009 చట్టాన్ని అకారణమని (unreasonable) చెప్పడానికి వీల్లేదు.”

బెంచి ఇంకా ఇలా పేర్కొన్నది. “సెక్షన్ 12(1)(సి) ప్రకారం 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ఒకటో క్లాసు అడ్మిషన్ ఇవ్వాలని అన్ ఎయిడేడ్ మైనారిటీయేతర పాఠశాలపైన బాధ్యత ఉంచడం అకారణ నిబంధన అనడం కూడా సరికాదు. ఆటివంటి చట్టం ఎలాంటి రాజ్యాంగ పరిమితిని అతిక్రమించినట్లుగా చెప్పలేము. 2009 చట్టం ఊదేశ్యం ఏంటంటే ఒకటో క్లాసులో అడ్మిషన్ కోరుతున్న పిల్లాడు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించడమే. దాని ఉద్దేశ్యం ఆర్టికల్ 19 (1)(జి) ప్రకారం ఉన్న స్వేచ్ఛపై నిబంధన విధించడం కాదు.”
“ఆర్టికల్ 21ఎ స్కీము, 2009 చట్టాల ఉద్దేశ్యం స్పష్టమే. వాటి ప్రకారం, 6, 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించడం ప్రభుత్వాలపై ఉన్న బాధ్యత. ముఖ్యంగా ఫీజులు లేదా ఛార్జీలు చెల్లించలేని అశక్తతలో ఉన్న వారు ప్రాధమిక విద్యలో చేరి పూర్తి చేయడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం కూడా ప్రభుత్వ బాధ్యత” అని తీర్పు పేర్కొంది.

రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఎ ప్రకారం ‘జీవించే హక్కు’ పౌరుల ప్రాధమిక హక్కు. జీవన హక్కు అన్నది కేవలం ప్రాణాలతో ఉండే హక్కు మాత్రమే కాదనీ, అన్నీ అవకాశాలతో సౌకర్యాలతో జీవించగలిగినప్పుడే ‘జీవన హక్కు’ కు సార్ధకం చేకూరుతుందనీ సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమయింది. పరిమితంగా ఉండే సహజ వనరులను ప్రవేటు కంపెనీలకు కట్టబేట్టి వారి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడానికి ప్రభుత్వాలు సహకరించడం అంటే విశాల ప్రజానీకానికి సదరు సహజ వనరుల ద్వారా లబ్ది పొందకుండా నివారించడమేననీ కనీసం ఈ తీర్పు ద్వారానైనా గమనించవలసి ఉంది. అంతే కాకుండా ఆర్టికల్ 21 ప్రకారం గల జీవన హక్కుని భారత దేశంలోని కోట్లాది పేదలు నిజమైన అర్ధంలో అనుభవించకుండానే అరవై యేళ్ళ స్వా(హా) తంత్ర్యం గడిచిపోయిందని సుప్రీం తీర్పు ద్వారా అర్ధమవుతోంది. ముఖ్యంగా జీవన హక్కులో సహజంగా భాగమైన ఉచిత నిర్భంధ విద్యా హక్కు కోట్లాది పేద ప్రజానీకం అరవై యేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా సిద్ధించలేదని 2009 ఆర్.టి.ఇ చట్టంతో పాటు సుప్రీం కోర్టు తీర్పు కూడా తేల్చి చెప్పాయి. అశేష భారత ప్రజానీకానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించలేదని నక్సలైట్లు పేర్కొనడం వాస్తవమేనని కోర్టు తీర్పు, 2009 విద్యాహక్కు చట్టం పాక్షికంగానైనా అంగీకరించనట్లయింది.

ఆర్.టి.ఇ చట్టం దానికదే ప్రగతిశీలమైనదే అయినప్పటికీ, ఆ చట్టం మాటున ప్రభుత్వాలు తమ బాధ్యతను తప్పించుకోజూస్తున్న ప్రయత్నాలు దాగి ఉన్నాయి. ప్రవేటు పాటశాలలకు పేదవారికి కూడా విద్యా సౌకర్యాలు కల్పించే బాధ్యతను పాక్షికంగా అప్పజెప్పినంత మాత్రాన ప్రబ్బుత్వాలు తమ అసలు బాధ్యతను విస్మరింపజాలవు. కానీ జరుగుతున్నది అదే. ప్రభుత్వ పాఠశాలలు దాదాపు అనాధలుగా మిగిలిపోయాయి. అద్భుతమైన ప్రతిభా సంపత్తులు కలిగిన విద్యార్ధులను తయారు చేసిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నామ మాత్రంగా మిగిలిపోయాయి. పాఠశాలల నిర్వహణకు స్ధిరంగా నిధులు ఇవ్వాలన్న స్పృహ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దాదాపు పూర్తిగా విస్మరించాయి. బడి పంతుళ్లను భావి పౌరులను తయారు చేసే నిర్మాతలుగా కాక నెల జీతాలు మింగే వారుగా మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. టీచర్లకు ఉన్నత స్ధాయి జీవనాన్ని గ్యారంటీ చేసే వేతనాలు ఇస్తున్నట్లయితే టీచింగ్ వృత్తివైపుకి మేధావులు ఆకర్షించబడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పరిస్ధితి అదికాదు. బతక లేక బడి పంతుళ్ళు అన్న పరిస్ధితి ఉండడంతో కోట్లాది బాలల ప్రతిభ చిత్తు కాగితాల కోసం వెతుకుతూ, పొట్టనింపు కోవడమే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ పరిస్ధితి తొలగించడంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప ప్రవేటు పాఠశాలలది కాదు.

5 thoughts on “ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

  1. నాకు తెలిసిన ఒకాయన పల్లెటూరిలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నడిపాడు. పేద విద్యార్థుల దగ్గర ఫీజ్ తక్కువే తీసుకునేవాడు. కానీ టీచర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు సరిపోలేదు. బాగా చదువుకున్నవాళ్ళైతే ఏ ప్రభుత్వ ఉద్యోగానికో వెళ్ళిపోతారు కానీ పల్లెటూర్లలో ఉద్యోగాలు చెయ్యడానికి ముందుకి రారు. దాంతో ఆ స్కూల్ నిర్వాహకుడు పల్లె ప్రజలకి ఇంగ్లిష్ విద్య అందించలేకపోయాడు.

  2. For an average working middle class couple with two kids in India. They together make around 80000 rupees a month, get taxed at 30% at source, have to pay rent (real estate is already exorbitant), bills, food, deal with inflation, corruption and above all invest in their kids education, their kids whom they love dearly hoping for their future.This Act will hit them the worst. Schools just WON’T pay for the 25%.
    That couple and many more like them will have to pay it for the school.

    Isn’t it state sanctioned extortion? And besides high fees, their kids will get unqualified teachers since schools will cut costs every single way. Aren’t we being grossly unfair to them? Can we blame them if they’re angry with RTE?

    RTE will also create a whole network of corruption, seats will be auctioned to the highest bidder. You’re saying that the state needs to create a free education system so great that everyone will go there. If that were really the case, if our state were so efficient, India won’t be India. Everything that the state has put its hand into, has been run into the ground.

    From, Nehru to Indira to Manmohan, every socialist scheme, though “well intentioned” has achieved exactly the opposite. Is there any evidence to the contrary? The poor will always have to go to schools which are specifically for them and their needs. To achieve that, there needs to be private investment in education, less taxes, more free market. Creating a monstrous and corrupt state machinery kills that.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s