అమెరికా పొగరు: మరోసారి షారుఖ్ నిర్బంధం


SRK at yale universityఅమెరికా తన పొగరు మరోసారి లోకానికి చాటుకుంది. రెండేళ్లలో రెండవ సారి షారుఖ్ ఖాన్ ను రెండు గంటలపాటు డిటెన్షన్ లోకి తీసుకుని ప్రశ్నించింది. షారుఖ్ ని పిలిచిన యేల్ యూనివర్సిటీ విద్యార్ధులు చెప్పాక, తమ కంప్యూటర్లు ఆయన పేరును ‘ఫ్లాగ్’ చేయడం వల్ల పొరబాటు దొర్లిందని న్యూయార్క్ ఎయిర్ పోర్టు అధికారులు తీరిగ్గా ‘అపాలజీ’ చెప్పారు. ఇలాంటి పోరాబాట్లు పదే పదే చేసి ఆనక ‘ఆపాలజీ’ చెప్పడం అమెరికాకి యాంత్రిక అలవాటుగా మారిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఆగ్రహించాడు. భారత దేశం తరపున ఫిర్యాదు నమోదు చేయాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కృష్ణ ఆదేశించాడు.

యేల్ యూనివర్సిటీ విద్యార్ధులు ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ప్రముఖ బాలీవుడ్ హీరో పాత్రధారి షారుఖ్ ఖాన్ ను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ప్రవేటు విమానంలో షారుఖ్ ఖాన్ న్యూయార్క్ చేరుకున్నాడు. బైటికి వస్తుండగా ఎయిర్ పోర్టు అధికారులు షారుఖ్ ని తీసుకెళ్ళి నిర్బందించారు. యేల్ యూనివర్సిటీ విద్యార్ధులు చెప్పాక షారుఖ్ ని విడుదల చేశారని బి.బి.సి తెలపగా, భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకున్నాక మాత్రమే విడుదల చేశారని ‘ది హిందూ’ తెలిపింది. విడుదలకు ముందు రెండు గంటల పాటు షారుఖ్ ను అధికారులు ప్రశ్నించారాని కూడా ‘ది హిందూ’ తెలిపింది.

సంఘటన పట్ల భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడలా అమెరికా ‘యాంత్రికంగా అపాలజీ’ చెప్పి చేతులు దులుపుకుంటోదనీ, ఈసారి అలాంటి ‘సారీ’ లకి ఒప్పుకునేది లేదని ప్రకటించాడు. అమెరికాలోని ఉన్నత స్ధాయి అధికారులతో ఈ సంగతి మాట్లాడతామని తెలిపాడు. భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకున్నాక అమెరికా కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ‘ప్రోఫౌండ్ అపాలజీ’ చెబుతున్నట్లుగా లేఖ అందజేశారు. ఇది సరిపోదని, ఉన్నత స్ధాయిలో చర్చిస్తామని విదేశీ మంత్రి తెలిపాడు.

2010 లో ఇలాగే షారుఖ్ కాన్ ను విమానాశ్రయ అధికారులు రెండు గంటల పాటు నిర్బంధించారు. ‘తాను ముస్లింను’ అయినందునే నిర్బంధించారని అప్పట్లో షారుఖ్ నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో భారత దేశానికి చెందిన ప్రముఖలను కనీసం ఏడుగురిని ఇలా నిర్బందించారని బి.బి.సి గుర్తు చేసింది. భారత మహిళా రాయబారి, ఒక సిక్కు రాయబారి, మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. అబ్దుల్ కలాం నయితే భారత దేశంలోనే అమెరికా విమానాన్ని ఎక్కకముందు ఒళ్ళంతా తడిమి అవమానించారు. ఆయన చేత చెప్పులు విడిపించి తనిఖీ చేశారు. ఇది 2009 లో జరిగింది. డిసెంబర్ 2010 లో అమెరికాలో భారత్ రాయబారి మీరా శంకర్ ను క్యూలో నుండి పక్కకు పిలిచి మరీ తనిఖీ చేశారు. ఒంటి నిండా చీర కట్టుకోవడమే ఆమె నేరంగా వారికి కనపడింది. అప్పుడు కూడా ఒక యూనివర్సిటీ వారు మీరాను ఉపన్యాసం నిమిత్తం పిలిపించుకోగా ఈ ఘటన జరిగింది. మరోసారి ఒక సిక్కు రాయబారి చేత బలవంతంగా తలపాగా విప్పించి తనిఖీ చేశారు.

నిజానికి రాయబారులను ఇలా తనిఖీ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఎయిర్ పోర్టు తనిఖీలకు మాజీ ప్రభుత్వాధిపతులను  గురి చేయకూడదు. అయినప్పటికీ ముస్లిం పేర్లు, చీర కట్టు, తలపాగా లు అమెరికా పిరికి భయాలకు టార్గెట్లుగా మారాయి.

షారుఖ్ తనిఖీ వ్యవహారాన్ని అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్.ఎం.కృష్ణ, అమెరికాలోని భారత రాయబారి నిరూపమరావు ని ఆదేశించాడు. “అదే వ్యక్తికి పదే పదే అవమానం జరగడం, తర్వాత రాయబారులు జోక్యం చేసుకున్నాక యాంత్రికంగా అపాలజీ చెప్పడం… ఇలా సరిపోదు” అని భారత్ ఆవిదేశాంగ కార్యాలయం అధికారులు అన్నారు. కంపూటర్లు షారుఖ్ పేరును ఫ్లాగ్ చేయడం వల సీనియర్ అధికారుల ‘అప్రూవల్’ అవసరమైందని, అందుకే డీటెయిన్ చేశామనీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన లేఖలో ఉన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. అమెరికాలో అన్నీ ప్రాంతాల్లో ఉన్న హోమ్ లాండ్ సెక్యూరిటీ అధికారులు ఎప్పటికప్పుడు తమ డేటా బ్యాంక్ ను అప్ డేట్ చేసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా సలహా ఇచ్చాడు.

One thought on “అమెరికా పొగరు: మరోసారి షారుఖ్ నిర్బంధం

  1. నేనైతే దురహంకారం అని అనుకోవడం లేదు. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యారు. మనకి కూడా అంత ప్రోతెక్టేడ్ గ చట్టం ఉంటె మనం కూడా ఫాలో అవుతాం. దురదృష్టం ఏంటంటే మనం అలంటి చట్టాలు పెట్టె సాహాసం కలలో కూడా చేయం. . నిజంగా చెప్పాలంటే, వాళ్ళు వల్ల చట్టాల్ని ఫాలో అవుతున్నారు, అది ఎవరైనా సరే, మన దేశం లో గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ పరాయి దేశం లో వాళ్ళు కేవలం మాములు మనుషులు. రోజు వెళ్ళే మా ఆఫీసు లోనే అందరిని చెక్ చేస్తారు. ఇదేమి మమ్మల్ని అవమానించడానికి కాదు. రెండు వేల మంది పనిచేస్తున్నారు. అందులోఎవడు ఎలాంటివాడో ఎలా తెలుస్తుంది అది హిందువైన ముస్లిమైన వేరెవరైనా. నాకు నేను మంచివాడిని కావచ్చు. కానీ అది నా మొహం మీద రాసి ఉండదు కదా. మనం కూడా అలంటి చట్టం పెట్టుకుని అందరిని తనిఖీ చేస్తామని ఒక note display చేయోచ్చు. Arab countries కి వెళ్ళే ప్రతి ఒక్కరిని అందరు హెచ్చరిస్తారు. అక్కడ drugs లాంటివి మన దగ్గర దొరికితే మరణ శిక్ష తప్పదని, దానికి ఎవరు సహాయం చేయలేరని.
    మనం అవతలి దేశాల చట్టాల్ని గౌరవ్హించాలి. కేవలం ముస్లిం అని చెప్పిdetain చేసారని అనుకోవడం లేదు. వల్ల దగ్గర కొంతమంది నేరస్తుల list ఉంది. దాని ప్రకారం వాళ్ళు అనుమానించారు. ఆ నేరస్తులలో హిందూ ఉండచ్చు ముస్లిమ్స్ ఉండచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండచ్చు. కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తారు రోజు అమెరికా నుండి వేరే దేశాలకి. అలాగే వేరే దేశాలు నుండి అమెరికా కి.
    అంత మంది లో ఎవడు మంచివాడు, ఎవడు దొంగో ఎలా తెలుస్తుంది. ఈ రోజుల్లో sympathy కోసం మతం పేరు, కులం పేరు వాడుకోవడం common అయిపోయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s