శ్రీకాంత్, ఇది మీకే


pointing-finger-cross-hatchశ్రీ, మీరూ ఒకరేనని రామ్మోహన్ గారు భావించారు. కాదని మీరంటున్నారు. ఈ విషయంలో నేను లేను గనక ఆ విషయంపై నేను రాయడం భావ్యం కాదు.

‘తోటి బ్లాగర్లను గౌరవించండి’ అని కోరడం ‘విరుచుకుపడం’ గా మీరు చెప్పడం సరికాదేమో ఒకసారి ఆలోచించండి. కాదు ‘విరుచుకుపడడమే’ అంటారా, మీ యిష్టం.

స్ట్రాస్ కాన్ సోషలిస్టు అని ఎలా భావిస్తున్నారు అని సవాలు చేస్తూ అడిగినట్లు నాకు గుర్తు లేదు. ఆయన సోషలిస్టు కాదు గనక, కాదు సోషలిస్టే అని మీరంటున్నారు గనక, మీరలా అనడానికి కారణం తెలుసుకుందామని అడిగాను. ఒక వ్యక్తి, అందునా ఫ్రాన్సు అధ్యక్ష పదవికి పోటీ పడతాడని భావించిన వ్యక్తి, సోషలిస్టు అని చెప్పాలంటే కొన్నయినా కారణాలు చూపాలి. మీరు కొన్ని కారణాలు చెప్పారు. ఆ విషయం మరో పోస్టులో చరిస్తాను.

పెట్టుబడిదారీ విధానమే స్ట్రాస్ కాన్ చేసిన వాటికి ఎలా కారణమో వివరిస్తానని నేను గతంలో చెప్పాను. దాన్ని మర్చిపోలేదు. సోషలిజం గురించీ, కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించీ మీకు తెలిసిందేమిటో చెబుతారని నేను ఇన్నాళ్లూ చూశాను. అవి తెలిస్తే మీరు స్ట్రాస్ కాన్ ని సోషలిస్టుగా ఎందుకు భావిస్తున్నారో నాకు కొంత అవగాహన కలుగుతుంది. కానీ మీరింతవరకూ ‘సోషలిజం’ ఫలానా చెబుతుంది అని రాసినవేవీ సోషలిజం గురించి చెప్పేవి కావు. అక్కడక్కడా కొన్ని కలిసినట్లు తోచినా అవన్నీ డిస్టార్టెడ్  అభిప్రాయాలు మాత్రమే. అవి కాక కాంక్రీట్ గా మీకు తెలిసినవి ఏమన్నా చెబుతారేమోనని చూశాను. నేనేమన్నా మిస్ అయ్యానేమో తెలియదు.

మీరు తాజాగా స్ట్రాస్ కాన్ విషయమై గానీ, సోషలిజం/కమ్యూనిజం సిద్ధాంతాలపై గానీ రాసిన అంశాలేవీ మీకు సోషలిస్టు/కమ్యూనిస్టు సిద్ధాంతాలు తెలుసు అని నేను భావించే గలిగేలాగా లేవు. బహుశా మీకు తెలిసింది ఇంతవరకేననీ, ఇంతకు తప్ప మరేమీ తెలియదనీ భావిస్తూ ఈ సమాధానం మొదలెట్టాను. మీకు ఇంకా ఏమైనా తెల్సి ఉంటే ముందు ముందు రాస్తారేమో.

మీ నుంచి సోషలిజం గురించిన కాంక్రీట్ అంశాలు (మీకు తెలిసినవి) వస్తే  స్ట్రాస్ కాన్ విషయమై నేరుగా మిమ్మల్నే సంబోధిస్తూ రాసేవాడిని. అవేవీ రాలేదు గనక మిమ్మల్ని సంబోధిస్తూ రాయలేదు. కానీ స్ట్రాస్ కాన్ ప్రవర్తనకీ, ఆయన నాయకత్వం వహిస్తున్న ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ’ కీ ఉన్న సంబంధం గురించి ‘స్ట్రాస్ కాన్’ పై రాసిన పోస్టులోనే వివరించాను. కాకపోతే మిమ్మల్ని ఉద్దేశించలేదంతే.

స్ట్రాస్ కాన్ ‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ పైన నేను రాసిన పోస్టులో నేనేమీ రాశాను? ఐ.ఏం.ఎఫ్ గురించి మొదట వివరించాను. అది మూడవ ప్రపంచ దేశాలపైనా, బలహీన దేశాలపైనా అమలు చేసే విధానాలను వివరించాను. ప్రపంచ వనరులను పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద కంపెనీలకు వశం చేయడానికీ, ప్రపంచాన్ని ఆ కంపెనీలకు మార్కెట్ గా మార్చడానికీ పని చేస్తుందని రాశాను. అప్పుల పేరుతో షరతులు విధించి బలహీన దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పశ్చిమ దేశాల కంపెనీలకు వనరులు సరఫరా చేసే దేశాలుగా, మార్కెట్లుగా మార్చుతున్నదని వివరించాను. ఈ విధానాలు వివిధ దేశాల్లో ప్రజలను పేదవారుగా, నిరుద్యోగులుగా, దరిద్రులుగా, చీప్ ధరలకు పని చేసే వేతన కార్మికులుగా మారుస్తున్నదని రాశాను. అటువంటి దుర్మార్గ సంస్ధకు స్ట్రాస్ కాన్ ఎం.డి గా నియమించబడ్డాడని సూచించాను.

ఐ.ఎం.ఎఫ్ షరతుల వల్ల బలహీన దేశాలలో జరుగుతున్న పరిణామాలు వివరించాను. భూములు, వనరులు విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీల పరం అవుతున్నాయని రాశాను. ఈ నేపధ్యంలో ప్రజల జీవనం ఛిద్రం అవుతున్నదని రాశాను. సమాజంలో అవకాశాలు లేక యువత నిర్వీర్యం అవుతున్న పరిస్ధితి రాశాను. ఆడవారి పరిస్ధితి రాశాను. సమాజం యొక్క నైతిక పతనం గురించి రాశాను. స్త్రీలు వ్యభిచార కొంపల్లోకి చేరుతున్న పరిస్ధితి వివరించాను. ఈ పరిస్ధితికి పశ్చిమ దేశాల్లో పెట్టుబడిదారీ కంపెనీల కోసం ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు విధించిన స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక విధానాల ఫలితమేనని వివరించాను.

పెట్టుబడిదారీ కంపెనీల ప్రయోజనాల కోసం ఐ.ఎం.ఎఫ్ లాంటి సంస్ధల ద్వారా వివిధ దేశాల్లో అమలవుతున్న ఆర్ధిక విధానాల వల్ల అక్కడి సామాజిక వ్యవస్ధలు నాశనం అవుతున్నపుడు ఆ సామాజిక వ్యవస్ధల్లో జరిగే పరిణామాలకు పెట్టుబడిదారీ వ్యవస్ధ కాకుండా ఎలా పోతుంది? వ్యక్తుల మధ్యా, వారి మధ్య జరిగే సంఘటనల మధ్యా ఉండే పరస్పర సంబంధాలు చూడడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు?

ప్రపంచ బ్యాంకు విధించిన షరతుల వల్ల హైద్రాబాద్ లో రిపబ్లిక్ ఫోర్జ్, ఆల్విన్ తదితర కంపెనీలని చంద్రబాబు కాలంలో మూసేశారు. దానితో అక్కడి కార్మికులు వీధిన పడ్డారు. వారిలో చాలామందికి ప్రవేటు ఉద్యోగాలు కూడా దొరకలేదు. అప్పటివరకూ నెలా నెలా వచ్చిన స్ధిరమైన ఆదాయం కంపెనీల మూతతో ఆగిపోయింది. పిల్లల చదువులు మూలాన పడ్డాయి. ఆడ పిల్లలకి మంచి సంబంధాలు తేలేకపోయారు. ఈ పరిస్ధితుల్లో కొన్ని కుటుంబాల యువకులు నిరుద్యోగులుగా మిగిలారు. కొంతమంది నిరుద్యోగులు వీధి గూండాలుగా సంఘ వ్యతిరేకుల చేతుల్లోకి పోయారు. పెళ్ళిళ్ళకు నోచుకోని ఆడపిల్లలు ప్రేమ పేరుతో మోసపోయి వ్యభిచార రొంపిలో చేరిపోయారు. కొన్ని కుటుంబాల్లో వైద్యం చేయించలేక ముసలి తల్లిదండ్రులని  కాపాడుకోలేకపోయారు. పసి పిల్లలకి పోషకాహారం అందించలేకపోయారు.

కంపెనీలు మూయకపోతే నెల నెలా జీతాలు కొనసాగేవి. పిల్లల చదువులు ఆగేవి కావు. వేతనాలు చూపి అప్పు తెచ్చుకునైనా పిల్లలకి ఉన్నత చదువులు చదివించేవారు. అన్నయ్య చదువుకుని కొంత బెటర్ ఉద్యోగం సంపాదించి చెల్లి పెళ్ళికి సాయపడి ఉండేవాడు. తల్లిదండ్రులకి ఉన్నంతలో ప్రభుత్వ సబ్సిడీల ద్వారా వైద్యం చేయించి మరి కొంతకాలం బతికించుకునేవారు. చదువు పూర్తయిన కొడుకు వీధి గూండాగా మారే బదులు ఉద్యోగ ప్రయత్నం చేసి ఉండేవాడు. మరి ప్రపంచ బ్యాంకు రుద్దిన విధానం వల్ల కంపెనీ మూతపడి, ఆదాయం ఆగిపోయి, విపరిణామాలు సంభవిస్తే వాటికి ప్రపంచ బ్యాంకు రుద్దిన విధానం కారణం కాదా? ప్రపంచ బ్యాంకు రుద్దిన విధానం పశ్చిమ దేశాల కంపెనీల కోసమే అయినపుడు ఆ కంపెనీలు ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగుల వెతలకు కారణం కాదా? ఆ కంపెనీలు పెట్టుబడిదారీ కంపెనీలు కాదా?

ఈ లింకులో స్ట్రాస్ కాన్ స్ధానం ఎక్కడ? ప్రపంచ బ్యాంకు లేదా ఐ.ఎం.ఎఫ్ విధానాల రూపకర్త స్ధానం ఆయనది. ఆ విధానాల ఫలితాలు తెలియకుండానే స్ట్రాస్ కాన్ ప్రపంచ దేశాలపైనా షరతులుగా అమలు చేశాడా? తెలిసే చేశాడు. ఆ సంగతి ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లే వివిధ నివేదికల్లో తెలియజేశాయి. తమ విధానాల వల్ల ఇంక్లూజీవ్ గ్రోత్ జరగడం లేదనీ, దరిద్రం పెరుగుతోందనీ, హక్కులు హరించబడుతున్నాయనీ అవి రిపోర్టులు ప్రచురించాయి. అయితే, ఆ కారణం వల్ల తమ విధానాలు మార్చుకోవడానికి ఆవేప్పుడూ సిద్ధపడలేదు. ఎందుకంటే వాటికి బాధ్యత లేదు. అడిగేవారు లేరు. సమాధానం చెప్పవలసిన అగత్యం లేదు.

పెట్టుబడిదారీ కంపెనీల కోసం నిర్దేశించబడుతున్న ఐ.ఎం.ఎఫ్ విధానాల వల్ల దరిద్రం పెరుగుతున్నా, ఆకలి పెరుగుతున్నా, సమాజాలు పతనం అవుతున్నా, సంబంధం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఎందుకు చూడలేకపోతున్నారు? పరస్పర సంబంధం దాక్కుని లేదు. చక్కగా బహిరంగంగానే ఉంది. అయినా చూడడానికి ఏమిటి సమస్య? కనపడిందని చెబితే పెట్టుబడిదారీ వ్యవస్ధకీ సమస్యలకీ సంబంధం లేదన్న మీ వాదనని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది గనక చూడడానికి నిరాకరిస్తున్నారా? మీ వాదనను సమర్ధించుకోవడానికి వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తే మీకిక ఎన్ని దృష్టాంతాలు చూపించినా వ్యర్ధమే కదా.

పోనీ పెట్టుబడిదారీ వ్యవస్ధని పక్కన బెడదాం. ఏ వ్యవస్ధలోనైనా జరిగే ఘటనలకు ఆ వ్యవస్ధకి సంబంధం ఉంటుందనైనా అంగీకరిస్తారా? ఉదాహరణకి బానిస వ్యవస్ధలో యజమానులు బానిసలను పీడించుకు తింటారు. ఏ బానిసని తీసుకున్నా వాడి దుస్ధితికి అతని యజమానే కారణం. బానిస యజమానులు తమ బానిసల దుస్ధితికి కారణం గనుక బానిస వ్యవస్ధ బానిసల దుస్ధితికి కారణం అని అంటాము. ఇది కూడా ట్విస్టేడ్ లాజిక్కేనా?

భూస్వామ్య వ్యవస్ధలో రైతులు అర్ధ బానిసలని సోషియాలజీ వివరిస్తుంది. రైతుల వద్ద కొద్ది పాటి భూమి ఉన్నా అందులో శ్రమ చేసుకుని సంపాదించే పూర్తి స్వేచ్ఛ అతనికి ఉండదు. అతని శ్రమలో ఎక్కువ కాలం భూస్వామి పొలాల్లో ఉచితంగా పని చేయాల్సి ఉండేది. అందువల్ల అర్ధ బానిస అని వ్యవహరించారు. భూస్వామ్య వ్యవస్ధలో రైతుల దుస్ధితికి భూస్వామ్య వ్యవస్ధ కారణం అని కూడా సోషియాలజీ చెబుతుంది. ఇది కూడా ట్విస్టేడ్ లాజిక్కేనా?

వ్యక్తుల ఆర్ధిక స్ధితిగతుల వల్ల వారి సామాజిక సమస్యలు రూపుదిద్దుకుంటాయి అని చెబితే అదీ ట్విస్టేడ్ లాజిక్కేనా?

పెట్టుబడిదారీ వ్యవస్ధలో నైనా, ఏ వ్యవస్ధలోనైనా ఆయా వ్యక్తుల విడి విడి సమస్యలన్నీ వారి వారి ఆర్ధిక పరిస్ధుతులే కారణంగా ఉంటాయి.  వ్యక్తుల సమూహమే వ్యవస్ధ కనుక వ్యక్తుల సమస్యలకు వ్యవస్ధ కారణమని చెబుతాము. ఇందులో ట్విస్టెడ్ లాజిక్కు ఏమిటి? ఇక్కడ లాజిక్కేమీ అవసరం లేదు. సంబంధం చక్కగా నేరుగా కనపడుతోంది. నేరు గా కనపడుతున్న సమస్యని గుర్తించడానికి మీకున్న సమస్య ఏమిటి?

పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో సమస్యలకు పెట్టుబడిదారీ వ్యవస్ధ కారణం అని చెబితే దానర్ధం పెట్టుబడి కార్యకలాపాలు దానికి కారణమని చెప్పడమే. పెట్టుబడి కార్యకలాపాలకి మద్ధతుగానే పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రభుత్వాలు విధానాలు అమలు చేస్తున్నాయి. నూతన ఆర్ధిక విధానాలు అందులో ప్రముఖమైనవి. బడ్జెట్ కేటాయింపులు కూడా ఆ విధానాలకి అనుగుణంగానే ఉంటాయి. ఉన్నాయి. బడ్జెట్ లో ప్రధాన కేటాయింపులు కంపెనీలు లాభాలతో వర్ధిల్లడానికి అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టండి మీకు పూర్తి స్వేచ్చా ఇస్తాం అని చెబుతారు. పన్నులు రద్దు చేస్తాం అంటారు. టాక్స్ హాలిడే ఇస్తారు. ‘లేబర్ ఫ్లెక్సిబిలిటీ’ పేరుతో కార్మిక చట్టాలు రద్దు చేస్తారు. ఉన్న చట్టాలని అమలు చేయరు. కార్మిక సంఘాలని అణచివేస్తారు.

తమ సమస్యలు చెప్పడానికి కార్మికులకి ఉన్న ఒకే ఒక ఆయుధం సమ్మె. సమ్మె హక్కు భారత దేశంలో ఇపుడు నామ మాత్రం. అమెరికా యూరప్ లలో పెట్టుబడి లాభాలకి ప్రమాదం కానంతవరకే సమ్మెలను అనుమతిస్తారు. ప్రమాదం వస్తే నిషేధిస్తారు. నిర్బంధం ప్రయోగిస్తారు. జైళ్ళలో కుక్కుతారు. దానికి రక రకాల సాకులు చూపుతారు. వీటి వల్ల కార్మికులకి ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. ఆర్ధిక సమస్యలు సామాజిక సమస్యలకి దారి తీస్తాయి. పెట్టుబడిదారుల కోసం అమలు చేస్తున్న విధానాల వల్ల కార్మికులకి ఏర్పడుతున్న సామాజిక సమస్యలకి సంబంధం ఇంత చక్కగా కనపడుతుంటే ఎందుకు చూడరు?

పెట్టుబడిదారీ కంపెనీలకి అనుకూలంగా విధానాలని నిర్దేశిస్తున్న ఐ.ఏం.ఎఫ్ కి స్ట్రాస్ కాన్ ఎం.డి. అంటే ఆ సంస్ధ విధానాల వల్ల సమస్యలు వస్తున్న సంగతి ఆయనకి తెలుసు. కానీ ఆయన చలించడు. ఎందుకని? ఆ సమస్యలకి బాధ్యతని గుర్తించే నైతిక స్ధాయి అతనికి ఉండదు గనుక.

——–

స్ట్రాస్ కాన్ సోషలిస్టు ఎందుకు కాడో మరో పోస్టులో చర్చిస్తాను.

12 thoughts on “శ్రీకాంత్, ఇది మీకే

 1. కానీ మీరింతవరకూ ‘సోషలిజం’ ఫలానా చెబుతుంది అని రాసినవేవీ సోషలిజం గురించి చెప్పేవి కావు.

  అలానే మీరు పెట్టూబ్డి దారి విధానం గురించి చెప్పినవి కూడా. అవేవీ పెట్టుబడి దారి విధానం చెప్పదు. అది కేవలం స్వార్థ పూరితమైన మనుషులు తమకనుగునంగా ఒక వ్యవస్తని వాడుకుంటున్నారు (వాటిని ఆవ్యవస్తలోని లోపాలు అనికూడా అనలేం). అలాంటప్పుడు మీరు స్ట్రాస్ కాన్ చేసిన దాన్ని పెట్టుబడి విధానానికి ఆపాదించడమే తప్పు.

 2. మీ నుంచి సోషలిజం గురించిన కాంక్రీట్ అంశాలు (మీకు తెలిసినవి) వస్తే స్ట్రాస్ కాన్ విషయమై నేరుగా మిమ్మల్నే సంబోధిస్తూ రాసేవాడిని. అవేవీ రాలేదు గనక మిమ్మల్ని సంబోధిస్తూ రాయలేదు.

  నేను కూడా మిమ్మల్ని ఉద్దేశించి రాయలేదండీ. కేవలం మీ పోస్టులో స్ట్రాస్ కాన్ అనే వ్యక్తిని సోషలిస్టు అంటుంటేనూ.. అది నిజం కాదు అని చెబుతూ జెనరల్ గానే రాశాను.

 3. శ్రీకాంత్, నేనీ చర్చను అకడమిక్ గా ఉపయోగపడవచ్చని మొదలు పెట్టాను. మీరిలా ముక్కలుగా విడదీసి స్పందించే బదులు ఆర్టికల్ మొత్తానికి స్పందిస్తూ రాయండి. అలా చేస్తే చర్చించడానికి బాగుంటుంది.

 4. మనిషికీ, సమాజానికీ మధ్య ఉన్న సంబంధం గురించి పెట్టుబడిదారీ విధానం చెప్పదు. అందుకే పెట్టుబడిదారులు అసమాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. పెట్టుబడిదారులలో కూడా ఒక్కొక్కరి వాదనలు ఒక్కోలాగ ఉంటాయి. ఒక పెట్టుబడిదారుడు ఇలా అంటాడు “డబ్బున్నవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కార్మికులందరూ మంచివాళ్ళు కాదు. డాక్టర్లలో కూడా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, కార్మికులలో కూడా తాగి పెళ్ళాలని కొట్టేవాళ్ళు ఉన్నారు” అని. ఇంకో పెట్టుబడిదారుడు సామాజిక స్వేచ్ఛ కంటే వ్యక్తి స్వేచ్ఛే గొప్పదనీ, వ్యక్తి స్వేచ్ఛ ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందనీ అంటాడు. వ్యక్తి స్వేచ్ఛే గొప్పది అనుకునేవాడు సామాజిక ప్రయోజనాలని పట్టించుకోడు అనేది కళ్ళకి కనిపిస్తున్న నిజం.

 5. మనిషి వేరు వ్యెవస్తా వేరు కాదు వ్యెవస్తలొ భాగమే మనిషి స్వార్దము , దురాశా, పీడన, ఇవన్నీ వ్యెవస్తను పట్టె వుంటాయి వ్యెవస్తకు అతీతంగా సున్యంలొనుంచి పుట్టుకురావు. పునాదిని పట్టె ఉపరితల అంశాలు ఆ దారపడివుంటాయి .మంచి,చెడు ,కేవలం మనచుచేసే గారడిగా భావిస్తున్నారు. అంటె సమాజ పరిస్తితులు వాటిమీద వుండవని సమాజంలొ ఏవిషయాన్ని తీసుకున్నా దానికి పునాదే కారణం. ఉదా…………. అధికారన్ని తీసుకుందాం రాజ్యాంగ యంత్రం వుందికదా. ఆ రాజ్యాంగ యంత్రం వల్ల మనిషికి అధికారం వస్తుంది ఆ అధికారం వల్ల ఆర్దిక స్తితిగతులు మారిపొతాయి ,హొదావస్తుంది,పలుకుబడి వస్తుంది . ఇవన్ని వస్తాయి కాబట్టి దానికొసం హత్యలు ,ఆత్మహత్యలూ,జరుగుతయి. వీటన్నిటికి కారణమైన రాజ్యాంగ యంత్రాన్ని వదిలిపెట్టి ,ఈహత్యలు స్వార్దం వల్ల జరిగాయా,లేదా మరొ దానికొసం జరిగాయా, వాటిల్లొ మంచి చెడులు వెతకడం అర్దరహితం దానికి గల పునాదిని పట్టుకొకుండా పైపైనే చుడం వల్ల ఉపయొగం వుండదు .అందుకే మార్క్స్ ఒక సందర్బంలొ అంటాడు చారిత్రకంగా మనముందుంచిన పలితాలతొ మనం చరిత్రను చుడం ప్రారంబిస్తాం.(రాజ్యాంగ యంత్రం కుడా ఉపరితల అంశమే .దాన్ని కేవలం ఉదాహరణకు మాత్రమే తీసుకున్నా)

 6. శ్రీ వేరు, శ్రీకాంత్ వేరు. అతన్ని ఆడిపోసుకోకండి. నేను శ్రీ ని. మీ బ్లాగు శ్రీకాంత్ గారి బ్లాగు కూడా చదివాను. అతని బ్లాగులో అతను ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు, మీ బ్లాగులో మీరు మీ ఉద్దేశాలను అన్నింటికీ రుద్దేస్తున్నారు. అందుకే మీ పధ్ధతి మంచిది కాదు అని (నా అభిప్రాయంగా) రాసాను.

  ఇక మీ రాయ్జాంగ యంత్ర ఉదాహరణ. అన్ని రాజకీయ హత్యలకీ కారణం రాజ్యాంగ యంత్రం అని కదా నిర్ణయించేసారు మీరు? అయితే దానికి పరిష్కారం ఏం చెయ్యాలంటారు? ఒక రాజకీయ హత్య జరిగితే, కారణం రాజకీయ యంత్రాంగానికి అంటగట్టేసి అతన్ని వదిలేద్దామంటారా? అవును మరి, ముఖ్య కారణం యంత్రాంగం అని కదా మీరు సెలవిచ్చారు?

 7. శ్రీకాంత్, మీరు వేరు,వేరు అని అప్పుడే చెప్పక పొయారా? ఇకపొతె నాకంటూ ఒక బ్లాగంటూ లేదు అతను రాసినదానిపైన స్వంధించానంతె .. ఇక్కడ చర్చ హత్య చెసిన వాడికి శిక్ష పడాలా,లేదా అనేది కాదు. సమాజాని అనుగుణంగానే వ్యెక్తులు నడుచుకుంటారని అన్నాను.సారాంశాన్ని వదిలి ముక్కలు ముక్కలుగా అర్దం చెసుకుంటె దానికి యవరేమీచెయలేరు. ఒకరి భావాల్ని ఒకరు అంటగట్టటమంటూ వుండదు. నా అభిప్రాయాలు నేను చెప్పెను మీ అభిప్రాయాలు మీరు చెప్పెరు ఇందులొ అంటకట్టడమంటూ ఏమీ వుడదు.

 8. పద్దతుల గురించి మీరు చెప్పదలిచారా!!! ఇకొరి బ్లాగులొ మీకు మల్లె బుతులురాసే భాపతనుకున్నావా? శెఖర్ గారి బ్లాగులొ మీకామెంట్ దానికి శెఖర్ గారు ఇచ్చిన సమాదానం అందురూ చుశారు. మీరేంటొ అందరికీ తెలుసు .ముందు మీరు సక్రమంగా వుండండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s