ఇంటర్నెట్ సంస్ధలు, సాఫ్ట్ వేర్ డవలపర్లు ఉచితంగా ‘అప్లికేషన్లు’ ఆఫర్ చేస్తూ వినియోగదారుల ప్రైవసీ ని తీవ్రంగా కొల్లగొడుతున్నాయి. వారిలో గూగుల్ అగ్ర స్ధానంలో ఉంది. వినియోగదారుల సమాచారాన్ని రహస్యంగా, అనుమతి లేకుండా దొంగిలించి నిలవ చేస్తున్నందుకు గూగుల్ పైన అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల పార్లమెంటులు గూగుల్ దుర్మార్గాలను తీవ్ర స్ధాయిలో ఖండించాయి. యూరోప్ లో చాలా ప్రభుత్వాలు గూగుల్ వ్యాపార పద్ధతులపైనా, మోసాలపైనా విచారణ చేస్తున్నాయి. గూగుల్ అనేక సర్వీసులని ‘ఉచితం’ గా అందిస్తూ వినియోగదారులను ఆకర్షించి బుట్టలో వేసుకోవడంలో ఆరి తేరింది. ప్రైవసీ పాలసీలో జిమ్మిక్కులు చేసి వినియోగదారులను మోసం చేయడంలో దిట్ట.
–
ఇంకా ఈ ఆప్….
మీ వెబ్ సెర్చ్ లనీ, కొనుగోళ్లనీ, మార్కెటీర్లకి అందుబాటులో ఉంచుతుంది….
మీ వ్యక్తిగత సమాచారం దాదాపు అందరికీ తెలిసేలా చేస్తుంది….
మీ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లు, మీరెక్కడ ఉన్నదీ వివరాలన్నీ భద్రతా సంస్ధలకి ఇచ్చేస్తుంది, వారంటీ లేకుండా….
ఇది పూర్తిగా ఉచితం!
–