సెక్స్ వ్యాపారంలో వాల్ స్ట్రీట్ కంపెనీ ‘గోల్డ్ మేన్’ పెట్టుబడులు


goldman-sachs-sex-traffickingగోల్డ్ మేన్ సాచ్ అమెరికాలో అతి పెద్ద వాల్ స్ట్రీట్ కంపెనీ. పేరు మోసిన ఆన్ లైన్ సెక్స్ పత్రికలో ఈ కంపెనీకి పెట్టుబడులున్నాయని ‘న్యూయార్క్స్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. తన క్లయింట్లను తానే మోసం చేస్తున్నదంటూ గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ యూరప్ విభాగం ఉపాధ్యక్షుడు కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశాడు. అది మరుపులోకి జారకముందే అమ్మాయిలతో వ్యాపారం చేసే కంపెనీలో సైతం ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి కావడం అమెరికా ప్రజలని నివ్వెర పరిచింది. బేక్ పేజ్ పేరుతో నడుస్తున్న ఆన్ లైన్ పత్రికని నిర్వహించే ‘విలేజ్ వాయిస్ మీడియా’ కంపెనీ పెట్టుబడుల ద్వారా గత పదేళ్ళుగా గోల్డ్ మేన్ సాచ్ సొమ్ము చేసుకుంటున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గుట్టు రట్టు చేసింది. స్ట్రాస్ కాన్ లాంటి వ్యభిచారిని, రేపిస్టునీ నాగరికతా ప్రపంచానికి ప్రసాదించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ ‘ఫ్లెష్ ట్రేడ్’ ని కూడా వదలని అతి పెద్ద వాల్ స్ట్రీట్ కంపెనీని కూడా సగర్వంగా ప్రపంచం ముందుంచింది.

గుట్టు బైట పడ్డాక గోల్డ్ మేన్ సాచ్ ‘విలేజ్ వాయిస్ మీడియా’ కంపెనీ నుండి తన వాటాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం డీల్ కుదిరినట్లు చెప్పింది. మీడియా కంపెనీ వ్యాపారం పట్ల అసౌకర్యం కలగడం వల్ల 2010 నుండే వాటాల ఉపసంహరణకి ప్రయత్నిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ‘ఆండ్రియా రాఫెల్’ రాయిటర్స్ కి తెలిపింది. రెండేళ్ల క్రితమే సెక్స్ వ్యాపారం గురించి తెలిసినా తన వాటా అలాగే కొనసాగించిందని ఆండ్రియా ప్రకటన స్పష్టం చేస్తోంది. రెండేళ్లుగా వాటాల ఉపసంహరణ కోసం ప్రయత్నిస్తున్నన్నా ఇన్నాళ్ళు ఆ పని చేయలేకపోయింది. మరి రెండు రోజుల్లోనే వాటాల ఉపసంహరణ ఎలా సాధ్యం అయిందో కంపెనీ చెప్పలేదు. సమాధానం స్పష్టమే. అతి వేగంగా పెరుగుతూ పోతున్న ‘సెక్స్ వ్యాపార లాభాలను’ ఆ కంపెనీ వదులుకోలేకపోయింది. గోల్డ్ మేన్ సాచ్ తో పాటు ఇంకా అనేక వాల్ స్ట్రీట్ కంపెనీలకి బేక్ పేజ్ లో వఆటాలున్నాయని టైమ్స్ పత్రిక విలేఖరి కృస్టాఫ్ బైటపెట్టాడు. న్యూయార్క్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ త్రైమారన్, ఆల్టా కమ్యూనికేషన్స్, బ్రేన్ వుడ్ పార్టనర్స్ మొదలయిన కంపెనీలకు బేక్ పేజ్ లో వాటాలున్నాయి. మొత్తం డజను కంపెనీలు బేక్ పేజ్ వెబ్ సైట్ కి యజమానులని క్రిస్టాఫ్ తెలిపాడు.

Goldman-Sachs-towerక్లాసిఫైడ్ ప్రకటనల సలహా కంపెనీ ‘ఎ.ఐ.ఎం గ్రూపు’ ప్రకారం ఆన్ లైన్ లో జరిగే వ్యభిచార ప్రకటనల ఆదాయంలో 80 శాతం ‘బేక్ పేజ్ డాట్ కామ్’ వెబ్ సైట్ ద్వారానే సమకూరుతోంది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 3.1 మిలియన్ డాలర్ల ఆదాయం బేక్ పేజ్ ద్వారా సమకూరింది. ఇంటర్నెట్ వినియోగదారులకు అంతర్జాతీయ స్ధాయిలో సేవలను అందిస్తున్నట్లు ఈ వెబ్ సైట్ చెప్పుకుంటుంది. మొదట పని కోసం, అపార్టుమెంట్ల కోసం ఇంకా ఇతర సేవల కోసం ఇది పని చేసేదట. ఆ తర్వాత ఆన్ లైన్ ఎస్కార్ట్ సర్వీసులను కూడా ఇది చేపట్టింది. ఎస్కార్ట్ సర్వీసులంటే అమ్మాయిలను సరఫరా చేయడమే. వ్యబిచారులను సరఫరా చేస్తామంటే గౌరవంగా ఉండదు గనక ‘ఎస్కార్ట్ అమ్మాయిలని’ కంపెనీలు పేరు పెట్టుకున్నాయి.

ఎస్కార్ట్ సర్వీసులు ఇటీవల కాలంలో భారత దేశంలోని మెట్రో నగరాల్లో కూడా వ్యాపించాయి. ఎప్పటినుండో వ్యభిచారం ఉన్నదే అయినప్పటికీ ఆ రంగంలోకి పెట్టుబడిదారీ కంపెనీలు ప్రవేశించాక ‘సభ్య సమాజం’ తిరస్కరించిన పదజాలాన్ని వదిలేసి కొత్త పదజాలాన్ని వినియోగిస్తున్నాయి. పెట్టుబడిదారులకి ‘వ్యభిచారం’ అన్న పేరు పైనే అభ్యంతరం తప్ప ‘సిగ్గు లేకుండా వ్యభిచారం వ్యాపారాన్ని సొమ్ము చేసుకోవడానికి’ ఏమీ అభ్యంతరం ఉండదు. మాఫియా గ్రూపులు, దిగజారిన రాజకీయ నాయకులు, సంఘ వ్యతిరేక శక్తులు మాత్రమే చేసే ‘వ్యభిచార వ్యాపారం’ పెట్టుబడిదారీ కంపెనీల చేతుల్లో ‘ఎస్కార్ట్ సర్వీసులు’ గా ‘అభివృద్ధి’ సాధించిందన్నమాట. పెట్టుబడిదారీ కంపెనీలు సమాజానికి ప్రసాదించే అభివృద్ధి ఇలానే తగలడుతుంది.

బేక్ పేజ్ లోని ప్రతి పేజీలోనూ పురుషులనీ, స్త్రీలనూ తార్చుతూ ప్రకటనలు నిండి ఉంటాయని రష్యా టైమ్స్ తెలిపింది. అద్దెకు ‘స్ట్రిప్ షో’ లుGoldman pimping ప్రదర్శించే సేవలు కూడా ఈ సైట్ అందిస్తుందట. 12 సంవత్సరాల లోపు ఆడ పిల్లల (పసి పిల్లలు అనడం కరెక్టు) చేత కూడా వ్యభిచారం చేయించే చట్ట వ్యతిరేక కంపెనీల ప్రకటనలను కూడా ఈ సైట్ అందించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ పసి ఆడ పిల్లలను ప్రధానంగా ఆసియా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాల నుండి మాఫియా గ్రూపులు బలవంతంగా రవాణా చేస్తాయి. ‘చైల్డ్ సెక్స్’ విస్తృతం అవుతోందని ఐక్యరాజ్య సమితి కూడా ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేసింది. నైతికంగా అత్యంత నీచ స్ధాయికి దిగజారిన వారు మాత్రమే పసి పిల్లలను లైంగిక వాంఛలకు వినియోగించగలరు. అలాంటి నీచులకి సేవలు అందించే పెట్టుబడిదారీ వ్యాపారులు ఇంకెంత కటిక నీచులై ఉండాలి? తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. తీవ్ర  అసహ్యం కలుగుతోంది.

బేక్ పేజ్ వెబ్ సైట్ గురించి న్యూయార్క్ రాష్ట్రంలోని బ్రూక్లీన్ జిల్లా అటార్నీ చార్ల్స్ హైన్స్ ఇలా అన్నాడు. “బ్రూక్లీన్ జిల్లా అటార్నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క సెక్స్ ట్రాఫికింగ్ కేసులోనూ అమ్మాయిలు బేక్ పేజ్ పాత్ర గురించి చెప్పారు.”  రాయిటర్స్ పత్రిక హైన్స్ ని ఉటంకిస్తూ ఈ సంగతి చెప్పింది.

నికోలస్ కృస్టాఫ్ అనే ‘టైమ్స్’ పత్రిక విలేఖరి ఈ గోల్డ్ మేన్ సాచ్ భాగోతం మొదట బైట పెట్టాడు. 2000 సంవత్సరంలోనే ‘విలేజ్ వాయిస్’ పత్రికలో గోల్డ్ మేన్ సాచ్ పెట్టుబడులు ప్రారంభం అయ్యాయని ఈయన తెలిపాడు. ఆరేళ్ళ తర్వాత ఈ పత్రిక ‘న్యూ టైమ్స్ ఇంక్’ మీడియా గ్రూపులో విలీనం అయిందట. ఆ విలీనంలోనే మీడియా కంపెనీలో గోల్డ్ మేన్ సాచ్ మైనారిటీ షేర్ హోల్డర్ గా అవతరించింది. ఆ విధంగా గోల్డ్ మేన్ పర్యవేక్షణలోనే మీడియా కంపెనీ ‘అతి పెద్ద ఆన్ లైన్ సెక్స్ ప్రకటనదారుగా’ అభివృద్ధి చెందింది. నికోలస్ కృస్టాఫ్ పరిశోధన ప్రారంభించాక గోల్డ్ మేన్ సాచ్ జాగ్రత్త పడింది. గత శుక్రవారానికల్లా (మార్చి 30) ‘విలేజ్ వాయిస్ మీడియా’ కంపెనీలో తన వాటా 16 శాతం వదులుకుంటున్నట్లు గోల్డ్ మేన్ సాచ్ ప్రకటించింది. తద్వారా 30 మిలియన్ డాలర్లు వదులుకుంటున్నట్లు ప్రకటించింది.

గోల్డ్ మేన్ సాచ్ బ్యాంక్ గ్లోబల్ వ్యాపారంతో పోల్చితే 30 మిలియన్ డాలర్లు పెద్ద మొత్తం కాదు. కానీ భవిష్యత్తులో అది పెట్టే గుడ్లపైనే అది కేంద్రీకరించింది. సెక్స్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టిన కంపెనీ ఆ వ్యాపారంలో లాభాలు పెంచుకోవడానికి తప్పనిసరిగా కృషి చేస్తుంది. అంటే మరింత మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతుంది. మరింత మంది పసి పిల్లలని పేద దేశాలనుండి అక్రమంగా రవాణా చేయిస్తుంది. మరిన్ని కుటుంబాలనుండి ఆడ పిల్లలని దూరం చేస్తుంది. తన వ్యాపారాభివృద్దికి అనువుగా సమాజం మరింతగా పతనం కావడానికి కృషి చేస్తుంది. వ్యాపారాల కోసం అమ్మాయిలని తార్చడం మరింత గౌరవనీయమైన వ్యాపారంగా మలచడానికి ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తెచ్చి అందుకు అనుకూలమైన చట్టాలు చేయిస్తుంది.

అమెరికా, యూరప్ దేశాల్లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడానికి కారణం ఈ సందర్భంగా స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు ప్రవేశించాక వారు ఎంత అనైతిక వ్యాపారాన్నయినా చట్టబద్ధం చేయించగలుగుతారు. తాము దిగజారి ‘సమాజం కోసమే తామూ’ అని చెప్పుకోవడానికి సమాజాన్ని, ప్రభుత్వాలనీ కూడా దిగజారుస్తారు. అమ్మాయిల చేత, పసి పిల్లల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ మాఫియా గ్రూపులు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడం చూశాక పెట్టుబడి అక్కడికి కూడా పరుగులు పెట్టింది. మాఫియా లాంటి చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తులు చేసే వ్యాపారాల్ని ప్రభుత్వాలు నిషేధిస్తాయి కనుక వ్యభిచారాన్ని కూడా పెట్టుబడిదారులు చట్టబద్ధం చేయించారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడకుండా తాము చట్ట వ్యతిరేకులుగా ముద్ర పడకుండా ఉండడం సరైన పద్ధతి. దానికి బదులు అనైతిక వ్యాపారాలని, దుర్మార్గమైన వ్యాపారాలనే చట్టబద్ధం చేయడం ద్వారా చట్టాల నుండి పెట్టుబడిదారులు రక్షణ పొందుతున్నారు. దారిద్ర రేఖని కిందికి జరిపి దరిద్రుల సంఖ్యని తగ్గించిన మన ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు ‘మాంటెక్ అహ్లూవాలియా’ లాగా అన్నమాట!

పెట్టుబడికి లాభాలు వస్తున్నపుడు తాను ఎక్కడ ఉన్నదీ దానికి అనవసరం. అధిక లాభాలు వస్తున్నపుడు ఇంకా అనవసరం. యంత్రాలు కొని ఉత్పత్తులు తీసి అమ్ముకుని లాభాలు పొందటం దూర ప్రయాణంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అలా కాక తక్కువ సమయంలో లాభాలు సంపాదించడం కూడా పెట్టుబడికి అవసరంగా ముందుకొచ్చింది. ఆర్ధిక సంక్షోభాల మధ్య కాలం తగ్గిపోతున్న కొద్దీ లాభాలకి దగ్గరి మార్గాలని పెట్టుబడిదారులు వెతుకుతున్నారు. ఆ అవసరానికి తగ్గట్లు ద్రవ్య కార్యకలాపాలని అవి విస్తృతం చేశాయి. ద్రవ్య మార్కెట్లు కాక తక్కువ సమయంలో అధిక లాభాలు సంపాదించి పెట్టేవి అనైతిక వ్యాపారాలే. వ్యభిచారం, తాగుడు, జూదం, మాదక ద్రవ్యాలు అలాంటివే. ఈ రంగంలో అనేక కొత్త కొత్త తరహా దిగజారుడు వ్యాపారాలు పెట్టుబడిదారులు కనిపెడుతున్నారు. కొన్నిసార్లు ఊహించలేనివి కూడా.

ఉదాహరణకి ఫస్ట్ పోస్ట్ పత్రిక ఇటీవల ఒక వార్త ప్రచురించింది. మెట్రో నగరాల్లో పబ్బుల దగ్గర అమ్మాయి తోడు లేనివారికి అమ్మాయిలు సరఫరా చేసే వ్యాపారాలు మంచి ఊపులో సాగుతున్నాయని ఆ పత్రిక తెలిపింది. అమ్మాయి తోడు ఉంటే తప్ప కొన్ని పబ్బులు (అన్నీ పబ్బూలూ అలాగేనేమో తెలియదు) లోనికి అనుమతించవట. అలాంటివారిని గమనించి అప్పటికప్పుడు అమ్మాయిలు నేనున్నానంటూ ముందుకొస్తారట. దీన్ని కూడా ‘ఎస్కార్టు సేవ’ అనే అంటున్నారు. ఆ సేవ డాన్స్ తో ఆగిపోదట. ఇంటిదాకా, లాడ్జిల దాకా ఆ తోడు కొనసాగుతుందని పత్రిక తెలిపింది. ఇక్కడ పైకి పబ్బులు, డ్యాన్స్, తోడు ఇలా కనిపిస్తున్నప్పటికీ అసలు జరిగేది వ్యభిచారమే. కుర్ర వెధవలను వ్యభిచారం వైపుకి ఆకర్శించడానికి కంపెనీలు కనిపెట్టిన మార్గమే ఇక్కడ గమనించాలి. అంటే మామూలుగా కోరిక పుట్టి వ్యభిచారుల దగ్గరికి వెళ్ళడం కాకుండా డ్యాన్స్ తోడు లేకపోయినా, పబ్బులో ప్రవేశం దొరక్కపోయినా తిన్నగా వ్యభిచారం దగ్గర తేలుతారన్నమాట.

ఈ లెక్కన టీనేజి ప్రారంభ దశలో ఉన్నవారి దగ్గర్నుండి సంసారుల దాకా అందరికీ వ్యభిచారాన్ని అలవాటు చేస్తున్నారు. కుర్రతనం కొద్దీ పబ్బుల్లో డ్యాన్స్ చేద్దామని వెళ్ళినవారికి వ్యభిచారం పరిచయం అవుతోంది. అది కూడా నేరంగా కాక ఒక సహజ కార్యక్రమంగా అలవాటవుతోంది. అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేద్దామన్న సహజ మైన అలవాటుగా వ్యభిచారం మారిపోతోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభ దశలో ఉత్పత్తి పెంచడానికి గొప్ప సృజనాత్మకత చూపింది. అదే సృజనాత్మకత ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట వినాశకరంగా మారిపోయింది. ఈ సృజనాత్మకతలో పడి దేశాలకు దేశాలే యుద్ధాల పాలపడి నాశనం అవుతున్నాయి. సమాజాలకు సమాజాలే అనైతిక వ్యాపారాల్లో చిక్కుకుని దిగజారుతున్నాయి. కుటుంబాలకి కుటుంబాలే వినిమయ సంస్కృతిలో పడి విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ వినాశనానికి ప్రజలు తప్పనిసరిగా పరిష్కారం వెతుక్కోవాల్సిందే.

24 thoughts on “సెక్స్ వ్యాపారంలో వాల్ స్ట్రీట్ కంపెనీ ‘గోల్డ్ మేన్’ పెట్టుబడులు

 1. మరి అదే పెట్టుబడిదారీ వ్యవస్థ కు చెందిన కంపెనీలు కార్లు, విమానాలు, సెల్ ఫోనులు, అత్యవసరమైన మందులు, అతి క్లిష్టమైన కట్టడాలు ఇలా ఎన్నింటినో అందిస్తోంది. దానిగురించి రాయరేం? నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక కత్తితో ఆపిల్ పండు కొయ్యొచ్చు, పీక కూడా కొయ్యొచ్చు. మీరు తిడుతున్న కంపెనీ చేసిన పని రెండో రకం.. అది కంపెనీ తప్పుగాని పెట్టుబడిదారీ వ్యవస్థ తప్పు కాదు. పోనీ కమ్యూనిస్టులు ఎన్నో రైలు మార్గాలు, టెలిఫోన్ మార్గాలు తెంచేసారు. దానికి కారణం వారా లేక పెట్టుబడి విధానమా? ఎవరిది తప్పు? అసలు అది తప్పే కాదంటారా?

 2. ఎంతసేపటికి కత్తీ-పీటా సొదే తప్ప నేను రాసిన విషయం అర్ధం చేసుకోరా? కనీసం ఆ ప్రయత్నమన్నా చేస్తున్నారా?

  కంపెనీలు, కార్లు, విమానాలు, సెల్ ఫోన్లు….. ఇవన్నీ ఏమో పెట్టుబడిదారీ వ్యవస్ధ అందించేవా? అందులో మనుషులు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రకారం ప్రవర్తించరా?

  ఈ సరుకులు ఒక్క పెట్టుబడిదారీ వ్యవస్ధ మాత్రమే కనిపెట్టాయని భావిస్తున్నారా? సోషలిస్టు రష్యా, చైనా ల్లో కూడా ఈ వస్తువులున్నాయి కదా? వాటినెవరు తయారు చేసినట్లు? ఇప్పుడంటే అక్కడ సోషలిష్టు వ్యవస్ధలు లేవు గానీ, స్టాలిన్, మావో లు ఉన్నంతవరకూ అక్కడ ఉన్నవి సోషలిస్టు వ్యవస్ధలే. అప్పుడు కూడా రైళ్ళు, బస్సులు, ఇంకా అనేక వస్తువులు అభివృద్ధి అయ్యాయి. మీరు రాసినవి మామాలు వస్తువులు. చైనా, రష్యా సోషలిస్టు వ్యవస్ధల్లో ఆ కాలానికి అమెరికా, యూరప్ ల కంటె గొప్ప వస్తువులు తయారు చేసి వినియోగించుకున్నారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడయినా ప్రయత్నించారా?

  పెట్టుబడిదారీ వ్యవస్ధలో వస్తువులు కనిపెట్టే అవకాశం ఒక్క సైంటిస్టులకి, ల్యాబొరేటరీలకీ వీరికే అవకాశాలు ఉంటాయి. సోషలిస్టు వ్యవస్ధలో ప్రతి ఒక్కరికీ అలాంటి అవకాశాలు ఉంటాయి. రష్యా లో సోషలిజం అమల్లో ఉన్నపుడు కార్మికులు స్వయంగా అనేక యంత్ర పరికరాలు కనిపెట్టారు. stakhanovite movement అని టైప్ చేసి గూగుల్ చేసి చూడండి. మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. పెట్టుబడులతో ప్రమేయం లేకుండా, కంపెనీలకి మేనేజర్లు, అధికారులు లేకుండానే కేవలం కార్మికుల నిర్వహణలో పెద్ద పెద్ద పరిశ్రమలే నడిచాయి. కార్మికులు కొత్త కొత్త పరికరాలు కనిపెట్టి ఉత్పత్తి అనేక రెట్లు పెరిగేలా దోహద పడ్డారు. మేనేజర్లు, ఎం.డిలు, బోర్డు రూంలు, స్టాక్ ఎక్ఛేంజిలు ఇవేవీ లేకుండానే రష్యా చైనాలు దశాబ్దాలు పాటు కంపెనీలు నడిపాయి. కేవలం సోషలిస్టు ప్రభుత్వ దిశా నిర్దేశం తప్ప వీళ్లెవరూ లేకుండా అమెరికా, యూరప్ లకు పోటీగా ఉత్పత్తులు తీసారక్కడ.

  అమెరికాకి అగ్ర రాజ్యం కావడానికి బానిసలు కావాల్సి వచ్చింది. ఆఫ్రికా నుండి మనుషుల్ని రవాణా చేసి బానిసలుగా చేసుకుని వారి శ్రమకేవీ విలువ చెల్లించకుండా ఆ డబ్బుని పోగేసుకుని పెట్టుబడిగా మలుచుకుంది. రష్యా సోషలిస్టు వ్యవస్ధ ఇవేవీ చెయ్యలేదు. కేవలం కార్మికులపైనా, వారి ఉత్పాదక శక్తి, మేధో సంపత్తి పైనే ఆధారపడి సోషలిస్టు విప్లవం సంభవించిన పాతికేళ్లలోనే అగ్ర రాజ్యంగా అభివృద్ధి అయింది. ఈవెన్ యూరప్ లో కూడా పారిశ్రామిక విప్లవం, ప్రజాస్వామిక విప్లవాలు సంభవించిన శతాబ్దాల తర్వాత మాత్రమే అభివృద్ధి అయ్యాయి. అది కూడా దేశాలపై బడి దోచుకుని దొంగ సొత్తుతో అభివృద్ధి చెందిన వ్యవస్ధలుగా మారాయి తప్ప మరొక విధంగా కాదు. సోషలిస్టు రష్యా చైనాలు ఎన్నడూ దేశాలని ఆక్రమించలేదు. కేవలం సొంత వనరులపై ఆధారపడే, సొంత కార్మికులపై ఆధారపడి మాత్రమే అగ్రరాజ్యాలుగా అభివృద్ధి చెందాయి.

  చైనా ఇప్పుడు సాధిస్తున్న ఆర్ధికాభివృద్ధి అంతా మావో కాలంలో జరిగిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం పుణ్యమే. సోషలిస్టు నిర్మాణంలో భూములు, పరిశ్రమలు అన్నీ సమాజం పరం చేసి అన్ని సౌకర్యాలూ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. అందువల్ల ప్రతి ఒక్కరి ఆర్ధిక స్ధాయి గణనీయంగా అభివృద్ధి సాధించింది. అలా అభివృద్ధి సాధించిన ఆర్ధిక స్ధాయి వల్లనే కొనుగోలు శక్తి పెరిగి సరుకులు అమ్ముడోబోయి కంపెనీలకి లాభాలు వస్తున్నాయి. ఊరికే వస్తువులు తయారు చేసి పడేస్తేనే లాభాలు రావు. దానికి తగ్గా కొనుగోలు శక్తి, జీవన స్ధాయి జనానికి ఉండాలి. అవి ఉంటెనే సరుకులు అమ్ముడుపోయేది. లేకుంటె పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో ప్రతి దశాబ్దానికీ వచ్చే (ఇప్పుడీ టైం తగ్గిపోయింది) సంక్షోభాలే వస్తాయి. చైనా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం వల్ల కొనుగోలు శక్తి పెరిగి సరుకులు అమ్ముడుపోవడానికి తగిన మార్కెట్ అనుకూల పరిస్ధితులు ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ పరిస్ధితి క్రమంగా తగ్గిపోతోంది డెబ్భైల చివరికే సోషలిస్టు నిర్మాణం ఆగిపోవడం వల్ల అప్పటి నుండీ చైనీయుల ఆర్ధిక స్ధాయి పడిపోతూ వస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంపదల కేంద్రీకరణని పెంచుతుంది అందువల్ల ఆకలి, నిరుద్యోగం, దరిద్రం లాంటి సమస్యలు చైనాలో పెరుగుతున్నాయి. ఇది వేరే చర్చ.

  రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా లేకుంటే జర్మనీ జైత్ర యాత్ర ఆగేది కాదు. జర్మనీని తామే ఓడించామని అమెరికా, ఇంగ్లండ్ లు చెప్పుకుంటాయి. కాని అది వాస్తవం కాదు. అమెరికా ఎప్పుడో చివర్లో యుద్ధానికి దిగింది కనుక అది జర్మనీని ఓడించే సమస్యే తలెత్తలేదు. బ్రిటన్, ఫ్రాన్సు లు అప్పటికే వణికిపోతున్నాయి. జర్మనీ రష్యా మీదికి వచ్చాకనే దాని పతనం మొదలయింది. జర్మనీని రష్యా చావు దెబ్బతీసాక మాత్రమే అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఓడిపోయిన జపాన్ మీద బాంబులేసి మిలియన్ల మంది జనాన్ని చంపేసింది. అణు బాంబు తయారు చేసినట్లు అమెరికా ప్రకటించిన కొద్ది నెలలకే రష్యా తయారు చేసుకుంది. మొట్టమొదట స్పేస్ లో నడిచింది రష్యన్లే. అమెరికా, యూరప్ ల దేశాధ్యక్షులు, ప్రధానులూ ఎవరూ యుద్ధాల్లో పాల్గొనలెదు. కాని స్టాలిన్ స్వయంగా యుద్ధరంగంలో పాల్గొన్నాడు. జర్మనీ దాడుల నుండి పరిశ్రమలని కాపాడుకోవడానికి వాటన్నింటినీ కొద్ది నెలల వ్యవధిలోనె తూర్పు ప్రాంతాలకి తరలించేశారని మీకు తెలుసా? అదంతా కార్మిక జనం పూనుకుంటేనే జరిగింది. పెట్టుబడిదారుల వల్ల కాదు. పెట్టుబడిదారులు అసలు సోషలిస్టు వ్యవస్ధలో ఉండరు.

  సోషలిస్టు వ్యవస్ధలో జరిగిన అద్భుతాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే నేను ఉదహరించాను. ఆర్ధిక పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాక సామాజిక రంగంలోగానీ, కళల రంగం లోగానీ కూడా బహుముఖాలుగా అక్కడి సోషలిస్టు వ్యవస్ధలు అభివృద్ధి సాధించాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రజల్ని మాడ్చి, నిరుద్యోగుల్ని చేసి, దరిద్రులుగా మార్చి అతి తక్కువ వేతనాలకి పని చేసేలా మార్చుకుని ఆ స్ధితినుండి లాభాలు పెంచుకుంటాయి. సోషలిస్టు వ్యవస్ధ ప్రజల ఆర్ధిక, సామాజిక స్ధితిగతులు పెంచి అభివృద్ధి చేసి, ప్రజల అభివృద్ధిపై ఆధారపడి మాత్రమే అబివృద్ధి సాధిస్తాయి. ఆ విధానమే ప్రజల్ని స్ధితిమంతులుగా చేస్తుంది.

  ముందు మీరు కత్తీ, పీక వదిలి పెట్టి నేను రాసింది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కత్తి, పీక గురించి కూడా రాసా గదా? కనీసం అదయినా మళ్ళొకసారి చదివి అర్ధం చేసుకోవడానికి ట్రై చెయ్యండి. ఆర్టికల్ లోనే నేను చెప్పిన అంశానికి సమర్ధనగా వివరణ ఇచ్చాను. దాన్ని అర్ధం చేసుకున్నారా? అసలా అంశాన్నే చదివినట్లు నాకనిపించడం లేదు. కేవలం ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ’ గురించి రాసిన ఆ రెండు వాక్యాలే చదివి వ్యాఖ్యానిస్తే ఇక మిగిలింది ఎందుకు రాసినట్లు. మీకు నచ్చని ఒకే ఒక్క వ్యాక్యాన్ని బైటికి తీసి వ్యాఖ్యానిస్తే ఇలాగే ఉంటుంది. కత్తి, పీక లాజిక్కు గొప్ప లాజిక్కన్న భావన నుండి ముందు మీరు బైటికి రండి. విషయాన్ని నిష్పాక్షికంగా రెండు వైపుల నుండీ పరిశీలించడానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే నిజాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. సోషలిజం గురించి అసలేమీ అవగాహన లేకుండానే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ప్రయోజన లేదు.

  ఇప్పుడు పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలకీ, కంపెనీ యజమానులకీ, సి.ఇ.ఒ లకే పెట్టుబడిదారీ వ్యవస్ధలపై మీలాంటి వారు వ్యక్తం చేస్తున్న కాన్ఫిడెన్స్ లేదు. వరుసగా ముంచెత్తుతున్న సంక్షోభాలకి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అనేకమంది పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు కేపిటల్ చదివి సంక్షోభాలకి కారణాలు తెలుసుకుంటున్నారు. నోబెల్ గెలుచుకున్న జోసెఫ్ స్టిగ్లిట్ద్, క్రుగర్ లాంటి ఆర్ధిక వేత్తలే కమ్యూనిస్టు అవగాహనతో కూడిన వివరణలు ఇస్తే తప్ప పెట్టుబదిదారీ సంక్షోభాలకి అర్ధాలు చెప్పలేకపోతున్నారు. పరిష్కారం కూడా అనివార్యంగా సోషలిస్టు టెర్మినాలజీ తో తప్ప ఇవ్వలేకపోతున్నారు.

  సంక్షోభాలని సహజంగా చెప్పి తప్పించుకోవడమే తప్ప వాటికి పరిష్కారాలని చెప్పే పనికి పెట్టుబదిదారీ ఆర్ధికవేత్తలు పూనుకోరు. మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించండి. పెట్టుబదిదారీ వ్యవస్ధల్ళో సంక్షోభాలు ఎందుకు వస్తాయి? దరిద్రం, ఆకలి, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? ఆర్ధిక అంతరాలు ఎందుకు పెరుగుతున్నాయి? సంపదలు కొద్ది మంది దగ్గరే ఎందుకు పోగుపడుతున్నాయి? యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? టెర్రరిజం ఎందుకు పెరుగుతోంది? ప్రజలంతా సుఖ శాంతులతో బతికే పరిస్ధీతి పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో ఉంటుందా? ఈ ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానాలు వెతకండి. పెట్టుబడిదారీ ఆర్దికవేత్తలే వీటికి సమాధానాలు ఇవ్వలేదు. వాళ్ళు సమస్యలనే ఏకంగా రేషనలైజ్ చేస్తారు తప్ప పరిష్కారాలు చూపరు.

  ‘దమ్ముంటే వీటికి సమాధానాలు చెప్పండి’ అని నేను మీకు సవాలు చెయ్యను. ఎందుకంటే సమాధానాలు లేవు గనక. లేని సమాధానాలు చెప్పమని సవాలు చేసి సమాధానాలు చెప్పలేని మీ పరిస్ధితిని చూసి కాలరెగరేసే కుసంస్కారం కాదు నాది. నేను మిమ్మల్ని కోరేది విషయాలు సమగ్రంగా తెలుసుకోమని. కొన్ని సంగతులైనా మీరు చెప్పగలిగే మీతో చర్చించడానికి పరస్పరం విషయాలు ఇచ్చి పుచ్చుకోవడానికీ అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా గుడ్డి అభిమానంతోనో, గుడ్ది ద్వేషంతోనో బూతులకి, దూషణలకీ దిగితే బైటపడేది మీ సంస్కారరాహిత్యమే. సంస్కార రాహిత్యం ఆరోగ్యకరం కాదు.

  మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను రాసిన అంశాల్లో మీకు లోపంగా కనిపించినదాన్ని ప్రస్తావిస్తూ వాదనకి దిగడం కరెక్టు కాదు. నేను రాసిన అంశాల్ని పూర్తిగా చదవండి. ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొండి. నేను ప్రస్తావించిన వివిధ అంశాల మధ్య పరస్పర సంబంధాల్ని గుర్తించండి. ఒక సమగ్ర దృక్పధాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మనం ఎంత చర్చించుకున్నా అది అర్ధవంతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

  (మీరు మళ్ళీ ప్రస్తావించకుండా ఉండడం కోసం ఇది రాస్తున్నా. టెలిఫోన్ లైన్లు తెంచడం, పట్టాలు తవ్వడం సోషలిస్టు వ్యవస్ధలు చేసేవి కావు. విప్లవాలు ఉఛ్ఛస్ధాయిలో ఉన్నపుడు శతృవుని బలహీనపరచడానికి వేసే ఎత్తుగడల్లో భాగం అవి. భారత దేశంలో ప్రస్తుతం విప్లవాలేవీ ఎగసి పడడం లేదు. కనుక టెలిఫోన్లు తెంచాల్సిన అవసరం లేదు. పట్టాలు తెంచాల్సిన అవసరం లేదు. అవి కొంతమంది తెలియక చేస్తున్న పనులు. వాటిని ఇప్పటి పరిస్ధితుల్లో సమర్ధించలేము. బెంగాల్ లో నందిగ్రాం లో సలీం కంపెనీ కోసం ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి (సో కాల్డ్) వామ పక్ష ప్రభుత్వం ప్రయత్నించింది. జనం ఒప్పుకోలెదు. పోలీసుల్ని దించి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. జనం తిరగబడ్దారు. అప్పుడు జనానికీ, పోలీసులు వారి వెనక ఉన్న ప్రభుత్వానికి కొన్ని నెలల పాటు యుద్ధం లాంటిది నడిచింది. పోలీసులు మందలు మందలుగా గ్రామాలపైన పడి జనాన్ని లాక్కెళ్ళి చిత్రహింసలు పెట్టారు. సి.పి.ఎం కార్యకర్తలు కూడా తుపాకులు చేత పట్టి జనంపై నిర్బంధానికి దిగారు. అలాంటి పరిస్ధితుల్లో జనానికి తమని తాము కాపాడుకోవలసిన తక్షణ అవసరం ముందుకొచ్చింది. సి.పి.ఎం గూండాలు, పోలీసులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవలసి వచ్చింది. అప్పుడు వేరేదారి లెక జనమే చెట్టు నరికి రోడ్లకి అడ్డంగా వేశారు. జనమే రోడ్లని తవ్వేశి గూండాలు, పొలీసు గూండాలు గ్రామాలపైన దండయాత్ర చెయ్యకుండా అడ్డుకున్నారు. అటువంటి పరిస్ధితిల్లో రోడ్లు తవ్వడం, చెట్లు నరకడం అనివార్యం. అది జరక్కపోతే జనం చావాల్సిన పరిస్ధితీ, పోలీసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించాల్సిన పరిస్ధితి వస్తుంది. కనుక ఆ చర్యలు సమర్ధనీయం. అవేమీ లేకుండా పేలుళ్లు, నరుకుళ్ళు, చంపుడు చెయ్యడం కరెక్టు కాదు. అలా చెయ్యమని ఏ కమ్యూనిస్టు సిద్ధాంతమూ చెప్పలేదు. ఏం చేసినా ప్రజలే అవసరంగా ఫీలయ్యి చెయ్యాలి తప్ప వారి తరపున కమ్యూనిస్టు కార్యకర్తలు అన్ని చెయ్యడం అసలే కరెక్టు కాదు.

  పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో విప్లవాల కోసం జనం పాల్పడే చర్యల్ని సోషలిస్టు వ్యవస్ధకి అవసరమైన చర్యలుగా మీరు భావించడం కరెక్టు కాదు. సోషలిస్టు వ్యవస్ధల్లో జనానికి ఆ అవసరం రాదు)

 3. వస్తువుని మనిషి కనిపెడతాడు కానీ పెట్టుబడి కనిపెట్టదు. వాస్కో డా గామా ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టిన తరువాత యూరోప్ నుంచి ఇండియాకి వ్యాపారం పెరిగి వస్తు ఉత్పత్తికి డిమాండ్ పెరిగింది. వందల మందిని ఒకే చోటుకి చేర్చి ఫాక్టరీలు పెట్టి వస్తువులు ఉత్పత్తి చెయ్యడం అప్పుడు మొదలయ్యింది. అప్పట్లో చేతి యంత్రాలతో పని చేసేవాళ్ళు, తరువాత ఆవిరి యంత్రాలు వచ్చాయి, ఇప్పుడు విద్యుత్ యంత్రాలతో పని చేస్తున్నారు. అదే తేడా. ఉత్తర అమెరికాలో బ్రిటన్ దేశస్తులూ, దక్షిణ అమెరికాలో స్పానిష్, పోర్టుగీస్ దేశస్తులూ స్థిరపడిన కొత్తలో అక్కడ చెరుకు తోటలలో పని చెయ్యడానికి స్థానిక ఆటవిక జాతులవాళ్ళనీ, ఆఫ్రికా నుంచి బలవంతంగా తీసుకొచ్చిన నల్లజాతి వాళ్ళనీ బానిసలుగా వాడుకునేవాళ్ళు. రమ్ ఉత్పత్తికి చెరుకు అవసరం కనుక రమ్ వ్యాపారానికి డిమాండ్ పెరిగినప్పుడు బానిసలకి కూడా డిమాండ్ పెరిగి ఆఫ్రికా నుంచి కొత్త బానిసలని తెచ్చి అమెరికాలోని సంతలలో పశువులని అమ్మినట్టు అమ్మేవాళ్ళు. వ్యవసాయ క్షేత్రాలలోనే కాకుండా గనులలో కూడా బానిసల చేత పనులు చెయ్యించుకునేవాళ్ళు. రోడ్స్ అనే వజ్రాల వ్యాపారి జింబాబ్వేలో వజ్రాల నిల్వలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అతను జింబాబ్వే ప్రజలని బానిసలుగా చేసుకుని, వజ్రాలు తవ్వించి, వాటిని అక్కడే సానబెట్టించి, సానబెట్టిన వజ్రాలని విదేశాలకి ఎగుమతి చేసేవాడు. ఆ రోడ్స్ పేరు మీదే జింబాబ్వేకి రొడీసియా అనే పేరు వచ్చింది.

  1750 తరువాత లండన్, బ్రిస్టల్ పట్టణాలలో నిర్మించిన బట్టల మిల్లులలో బ్రిటిష్‌వాళ్లు వాడినది ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న పత్తే. వాళ్ళు బట్టలకి రంగులు వెయ్యడానికి ఉపయోగించిన నీలి మందు కూడా ఇండియాలో పెరిగిన ఇండిగోఫెరా పువ్వుల నుంచి తీసినదే. 1850లో సైంటిస్ట్‌లు సింథెటిక్ రంగులు కనిపెట్టేంత వరకు బ్రిటిష్‌వాళ్ళు ఇండియా నుంచి దిగుమతి చేసిన నీలి మందునే ఉపయోగించేవాళ్ళు. అలాగే 1948 వరకు బ్రిటిష్‌వాళ్ళు ఇండియా నుంచి దిగుమతి చేసిన పత్తినే బట్టల మిల్లులలో వాడేవాళ్ళు. ఇండియా ప్రజల రక్తం తాగకపోతే లండన్ ప్రపంచంలోని అతి పెద్ద నగరం అయ్యేది కాదు.

 4. 12 ఏళ్ళ ఆడపిల్లలు పెద్దవాళ్ళు కాకపోవచ్చును గానీ పసిపిల్లలు మాత్రం కారు. ఆ వయసుమీద ఇంకో రెండేళ్ళు పోతే వారు గర్భధారణ కూడా చేయగలరు.

 5. అతను( పై కామెంట్ శ్రీకాంత్ గారిదే అనుకుంటా) వ్యవస్ధకూ, సమస్యలకూ, సంబంధం లేకుండా విడి విడిగా వుంటాయని భావిస్తాడు. వ్యవస్తకూ, సమస్యలకూ,వున్న సంభందాన్ని ఏమాత్రం అర్దం చేసుకొడు. పైకి కనిపించేది విడి విడిగానే కనిపిస్తాయి కాని వాటన్నిటికీ, పునాది ఒకటే. అతని దృష్టిలొ అవన్నీ కర్మ ఫలాలు. చెసుకున్నవాడికి చేసుకున్నంత. ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తి ఇతను. బానిస, ప్యుడల్, పెట్టుబడిదరీ సమాజాలలొ ఈ మూడింటిలొ దేన్ని తీసుకున్నా దాని చారిత్రక ఘటనల ఫలితంగా ఎర్పడిన సమాజాలే. సమాజానికి సంబందం లేకుండా ఏఒక్క సమస్యా వుండదు. సమస్యలు శూన్యంలొనుంచి పుట్టుకు రావు. భానిస సమాజంలొ బానిసత్వమే పునాదిగా ఎర్పడి సమాజం. ఆ సమాజంలొ బానిసను చంపె హక్కు యజమానికి వుంటుంది అందులొ ఎవరు చనిపొతారు ఎవరు బతుకుతారు అనేది యాదృచ్చికం. అది విడి సంఘటన. కాని పునాది మటుకు బానిస సమాజమే . అలాగే నిరుద్వొగం అనేది పెట్టుబడిదారీ సమాజ లక్షణం అందులొ యవరికి ఉద్వొగం వుంటుందొ ఎవరికి వుండదొ అనేది యాద్రుచ్చికం ఇలాగే ఏసమస్యను తీసుకున్నా దాని పునాది దానికి వుటుంది.

 6. సర్ఫిజెన్ గారూ, పన్నెండేళ్లవాళ్లను పసివాళ్ళు అన్నాననా మీ అభ్యంతరం!!! వయసునే రిఫరెన్సు గా తీసుకుంటె మీరన్నట్లు ఖచ్చితంగా పసివారు కాకపోవచ్చు. ఆర్టికల్ ని రిఫరెన్స్ గా తీసుకుని చూడండి. ఆ వయసు వాళ్ళు కామంతో, కోరికలతో చూడదగ్గవాళ్లా? రజస్వల కావడం అన్నది ఆడపిల్లకి ప్రకృతి సహజ లక్షణం. రజస్వల అయ్యాక గర్భదారణ చేయగల స్ధితిలో ఉంటే ఇక పెద్ద వాళ్ళు అయినట్లేనా? కామంతో చూడబడడానికి అర్హులేనని చెప్పదలిచారా? సెక్స్ ట్రాఫికింగ్ కి అర్హులేనని చెప్పదలిచారా?

  ఆర్టికల్ లో చర్చించిన అంశాన్ని నేపధ్యంగా తీసుకున్నపుడు, సమాజం పన్నెండేళ్ల ఆడపిల్లలను చూడవలసిన నైతిక దృష్టిని, సంస్కారయుత పద్దతులను పరిగణలోకి తీసుకున్నపుడు ఆ వయసు ఆడపిల్లల్ని పసిపిల్లలుగా చూడాలన్నది నా ఉద్దేశ్యం. చర్చిస్తున్న అంశాన్ని వదిలి పెట్టి గర్భం దాల్చగల లక్షణాన్ని రిఫరెన్సుగా తీసుకుని పసివాళ్లు కాదు అనంటే మిమ్మల్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది.

 7. రామమోహన్ గారూ, నేను ఈ ఆర్టికల్ లో గానీ స్ట్రాస్ కాన్ పై రాసిన ఆర్టికల్ లో గానీ, టెన్త్ క్లాస్ పిల్లాడి హత్యలో గానీ ఆ ఘటనలకీ పెట్టుబడిదారీ సమాజ విలువలకీ సంబంధం ఎలా ఉందో వివరించాను. ఆ చర్చనంతా వదిలేసి ‘పెట్టుబడిదారీ వ్యవస్ధే దీనికి కారణం’ అన్న ఒక్క వ్యాక్యాన్నే పరిగణించి విమర్శ చేస్తే అది విమర్శ కాదు.

  మీరన్నట్లు సమాజంలోని సంఘటనలన్ని కార్య కారణ సంబంధాలు కలిగి ఉంటాయి. పరస్పరం సంబంధం కలిగి ఉండడమే కాక అన్నీ కలిసి ఒక వ్యవస్ధకి ప్రతిరూపంగా నిలుస్తాయి. అన్నీ కలిసి ఆర్ధిక సంబంధాలకు అనుగుణంగా వ్యక్తీకృతం అవుతుంటాయి. ఈ సంగతి అర్ధం కావాలంటె సామాజిక పరిశీలన అవసరం. ఒట్టి పరిశీలనే కాక సమగ్ర దృక్పధంతో కూడిన పరిశీలన అవసరం. సంఘటనలని విడి విడిగా చూడడమే కాక ఉమ్మడిగా కూడా చూడగల పరిశీలనను కలిగి ఉండాలి. అది లేనట్లయితే ప్రతి ఘటననీ విడి విడిగా చూస్తూ దేని కదే ప్రత్యేకంగా భావించడం జరుగుతుంది.

  చిత్రం ఏమిటంటె సోషలిస్టు వ్యవస్ధల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనకీ కారణం సొషలిజంగానే వీరు చెబుతారు. కాని పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో జరిగే వాటికి మాత్రం వ్యవస్ధ కాకుండా ఇంకేదో కారణంగా చెబుతున్నారు. సోషలిజం అంటే ఏమీ తెలియకుండానే గుడ్డిగా వ్యతిరేకించడం నుండే ఈ అసంబద్ధత వ్యక్తం అవుతోంది.

 8. స్కూల్ పిల్లలపై గురువుల అత్యాచారాల విషయంలో కూడా వాళ్ళు ఇలాగే మాట్లాడారు. మనిషి ప్రాథమికంగా జంతువే కనుక గురువు శిష్యురాలిపై అత్యాచారం చెయ్యడం విచిత్రం కాదని అన్నారు.

 9. ఈ లింక్ చదవండి: http://saradaa.blogspot.in/2010/07/blog-post_25.html
  >>>>>
  చూడు జగదీష్ బాబు ప్రాథమికం గా మనిషి ఒక జంతువు అన్న సంగతి అనే విషయం మరచి పోయినట్టు ఉన్నావు. మీరు మాట్లాడె నీతి నియమాలన్ని అక్వైరెడ్ గుణాలు అందువలన అవి అందరి విషయం లో సమానం గా వర్తించవు. నువ్వు గగ్గోలు పేట్టినంత మాత్రనా ఎమీ మారదు.
  >>>>>
  ఇలాంటి వ్యాఖ్యలు వ్రాసేవాళ్ళు పద్నాలుగేళ్ళ అమ్మాయికి అబార్షన్ చెయ్యించుకునే హక్కు ఉండాలని ఎందుకు వాదించరు?

 10. విశెఖర్ గారు మీరు చెప్పింది నిజమే పునాదితొ పాటు ఉపరితల అంశాలు కుడా చర్యా ప్రతిచర్యా జరుపుకుంటాయి నేను ప్రత్కేకంగా పెట్టుబడిదారీ సమాజం గురించి ఎందుకు ప్రస్తావించానంటె , మీరు రాసిన స్టాస్ కాన్ ఆర్టికల్ కు ప్రతిగా దానిపైనే శ్రీకాంత్ ఒక ఆర్టికల్ రాసినాడు దానిలొ అతను మీరెప్పుడూ, పెట్టుబడిదారీ సమాజాన్ని కారణంగా చుపుతారని వాటికి పెట్టుబడిదారీ సమాజానికీ సంభంధం లేదని . ఈవిధంగా సాగుతుంది అది . అతనితొ కొంతవరకు వాదించి ఇతనితొ వాదించి ఉపయొగం లేదని .అంతటితొ ఆపెను. పైన ఆదేదొరణిలొనే కామెంట్ వుండం చుసి. పెట్టుబడిదారీ సమాజానికి మిగతా సమస్యలకు గల కారణాన్ని ప్రత్యెకంగా చెప్పవలసి వచ్చింది.

 11. తక్కువవయసు (under-age) ఆడపిల్లలతో వ్యభిచారం, లేదా వారిపై అత్యాచారాలూ సమర్థించడం నా ఉద్దేశం కాదు. సమస్యల్ని అనవసరంగా పదాలతో exaggerate చేసుకోకుండా వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చూద్దామనేదే నా ఉద్దేశం. 14 ఏళ్ళు దాటిన అమ్మాయిలు సెక్సుకు, దాంపత్యానికీ పనికొస్తారు. చాలా సంస్కృతులలో ఆ వయసుకు పెళ్ళి చేయడం కనిపిస్తుంది. మన దేశంలో కూడా ఆ వయసున్న సంసారపు అమ్మాయిలు చాలామంది స్వచ్ఛందంగా సెక్సులో పాల్గొంటున్నారు. ఇది అనేక ప్రభుత్వ/ ప్రైవేటు సర్వేలలో తేలింది కూడా. ఆ వయసులో ఇలాంటివి చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ కలిగే ప్రభావాలు వేరే విషయం. ప్రభావాలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిత్యజీవిత వాస్తవాన్ని నిరాకరించకూడదు. దానికది విడిగా చూసినప్పుడు అది తప్పని వాదించలేం. ఆ వయసుకది సహజమైన ప్రేరణే కనుక.

 12. Some of what you wrote are facts. Some are not.

  Some of your interpretations are totally wrong. Dont spread such wrong information.

  For instance, the following is utter irrelavant to the topic that you chose.
  >> దారిద్ర రేఖని కిందికి జరిపి దరిద్రుల సంఖ్యని తగ్గించిన మన ప్రణాళికా శాఖ
  >> ఉపాధ్యక్షుడు ‘మాంటెక్ అహ్లూవాలియా’ లాగా అన్నమాట!

  Next, most of your interpretation in last few paragraphs is incoherent.
  >> ఉదాహరణకి ఫస్ట్ పోస్ట్ పత్రిక ఇటీవల ఒక వార్త ప్రచురించింది..
  >> కుర్రతనం కొద్దీ పబ్బుల్లో డ్యాన్స్ చేద్దామని వెళ్ళినవారికి వ్యభిచారం పరిచయం అవుతోంది…
  >> అమ్మాయిలు నేనున్నానంటూ ముందుకొస్తారట.

  you wrote as if there is some rama bhajana in the pubs and the kids (as stags) are not allowed inside, so they are robbed by capitalists outside those pubs!!

  next, you dont seem to understand the topic of pubs/dance-clubs/indira-parks.
  >> అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేద్దామన్న సహజ మైన అలవాటు
  why is this a సహజ మైన అలవాటు??????????????
  dont write such crap, pl.

  You dont seem to be aware that most of the operators outside these pubs are independent. They are not capitalists as per your text book definitions. You know what their capital is. They operate on their own and pay to the only capitalist, if you may call – the local goonda, some protection fee.

  >> ఈ వినాశనానికి ప్రజలు తప్పనిసరిగా పరిష్కారం వెతుక్కోవాల్సిందే.

  I agree.

  Similarly, blogs of ill-informed armchair thinkers is the true threat of human civilzation.ఈ వినాశనానికి ప్రజలు తప్పనిసరిగా పరిష్కారం వెతుక్కోవాల్సిందే!

 13. సర్ఫిజెన్ గారూ 12 వయసు లోపు ఆడపిల్లలను నా ఆర్టికల్ నేపధ్యంలో చూస్తే పసివాళ్లని చెప్పడంలో తప్పు కాదని భావిస్తున్నాను. ఆర్టికల్ సందర్భం నుండి విడదీసి చూస్తే పన్నేండవాళ్ళు పసివారు కాకపోవచ్చు.

  ప్రతి అంశమూ ఆబ్సల్యూట్ గా కాకుండా రిలెటివ్ గా చూడాల్సి ఉంటుంది. ఆబ్సల్యూట్ గా చూసినపుడు సందర్భం నుండి పక్కకు వెళ్లిపోతాం. “ఆ వయసులో ఇలాంటివి చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ కలిగే ప్రభావలు వేరే విషయం” అన్నారు కదా. ఆర్టికల్ ని దృష్టిలో పెట్టుకున్నపుడు అలా వేరే విషయంగా ఉండదు. వేరే విషయంగా చూడడం వల్ల మీకు ‘పసివారు’ అనడం పట్ల అభ్యంతరం తలెత్తింది.

  సహజ ప్రేరణలు సామాజిక నియమాలకు లోబడే ఉండాలి. లేనట్లయితే సమస్యలు ఏర్పడతాయి.

 14. విట్ రియల్ గారూ,

  ఇది తెలుగు బ్లాగ్ కనుక వ్యాఖ్యానాలు కూడా తెలుగులోనే ఉంటె బాగుంటుంది. ఇతర పాఠకులు చర్చలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక ముందు వ్యాఖ్యానం చేయదలిస్తే తెలుగులో రాయవలసిందిగా కోరుతున్నాను.

  అహ్లూవాలియాను ఒక సందర్భంలో ప్రస్తావించాను. ఆ సందర్భం చూద్దాం.

  “మాఫియా లాంటి చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తులు చేసే వ్యాపారాల్ని ప్రభుత్వాలు నిషేధిస్తాయి కనుక వ్యభిచారాన్ని కూడా పెట్టుబడిదారులు చట్టబద్ధం చేయించారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడకుండా తాము చట్ట వ్యతిరేకులుగా ముద్ర పడకుండా ఉండడం సరైన పద్ధతి. దానికి బదులు అనైతిక వ్యాపారాలని, దుర్మార్గమైన వ్యాపారాలనే చట్టబద్ధం చేయడం ద్వారా చట్టాల నుండి పెట్టుబడిదారులు రక్షణ పొందుతున్నారు.”

  ఇదీ సందర్భం.

  అహ్లూవాలియా విషయానికి వస్తే, భారత దేశ ప్రభుత్వానికీ, ప్రణాళికా శాఖకీ ద్రవ్య లోటు తగ్గించడం అన్నది ఒక అబ్సెషన్ గా మారింది. ద్రవ్యలోటుకి ప్రధానంగా ప్రజలకి ఇచ్చే సబ్సిడీలనే కారణంగా ఆర్ధిక శాఖ, ప్రణాళికా సంఘం చూస్తున్నాయి. స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకి ఇస్తున్న పన్ను రాయితీలు, టాక్స్ హాలిడేలు, పెట్టుబడి సబ్సిడీలు, విధానపరమైన ఫేవర్స్ ఇవేవీ వారు ద్రవ్యలోటుకి కారణాలుగా చూడరు. అందువల్ల ద్రవ్య లోటు తగ్గించాలంటే వారికి మొదట కనిపించేది కోట్ల ప్రజలకి ఇస్తున్న సబ్సిడీలే. గ్యాస్, పెట్రోల్ సబ్సిడీలు, ఉపాధి హామీ పధకం, పాఠశాలల మధ్యాహ్న భోజన పధకం ఇవే వారికి కనిపిస్తున్నాయి. ఈ ఖర్చు తగ్గించాలని అహ్లూవాలియా అనేకసార్లు బహిరంగంగా, ప్రభుత్వ సమావేశాల్లో, విలేఖరుల సమావేశాల్లో, విధాన పరమైన సిఫార్సుల్లో చెబుతూ వచ్చాడు.

  నూతన ఆర్ధిక విధానాల అమలు మొదలుపెట్టాక భారత ఆర్ధిక వ్యవస్ధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వారిలో అహ్లూవాలియా ఒకరు. వీరి దృష్టిలో అభివృద్ధి అంటే జిడిపి వృద్ధి శాతం, తక్కువ ద్రవ్యలోటు… ఇలాంటివే. ప్రజల ఆర్ధిక స్ధితిగతులు వీరి దృష్టిలో లేవు. పెట్టుబడిదారీ వర్గం ఆదాయాలు అనేక రెట్లు పెరుగుతుంటె ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. అందువల్ల ప్రజల ఆర్ధిక స్ధితిగతులని విస్మరించలేని పరిస్ధితి వారికి ఉంది. దరిద్రం పెరుగుతోందని ప్రభుత్వ, ప్రవేటు సర్వేలు చెబుతున్నందువల్ల జిడిపి వృద్ధిలో ప్రజల వృద్ధి కూడా కలిసి ఉందని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కనుక దరిద్రుల సంఖ్యని తగ్గించాలి. మామూలుగ నైతే ప్రజల ఆదాయ మార్గాల్ని అభివృద్ధి చేసి తద్వారా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచితే దరిద్రుల సంఖ్య తగ్గుతుంది. కాని ఆ పద్దతికి సంస్కరణల బోధకులు వ్యతిరేకులు. కాని దరిద్రుల సంఖ్య తగ్గించాలి. అందుకు అహ్లూవాలియా అండ్ కో ఎంచుకున్న మార్గం దారిద్ర రేఖని కిందకి జరపడం.

  అనైతిక వ్యాపారాలు చేయకుండా ఉండడం నైతికత. కాని లాభాలు కావాలి. అనైతికతని చట్టబద్ధత చేస్తే ఇక అనైతికత కూడా నైతికత కిందకి వచేస్తుంది. దరిద్రుల జీవన ప్రమాణాలని పెంచితే దరిద్రుల సంఖ్య తగ్గుతుంది. అదే జీవన ప్రమాణాన్నే తగ్గిస్తే, జీవన ప్రమాణం పెంచకుండానే దరిద్రులు తగ్గిపోతారు. ఈ రెండు పరిస్ధితుల్నిపోల్చాను.

  —————-

  పబ్స్ గురించి నిజంగానే నాకు తెలియదు. ఫస్ట్ పోస్ట్ ఆర్టికల్ పైనే నేను పూర్తిగా ఆధారపడ్డాను. కాని నేను రాసిన అంశంపై మీ అభ్యంతరం ఏమిటో నాకు సరిగ్గా అర్ధం కాలేదు. బహుశా తెలుగులో రాస్తే అర్ధం అయి ఉండేదేమో.

  —————

  కుర్రతనంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఆకర్షణ సహజం. ఈ ఆకర్షణ ఆయా సామాజిక అలవాట్లను బట్టి వ్యక్తం అవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడమే గగనం అయిన చోట అమ్మాయిలతో మాట్లాడాలన్న తహ తహ రూపంలో ఆ ఆకర్షణ వ్యక్తం అవుతుంది. అలా కాక మాట్లాడుకోవడం సాధారణ విషయంగా మారి ఇద్దరు కలిసి డ్యాన్సు చేయగలగడం సాపేక్షికంగా గొప్ప విషయం అయినపుడు అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేయాలన్న తహ తహ రూపంలో ఆకర్షణ వ్యక్తం అవుతుంది. ‘సహజ అలవాటు’ బదులు ‘సహజ ఉత్సుకత’ అని రాస్తే ఇంకా కరెక్ట్ గా ఉండేదేమో. ఆ ఒక్క పదం వల్ల సందర్భం తప్పిందనీ, రాకూడని అర్ధం వచ్చిందనీ నాకు అనిపించలేదు. మీకేం అర్ధం అయింది?

  —————–

  పబ్ ల బయట ఆపరేటర్లు ఇండిపెండేంట్స్ అనీ, పెట్టుబడిదారులు కాదనీ మీరు చెబుతున్నారు. కనుక పెట్టుబడిదారుల మీద అభాండం వేయడం తగదని మీరు చెప్పదలిచారని నేను భావిస్తున్నా.

  నా టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఏమిటని మీ ఉద్దేశ్యం. మీ డెఫినిషన్ నాకెందుకు అంటగడుతున్నారు?

  పెట్టుబడి ఒక వ్యక్తిదా, ఇద్దరు ముగ్గురు వ్యక్తులదా లేక కంపెనీదా, నాలుగైదు కంపెనీలదా అన్నది అసందర్భం. పెట్టుబడి పోగుపడ్దాక అది లాభం కోసం చూస్తుంది. దాని వెనుక ఎంతమందైనా ఉండచ్చు. ఎంతమంది ఉన్నా పెట్టుబడి క్యారెక్టర్ మారదు. పెట్టుబడి ప్రారంభ దశలో, ఫ్యూడల్ సమాజంతో పోల్చినపుడు, ప్రగతిశీలంగా వ్యవహరించిందని నేను అనేకసార్లు పేర్కొన్నాను. కాని పోటీ పెరిగే కొద్దీ, ఉత్పత్తుల విస్తృతి పెరిగే కొద్దీ, లాభాల అర్జనకి అనేక ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. చట్టాల రూపంలో ఉండే నియంత్రణలు, పన్నులు, నైతిక సూత్రాలు చివరికి దేశాల సార్వబౌమత్వాలు, జాతీయ ప్రాంతీయ ఆకాంక్షలు… ఇవన్నీ దానికి ఆటంకాలే. పెట్టుబడిదారీ వ్యవస్ధ ముదిరి పోయే కొద్దీ, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయే కొద్దీ (కొనుగోలు శక్తి పడిపోయే కొద్దీ) సంక్షోభాలు పెరిగిపోయాయి. మొదట సంక్షోభాలు సహజంగా చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు వాటి మధ్య కాలం కూడా తగ్గిపోతోంది. సంక్షోభాలను పరిష్కరించడానికి బదులు తప్పించుకోవడం పెరిగింది. అలా తప్పించుకోవడం లో భాగంగా అనైతిక వ్యాపారాల్లోకి కూడా అది ప్రవేశించింది. కాని అనైతిక ముద్ర పడకూడదు. పడితే వ్యాపారానికే (లాభాలకే) నష్టం. అందుకోసం దాన్ని చట్టబద్ధం చేసేశారు. ఆ విధంగా జూదాన్ని, వ్యభిచారాన్ని పరిశ్రమలుగా అభివృద్ధి చేశారు.

  ఒక వ్యక్తి పబ్ బైట నిలబడి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు ఏజెంటుగా ఉండడం ప్రాధమిక దశ కావచ్చు. అమ్మాయిలు ఎస్కార్టులుగా తోడు వెళ్లి డబ్బులు సంపాదించడం చూసి కొంతమంది అమ్మాయిలు ఆర్ధిక సమస్యల నుండి బైటపడడం కోసం స్వయంగా ఎస్కార్టుగా ముందుకొచ్చి డబ్బు సంపాదించవచ్చు. ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు కలిసి ఎస్కార్ట్ సర్వీస్ ఏర్పరిచి అమ్మాయిలు సరఫరా చేస్తే చిన్న పెట్టుబడిదారీ బ్రోతల్ కంపెనీ. ఏజెంట్ల పెట్టుబడి మరింత పెరిగి వ్యాపారం విస్తరిస్తే, ఇతర పట్టణాల్లో కూడా సర్వీసులు చేపడితే అది అంతర్రాష్ట్ర (జాతియ) ఎస్కార్ట్ కంపెనీ. అమ్మాయిలు తగినంతమంది దొరక్కపోతే మోసంచేసి బ్రోతల్స్ గా మార్చే స్ధాయికి వారే ఎదుగుతారు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, ఉద్యొగం పేరుతో ఇంకా అనేకానేక ప్రలోభాలతో మోసం చేసి వ్యభిచార గృహాలను నడుపుతున్న స్ధితి మనం చూస్తూనె ఉన్నాం కదా. వీరంతా చేసేది ఒకటే. అమ్మాయిలని అనైతిక వ్యాపారంలోకి దింపి సొమ్ము చేసుకోవడం. నైతిక విలువలని దిగజార్చడం.

  పెట్టుబడికీ, అనైతికతకీ ఉన్న ఈ సంబంధాన్ని వివరించడానికి ఇంకా ఎన్ని పేజీలు రాస్తే మీలాంటి వారికి అర్ధం అవుతుందో నాకు తెలియదు. కాని అదే పనిగా వివరిస్తూ పోవడం సాధ్యం కాదని మీరు గ్రహించాలి. లేదా సామాజిక వ్యవస్ధల తీరుతెన్నులు వాటికీ ఆర్ధిక సంబంధాలకీ ఉండే సంబంధాలపైన మరింతగా మీరే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సమాజంలో ప్రతి అంశమూ పరస్పరం సంబంధం కలిగి ఉంటుందన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం ఒకరి విశ్లేషణా శక్తికి సంబంధించినది. అలాగని మీకు ఆ శక్తి లేదని నేను చెప్పలేను. వివిధ అంశాలనీ, సొసైటల్ డైనమిక్స్ నీ గుర్తించి ఆమోదించడంలో మీకున్న ప్రిఫరెన్స్ పైన అది ఆధారపడి ఉంటుంది. ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని దానికి భిన్నంగా కనిపించే ప్రతి అంశాన్నీ తిరస్కరించడమే ధోరణిగా పెట్టుకున్నవారికి ఎన్నిసార్లు ఓపిగ్గా వివరణ ఇస్తే అర్ధం అవుతుంది?

  >You know what their capital is. They operate on their own and pay to the only capitalist, if you may call – the local goonda, some protection fee.

  ఈ వ్యాక్యం నాకు సరిగ్గా అర్ధం అయితే… మీరు అమ్మాయిల్ని అవమానిస్తున్నారు. అనేక ఆర్ధిక సామాజిక ఒత్తిడిలతో అమ్మాయిలు ఎదుర్కొంటున్న దుర్మార్గాలని చూడ్డానికి తిరస్కరిస్తున్నారు. సమాజంలో పలుకుబడి, అధికారం, డబ్బు ఉన్న వర్గాల మద్దతు లెకుండా గూండాయిజం మనజాలదు. ఆదిపత్య వర్గాల చేతిలో గూండాయిజం ఒక సాధనమే తప్ప దానికదే మనదు. డబ్బు, అధికారం అండ లేకుండా గూండాలు ఏ రక్షణా ఇవ్వలేరు.

  Similarly, blogs of ill-informed armchair thinkers is the true threat of human civilzation.ఈ వినాశనానికి ప్రజలు తప్పనిసరిగా పరిష్కారం వెతుక్కోవాల్సిందే!<

  మీ గర్వాతిశయాన్ని చాలించండి. హ్యూమన్ సివిలైజేషన్ అంటే అజ్ఞానంలో పడి దొర్లడం కాదని, ప్రగతి వ్యతిరేక పాత భావాలని పట్టుకుని వేళ్లాడం కాదని గుర్తించండి. మీ లాంటి గుడ్డి ద్వేషుల వల్ల బ్లాగుల్లో ఎంత చెత్త పేరుకుపోతోందో బ్లాగ్ మిత్రులు చెబుతూనే ఉన్నారు. బావిలో కప్పగా ఉంటానంటే ఉండండి. నాకేమి అభ్యంతరం. కాని అందర్నీ బావిలోకి లాగాలని చూడకండి. ఎస్కార్టు సర్వీసుల్లో, వ్యభిచారంలో, జూదంలో, పెట్టుబడులు ప్రవేశించడం వల్ల అనైతికత వ్యవస్దీకృతం అవుతున్న ప్రమాదాన్ని గుర్తించండి. నాగరికతా సమాజం సాధించిన నైతిక విలువలను చెరబడుతున్న వారెవరో కళ్లు తెరిచి చూడండి. గోల్డ్ మేన్ దుర్మార్గం ఇంత చక్కగా బహిర్గతం అయ్యాక కూడా కళ్లు తెరవడానికి నిరాకరించే మూర్ఖత్వాన్ని విడిచి పెట్టండి. మీకు మీరే గొప్పతనాన్ని అపాదించుకుని ఎదుటివారిని చులకనగా చూసే ఆధిపత్య అహంభావం కట్టిపెట్టండి. మిమ్మల్ని కూడా చులకన చేసి మాట్లాడడం క్షణాల్లో పని అని గుర్తించండి. అహంభావానికి కూడా కనీస పునాది ఉండాలని గ్రహించండి. ఇలా పని గట్టుకుని బ్లాగుల్లో దూరి, సభ్యతా సంస్కారాలు మరిచి బ్లాగర్లను చులకన చేస్తూ కామెంట్లు పెట్టడం ‘హ్యూమన్ సివిలైజెషన్’ సాధించిన విలువ అసలే కాదని గ్రహించండి. ఆల్ ది బెస్ట్.

 15. >> పెట్టుబడికీ, అనైతికతకీ ఉన్న ఈ సంబంధాన్ని వివరించడానికి
  >> ఇంకా ఎన్ని పేజీలు రాస్తే మీలాంటి వారికి అర్ధం అవుతుందో నాకు తెలియదు.

  From whatever you wrote, it is clear that, you dont know all the dimensions of each of the items that you quoted above.

  and when you dont know a topic, it doesnt matter how many pages you wrote.

  >> మీ లాంటి గుడ్డి ద్వేషుల వల్ల బ్లాగుల్లో ఎంత చెత్త పేరుకుపోతోందో
  >> బ్లాగ్ మిత్రులు చెబుతూనే ఉన్నారు.

  keep adding to the trash! బావిలో కప్పగా ఉంటానంటే ఉండండి. !!

  Further, none of my previous comment above lead to your last paragraph of useless rant. That shows your insecurity & lack of confidence on what you wrote.

 16. హలో విట్ రియల్

  మీ అహంభావం అవధులు దాటిపోయింది. మీ బుర్రలో నుండి ప్రవహించిన చెత్త తప్ప మిగిలినదంతా rant లా కనిపిస్తున్నపుడు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. తోటి బ్లాగర్లను గౌరవించాలన్న కనీస సంస్కారం లేని మీరు నాకు పాఠాలు చెప్పడమే వింత. మీ చెత్తంతా మీ లోగిలికి పరిమితం చేసుకోండి. నా బ్లాగ్ కి వచ్చి నా స్పేస్ ని మీ చెత్తతో నింపకండి. ఇంకెప్పుడూ మీ అజ్ఞానం నాకు అంటించేందుకు ప్రయత్నించకండి. మీరు చెబుతున్న rant ఎలా ఉంటుందో ఇతర బ్లాగర్లకి తెలియాలి. అందుకే మీ వ్యాఖ్యలని అలాగే ఉంచుతున్నాను.

 17. పింగ్‌బ్యాక్: రాం మోహన్ మరియు విశేఖర్ లకు… !! « కమ్యూ 'నిజం'

 18. కొన్ని కామేంట్లు సరిగ్గా కనపడటం లేదు. కుడి వైపు మార్జిన్ లోకి వచ్చాయి కారణమేమి? I am using IE

 19. వాసు గారు. నేను ఐ.ఇ లో బ్లాగ్ ఓపెన్ చేసి చూసాను. బాగానే కనిపించింది. టెక్నికల్ విషయాలు నాకు పెద్దగా తెలియదు. తెలిసినవారెవరైనా చెబుతారేమో చూద్దాం.

 20. “చేరి మూర్ఖుల మనసు రంజింపలేము” అన్న సామెత ను భలే గుర్తుకు చేసారు మీరు. పెట్టుబడిదారీ వ్యవస్థ లో లోపాలు లేవని నేను అన్నానా? లేక పెట్టుబడిదారుల్లో దుర్మార్గులు లేరన్నానా? నేను చెప్పిందల్లా, మీరు ప్రతి దానికీ కారణం ఒక వ్యవస్థకు తప్ప, తప్పుకు కారణమైన వ్యక్తులకు ఆపాదించుటలేదని. ఒకసారి మీ బ్లాగులు చదువుకోండి. అందులో ప్రతిసారీ తప్పుని వ్యవస్థకే ఆపాదించేసారు. అక్కడికి పెట్టుబడిదారులు, బాంకులు వ్యభిచారులవద్దే పెట్టుబడి పెట్టినట్టు!!

  ప్రపంచం లో ప్రతి వ్యక్తి తను దాచుకున్న దాన్ని ఎక్కడో ఒకదగ్గర పెట్టుబడి పెడతాడు (ఆఖరికి శ్రమజీవి కూడా తన శ్రమని పెట్టుబడి పెట్టే సంపాదిస్తున్నాడు). అందుచేత ఈ ప్రపంచం లో పెట్టుబడి వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది.

 21. శ్రీ గారూ, పెట్టుబడిదారుడు పెట్టే పెట్టుబడి కి లాభార్జనే ధ్యేయం. శ్రామికుడి పెట్టుబడి ప్రధానంగా శ్రమ మాత్రమే. తన వద్ద ఉన్న కొద్ది పెట్టుబడిని వినియోగించేటప్పుడు అతనికి జీవన స్ధాయి పెంచుకోవడానికే ఉద్దేశించబడుతుంది. రెండింటికీ తేడా ఉంటుంది. ఈ తేడాని మీరు చూడగలగాలి. లేనట్లయితే అంతా పెట్టుబడిలాగానే కనబడుతుంది. పెట్టుబడిదారుడి పెట్టుబడికీ, శ్రామికుడి పెట్టీ పెట్టుబడికీ ఉండే తేడాని సందర్భం వచ్చినపుడు చర్చిస్తాను.

  వ్యక్తులు చేసే తప్పులకి ఆ వ్యక్తులు కారణం కాదని నేను అనలేదు. ఆ తప్పులకు దారితీసే పరిస్ధితులు ఒక నిర్దిష్ట వ్యవస్ధకు సంబంధించినవై ఉంటాయి. ఆ సంబంధాల వల్ల వ్యవస్ధలకూ అందలి వ్యక్తుల చర్యలకూ సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని వివరించాను. ఆ వివరణలో తప్పులు చూడగలిగితే అది చెప్పండి. అసలా వివరణ చదువుతున్న సూచనలు మీ నుండి లేవు.

  బాగా గుర్తు చేశానా? పోన్లెండి ఇప్పటికైనా గుర్తించారు. మరి దారి తప్పి ఇక్కడికెందుకు వస్తున్నారు? మిమ్మల్ని మీరు రంజింపజేసుకోండి చాలు. బూతుల్తో, దూషణలతో, హేళనలతో రంజింపబడే జాతి వేరే ఉంది. అక్కడికెళ్లండి. మళ్ళీ ఇలాంటి చెత్త రాస్తే కామెంట్స్ తీసేస్తాను. గమనించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s