రు. 50 వేల కోసం క్లాస్ మేట్ ని హత్య చేసిన టెన్త్ విద్యార్ధులు


Teen killedవిలాసాల ఖర్చుల కోసం పదో తరగతి విద్యార్ధులు తమ క్లాస్ మేట్ ని కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణం పూణె లో చోటు చేసుకుంది. క్లాస్ మేట్ తల్లిదండ్రులకు గర్భ శోకం మిగల్చడమే కాక తమ తల్లిదండ్రులను సైతం సమాజంలో తలెత్తుకోనీకుండా చేసిన విద్యార్ధులు తమకు టి.వి సీరియళ్ళు స్ఫూర్తినిచ్చాయని పోలీసులకి చెప్పారు. టి.వి సీరియళ్ళే తమకు దారి చూపాయని విద్యార్ధులు తమ విచారణలో చెప్పినట్లుగా పోలీసు అధికారులు చెప్పారు.

శుభం షిర్కే పూనె లో పదవతరగతి పరీక్షలు రాశాడు. అతని క్లాస్ మేట్ అక్షయ్ భగత్ శనివారం మధ్యాహ్నం తన ఇంటికి పిలిచాడు. అక్కడ అక్షయ్ తో పాటు మరో ఇద్దరు విద్యార్ధులు ఉన్నారు. కొద్ది గంటల తర్వాత అక్షయ్ శుభం నాన్నకి ఫోన్ చేశాడు. శుభం తన వద్ద ఉన్నాడనీ, రు.50,000 లు వెంటనే తనకు తెచ్చివ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. శుభం తండ్రి డబ్బు తెచ్చివ్వక ముందే అతన్ని చంపేశారని పోలీసుల విచారణలో తేలింది.

“వాళ్ళు రు.50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా దగ్గర రు.15,000 మాత్రమే ఉన్నాయని చెప్పాను. శుభంతో మాట్లాడనివ్వాలని రిక్వెస్ట్ చేశాను. మా అబ్బాయి బాగానే ఉన్నాడనీ, డబ్బు ఇస్తే పంపిస్తామని కూడా చెప్పారు” అని శుభం తండ్రి మహదేవ్ ఎన్.డి.టి.వి కి తెలిపాడు. తనకు చెప్పినట్లుగానే ఫుట్ పాత్ పైన డబ్బులు పెట్టాననీ ఒక అబ్బాయి బైక్ పై వచ్చి డబ్బులు పట్టుకెళ్లాడనీ మహదేవ్ తెలిపాడు.

కానీ కిడ్నాపర్లు చెప్పినట్లుగా శుభం ఇంటికి రాలేదు. మహదేవ్ పోలీసులకి ఫిర్యాదు చేసి బైక్ నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఆధారంగా పోలీసులుShubham's father అక్షయ్ ని అరెస్టు చేశారు. ఆదివారం ఉదయానికి శుభం శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసాల కోసం త్వరగా డబ్బు సంపాదించాలని అక్షయ్, అతని మిత్రులు భావించారనీ, అందుకోసం వారికి టి.వి సీరియళ్ళు మార్గం చూపాయనీ పోలీసులు ఎన్.డి.టి.వి కి తెలిపారు. “టి.వి సీరియళ్ళు చూసి ప్లాన్ వేసుకున్నామని వాళ్ళు చెప్పారు. విలాస జీవనం గడపడం కోసం వారీ ఆలోచన చేశారు” అని పోలీసు అధికారి చెప్పాడు. శుభం ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ముగ్గురు విద్యార్ధుల్లో ఇద్దరు 15 యేళ్ళ విద్యార్ధులు. వారిలో అక్షయ్ శుభం క్లాస్ మేట్. మరొక విద్యార్ధి వయసు 19 ఏళ్ళు.

పతనమవుతున్న సామాజిక విలువలని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. రోజువారీ జీవనానికి ఏ మాత్రం అవసరం లేని విలాసవంతమైన సరుకులు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సెల్ ఫోన్ల దగ్గర నుండి, ఫ్యాషన్ దుస్తులు, టూ వీలర్స్ మొదలయినవన్నీ విద్యార్ధులకి ఇప్పుడు అత్యవసరాలుగా కనిపిస్తున్నాయి. వీటిని వాడలేని బతుకు వ్యర్ధమన్న నిరాశా, నిస్పృహలని వినియోగ సరుకులు విద్యార్ధుల్లో, యువతలో ప్రోది చేస్తున్నాయి. వ్యక్తుల గొప్పతనం కూడా వీటి చుట్టూనే కేంద్రీకృతం అవుతోంది. విద్యార్ధులు/విద్యార్ధినుల మధ్య స్నేహాలు, అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఆకర్షణ వీటికి కూడా వినియోగ సరుకులు ఒక సాధనంగా మారాయి.

ఆరోగ్య కరమైన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా, చదువులో ప్రతిభ చూపడం ద్వారా లేదా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా తోటివారితో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న చైతన్యవంతమైన దృక్పధాన్ని నేటి చదువులు ఇవ్వలేకపోతున్నాయి. సమాజం నుండి కూడా విద్యార్ధులకి ఆ చైతన్యం అందుతున్న పరిస్ధితులు లేవు. ప్రతి వస్తువూ, సేవ, అవసరమూ డబ్బు ద్వారా తప్ప మరొక విధంగా దొరకని పరిస్ధితులు క్రమంగా పెరుగుతున్నాయి. చివరికి స్నేహమైనా, ప్రేమ అయినా డబ్బు లేదా వస్తువులతో కొనుక్కోవచ్చన్న తప్పుడు చైతన్యం అభివృద్ధి అవుతోంది. పల్లెల్లో ఈ పరిస్ధితి వినాశకర స్ధాయికి చేరుకోనప్పటికీ పట్నాలు, నగరాలు ఆ స్ధితిలో పీకల్దాకా మునిగిపోయాయి.

ఈ నేపధ్యంలో చూసినపుడు పూనే ఘటనకు దారితీసిన కారణాలు అర్ధమవుతాయి. టి.వి సీరియల్ ఒక కారణమే కానీ అది కేవలం దారి మాత్రమే చూపింది. ఆ దారి వెతుక్కునే పరిస్ధితిని కల్పించింది మాత్రం వినిమయ సంస్కృతే. పెట్టుబడిదారీ వ్యవస్ధ వినిమయ సంస్కృతిని పెంచి పోషిస్తుంది. తాము తయారు చేసిన ప్రతి సరుకునూ వినియోగదారులంతా వినియోగించాలని పెట్టుబడిదారీ వ్యవస్ధ కోరుకుంటుంది. అందుకోసం నిరంతరం ప్రచారం చేస్తుంది. ఒక వస్తువు కొనడానికి షాపుకి వెళ్ళి అవసరం లేని మరిన్ని వస్తువులతో షాపు నుండి బైటికి వచ్చేలా షాపుల్లో వస్తువులు అందంగా అమర్చబడతాయి. నిత్యం టి.వీల్లో, హోర్డింగులద్వారా పెట్టుబడిదారీ సంస్ధలు చేస్తున్న ప్రచారం కూడా వినిమయ సంస్కృతిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. పెట్టుబడిదారీ సంస్కృతిలో వినిమయ సంస్కృతి ముఖ్యమైన భాగం.

6 thoughts on “రు. 50 వేల కోసం క్లాస్ మేట్ ని హత్య చేసిన టెన్త్ విద్యార్ధులు

 1. మాటలు రావటం లేదు. పసి మనస్సుల్లో నేరప్రవృత్తి… నేరం చేయటం. నేరానికి పాల్పడటం ఇంత సులభమా… దేనికయినా తెగించడం.. తమ కోరికలకు భిన్నంగా ఒక మాట పరుషంగా అంటే ఆత్మహత్యలకు పాల్పడటం… చిన్న వయస్సులో ఈ రకమైన కిక్, ఈ ట్రెండ్ గడిచిన తరాల్లో కనీసం ఊహకు కూడా లేవు.

  చెన్నయ్‌లో ఇటీవలే ఇంజనీరింగ్ విద్యార్థితో సహా నలుగురు నేరుగా బ్యాంకులపై దాడికి దిగి ఎన్‌కౌంటర్ పాలబడ్డారు. డబ్బు సంపాదన ముందు దొంగ, దొర ఇద్దరూ ఏకమైన స్థితి.

  “ప్రతి వస్తువూ, సేవ, అవసరమూ డబ్బు ద్వారా తప్ప మరొక విధంగా దొరకని పరిస్ధితులు క్రమంగా పెరుగుతున్నాయి. చివరికి స్నేహమైనా, ప్రేమ అయినా డబ్బు లేదా వస్తువులతో కొనుక్కోవచ్చన్న తప్పుడు చైతన్యం అభివృద్ధి అవుతోంది.”

  కళ్ళముందు శరవేగంగా జరుగుతున్న ఈరకం మార్పులను సమాజం మొత్తంగా అనుభవించవలసిందే… వేరే మార్గం సమాజానికి కనుచూపు మేరలో కనిపించడం లేదేమో…

  ఇలా కాక పౌరులను మరోలా తయారు చేయడం వ్యవస్థకు సాధ్యం కాదనిపిస్తోంది.

 2. ఒక సినిమాలో విలన్ డమ్మీ బాంబ్ చూపించి బెదిరించి బ్యాంక్ దోచుకుంటాడు. ఒరిస్సాలో పోలీసులు బ్యాంక్ దోపిడీ చేసిన ఒక వ్యక్తి దగ్గర డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. సినిమాలు చూస్తే దొంగతనాలు చేసేవాళ్ళకి ఐడియాలు ఎందుకు రావు?

 3. అదేదో ఆవు వ్యాసం లాగా, ప్రతి దానికీ పెట్టుబడి సమాజం, వినిమయం అంటూ గోల చేస్తారెంట్రా వెర్రి వెధవల్లారా. ఒక కత్తితో ఆపిల్ పండు కొయ్యొచ్చు. పీక కూడా కొయ్యొచ్చు. ఎవడో వెధవ కత్తితో ఒకడిని చంపితే ఆ తప్పు కత్తి కనిపెట్టినవాడిదా? కాదు కదా? మీ ఎర్రి మొహాలు మారవుగాక మారవు

 4. నీ లాంటి చచ్చు సన్నాసులకి వ్యవస్ధకీ, వ్యక్తులకీ ఉండే సంబంధం ఎంత రాసి చెప్పినా అర్ధం అయి చావదు. మనుషులంతా కలిస్తేనే వ్యవస్ధ అనీ మనుషుల ఆచార వ్యవహారాలు, జీవన వివిధానాలు, సంస్కృతీ సంబంధాలు ఇవన్నీ కలిస్తేనే వ్యవస్ధ అని మీ లాంటి బద్మాష్ గాళ్లకి ఎలా చెబితే అర్ధం అవుతుందిరా బుర్ర తక్కువ వెధవల్లారా? వ్యవస్ధకి ఒక పద్ధతీ అందులో వ్యక్తులకి ఇంకో పద్ధతి ఉంటుందంట్రా తిక్క సన్నాసీ? మీకు బూతుల్తో మొదలు పెట్టి, బూతుల్తో ముగిస్తే గానీ చెప్పె విషయం బుర్రకి ఎక్కదంట్రా పావు బుర్ర చెత్త వెధవా?

  ఏ వ్యవస్ధలో నైనా ఆర్ధిక సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయనీ, ఆర్ధిక సంబంధాల తీరు తెన్నులపైనే ఇతర సంబంధాలైన సంస్కృతి సంబంధాలు ఆధారపడి ఉంటాయని నీ లాంటి మందంగాళ్లకి ఎన్ని పేజీలు రాస్తే ఎక్కుతుంది? వ్యవస్ధలో ఉండే ప్రతీ అంశం పరస్పరం సంబంధం కలిగి ఉంటుందనీ, ఒకటి లేకుండా మరొకటి ఉండదనీ నీలాంటి మట్టి బుర్రలకి ఎప్పుడైనా అర్ధం అవుతుందంట్రా? ముందు బుర్రని కాస్త పెంచుకోండి. మూసిన కళ్లు తెరవండి. బావిలోనే ఉంటామని కమిట్ అయితే ఎవరికీ నష్టం లేదు. కాని ఆ బావే సర్వ ప్రపంచం అని అందర్నీ నమ్మమంటారేంరా చచ్చు, పుచ్చు సన్నాసుల్లారా?

  అజ్ఞానం తప్పేమీ కాదు. పుట్టుకతోనే అందరికి జ్ఞానం అబ్బదు. కానీ అదేవిట్రా అర కుంచం వెధవా? నీ అజ్ఞానమే ‘విజ్ఞాన సర్వస్వం’ అంటావేమిట్రా వెర్రి వెధవా?

  వ్యవస్ధ పరిణామ క్రమాన్ని మీరెప్పుడైనా అధ్యయనం చేసారంట్రా? నువ్వు పుట్టి పెరిగిందే వ్యవస్ధంట్రా? నీకు ముందు బోల్డెంత ప్రపంచం ఉంది. నీ తర్వాతా అది కొనసాగుతుంది. దానంతటికీ ఒక పరిణామం ఏడ్చింది. ఆ పరిణామాన్ని అధ్యయనం చేస్తే వ్యవస్ధ తీరు తెన్నులు అర్ధం అవుతాయి. మనుషులు ఎందుకు ఎలా వ్యవహరిస్తారో కారణాలుంటాయనీ, ఆ కారణాలు వ్యవస్ధే అందిస్తుందనీ, వ్యవస్ధలో సంబంధాలు బాగుంటే మనుషుల ప్రవర్తనలు కూడా బాగుంటాయనీ నీలాంటి అరమందం బుర్రలకి ఎలా చెబితే అర్ధం అవుతుంది? సమాజంలో కనబడే ప్రతీ అంశానికీ వ్యవస్ధలోనే పునాది ఉంటుందని నీలాంటి చచ్చు బుర్రలకి ఎన్ని సిద్ధాంతాలు చెబితే అర్ధం అవుతుంది.

  ఈ ఆర్టికల్ లో కత్తి కనిపెట్టినవాడిది తప్పనేనా నీకు అర్ధం అయింది? నేను చెప్పింది అదంట్రా? అందుకే బుర్రతక్కువ వెధవా అంటోంది. కత్తి పెట్టి చంపడమేనంట్రా నీకు కనిపించింది సన్నాసీ? టి.వి సీరియల్ చూసి ప్లాన్ వేసారని చెబుతుంతే అది నీకు అర్ధం కాదంట్రా? విలాస జీవనం కోసం చంపామంటున్నారే అదీ నీ చచ్చు బుర్రకెక్కలెదా? విలాస జీవనం అంటే కూడా ఏంటో ఇంకా వివరంగా చెప్పాలా? విలాస జీవనం అంటే తిని తొంగోటం అనా నీ ఉద్దేశ్యం. విలాస జీవనం లో వస్తు వినియోగం ప్రధానం. వస్తువులు తయారు చేసేది పెట్టుబడి. తాను తయారు చేసిన వస్తువుల్ని అమ్ముకోవడానికి పెట్టుబడిదారుడు దేశ దేశాల్ని ఆక్రమించుకున్నాడు. వ్యాపారం కోసమే భారతదేశానికి వచ్చాడని నీకు మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలంట్రా? ఒక్క భారత దేశమే కాక ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన అమెరికా దేశాలు ఆక్రమించి మార్కెట్లుగా చేసుకోవడానికీ వ్యాపారం కారణం కాదా? ఇరాక్, ఆఫ్గనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలు చేసింది వ్యాపారానికి కాదా? లిబియా పై బాంబులేసింది, సిరియాలో కిరాయి తిరుగుబాటు నడుపుతోందీ, ఇరాన్ పై బెదిరింపులకి దిగుతోందీ, లాటిన్ అమెరికా దేశాలపై వ్యాపార ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నదీ వాణిజ్యం కోసమే కాదా?

  కాదని చెప్పదలిస్తే చచ్చు సన్నాసీ, ఇక నీలాంటి చచ్చు బుర్రలకి చెప్పేదేమీ ఉండదు, తెలివి పెంచుకోమని చెప్పడం తప్ప. కనీసం భారత దేశాన్ని ఆక్రమించి పాలించింది కూడా వ్యాపారం కోసమేనని అంగీకరిస్తావా బుర్ర తక్కువ వెధవా? ఒప్పుకోకపోతే మళ్ళీ ఒకటో తరగతి నుండి చదవడం మొదలుపెట్టు. భారత జాతీయోద్యమం గురించి అక్కడ కొద్దిగా చెబుతారు. అది చదివినా వ్యాపారం కోసం, తమ కంపెనీల సరుకుల్నే ప్రపంచం అంతా కొనడం కోసం ప్రపంచాన్నంతా తమ పాదాక్రాంతం చేసుకోవడానికి పెట్టుబడిదారుడు తెగిస్తాడని అర్ధం అవుతుంది.

  వ్యాపారం అంటే సరుకులు అమ్ముకోవడం కోసం అనే కదా అర్ధం? సరుకుల్ని జనం కొనాలంటె అందుకు అనుకూలమైన వాతావరణం జనంలో ఉండాలి కదా? సరుకుల్ని కొంటే తప్ప తమ బతుకుల్ని గడపడం సాధ్యం కాదన్న వాతావరణం కల్పించాలి. అలా కల్పించడమే సంస్కృతి ని ప్రభావితం చెయ్యడం అంటే. సంస్కృతి అంటే ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తుల సంబంధాలు ఇవన్నీ. అందుకే సరుకుల వల్ల సంస్కృతి ప్రభావం అవుతోందని చెప్పడం.

  సంస్కృతి అనగానే నీ లాంటి పందుల్లాగా అందరూ అదే బురదలో పడి దొర్లరు. అందులో విషయం తెలుసుకునేవారు, తెలుసుకుని మనం ఉంటోంది బురద అని చెప్పేవారు కొందరు ఉంటారు. ఆ జ్ఞానం ఇచ్చేవే వ్యవస్ధ నడవడిని సైద్ధాంతీకరించే సిద్ధాంతాలు. చదువూ, సంస్కారం ఉంటె ఎవరైనా ఆ సిద్ధాంతాలు చదివి తర్చించుకుంటారు. అందులో మంచి చెడ్డలు ఎంచుకుంటారు. అర్ధం చేసుకోవడానికి చర్చిస్తారు. తప్పొప్పుల్ని చర్చించుకుని విజ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కాని నీలాంటి బురద పందులు మాత్రం బురదలోనుండి బైటి పడడానికి ససేమిరా అంటుంటారు. నీలాంటోళ్లకి సంస్కారం అనేది ఎరగరు కనక, ఇదిగో ఇలా వాచాలత్వం చూపిస్తారు.

  నీలాంటి అరబుర్ర సంస్కారహీనపు వెధవలకి ఎక్కించడానికి నేనూ అదే పంధా ఎంచుకోవలసి రావడమే బాధగా ఉంది.

  మారాల్సిందీ, తెలుసుకోవలసిందీ నేను కాదురా చచ్చు సన్నాసీ. తెలుసుకుని మారాల్సింది నువ్వు. విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఎగతాళీ, వెక్కిరింపులు, బూతులు.. ఇవే వస్తాయి. అయినా నువ్వు నమ్మింది అందరూ నమ్మాల్సిన అవసరం లేదని అర్ధం కాదంట్రా నీకు? తెలివి నీలాంటోళ్ల దగ్గరే ఆగలేదనీ, అది నీలాంటోళ్లని దాటి శతాబ్దాల క్రితమే ముందుకెళ్లిపోయిందనీ నీలాంటి చచ్చు పుచ్చు బుర్రలకి ఎప్పుడు అర్ధం అవుతుందిరా బాబోయ్?

  (ఈ వ్యక్తి రాసిన పై వ్యాఖ్యలో బూతు లేనందున ప్రచురించి ఈ సమాధానం ఇస్తున్నా. ఇతను గతంలో చాలా సార్లు బూతులు రాసాడు. ముఖ్యంగా హిందూ మతం గురించి రాసిన పోస్టుల కింద బూతులు రాసాడు. బూతులంటే మామూలు బూతులు కాదు. పచ్చి బూతులు. నేను బుద్ధెరిగాక అలాంటి బూతులు ‘చదవలేదు’. వీడి పుణ్యాన నా బ్లాగ్ లోనే చదవాల్సి వచ్చింది. చదువుల తల్లిని సరస్వతి గా ఇలాంటి వాళ్ళే పూజిస్తుంటారు. పుస్తకాన్ని పొరబాటున కాలితో తొక్కితే కళ్లకద్దుకుని మనసులోనే సారీ చెప్పుకుంటాం. అలాంటిది పుస్తకం లాంటి బ్లాగ్ లోనే పచ్చి బూతులు రాయడానికి ఇతను తెగించాడు. అందుకే సమాధానం ఇలా రాయాల్సి వచ్చింది. మిత్రులకి ఎవరికైనా బాధనిపిస్తే బాధ్యత నాది కాదని విన్నవించుకుంటున్నాను. -విశేఖర్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s