దురాక్రమణ యుద్ధాలవల్ల ఆర్ధిక వ్యవస్ధలు కులారిల్లుతున్నప్పటికీ, అవే యుద్ధాల వల్ల కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పరిస్ధితి ఉంది. యుద్ధాలు చేసి దురాక్రమించి ప్రపంచ వనరులు గుప్పెట్లో పెట్టుకోవడం పశ్చిమ దేశాల ‘మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ దురాశ కాగా, యుద్ధాలకు ఎదురొడ్డి నిలిచే శక్తుల వల్లా, యుద్ధోన్మాదుల అదుపులో లేకుండా పోయే యుద్ధ ఖర్చుల వల్లా ఆర్ధిక సంక్షోభాలు అనివార్యంగా ఎదురవుతున్న పరిస్ధితి.
ఈ పరిస్ధితుల్లో నిరుద్యోగ సైన్యానికి ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతున్నా, యుద్ధాలు మాత్రం కావలసినన్ని. యుద్ధాల వల్ల సంభవించిన ఆర్ధిక సంక్షోభాలతో నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లడం నేటి వాస్తవం. అమెరికాలో దాదాపు తొమ్మిది శాతం పైనే నిరుద్యోగం ఉంటే, బ్రిటన్ లో తొమ్మిది శాతం, పదిహేడు దేశాల యూరో జోన్ లో జనవరి నాటికి 10.7 శాతం నిరుద్యోగం రికార్డయింది. జనవరి 2012 నాటికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ లో నిరుద్యోగుల సంఖ్య 2.43 కోట్లు. స్పెయిన్ లో అత్యధికంగా నిరుద్యోగం 23.3 % ఉండగా గ్రీసులో 23.3 %, ఐర్లండు, పోర్చుగల్ లలో 14.8 % నిరుద్యోగంతో విలసిల్లుతున్నాయి.
యుద్ధాలు కొద్ది మంది హంతకులకు ఉద్యోగాలు కల్పించి కోట్లమంది ఉద్యోగులను బజారుకీడుస్తున్నాయి. ప్రజా జీవనాన్ని అల్ల కల్లోలం చేస్తున్నాయి.
“ఈ రోజుల్లో ఉద్యోగం కంటే యుద్ధం తేలిగ్గా దొరుకుతుందని తెలిసొచ్చింది”
–
–