ఆకలికమ్ముడుబోయిన అపరంజి బొమ్మలు -ఫొటోలు


మానవత్వం పెదవిపైన మాసిన చిరు నవ్వులు

మనసులేని కౌగిలిలో నలిగిపడిన పువ్వులు

బుసకొట్టే కామాగ్నికి విసిరేసిన సమిధలు

కొడిగట్టిన జీవంతో మిణుకుమనే ప్రమిదలు

వసివాడని బాల్యంతో కసి తీర్చే దేహాలు

వలువులు విడిచిన విలువల సాక్ష్యాత్కారాలు

చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకు రెమ్మలు

నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు

కసి దాగిన, కలతల కాగిన జీవచ్ఛవాలు

ఎవరు వీరు? ఎవరు వీరు?

మనం జారవిడుచుకున్న మన జాతి పరువులు

మనిషి జారవిడిచిన మానవ జాతి విలువలు

ఈ ఆడపడుచులు… మన జాతి పరువులు

ఈ బాలికలు ఈశాన్య బంగ్లాదేశ్ లోని తంగైల్ ప్రాంతంలో ఉన్న కందపర బ్రోతల్, మధ్య బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో శరీరం అమ్ముకుని బతుకుతున్న సమాజ వంచితలు. ఆకలి నిండిన సమాజంలో అనేక రకాలుగా వంచించబడుతూ వీరు బ్రోతల్స్ కు అమ్ముడవుతున్నారు. ప్రేమల పేరుతో మోసపోయే టీనేజర్ల దగ్గర్నుండి, ట్రాఫికింగ్ మాఫియాల చేత చిక్కి బలవంతంగా అమ్ముడుబోయే అమాయక బాలికల వరకూ ఈ బ్రోతల్స్ లో జీవితాలు వెళ్లబుచ్చుతున్నారు. కుటుంబాలను పోషించుకోలేక కేవలం కొన్ని వందల టాకాలకు (బంగ్లాదేశ్ కరెన్సీ) తల్లిదండ్రులే తమ కూతుళ్లను ఆమ్మేస్తున్న పరిస్ధితి కూడా బంగ్లాదేశ్ లో ఉంది.

ఈ బ్రోతల్స్ కి సంబంధించి దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను పత్రికలు వెల్లడించాయి. అత్యంత చిన్న వయసులోనే బ్రోతల్స్ కి చేరడంతో విటులను ఆకర్షించడానికి బ్రోతల్ యజమానులు వీరి చేత బలవంతంగా స్టెరాయిడ్స్ ని మింగిస్తున్నారని వెల్లడయింది. ‘ఒరాడెక్సన్’ అనే స్టెరాయిడ్ ఇక్కడ విస్తృతంగా వాడుకలో ఉంది. దీన్ని వాడడం వల్ల బాలికల శరీరాలలో కృత్రిమంగా కండ చేరుతుంది. తద్వారా తమ వయసు కంటే ఎక్కువ గా విటులకి కనబడి విటులు త్వరగా ఆకర్షితులవుతున్నారని బాలికలు చెప్పారు. దీన్ని వాడడం ద్వారా రోజుకు 15 నుండి 20 వరకు విటులతో వ్యాపారం చేయగలుగుతామని వారు చెప్పారు. వీరికి చెల్లించేది అతి తక్కువ మొత్తం కావడం వల్ల రోజులో వీలయినంత ఎక్కువమందిని సంతృప్తిపరచడానికి వీరు ప్రయత్నిస్తారు. దానితో వీరి జీవించే కాలం తీవ్రంగా పడిపోతుంది. యౌవనం ముగియకుండానే ముసలివారుగా మరిపోయి బ్రోతల్స్ కి కూడా పనికిరాని పరిస్ధితిలో జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.

(పై కవిత నిజానికి ఒక పాట. ‘మానవుడు దానవుడు’ సినిమా కోసం సినారె రచించిన పాట. అయితే పాట పూర్తిగా గుర్తు లేనందున కొంత జోడించాను)

(ఫొటోలు: రాయిటర్స్)

4 thoughts on “ఆకలికమ్ముడుబోయిన అపరంజి బొమ్మలు -ఫొటోలు

  1. Excellent coverage of the exploitation of girls, mostly underaged.
    Root causes are poverty and ‘ demand’ . Who is creating that ‘ demand’ ? – MEN.
    I do not think we can do anything for the events in Bangladesh.
    Please riaise similar issues in India and create awareness.
    Wherever it happens, ‘demand’ is created by ‘ MEN ‘ and the victims are those unfortunate ones.
    Often, the demand creators ( men ) also are becoming victims by contracting diseases, and perpetrators, by spreading them.
    Best wishes.

    Dr.Sudhakar.

  2. Hi Sudhakar

    The situation in India is more or less the same as in Bangladesh. The photos, made available by Reuters, are intended to highlight the underage of prostitutes. I want to point out that the plight of the exploited girls, shown in the photos, can be seen as a testament to the girls of India with similar plight.

  3. True.The difference is, India is getting richer with huge resources but the gulf between the poor and the rich is widening. May be it has a lot to do with the ‘ mind frame’ of the people( again I dare say , mostly men !) to promote the world’s oldest profession ! .
    Sudhakar.

  4. ‘ఆకలికి అమ్ముడుపోయిన అపరంజి బొమ్మలు’ – ఎంత వాస్తవం! పసిదేహాలు కూడా మార్కెట్ సరుకైనచోట .. గిరాకీ పెంచటానికని శరీరాలను స్టెరాయిడ్ విషపూరితం చేయటం లాటి ఘోరాలు మామూలే! ఈ వ్యవస్థలోని భయంకరమైన చెడుగుల్లో ఇదొకటి. సామాజిక మార్పుతో తప్ప పరిష్కార మార్గం కనుచూపు మేరలో కనపడని సంక్లిష్ట సమస్య ఇది!

    రెడ్ లైట్ ఏరియా లో చిక్కుకుపోయిన బాలిక కథతో కొన్నేళ్ళ క్రితం కమల్ హాసన్ సినిమా ‘మహానది’ వచ్చింది. దానిలో కొన్ని దృశ్యాలు హృదయవిదారకంగా ఉంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s