ట్రాఫిక్ గుర్తుల్ని రూపొందించినవారికి కళా దృష్టి తప్పని సరి. బిజీ రోడ్లపై ట్రాఫిక్ ను నియంత్రించడానికి వాడుతున్న గుర్తుల్ని రూపొందించడంలో కళాత్మక దృష్టిని మనం చూడగలం. కళాత్మక దృష్టి లేకుండా ట్రాఫిక్ లో ఎదురవగల ప్రమాదాలను కేవలం కొన్ని రేఖలతో గీసిన గుర్తుల ద్వారా, పెద్దగా రంగులు వాడకుండానే చెప్పగలగడం సాధ్యమేనా?
స్ట్రీట్ అర్ట్ చిత్రకారులు తమ కళా దృష్టికి మరింత పదును పెట్టి గీసిన ట్రాఫిక్ గుర్తులివి. మౌస్ పాయింటర్ తో కంప్యూటర్లలో ఎన్నో ఆపరేషన్స్ ను చిటికెలో చేసేస్తున్నపుడు వాహనాలను ఎందుకు ఆపలేమన్న ఐడియా, అప్రమత్తంగా రోడ్డు దాటితే పైకే ప్రయాణమన్న సూచన… లాంటివి ఈ ఫొటోల్లో చూడవచ్చు.
–
–