టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి


తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి టీచర్ ని కత్తితో పొడిచి చంపిన దారుణం తమిళనాడులోని ఓ ప్రవేటు స్కూల్ లో చోటు చేసుకుంది. ‘స్ట్రిక్ట్ టీచర్’ గా పేరుపొందిన నలభై యేళ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఉమా మహేశ్వరి విద్యార్ధుల చదువు గురించి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.

చెన్నైలోని ఆర్మేనియన్ స్ట్రీట్ లో గల ప్యారీస్ కార్నర్ లో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. గత పది సంవత్సరాలుగా సైన్సు, హిందీ సబ్జెక్టులను ఉమా మహేశ్వరి బోధిస్తున్నట్లు తెలుస్తోంది. నాల్గవ పీరియడ్ కోసం తరగతి గదిలో ఎదురు చూస్తున్న టీచర్ వద్దకు విద్యార్ధి అందరి కంటే ముందు వెళ్లి దాడి చేశాడని ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది. పుస్తకంలో దాచి తెచ్చుకున్న కత్తితో టీచర్ గొంతు కోసి, అనంతరం కత్తితో కడుపులో పొడిచాడని ఇతర విద్యార్ధులూ కేకలు వేసి పట్టుకోబోగా బాత్రూంలో దాక్కున్నాడనీ విద్యార్ధులు, టీచర్లు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారని ఎన్.డి.టి.వి తెలిపింది.

కొన్ని రోజులుగా విద్యార్ధి టీచర్ పై కోపంగా ఉన్నాడని మరో విద్యార్ధి తండ్రి అజ్మల్ ఖాన్ చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. “అతను కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నాడు. అవకాశం దొరకడంతో తాను చేయదలుచుకున్న పని చేశాడు” అని అజ్మల్ ఖాన్ తెలిపాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోగానే ఉమా మహేశ్వరి మరణించినట్లు తెలుస్తోంది. టీచర్ స్ట్రిక్ట్ టీచర్ కావడం వల్ల కోపం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడాని, విద్యార్ధిని విచారించిన పోలీసులు తెలిపారు. విద్యార్ధుల చదువు గురించి ఉమామహేశ్వరి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు లేఖల ద్వారా తెలియజేస్తుందని అదే ఆవిడ ప్రాణాల మీదికి తెచ్చిందని పోలీసులు తెలిపారు.

విద్యార్ధిపైన హత్యా నేరాన్ని మోపి జువెనైల్ హోమ్ కి తరలించారు. తరగతి గదిలో, చదువులో సదరు విద్యార్ధి పరిస్ధితి ఎలా ఉన్నదీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. టీచర్ మరణంతో స్కూలుకి నాలుగు రోజులు సెలవు ప్రకటించారు.

విద్యార్ధి, ఉపాధ్యాయుల సంబంధాలు ఎలా ఉన్నాయన్న సంగతి తాజా ఘటన మరోసారి చర్చలోకి తెస్తుంది. పత్రికలు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని రోజుల పాటు చర్చోప చర్చలు సాగిస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారు సైతం ఈ చర్చలో పాలు పంచుకునే అవకాశం ఉంది. విద్యా వ్యవస్ధలో జరగవలసిన మార్పుల గురించి, తేవలసిన సంస్కరణల గురించీ, ప్రభుత్వాల బాధ్యత గురించీ చర్చలు జరుగుతాయి. కానీ అవన్నీ కొద్ది కాలం వరకే. ఆ తర్వాత అంతా మామూలే. విద్యా వ్యవస్ధలో అవే పద్ధతులు, వ్యాపార ధోరణులు కొనసాగుతాయి. సమాజాన్ని తెలుసుకుని మార్చుకునే విద్యకు బదులుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకునే విద్యా బోధన యధావిధిగా కొనసాగుతుంది. ఈ పరిస్ధితిలో మార్పులు రావడానికి వ్యవస్ధ తీరు తెన్నులు పూర్తిగా మారవలసి ఉంది.

5 thoughts on “టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి

  1. కేవలం ఉత్తరాలు వ్రాయడం కారణం కాకపోవచ్చు. ఆ టీచర్ వల్ల తన తల్లితండ్రులు తనని కొట్టారనే కారణం కూడా ఉండి ఉండొచ్చు.

  2. Please observe that the student is muslim. See how their community encourages the violence. He might have seen many violent scenes in his community as usual he did the same. Muslims dont think with their mind, they always think with Kuran.

  3. ఆ విద్యార్థి మతం మీద విశ్వాసం లేని నాస్తికుడైనా అతని తల్లితండ్రులు లేదా టీచర్లు వేధిస్తే అలాగే చేస్తాడు. ఇక్కడ మతం ప్రశ్న ఎక్కడ ఉంది? కొడుకు తల్లితండ్రులని చంపలేడు. తన తల్లితండ్రుల చేత తనని కొట్టించిన టీచర్‌నైనా చంపుదామని అనుకుని ఉంటాడు. చిన్నప్పుడు మా అమ్మానాన్నలు కూడా నన్ను చదువు, చదువు అంటూ కొట్టేవాళ్ళు. టీచర్లు మాత్రం నన్ను అంతగా కొట్టలేదు. విద్యార్థులని కొట్టమని టీచర్లకి ఆదేశాలు ఇచ్చే స్కూల్ యాజమాన్యాలని మాత్రం చూశాను. పిల్లలు చదవకపోతే ఆఫీసర్ అవ్వరు అనుకుని పిల్లలని కొట్టి చదివిస్తారు కొందరు తల్లితండ్రులు. అందుకోసం వాళ్ళు తమ పిల్లలని స్ట్రిక్ట్ స్కూళ్ళలోనే వేస్తారు. ఆ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఆఫీసర్లు అవ్వరు కానీ హంతకులు అవుతారు.

  4. దేశంలో నిత్యం అనేక కోట్ల నేరాలు జరుగుతున్నాయి. ఆ నేరాల్లో అనేక కోట్ల మంది హిందువులు పాత్ర ధారులుగా ఉన్నారు. దోపిడిలు, హత్యలు, మాన భంగాలు ఇలా అనేక నేరాల్లో హిందువులు ఉన్నారు. హిందువుల పార్టీ గా చెప్పుకుంటున్న పార్టీ నేతలు అసెంబ్లీలోనే బూతు వీడియోలు చూస్తున్నారు. ఆ పార్టీనేతే ముఖ్యమంత్రిగా ఉంటూ తన ప్రజలపైన దుర్మార్గంగా హత్యలు చేయించాడు. పన్నెండొందల మంది ముస్లింలను చంపించాడు.

    ఈ నేరాలన్నీ హిందువులు చేస్తున్నారు గనక హిందువులంతా దుర్మార్గులైనట్లేనా? మీ విశ్లేషణ ఇలాంటి అర్ధాలకు కూడా దారి తీస్తుందన్న స్పృహ కూడా లేనంతగా మీ లాంటి వారి మెదళ్లు కుళ్ళిపోతుండడమే దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి.

  5. హత్యలు చెయ్యాలనుకునేవానికి మతంతో పని లేదు. ఫూలన్ దేవి, హరిబాబా, నిర్భయ్ గుజ్జార్ లాంటి కరడుగట్టిన బందిపోట్లందరూ హిందువులే కనుక హిందూ మతం దొంగతనాలు నేర్పిస్తుంది అని అంటే మీరు ఒప్పుకుంటారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s