చైనాలో ఐ ఫోన్ కోసం చలిలో, గడ్డకడుతూ… -ఫొటోలు

ఇది చైనాలో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరుగుతున్న నిరసన ప్రదర్శన కాదు. కేవలం ‘ఐ ఫోన్ 4 ఎస్’ కొనుగోలు చేయడానికి గుమికూడిన జనం. ‘వినియోగదారీ సంస్కృతి’ వెర్రి తలలు వెయ్యడం అంటే ఇది కదా! ఐఫోన్ ఎట్టి పరిస్ధితుల్లోనూ జీవితావసరం కాదు. ఐనా వీరి ఆత్రుతను ఎలా అర్ధం చేసుకోవాలి? చైనా తో పాటు మరొ పదమూడు దేశాల్లో శుక్రవారం అమ్మకాలు ‘ఐ ఫోన్ 4 ఎస్’ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించింది. చైనాలోని ప్రధాన నగరాల్లో ఏపిల్…

గ్వాంటనామో బే -ఒబామా విఫల వాగ్దానం

గ్వాంటనామో చీకటి కొట్టం మూసివేత! ఇది బారక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు అమెరికా ప్రజలకు ఇచ్చిన ఘనమైన వాగ్దానం.  విమానాశ్రాయాలలో అనుమానితుల్ని అరెస్టు చేసినా వారిని ఈ చీకటి కారాగారానికే తరలించారు. ప్రజాస్వామిక విలువలపైన అమెరికా రాజ్యానికి ఉన్న గౌరవం ఒట్ఠి బూటకం అని నిరూపించిన అనేక అంశాల్లో గ్వాంటనామో బే జైలు ఖైదీలపైన అమెరికా సాగించిన అకృత్యాలు ఒకటి మాత్రమే. బారక్ ఒబామా, అధ్యక్షుడిగా గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేశాడు. అవేవీ అమలు…

‘స్మగ్ వన్’ వీధి చిత్రాలు

స్మగ్ వన్ వీధి చిత్రాలకు సినిమా క్యారెక్టర్లే ప్రేరణగా నిపిస్తోంది. సినిమా క్యారెక్టర్లే అయినా అవి గోడల మీద ఠీవిగా నిలబడ్డ తీరు అధ్బుతంగా ఉంది. – –

శ్రీకాంత్ గారూ, మీకు సమాధానం త్వరలో ఇస్తాను, ఆలోగా ఇది చూడండి

నేను (విశేఖర్) ఇతర బ్లాగుల్లోకి వెళ్ళడం తక్కువ. ఇపుడే నా డాష్ బోర్డ్ లో లేటేస్ట్ పోస్టులు చూస్తుండగా ‘స్వదేశీ కమ్యూనిస్టుల దేశ భక్తి…’ అంటూ మీ పోస్టు లింక్ చూసి దాన్ని పట్టుకుని మీ బ్లాగ్ కి వచ్చాను. అందులో సైడ్ కాలంలో ‘నన్ను ఉద్దేశిస్తూ ఓ పోస్టు’ ఉన్నట్లు గమనించి అదీ చూశాను. మీరు జనవరి ఎనిమిది న ఆ పోస్టు రాసినట్లు చూశాను. ఈ రోజు పన్నెండు. ఆలస్యంగా చూశాను. కాని మరో…

ఐదువేలు చెల్లించలేదని దళితుడి సజీవ దహనం

ఇది మరో ఘటన. దళితులపై కొనసాగుతున్న దుర్మార్గాలకి మరొక సాక్షీభూతం. తీసుకున్న అప్పు ఐదు వేలు చెల్లించలేదని అందరి ముందూ కిరోసిన్ పోసి తగలబెట్టిన ఈ దుర్మార్గం రెండు కుటుంబాలకు ‘మగ దిక్కు’ ని దూరం చేసింది. సజీవ దహనానికి ఐదు వేల అప్పు చెల్లించకపోవడం కారణం కాదనీ, అప్పు తీర్చమని వచ్చి పదే పదే కొడుతూ అవమానించినందుకు పోలీసులకు రిపోర్టు ఇవ్వడమేననీ బాధితుడి కుటుంబీకులు చెబుతున్న నిజం. ‘దిక్కు’ ని కోల్పోయిన ఈ కుటుంబీకుల దైన్యం…

దళిత స్త్రీని కొట్టి, బట్టలిప్పి, ఊరేగించి…..

మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సొంత గ్రామంలోనే ఒక దళిత స్త్రీని బట్టలిప్పి ఊరేగించారు. న్యాయం చెయ్యమని పోలీసు స్టేషన్ కి వెళితే ‘మీ గ్రామంలో ఇవి మామూలే కదా? కేసెందుకు?’ అని పోలీసులు తిప్పి పంపేశారు. ఈ దురన్యాయానికి కారణం మరీ ఘోరంగా ఉంది. ఆమె పాత్ర ఏ మాత్రం లేని ఓ ఘటనకి ఆమెని బాధ్యురాల్ని చేసి ఆమెను శిక్షించారు. బాధితురాలు నలభై రెండేళ్ళ రేఖా చవాన్. ఆమె కొడుకుతో కలిసి అగ్ర…

పాక్ ప్రభుత్వానికి ఆర్మీ తీవ్ర హెచ్చరిక

పాకిస్ధాన్ లో ప్రభుత్వమూ, సైన్యా ల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇరు పక్షాల విభేధాలు వివిధ రూపాల్లో రచ్చకెక్కుతున్నాయి. మరోసారి పౌర ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యడానికి ఆర్మి తన చర్యలను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని పదవినుండి తొలగించి ప్రభుత్వంతో అమీ, తుమీ కి సిద్ధపడింది. పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను పాక్ ప్రధాని తీవ్రంగా విమర్శించడంతో సైన్యం వైపునుండి వరుస చర్యలు కనిపిస్తున్నాయి. “మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను…

రోడ్డు మీద ప్రతీదీ మాట్లాడేదే! -వీధి (వి)చిత్రం

వీధి చిత్ర కళాకారులతో రోడ్డు పైన కనిపించే ప్రతి వస్తువూ, చోటూ మాట్లాడుతుంది. ఆ మాటకొస్తే మాట్లాడలని ఉండాలే గాని రోడ్డు మీద మనకు కనపడేవన్నీ మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంటాయి. వీధి చిత్ర కళాకారులు ఆ విషయాన్ని తమ దైన చిత్ర కళ ద్వారా ఆ నిజాన్ని అందంగా చెప్పిస్తారు. అంతే. – – – –  

ప్రధాని జిలాని గౌరవనీయుడు కాడు, తేల్చేసిన పాక్ సుప్రీం

ఇండియా, పాక్ లలో రాజకీయ నాయకులను కోర్టులు చెడుగుడు ఆడేస్తున్నాయి. ఎ.రాజా, గాలి జనార్ధన్ తదితరులను అవినీతి ఆరోపణలపై జైలుకి పంపిన భారత కోర్టులు ఇంకా జగన్, దయానిధి తదితరులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి విదితమే. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టుకి ఇచ్చిన హామీలను గౌరవించకుండా పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ‘గౌరవనీయుడు కాద’ ని అక్కడి సుప్రీం కోర్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ప్రధాని జిలానికి…

ఢిల్లీలో రేప్ లన్నీ బంధువులు, పొరుగువారూ చేసినవే -కమిషనర్

స్త్రీలపై అత్యాచారాలు జరగకుండా ఉండడానికి స్త్రీలే వివిధ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ వ్యాపితంగా పోలీసు పెద్దలు సుద్దులు చెబుతుండగా అందుకు భిన్నమైన వివరాలని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీల్లో జరిగిన మాన భంగ అత్యాచారాల్లో తొంభై ఎనిమిది శాతం దగ్గరి బంధువులో, పొరుగున నివసించేవారో చేసినవేనని ఢిల్లీ పోలీసు అధికారులు ఓ షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. 2011 సంవత్సరంలో మొత్తం 568 రేప్ కేసులు నమోదు కాగా, అందులో 550 కేసుల్లో నిందితులు బాధితులకి తెలిసినవారేనని ఢిల్లీ…

‘డిప్లొమసీ’ పుట్టిందీ పెరిగిందీ యుద్ధాల కోసమే -కార్టూన్

రెండు యుద్ధాల మధ్య విరామమే ‘శాంతి’ అని కారల్ మార్క్స్ మహాశయుడు చెప్పాడు. ఆధునిక మానవ జాతి సాగించిన యుద్ధాల చరిత్ర దానిని నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. యుద్ధాలని నివారించడానికే డిప్లొమసీ అని చెప్పే పాఠాల సంగతి ఎలా ఉన్నా, ‘డిప్లొమసీ’ అనాదిగా నమ్ముకున్నది మాత్రం ‘ఆయుధాలనే’నని ఈ కార్టూనిస్టు చెబుతున్నారు. ఆయుధాలను నమ్ముకున్న ‘డిప్లొమసీ’ సృష్టించేది యుద్ధాలనే కదా! – –

పాక్ జెండా ఎగరేసింది హిందూత్వ ముఠాయే

మంగళవారం మరొక ‘హిందూత్వ’ కార్యకర్త అరెస్టుతో పాకిస్ధాన్ జెండా ఎగరేయడం వెనుక జరిగిన కుట్రను పొలీసులు వెల్లడించగలిగారు. కర్ణాటక రాష్ట్రంలో సిందగీ గ్రామ తహసీల్దారు కార్యాలయం ముందు జనవరి ఒకటిన పాకిస్ధాన్ జెండా ఎగరేయడంతో అలజడి చెలరేగింది. మత కల్లోలాను రెచ్చగొట్టడానికే ఈ విధంగా పాకిస్ధాన్ జెండా ‘హిందూత్వ’ కార్యకర్తలు ఎగరేశారని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య ఏడు కి చేరుకుంది. అరెస్టయిన వారు ‘శ్రీరాం సేన’ సభ్యులని పొలిసులు తెలిపారు.…

ప్రభుత్వ సాయం కోసమైనా పోలీసుల్తో తలపడాల్సిందే -ఫొటో

‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్ధ అందించిన ఈ ఫొటోని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రిక ప్రచురించింది. పరాగ్వే దేశంలో ‘అసున్సియన్’ (Asuncion) పట్నంలో చోటు చేసుకున్న దృశ్యాలివి. ఆ పట్నంలోని ఓ స్క్వేర్ ని ఆక్రమించడానికి పరాగ్వే దేశంలోని ‘అవా గ్వొరాని’ అనే ఆదిమ జాతి వారు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు.  వద్ద ప్రభుత్వ సాయం కోసం వీరు అర్ధిస్తూ ఆ స్క్వేర్ వద్దకు చేరుకున్న వారిని అక్కడి నుండి తొలగించడానికి పోలీసులు ఇలా కరుకు…

అనుకోని ఉపద్రవం వస్తే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకునేది ఓ వారమే

ఇప్పటికిప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చిపడితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలిచేది కేవలం ఆ వారం రోజులేనని ఓ అధ్యయన సంస్ధ తేల్చిపారేసింది. ఓ పెద్ద ప్రకృతి విలయం లేదా మిలిటెంట్ల దాడి (9/11 దాడుల్లాంటివి కావచ్చు) వస్తే గనక అటువంటి వాటిని తట్టుకుని సుదీర్ఘ కాలం నిలవ గల శక్తి ఇప్పటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు లేదని ఆ సంస్ధ తేల్చింది. 2010 లో ఐస్ లాండ్ అగ్ని పర్వతం పేలుడుతో ఎగజిమ్మిన బూడిద మేఘాలుగా…

శిల్పారామం ఫొటోలు

ఇవి తెలుగు బ్లాగర్ సుజాత గారు తీసిన ఫొటోలు.  హైద్రాబాద్ లో శిల్పారాం కు నేనెప్పుడూ వెళ్లలేదు. ఈ ఫొటోలు చూసి ధ్రిల్లయ్యాను. ఫొటోలనైనా సొంతం చేసుకుందామని నా బ్లాగ్ లో పోస్టు చేసుకుంటున్నా. అసలు పోస్టు ఇక్కడ చూడండి.