అప్పుల కుప్ప యూరప్

కొత్త సంవత్సరం యూరో దేశాలకు అనుకూలంగా ఉన్నట్లు లేదు. పదిహేడు దేశాల యూరో జోన్ కూటమి కొత్త సంవత్సరంలో చెల్లించవలసిన అప్పులు దాదాపు 700 బిలియన్ యూరోల వరకూ ఉంది. ఈ అప్పు చెల్లించకపోతే అలా చెల్లించలేని దేశం డిఫాల్ట్ (దివాలా) తీసినట్లుగా ముద్రపడుతుంది. దివాలా తీసిన దేశానికి కొత్త అప్పులు ముట్టవు గనక రోజువారి ఖర్చులు గడవడం కూడా గగనం గా మారుతుంది. దివాలా తీసిన దేశాలకు సాయం చెయ్యడానికి యూరప్ దేశాలు ఒక ట్రిలియన్ యూరోల…

రైలు పట్టాల ఏకాభిప్రాయం -కార్టూన్

పదిహేడు యూరప్ దేశాక కూటమి యూరో జోన్ కి జర్మనీ, ఫ్రాన్సు లు నాయకులు. వీరికి తమ తమ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలకి యూరో ఉమ్మడి కరెన్సీ అవసరం. ‘ఉమ్మడి కరెన్సీ ని కాపాడుకోవాలా?’ తమ దేశాల కంపెనీలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకోవాలా? అన్నది వీరి మీమాంస. ఈ మీమాంస వీరిని చెరో పట్టాపై నిలిపింది. తమ తమ పట్టాలపై కొనసాగుతూ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఎన్ని సమావేశాలు జరిపినా ఏం ప్రయోజనం? – – జర్మనీ…

ఫోటోషాప్ లేకున్నా ఈ ఫోటోలెలా సాధ్యం?

శాండీ స్కాగ్లండ్ తీసిన ఫొటోలివి. ఫోటోలు చూసి ఫోటో షాప్ ద్వారా మలిచినవిగా పొరబడడానికి వీలుంది. ఈ ఫోటోలు తీసిన కాలానికి ఫోటో షాప్ ఇంకా కనిపెట్టలేదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సర్రియలిస్టు ఫోటోలు సృష్టించడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద సెట్టింగులు సృష్టించి ఫోటోలు తీయడం ఈమె/ఈ కళలో ప్రత్యేకత. ఈ సెట్టింగ్ లు ఏర్పాటు చేయడానికి ఈమెకి ఒక్కోసారి నెలల తరబడి సమయం పట్టేదిట. ఒక్కే వస్తువుతో దృశ్యం అంతా నింపటం, పూర్తిగా పరస్పర…

ఫేస్‌బుక్, గూగుల్ లపై ‘అశ్లీలత’ కేసులు

ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ తదితర ఐ.టి సంస్ధలతో పాటు మొత్త ఇరవై ఒక్క సామాజిక వెబ్ సైట్లను వివిధ నేరాల క్రింద ప్రాసిక్యూట్ చెయ్యడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ తరగతుల ప్రజానీకం మధ్య శతృత్వాన్ని పెంపొందించడం, అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చెయ్యడం లాంటి నేరాలకు సాక్ష్యాలు ఉన్నందున సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లను ప్రాసిక్యూట్ చెయ్యవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది. శుక్రవారం…

విల్స్ ‘గీకుడు’ చిత్రకళ -ఫొటోలు

ఇది ‘గీకుడు’ (స్క్రాచింగ్) చిత్ర కళ. పేలుడు చిత్ర కళకి పూనుకున్న లండన్ యువ కళాకారుడు ‘విల్స్’ దీనికీ పూనుకున్నాడు. గోడలను గీకి తాను తెప్పించదలుచుకున్న రూపాల్ని విల్స్ తెప్పిస్తాడు. గీకడం అంటే చేతుల్తొనో, చిలపెంకుతోనో గీకడం కాదు, ఏకంగా విద్యుత్ రంపాలతో, సుత్తులతో గీకడమే. మాస్కో నగరం గోడలపైన గీకిన చిత్రాల్ని ఇక్కడ చూడవచ్చు. – –

‘ఔట్’ కాదిక ‘ఇన్’ సోర్సింగ్ -ఒబామా

ఎన్నికలు సమీపించే కొద్దీ అమెరికా అధ్యక్ష పదవి పోటీదారులు తమ అసలు రూపాల్ని బైటపెట్టుకుంటున్నారు. ఆర్ధిక సంక్షోభం, ఓటమి అంచున ఉన్న యుద్ధాలు, జడలు విప్పుతున్న నిరుద్యోగం మున్నగు సమస్యలు విజయావకాశాలను దెబ్బతీస్తున్న పరిస్ధితిని ఒబామా ఎదుర్కొంటున్నాడు. దానితో తాము మూడో ప్రపంచ దేశాల కోసం ప్రదిపాదిస్తూ వచ్చిన ‘గ్లోబలైజెషన్’ విధానాలకు కూడా తమ దేశం వరకూ తిలోదకాలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. – –

పేలుడు కళ -వీడియో (మిస్ అవద్దు)

కళలు అరవై నాలుగు అని పెద్దలు సూత్రీకరించారు. కాని హద్దుల్లేని సృజనాత్మకత ఎన్ని కళలకైనా జన్మనిస్తుందని ఏ పేలుళ్ళ కళ సూచిస్తోంది. పేలుళ్ళతో మానవ హననం జరుగుతుందని ఇప్పటివరకూ తెలిసిన నిజం. పేలుళ్ళతోనూ కళా సృష్టి కూడా జరుగుతుందని వీధి చిత్ర కళాకారులు వీడియో సాక్షిగా చూపిస్తుంటే కాదని అనగలమా? “ఎక్స్‌ప్లోజివ్ ఆర్ట్” అని చెబుతున్న ఈ కళను చూడండి. ఈ కళ సృష్టికర్త లండన్ నివాసి అలక్జాండ్రే ఫార్టో. 1987 లో ఈయన జననం. నిండా…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు

ఉద్యమాలు సృజనాత్మకతకు కేంద్రాలుగా భాసిల్లడం అనాదిగా వస్తున్న చరిత్ర. ఉద్యమాలకు ఉండే వివిధ అవసరాలు సృజనాత్మకతకు పదును పెడుతుంటాయి. వందలు, వేల మందిని ఆర్గనైజ్ చెయ్యవలసిన పరిస్ధితుల్లో ఒకరు వందల మందితో, తిరిగి వందలమంది ఒకరితో సంభాషించవలసిన పరిస్ధితుల్లో, దూరంగా ఉంటూ పరస్పరం సంభాషించుకోవలసిన పరిస్ధితుల్లో సైగల భాషకు ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం జన్మనిచ్చింది. జన్మనిచ్చింది అనడం కంటే పదును పెట్టింది అనడం సరిగా ఉంటుంది. ‘ఆకుపై’ ఉద్యమాలకు మైక్ పర్మిషన్ ఇవ్వని పరిస్ధుతులనుండి ‘హ్యూమన్…

యూరప్ రేటింగ్ – ఇండియాపై ప్రభావం

అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలకు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను కట్టిపడేయడం వల్ల అక్కడ ఏం జరిగినా భారత్ పై ప్రభావం తధ్యం. గ్లోబలైజెషన్ ఆర్ధిక విధానాల దుష్ఫలితం ఇది. ‘రష్యా, చైనాల్లో వాన కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారు’ అని గతంలో ఎద్దేవా చేసేవారు. ఇపుడు అమెరికా, యూరప్ లకి జలుబు చేస్తే ఇండియా ఆర్ధిక వ్యవస్ధకి ఏకంగా జ్వరమే తగులుకుంటోంది. తీవ్ర సంక్షోభాలు తలెత్తితే జ్వరమే కాక ఏకంగా…

యూరప్ ‘బెల్ట్ టైటెనింగ్’ -కార్టూన్

యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ జర్మనీ గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే…

ఫ్రాన్స్ సహా 9 యూరో దేశాల రేటింగ్ కట్

యూరప్ రుణ సంక్షోభం కొనసాగుతోంది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభం నుండి బైటికి వచ్చే సూచనలు సమీప భవిష్యత్తులో లేవని తొమ్మిది యూరో జోన్ దేశాల అప్పు రేటింగ్ ను తగ్గించడం ద్వారా ప్రముఖ రేటింగ్ సంస్ధ స్టాండర్ట్ & పూర్ (ఎస్ & పి) క్రెడిట్ రేటింగ్ సంస్ధ స్పష్టం చేసింది. యూరో జోన్ ఉనికి ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశాల్లో ఒకటైన ఫ్రాన్సు రేటింగ్ సైతం ఎస్ & పి తగ్గించి సంక్షోభం…

స్పెయిన్ వీధి శిల్పకళ -ఫొటోలు

ఈ వీధి శిల్పాలు స్పెయిన్ దేశ శిల్పి ‘ఐజక్ కోర్డల్’ నెలకొల్పినవి. గాలీషియా నగరానికి చెందిన ఈయన స్పెయిన్ రాజధాని ‘బార్సిలోనా’ ఈ శిల్పాల్ని నెలకొల్పాడు. వివిధ చోట్ల కనిపించే కాంక్రీటు నుండి ఈ శిల్పాలను ఐజక్ రూపొందించాడు. కొన్ని అక్కడికక్కడే రూపొందించిన శిల్పాలు కాగా మరికొన్ని వేరే చోటి నుండి తెచ్చిన కాంక్రీటునుండి రూపొందించిన శిల్పాలు. చిన్న చిన్న మానవ రూపాలను కాంక్రీటు నుండి మలచడంలో దిట్ట ‘ఐజక్ కోర్డల్’. రంగు లాంటి అంశాల్లో పూర్తి…

కోల్ కతా ఆసుపత్రుల దుర్మార్గం

కోల్ కతా ప్రవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి అనేకమంది రోగులు మరణించిన ఘటన మరవక ముందే మరో దుర్మార్గం జరిగింది. ఈ సారి దుర్మార్గం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వంతయ్యింది. నిండు గర్భిణితో వచ్చిన ఓ స్త్రీని ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో ఆమె ఒక్కో ఆసుపత్రి బయట ఒక్కొక్క బిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది. కోల్ కతా లో ఆసుపత్రుల దుర్మార్గం వెల్లడిస్తూ గత కొద్ది రోజుల్లోనే జరిగిన ఘటనల్లో ఇది రెండవది. తమ వద్దకు…

‘వేడి వేసవులే’ ‘తీవ్ర శీతలాలకి’ కారణం

ఉత్తరార్ధ గోళంలో వేడి వేసవి కాలాలు అమెరికా, యూరప్ లలో తీవ్ర చలితో కూడిన శీతాకాలాలకు కారణం అవుతున్నాయని అమెరికా అధ్యయన సంస్ధ ఒకటి తెలిపింది. ‘ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్ లెటర్స్’ అనే పత్రికలో శుక్రవారం  ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. మంచు తుఫాన్లు, శీతాకాలంలో తీవ్రమైన చలితో కూడిన టెంపరేచర్లు గత రెండు సంవత్సరాలలో అమెరికా, యూరప్ లలోని కొన్ని ప్రాంతాల్లో అనేక సమస్యలను సృష్టించాయి. భూమి వేడెక్కుతోందని ఓ పక్క శాస్త్రవేత్తలు గోలపెడుతుండగా ఎదురుగా ఎవరున్నదీ…