అమెరికా రాయబారి రాకను వద్దన్న పాక్

అమెరికా ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్‌మన్, తాను పాకిస్ధాన్ సందర్శిస్తానని కోరగా, ‘ఇప్పుడు వద్దు’ అని నిరాకరించి, పాకిస్ధాన్ సంచలనం సృష్టించింది. పాకిస్ధాన్ కి చెందిన సీనియర్ అధికారి ఒకరి ఈ సంగతి వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఇది సూచిస్తోంది. రాయబారిని రావొద్దని కోరడానికి గల కారణాలను పాక్ అధికారి వివరించలేదు. “రాయబారి గ్రాస్‌మన్ పాకిస్ధాన్ సందర్శిస్తానని విజ్ఞప్తి చేశాడు. కాని ఈ సమయంలో ఆయన…

ప్రాణాంతక మధురై జల్లికట్టు -ఫొటోలు

తమిళనాడులొ మధురై సమీపాన ఉన్న అనంగనల్లూరు గ్రామంలో జరిగిన జల్లికట్టు దృశ్యాలివి. ‘జల్లి కట్టు’ పేరుతో ఆంబోతులతో తలపడే ఆచారం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం కాదన్నమాట! ‘ఈ ఎద్దులు మాకు దైవంతో సమానం’ అని జల్లికట్టు జరిగిన ప్రాంగణంలో ప్రదర్శించబడిన ఒక బ్యానర్ చెబుతోంది. దైవం అంటూనె వాటిపై హింసకు పాల్పడడం కేవలం ‘జీవన వైవిధ్యం’ గానో, ‘సంస్కృతి’ గానో చెప్పుకుని సరిపెట్టుకోగలమా? జల్లికట్టు సందర్భంగా క్రీడలో పాల్గొన్న వారు యూనిఫారం ధరించారు. యూనిఫారం…

‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం

గుజరాత్ రాష్ట్ర లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతామని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గుజరాత్ హై కోర్టు తన మెజారిటీ తీర్పు ద్వారా లోకా యుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. గుజరాత్ గవర్నర్ కమ్లా బేనివాల్ గత సంవత్సరం ఆగష్టులో…

గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ

గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ పూనుకుని, స్వతంత్రంగా చేసిన లోకాయిక్త నియామకం చెల్లదనీ, అది రాజ్యంగ వ్యతిరేకం  అని వాదిస్తూ గజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు, మెజారిటీ తీర్పు ద్వారా కొట్టి వేసింది. గుజరాత్ గవర్నర్ ‘కమ్లా బెనీవాల్’ ఆగష్టు 25, 2011 తేదీన రిటైర్డ్ జస్టిస్ ఆర్.ఎ.మెహతా ను గుజరాత్ ‘లోకాయుక్త’ గా నియమించింది.…

వైట్ హౌస్‌పై పొగ బాంబు విసిరిన నిరసనకారులు

అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోకి మంగళవారం ఆకుపై ఉద్యమకారులు పొగబాంబు విసిరి సంచలనం సృష్టించారు. ఈ సంఘటనతో వైట్ హౌస్ ని తాత్కాలికంగా మూసివేశారు. వైట్ హౌస్  చుట్టూ ఉన్న కంచె పై నుండి ఈ పొగబాంబు విసిరినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ వార్తా పత్రిక ఈ వార్తను ప్రచురించింది. వెయ్యిమందికి పైగా ఉన్న నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. వైట్ హౌస్…

‘ఎల్ మేక్’ వీధి పోర్ట్రయిట్లు -ఫొటోలు

‘ఎల్ మేక్’ అమెరికా దేశస్ధుడు. 1980 లో జననం. చిన్నతనం నుండీ బొమ్మలు గీస్తూ స్వతంత్రంగా అధ్యయనం చేస్తూ వచ్చాడట. మనుషుల బొమ్మలు ముఖ్యంగా ముఖాలపైన ఇతను ప్రధానంగా కేంద్రీకరించినట్లు కనపడుతోంది. మెక్సికో, అమెరికాల సంస్కృతి నుండి స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పుకున్నాట్లు తెలుస్తొంది. నైరుతి అమెరికా సంస్కృతి, మతపరమైన చిత్రలేఖనం, గ్రాఫిటి లతో పాటు అనేక రకాల సాంప్రదాయక చిత్ర కళను ఈయన అధ్యయనం చేశాడు. అనేక దేశాల్లో ఈయన వీధి చిత్రాలు గీసాడు. మెక్సికో,…

వ్యవసాయ సబ్సిడీలు, దళారీ వ్యవస్ధ

(“‘ఎస్&పి’ తాకి ‘ఇ.యు’ ఓడ మునక” పోస్టు కింద సంజయ్ గారు ఓ వ్యాఖ్య రాశారు. వ్యాఖ్యలో ఫస్ట్ పోస్టు వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ లింక్ ఇస్తూ విశ్లేషించమని కోరారు. సంజయ్ గారి కోరిక మేరకు ఈ ఆర్టికల్ రాసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) నూతన ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులకు హాని చేస్తున్నాయన్న నిజాన్ని మరుగుపరచడానికి ఇటువంటి అర్ధ సత్యాలతో కూడిన వాదనలు చాలా వ్యాప్తిలోకి తెచ్చారు. ‘ఫస్ట్ పోస్టు’ ఆర్టికల్ లోనే…

బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ ఆలీకి 70 -ఫొటోలు

“రాకాసి మొసలి తో కుస్తీ పట్టా. తిమింగలంతో కలబడ్డా, గత వారమే ఓ బండరాయిని చంపేశా. మరో రాయిని మోది గాయపరిచా, ఇటుకని ఆసుపత్రి పాల్జేశా. నేనెంత క్షుద్రుడ్నంటే నన్ను చూస్తే మందులకి కూడా జబ్బొస్తుంది.” లెజెండరీ బాక్సర్ మహమ్మద్ ఆలీ చెప్పిన మాటలివి. తన ఏనుగు బలంపై అయనకెంత నమ్మకమో ఈ మాటలే చెబుతాయి. ఆ నమ్మకమే లేకుంటే లెజెండ్ గా ఎలా మారగలడు? నిజమో కాదో తెలియదు కాని మహమ్మద్ ఆలీ కవిత్వం కూడా…

విషమ షరతుల భారత్ అప్పు, ప్రాజెక్టుల రద్దు యోచనలో బంగ్లాదేశ్

భారత ప్రభుత్వం ఇస్తున్న అప్పుతో పాటు అది విధించిన విషమ షరతులను అమలు చేయలేక బంగ్లాదేశ్ ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులను రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతోంది. బంగ్లాదేశ్ లో చౌకగా దొరికే ఇసుక, ఇటుకలను కూడా భారత దేశంనుండే దిగుమతి చేసుకోవాలను భారత ప్రభుత్వం షరతులు విధించడంతో దానికంటే ప్రాజెక్టులు రద్దు చేసుకోవడమే మేలని బంగ్లాదేశ్ ప్రభుత్వం తలపోస్తున్నది. ఇదే రకమైన అప్పుల్ని అమెరికా, యూరప్ లనుండి తీసుకుని ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపిన భారత ప్రభుత్వాలు…

రాజీనామాకి సిద్ధపడ్డ పాక్ ప్రధాని గిలాని

న్యాయ వ్యవస్ధ నుండి ఎదురవుతున్న ఒత్తిడితో ప్రధాని పదవికి రాజీనామా చేయడాని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని సిద్ధపడ్డాడు. కోర్టుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు గానూ ‘కోర్టు ధిక్కార నేరం’ విచారణ కోసం బుధవారం తన ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు సమన్లు జారీ చెయ్యడంతో పాక్ ప్రధాని తాజా ప్రతిపాదన చేశాడు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ పై నమోదైన అవినీతి కేసులను గత ముషర్రాఫ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆఫ్ఘనిస్ధాన్…

ఇటలీ లగ్జరీ ఓడ మునక –ఫోటోలు

‘కోస్టా కంకోర్డియా’ పేరు గల ఓడ ఇటలీ సముద్ర జలాల్లో ఒరిగిపోయి మునిగిపోయింది. 4,200 మందిని ఒరుగుతున్న ఓడ నుండి రక్షించగా ఆరుగురు చనిపోయినట్లు ఇప్పటివరకూ తేలింది. ఓడ కెప్టెన్ తనకు నిర్దేశించబడిన మార్గం నుండి అనుమతి లేకుండా పక్కకు వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఓడ సొంత దారు చెబుతున్నాడు. ప్రయాణీకులు రక్షించబడకుండానే ఓడను వదిలేవేళ్ళాడని కేప్టేన్ విచారణను ఎదుర్కొంటున్నాడు. అలా వెళ్ళడం ఇటలీ ఓడ నియమాలకి విరుద్ధం. శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఓడ…

ఆల్ ఖైదా చేతుల్లోకి యెమెన్ పట్నం

ప్రజాస్వామిక సంస్కరణల కోసం ప్రజలు గత సంవత్సర కాలంగా ఉద్యమిస్తున్న యెమెన్ దేశంలో ఆల్ ఖైదా ఓ పట్నం వశం చేసుకున్నట్లు  వార్తా సంస్ధలు వెల్లడించాయి. యెమెన్ రాజధాని సనా కు దక్షిణాన వంద మైళ్ల దూరంలో ఉన్న రడ్డా పట్నాన్ని ఆల్ ఖైదా మిలిటెంట్లు తమ వశంలోకి తెచ్చుకున్నారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. యెమెన్ ప్రభుత్వ బధ్రతా బలగాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వార్తా సంస్ధలు ప్రచురించాయి. పట్టణంలో కాపలాగా ఉన్న సైనిక బలగాలపై ఆల్…

చెన్నై (ఛేపక్) అగ్నిప్రమాదం -ఫొటోలు

ఆదివారం ఆర్ధ రాత్రి (సోమవారం తెల్లవారు ఝాము) ఛేపక్ (చెన్నై) లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పుతున్న సిబ్బందిలో ఒకరు దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్, సోషల్ వెల్ఫేర్ కార్యాలయాలున్న భవనం ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బ తింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. మొదటి అంతస్ధులో మంటల్ని చూసిన వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద…