ప్రవీణ్! మీరు మారాలి


ప్రవీణ్ గారికి ఇది నా బహిరంగ లేఖ. ఇది సలహా, విన్నపం, కోరిక ఎలా తీసుకున్న ఫర్వాలేదు.

గత రెండు రోజులుగా నా బ్లాగ్ లో కొన్ని అంశాలపై చర్చ జరుగుతోంది. నా బ్లాగ్ లో ఉంచుతున్న బూతు వ్యాఖ్యాతల ఐ.పి లను బహిరంగ పరుస్తూ నేను రాసిన టపాకు పెద్దలు, మిత్రులు, విజ్ఞులు స్పందించారు. చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. (అందరికీ కృతజ్ఞతలు) అందరూ కాకపోయినా కొందరైనా బ్లాగుల్లో బూతుల్ని ఖండించారు. చర్చకు అనుమతిస్తున్నపుడు చర్చ చేయడం వదిలి పెట్టి బూతుల్లోకి దిగడం మర్యాద, సభ్యత, సంస్కారం కాదన్నారు.

ఈ చర్చ సందర్భంగా మీ విషయం ప్రముఖంగా చర్చకు వచ్చింది. అందులో మీరూ పాల్గొన్నారు. బ్లాగర్లలో ఓ వ్యక్తి మీ పై దుష్ప్రచారం చేశారని మీరు చాలా కాలం నుండి ఆరోపిస్తున్నారు. మీపై జరిగిన బూతు దాడికి సాక్ష్యాలు చూపారు. ఫలానా పేరు కింద బూతులు రాసినట్లు చూపించండి మర్యాదస్తులు సవాలు విసిరారు. అజ్ఞాత పేర్లతో ఇవి జరుగుతున్నందున సాక్ష్యాలు చూపే పరిస్ధితిలో ఎవరూ లేరు. మీరు కూడా.

మీరు అతని తల్లిగారిని నేరుగా పేరు పెట్టి సంభోధిస్తూ బూతులు తిడుతూ వీడియో రూపొందించారని ఆరోపణలు మీపైన వచ్చాయి. ఆ విషయాన్ని మీరే స్వయంగా ధృవపరిచారు. ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. మీరిలా చేయగలరని నేను ఊహించలేదు. సమాజంలో స్త్రీల స్ధితిగతులపైన మీకు ఉన్న అభ్యుదయ భావాల నేపధ్యంలో ఇది ఇంకా తీవ్రమైన సంగతి.

అభ్యుదయ భావాలు, ప్రగతిశీల భావాలు, రేడికల్ ధింకింగ్ తదితర పేర్లతో ప్రస్తావించుకుంటున్న భావజాలం దానికదే అభ్యుదయకరంగా మనజాలదు. ఒక చోట కదపకుండా ఉంచి పూజించడానికి ఆ భావజాలం దేవాలయంలోని దేవుడి విగ్రహం లాంటిది కాదు. నెలకో సంవత్సరానికో బైటికి తీసి దుమ్ము దులిపి ప్రతిష్టించుకునే ఉత్సవ విగ్రహం కాదు. పండితులు లేదా మేధావుల చర్చలకు మాత్రమే పరిమితం అయ్యే గ్రంధ పఠనాంశం కాదు.

అభ్యుదయ భావజాలం అన్నది సామాజిక జీవన విధానం. మన జీవితాల్లోని ప్రతి అడుగులోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి మలుపులోనూ అన్వయించి ఆచరించాల్సిన భావ జాలం అభ్యుదయ భావజాలం. అది మార్క్సిజం-లెనినిజం కావచ్చు. స్త్రీ పక్షపాత ఆలోచనా విధానం కావచ్చు. నవ్య మానవతా వాదం, నవీన స్త్రీ వాదం, హెగెల్ భావ వాదం… ఇలా ఏదైనా కావచ్చు. ఆయా సిద్ధాంతాలపైన ఉండే నమ్మకం, ఇష్టం అన్నీ మన జీవితాల్లోని ప్రతి చర్యలోనూ ప్రతిబింబించాలి. అది లేకుండా అభ్యుదయ భావజాలం తనకుంది అని చెప్పుకునే వారు ఎవరి వల్లా సమాజానికి కాణీ లాభం చేకూరదు.

ఏ అభ్యుదయ భావజాలమైనా సామాజికా ఆచరణకి పెట్టకుండా సంపూర్ణ సిద్ధాంతంగానో, అభ్యుదయకర సిద్ధాంతంగానో నిలవ జాలదు. సగటు జీవికి నిత్యం అనేక కష్టాలు ఎదురవుతుంటాయి. ఒక కష్టం తర్వాత మరొక కష్టం ఎదురవుతుంది. ఈ కష్టాలను చూపి అభ్యుదయ భావజాల ఆచరణను వాయిదా వేయదలిస్తే, అది అభ్యుదయత, ప్రగతిశీలత కాబోదు. మీకు వచ్చిన అనేకానేక చిన్నా పెద్దా కష్టాల్లో బ్లాగు కష్టాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ అతీతంగా అభ్యుదయ భావజాల ఆచరణ ఉండాలి. ఆచరణలో లేని భావజాలం మదిలో ఉన్నా వ్యర్ధమే.

“సిద్ధాంతం లేని ఆచరణ, ఆచరణలో లేని సిద్ధాంతం” రెండూ వ్యర్ధమే అని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ‘మావో సేటుంగ్’ అన్న సంగతి మీకీ సందర్భంగా గుర్తుకు తెస్తున్నాను. మానవ సమాజ నాగరికతా పరిణామ క్రమంలో మనిషి జ్ఞానాని అభివృద్ధి చేసుకున్నాడు. ప్రగతిశీల భావజాలం ఆ జ్ఞానంలో భాగమే. మానవ నాగరికత నుండి ఉద్భవించిన భావజాలాన్ని తిరిగి మానవ సమాజానికే ప్రయోగించాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు అర్ధం అయి ఉండాలి.

నమ్మకంలో, మాటల్లో స్త్రీలపట్ల గౌరవ భావనలు ప్రకటిస్తూ తనకు సంబంధించినంతవరకూ మినహాయింపులు ఇవ్వాలని మీరు కోరజాలరు. బూతులు అన్నవే నేరుగా స్త్రీలను ఉద్దేశించి ఉండేవి. తిడుతున్నది మగవారినైనా అక్కడ ఘటనలతో ఏ మాత్రం సంభందం లేని సంబంధిత ఆడవాళ్ళని అవి బజారుకీడుస్తాయి. కనుక బూతులు తిట్టరాదని నమ్ముతున్న మీలాంటివారు, స్త్రీల అణచివేత గురించి మాట్లాడే మీలాంటివారు బూతులు వాడడం సరైంది కాదు.

చర్చల్లో పాల్గొన్న వారిలో అత్యధికులు మీ పద్ధతులపైన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. మిమ్మల్ని సమర్ధించడం వల్ల ‘నా విశ్లేషణ శక్తి’ పైనే అనుమానాలు వస్తున్నాయని ఒక బ్లాగర్ సీరియస్ గా స్పందించారు. నా పద్ధతులపైన రాజీ పడుతున్నానని కూడా వారు అన్నారు. ఇందరు చెబుతున్నప్పటికీ అలాంటిదేమీ లేదని నేను భావించడం సాధ్యం కాదు. మీరు స్వయంగా ధృవపరిచినందున మీ బూతు వీడియోలు నిజమేనని అర్ధం అవుతోంది. ఇది మీకు తగనిది. ఓ వైపు స్త్రీల పక్షపాత ధోరణులను ప్రమోట్ చేస్తూ మీరు స్వయంగా స్త్రీలను తిట్టడం పూర్తిగా అంగీకార యోగ్యం కాదు.

వీడియోల ద్వార మీరు చేస్తున్న వృధా ప్రయత్నాలని మీరు ఆపాలి. మీ వీడియోల దార వాతావరణం మరింత కలుషితమైందని మీరు గుర్తించాలి. బూతు ధోరణులను ఆపడానికి మొదటి అడుగు మీదే ఎందుకు కాగూడదు?

[ఈ టపాతో నా గత టపాలు రద్దయినట్లు కాదు. నేను ముందు రాసిన టపాలకు ఈ టపా కొనసాగింపు మాత్రమే. ప్రవీణ్ మారాలని నేనంటే మారవలసిన అంశాల్లో మారాలని కొరుతున్నట్లే. ఆయనకి నేనిస్తున్న విచక్షణా పూరిత మద్దతు (Discretionary support) కొనసాగుతుంది.]

150 thoughts on “ప్రవీణ్! మీరు మారాలి

 1. శేఖర్ గారూ,
  నిన్న రాత్రి నుంచే బ్లాగుల్లో పరస్పరం ఈ విషయం పైన జరుగుతున్న చర్చను కాస్త నిశితంగా ఫాలో అవుతున్నాను. పాల్గొనలేకపోవడానికి సకారణం ఉంది. మీరు తేనెతుట్టెను కదిపిన తర్వాత బ్లాగులోకి ఇలా వచ్చి అలా వెళ్లడం ఈ ప్రత్యేకాంశం వరకు సరైనది కాదని, అలా సాధ్యపడదని బోధపడింది.

  ఇరుపక్షాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడానికి ఈ చర్చ ఎంత చిన్నస్థాయిలో మొదలై విస్తృత రూపం దాల్చినా నేను పాల్గొనలేకపోయాను. ముందే ఒప్పుకున్న ఒక అనువాద పనిని అనివార్యంగా శనివారం, ఆదివారం ఇప్పటివరకు చేయవలసి రావడమే దీనికి కారణం. నిన్న రాత్రి చర్చలో అటు ఇటు పోస్ట్‌లు అలా చూసి అన్నీ కాపీ చేసుకుని మళ్లీ నా పనిలో పడిపోయాను. ఇది అనివార్యమైన పని అని మళ్లీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.

  ఈ చర్చ లేవదీశాక ఒక రోజు మొత్తంగా మీరు దీనికి కేటాయించారు. ఇప్పటికీ ఇది రగులుతూనే ఉంది. అటువైపూ, ఇటువైపూ కూడా. కాని ఈ చర్చలో అతి ప్రధాన భాగస్వామిగా ఉండవలసిన ప్రవీణ్ ఒరిస్సా గ్రామానికి ప్రయాణమై చర్చలో భాగం కాకుండా పోయారు.

  ఈ చర్చ కొత్తది కాదని అందరికీ తెలుసు. గత మూడేళ్లుగా ప్రవీణ్ వర్సెస్ ఇతరులకు లేదా ఇతరులు వర్సెస్ ప్రవీణ్‌కు మధ్య జరుగుతున్న భీకర దూషణలు ప్రతిదూషణలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, వ్యక్తి విధ్వంసక చర్చలు అన్నీ కాకపోయినా బ్లాగర్లలలో చాలామందికి తెలిసే ఉంటుంది.

  నేను గత రెండు, మూడు రోజుల చర్చను ఇప్పటికీ పూర్తిగా అనుసరించలేదని చెబుతున్నాను. కాబట్టి సాధికారంగా ఏది తప్పు, ఏది ఒప్పో నిగ్గు తేల్చడానికి నేను వెళ్లలేను.

  కాని ఒక్క మాట అత్యంత స్పష్టంగా నా వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. బ్లాగుల్లో ప్రవీణ్ వ్యాఖ్యలు, వెంటనే తనను గేలిచేస్తూ, ఆటాడుకుంటూ చేసే ప్రతి వ్యాఖ్యలు చదవడం ద్వారా మాత్రమే ప్రవీణ్‌తో నాకు పరిచయం. ఇది కూడా అరుదుగా మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ కెలుకుడు, కెబ్లాస, ప్రమదావనం, ప్రమోదవనం వంటి బ్లాగులను తరచుగా చూసే అవకాశం కూడా నాకు లేదు.

  బొందలపాటి ప్రసాద్ గారి, మీ బ్లాగులో తప్పితే ఈ మధ్య కాలంలో -అంటే గత నాలుగైదు నెలలుగా- బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. లేక లేక శాస్త్ర విజ్ఞానము బ్లాగులో శ్రీనివాస చక్రవర్తి గారు ప్రచురించిన ‘భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం’ అనే ఇటీవలి కథనంపై కూడా ప్రవీణ్ వ్యాఖ్యలు పెట్టిన తర్వాతే అది రసాభాసగా మారింది.

  ప్రవీణ్‌పై ఇతరులు ముందే ఏర్పర్చుకున్న నిర్ధారణలు కానివ్వండి, తన వ్యాఖ్యలలో చాలా తరచుగా కనిపించే రెచ్చగొట్టు ధోరణి కాని అతడికి బ్లాగ్ ప్రపంచంలో కాస్తంత గౌరవాన్ని కూడా మిగలనివ్వడం లేదనిపిస్తోంది. కారణాలు ఏవైనా కానివ్వండి ఏళ్ల తరబడి బ్లాగులలో తన వ్యాఖ్యలు నెగటివ్ ఫలితాలు ఇస్తున్నాయని తెలిసి కూడా తన పంధాను మార్చుకోవడం, తన భావాలను, వ్యాఖ్యలను సమర్థించని వారితో పోటీ పడుతూ పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు పెడుతూ, తిడుతూ, తిట్టించుకుంటూ, కెలుకుతూ కెలికించుకుంటూ ఉండటం నాకు తెలిసి ఏ బ్లాగరు కూడా ఇంత సాహసానికి పూనుకోలేదనిపిస్తుంది. విలువైన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో కూడా అవి పక్కకు పోయి మళ్లీ కెలకడం అనేదే ముందుకొస్తున్నప్పుడు దాంట్లో ఇతరుల లోపాలను ఎన్నడానికి ముందు, మనలోకి మనం చూసుకోవడం చాలా ముఖ్యం అవసరమైనది కూడా.

  మీరు ప్రగతి శీలవాదులా, స్త్రీ వాదులా, కమ్యూనిస్టులా, మావోయిస్టు సమర్థకులా లేదా మరొకటా అనేది ఇక్కడ అప్రస్తుతం. కాని దుర్భాషను వాడటంలో మీరు ఇతరులతో పోటీ పడ్డాక, పేరడీలతో స్త్రీలను కించపర్చే వీడియోలు రూపొందించడానికి మీరూ సిద్ధమైపోయాక, వాడటానికి వీల్లేని భాషను మీరూ మనుషులపై ప్రయోగించడం మొదలెట్టాక మీరు విలువల గురించి మాట్లాడే, చెప్పుకునే నైతిక అర్హత ఆ క్షణం నుంచే కోల్పోతారని, కోల్పోయారనే నేను అనుకుంటున్నాను.

  మీ పాత్రల్లోని వదిననో, లేదా మీ స్వంత వదిననో అసభ్యంగా వ్యాఖ్యానించడం ఎంత తీవ్రమైన తప్పో మీరు సీతా మహాలక్ష్మి అనే ఒక సజీవవ్యక్తిని గురించి ఆ విధంగా వ్యాఖ్యానించడం క్షమించరాని తప్పు. మూడేళ్లు మీపై దాడులు, వ్యక్తిగత దూషణలు పట్ల సహనం వహించి చివరికి ఈ రూపంలో దాడి మొదలుపెట్టానని మీరే చెప్పుకున్నారు. కాని మీరు సహనంగా లేరని, ఎప్పటికప్పుడు మీ ప్రత్యర్థులకు రిటార్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది.

  మాటవరసకు నూటికి నూరు శాతం మీ ఈ ప్రకటన నిజమైందే అనుకుందాము. కాని సహనం కోల్పోవడం అనేది ఈ రూపంలో వ్యక్తీకరించబడవచ్చా? ముఖ్యంగా నవీన స్త్రీవాదం అనే భావనకు సమర్థకులుగా ఉంటూ రాస్తూ వస్తున్న మీరు మీ ‘శత్రువు’ కుటుంబం మీద అయినా సరే… ఈ రకం దాడికి దిగవచ్చా?

  ఇది సరైందే అని మీరు భావిస్తున్నట్లయితే మీకూ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లు మీ పట్ల వ్యవహరిస్తున్న తీరు, మీతో ఆటాడుకుంటున్న తీరు సరైంది కాదని కొంతమందైనా భావిస్తున్నప్పుడు ఇన్నేళ్ల ‘సహనం’ తర్వాత మీరు తీసుకున్న అత్యంత గర్హనీయమైన చర్యకు పాల్పడ్డాక మిమ్మల్ని సకారణంతో సమర్థించే కొద్దిమందిని కూడా మీరు దూరం చేసుకుంటున్నారు.

  మీరు నూతనంగా అవలంబించిన ఈ ధోరణిని, ఈ రకమైన దాడిని ఏ రకంగా కూడా సమర్థించడమే పెద్ద తప్పు అవుతుంది.

  మీరు పల్లెనుండి తిరిగి వచ్చిన తర్వాత అయినా సరే సీతామహాలక్ష్మిగారిపై వ్యాఖ్యకు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఇంతకుమించి మీకు ఏ సలహా ఇచ్చినా నేను నిజాయితీతో వ్యవహరించనట్లే లెక్క.

  మీరు నిజంగా ఈ సలహాలను పాటించి బేషరతుగా క్షమాపణ చెప్పినా మీకూ, ఇతరులకు మధ్య ద్వేష భావం ఘనీభవించిపోయిన స్థితిలో అద్భుతాలు జరుగుతాయని ఆశించకండి. మీ క్షమాపణతో అవతలివారు మీ పట్ల తమ ధోరణిని మానుకుంటారని, వారూ కాస్త తగ్గుతారని కూడా అనుకోనవసరం లేదు. ఎందుకంటే ఇది స్పష్టంగా రెండు భిన్న భావజాలాల మధ్య చర్చలు, విభేదాలతో మొదలై వ్యక్తి హననాలవరకు సాగిన, సాగుతున్న తీవ్ర ఘర్షణల క్రమంతో ముడిపడివుంది. ఇది ఆరటం, చల్లబడటం అంత సులభం కాదు.

  “వీడియోల ద్వారా మీరు చేస్తున్న వృధా ప్రయత్నాలని మీరు ఆపాలి. మీ వీడియోల ద్వారా వాతావరణం మరింత కలుషితమైందని మీరు గుర్తించాలి. బూతు ధోరణులను ఆపడానికి మొదటి అడుగు మీదే ఎందుకు కాగూడదు?”

  శేఖర్ గారి మాటను పాటించి ఆ మొదటి అడుగు మీరే వేయండి. ఇది మీ వ్యతిరేకులు, విమర్శకుల ముందు తల వంచినట్లు కాదు. మీ వ్యక్తిత్వాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసిన కనీస ప్రయత్నం అనుకోండి.

  అలాగే దయచేసి ఇకనుండి మీరు ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టడం కూడా తగ్గించుకోవాలని నా సలహా. ప్రధానంగా చరిత్రను, సంప్రదాయాలను, విశ్వాసాలను చర్చిస్తున్నప్పుడు వీలైనంత సంయమనం పాటించగలరని అభ్యర్థన. నేను 13 ఏళ్లు ఉద్యమాల్లో పనిచేశాను. చర్చల ద్వారా వెలుగు రావాలి కాని వేడి పుట్టకూడదన్నది నా ఆచరణలో నేను నేర్చుకున్న పాఠం. కాని తెలుగు బ్లాగుల్లో వేడి రగులుతోంది కాని వెలుగు పుట్టడం లేదు. ఆ వేడికి ప్రధాన కారకుల్లో మీరూ ఒకరు కావడమే బాధాకరం.

  మంచుపల్లకీ గారు మూడేళ్ల క్రితం అన్నట్లు మీరు మీ బ్లాగులో లేదా బ్లాగుల్లో మీరు విశ్వసిస్తున్న అంశాలపై రచనలు చేయడంపైనే దృష్టిపెట్టండి. మీ భావాలను నమ్మేవారు వాటిని చదువుతారు, ఆలోచిస్తారు లేదంటే ఊరకుండిపోతారు. ప్రధానంగా మీపై వస్తున్న రెచ్చగొట్టే, ఏడ్పించే, ఆటాడుకునే వ్యాఖ్యలకు మీరు తక్షణ స్పందనకు పూనుకోవద్దు.

  మూడేళ్లుగా మీ వ్యతిరేకులు లేదా విమర్శకులు మీతో ఆటాడుకుంటున్నారు. చెప్పి మరీ ఆటాడుకుంటున్నారు. కానీ మీరు గ్రహించక పోవడమే విచారకరం. ఇలాంటి యుద్ధంలో మీరు మరో వందేళ్లు పాల్గొన్నా మీ విశ్వాసాలకు, భావాలకు మీరు ఏ ప్రయోజనం కలిగించలేరు.

  ప్రవీణ్, మీ పరోక్షంలో మీగురించి ఇలా వ్యాఖ్యానిస్తున్నందుకు మన్నించాలి. మీ గురించి వ్యక్తిగతంగా ఈ రోజు వరకు నాకు తెలీదు. కాని నా సలహాను సహృదయంతో ఆలోచిస్తారని అనుకుంటున్నాను.

 2. ప్రవీన్ సంగతి అలా ఉంచండి. మీరు కూడా మీరు వ్రాసే వార్తలకు సంబంధం లేని, అర్ధం లేని వ్యాఖ్యలు ప్రచురించడం మానేస్తారా?

  వ్యాఖ్యల మీదే బ్రతికే జీవులను పోషించడం తగ్గించాలి .

  లేదంటే తాడేపల్లి గారు, సత్యన్నారాయణ శర్మ గారిలా కామెంట్స్ తీసెయ్యాల్సి వస్తుంది మీరు కూడా 🙂

 3. విశేఖర్‌గారు సంఘటన పూర్వాపరాలు తెలుసుకొకుండా ఇలా ఏకపక్షంగా ప్రవీణ్ మీద టపా రాయడం సరికాదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక వ్యక్తి ఒంటరివాడై ఎంత కాలం అని మందితొ పొరాడతాడు. ఎమయినా మీరు ఇలా రాయగలరని నేను ఊహించలేదు. ఇన్నాళ్ళు సపొర్ట్ చేస్తూ వచ్చి ఇప్పుడు నట్టేట ముంచడం వల్ల మీరు అతనికి మంచికన్నా చెడే ఎక్కువ చేసారు అనిపిస్తుంది. మీ నిర్ణయం సరికాదు.

 4. VisLandhra mahasabha admins didn’t allege that I posted irrelevant comments though they disagreed with me. But the kelukudu gang lied every day with same old gramofone records. Why should I change for such people who even dragged my family members in to the issue? Signal in my fone will be cutoff again. I am still at out station.

 5. రాజశేఖర్ రాజు గారి సలహా ప్రవీణ్ పాటిస్తే అతనికి, బ్లాగ్లోకానికీ మంచిదని నమ్ముతున్నాను నేను కూడా!

 6. మీరు నమ్ముతున్న భావజాలం వెలుగులో మాత్రమే మీ నుండి సవరణలు ఆశిస్తున్నాను ప్రవీణ్ గారు. దానితో పాటు బ్లాగుల్లో బూతు ధోరణులు అరికట్టడంలో మీ నుండి పాజిటివ్ స్పందనను నేను ఆశిస్తున్నాను. బూతు ధోరణులకు మీరు మొదలు అని నేను ఆపాదించలేదు. గత టపాల్లో మీకు నేను అందించిన మద్దతు, నేను చెప్పిన పరిమితుల్లో, కొనసాగుతుంది.

 7. సుజాత గారు
  ప్రవీణ్ మీ బ్లాగులొ అసందర్భంగా వ్యాఖ్యలు వ్రాసాడా ? అతను అలా రాసి ఉంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు రాయొద్దని అతనికి చెప్పిండొచ్చు కదా, లేక అతని కామెంట్లను బ్లాక్ చెయ్యవచ్చు కదా ? అతని కామెంట్లు అసందర్భంగా ఉన్నాయనిపిస్తే అతని పేరు చూడగానే అతని కామెంట్ చదవడం మానేయొచ్చు కదా? ఎవరికి నచ్చకపొతే వారు ఇతని కామెంట్లు ప్రచురించకుండా నిలువరించే అవకాశం ఉంది కదా. ఇన్ని అవకాశాలుండగా అవన్నీ వదిలేసి ఇతన్ని అని లాభం ఎమిటి ? మీరు మారకుండా ఇతనే మారాలని ఎందుకు అనుకుంటున్నారు ?

  (వారం క్రితం అతడు రాసిన …)
  ప్రవీణ్ ని ల* కొ* అని బ్లాగులొ పబ్లిగ్గా తిట్టినప్పుడు మీరు ఇదే పని చేసారా? కనీసం ఖండించారా ? మీకు తెలీదని తప్పించుకొవడానికి చూడకండి. ప్రవీణ్ ఎన్నొసార్లు ఈవిషయం బ్లాగర్ల ద్రుస్టికి తెచ్చాడు. మీకు ఒకవైపు బూతులే కనిపిస్తాయా ?


  … ఎడిట్

 8. ప్రవీణ్ లం* కొ* అని తిట్టినందుకు బ్లాగుముఖంగా క్షమాపణ చెబితే ప్రవీణ్ కూడా క్షమాపణ చెబుతాడు.
  విశేఖర్ గారు ముందు ఆపని చేయించండి

 9. @visekhar
  మీరు ఈ వ్యక్తి గురించి ఎంత తక్కువ ఆలొచిస్తే అంతమంచిది , నేను ఈ వ్యక్తి బాదితుడినే .. అసందర్బ వ్యాఖ్యలే ఇతని పని ఏదైనా విష్యంలొ చర్ఛ జరుగుతుందనుకొండి అక్కడ తప్పకుండా ఇతని వ్యాఖ్య ఉంటుంది , అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడొ అర్దంకాదు ! ఇక్కడ నాది ఒక సలహా సులభంగా ఇతని వ్యాఖ్యలని #ignore చేసేయండి లేకపొతే అనుమతించకండి ! అదే ఉత్తమం.

 10. I could count some 20 requests in last few days in this blog from half a dozen different people requesting him to pull those abusive comments on that respected lady that we should treat as our own mother. Till now I didn’t see him conceding to that request (or did I miss it?).

  Sorry…tough for me to believe it is all because he is naive or wounded or both.
  Visekhar gaaru, I truly appreciate your sincere effort and time that you are investing on this issue rather relentlessly. I agree that all sides should concede but he should remove those comments at the minimum.

 11. నో వన్ గారూ,
  సుజాత గారు తన వ్యాఖ్యని తొలగించమని కోరారు. అది సవరించుకొని మళ్ళీ రాస్తానని కోరారు. దురదృష్టవశాత్తూ నేననది చూసుకోకుండా ప్రచురించాను. చూశాక తొలగించాను. పొరబాటు పూర్తిగా నాది.

  కనుక సుజాత గారికి సంధించిన ఈ వ్యాఖ్య అసందర్భంగా మారింది. మీరు అనుమతిస్తే ఇది తొలగిస్తాను.

 12. పావని గారూ, బూతు దూషణని ప్రవీణ్ ప్రారంభించలేదు. ఆ విషయం నేను చూపాను. ప్రవీణ్ ది స్పందన మాత్రమే.

  ఏ స్త్రీ అయినా ఒకరికి తల్లేనండీ. ప్రవీణ్ తల్లి, వదిన… ఇలా వీరు కూడా. ప్రతీ తిట్టూ స్త్రీలనే సంబోధిస్తుందని అంగీకరిస్తే ప్రవీణ్ ని తిట్టిన బూతులు కూడా అవే. ఇక్కడి వ్యాఖ్యల్లోనే ప్రవీణ్ ని తిట్టిన తిట్టు నో వన్ ప్రస్తావించారు. అలాంటివి, ఇంకా ఘోరమైనవి నేను చూశాను. ప్రవీణ్ తిట్టు స్పందనగా వచ్చింది. అయినా అది ఉపసంహరించుకోమని ప్రవీణ్ ని ఎందుకు కోరుతున్నానంటే, అది అతని భావాజాలం ప్రాతిపదకన మాత్రమే తప్ప మరొకటి కాదు. అతని భావజాలం అతనిపైన ఈ భారం మోపుతుంది.

  ఈ టపా, ప్రవీణ్ కి నేనిచ్చిన షరతుల మద్దతును పూర్వపక్షం చేయదు. ఆ మద్దతుకి కొనసాగింపే ఈ టపా.

 13. అది నా చేతుల్లో లేదని మీకు తెలుసు. ప్రవీణ్ ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నది అతని భావాజాలం ప్రాతిపదికన. ఆ భావజాలం కలిగి ఉన్నవారు శత్రువుకి సంబంధించిన స్త్రీలను కూడా అవమానించడం సాధ్యం కాదు. ఆ బలంతోనే ప్రవీణ్ ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. అది ఆయనకే గౌరవాన్ని తెస్తుంది. ప్రవీణ్ గారు ఓ వ్యక్తి తల్లిగారిని ఉద్దేశిస్తూ చేసిన తిట్టు ఉపసంహరించుకోగలిగితే ఇతరులను డిమాండ్ చేయడంలో నాకు బలం వస్తుంది. అది మీరెందుకు గ్రహించరు?

 14. “చర్చల ద్వారా వెలుగు రావాలి కాని వేడి పుట్టకూడదన్నది నా ఆచరణలో నేను నేర్చుకున్న పాఠం.”
  మంచి భావాన్ని అందం గా చెప్పారు రాజు గారు.
  విశేఖర్ గారి వాదనలలో(వామ పక్ష) చాలా వాటి తో నేను అంగీకరించను. కానీ విశేఖర్ గారిని విష-శేఖర్ అని పిలవటం మొదలు పెట్టింది (తద్వారా తిట్లకి ఆజ్య పోసింది) మాత్రం, ఆపోజిట్ బాచీ నే అని నేను అనుకొంటున్నాను.
  ప్రవీణ్ యుధ్ధం పూర్వా పరాలు నాకు తెలియదు.
  నా బ్లాగు లో ప్రవీణ్ ఏదైనా టపా యొక్క టాపిక్ కి relavant గా(even if it is indirectly related) వ్యాఖ్య పెడితే మాత్రం తీయటం జరగదు. ఇంకా ఎవరు వ్యాఖ్య చేసినా ఇదే రూల్ వర్తిస్తుంది. ప్రవీణ్ ని relavant గా వ్యాఖ్యలు పెట్టమని మాత్రమే కోరుకొంటున్నాను.

 15. మౌళి గారూ, నిజమే. సంబంధం లేని వ్యాఖ్యలకు ప్రవీణ్ మాత్రమే సొంతదారు కాకపోవచ్చు. కాని ప్రవీణ్ వి ఎక్కువవడంతో, విస్తృతం కావడంతో వ్యతిరేక స్పందన విస్తృతంగా వస్తోంది. ప్రవీణ్ ఈ విషయంలో సంయమనం పాటించాలి. ఓ మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా నే ప్రవీణ్ ని ఇవన్నీ కోరుతున్నా.

 16. బొందలపాటిగారూ ఒకే వ్యాఖ్య చేసినా సూటిగా ఉంది.
  చర్చలు చాలా చేసిన మిత్రులు కూడా ఇలాంటి సూటి మద్దతు ఇవ్వలేకపోయారు. అందుకు ఆశ్చర్యంగా ఉంది.

  శంకర్ గారి లాంటివారినీ ఇదే కోరుతున్నాను. నాపైన జరిగిన దాడిని మాట మాత్రంగానైనా ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? నేను ప్రారంభించలేదు కదా. నేను అనుసరించడం లేదు కదా? కనీసం వారి బ్లాగుల్లోకి వెళ్ళడం లేదు కదా? ఇప్పటీకీ తిడుతున్నారు కదా? అది తప్పని ఎందుకు ప్రకటించలేరు శంకర్ గారూ?

  బోందలపాటిగారికి కృతజ్ఞతలు.

 17. ఎలాగూ ఎడిట్ చేసారు కదా. ఆ పేరు తొలగించి మిగిలిన కామెంట్ ఉంచితే సంతొషం.
  విశేఖర్ గారు ఒక్కటి అడుగుతా సూటిగా సమాధానం చెప్పండి. ప్రవీణ్ని లం* కొ* అని తిడితే అది అతని తల్లిని తిట్టినట్టు కాదా ? ఇక్కడ నీతులు చెప్పేవారిలొ ఒక్కరు కూడా అప్పుడు ఎందుకు కనీసం ఖండించలేదు. అప్పుడు ప్రవీణ్ వాళ్ళని రెచ్చగొట్టనుకూడాలేదు. అయినా ఎందుకు తిట్టినట్టు ?
  ఇవేమీ తెలుసుకొకుండా మీరు ఈ టపా రాయడం దారుణాతి దారుణం.

 18. You may please read my post again. I agree that both sides should concede.
  I highlighted that specific comment from him because that was about a real elderly person whose name was revealed long back.
  I believe one can get in to legal troubles too for such direct name calling.

 19. విశేఖర్ గారూ తప్పు ఎవరు చేసినా తప్పే. దానికి నావరకు తనపర బేధాలు లేవు. ప్రవీణ్ విషయానికొస్తే నాకు తెలిసినంత వరకు అవతలివైపు ప్రతి చర్య మాత్రమే. సరే ఆ విషయం వదిలేద్దాం. మీ విషయానికొస్తే నేను సాధారణంగా ఇలాంటి ఇజాలతో కూడిన భావజాలం ఉండే బ్లాగులు, చర్చలకు కాస్త దూరం. అవి నాలాంటి సామాన్యుడికి ఓ పట్టాన కొరుకుడు పడవు కూడాను. మీ భావజాలం పై దాడిచేస్తే నేను అంగీకరిస్తానేమో కానీ మీ పై వ్యక్తిగత దాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఖండిస్తాను. ఒకరి అభిప్రాయం మనకి నచ్చకపోతే దానిని ఖండిస్తూ వాదన రూపంలో అవతల వాళ్ళ భావజాలం పై దాడి చేయవచ్చు. ఎవరి వాదనలో దమ్ముంటే వాళ్ళే విజేతలు. అభిప్రాయం నచ్చనంత మాత్రాన అవతల వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం పద్ధతీ కాదని ప్రవీణ్ విషయంలోనే స్పష్టం చేశాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను.

 20. నో వన్ గారూ, ఆఫీసు కి వెళ్తున్నాను. రెండు వారాల సెలవు తర్వాత. మళ్ళీ వచ్చి రాస్తాను. సుజాత గారికి మీ సమాధానం తొలగించడానికి మీ అనుమతి దొరికినట్లేగా?

 21. క్షమించాలి ఇందాకా కామెంట్ లో భావజాలం పై దాడి అంటే అపార్ధం చేసుకుంటారేమో అని వివరణ ఇస్తున్నా. నా ఉద్దేశ్యం ప్రతిఘటన. వాదించి ప్రతిఘటించవచ్చు అని నా భావన. (మళ్ళీ ఈ దాడి అనే పదం ఇంకో కొత్త వివాదానికి తెరలేపకుండా వివరణ ఇస్తున్నా)

 22. సుజాత గారు, మీరు కూడా రిజర్వేషన్‌ల గురించి వ్రాసి కత్తికి వ్యతిరేకంగా వాళ్ళకి మేత అందించడం, పరోక్షంగా నాకు వ్యతిరేకంగా కూడా వాళ్ళకి మేత అందించడం చేశారు. వాళ్ళు ఐడియాలజీ గురించి ఏమీ చర్చించలేదు. నేను మావో జెడాంగ్ గురించి వ్రాస్తే నీ వదిన ఎవరు అని అడగడం, జాతుల సమస్య గురించి వ్రాసినా నీ వదిన ఎవరు అని అడగడం, ఆస్తి సంబంధాల గురించి వ్రాసినా నీ వదిన ఎవరు అని అడగడం ఇలా వాళ్ళే సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకపోయినా నాకే చర్చించడం చేతకాదని వాదిస్తారు.

 23. నేను ఐడియాలజీ గురించి వ్రాసినా వాళ్ళు వదిన-మరుదుల సంబంధం గురించి ప్రశ్నలు అడుగుతోంటే వాళ్ళు వ్రాసినవి సంబంధం లేని ప్రశ్నలు అని సుజాత గారికి ఒక్కసారైనా అనిపించిందా? కనుక నేను ఇదే ప్రశ్న సుజాత గారికి అడుగుతున్నాను.

 24. బొందలపాటి గారి బ్లాగ్‌లో డిజిపి వ్యాఖ్యల గురించి చర్చ జరిగింది. చర్చ ప్రధానంగా నిక్కర్లు, మినిస్కర్టుల మీద సాగింది. వాళ్ళు దాని గురించే మాట్లాడుతున్నారు కనుక నేను డిజిపి మాట్లాడింది దాని గురించే అనుకున్నాను. తీరా వీడియో చూస్తే డిజిపి మాట్లాడింది సల్వార్-కమీజ్‌ల గురించని తెలిసింది. ఇలాగైతే ఆ బ్లాగ్‌లో బొందలపాటి గారి వ్యాఖ్యలూ తప్పే, రాజశేఖర్ గారి వ్యాఖ్యలు కూడా అసందర్భమే అనుకోవాలి. చర్చ మొత్తం ఒక అసందర్భ విషయం మీద నడిచినప్పుడు అందులో కామెంట్లు వ్రాసిన ఒక వ్యక్తినే టార్గెట్ చెయ్యడం అవసరమా? కెలుకుడు బేచ్‌వాళ్ళు గతంలో ఇలాంటి తప్పులే చేశారు. దళితవాదం విషయంలో కత్తిని ఓడించడానికి వాళ్ళు ఇతర దళితవాదులని విమర్శించకుండా కేవలం కత్తినే విమర్శించారు. అందు కోసం కేవలం కత్తినే టార్గెట్ చేస్తూ పేరడీలు వ్రాసారు. నేను కూడా కత్తిలాగ బలమైన దళితవాదినని తెలిసిన తరువాత కత్తిని వదిలేసి నా మీద ఫోకస్ పెంచారు.

 25. పావని గారు, మీకు చరిత్ర తెలిసినట్టు లేదు. ఒక ప్రముఖ మహిళా బ్లాగర్ భరద్వాజ వాళ్ళ అమ్మగారి స్నేహితురాలు. ఈ విషయం తెలియక భరద్వాజ ధూం, కాగడా అనే బ్లాగులు పెట్టించి అతను ఆమె గురించి ధూం, కాగడాల చేత చెత్తగా వ్రాయించాడు. విషయం తెలిసిన తరువాత ఇంకో విచిత్రం జరిగింది. తన స్నేహం చెడిపోతుందనే భయంతో ఆ మహిళా బ్లాగర్ భరద్వాజతో రాజీపడిపోయింది. పైగా ధూం, కాగడా బ్లాగులని భరద్వాజ పెట్టించలేదని ఆమె ప్రచారం చేసింది. ఆమె ఒక మహిళా బ్లాగర్ల గ్రూప్ పెట్టి నీహారిక గారికీ, నాకూ వ్యతిరేకంగా మహిళా బ్లాగర్ల దగ్గర ప్రచారం కూడా చేసింది. భరద్వాజ అనుచరుడు కార్తీక్ భర్త చనిపోయిన స్త్రీలని ముండమోపులూ, ముమైత్ ఖాన్‌లూ అంటూ పేరడీ వ్రాసినప్పుడు నీహారిక గారు మాత్రమే కార్తీక్‌ని విమర్శించారు. ఆ ప్రముఖ మహిళా బ్లాగర్ ఇంకో మహిళా బ్లాగర్‌తో కలిసి నీహారిక గారికి మెయిల్ చేసి ఆమె చేత బలవంతంగా విమర్శలు డిలీట్ చెయ్యించింది. ఆ ప్రముఖ మహిళా బ్లాగర్ పేరు ఒక ఇంగ్లిష్ న్యూస్ పేపర్‌లో కూడా వచ్చింది కనుక ఆమె పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను.

 26. సుజాత గారు, మీరు కత్తి మహేశ్ గారి బ్లాగ్‌లో వ్రాసిన వ్యాఖ్యలు చదివాను. మీరు దళితవాదాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి. కానీ కేవలం రిజర్వేషన్‌ల ఇష్యూ గురించి వ్రాసి నిప్పు మీద నూనె పొయ్యకండి. కత్తి దళితవాదం గురించి ఏదో వ్రాస్తే ఆ విషయానికి సంబంధం లేని రిజర్వేషన్‌ల విషయం గురించి మీరు వ్రాసారు. నేను చాలా సార్లు ఒక విషయం చెప్పాను “రిజర్వేషన్ల వల్ల తమకి అవకాశాలు ఉంటాయనిపించినవాళ్ళు వాటిని సమర్థిస్తారు, తమ అవకాశాలు పోతాయనిపించినవాళ్ళు వాటిని వ్యతిరేకిస్తారు. వాటిని సమర్థించేవాళ్ళకి గానీ, వ్యతిరేకించేవాళ్ళకి గానీ కులం మీద లేదా మతం మీద నమ్మకం ఉందా లేదా అనేదానిపై విషయం ఆధారపడి ఉండదు” అని. అసలే కులం పేరుతో రెండు వర్గాలవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో రిజర్వేషన్ల విషయం ఎత్తితే దాని వల్ల వచ్చే, పోయే అవకాశాల గురించి కూడా గుర్తు తెచ్చుకుని దాని పేరు కూడా చెప్పుకుని కొట్టుకుంటారు కనుక ఆ సందర్భంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడమే మంచిది.

 27. శంకర్ గారూ, ధన్యవాదాలు.

  కెబ్లాస ఉన్నది మీరు చెప్పిన అర్ధంలో కాదని వాళ్ళే వివిధ సందర్భాల్లో చెప్పుకున్నారు. వారి అసభ్య వ్యాఖ్యలు తీసేసినా, వారికి నచ్చని భావాలు రాసినా, తమ అభిప్రాయాలను ప్రచారం చేసుకునే పేరుతో ఇతరులని కెలుకుతారట.
  పద్మ గారూ ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేశారు.

  నేను పదే పదే చెబుతున్నదేమంటే అటువంటి వారి బూతు ధోరణితో విసిగిపోయాక మాత్రమే ప్రవీణ్ బూతుల్లోకి దిగాడని. ఎంత విసిగిపోయినా బూతుల్లోకి దిగరాదని ప్రవీణ్ కి చెబుతూనే అతను అనుభవించిన టార్చర్ ని గుర్తించి ఆ టార్చర్ విధించడాన్ని కూడా ఖండించాలని కోరుతున్నాను.

  కెలుకుడు గ్యాంగ్ సభ్యులు చెప్పినదాని ప్రకారమే ఇన్నయ్య గారి బ్లాగ్ పోస్టు చూశాను. ఆ పోస్టు లింక్ మీరు అడిగారు. ప్రవీణ్ ఇచ్చాడని చెప్పాను. మీరు చూశారో లేదో తెలియదు. అందులో స్పష్టంగా తెలుస్తున్న అంశం ఏమిటంటే ప్రవీణ్ ని మొదట వారే ఒరేయ్, అనీ మెంటల్ అనీ తిట్టారని. ‘నాయాల’ అని కూడా తిట్టారు. అదే ప్రారంభం అని కెలుకుడు వాళ్ళు చెప్పారు. వాళ్ల సాక్ష్యం ఆధారంగానే ప్రవీణ్ పైన దాడి మొదట ప్రారంభం అయిందని స్పష్టం అవుతోంది. ఇక ప్రవీణ్ వల్లనే కెలుకుడు ప్రారంభం ఐందని చెప్పడం నిజం కాదని స్పష్టం అవుతోంది.

  వీళ్ళకి అక్కడ రాందేవ్ ని విమర్శించడం నచ్చలేదు. అందుకు రాందేవ్ తరపున వాదించడానికి బదులు నేరుగా తిట్లలోకి దిగారు. ఇది అంతటితో ఆగలేదు శంకర్ గారూ, నెలలు, ఏళ్ళ తరబడి సాగింది. నాపైన పెట్టిన దూషణల బ్లాగ్ లో నేను నేరుగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాళ్ళు ‘నా భావాజాలం మానుకోవాలని’ నేరుగా హెచ్చరించారు. ఇంతకంటే ఏం కావాలి? మా ఇద్దరి భావాజాలం నచ్చకే మాపైన వ్యక్తిగత దాడులకి దిగారని చెప్పడానికి?

  వీళ్లకి నచ్చిన భావాజాలాన్ని ఎవరూ విమర్శించరాదని వీరి అప్రకటిత రూలు. అందుకే వారి కెలుకుడు. అది కూడా భావాజాలం కెలుకుడైతే ఆ మేరకైనా వారి క్రెడిబులిటీ నిలిచి ఉండేది. కాని మొదలే తిట్లతో, బూతుల్తో, అవమానాలతో, హేళలనలతో ప్రారంభించి వారి ధోరణికి స్పందనగా వచ్చిన ప్రవీణ్ బూతులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోనీ దీనికి జతగా ప్రవీణ్ అలా చేస్తే మేమూ ఉపసంహరించుకుంటాం అంటున్నారా? అదీ లేదు. పద్మ గారు కనీసం ఆ చిత్త శుద్ధిని కూడా కనపరచలేదు. పూర్తిగా ఏక పక్షం. ప్రవీణ్ ఊపసంహరించుకోవాలన్నదే ఆమే డిమాండ్. వారి గ్యాంగ్ పేర్లకింద బూతులు చూపండి అని తెలివిగా మాట్లాడడమే తప్ప బూతులు ఉండరాదన్న విషయంలో వారికి ఏ మాత్రం చిత్త శుద్ది కనిపించడం లేదు.

  ఒత్తిడి తెచ్చి నాలాంటి వారి మద్దతు తీసుకుని ప్రవీణ్ ని రాక్షసీకరించాలన్న ప్రయత్నమే తప్ప ఇరు వైపులా బూతులు ఉండరాదు అన్న చిత్త శుద్ధి పద్మ గారు కూడా ప్రకటించలేకపోయరు. ఇది ఆమోదించలేని విషయం.

  మీ ప్రకటన మరింతమంది మిత్రుల ప్రకటనలకి దారి తీస్తుందని ఆశిస్తున్నాను.

 28. ప్రవీణ్ గారూ మీరు సంయమన ధోరణిలోకి వస్తున్నారు. అది కొనసాగించండి. చర్చలో పాల్గొనలెకపోతున్న వారి పేర్లను ప్రస్తావించకుండా సంయమనం పాటించారు. అభినందనలు.

 29. ప్రవీణ్, ఇక్కడ చేసినట్లుగానే ఓ వ్యాఖ్య చేసేటప్పుడు సందర్భం ప్రస్తావించండి. మీరు చేస్తున్న చర్చలో సంయమన ధోరణి పెంచండి. విషయంపైనే చర్చిస్తున్నానన్న నమ్మకాన్ని ఇతరులకు కలిగించండి. అలా చేయకుండా మీకు మద్దతు లభించదు. సూత్ర బద్ధంగా మీతో ఏకీభవిస్తున్నవారు సైతం మీ ధోరణితో హర్ట్ అయి మీకు వ్యతిరేకులుగా మారుతున్నారన్న విషయం గమనించండి. వారి మద్దతు పోగొట్టుకోకండి. సామాజిక అంశాలపైన మిత్రులు, మిత్రేతరులు అందరి మద్దతూ ఉండాల్సిందే. అది గమనించండి.

 30. మీరు సీరియస్ బ్లాగరైతే, మీరు తెలుసుకోవలసిన పాయింటు:
  ప్రవీణ్ ఒక పిచ్చి అమాయకుడు.
  నీహారిక అంతకంటే పిచ్చి అమాయకురాలు. వాళ్ళ మీద చర్చ అనవసరం. ఇక్కడితో ఆగిపోండి ఇంక చదవకండి.

  మీరు రచ్చ బ్లాగర్ అయితే:
  పిచ్చి వాల్లకీ ప్రాథమిక హక్కులు, బ్లాగుల్లో కామెంట్లు రాసే స్వేచ్చా ఉన్నయి అని వాదన మొదలెట్టి….నా పై కామెంటు ని చీల్చి చెండాడి ఇంకో వంద కామెంట్ల యుద్దం జరుపుకోవచ్చు.

  మీరు కెలుకుడు బ్లాగర్లైతే:
  నా పై కామెంట్ల స్క్రీన్ షాట్లు తీసుకుని ఇంకో నాలుగేల్ల పాటు టైం పాస్ కామెడీ చేసుకోవచ్చు.

  ఏతా వాతా చెప్పొచ్చేదేటంటే… ఊరూ పేరు లేని ప్రతి ఎదవా, ఐడెంటిటీ క్రైసిస్ కుతి తీర్చుకోడానికి ఇలా బ్లాగుల్లో గొడవేసుకుంటూంటారు.

  వీళ్ళంతా పెద్ద పోటు గాళ్ళైతే, జీవితంలో చాలా సాధించేవాళ్ళే కద? ఇలా గాలి గొడవలతో టైం పాస్ చెయ్యొరుగద?

  కెలుకుడు బ్యాచ్ కొంతలో కొంత నయం. వాల్లు బూతు మాటలు వాడరు. కాని ప్రవీణ్ ఒక్కడైపోయేసరికి ఇక తట్టుకోలేక తిట్టేస్తుంటాడు.

  పిడివాదులైన కత్తి మహెష్, తాడేపల్లి, శర్మ, సౌమ్యా… వీళ్ళూ పిచ్చోళ్ళే. కానీ, వాళ్ళు చివరకి గొడవ ముగించి పక్కకెళ్ళిపోతారు.. కానీ ప్రవీణ్ & నీహారికాల గోడవ అప్పటికీ ఆగదు. అందుకనే వీళ్ళకి మానవతా దృక్పధంతో ఎవరైన చికిత్స చేయించాలని నా మనవి.

  btw, i second katta vijay (above).

 31. విశేఖర్ గారూ,
  మనం నమ్మిన సిద్ధాంతం ప్రచారం చేసుకునే హక్కు మనకు ఎలా ఉంటుందో ఆయా సిద్ధాంతాలపై, వాటి లోటుపాట్లపై విమర్శించే హక్కు ఇతరులకూ ఉంటుంది. వాటిని సరైన ఆధారాలు, వాదనలతో తిప్పికొడితే ఆ సిద్ధాంతానికీ, ఆ వ్యక్తికీ శోభనిస్తుంది. లేదూ కాస్త వ్యతిరేక వ్యాఖ్యలు లేదా స్పందన రాగానే అసహనపడిపోయి ఎదుటివారిపైన దాడి (లేదూ ప్రతిదాడి) చేస్తూ పోతే మనకే కాదు మనం నమ్మిన సిద్ధాంతానికీ చేటు తెస్తుంది. ఇందుకు గత టపాలో మీరు నాకివ్వవలసి వచ్చిన వివరణే మంచి ఉదాహరణ. ఏదేమైనా చరిత్ర నిరూపించినది ఒకటే సరైన అనుచరులు లేని సిద్ధాంతం వ్యర్థం. ఏదేమైనా ప్రవీణ్ శర్మ గారి విషయములో మీరు తీసుకున్న వైఖరి అభినందనీయం. మీరతని భావజాలానికి మద్దతిస్తే బ్లాగర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. అందులో ఆతని తప్పులు (మీరు పొరపాట్లు అనొచ్చు వాటినే) కూడా సమర్థిస్తేనే వచ్చేది చిక్కంతా!

  ప్రవీణ్ శర్మగారితో నా చేదు (?) అనుభవాన్ని వివరిస్తాను. ‘ఏది రెండున్నర జిల్లాల భాష’ అనే శీర్షికన గుంటూరు జిల్లా మాండలికం ప్రామాణిక తెలుగుతో ఎలా భేదాన్ని కలిగి ఉందో వివరిస్తూ ఒక టపా రాశాను. ఒకవేళ నేను రాసింది తప్పే అయితే దానికి వారు సరైన ఆధారాలతో నిరూపణకు దిగవచ్చు కానీ వారాపని చేయలేదు సరికదా ఏకంగా ఓ వీడియో పెట్టేశారు. మీకు సమయముంటే చూడొచ్చు వారి పనులకు జనాలకు ఎందుకు చిర్రెత్తుకొస్తుందో! బహుశా వారి వీడియో నా టపాకు ప్రతిస్పందన కాకపోయి కూడా ఉండొచ్చు. నిజానిజాలు పెరుమాళ్ళకెరుక. కానీ ఒక నిరాధార వీడియోను జనమ్మీదకు వదలటం అంటే అదీ మనకు తెలియని ప్రాంతము భాషపై ఎంతటి విమర్శలకు ఆస్కారమిస్తుందో నేను మీకు వేరే చెప్పనవసరము లేదు కదా! ఇకనైనా ప్రవీణ్ శర్మగారు తన పంథా మార్చుకుంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం.

  ఇక ముందువెనుకల శ్లేష లేకుండా బ్లాగుల్లో తిట్ల దండకం అందుకునే ఎలాంటి టపాకైనా నేను వ్యతిరేకం.

 32. శ్రేయోభిలాషి గారూ, విషయం సూటిగా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదాలు.

  ఒక పేరుతో బూతులు రాయకుండా, అలియాస్ పేర్లతొ బూతులు రాస్తున్నారు.

  బూతు కాని ఛండాలం కూడా చాలా కురిపిస్తున్నారు. బూతుల్లేనంత మాత్రాన ఆ ఛండాలం పవిత్రం కాబోదు. ఉదాహరణకి ‘కెలకడం’. భావాజాలం కెలుకుతున్నామన్న పేరుతో వ్యక్తులను కెలకడమే వీరి లక్ష్యం. కెలికితే అది భరించలేక తమకు నచ్చని భావాలు వ్యక్తం చేయడం మానుకోని వెళ్ళిపోవాలని వీరి అభిలాష. అందుకే ‘మేము బూతు మాట్లాడం’ అని అదొక సూత్రంగా చెప్పుకుంటున్నారు. లేనిది ‘బూతే’ కాని ఇతర ఛండాలం అంతా ఉన్నపుడు ఆ బూతు రాహిత్యం గొప్ప సంగతేమీ కాదు.

  కాదంటారా?

 33. ఆవిడ పేరు బ్లాగర్లందరికీ తెలిసిన తరువాత నేను చెప్పడానికి ఏముంటుంది? అందుకే ఆవిడ పేరు వ్రాయాలనిపించలేదు. అసలు విషయానికొద్దాం.

  అడవి బాపిరాజు గారి ఓ కథలో వదిన-మరుదులు లేచిపోతారు కానీ స్టోరీ చివరలో ఆత్మహత్య చేసుకుంటారు. అనుమానించే భర్తతో కాపురం చెయ్యడమే అవమానకరం కానీ మరిదితో లేచిపోవడం అవమానకరం కాదు అనుకున్నప్పుడు లేచిపోయినవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చూపించడంలో అర్థమేమిటని రంగనాయకమ్మ గారు అడవి బాపిరాజుపై విమర్శ చేశారు.

  (రంగనాయకమ్మ గారి విమర్శలని దృష్టిలో పెట్టుకుని) నేను నా కథలో లేచిపోయినవాళ్ళు సుఖంగా ఉంటున్నట్టు వ్రాసాను. నా కథలని సపోర్ట్ చేసిన మహిళా బ్లాగర్ నీహారిక గారు ఒక్కరే. అందుకే వాళ్ళు నీహారిక గారి గురించి కూడా చెత్తగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

  నిజానికి నీహారిక గారు స్త్రీవాది కాదు. లేచిపోవడానికి బావైతే ఏమిటి, మరిదైతే ఏమిటి అనేది మాత్రమే ఆవిడ ప్రశ్న. కానీ వాళ్ళందరూ నీహారిక గారిని తిట్టారు. నీహారిక గారు అడిగిన ప్రశ్నలో తప్పు లేదు. లేచిపోయేవాళ్ళు స్వేచ్ఛా జీవితం కోరుకుంటారు కానీ వయసు, ఎత్తు లాంటివి పట్టించుకుంటారా అన్నది నా ప్రశ్న.

  ఒక స్త్రీ తన కంటే వయసులో చిన్నవాణ్ణి పెళ్ళి చేసుకుంది. ఆమె భర్త ఆమె చెల్లెలి కంటే కూడా వయసులో చిన్నవాడు. అప్పుడు ఆమె చెల్లెలికి ఆమె భర్త బావ గారు అవుతాడా, మరిది అవుతాడా? భార్య వయసులో ఆమె భర్త కంటే పెద్దది. ఆమె భర్త వాళ్ళ అన్నయ్య కంటే కూడా పెద్దది. అప్పుడు ఆమె భర్త వాళ్ళ అన్నయ్య ఆమెకి బావ అవుతాడా, మరిది అవుతాడా? (అని నీహారిక గారు అడిగారు) నీహారిక గారు అడిగిన ప్రశ్న చాలా లాజికల్‌గా ఉన్నా వాళ్ళు నీహారిక గారి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆవిడ గురించి చాలా చెత్తగా ప్రచారం చేశారు.

  (బ్రాకెట్లలో ఉన్నవి నేను చేర్చిన పదాలు. పేరాలుగా విడగొట్టడం కూడా నేను చేసిందే. -విశేఖర్)

 34. అచంగ గారూ, ధన్యవాదాలు.

  చివరి వ్యాక్యంలో మీ సూత్ర బద్ధ ప్రకటన మరింతమందికి స్ఫూర్తినివ్వాలని కోరుతున్నాను.

  ప్రవీణ్ వీడియో విషయమై ఆయన సమాధానం, అత్యంత సంయమనంతో – వివరణాత్మకంగా – సందర్భ శుద్ధితో – సంబంధం కలుపుతూ, ఇస్తారని ఆశిస్తున్నాను.

 35. (మహిళా బ్లాగర్) పేరు వ్రాయకపోయినా తెలిసిపోతుంది కనుక నేను వ్రాయలేదు.

  ఆ సంగతి సరే, స్నేహితురాలి కొడుకే కదా అని (ఆవిడ) తన గురించి బూతులు వ్రాయించిన వ్యక్తికి సపోర్ట్ ఇవ్వడం ఏమిటి?

  భరద్వాజ తాను కాగడా అభిమానినని ఓపెన్‌గానే చెప్పుకున్నాడు. ఇదేమీ రహస్యం కాదు. ఆ విషయం తెలిసినా భరద్వాజకీ, కాగడాకీ సంబంధం లేదని ప్రచారం చెయ్యడం ఎందుకు? పైగా కాగడా వ్రాసిన బూతులని వ్యతిరేకించిన నా గురించి చెత్తగా ప్రచారం చెయ్యడం ఎందుకు?

 36. ప్రవీణ్, మహిళా బ్లాగర్ గురించిన ప్రతికూల సమాచారం మీరు ఇస్తున్నారు. ఆవిడ ఇక్కడ చర్చలో లేరు. కనుక అటువంటి వారి పేర్లు ఇవ్వకపోవడం మర్యాద, సభ్యత. మర్యాద సభ్యతల కోసమే మిమ్మల్ని పేర్లు ప్రస్తావించవద్దు అంటున్నది. ఈ విషయం గమనించారా? దీనికి నేరుగా, వేరే అంశాలు లేకుండా బదులివ్వండి. గమనించాననో, గమనించలేదనో, గమనించాల్సిన అవసరం లేదనో చెప్పండి. వీలయితే వివరంగా.

 37. ఈ లింక్ చదవండి: http://jyothivalaboju.blogspot.com/2010/02/blog-post_13.html

  నేను ఆవిడకి కథ గురించి మెయిల్ చెయ్యకపోయినా నేను మెయిల్ చేశానని ఆవిడ చేత వ్రాయించారు. ఆవిడ … అనే ఏదో పేరు వ్రాసింది. నా కథల్లో ఒక పాత్ర పేరు కూడా అదే. ఆ విషయం చెప్పి ఆవిడకి మెయిల్ పంపింది నేనేనని ప్రచారం చేశారు. ఆవిడ టాపిక్‌లో డైరెక్ట్‌గా నా పేరు వ్రాయకుండానే నేనే మెయిల్ చేశానని ఇంప్రెషన్ కలిగించింది.

  కానీ తరువాత నేను ఆవిడని విమర్శిస్తాననే భయంతో పేరుకి సంబంధం లేని లింక్ తగిలించింది. నేను వ్రాసిన కొత్త చిగురు కథలోని ఒక పాత్ర పేరు (కూడా అదే). కానీ నేను ఆ కథ గురించి (…) గారికి మెయిల్ చెయ్యలేదు అని తెలిసినా తెలియనట్టు నటించి ఆవిడ నాటకం ఆడారు.

 38. ఇన్నయ్య గారి బ్లాగ్‌లోని కొన్ని స్క్రీన్‌షాట్‌లు మాత్రమే ఉంచి టపా యొక్క అసలు లింక్ వాళ్ళు చాలా కాలం వరకు బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఎందుకంటే ఆ టపాలో వాళ్ళు నా గురించి కూడా చెత్తగా వ్రాసారు కాబట్టి. ఆ విషయం నాకు తెలుసు. అందుకే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళి ఇన్నయ్య గారి పాత టపాల లింక్‌లు వెతికాను. గూగుల్ సెర్చ్‌లో ఉన్న ఆర్కివ్స్ అంత సులభంగా పోవని వాళ్ళకీ తెలిసిన విషయమే.

 39. నేనిక్కడ మరి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.

  నాకు తెలిసి తాడేపల్లి గారిపై ఎవరూ తీవ్ర విమర్శలు చెయ్యలేదు. అతని భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహేశ్ గారి కూడా అంతగా విమర్శించలేదు. నేను కేవలం ఒక టపా విషయంలోనే తాడేపల్లి గారిని తీవ్రంగా విమర్శించాను. ఆయన “ఆడది తాగితే సమాజం పూర్తిగా చెడిపోతుంది, మగవాడు తాగితే సమాజం సఘం చెడిపోతుంది” అని అన్నారు. ఆ విషయంలో ఇతర బ్లాగర్లు కూడా తాడేపల్లి గారిని తీవ్రంగా విమర్శించారు కాబట్టి అందులో నా ఒక్కడి పాత్ర ఉందనడం సరికాదు.

  సత్యనారాయణ శర్మ గారి విషయంలో గొడవ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కెలుకుడు గ్యాంగ్‌వాళ్ళు తమ ఇంటిలో సాయిబాబా విగ్రహానికి విభూది కారింది అంటే నమ్మాలట. సత్యనారాయణ శర్మ గారు చెప్పిన జాతకాలని మాత్రం నమ్మకూడదట! సత్యనారాయణ శర్మ గారు సాయిబాబాని ఏదో అనడం వారికి నచ్చలేదులాగుంది.

  నిజమే కానీ సాయిబాబా సనాతన దేవుడు కాదు అనేది కూడా నిజమే కదా. అల్లా, ఏసు, శ్రీరామ అంటూ మూడు మతాల నామాలూ కలిపితే సనాతనవాదులు ఎలా ఒప్పుకుంటారు? నాకు వ్యక్తిగతంగా దేవుడూ, దెయ్యాలూ లాంటివాటి మీద నమ్మకం లేకపోయినా సత్యనారాయణ శర్మ గారి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు.

  వాళ్ళు తాము మతభక్తులమని చెప్పుకుంటూనే సత్యనారాయణ శర్మ గారిని గొడవల్లోకి లాగడమే నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి మత నమ్మకాలూ లేకపోయినా ఆ సమయంలో నేను సత్యనారాయణ శర్మ గారికే సపోర్ట్ ఇచ్చాను. సత్యనారాయణ శర్మ గారిని ఒకణ్ణి చేసి పది మంది … ఆడుకోవడం నాకు అసహ్యం కలిగించింది.

 40. నిజానికి వాళ్ళ బాధ నిజంగా సందర్భమూ, వ్యాఖ్యల స్పష్టత గురించి కాదు.

  వాళ్ళు సత్యనారాయణ శర్మ గారిని కూడా ఒక్కణ్ణి చేసి ఆటాడుకున్నారు, స్కైబాబా గారిని కూడా ఒక్కణ్ణి చేసు ఆటాడుకున్నారు.

  ఫలానా వాడితో ఆటాడుకుందాం, టైమొచ్చింది, రండి అని వాళ్ళ లీడర్ ప్రైవేట్ చాట్ రూమ్‌లలో పిలుస్తాడు. అతని అనుచరులు పది మందీ గొఱ్ఱెలలాగ తల ఊపి అతనితో కలిసి దాడి చెయ్యడానికి వస్తారు. అందుకే జాతకాలు లాంటి చిల్లర నమ్మకాలని నమ్మే సత్యనారాయణ శర్మ గారిపై కూడా అమానుషంగా దాడి జరిగింది.

 41. (ప్రతి దాడి చెయ్యడం నా లక్ష్యం కాదు.) ప్రతి దాడి చెయ్యడమే ఒకవేళ నా ప్రాథమిక అజెండా అయితే అందుకు మూడేళ్ళు ఆగాల్సిన అవసరం నాకు ఉండదు కదా.

  (ఉదాహరణకి) విశాలాంధ్ర మహాసభ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాయడం మానేశాను. (దానికి కారణం డిలిట్ చేస్తున్నారని కాదు. నిజానికి) వాళ్ళు కామెంట్లు డిలీట్ చెయ్యలేదు. కేవలం డిలీట్ చేస్తామని (మాత్రమే) అన్నారు. అయినా వాళ్ళ మీద ప్రతి దాడి చెయ్యకుండా, వాళ్ళతో వాదించడానికి విషయం ఏమీ లేదన్న కారణంతో అక్కడినుండి వెళ్ళిపోయాను.

  కానీ కెలుకుడుగాళ్ళ విషయం అది కాదు. నేనేమీ మాట్లాడకపోయినా నీ వదిన ఎవరు అని పాచిపళ్ళ దాసరి పాటలాగ రోత పుట్టించే విధంగా అడుగుతోంటే ఎదురు దాడి చెయ్యకతప్పలేదు.

  (బ్రాకెట్లలో ఉన్న పదాలు నేను చేర్చినవి. పేరాల విభజన కూడా. -విశేఖర్)

 42. ప్రవీణ్, సందర్భమూ, వ్యాఖ్యల స్పష్టత ల గురించి నేను చెబుతున్నది ‘కెలుకుడు గ్యాంగ్’ రిఫరెన్స్ తో కాదు. వారితో నాకు నిమిత్తం లేదు. పద్ధతులు ఏవీ పాటించని వారి విమర్శలను నేనసలు రిఫరెన్సుగా చూపడానికి ఇష్టపడను.

  మీరు పట్టించుకోవలసింది ఇతర బ్లాగర్లను కూడా. అసలు జనరల్ గా చూసినపుడు కూడా మీ వ్యాఖ్యలకు సందర్భం ఉండాలని మీరు అంగీకరిస్తారు కదా. ఆ సందర్భం ఏమిటో తమకు ఆర్ధం కాలేదని ఇతర బ్లాగర్లూ చెబుతున్న విషయం కూడా మీరు పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నట్లయితే మీ వ్యాఖ్యలకు పోస్టులకు సంబంధం ఉందా లేదా అని మీరు చూడాల్సిన అగత్యం ఉంటుంది. ఇందులో వేరెవరి ప్రస్తావన మనకెందుకు?

 43. సిద్ధాంతాల గురించి అడిగారు. వాళ్ళు ఎన్నడూ నాతో సిద్ధాంతాల గురించి చర్చించలేదు. నేను దేని గురించి వ్రాసినా వదిన-మరిది అంటూ ఆవు వ్యాసం స్టైల్‌లో టాపిక్ డైవర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళతో సైద్ధాంతికంగా చర్చించడానికి ఏముంటుంది?

  రెండున్నర జిల్లాల భాష విషయంలో నేను నా సొంత ప్రాంతంవాళ్ళని ఎగతాళి చేశానన్నారు. అచంగ గారు దాని గురించి అడిగారు కాబట్టి చెపుతున్నాను. (మళ్ళీ ఇది సంబంధం లేనిది అనవద్దు)

  మా పిన్నమ్మ గారిది శ్రీకాకుళం జిల్లా వండువ గ్రామం. మా బాబాయి గారిది ఒరిస్సాలోని రాయగడ జిల్లా తుంబిగూడ గ్రామం. వాళ్ళు నాయుడుపేటలో ఉండే రోజుల్లో “దొబ్బు” అనే పదం విన్నారు. నెల్లూరు భాషలో దొబ్బు అంటే తొయ్యు అని అర్థం. వాళ్ళు అది బూతు పదం అనుకుని ఆడవాళ్ళ దగ్గర బూతులు మాట్లాడుతున్నావేమిటి అని అడిగారు. కోస్తా ఆంధ్రలోనే చూసినా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి నెల్లూరు జిల్లాలో పలికే కొన్ని పదాలు తెలియవు.

  అప్పట్లో జరిగిన గొడవ దీని గురించి కూడా కాదు. తెలంగాణావాళ్ళకి తెలుగు రాదు అంటూనే కోస్తా ఆంధ్ర వాళ్ళు వార్త పత్రికలలో దస్తావేజు, మూజువాణీ, ఖైదీ లాంటి ఉర్దూ పదాలు ఉపయోగించడం గురించి.

  నేను ఇలా ఉర్దూ పదాలు కలిసిన తెలుగు భాషని ప్రామాణికం అనుకోవడాన్ని మాత్రమే విమర్శించాను. అంతే కానీ కోస్తా ఆంధ్ర శైలిలో కన్నం అనాలా, తెలంగాణా శైలిలో రంధ్రం అనాలా అని నేను అక్కడ వాదించలేదు.

 44. ప్రవీణ్ శర్మ గారూ….
  నేను మీకు చెప్పగలిగింది ఒక్కటే ‘అనువుగాని చోట అధికులమనరాదు’. బ్లాగర్లలో పెక్కుశాతం మందికి మీ వ్యాఖ్యలు అసందర్భంగా (అర్థం కావటం లేదని లేదా అర్థం చేసుకోవటం లేదని మీరనవచ్చు) అనిపిస్తున్నాయి. అది మీరు అంగీకరించాల్సిన వాస్తవం. అలాగే వందల నుండి వేలమంది ఉన్న బ్లాగులోకములో కేవలం అతికొద్దిమందిని అందులో ముఖ్యంగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవటానికి ప్రయత్నించండి. మనకు చప్పట్లు వినబడుతున్నాయి అంటే అందులో రెండు చేతుల ప్రమేయమూ ఉందని మీరు గుర్తించాలి. వస్త్రం, వపుషం, వాక్కు, విద్య, వినయం అనే ఐదు ‘వ’కారాలు కలిగిన మనిషికి ప్రత్యేక అస్తిత్వం, గౌరవం అవసరం లేదని నేను నమ్మే సిద్ధాంతం (హిందూ మతం) చెబుతుంది. లోకం ఎప్పుడూ మనం అవకాశం ఇవ్వకుండా గేలి చేయదు. అలా లోకం గేలి చేయటానికి మనం ఎంతవరకూ ఆస్కారమిస్తున్నామో కాస్త ఒక్కసారి తరచి చూసుకోండి. సలహాలిచ్చేయటం అన్నిటికన్నా తేలికైన పనే నేనూ అంగీకరిస్తాను. అయితే అవతలివారి తప్పొప్పులు, ముందువెనుకలూ కాస్త వదిలేసి మీవంతుగా తక్షణం తీవ్ర పదజాలంతో ఇతరులను దూషించిన వీడియోలు, ఆడియోలూ తొలగించండి. మీరీ చర్య తీసుకుంటే అవతలివారిని వారి చర్యలను వెనక్కి తీసుకోమని ప్రత్యేకంగా ఎవ్వరూ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండదని గుర్తించండి. అదే సమయములో మీరు కొన్నాళ్ళు వ్యాఖ్యానించకుంటే మీక్కానీ, దేశానికి కానీ వచ్చి పడే నష్టం ఏమీ లేదని గ్రహించి మీరు వ్యాఖ్యానించేటప్పుడు వాడుతున్న భాషను గమనించండి. ఇతరులు వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు వాడుతున్న భాషను పరిశీలించండి. మిమ్మల్నెక్కడా మీ సిద్ధాంతాలతో రాజీపడమని చెప్పను. అది మీ ఇష్టం వ్యక్తిగతం. కాకుంటే మీ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజెప్పే పద్ధతి మాత్రం కచ్చితంగా ఇది కాదు.

  ఒక సాటి మనిషిగా నేను మీకు ఇవ్వగలిగిన అత్యుత్తమ సలహా ఇదే అని నా అభిప్రాయం. ఆపై మీ అదృష్టం దేవుని దయ. శెలవు.

 45. I can’t write telugu and I can read as I said before to you . Shekar gaaru , dayachesi telugu lo meeru deenni marchi prachurinchagalaru.
  1. The biggest problem with Praveen is that he follows certain books and writers blindly. And he believes it without any rational thinking. That makes him standout of the crowd. But he has to understand that , nothing in this world is correct or wrong,everything depend on different perspectives.
  Despite many people’s efforts he won’t understand this.
  2. You can check many blogs where his comments are completely out of the context. And he is against ‘KULALU’ and you can see many many many many comments in which he mention human behavior depending on Kulam . His intension might be right but generalization of his thoughts are wrong. I even commented on his comment as please write some thing in right context and thought.
  3. He never understand the humor when people write the posts. His comments are still serious and make to feel that he has some problem with that . I don’t think he is enjoying the life as it is . I can understand the dreams and ijalu , but at some point you need some relief.
  4. When ” Prapeesasa ” was having posts , lots of people secretively enjoyed a lot because everyone was so frustrated with him. Lot of them say that they wont encourage them but still …. he write a story ( he says its a story ) and no one has right to say anything about it. How it is possible , people like Chalam Also had lot of criticism .
  5. He sometimes loose his temper ( lot of times actually ) . I thought before 2 years that he was young and innocent. So called influenza of some sort of ‘ Ism ‘. Not anymore after the so called “‘Direct attract on to other one’s mother” . No proper brainer will do that ever. Either you need to be utter dumb or insane.
  6. Using excessive references and books and words like “Gati bhouthika vaadam ” , ” boorjuva ” , ” peeditha”, ” gati taarkika bhouthika vaadam ” , will make people think that Communism is something which is far far far far far away from their brains.

  Finally one single request to Praveen – Hope that you print it .

  Please think twice before publishing the comments . Please think whether , your comments is in the right context or not . Think that you will not include words like in 6 point.
  Please its a request that you make people even more away from Communism , ( Most in India will never understand it because of so called ‘Medhavulu’.

  One request to you Shekar gaaru :

  Please explain communism in simple way , not using the words in 6 will at least give people to understand what it is .

  Thanks for your patience . KEVIN

 46. ప్రవీణ్ నువ్వు జీవని ప్రసాద్ గారి మీద పెట్టిన వీడియో సంగతేంటి? నాకు తెలిసి ఆయన ఎప్పుడూ నీతో ఎలాంటి విషయంపై చర్చ చేయలేదు. నిన్ను తిట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇలాంటి వాటికి దూరం. ఒక మంచి పని చేస్తున్న ఆయనని అభినందించడం పోయి అవాకులూ చవాకులూ పేలడం ఏం పధ్ధతి ప్రవీణ్? అసలు ఆయన నీ గురించి ఏమీ అననప్పుడు ఆయనని, ఆయన చేస్తున్న సేవని అంత అవహేళన చేస్తూ మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?

  ఆయన విషయం పక్కన పెడితే నిన్ను ఇక తమ బ్లాగుల్లో కామెంట్లు పెట్టద్దు మహాప్రభో అని సవినయంగా మనవి చేసుకున్నా మళ్ళీ అదే బ్లాగుల్లో పదే పదే కామెంట్లు పెడుతూ ఉంటావు. దీనిని ఏమనుకోవాలి? పోనీ అలా అని చర్చకి సిద్ధపడతావా అంటే అదీ లేదు. నేను నిన్ను శాస్త్ర విజ్ఞానం బ్లాగులో ఒక సిద్ధాంతం యొక్క ఊహ, ఆచరణ విషయం వచ్చినప్పుడు మార్క్సిజం గురించి ఒక ప్రశ్న అడిగాను. అది టాపిక్ కి సంబంధం లేనిది అన్నావు. నేను నిన్ను ఆ ప్రశ్న అసంబద్ధం కాదని, నీ వాదనతో సంబంధం ఉందని నిరూపిస్తానని చెప్పాను. కానీ నువ్వు ఏం చేసావ్? సమాధానం చెప్పకుండా పలాయనం చిత్తగించావ్. దయచేసి నీ వాదన బలంగా వినిపించలేనప్పుడు ఆయా చర్చల్లో కామెంట్లు పెట్టి వాటిని పక్కదారి పట్టించద్దు.

  నేను గమనించినంత వరకు నీకు ఆత్మన్యూనత, అభద్రతా భావాలు ఎక్కువ. వాటిని కప్పిపుచ్చు కోడానికి నిన్ను ఏ విషయంలో అయినా ప్రశ్నించిన వాళ్ళని కే.బ్లా.స సభ్యులు అని నువ్వే తీర్మానిన్చేస్తావ్. నీకు గతం లోనే ఒక సారి చెప్పాను. నీ అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు అందరూ కే.బ్లా.స సభ్యులే అవాల్సిన అవసరం లేదు. నీ అసందర్భ కామెంట్లతో విసుగొచ్చిన ఏ బ్లాగరైనా చాలు అని.

 47. నేను ఇప్పటి వరకు చెప్పినవాటిలో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి లేదా ఇగ్నోర్ చెయ్యాలి కానీ వాళ్ళు అలా చెయ్యరు. కత్తి మహేశ్ గారినైనా, నన్నైనా, నీహారిక గారినైనా, సత్యనారాయణ శర్మ గారినైనా, స్కైబాబా గారినైనా, ఇలా ఎవరినైనా ఒక్కణ్ణి చేసి ఆడుకుంటారు.

  స్కైబాబా గారి బ్లాగ్‌లో ఒక వ్యాఖ్యాత స్కైబాబా గారిని “సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే మీరేం చేస్తున్నారు, గాడిదలు తోలుతున్నారా?” అని అడిగితే స్కైబాబా గారు ఆ వ్యాఖ్యాత వ్యాఖ్యలని డిలీట్ చేశారు. ఒకవేళ నేను కూడా అదే స్టైల్‌లో వ్యాఖ్యలు వ్రాస్తే నా వ్యాఖ్యలు కూడా డిలీట్ చెయ్యొచ్చు. కానీ నా వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఈ సోకాల్డ్ విమర్శకులెవరూ డిలీట్ చెయ్యలేదు. అప్పట్లో స్కైబాబా గారు అతనికి వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యలని డిలీట్ చేసినప్పుడు కెలుకుడు గ్యాంగ్‌వాళ్ళు స్కైబాబా గారి మీద పేరడీ పోస్ట్ వ్రాసారు. ఆయన గాడిదలు తోలుతున్నారని అంటే గాడిదలకే అవమానం కనుక గాడిదలకి క్షమాపణ చెప్పాలి అంటూ పేరడీ వ్రాసారు. వాళ్ళ అనాగరిక పేరడీలు ఇలాగే ఉంటాయి.

 48. ప్రవీణ్ శర్మ గారూ,

  “రెండున్నర జిల్లాల భాష విషయంలో నేను నా సొంత ప్రాంతంవాళ్ళని ఎగతాళి చేశానన్నారు. అచంగ గారు దాని గురించి అడిగారు కాబట్టి చెపుతున్నాను. (మళ్ళీ ఇది సంబంధం లేనిది అనవద్దు)”
  ———————————————————————————————————————————–
  ఇక్కడ మీరు మిస్సయిన లాజిక్ ఏమిటో చెప్పనా?! నేనా టపా రాసింది కోస్తాంధ్ర అంతటా ఒకే యాస ఉంది అని కాదు. తెలంగాణవాదులు ఆరోపిస్తున్నది రెండున్నర జిల్లాల భాషే ప్రామాణిక తెలుగుగా వారి మీద రుద్దుతున్నారు అని. దానికి ప్రతిస్పందనగా వారారోపిస్తున్న రెండున్నర జిల్లాలలోనే భాషలో యాసల భేదాలున్నాయి అని చెప్పటానికి ఆ టపా రాశాను. నేను చెప్పిందీ కోస్తాంధ్రలోనే చాలా భాషావైరుధ్యాలున్నాయని కదా? మరి మీ వీడియో ద్వారా సాధించినదేముంది? మీరు పెట్ట్టిన వీడియో అటు తెలంగాణవాదులనీ సమర్థించక, ఇటు నా సమర్థనకూ నోచుకోక ఏమి బావుకున్నట్లు? జనం వ్యతిరేకత తప్ప!

 49. వాళ్ళు నాతో సిద్ధాంతాల గురించి చర్చించలేదు, కేవలం వదిన-మరిది సంబంధం పేరు చెప్పి విమర్శించారు అని అంటోంటే మీరు ఇంకా నా సిద్ధాంతాలు మీకు అర్థం కాలేదు అంటున్నారు. వాళ్ళు సిద్ధాంతాల గురించి చర్చించకుండా అవి ఎలా అర్థమవుతాయనుకుంటున్నారు? నేను దేని గురించి మాట్లాడినా వాళ్ళే ఆవు వ్యాసంలాగ వదిన-మరిది సంబంధం గురించే అడుగుతున్నారు. అంతెందుకు? వేణు గారి బ్లాగ్‌లో రంగనాయకమ్మ గారు వ్రాసిన పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు వదిన-మరిది సంబంధం పేరు చెప్పి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు కానీ సిద్ధాంతాల గురించి చర్చించలేదే.

  సిద్ధాంతాల గురించి చర్చించడం వాళ్ళకే ఇష్టం లేనప్పుడు ఇంకా నా సిద్ధాంతాలు అర్థం కాకుండా ఉన్నాయని ఆరోపించడం ఎందుకు? అంగీకరించకపోవడాన్ని కూడా అర్థం కాకపోవడం అనరు. కానీ వాళ్ళు చర్చే చెయ్యకుండా సంబంధం లేని ఇంకో విషయం గురించి అడిగి టాపిక్ డైవర్ట్ చేసి నా మాటలు అర్థం కావడం లేదు అని కావాలని అనేవాళ్ళు. వాళ్ళ మోడస్ ఓపరాండీయే అది.

 50. శంకర్ గారూ ఆత్మ న్యూనత, అభద్రతా భావాలు ఉన్న విషయం బ్లాగు రాతల్లో నిర్ధారించగలరా? మీరు వ్యక్తిత్వంపై దాడికి పూనుకుంటున్నారేమో?

 51. కెవిన్ గారూ, మీరు అనువాదం చెయ్యమన్నారు గానీ ఆ ధైర్యం నేను చెయ్యలేను. నేరుగా తెలుగులో రాస్తేనే విపరీత అర్ధాలు వస్తున్నపుడు అనువాదంలో రావని నేను చెప్పలేను. దాదాపు బ్లాగర్లందరికీ ఇంగ్లీష్ వచ్చని అనుకుంటున్నా.

  కమ్యూనిజం పైన సింపుల్ గా వివరించిన పోస్టులు నా బ్లాగ్ లో ఉన్నాయి. ఆ లింక్ లు వెతికి ఇస్తాను. ఓపిగ్గా చదవాలి మరి.

  మానవ సమాజం సంక్లిష్టం కెవిన్ గారూ. వివిధ దేశాల్లో వివిధ సామాజిక ధోరణులు ఉండడమే కాక ఒకే దేశంలో, ఒకే రాష్ట్రంలో, ఒకే భాష మాట్లాడే వారిలో సైతం అనేకానేక సామాజిక ధోరణులు నెలకొని ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల సామాజిక, ఆర్ధీక, రాజకీయ పరిస్ధితులను కొన్ని సూత్రాలలో గుదిగుచ్చి వివరించే మార్క్సిజం ఇదీ అని అంత సింపుల్ గా చెప్పలేకపొవచ్చు.

  ఐనా నా పోస్టులు చదివాక చెప్పండి. లింక్ లు వెతికి మరో వ్యాఖ్యలో ఇస్తాను.

 52. విశేఖర్ గారూ ఆత్మ న్యూనత, అభద్రతా భావాలను బ్లాగు రాతల్లో సులభంగా గుర్తించవచ్చండీ. ప్రవీణ్ రాతలను, ముఖ్యంగా కామెంట్లను నిశితంగా పరిశీలిస్తే ఆ విషయం మీకూ అర్ధమవుతుంది. ఇక నేను ఆ విషయం చెప్పింది తన వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు కాదు. ప్రయత్నంతో అధిగమించదగిన ఈ సమస్యలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే దిశగా ప్రవీణ్ ప్రయతిస్తాడనే ఈ విషయం చెప్పాను.

 53. ఒకవేళ నాకు నిజంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మీరు నా మీద ఇంతగా పడి ఏడవాల్సిన అవసరం లేదు. “ప్రవీణ్‌కి వాడి మీద వాడికే నమ్మకం లేదు, మనకేమిటి భయం” అని అనుకోవచ్చు.

  జీవని ప్రసాద్ గురించి అడిగావు కాబట్టి చెపుతున్నాను. NGOల మీద అతి విశ్వాసం పనికిరాదు. వాళ్ళు చేస్తున్న అవినీతి కూడా తక్కువేమీ కాదు. జీవని ప్రసాద్ అవినీతిపరుడా, కాదా అనే విషయం నేను ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. గతంలో ఇన్నయ్య గారి బ్లాగ్‌లో నాకూ, జీవనికీ మధ్య గొడవ జరిగింది. అతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయ్యుండి జాతకాలూ, ముహూర్తాలూ లాంటి చిల్లర నమ్మకాలని నమ్మితే విద్యార్థులకి కూడా అవే నేర్పిస్తాడా అని సందేహం వచ్చి అతన్ని విమర్శించాను. అంతే కానీ అతనితో నాకు వ్యక్తిగత వైరం లేదు.

 54. అయ్యా ప్రవీణ్ గారూ మీరు మేధావులు, ఈ ప్రపంచాన్ని మార్చే సత్తా కలిగినవారు ( ఏదో అంతర్జాతీయ పార్టీ పెడుతున్నారని కూడా విన్నాను ) ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి నేను చెప్పగలిగేవాడిని కాదు.

  నేనేదో ఆఫ్ట్రాల్ బడి పంతుల్ని. నా మెదడు ఎంత మీ ముందు? మార్క్స్ ని మావోని ఔపోసన పట్టారు. ప్రపంచంలో తమరికి తెలీని విషయం లేదు. ఒరిస్సాలోని కొండ జాతుల నుంచి ఆఫ్రికాలో అడవి జాతుల వరకు, వేదాల నుంచి రాజ్యాంగాల వరకు… ఇలా చెప్పుతూ పోతే మీకు తెలీని విషయం లేదని నాకు తెలుసు. అపారమైన విఙ్ఞానం మీ సొత్తు.
  తమరి ముందు నేను గడ్డిపోచ అని చెప్పడానికి ఇది డిస్క్లయిమర్ అన్నమాట 🙂

  సరే సార్ ngoలు అందరూ అవినీతిపరులని మీ భావన. మీరు కరెక్టే కావచ్చు ఎందుకంటే ప్రపంచంలోని NGO అందరి గురించి మీకు తెలుసు. మరి నా మట్టి బుర్రకు అర్థం అయిందేమంటే వాడెవడో NGO మీ దగ్గర వెబ్సైట్ చేయించుకుని డబ్బు ఎగ్గొట్టాడు కాబట్టి ఈ లోకంలో అందరూ ఇలానే ఉంటారని మీరు నిర్ణయానికి వచ్చేశారు. ప్రతి అనుభవాన్ని మీరు మీ విశాలమైన మెదడులో నిక్షిప్తం చేసుకుంటారు. ఎవడైనా NGO అనగానే వెంటనే మీ మెదడు గిర్రున తిరిగేసి మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది.ప్రవీణూ ఈ భూమ్మిద నీలాంటివాళ్ళతో వెబ్సైట్లు చెయించుకుని డబ్బులు ఎగ్గొట్టడానికే NGO lu పుట్టారు అని. అప్పుడు మీరు కామెంటు పెట్టేస్తారు. NGO లంతా దొంగలని నేను కూడా అవినీతిపరుడని. నేనూ అవినీతిపరుడినే, మాకు విరాళాలు పంపారు చూడు దాదాపు 25 లక్షలు వాళ్ళంతా తెలివితక్కువవాళ్ళు. మీకున్నన్ని తెలివితేటలు వీళ్ళకు ఉంటే విరాళాలు, సహాయం చేసే బదులు బ్లాగుల్లో కామెంట్లు పెట్టుకుంటూ మేధావిలా పోజులు కొడుతూ బలాదూరు తిరిగేవాళ్ళు.
  ఇలా ప్రజలు మోసపోకూడదని తమరు ఆడియోలు, విడియోల ద్వారా చైతన్య పరుస్తున్నారు. ( చూసేవాడికి, వినేవాడికి ఆసక్తి కోసం బూతులు చేరుస్తున్నారనుకుంటా ) దృస్యశ్రవణ మాధ్యమం ద్వారా ఈ ప్రపంచానికి వివేకానందుడు… సారీ మళ్ళీ ఈయనను ఉదహరిస్తే మరో విడియో పెడతావేమో! లెనిన్ మార్క్స్ మావోల మాదిరిగా అనుకో.

  ఇక నేను మా పిల్లలకి జాతకాల గురించి చెప్పానా? నేను జాతకాలను నమ్మినట్టు ఎక్కడ చూశారు మహాశయా?
  అయినా మా విద్యార్థుల పట్ల మీకున్న సానుభూతికి జోహార్లు. నేను విప్లవాల గురించి చెప్తే ఆకాశానికి ఎత్తేశేవారా? మీరు ఎవర్నీ ఎక్కువసేపు ఆకాశానికి ఎత్తరని నా మట్టి బుర్ర అంచనా. ఏదో ఒకరోజు వారి మీద కూడా బూతు విడియో పెట్టేయగలరు.

  మీతో వాదించే ఓపికా తీరికా నాకు లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తే మీరు మా పిల్లల్కు ఎంతో సేవ చేసినట్లు అవుతారు. ( ఆ బోడి టైంలే ఈ సమయంలో మరింత అవినీతికి పాల్పడి అక్కడ ఇంట్లో బంగారు స్పూన్లు కంచాలు ఒక హెలికాప్టర్ మెయింటైన్ చేస్తావులే అని మీరు అనుకోవచ్చు. )

  మీలాంటి మహానుభావులు, గొప్పవాళ్ళు, ఉత్తమ సంస్కారవంతులు జీవనిని ఎంత కించపరిచినా ఎదుగుతూనే ఉంటుంది. ఒక 4 సంవత్సరాలకు జీవని విశ్వరూపం చూస్తావు. నీ దగ్గర లక్షల కొద్దీ స్క్ర్రిన్ షాట్లు ఉంటాయి కదా ఈ చివరి మూడు ముక్కల్ని కూడా అందులో జతపరుచుకో. ఇది నా పొగరు కాదు. జీవనిని శ్వాసిస్తున్న ఎందరో దాతలు, పిల్లలకు ప్రేమ పంచుతున్న మానవతామూర్తులు ఇస్తున్న నమ్మకం.

  ఎప్పుడైనా అనంతపురం వైపు వస్తే తప్పక నన్ను కలువు. ( విచ్చలవిడిగా అవినీతికి పల్పడి నీకోసం ఓ హెలికాప్టర్ కొని ఉంటా ) అనంతపురం జిల్లలో ఉన్న లోయలు పర్వతాలు చూపిస్త. అయితే ఇక్కడ కాకిరి గుమ్మలు, కోతుల గుట్టలూ లేవు ఉన్నవి చూపించగలను.
  అలాగే మా పిల్లల్ని కూడా. నీలాంటి వ్యక్తిని వారికి చూపించే భాగ్యం కూడా కలుగుతుంది.

 55. విషేఖర్ గారూ,

  ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్ర.పీ.స.స అనే బ్లాగు పెట్టక మునుపు బ్లాగర్ల పరిస్థితి. తన భావ జాలానికి సరిపడని టపా కానీ, తాను ఆదర్శమని నమ్మిన దానికి వ్యతిరేకంగా గానీ ఏటపా కనపడినా .. అపర అభ్యుదయ వాదిలా అక్కడికి వెల్లి నీవన్నీ చిల్లర మనస్తత్వాలూ, నీలాంటి వారు మూఢనమ్మకాలను పోశిస్తున్నారు అని దాదాపుగా విరుచ్కు పడినంత పనిచేసేవాదు. అంతే కాదు, తన మావో-స్టాలిన్ అనే పేరుతో పెట్టుకున్న బ్లాగులో కూడా ఘాటైన పదజాలముతో విరుచుకు పడేవాడు.

  పొరపాటున ఎవ్వరైనా చలం గురించిగానీ, రంగ నాయకమ్మ గురించి కానీ రాస్తే చాలు విశ్వరూపం చూపించే వాడు. అప్పట్లో ప్రవీన్ మూడు నాలుగు లైన్ల పోస్టులు రోజూ పెద్ద సంఖ్యలో వేసే వాడు కూడా. దాని మీద ఒక బ్లాగరు ఓపనుగానే విమర్శించాడు. ఇంత కష్టపడి మేము బ్లాగులు రాస్తే.. అవికాస్తా అగ్రిగేటరులో కన్ను మూసి తెరిచేలోగా మాయమైపోతున్నాయి అని. ఈ వివాధం తరువాతే అనుకుంటా.. వీవెన్ గారు రోజుకు ఇన్ని టపాలు మాత్రమే అంగీకరించ బడుతాయి అని కండీషను పెట్టారు.

  కాకపోతే వందగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది అని.. ప్రవీన్ దురదృష్టం కొద్దీ ఒక రోజు మలక్‌ను కెలికాడు అదే రేంజులో. అప్పుడు మొదలైంది అసలు జాతర… మిగిలింది అందరికీ తెలిసిందే..

 56. అయినా మీరేమిటి విశేఖర్ గారూ, మొదటి టపాలో ప్రవీణ్ గారిని సమర్థించి ఆయన కోసం ఒక ప్రతేకమైన పోస్ట్ కూడా వేసి ఇప్పుడాయనకి బుద్ధులు చెప్తున్నారేమిటి? Where is your Integrity ? ఇలా ఒక రోజులోనే మీరు ఇన్ని రంగులు మారుస్తున్నారేమిటి? ఇంతకీ మీరాయన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అన్నదే కొంచం అయోమయగా ఉంది. దయచేసి స్పష్టపరచగలరా?
  నా పేరు క్రిష్ణవేణి

 57. శ్రీకాంత్ గారూ,

  ప్రవీణ్ విషయంలో ‘కెలుకుడు’ వారు చూపించిన సాక్ష్యమూ, నేను స్వయంగా ఎదుర్కొన్న అనుభవమూ మీరు చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

  ఇన్నయ్య గారి బ్లాగ్ లోనే అసలు బూతుల పర్వం మొదలైందని మలక్ పేట రౌడీ గారు స్వయంగా ఈ బ్లాగ్ లో గత పోస్టులో తెలిపాడు. కాని దానికి లింక్ ఆయన ఇవ్వలేదు. ప్రవీణ్ ఆ లింక్ పోస్ట్ చేశారు. అది పట్టుకుని చూశాను. అక్కడ ప్రవీణ్ ని ‘ఒరేయ్’ అనీ ‘మెంటల్’ అనీ ‘నాయాల’ అని తిట్టడంతోనే ఈ బూతుల పర్వం మొదలైందని నాకు అర్ధం అయింది.

  కెలుకుడు గ్యాంగ్ వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఇన్నయ్య గారి బ్లాగ్ లో ప్రవీణ్ వారిపై దాడి చేశారని. ఆ బ్లాగ్ లో చూస్తేనేమో పరిస్ధితి పూర్తిగా అందుకు భిన్నంగా ఉంది. ఈ అంశాన్ని ఇప్పటికే రెండు సార్లు ప్రస్తావించాను గత రెండు రోజుల్లో. మీరు బహుశా మిస్ అయారేమో. ఇది ఎత్తి చూపిస్తూ శంకర్ గారినీ, పద్మ గారినీ వివరించమని కోరాను. పద్మ గారు ఆ తర్వాత ఇటేపు రాలేదు. బహుశా వేరే పనుల్లో ఉండి ఉండవచ్చు. ఆ పనులు ముగిశాక స్పందిస్తారని చూస్తున్నా. ఇక శంకర్ గారేమో ఆ బ్లాగు స్పందనగానే మొదలైందని మళ్ళీ అన్నారు గానీ నేను ఎత్తి చూపిన విషయమై ఏమీ చెప్పలేదు. పదే పదే అడగడం నాకే ఇష్టం లేక వదిలేశాను.

  నేను స్వయంగా ఎదుర్కొన్న అనుభవం ప్రవీణ్ ఎదుర్కొన్న అనుభవంతో సరిపోలింది. నేనూ అమెరికా విదేశాంగ విధానంపై రాస్తే నన్ను దూషించారనీ, దూషిస్తూ రాసిన కామెంట్ తీసేస్తే అది అగ్రిగేటర్ లో ప్రత్యక్షం అయిందనీ, ఆ తర్వాత నన్ను దూషిస్తూ ఏకంగా బ్లాగే పెట్టారనీ నేను చెప్పాను. ఇవేవీ మీకు కనపడలేదా? నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఎదుర్కొన్న టార్చర్ కి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పాను. కాని నేను అవి చూపదలుచుకోలేదు. ఎవరైనా పెద్దలు ‘బ్లాగుల్లో ఇలాంటివి ఇకముందు జరగకూడదన్న సదుద్దేశంతో పూనుకుని చర్చలకు దిగితే, వారికి అన్ని వైపులా సహకారం అందితే అప్పుడు నా వద్ద, నాపై జరిగిన టార్చర్ మొదలైన సాక్ష్యాలు చూపుతాను. నిజానికి అందులో చాలా నాపై దూషిస్తూ రాసిన బ్లాగ్ లో ఇంకా అందుబాటులో ఉన్నాయనుకుంటా.

  ప్రవీణ్ కి నేను ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు భావిస్తున్నారేమో. అది జరగలేదు. ఆయనకి, ఆయన ఏళ్ళతరబడి అనుభవించిన మానసిక హింస, తిట్లు, నిస్పృహ ల నేపధ్యంలో, నా విచక్షణాయుత మద్దతు కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసాను. మీ పై వ్యాఖ్య సందర్భంగా మరొసారి ఆ విషయం చెబుతున్నా.

  తనపైన వీడియోలను, తిట్లను ఉపసంహరించుకుంటే తన వీడియోలను ఉపసంహరించుకుంటానని ప్రవీణ్ స్పష్టం గా చెప్పారు. కెలుకుడు వారి నుండి అటువంటి కనీస ప్రతిపాదన రాకపోగా వారి కెలుకుడు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మరిన్ని బ్లాగుల్లో నాపైన వ్యక్తిగత విద్వేష విష ప్రచారం కొనసాగుతోందని నా డాష్ బోర్డ్ లో వస్తున్న లింక్ ల ద్వారా అర్ధం అవుతోంది.

  ఇన్ని దృష్టాంతాలు కనిపిస్తున్నా కేవలం ప్రవీణ్ వల్లే ఇదంతా ప్రారంభం అయిందని నేను అనుకోవాలని మీలాంటివారు కొరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేను స్వయంగా, కేవలం నా భావాల కారణంగా, ఈ గ్యాంగ్ నుండి తిట్లను, హేళననూ, ఆధిపత్య ధోరణులనూ ఎదుర్కొన్నానని చెబుతున్నా, ఆ నేపధ్యంలోనే ప్రవీణ్ పై సాగిన టార్చర్ ని అర్ధం చేసుకోగలిగానని చెబుతున్నా ఆ అంశాలని ఏ మాత్రం పట్టించుకోకుండా అవే అంశాలను నాకు చెప్పాలని భావించడం భావ్యమా?

  ప్రవీణ్ పైన కెలుకుడు గ్యాంగ్ గానీ, బూతుల బ్యాచ్ గానీ మొదట దాడి ప్రారంభించాకే ప్రవీణ్ రియాక్షన్ మొదలైందని కెలుకుడు వారు చూపిన సాక్ష్యమే ధృవపరిచాక ప్రవీణ్ తోనే అంతా మొదలైందని నన్ను నమ్మమని మీరు చెప్పలేరు. ఇతర బ్లాగర్ల విషయంలో అతను అనుసరించిన ధోరణులకు సంబంధించి ప్రవీణ్ కి నేను చెప్పదలిచినది చెప్పాను. మీ లాంటి వారు కెలుకుడు వారికి ‘కెలుకుడు’ ఆపాలని, వ్యక్తిగత విద్వేష ప్రచారం మానుకోవాలని, ఏమన్నా ఉంటే భావజాలం పైన చర్చ చేయండనీ కోరాల్సిన భాధ్యత ఉంది. ఆ భాద్యతను నిర్వర్తించడానికి కనీస ప్రయత్నం మీరు చేయగలిగితే నా కంటే సంతొషించేవారెవరూ ఉండరు. ఆ పని మీరు చేయగలరా? నా కొసం మరొకరి కోసం కాదు. బ్లాగింగ్ లో సత్సంప్రదాయాలను నెలకొల్పడం కోసం. మీరూ బ్లాగింగ్ చేస్తున్నారు. ప్రవీణ్ వ్యాఖ్యలతో హింస పడ్డామని మీరు చెబుతున్నారు. అలాంటపుడు ఇప్పటికీ నన్ను హింస పెట్టాలని ప్రయత్నిస్తున్న కెలుకుడు గ్యాంగ్ ని అవన్నీ అపేయాలని కోరాల్సిన భాధ్యత లేదా?

  ఎవరో ఒకరి నుండి ప్రయత్నం మొదలు కావాలి కదా. అందులో భాగంగా మొదటి ప్రయత్నంగా ప్రవీణ్ ని అవతలి వారు ఎంత అధములైనా సంయమనం కోల్పోవడం సరికాదని చెప్పాను. అలాగే మీరు కూడా వారికి చెప్పండి. ఇపుడు బ్లాగుల్లో ఉన్న కెలుకుడు చెత్త అంతా తొలగించి ఇకముందైనా పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడంలో మీరూ భాగస్వాములు కాలేరా?

 58. క్రిష్ణవేణి గారూ, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. మొదటి టపానుండి చెబుతున్నదే ప్రవీణ్ గారిపై రాస్తున్న టపాలోనే రాసాను.

  ఐనా అడిగారు కనక క్లుప్తంగా వివరిస్తాను. అనుమానాలొస్తే మాత్రం మళ్ళీ ఒకసారి టపాల్లోకి వెళ్ళండి.

  ఒకటి: ప్రవీణ్ ది రియాక్షన్ తప్ప యాక్షన్ కాదు. స్పందనగానే అతని విపరీత ధోరణి మొదలైంది. ఆయన ఏళ్ళ తరబడి అనుభవించిన హింస, ఎదుర్కొన్న బూతులు, ఒంటరి తనం లోనుండి వచ్చిన నిరాశ అన్నీ కలిసి అతనిని ఇలా బూతుల్లోకి దింపింది.

  రెండు: అతనికి కొన్ని అభ్యుదయ భావాలు ఉన్నాయి. నవ్య మానవతా వాదం, నవీన స్త్రీ వాదం, హెగిల్ భావ వాదం, మార్క్సిజం లాంటి అంశాలపైన అవగాహన ఉంది. అలాంటి భావాలు, అవగాహన ఉన్నవారికి సామాజిక భాధ్యత ఆటోమేటిక్ గా వచ్చి చేరుతుంది. వారు నమ్ముతున్న భావాలు వారిపై ఆ భాధ్యతను మోపుతాయి. అందులో ఎట్టి పరిస్ధితుల్లోనూ స్త్రీలను నేరుగా బజారుకి ఈడ్చే బూతులను ఉపయోగించక పోవడం ఒకటి.

  మూడు:ప్రవీణ్ నమ్ముతున్న భావజాలం ప్రాతిపదికనే ఆయన, తన శత్రువులనైనా సరే బూతులు తిట్టడం సరికాదు. సామాజిక అణచివేతకు స్త్రీలు గురవుతున్నారని ఒకవైపు వాదిస్తూ మరొక వైపు తన శత్రువు బూతులు తిట్టారని సాకు చూపి అదే స్త్రీలపైన అవే బూతులను ప్రవీణ్ వాడడం సరికాదు.

  నాలుగు: కనుక ప్రవీణ్ తన బూతుల్ని ఉపసంహరించుకోవాలి. అలా చేస్తే అది ఆయన నమ్ముతున్న భావజాలాన్ని గౌరవించినట్లే. ఆ ఉపసంహరణ అతని శత్రువుల బూతులకు సర్టిఫికేట్ కాదు. అలా అని వారు సంతోషిస్తే వారి హ్రస్వ దృష్టిగానే పరిగణించాలి.

  ఐదు: ప్రవీణ్ ని బూతులు ఉపసంహరించుకోమని నేను కోరడం అతని శత్రువులకు మద్దతు ఇస్తున్నట్లు కాదు. నిజానికి ప్రవీణ్ కి నేనిస్తున్న గౌరవంలో ఒక భాగంగానే చూడాలి. పైన రెండు, మూడు, నాలుగు పాయింట్లు మొదటి పాయింటు ని రద్దు పరచవు.

  ఆరు: కేవలం బూతులు మాత్రమే ఖండనార్హమనీ, ఇతర ఛండాలం అంతా ఆమోదనీయం అనీ నేను భావించడం లేదు. అవ హేళన, వ్యక్తిగత విద్వేష ప్రచారం, అసలు పేర్లతో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ మారు పేర్లతో బూతులు రాస్తూ ప్రవీణ్ బూతుల్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫోజులు పెట్టడం నాకు తెలుస్తూనే ఉంది. బూతులతో సమాన ప్రతిపత్తి వీటికీ ఉంది. అభ్యుదయ భావజాలం ఉన్నవారికి మాత్రమే బూతులకి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి అర్ధం అవుతుంది. ఆ భావజాలం నమ్మని ప్రవీణ్ వ్యతిరేకులకు ఈ విషయంలో నేను చూపే విచక్షణ వర్తించదు.

  ఏడు: ఈ సందర్భంగానైనా బ్లాగర్లు బూతులు, విద్వేష ప్రచారం, కెలుకుడు, పేర్లు మార్చుకుని బూతులు పెట్టడం ఇవన్నీ అపాలి. ఇవన్నీ చేయని వారు, చేస్తున్నవారిని ఆపాలని కోరాలి. వారిని కోరక పోయినా కనీసం స్వతంత్రంగానైనా తమ తమ బ్లాగుల్లో ఇలాంటివి ఆమోదించబోమని ప్రకటించాలి.

  అర్ధమైందని భావిస్తున్నా.

 59. Yes. Somewhat. But then my Telugu is not strong enough to continue in the same language. Does not mean that I am unable to read and understand Telugu perfectly well. But then I hope that from now on I will be allowed to comment in English.
  Thank you.

 60. విశేఖర్ గారూ,

  ముందుగా మీకు అభినందనలు. I appreciate your step.

  ఇక నా పైన వేసిన కొన్ని అభాండాల విషయానికి వస్తే

  కెబ్లాస ఉన్నది మీరు చెప్పిన అర్ధంలో కాదని వాళ్ళే వివిధ సందర్భాల్లో చెప్పుకున్నారు. వారి అసభ్య వ్యాఖ్యలు తీసేసినా, వారికి నచ్చని భావాలు రాసినా, తమ అభిప్రాయాలను ప్రచారం చేసుకునే పేరుతో ఇతరులని కెలుకుతారట.
  పద్మ గారూ ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేశారు.
  ————————————————————————
  ఎవరన్నారండి ఆ మాట? నేనా? మీకు అలా అర్థం అయితే అదే మాట చెప్పండి. కానీ don’t try put words in my mouth..

  “వారి అసభ్య వ్యాఖ్యలు తీసేసినా, వారికి నచ్చని భావాలు రాసినా” ఈ మాటలు నేనన్నవా? మీరు అర్థం చేసుకున్నవా? అవతలి వాళ్ళు ఏ మాటన్నా మీకు కావలసినట్టుగా అర్థం చేసుకోవటం మీ పధ్ధతి అయితే, సో బీ ఇట్. మీరా భావనలోనే ఉండండి కానీ, అది ఇలా పబ్లిక్‌గా అవతలి వాళ్ళ అభిప్రాయమని రుద్దకండి. మీ పోస్ట్స్‌లో నేను చూసినవి చాలా మటుకు ఇలాగే ఉంటాయి. అవతలివాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోరు. మీరు అవి ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అలాగే అర్థం చేసుకుంటారు. పచ్చ కళ్ళద్దాలతో చూస్తే ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుందండి.

  మీ భావజాలం మీకు ఉండవచ్చు. ఇంకొకరి భావజాలం వారికి ఉండవచ్చు. కానీ మీరు ఏరకంగా రాసినా అది కరెక్టు ఇంకెవరు రాసినా తప్పు అనటం న్యాయం కాదేమో. ఇక వ్యంగ్యంగా రాయటం అసభ్యం కింద వస్తే ఆర్.కే లక్ష్మణ్ కార్టూన్స్ అన్నీ బూతులే కదండి.
  కెబ్లాస వారివి అసభ్య వ్యాఖ్యలు అని మీరంటున్నారు, అనుకుంటున్నారు. అంతే. మీ రాతలు తప్పు అంటే మీకు కోపం వచ్చి కామెంట్స్ ప్రచురించకుండా ఉండటం, మీరు రాసింది సరి కాదు జరిగింది ఇది అని చెప్తే త్రాష్టుడు, నికృష్టుడు అని తిట్టటం. నిజం చెప్పండి విశేఖర్ గారూ, మీరెన్ని వ్యాఖ్యలు తిరస్కరించి ఉంటారు? అది తప్పు అని కూడా నేననటం లేదు. మీ బ్లాగు మీ ఇష్టం. కానీ మీ బ్లాగులో ప్రచురించనివ్వకుండా, వేరే ఎక్కడో వాళ్ళు ప్రచురించుకుంటే అది కూడా తప్పు అనటం సమంజసం అంటారా? భరద్వాజ బ్లాగ్‌కి వెళ్ళి చూడండి. జీడిపప్పు గారన్నారు మీ కమ్యూనిస్ట్ రచనల మీద ఆయన కామెంట్ రాస్తే అది మీరు తిరస్కరించారని. జీడిపప్పు గారి వ్యాఖ్యలు అసభ్యకరమైనవని అంటే అది మీరొక్కరే అవ్వాలి, ఇంకెవరూ అనరు, అనలేరు. ఇక ప్రత్యేకంగా బ్లాగ్ పెట్టకూడదు, మీ అభిప్రాయాల మీద మీ దగ్గరే చర్చించాలి అనుకున్నప్పుడు (వ్యాఖ్యలు ప్రచురించటం ప్రచురించకపోవటం మీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నా సరే) మీరు కూడా అదే పని చెయ్యాలి కదండి. ఉదాహరణకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వస్తే దాన్ని మీరు మీ తెలుగు వార్తల్లో మీ “అభిప్రాయం” మీకు అర్థమైనట్టుగా ప్రచురిస్తారు. ఎందుకు? మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాడి వార్త నచ్చకపోతే ఆ వార్త వేసిన చోట డిస్కషన్ చెయ్యాలి కానీ ప్రత్యేకంగా ఒక బ్లాగ్ ఎందుకు? అందులో రాయటం ఎందుకు?

  మీకు ఇప్పటికి నేను లక్షసార్లు చెప్పాను. చూస్తుంటే ఇంకో లక్ష సార్లు చెప్పాలేమో అనిపిస్తోంది. నేను ప్రవీణ్ బూతుల గురించి మాట్లాడింది కూడా కుటుంబ సభ్యులని లాగి నోటికి వచ్చినట్టు మాట్లాడాడనీ అది తప్పనీ. కుటుంబ సభ్యులని బైటికి లాగి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా బూతులు మాట్లాడటం క్షమించరాని నేరమనీ. మీరు అది కన్వీనియంటుగా పక్కన పెట్టేసి ప్రవీణ్‌ని బూతులు తిట్టారు కాబట్టి ప్రవీణ్ తిట్టాడు. అది నేనర్ధం చేసుకోగలను. కానీ ఆడవాళ్ళని తిట్టటం తప్పు అని చాలా తెలివిగా వాదిస్తున్నారు. మీకు ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీద చూపించుకోండి. ఆ వ్యక్తి కుటుంబం మీద కాదు. ఈ పాయింటు మొదటి నించి ఎంఫసైజ్ చేస్తున్నాను. ప్రవీణ్ భరద్వాజని బూతులు తిట్టటం, భరద్వాజ ప్రవీణ్‌ని బూతులు తిట్టటం అన్నది చాలా వేరు విషయం. అలా అని వాళ్ళిద్దరూ బూతులు తిట్టుకోవటం నేను సమర్ధిస్తున్నానని మీరు మళ్ళీ మీ సొంత అభిప్రాయానికి వచ్చెయ్యకండి. పరిస్థితి అలా ఉంటే ఈ డిస్కషన్ ఇంకోలా ఉండేది. అప్పుడు ఇంకా చాలా విషయాలు బైటికి వచ్చేవి. ఒక్కసారి ఆలోచించండి విశేఖర్ గారు, నేను మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నారు. నేను తిరిగి మిమ్మల్ని కాక మీ తల్లిగారిని అంటే మీకెలా అనిపిస్తుందండి? అనటం తప్పే కానీ ఎంత విసిగిపోతే అలా చేసుంటానో అని మీరనుకోగలరా? (మీరు నన్ను క్షమించాలి మీ తల్లిగారి ప్రస్తావన తెచ్చినందుకు. నాకు ఇంతకన్నా ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. మీరు ఇది తప్పు అని భావిస్తే ఆ వాక్యం తీసెయ్యండి. మరోసారి క్షమాపణ కోరుతున్నాను.)

  నేను పదే పదే చెబుతున్నదేమంటే అటువంటి వారి బూతు ధోరణితో విసిగిపోయాక మాత్రమే ప్రవీణ్ బూతుల్లోకి దిగాడని. ఎంత విసిగిపోయినా బూతుల్లోకి దిగరాదని ప్రవీణ్ కి చెబుతూనే అతను అనుభవించిన టార్చర్ ని గుర్తించి ఆ టార్చర్ విధించడాన్ని కూడా ఖండించాలని కోరుతున్నాను.
  ————————————————————————————–
  ఇది చాలా హైట్స్ అండి. మీరు పదే పదే చెప్తున్నాను, చెప్తున్నాను అంటున్నారు కానీ మీరు చెప్పేది ప్రవీణ్ బాధేనా, అవతలి వాళ్ళ బాధ మీకు తెలుస్తోందా? జీవని ప్రసాద్ గారు ఎన్ని ఏళ్ళుగా ప్రవీణ్‌ని టార్చర్ పెడితే ప్రవీణ్ అనకూడని మాటలు ఆయనని అన్నారండి? ఎందుకు జీవని మీద అన్ని చెత్త, చండాలమైన రాతలూ, వీడియోలూ? జీవని గురించి తెలియకుండా, నోటికి వచ్చినట్టు మాట్లాడి చేతి దురద తీర్చుకోటానికి అన్నట్లు రాసేసి అది జనాల మీదకి వదిలేస్తే దాని గురించి ఎవరూ ఏమీ అనకూడదు. అంటే అది అతని భావజాలం మీద దాడి. భరద్వాజని సపోర్ట్ చేసినందుకు ఒక పెద్దావిడని (ఒక సీనియర్ బ్లాగర్) ఆవిడ కొడుకు వయసు ఉన్న ఇంకొక బ్లాగర్‌తో కలిపి చండాలమైన రాతలు రాశాడో మీకు తెలుసా? ఆవిడ ఎన్నేళ్ళు ఇతన్ని వేధించిందని అలాంటి రాతలు రాశాడండి? మొన్న కొన్ని లింకులు చూసి అందులో ప్రవీణ్ గారి వ్యాఖ్యలు మొదటిది చదవగానే కంపరం వేసింది. చివరి వరకు ఏం ఖర్మ రెండొడే చదవలేకపోయాను. ఏళ్ళుగా జరిగిన బూతు ధోరణితో విసిగిపోయాక మాత్రమే ప్రవీణ్ బూతుల్లోకి దిగాడంటున్నారు. మరి, ఫ్రాంక్లీ, మీరెన్ని ఏళ్ళుగా ప్రవీణ్ అనుభవిస్తున్న టార్చర్ గమనిస్తూ వచ్చారో తెలీదు. కానీ ఎన్ని ఏళ్ళుగా ప్రవీణ్ బూతు ప్రవచనాలు చదువుతున్నాడో మీరు గమనించలేదా? అది కేవలం గత కొన్ని నెలలుగా మాత్రమే జరుగుతోందని ఎలా బావిస్తున్నారు? పోనీ అన్నేళ్ళుగా గమనిస్తున్నారు అంటే ప్రవీణ్ బారిన పడ్డ మిగతావారి టార్చర్ కూడా గమనించాలి కదండి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు.

  ప్రవీణ్‌కి ఒక రూల్, మీ మిత్రులకి ఒక రూలా అని అడిగారు పాత పోస్ట్‌లో. ఎంత మాత్రం కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు ఎంత సేపు కెబ్లాస తప్పు చేసింది అంటున్నారు. సాక్ష్యం చూపించమంటే తెలివి గల వాళ్ళు కాబట్టే వేరే ఐడీస్‌తో వచ్చి బూతులు మాట్లాడారు అంటున్నారు. మరి అదే అజ్ఞాతలుగా వచ్చి ఇతర బ్లాగర్లని తిట్టింది చూడలేదా మీరు? కానీ ఆ అజ్ఞాతల రూపంలో వచ్చి కెబ్లాస సభ్యులని తిట్టింది మటుకు ప్రవీణ్ అతని సపోర్టర్స్ కాదు. ఆ అజ్ఞాతలు కూడా కెబ్లాస సభ్యులే. వాళ్ళే వాళ్ళని వాళ్ళు తిట్టుకుని ప్రవీణ్ మీదకి నెడుతున్నారు అంటున్నారు. ఇది మీకు కాస్తన్నా భావ్యంగా అనిపిస్తోందా? ఇప్పుడు నేనడుగుతున్నాను మిమ్మల్ని. మీ సపోర్టర్‌కి ఒక రూల్, కెబ్లాసకి ఒక రూలా విశేఖర్ గారూ? మిమ్మల్నో, ప్రవీణ్‌నో అజ్ఞాతల ఐడీల్లో వచ్చి మాటలంటే ఆ ఐడీలు ఖచ్చితంగా కెబ్లాస సభ్యులవే. కానీ కెబ్లాస సభ్యులనో, ఇతర బ్లాగర్లనో అజ్ఞాతలుగా వచ్చి తిట్టినవాళ్ళు మాత్రం ప్రవీణ్ కాదు. ఆ ఐడీలు కెబ్లాస వాళ్ళవే. కదండి? సో మీరు చెప్పేది అజ్ఞాత = కెబ్లాస. అంతే. ఇదేం విశ్లేషణ అండి?

  “అసలు పేర్లతో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ మారు పేర్లతో బూతులు రాస్తూ ప్రవీణ్ బూతుల్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫోజులు పెట్టడం నాకు తెలుస్తూనే ఉంది. ”
  ———————————————————————-
  ఎలా తెలుస్తోందండి మీకు? కాస్త అందరికీ చెప్పండి. తద్వారా ఇతరులు కూడా మారుపేర్లతో వచ్చినవారెవరో తెలుసుకోగలరు. ఒక వేళ రాసిన పధ్ధతి, స్టైల్ అంటారా? ఆ ప్రకారం అయితే మీరన్న ఇన్నయ్య గారి బ్లాగ్‌లో బూతులు మొదలు పెట్టీన ఐడీ రాసిన విధానం అచ్చం ప్రవీణ్ రాసినట్టుగానే ఉంది. మరి ప్రవీణే మూల కారణం అని నమ్మేద్దామా?

  “అభ్యుదయ భావజాలం ఉన్నవారికి మాత్రమే బూతులకి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి అర్ధం అవుతుంది.”
  ———————————————————-
  ఈ మాట అర్థం కాలేదు విశేఖర్ గారూ. బూతులకి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ఏంటండి? అంటే బూతులు ఉపయోగించటం ఎట్టిపరిస్థితులలోనూ తప్పనా? మరి అలాంటప్పుడు ప్రవీణ్ అసలు అభ్యుదయవాది ఎలా కాగలడు? But, seriously, I did not understand what it meant. If you could please explain it to me, I may respond to it properly.

  “కెలుకుడు గ్యాంగ్ వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఇన్నయ్య గారి బ్లాగ్ లో ప్రవీణ్ వారిపై దాడి చేశారని. ఆ బ్లాగ్ లో చూస్తేనేమో పరిస్ధితి పూర్తిగా అందుకు భిన్నంగా ఉంది.”
  ————————————————
  మీరు చూసిన పోస్ట్‌లో చాలా కామెంట్స్ తీసేసారు విశేఖర్ గారూ. తద్వారా మీకు అసలు పరిస్థితి తెలిసే అవకాశం లేదు. మీరు ఈ కింది పోస్ట్ చూడండి. ఇందులో స్క్రీన్షాట్స్ ఉన్నాయి బూతుల పర్వంవి. బూతులు ఎవరు మొదలెట్టారో మీకు చాలా సుస్పష్టం అవుతుంది.
  http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

  మీరు మీ https://teluguvartalu.com/2012/01/04/%E0%B0%AC%E0%B1%82%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A1%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95/ పోస్ట్ లో మోపిన అభియోగాలకి అక్కడే సమాధానం ఇస్తాను. ఈ రెంటినీ కలపటం సమంజసం అనిపించటం లేదు.

 61. మలక్ ఇన్నయ్య గారి బ్లాగ్ యొక్క లింక్ ఎన్నడూ చూపించలేదు. అలా చూపిస్తే ఇన్నయ్య గారి బ్లాగ్‌కి హిట్లు పెరిగిపోతాయని మలక్ మొదట్లోనే వాదించాడు. కొన్ని స్క్రీన్‌ షాట్‌లు మాత్రం తీసి ఉంచుకున్నాడు.

  ఇన్నయ్య గారి బ్లాగ్‌లో గొడవ జరిగినప్పుడు జీవని ప్రసాద్‌ గారిపై చేసిన విమర్శలకి నేను కట్టుబడే ఉన్నారు. చిన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన గురువే భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సామెతలు ఉపయోగించేవాడు. “మొగుడు చచ్చినా ము.మో.కి బుద్ధి రాలేదు” అనే సామెత విద్యార్థులు చూస్తుండగా ఎన్ని సార్లు అన్నాడో గుర్తు లేదు. విద్యార్థులు జాతకాలు లాంటి చిల్లర నమ్మకాలని నమ్మితే ఏ పరిస్ధితిలోనూ బాగుపడరు. అలాంటిది గురువులే అలాంటి వాటిని నమ్మితే (వారిని అనుసరించే విద్యార్థులు) వాటిని నమ్మరని గ్యారంటీ లేదు. (అందువలన గురువులు విద్యా బోధనలో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది)

  శ్రీకాంత్‌కీ, నాకూ మధ్య చర్చ స్త్రీవాదం విషయంలో జరిగింది. అతను భార్యాబాధితులు ఉన్నారు అని వాదిస్తే నేను లేరు, ఉంటే ఒకరో, ఇద్దరో ఉండొచ్చు, వాళ్ళనే హైలైట్ చెయ్యడం బాగాలేదు అని అన్నాను. రేప్ లాంటి విషయాలలో కూడా వాళ్ళ భావజాలం స్త్రీలని కించపరిచే విధంగానే ఉంది. సామాజిక కట్టుబాట్ల వల్ల, బయోలాజికల్ కారణాల వల్లా కూడా, స్త్రీలు పురుషులని రేప్ చేయడం కుదిరేపని కాదు.

  ఎన్నడన్నా, ఎక్కడైనా స్త్రీ పురుషుణ్ణి రేప్ చేసిన వార్తలు వచ్చాయా? కానీ శ్రీకాంత్, అతని స్నేహితులు ఏమన్నారంటే “ఆడది మగవాణ్ణి రేప్ చేసినా, మగవాడు ఆడదాన్ని రేప్ చేసినా ఆడదాని శీలమే చెడుతుంది. అరిటాకు ముల్లు మీద పడినా రంధ్రం పడేది అరిటాకుకే” అని.

  ఇలా స్త్రీలని కించపరిచే సంకుచిత నమ్మకాలని నమ్మేవాళ్ళని చూస్తే కొంచెం పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళు ఎవరికైనా బాధ కలుగుతుంది. నేను చాలా కాలం పాటు శ్రీకాంత్ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాయలేదు. ఎందుకో నేను ఇక్కడ చెబుతున్నాను.

 62. గతంలో జార్ఖండ్‌లో మావోయిస్ట్‌లు ICICI ATMలపై దాడి చెయ్యడం గురించి వాసవ్య గారికీ, నాకూ మధ్య చర్చ జరిగింది.

  సాధారణ వ్యక్తి ఎలాగూ పది వేలు రూపాయలు పెట్టి ICICIలో అకౌంట్ ఓపెన్ చెయ్యలేడు. జార్ఖండ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలలో ICICIలో డబ్బులు ఉండేది మైనింగ్ కంపెనీలకే. మావోయిస్ట్‌లు ICICI ATM నుంచి డబ్బులు కొట్టేసినా పోయేది మైనింగ్ కంపెనీల డబ్బే కానీ ప్రజల డబ్బు కాదని నేను వాదించాను.

  ఈ విషయంలో నా వాదనని వాసవ్య గారు అంగీకరించలేదు, వాసవ్య గారి వాదనని నేను అంగీకరించలేదు. ఇద్దరం డీసెంట్‌గా ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాము కానీ ఒకరినొకరు కెలుక్కోలేదు.

  కానీ కెలుకుడు గ్యాంగ్‌వాళ్ళు అలా కాదు. దారిన పోయే వాళ్ళని పిలిచి మరీ కెలుకుతారని సత్యనారాయణ శర్మ & స్కైబాబా గార్ల విషయంలోనే తేలిపోయింది కదా.

 63. విశేఖర్ గారూ,

  ప్రవీన్ విషయములో నాది అనుభవం. నాకు స్క్రీన్ షాట్లతో కానీ, మరో సాక్షాధారాలతో కానీ పనిలేదు. నేను స్వయంగా చూశాను. కొంత మంది బ్లాగర్లు నా బ్లాగులోనే తమ గోడును వెల్లబోసుకోవడం. కూడా జరిగింది. ఇదంతా, అసలు బ్లాగుల్లో ప్రవీన్ మీద కెలుకుడు అన్నది ప్రారంభం కాక మునుపు మాట. అప్పటి ప్రవీన్ Agressiveness గురించి అతని రాతల గురించి నాకు బాగా తెలుసు. (అప్పుడు అతను మార్తాండ అనేపేరుతో రాసేవాడు.

  పైన ఒక బ్లాగర్ రాసింది మీకు గుర్తుండే ఉంటుంది. ప్ర.పీ.స.స (అందులో ప్ర. పీ అంటే ప్రవీన్ పీడిత అని అర్థం. స.స అంటే గుర్తుకు లేదు) లో ప్రవీన్ మీద కెలుకుడు టపాలు పడినప్పుడు చాలా మంది ఎంజాయి చేశారు అని. అంత వ్యతిరేకత బ్లాగర్లలో చాలా మందికి ఎందుకు వచ్చింది? కేవలం భావజాలం కారణంగానే అనుకుంటే.. మీరు పొరపడ్డారని చెప్పక తప్పదు.

  ఇక మలక్ విషయములో జరిగినది నా అనుకోలు మాత్రమే. మిగిలిన బ్లాగర్ల పైగానే అతని మీద కూడా తన ప్రతాపాన్ని చూపబోయి దెబ్బ తిన్నాడు అని. ఇరువురు తిట్టుకోవడం మొదలు పెట్టిన తరువాత ఎవరు ముందు ఎవరు వెనుక అనే దానితో సంబందం లేకుండా.. చాలా జరుగుతాయి.

  మీరు ప్రవీనుకు ఇచ్చే మద్దతు విషయం అంటారా, The final outcome is very important. మిగిలిన వాటికి అంత ప్రాముఖ్యత ఉండదు. ఆ outcome అనేది ఇటీవల ప్రవీన్ పెట్టిన అతి హేయమైన టపా తొలగించడం అయితే.. చాలా విషయాలు సెటిల్ అవుతాయి. మిగిలిన వాటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది అనుకోను.

 64. నేను భరద్వాజ వాళ్ళ అమ్మగారిని తిట్టినా భరద్వాజకి అభ్యంతరం లేదు, నేను తిట్టానని చెప్పి సానుభూతి కోరుకోవడమే అతనికి ముఖ్యం. వాళ్ళ అమ్మగారి గురించి భరద్వాజకి లేని బాధ నాకెందుకు? కత్తికి లేని దురద కందకి అవసరం లేదు.

  అయినా ఇంకొకరి చేత జుగుప్సకరమైన తిట్లు తిట్టించుకుని సానుభూతి పొందాలనుకోవడం మానసిక రోగుల లక్షణమే కానీ ఇంకొకటి కాదు.

 65. కృష్ణవేణి గారు, ముందు బూతు అంటే ఏమిటో చెప్పండి.

  ఆడది తన బావతోనో, మరిదితోనో సంబంధం పెట్టుకున్నట్టు వ్రాస్తే అది బూతు అంటారు, మగవాడు తన వదినతోనో, మరదలితోనో సంబంధం పెట్టుకున్నట్టు వ్రాస్తే అది పేరడీ అంటారు.

  ఒక వ్యక్తికి తెలియకుండా వెనుక నుంచి ఆ వ్యక్తి గురించి బూతులు మాట్లాడుకోవడం పాత స్టైలే. దీని గురించి ఇంతకు ముందు చర్చ జరిగింది, చదవండి: http://kalpanarentala.blogspot.com/2010/06/blog-post_2005.html

 66. శంకర్. ఎస్ గారూ!

  కెలుకుడు గ్యాంగ్ కు అనుకూలంగా చాలా మాట్లాడిన మీరు విశేఖర్ గారు స్పష్టంగా అడిగిన ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి – ‘నాపైన జరిగిన దాడిని మాట మాత్రంగానైనా ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? నేను ప్రారంభించలేదు కదా. నేను అనుసరించడం లేదు కదా? కనీసం వారి బ్లాగుల్లోకి వెళ్ళడం లేదు కదా? ఇప్పటీకీ తిడుతున్నారు కదా? అది తప్పని ఎందుకు ప్రకటించలేరు శంకర్ గారూ?’

  ఇదే పోస్టులో మీరు చేసిన కామెంట్ ని ఓసారి గుర్తు చేస్తాను – ‘మీ భావజాలం పై దాడిచేస్తే నేను అంగీకరిస్తానేమో కానీ మీ పై వ్యక్తిగత దాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఖండిస్తాను. ఒకరి అభిప్రాయం మనకి నచ్చకపోతే దానిని ఖండిస్తూ వాదన రూపంలో అవతల వాళ్ళ భావజాలం పై దాడి చేయవచ్చు. ఎవరి వాదనలో దమ్ముంటే వాళ్ళే విజేతలు. అభిప్రాయం నచ్చనంత మాత్రాన అవతల వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం పద్ధతీ కాదని ప్రవీణ్ విషయంలోనే స్పష్టం చేశాను.’

  ఈ ధోరణికి భిన్నంగా ఈ మధ్య కాలంలోనే మీరు చేసిన కొన్ని కామెంట్లు చూడండోసారి.

  1. అసభ్యతా, మన సమాజం యొక్క average tolerance by SHANKAR.S పై అభిప్రాయములు

  వ్యాఖ్యాత: :SHANKAR.S బ్లాగు :ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టపా : వ్యాఖ్యనించిన తేది: 05-01-12 05:49:04

  పిచ్చి నా ప్రవీణూ నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకునే ప్రతి వాడూ ప్ర.పీ.స.స అయితే నువ్వు తప్ప బ్లాగర్లందరూ ప్ర.పీ.స.స కిందే లెక్క. “నీ మాటలు చదువుతోంటే ప్రపీసస పెట్టినది నువ్వేనని అర్థమైపోతుంది.” ఇంకో సారి ఇలా తెలిసీ తెలియక పిచ్చి వాగుడు వాగకు అర మెదడు కుంకా
  ———————-
  2. ప్రవీణ్ నిన్నొకటి అడుగుతా సూటిగా సమాధానం చెప్తావా?…

  వ్యాఖ్యాత: :SHANKAR.S బ్లాగు :నాన్న టపా : నీ యబ్బరేయ్!! గూగులుగా!!! వ్యాఖ్యనించిన తేది: 02-01-12 11:01:33

  ప్రవీణ్ నిన్నొకటి అడుగుతా సూటిగా సమాధానం చెప్తావా? ఇందాకా నువ్వు మీ వదిన గారి మీద పేరడీలు రాశారు అన్నావు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ఆవిడ పేరు ఉపయోగించి పేరడీలు రాశారా? ఒక వేళ అలా రాసి ఉంటె సాక్ష్యాలు చూపించు. లేదా ఇలాంటి రాతలు రాస్తున్నందుకు ఈ రోజు నా చేతిలో చచ్చావే నువ్వు.

  ———————
  3. మగవారి దుస్తులపై మోరల్ పోలీసింగ్.. భవిశ్యత్తు, 2000012, Jan 02 by SHANKAR.S పై అభిప్రాయములు

  వ్యాఖ్యాత: :SHANKAR.S బ్లాగు :కలల ప్రపంచం టపా : వ్యాఖ్యనించిన తేది: 02-01-12 08:57:05

  “మీరు నా వదిన మీద పేరడీ వ్రాసినప్పుడు” ఎవరు రాశారు ప్రవీణ్? నేను రాశానా? లేక రాయడం నువ్వు చూశావా? పిచ్చి వాగుడు వాగితే తోలు తీస్తా జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.
  ———————-

  శంకర్.ఎస్ గారూ! ‘అర మెదడు కుంకా’, ‘నా చేతిలో చచ్చావే నువ్వు’, ‘తోలు తీస్తా జాగ్రత్త’,,, ఇవన్నీ వ్యక్తిగత దాడి కిందకు రావా? వ్యక్తిగతంగా దూషించడం కాదా? మీరే చెప్పండి!

 67. విశేఖర్ గారూ మీరు ఇన్నయ్య గారి బ్లాగ్ లో ప్రవీణ్ తనకు అనుకూలంగా ఉన్నట్టు చూపించే లింక్ ఇచ్చినట్టు నాకు తోస్తోంది. ఈ గొడవ 2009 సెప్టెంబర్ లో మొదలయినట్టు ప్రవీణ్ ఇచ్చిన లింక్ చూపుతోంది. అయితే కాస్త వెనక్కు వెళ్లి మార్చిలో ఈ లింక్ లో http://naprapamcham.blogspot.com/2009/03/blog-post_24.html జరిగిన చర్చ చూడండి. ఇక్కడ ISP Administrator పేరుతో ఉన్నది ప్రవీణే. ఆ విషయం మీరు ప్రవీణ్ ని అడిగి కూడా నిర్ధారించుకోవచ్చు. మన అభిప్రాయాలను వ్యతిరేకించిన వారిని సన్నాసులు అనడం ఎంత వరకూ సమంజసమో మరి మీరే చెప్పాలి. ఇలా తవ్వుకుంటూ పోతే ప్రవీణ్ నోటిదురుసు తనానికి ఉదాహరణలు కోకొల్లలు. ఇక్కడ నేను ముందు ఎవరు మొదలు పెట్టారో అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఇవ్వలేదు. ప్రవీణ్ మీరు అనుకుంటున్నంత అమాయకుడు కాదు అని చెప్పడానికి మాత్రమే ఇది చెప్పడం జరిగింది.

  ఇక పోతే ప్రవీణ్ చెబుతున్న మేరకైనా మూడేళ్ళుగా తనని పేరడీలతో హింసిస్తున్నారు. తను భరించాడు. ఏడాదిగా తను కూడా ప్రతిస్పందిస్తున్నాడు అన్నారు. మరి 2009 సెప్టెంబర్ నుంచీ ఈ గొడవ మొదలైతే ప్రవీణ్ అన్నేళ్ళు ఎలా పేరడీలు భరించాడో పాపం. (నాకు తెలిసి ఇది 2012 జనవరి). ఇక పోతే మొదటగా “గబ్బర్ సింగ్” పేరడీ వీడియో ఎవరు మొదలు పెట్టారో కాస్త మెదడు పొరలని కదిలించి ప్రవీణ్ ని గుర్తుకు తెచ్చుకోమని చెప్పగలరు. దానికి స్పందన గానే కే.బ్లా.స ఒక పేరడీని విడుదల చేసింది. ఇది నేను కే.బ్లా.స ని సమర్ధించడానికి చెప్పటం లేదు. అది ప్రతిస్పందన మాత్రమే అని చెప్పడానికి ఈ విషయం ప్రవీణ్ కి గుర్తు చేస్తున్నాను .

 68. క్షమించాలి. “విశేఖర్ గారూ మీరు” అనేదాన్ని “విశేఖర్ గారూ మీకు” అని చదువుకోగలరు. టైపింగ్ పొరపాటు. అర్థం మారే ప్రమాదం ఉంది కనుక వివరణ ఇస్తున్నా

 69. Prasad garu,

  Just ignore him. You have better things to do in life than this. Never ever spend a single second for this . No one can spend so much time like you as I know you very well …

  To Praveen Sharma ,
  Please reply to me . Did you ever visited Jeevani personally ? Did you ever gave a single dime to Jeevani ? Did you ever spend some time with the kids there ?
  How can you blindly generalize the NGO’s ?
  I am proud to be part of Jeevani. And i met the kids and i felt the happyness of being there for them .

  if that is the case, why can’t we say that Mao is the biggest killer than anyone in the world ? ( depending on the links like these, google it and you will find more . http://fullcomment.nationalpost.com/2011/04/16/robert-fulford-mao-outmurdered-hitler-and-stalin-combined/) …
  You can say that these are the news of western world and all . But remember that you use computer from them. Search engine from them , Operation system from them etc , without which you never can blog and no one in this world other than your circle could know your name . So be thankful for that.

  Rational thinking is what you need Praveen. Understand that. Don’t see everything in single dimention. Try to see it from other side also.

  Lot of people don’t hate you . They only can’t bare you , just becasue of your comments . Understand that.
  Probably this is the last time I am spending some time to change you .

  I am not against Mao or Communism or Commercialism or bloody anything . I just think everything should be there to make this world better .

  Please as I said , understand this . think twice .

 70. andariki,
  kalisi unte kaladu sukam…ika vimarsanalu maneddamu…iyyindi edo iyyindi…vere samsyala meda, vere topics meeda comment cheyandi…scraps anni mind nundi delete cheyandi…tappulu manava sahajam…but, meeru andaru telivi ina personalities…ee visayanni vadileyandi…cinema lo manchi untundi, chedu untundi…chedu vadili manchini mataladukundamu…final gaa all is well…meeku cheppe anta pedda vadini kaadu…migatavisayalu, migata topics meeda concentration cheyandi please…

  Thanks,
  Subhas

 71. పద్మ గారు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి.

  నేను ఏ విషయం గురించి వ్రాసినా వదిన-మరిది సంబంధం పేరు చెప్పి టాపిక్ డైవర్ట్ చేసినప్పుడు మీకు మీరు వ్రాస్తున్నవి సంబంధం లేని విషయాలు అనిపించలేదా? ఇంతకు ముందు రూత్ గారి బ్లాగ్‌లో మీ బేచ్‌వాళ్ళు అలాంటివి వ్రాసినప్పుడు రూత్ గారు అవి డిలీట్ చేశారు. కానీ ఇతర బ్లాగుల్లో కామెంట్ల మోడరేషన్ లేని విషయం వినియోగించుకుంటూ అవి మీరు అలా వ్రాయలేదా?

  ఈ లింక్ చదవండి: http://muddamandaram.blogspot.com/2010/05/blog-post.html

  వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యకూడదు అని నేను రూత్ గారి బ్లాగ్‌లో వ్రాస్తే నువ్వు వేశ్యలకి వందకి రెండొందలిస్తావు కదా అని మీ బ్యాచ్‌వాళ్ళే అడగలేదా?

 72. “ఒక్కసారి ఆలోచించండి విశేఖర్ గారు, నేను మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నారు. నేను తిరిగి మిమ్మల్ని కాక మీ తల్లిగారిని అంటే మీకెలా అనిపిస్తుందండి? అనటం తప్పే కానీ ఎంత విసిగిపోతే అలా చేసుంటానో అని మీరనుకోగలరా? (మీరు నన్ను క్షమించాలి మీ తల్లిగారి ప్రస్తావన తెచ్చినందుకు. నాకు ఇంతకన్నా ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. మీరు ఇది తప్పు అని భావిస్తే ఆ వాక్యం తీసెయ్యండి. మరోసారి క్షమాపణ కోరుతున్నాను.)”

  పద్మ గారూ,

  ఏమిటిది?

  ప్రవీణ్ తనని వ్యక్తిగతంగా తిట్టారని ఆరోపిస్తూ తనని తిట్టిన వారి తల్లిగారిని తిట్టారు. ఇందులో నేను లేను.
  ఈ పని చేసిన ప్రవీణ్ కి గత రెండు పోస్టుల వ్యాఖ్యల కింద ‘అలా బూతులు తిట్టడం సరికాదని’ నేరుగా చెప్పాను. అది అతను నమ్ముతున్న భావజాల రీత్య సరికాదని చెప్పాను.
  అతను చేసిన దానికి ఉన్న గ్రావిటీ పూర్తిగా అర్దం చేయించాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా పోస్టు రాశాను. అతను అలా తిట్టడం ఎలా సరైంది కాదో వివరించే ప్రయత్నం చేశాను. దానివల్ల ప్రవీణ్ నాకు వ్యతిరేకం అవుతారా లేదా అన్నది నేను ఆలోచించలేదు. కేవలం నేను నమ్మిన భావజాలం ప్రాతిపదికన, నేను నమ్మిన విలువల ప్రాతిపదికన ఆ పని చేసాను. కెబ్లాస నుండి నేను స్వయంగా విష ప్రచారం ఎదుర్కొంటున్నప్పటికీ నేను నమ్ముకున్న విలువల ప్రాతిపదికపైన నిలబడి ఆ పని చేశాను.

  ఇది నా తప్పు కదండీ పద్మ గారూ, ఈ తప్పుకి మీరు మా తల్లిగారిని ఈ చర్చలోకి లాగుతారా?

  ఈ పని చేసి మీరు క్షమాపణలు కొరారు. ఎందుకని? అలా మా అమ్మగారిని ఈ చర్చలో లాగడం తప్పని మీకే అర్ధమైంది గనక. ఆ తప్పు చేసాక కూడా మీరింకా మీ వ్యాఖ్యని ఆపలేదు. అంతటితో ‘పోస్ట్ కామెంట్’ బటన్ ప్రెస్ చెయ్యలేదు. ఆ వ్యాఖ్యని ఇంకా కొనసాగించారు కూడా.

  అలా తప్పని అర్ధమైనపుడు వెంటనే మీరు చెయ్యవలసిన పనేంటి? మా అమ్మగారి ప్రస్తావన చేసిన దాన్ని తుడిచెయ్యాలి. ఆ ప్రస్తావన రాకుండా చూసుకుంటూ మీ వ్యాఖ్యను కొనసాగించాలి.

  మీరా పని చెయ్యలేదు. చెయ్యక పోగా ఆ తప్పుని అలానే ఉంచి, “నాకు ఇంతకన్నా ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. మీరు ఇది తప్పు అని భావిస్తే ఆ వాక్యం తీసెయ్యండి. మరోసారి క్షమాపణ కోరుతున్నాను” అని రాస్తూ అది కొట్టేసే బాధ్యత నా పైన పెట్టారు. అంటే మీ తప్పుని నేను సవరించాలన్నమాట!

  మీరు చేసిన తప్పుని మీరు సరిచేసుకోకుండా నన్ను సరిచెయ్యమని కోరడం ఏమిటి?

  ప్రవీణ్ గారు మీ ‘కెలుకుడి’ మిత్రుడి తల్లిగారిని లాగినందుకు మీరు మా తల్లిని ఈ చర్చలోకి లాగుతారా?

  ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇది చేశారు?

  తప్పని ఒప్పుకుంటూనే, ఆ తప్పుని అక్కడికక్కడే సరిచేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, ఆ బాధ్యత నా పైన మోపుతారా?

  ఇంత చర్చ చేసి మీరు చేసేది ఇదా?

  ఇవి కదా మీ ‘కెలుకుడు తెలివితేటలు’? కెబ్లాస పెట్టుకుంది ఇందుకా?

  ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీరు ప్రచారం చేయదలుచుకున్న భావజాలం? ఈ అమానవీయ ‘కెలుకుడు’ తో బ్లాగుల్లో చెత్తని ఏరిపారేస్తారా?

  మీరు మీ పరిమితుల్ని దాటారు. ప్రవీణ్ పరిమితుల గురించి గుర్తు చేసే మీకు పరిమితులేవీ ఉండవని భావిస్తున్నారా?

  ఇది మీ ‘కుత్సితం.’ మీతో చర్చ శుద్ధ దండగ!

  మీ పరిమితి దాటి వచ్చిన మీరు, ఆ పరిమితికి ఆవల, మరిన్ని అమానవీయ అడుగులు వేయరని నాకు నమ్మకం లేదు. మీ గొప్ప ‘సంస్కారం’ రుజువు చేసుకున్నారు. మీతో ‘చర్చకు’ ఇదే ముగింపు.

  చాలా బాధతో మీతో చర్చను ముగిస్తున్నాను. తీవ్ర నిరసనతో ఈ చర్చను ముగిస్తున్నాను. బ్లాగుల్లో బూతు ధోరణి ఆపడానికి ఒక మార్గం దొరక్కపోదా అని మీతో ఇంత సేపూ చర్చ చేశాను. బ్లాగింగ్ సంగతి తర్వాత కనీసం ‘కంప్యూటర్ ముఖం కూడా చూడని మా అమ్మగారిని’ ఈ చర్చలోకి లాగడానికి మీరు చేసిన ప్రయత్నం అత్యంత అనాగరికం.

  ఈ మాట నాచేత చెప్పించి ‘ఆయన తన తల్లిగారి ప్రస్తావనకే తట్టుకోలేకపోయారు. ఈయన తన తల్లిని బూతులు తిట్టడాన్ని ఎలా తట్టుకోగలరు?’ అని ప్రచారం చేసుకునే కుటిల, కుత్సిత, అసందర్భ, కెలుకుడు బుద్దితో మీరీ పని చేశారు. ‘ప్రవీణ్ ఒకరి తల్లిగారిని తిడితే తప్పులేనపుడు, విశేఖర్ తల్లిగారి ప్రస్తావన తేవడం తప్పెలా అవుతుంది’ అని విష ప్రచారం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా పాల్పడిన కుటిల ఎత్తుగడ ఇది. అందుకే మీరు చేసిన తప్పుని సవరించుకోగల అవకాశం మీకు వెంటనే ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రాలేదు.

  మీతో చర్చను ముగించడం ఆధారం చేసుకుని ఇకముందు మా తల్లిగారిని కూడా బ్లాగుల్లోకి లాగి దుష్ప్రచారం సాగించే మీ కెలుకుడు బుద్ధి నాకు కనిపిస్తోంది. కెలుకుడు బుద్ధి కెలుకుడు స్ధాయిలోనే ఉంటుంది తప్ప అంతకంటే ఉన్నత స్ధాయికి ఎలా ఎదుగుతుంది? ఐనా తప్పదు. ఆది నిష్టూరమే మేలు.

  కానీ ఈ సందర్భంగా గౌరవనీయ బ్లాగర్లు ఓ ముఖ్య విషయం గుర్తించాలి. మా అమ్మగారే కాదు, ఎవరి అమ్మగారి ‘అమ్మతనం’ ఐనా ఏ ఒక్కరి ‘కెలుకుడి’ కీ చెరిగిపోదు. ఏ ఒక్క కుసంస్కారి తిట్లకీ చెదిరిపోదు. ఏ ఒక్కరి కుటిల బుద్దులకూ బెదిరిపోదు. అలా చెరిగి, చెదిరి, బెదిరి పోయేదయితే ఆమె ‘అమ్మ’ ఎలా అవుతుంది? ఆమెది ‘అమ్మతనం’ ఎలా అవుతుంది.

  ‘అమ్మ ఎవరికైనా అమ్మే’ అన్నది ప్రత్యక్షర సత్యం. ఎంతమంది కెలుకుడు గాళ్లు పూనుకుంటే ఆ సత్యం తుడిచిపెట్టుకు పోవాలి? అసలది తుడిచిపెట్టుకుపోయే సత్యమా?

  పద్మ గారూ ఓ విజ్ఞప్తి! దయచేసి మళ్ళీ మీరిటేపు రాకండి. ఏ కొంచెం గౌరవం ఉన్నా, ఇటేపు రాకుండా దాన్ని నిలబెట్టుకోండి. ఈ నా సమాధానం ప్రచురితం అయ్యాక మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఎవరు రాసినా అవి ప్రచురించను. నేనూ మిమ్మల్ని ఉద్దేశించను. ఇక మీ ‘కెలుకుడు’ అంటారా. అది మీ ‘సంస్కృతి’. అది నన్ను ఎన్నటికీ ఏమీ చేయలేదు. దాన్ని సరి చేసుకునే అవకాశం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది.

  ఇతర గౌరవనీయ బ్లాగర్లు, వ్యాఖ్యాతలు తమ చర్చలను కొనసాగిస్తారు.

 73. నేనొకరి అమ్మగారిని బూతులు తిట్టానని కదా ఈ చర్చ! అమ్మల విషయాన్నే చర్చిద్దాం.

  నీహారిక గారు కూడా పెద్దవారే. ఆవిడ కూడా తన పిల్లలకి అమ్మే.

  ఆ మాటకొస్తే పిల్లల్ని కన్న ఏ స్త్రీ అమ్మ కాదు? పిల్లలని కనకపోయినా స్త్రీ హృదయం ఎప్పటికీ అమ్మ హృదయమే కదా.

  కానీ నీహారిక గారిపైన ఎందుకు బూతులు వ్రాసినట్టు. ఏ స్త్రీ అయినా జీవితంలో ఒక దశ వచ్చిన తరువాత అమ్మ అవుతుంది.

  మీకు నచ్చని, మీ భావాలు మెచ్చని ఎవరి గురించైనా మీరు బూతులు వ్రాస్తారు. కానీ మీ కుటుంబ సభ్యుల గురించి వ్రాస్తే ఒప్పుకోరు, అంతే కదా.

  మీ ద్వంద్వ ప్రమాణాలు కావా ఇవి?

 74. పద్మ గారు, మీ బేచ్‌వాళ్ళు వ్రాసిన పేరడీలు మా అన్నయ్య చదివాడు. అదృష్టం ఏమిటంటే మా వదిన గారు చదవకపోవడం వల్ల మీరు బతికిపోవడం.

  వైజాగ్, కొత్తగూడెం, హైదరాబాద్‌లలో ఉంటున్న మా బంధువుల దగ్గర కూడా ఇంటర్నెట్ ఉంది, ఢిల్లీలో ఉంటున్న మా తమ్ముడి దగ్గర కూడా ఇంటర్నెట్ ఉంది. రేపు వాళ్ళు కూడా బ్లాగుల్లో ఆ పేరడీలు చదివి వాటి గురించి నన్ను అడిగితే నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి?

  బ్లాగింగ్ గురించి అందరికీ తెలియజెయ్యాలని నా బ్లాగ్ గురించి మా వాళ్ళందరికీ చెప్పాను. నా బ్లాగ్ తెరిచి చదివినవాళ్ళు ఇతర బ్లాగులు చదవరని గ్యారంటీ లేదు, కెలుకుడు బ్లాగులు కూడా చదవరని గ్యారంటీ లేదు. వాళ్ళు కెలుకుడు బ్లాగుల్లో నా గురించి వ్రాసిన పేరడీలు చదివితే నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి?

 75. శ్రీకాంత్ గారూ, కెలుకుడు గ్యాంగ్ తో, బూతుల బ్యాచ్ తొ నా అనుభవం వేరుగా ఉంది. అది ఇంకా కొనసాగుతోంది. ప్రవీణ్ అనుభవించిన టార్చర్ విషయమై నేను చూసిన బ్లాగులు, వ్యాఖ్యలు, కెలుకుడు అన్నీ చూశాకనే నా ప్రస్తుత నిర్ణయానికి వచ్చాను.

  నాపై విష ప్రచారం వల్ల నా వ్యక్తిత్వానికి భంగం రాదు. అది భద్రంగా నా వద్దనే ఉంది. అదసలు నాకు సమస్య కాదు. కాని బ్లాగింగ్ కి మాత్రం సమస్యే.

  “ఇరువురు తిట్టుకోవడం మొదలు పెట్టిన తరువాత ఎవరు ముందు ఎవరు వెనుక అనే దానితో సంబందం లేకుండా.. చాలా జరుగుతాయి.”

  ఇది సత్యం. చాలా జరుగుతాయి. ఎవరు ముందు అన్న సమస్య అదృశ్యమై పోతుంది. ప్రవీణే ముందు అని కెలుకుడు వారు చెప్పిన సాక్ష్యం అందుకు భిన్నంగా ఉండడాన్ని నేను గుర్తించాను. విషయం ఏమిటంటే ఈ సాక్ష్యాన్ని కెలుకుడు వారు చెప్పారు గానీ చూపలేదు. (లింక్ ఇవ్వలేదు). ఆ లింక్ ప్రవీణే ఇవ్వగా చూడవలసి వచ్చింది.

  కరెక్టుగా చెప్పారు. ఫైనల్ ఔట్ కం ఇప్పుడు ముఖ్యం. ఎవరు ముందు అన్న సమస్యను పట్టించుకోగూడదు అన్న సంగతిని ఇరు పక్షాలు అంగీకరించాలి. అది ఎప్పటికి సాధ్యం? చూద్దాం. ప్రయత్న లోపం లేకుండా మీలాంటివారు పూనుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.

  ఎవరు ముందు అన్న సమస్య వదిలిపెడితే ప్రవీణే ముందు తొలగించాలా, లేదా ఇతరులు తొలగించాలా అన్నది కూడా అప్రస్తుతమవుతుంది.

 76. ప్రపీసస గురించి బ్లాగ్ సోదరి అనే బ్లాగ్‌లో చర్చ జరిగింది.

  ఆవిడ ప్రపీసస బ్లాగ్ కొన్ని సార్లు చదివింది. వాళ్ళు తమకి మాత్రమే అర్థమయ్యే స్క్రీన్‌షాట్‌లు పెట్టి వాటి పేరుతో ప్రవీణ్‌ని (నన్ను) తిట్టి ఎంజాయ్ చేసుకున్నారని ఆవిడ అన్నారు.

  వాళ్ళు నన్ను “శవాల మీద మురియాలు ఏరుకునే చిల్లర ఎదవ” లాంటి తిట్లు తిట్టడంతో ఆవిడకి అసహ్యం కలిగి ప్ర.పీ.స.స. బ్లాగ్ ఓపెన్ చెయ్యడం మానేసింది. ప్ర.పీ.స.స పెట్టి వ్యక్తిగత విద్వేష ప్రోపగాండా ఎలా చేశారో ఆ బ్లాగ్ చదివినవాళ్ళందరికీ గుర్తుంది.

 77. సుభాష్ గారూ, పెద్ద వాడ్ని కాదంటూనే అందరూ మర్చిపోతున్న విషయం గుర్తు చేశారు. మీరు చెప్పిన సత్యం అందరూ గుర్తించాలని ఆశిస్తున్నాను.

 78. సన్నాసులు అని తిట్టడానికీ, వదిన గారి పేరుతో పేరడీలు వ్రాయడానికీ మధ్య ఎంత తేడా ఉందో నీకు తెలియదా?

 79. ప్రవీణ్ గారూ, పద్మ గారి పేరుతో వచ్చే వ్యాఖ్యలు నేను ప్రచురించడం లేదు. కారణం వివరించాను చూడగలరు. పై వ్యాఖ్య రాసిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నందున దానిని ఉంచుతున్నాను. ఇక ముందు పద్మగారిని ఉద్దేశిస్తూ రాసే మీ వ్యాఖ్యలు నేను ప్రచురించను.

 80. ప్రవీణ్ గారూ, మొట్టమొదటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి.
  1. మీరు నన్ను “క్రిష్ణవేణిగారూ” అని సంబోధించేరు. ఆశ్చర్యంగా ఉంది నాకు చదువుతుంటే. మీరే కదూ ” ” క్రిష్ణవేణి చారి ఎవరూ” అన్న ఒక పోస్టుని వేసింది? దాన్లో భరద్వాజ్ గారే నా పేరు ( నకిలీది) పెట్టుకుని బజ్జుల్లో రాస్తున్నారని నానా ఆగడా చేసేరు కదా? ఎవరైనా నా పేరు పెట్టుకుని రాయడానికి ( అది కూడా అది నా అసలు పేరయి ఉండి, నేనింకా బతికి ఉన్నప్పుడే నేను ఎవరినయినా అలా చేయడానికి ఎందుకు అనుమతిస్తానని మీరనుకున్నారు? ఆ పేరు నాదే అని నేను మీకు రాసిన తరువాత కూడా, నా గురించి మీకు మీ సోర్సెస్ వల్ల తెలిసినప్పటికీ కూడా మీరు ఆ సందేహపు పోస్టుని చాలా రోజులు తొలిగించనే లేదు. దానికి కారణం తెలుసుకోవచ్చా? ఇప్పుడు నేను నేనే అని మీకు నమ్మకం కలిగిందా మీరు నన్నిలా సంబోధించడానికి?
  2. ” బూతు” అంటే నిర్వచనమేమిటో అని మీరు నన్నడుగుతున్నారు. ఆశ్చర్యం! నేనీ తెలుగు బ్లోగులు అంతగా చదవను. అదీ కాక ఈ తెలుగు అగ్రెఅగేటర్స్ ఉంటాయని ముందు నాకు తెలియదు. కనుక నాకివన్నీ కంపారిటివ్లీ కొత్త కానీ నాకు ఇక్కడ బూతులంటూ కనిపిస్తే అవి మీరు రాసినవి మాత్రమే. అదీ కొన్ని రోజుల కిందటే మీరు అసహ్యంగా ఒక పెద్దావిడ గురించి రాసినవి నా మెదడులోనుంచి అంత త్వరగా తొలిగిపోలేదు. మీవి కాక ఇంకెవరి బూతులనీ నేను చదవలేదు, చూడలేదు. కనుక ఆ పదానికి మీ అర్థం ఏమిటో నిర్వచనం ఏమిటో అని మీరు అడుతున్న వ్యక్తి తప్పు వ్యక్తి. అలాంటర్థాలు నాకు తెలియవూ తెలుసుకోదలచుకోలేదు కూడా.
  3.>>>పద్మ గారూ, మళ్ళీ మీరిటేపు రాకండి. ఏ కొంచెం గౌరవం మిగిలున్నా, ఇటేపు రాకుండా దాన్ని నిలబెట్టుకోండి >>> అని ఈ బ్లోగ్ ఓనర్ విశేఖర్ గారు చెప్పిన తరువాత కూడా మీరు పద్మగారిని ఇక్కడే ప్రశ్న తరువాత ప్రశ్నని అడుగుతున్నారు ఆవిడ ఇక్కడకి వచ్చి కామెంట్లు పెట్టలేరని మీకు తెలిసినప్పటికీ కూడా. అదెందుకు?
  దయచేసి నా ప్రశ్నలకి మర్యాదగా సమాధానం ఇస్తారని ఆశిస్తాను.

 81. మనోహర్ గారూ మీరు అడిగింది బానే ఉంది. అయితే దాని పూర్వాపరాలు కూడా మీరు ఇక్కడ ఇచ్చి ఉంటే బావుండేది. నా మీద ప్ర.పీ.స.స పెట్టానని ప్రవీణ్ అభియోగం మోపిన తరువాత మాత్రమే నేను తనని ఆ విధంగా అన్నానని ఆ బ్లాగు చూసిన మీకు తెలియదా? లేక తెలిసీ కన్వీనియంట్ గా దాన్ని వదిలేశారా? అలాగే “మీరు నా వదిన మీద పేరడీలు రాసినప్పుడు” అని అసలు నాకు సంబంధం లేని అభియోగంలో నన్ను లాగినప్పుడు ఆధారాలు చూపించు అని ప్రవీణ్ ని ఎన్ని సార్లు అడిగానో తనని ఒక సారి చూడండి. ఇదే మొదటి సారి కాదు. ప్రతి సారీ అలాంటి అభియోగం మోపుతూంటే నేను ఊరుకోవాలి అని మీరు భావిస్తున్నారా?. ఇక పేరు పెట్టి రాసినట్టు ఉంటే చూపించు అని అప్పటికి ఎన్ని సార్లు అడిగినా జవాబు చెప్పకుండా భాస్కర్ గారి బ్లాగులో తిరిగి అవే బూతులు పదే పదే ఉపయోగిస్తుంటే సభ్యత తెలిసిన వాళ్లెవరైనా దాన్ని ఆపకుండా, సదరు వ్యక్తిని మందలించకుండా ఉండరు. ఒక మాట చెప్పండి బయట ఎక్కడైనా ఒక వ్యక్తీ పబ్లిక్ గా పచ్చి బూతులు మాట్లాడుతుంటే మీరు శభాష్ అని మెచ్చుకుంటారా? ఏం పని ఇది అని మందలిస్తారా? అటువంటి మందలింపు వ్యక్తిగత దూషణ అనుకుంటే నేను చేసింది వ్యక్తిగత దూషణే.

 82. మనోహర్ గారూ ఇంకో మాట మీరు ఉదాహరించిన నా వ్యాఖ్యలని ఒక్క సారి సరిగా చదవండి. నేను అన్నది భావజాలం విషయంలో వాదన గురించి. అంతే గానీ చర్చతో సంబంధం లేకుండా చెత్త వాగుడు వాగితే క్షమించమని కాదు.

 83. విశెఖర్ గారూ,

  ప్రవీన్ మరియూ కొంత మంది బ్లాగర్లు ఒకరినొకరు దూషించుకోవడం మొదలు పెట్టిన తరువాత చాలా విషయాలు జరిగాయి. ప్రవీన్ వీడియో పెట్టడం, దానికి ప్రతిగా వారు కూడా విడియో పెట్టడం జరిగింది. తేడా ఏమిటంటే, వారు పెట్టింది చాలా ప్రజాధరణ పొందింది. దానికి ప్రవీన్ మీద అప్పటికే బ్లాగర్లందరిలో ఉన్న నిరసన భావం కారణంకావచ్చు. అది ప్రవీన్ ను మరింతగా రెచ్చగొట్టింది. ఇలాంటి సంఘఠనలు చాలా జరిగాయి .. ఇవన్నీ ఏకరువు పెట్టే ఓపిక లేక .. సింపులుగా, ఒకరిని ఒకరు తిట్టుకోవడం మొదలు పెట్టిన తరువాత, చాలా విషయాలు జరుగుతాయి అన్నది దానికే. అంతే కానీ, ముందు ఎవరు మొదలు పెట్టారో పట్టించుకోకూడదు అన్న భావముతో నేను దాన్ని అనలేదు. కాబట్టి, నేను ఎవ్వరో ఒకరు ముందు తీసేస్తే బావుండును అన్న మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాను.

  అంతే కాదు, నేను Final outcome ముఖ్యం అన్నమాట కూడా, మీరు ప్రవీన్ కు ఇచ్చే మద్దతు విషయం మీదే కానీ, ఎవరు ముందు తొలగించాలి అన్నదాని మీద కాదని మీరీపాటికి గ్రహించే ఉంటారు. ఎందుకంటే,ఎవరైతే ఏముంది అనుకునే వాన్నే ఆయితే, అసలు నేను మీ బ్లాగులో కామెంటాల్సిన అవసరమే లేదు. ముందుగా వెల్లి, వారిని కెలుకుడు టపాలు తీసేయమని కోరుండేవన్ని.

  ఎందుకంటే, అలాంటి నీచమైన టపా తొలగించకుండా ఉన్నంతవరకూ, మీరూ ఎవరికి మద్దతిస్తున్నారు, ఎందుకిస్తున్నారు అన్నది చాలా చిన్న విషయముగా కనపడుతుంది. అందుకే దానికి ప్రాముఖ్యత లేదన్నాను.

  అమ్మ ఎవరికైనా అమ్మేనని మీరు రాసిన వ్యాఖ్య చదివాను. ఎంతో అర్థవంతమైనది అది. ఎవరి తల్లైనా తల్లే గౌరవినిచ్ తీరాలి అని చెప్పిన మీరు, తప్పకుండా ప్రవీన్ ను ముందుగా తొలగించ మని చెబుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటె, కన్న తల్లి మీద అంత నీచమైన టపా రాసింది ప్రవీనే, కెలుకుడు వల్లు కాదని మీకు మళ్ళీ నేను చెప్పనవసరం లేదనుకుంటాను.

  మీకు ప్రవీన్ ఇచ్చిన లింకులో చాలా వరకూ కామెంట్లు తొలగించబడ్డాయని SHANKAR గారు వేరొక లింకు ఇవ్వడం జరిగింది ఒక సారి చూడండి. అది మీరు నిజాన్ని గ్రహించడానికి కొంత వరకైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

  ఇంకో మాట, ప్రవీన్ సంస్కారం ఇప్పుడే కాదు చాలా సార్లు బయటపడింది. ప్రవీనుకు నాకూ జరిగిన ఒక సంభాషన చెబుతాను వినండి.

  వ్యభిచారం అనే టాపిక్కు మీద ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వ్యభిచారం చట్టబద్దత అనే విషయం మీద బ్లాగుల్లో కొన్ని సార్లు చర్చ జరిగింది. అప్పుడు, కొంత మంది ఇరువురికి ఇష్టమైనప్పుడూ క్యాజువల్ సెక్సు అనేది తప్పు కానప్పుడు, ఇరువురికీ ఇష్టమైన వ్యభిచారం మాత్రం ఎలా తప్పైంది అన్న ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానం ఎందుకు కాదో చెప్పొచ్చు. కానీ, ఇంట్లోవారు (ఎవ్వరో మళ్ళీ చెప్పాలా) వ్యభిచారం చేసిన ఇలానే చెబుతారా అనే నీచమైన ప్రశ్న ప్రవీన్ చాలా సార్లు చాలా మందిని అడగడం జరిగింది. పవీన్ సంస్కారం ఎంతో తెలిసిన వాల్లం కాబట్టి అతని సమాధానం, అదే కోనములో ఇవ్వగలిగే అవకాశం ఉన్నా (అతను కొన్ని గొప్ప గొప్ప సిద్దాంతాలు ప్రవచించాడులెండి) వాటికి ఇవ్వకుండా సాధారణంగా చెప్పి వదిలేశాము.

 84. విశేఖర్ గారూ,

  రేప్ అనేపదానికి చాలా మంది తెలుగులో మాన భంఘం అనే పదాన్ని ఉపయోగిస్తారు, నేను మాత్రం అత్యాచారం అని మాత్రమే ఉపయోగిస్తను. ఎందుకంటే అది మానం పోగొట్టుకోవడం అన్న పదం కూడా regressive and repressive అన్నది నా అభిప్రాయం. అలాంటి నేను, ఆకు, ముల్లు లాంటి చెత్త అభిప్రాయాలను వెలువరించడం జరగదు. కాకపోతే, ఒక వేల నిజంగానే మగవారిని రేప్ చేయడానికి ఆడవారు ప్రయత్నిస్తే, Sex Starved మగాడు దాన్ని అసలు రేప్ గా భావిస్తారా? అన్నది అసలు ప్రశ్న. దాన్నే చాలా మంది చెప్పడం జరిగింది. కానీ, pravin is pravin దాన్ని అతను అవతలి వారికి అభ్యుదయ భావాలు లేవు అన్నట్లుగా అర్థం చేసుకున్నట్లుగా కనబడుతోంది.

 85. క్రిష్ట వేణి గారికి ఒక వివరణ.

  నేనీరోజు కంప్యూటర్ వద్ద లేను. వేరే ఊరు వెళ్ళాను. సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే మొదటి వ్యాఖ్య పద్మ గారిది. ఆమె ఉంచిన ఇతర కామెంట్లతో పాటు ప్రవీణ్ కామెంట్లు ఉన్నాయి. నేను తొలగించడానికి నిర్ణయించకముందే అవన్నీ వచ్చి ఉన్నాయి. అందువలన అవి పద్మ గారిని ఉద్దేశించి ఉన్నా ప్రచురించవలసి వచ్చింది. అప్పటికీ విషయం వారికి తెలియదు కనుక.

  ఆ తర్వాత ప్రవీణ్ నుండి ఆమెను ఉద్దేశిస్తూ రాయలేదు. నేను ఎందుకు తొలగించిందీ వ్యాఖ్యలోనే చెప్పినందున అది అందరూ చూడలేకపోవచ్చు. ఎందుకంటె ఈ టెంప్లేట్ లో వ్యాఖ్యలకి ఇచ్చిన స్పందన, అన్నింటి కంటే కింద కాకుండా అ వ్యాఖ్య వద్దనే ప్రచురితమవుతోంది. అందువలన తాజా వ్యాఖ్య చివరన ఉండడం లేదు.

  బహుశా దీనివల్ల పొరబాటు జరిగి ఉండవచ్చు. సూచిస్తున్న సమయం నేనిచ్చిన వివరణ పరిధిలో లేనట్లయితే అది పూర్తిగా నా తప్పు. అలాంటి తప్పు జరిగిందేమో చూస్తాను.

 86. విశేఖర్ గారూ నేను ప్రవీణ్ గారికి రాసిన జవాబులో ఆఖరి వాక్యాన్ని ” దయచేసి కొంచం మర్యాదగా, కొంచం గౌరవంగా సమాధానం ఇస్తే సంతోషిస్తాను” అని చదువుకోవాలి. నా తెలుగు అంతంతమాత్రమే అని ముందే చెప్పేను. నేను ఆఖర్న రాసిన వాక్యానికి బహుసా వేరే ఏదో అర్థం వస్తుందేమో అని ఒక శ్రేయాభిలాషి సూచించేరు కనుక ఇక్కడ వివరంగా నా ఉద్దేశ్యమేమిటో రాస్తున్నాను. మీరిప్పుడు రాసిన వ్యాఖ్యకి నాకు బహుసా సంబంధించి ఉండకపోవచ్చు కానీ నేను ప్రవీణ్ గారిని ప్రశ్నించినవి ఆయనకి అర్థం అవతాయి లెండి.

 87. శంకర్.ఎస్ గారూ!
  మీరు ఆ కామెంట్లలో వాడిన పదజాలం వ్యక్తిగత దూషణ కాదనీ, ‘మందలింపు’ మాత్రమేననీ అనుకోమంటారా?

  సరే, నా కామెంట్లో మొదటి అంశానికి మీరు స్పందించాలని కోరుతున్నాను. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను.

  విశేఖర్ గారు స్పష్టంగా అడిగిన ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి – ‘నాపైన జరిగిన దాడిని మాట మాత్రంగానైనా ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? నేను ప్రారంభించలేదు కదా. నేను అనుసరించడం లేదు కదా? కనీసం వారి బ్లాగుల్లోకి వెళ్ళడం లేదు కదా? ఇప్పటీకీ తిడుతున్నారు కదా? అది తప్పని ఎందుకు ప్రకటించలేరు శంకర్ గారూ?’

 88. ఆ పేరడీలు వ్రాసిన వాళ్ళకి నువ్వు ఓపెన్‌గానే సపోర్ట్ ఇచ్చావు శంకర్.

  ఒకవేళ నాకు నిజంగా నా వదిన గారితో సంబంధం ఉన్నా మా ఇద్దరి మీదా కుళ్ళు జోక్‌లు వేసి ప్రచారం చెయ్యడం సంస్కారహీనమే అవుతుంది.

  ఆ సమస్య మా ముగ్గురికి మాత్రమే సంబంధించిన విషయమవుతుంది. నాలుగో వ్యక్తి దాని గురించి కుళ్ళు జోక్‌లు వేసి ప్రచారం చెయ్యడం సంస్కారహీనమే అవుతుంది.

 89. పేరు డైరెక్ట్‌గా ఉపయోగించకుండా ఎన్ని చెత్త పేరడీలైనా వ్రాసుకోవచ్చు అనడం హాస్యాస్పదం.

  ముహమ్మద్ ప్రవక్త పేరు డైరెక్ట్‌గా వ్రాయకుండా ఎడారిలో ఉండే ‘ఒక మతంవాళ్ళ ప్రవక్తం’ అని వ్రాస్తూ పేరడీలు వ్రాస్తే ముస్లింలు ఊరుకోరు. జైలాండ్స్ పోస్టీన్ కార్టూన్‌లు వేసినవాని తలకి రివార్డ్ పెట్టినట్టు పేరడీ రాతగాళ్ళ తలకి కూడా రివార్డ్ పెట్టగలరు.

  పేరు వ్రాయకుండా ఒక వ్యక్తి గురించి ఏమి వ్రాసినా తప్పు కాదనుకుంటూ “ఎడారిలో ఉండే ఒక మతంవాళ్ళ ప్రవక్త” అనే టైటిల్‌తో పేరడీలు వ్రాస్తే ఆ మతంవాళ్ళనుండి రక్షణ కోసం పరిగిత్తాల్సి ఉంటుంది.

 90. “ఇన్నయ్య గారి బ్లాగ్‌లో గొడవ జరిగినప్పుడు జీవని ప్రసాద్‌ గారిపై చేసిన విమర్శలకి నేను కట్టుబడే ఉన్నారు. చిన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన గురువే భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సామెతలు ఉపయోగించేవాడు. “మొగుడు చచ్చినా ము.మో.కి బుద్ధి రాలేదు” అనే సామెత విద్యార్థులు చూస్తుండగా ఎన్ని సార్లు అన్నాడో గుర్తు లేదు.”

  అంటే మీ గురువు గారు స్త్రీలని కించపరిచారని ప్రపంచంలో గురువులందరి మీదా విమర్శ చేసేస్తావా ప్రవీణ్? ఇలాంటి వాదన నాకే కాదు ఎవరికైనా హాస్యాస్పదం గానే ఉంటుంది.

 91. శంకర్, మీరు ఎప్పుడు చర్చించారని చర్చతో సంబంధం లేని విషయాలు వ్రాయాలి?

  వదిన-మరిది సంబంధం అనో, రెల్లి వీధిలో వందకి రెండు వందలు అనో చెప్పి మీరు ఎన్ని సార్లు టాపిక్ డైవర్ట్ చెయ్యలేదు?

  మీరు చర్చించకుండా టాపిక్ డైవర్ట్ చేసింది మీరయితే, అది వదిలిపెట్టి నేను సంబంధం లేని విషయాలు వ్రాసాననడం ఏమిటి? మీరు డైవర్ట్ చేసిన టాపిక్‌లలో నేను సంబంధం లేని విషయాలు వ్రాయడం ఏమిటి? అందులో అర్ధం ఉందా?

  మీరు ఎన్నడూ నన్ను భావజాలం గురించి అడగలేదు. నేను నా సొంత బ్లాగ్‌లో భావజాలం గురించి వ్రాసుకున్నాను కానీ కావాలని టాపిక్‌లు డైవర్ట్ చేసే మీతో నేను ఎన్నడూ భావజాలం గురించి చర్చించలేదు. ఒకవేళ చర్చించాలనుకున్నా నేను వ్రాయాలనుకున్నది వ్రాసే లోపే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారని నాకు తెలుసు.

  నేను మావో గురించి వ్రాసినా మార్తాండ వదిన ఎవరు అని అడగడం, చారిత్రక భౌతికవాదం గురించి వ్రాసినా మార్తాండ వదిన ఎవరు అని అడగడం, ప్రైవేట్ ఆస్తి యొక్క పరిణామం గురించి వ్రాసినా మార్తాండ రెల్లి వీధిలో వందకి రెండు వందలు ఎందుకు ఇచ్చాడు అని అడగడం, ఇలా దేని గురించి వ్రాసినా దానికి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతోంటే అలా అడిగినవాళ్ళతో ఎలా చర్చిస్తానని అనుకున్నారు?

 92. “సన్నాసులు అని తిట్టడానికీ, వదిన గారి పేరుతో పేరడీలు వ్రాయడానికీ మధ్య ఎంత తేడా ఉందో నీకు తెలియదా?”

  తేడా నాకు బాగా తెలుసు ప్రవీణ్. అయితే సన్నాసులు అని తిట్టి నువ్వు మొదలు పెట్టినది ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో చూశావా? దీన్నే చిలికి చిలికి గాలి వాన అంటారు. ముందే నువ్వు నీ నోటి దురుసుతనం అదుపులో పెట్టుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ రాకపోయేది కదా. నువ్వు తిట్టినప్పుడు అవతలివాళ్ళు మౌనంగా ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావ్? వాళ్ళూ స్పందిస్తారు కదా. ఇక వీడియో ల విషయంలో కూడా గబ్బర్ సింగ్ వీడియో తో మొదలు పెట్టింది ఎవరు? ఇన్ని చేసి కూడా ఇంకా నీ పై సానుభూతి రావాలని కోరుకుంటే ఎలా వస్తుంది ప్రవీణ్?

 93. గురువులందరూ భర్త చనిపోయిన స్త్రీలని కించపరుస్తారని నేను ఎన్నడూ అనలేదు. గురువులలో అభివృద్ధి నిరోధక నమ్మకాలు ఉంటే పిల్లలు కూడా వాటినే నమ్ముతారు అని మాత్రమే అన్నాను.

  జ్యోతిష్యం, వాస్తు లాంటివి మాత్రం అభివృద్ధి నిరోధక నమ్మకాలు కావా? పిల్లవాడు కష్టపడి చదవకుండా తాను డాక్టర్ అవుతానని జ్యోతిష్యుడు చెప్పాడు కదా అని సరిగా చదవకపోతే అతని భవిష్యతే పాడవుతుంది. అందుకే జీవని ప్రసాద్ అలాంటి నమ్మకాలని నమ్మడం నాకు ఆశ్చర్యం కలిగించి నేను ఆయన్ని విమర్శించాను.

  గురువు గారు భర్త చనిపోయిన స్త్రీని ము.మో అని అంటే పిల్లలు కూడా భర్త చనిపోయిన స్త్రీని ము.మో. అనే అవకాశం ఉంది. పెద్దగా చదువుకోనివాళ్ళలో ఉండే నమ్మకాలు గురువులలో కూడా ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే ఆ విషయం చెప్పాను.

  ఒక అభివృద్ధి నిరోధక నమ్మకాన్ని నమ్మేవాళ్ళకి అదే తరహాలో ఉండే ఇంకో అభివృద్ధి నిరోధక నమ్మకాన్ని నమ్మడం కష్టం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. జాతకాలు, ముహూర్తాలని నమ్మేవాడు భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చినప్పుడు కూడా అపశకునం అనుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకోగలడు.

  ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్‌కి గంట ఆలస్యంగా వెళ్ళినప్పుడు గురువు స్కూల్ పిల్లవాణ్ణి ఎందుకు ఆలస్యం అయ్యిందని అడుగుతాడు. “నేను స్కూల్‌కి వస్తోంటే ఒక ము.మో. ఎదురొచ్చింది, శకునం బాగాలేదని గంట వాయిదా వేశాను. మీరే కదా ముహూర్తం దేనికైనా బలంగా ఉండాలని చెప్పారు” అని పిల్లవాడు సమాధానం చెపితే దానికి గురువు ఏమనగలడు? అందుకే నమ్మకాల విషయంలో గురువులు social awareness కలిగి ఉండాలి అని అనేది.

 94. మనోహర్ గారూ నేను విశేఖర్ గారి ప్రశ్నకి అక్కడే బదులిచ్చాను. అఫ్కోర్స్ దాన్ని మీరూ మీ గత కామెంట్లో కోట్ చేశారు కదా. ఇంకా ఏం చెయ్యాలని మీరు ఆశిస్తున్నారు?
  “‘మీ భావజాలం పై దాడిచేస్తే నేను అంగీకరిస్తానేమో కానీ మీ పై వ్యక్తిగత దాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఖండిస్తాను.”

  ఇక మందలింపు కి వ్యక్తిగత దూషణకి తేడా మీకు అర్థమయింది అనుకుంటాను. అర్థవంతమైన చర్చ జరుగుతున్నప్పుడు నేను మందలిస్తే మీరు అడగచ్చు. అంతే కానీ అడ్డమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు స్పందించడం తప్పుగా నేను భావించటం లేదు.

 95. గబ్బర్ సింగ్ వీడియోలో నేను కుటుంబ సభ్యులని లాగలేదు. భరద్వాజ & అతని ముగ్గురు స్నేహితుల పేర్లు వ్రాసాను, అంతే.

  కానీ అందుకు ప్రతిగా పెట్టిన వీడియోలో మీరు మార్తాండ తన వదినని కామిస్తాడు అని వ్రాసారు. అది సంస్కారహీనం.

  ఒకవేళ నాకు నిజంగా మా వదిన గారితో సంబంధం ఉన్నా మా ముగ్గురికీ తప్ప నాలుగో వ్యక్తికి అది సమస్య కాదు. నాలుగో వ్యక్తి దాని గురించి కుళ్ళు జోక్‌లు వేసి ప్రచారం చెయ్యడం సంస్కారహీనమైన పనే అవుతుంది.

 96. శంకర్ గారూ

  ప్రవీణ్ సన్నాసులు అని తిట్టినందున అది చిలికి చిలికి గాలివాన గా మారి ప్రవీణ్ వదిన గారిపైన పేరడీలు రాయడం వరకూ వెళ్ళిందని మీరు సూచిస్తున్నారు.

  ‘సన్నాసులు’ అన్నది వ్యక్తి గత దూషణ. మీరన్నట్లు నోటి దురుసుతనం కూడా. వదిన గారి పై పేరడీలు రాయడం సంబంధీకులపై దూషణ. వ్యక్తిగతంగా తిట్టినందుకు సంబంధిత స్త్రీలను తిట్టడం (లేదా పేరడీలు పెట్టడం) సరికాదని నేను ప్రవీణ్ గారికి చెబుతూ వచ్చాను. ఆ విధంగా సన్నాసులు అని తిట్టినందుకు వదిన గారిపై పేరడీలు రాయడం సరికాదు కదా.

 97. “ఆ పేరడీలు వ్రాసిన వాళ్ళకి నువ్వు ఓపెన్‌గానే సపోర్ట్ ఇచ్చావు శంకర్.”

  నిజమే కావచ్చు ప్రవీణ్. నేను ఇప్పటి వరకూ చూసిన వాళ్ళ ఓకే ఒక పేరడీ షోలే సినిమాలో జైలు సీన్ తో ప్రారంభం అవుతుంది అది. నిజానికి అది చూసే సమయానికి నాకు ఈ మార్తాండ నువ్వని కూడా తెలియదు.నిజానికి నీ సహస్ర నామాలు నాకు పూర్తిగా ఇప్పటికీ తెలియవు. నువ్వు పెట్టిన గబ్బర్ సింగ్ వీడియో కి ప్రతిస్పందనగా వాళ్ళు ఆ వీడియో పెట్టామని అందులో చెప్పడం చూసి ఆ లింక్ కూడా చూశాను. అది కూడా నచ్చింది. నేను వ్యక్తిగతంగా పేరడీలని ఇష్టపడతాను. పేరడీ లో అంతర్లీనంగా ఉండే వ్యంగ్యం నాకు నచ్చుతుంది. పేరడీ అనేది ఒక సాహిత్య ప్రక్రియగా చూస్తాను తప్ప కేవలం తిట్టడానికి మాత్రమే వాడేది అన్న అపోహ నాకు లేదు. నీకు జరుక్ శాస్త్రి గారి పేరు తెలిసినట్టు లేదు. నేను ఆయనకి ఎంత వీరాభిమానినో, పేరడీ ప్రక్రియని నేను ఎంత ఇష్ట పడతానో నా బ్లాగ్మిత్రులందరికీ తెలుసు.

  పేరడీ అంటే కేవలం తిట్టడమే అనుకునే నీ అభిప్రాయం నుంచి నువ్వు బయటకి వస్తే మంచిది.

  “ఒకవేళ నాకు నిజంగా నా వదిన గారితో సంబంధం ఉన్నా మా ఇద్దరి మీదా కుళ్ళు జోక్‌లు వేసి ప్రచారం చెయ్యడం సంస్కారహీనమే అవుతుంది.”

  నీ వ్యక్తిగత విషయం నాకు అనవసరం ప్రవీణ్. నాకు అర్థమయినంత వరకు వాళ్ళు నీ కథల్లో వదిన పాత్ర పై కథానాయకుడికి ఉండే ప్రేమని విమర్శించారు. నేను చదివిన నీ ఒక కథలో అన్న పొలంలో పనిచేసే అమ్మాయితో ఉండటం చూసిన తమ్ముడు వదిన వద్దకి వచ్చి అన్నయ్య అలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి అతన్ని వదిలేసి నాతో వచ్చేయి అంటాడు. కాస్త తటపటాయించిన వదిన చివరికి తమ్ముడితో వెళ్ళిపోడానికి నిశ్చయించుకుంటుంది. ఇదే నవీన స్త్రీ వాదం అయితే, ఒక సమస్యకి ఇలాంటి పరిష్కారమే నవీన స్త్రీవాదం సూచిస్తే నాకు తెలిసి అది ఒక పర్వర్టేడ్ ఆలోచన మాత్రమే. ఒక స్త్రీ అయితే భర్త దగ్గర లేదా అతని తమ్ముడి నీడలో బ్రతికేయాలి తప్ప మరో మార్గం లేదు అనేదే నీ ఆ కథలో నాకు కనిపించిన సోకాల్డ్ నవీన స్త్రీ వాదం.

 98. “శంకర్, మీరు ఎప్పుడు చర్చించారని చర్చతో సంబంధం లేని విషయాలు వ్రాయాలి?”

  ఉదాహరణకి శాస్త్ర విజ్ఞానం బ్లాగులో నేను మావోయిజం గురించి అడిగిన దానికి సమాధానం చెప్పు, నా ప్రశ్న అసంబద్ధం కాదు అని నిరూపిస్తాను అని ఎన్ని సార్లు అడిగాను ప్రవీణ్? అది చర్చ కాదా? కలల ప్రపంచం బ్లాగ్ లో శ్రీ కృష్ణ దేవరాయలు ముస్లిం అని నువ్వ్వన్నప్పుడు ఆధారం చూపించు అంటే ఇప్పటి వరకూ పత్తాలేవు. ఆ రోజు జరిగింది చర్చ కాదా?

  “వదిన-మరిది సంబంధం అనో, రెల్లి వీధిలో వందకి రెండు వందలు అనో చెప్పి మీరు ఎన్ని సార్లు టాపిక్ డైవర్ట్ చెయ్యలేదు?”

  ప్రవీణ్ నీకు ఇప్పటికే సవాలక్ష సార్లు చెప్పాను. “మీరు” అనేది ఎవర్ని ఉద్దేశించి అంటున్నావు? నేను నిన్ను ఎప్పుడైనా పైన నువ్వు చెప్పిన విధంగా అన్నానని ఒక్క మాట, ఒక్క మాట చూపించు చాలు. అందరి ముందూ నీకు క్షమార్పణ చెబుతాను. అలా కాక నీ ఇష్టం వచ్చినట్టు నా మీద ఆరోపణలు చేస్తే మర్యాద దక్కదు. ఇది నీకు ఇప్పటికే చాలా చాలా చాలా సార్లు చెప్పాను. అర్థమయితే మరో సారి చెప్పించుకోవనే ఆశిస్తున్నాను.

 99. వాళ్ళు ప్రపీసస పెట్టడానికి కారణం ఇన్నయ్య గారి బ్లాగ్‌లో జరిగిన గొడవ కాదు.

  గతంలో తెలుగు బ్లాగుల్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ తత్వశాస్త్రం గురించి అవగాహన లేనట్లు కనిపించింది. మూడేళ్ళ క్రితం నేను తెలుగు బ్లాగుల్లోకి వచ్చాను. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం గురించి వ్రాసిన కొద్ది మంది తెలుగు బ్లాగర్లలో నేను ఒకణ్ణి. నేను ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి ఉండడం వల్ల నాకు తెలుగు సరిగా రాక తెలుగు అనువాదాలలో సంస్కృత పదాలు వ్రాసేవాణ్ణి. అవి అర్థం కానివాళ్ళు పట్టించుకోకుండా వేరే పనులు చూసుకునేవాళ్ళు కానీ నా మీద వ్యక్తిగత విమర్శలు చెయ్యలేదు.

  అయితే కొంత మంది గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళకి నా మార్క్సిస్టు రాతలు నచ్చలేదు. గ్లోబలైజేషన్ విధానాలు అమలు జరుగుతున్న కాలంలో మార్క్సిజం-లెనినిజం లాంటి తత్వశాస్త్రాలని జనం చదివితే గ్లోబలైజేషన్ ప్రక్రియకే నష్టం అని వారు గ్రహించారు. నా బ్లాగ్ ముయ్యించాలనుకున్నారు.

  అందులో భాగంగానే ప్రపీసస పెట్టి నన్ను తిడుతూ రోజుకి మూడు వందల కామెంట్లు వ్రాసేవాళ్ళు.

  ఒకవేళ నా రచనలు నిజంగా అర్థం కాకపోతే వాటిని విమర్శించడానికి కష్టపడి అన్ని కామెంట్లు వ్రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను కామెంట్లలో “శవాల మీద మురియాలు ఏరుకునే చిల్లర ఎదవ” లాంటి తిట్లు తిట్టడంతో ప్రపీససపై వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రపీసస మూసేసారు. ప్రపీసస మూతపడడం జీర్ణించుకోలేని కెలుకుడు బేచ్ లీడర్ నాకు వ్యతిరేకంగా వదిన కామరాజు లాంటి వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో నాకూ, భరద్వాజకీ మధ్య ద్వేషం పెరిగిందే కానీ తగ్గలేదు.

  ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే భరద్వాజ శిష్యుడు కార్తీక్ భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే పేరడీ ఒకటి వ్రాసాడు. ఆ పేరడీ వల్ల గొడవలు మళ్ళీ పెరిగాయి. వాళ్ళ బేచ్‌కి చెందిన ఒక అమ్మాయే ఆ బేచ్ నుంచి కొంత కాలం వరకు తప్పుకుంది. అయితే గూగుల్ గ్రూప్స్‌లో ప్రపీసస అనే గ్రూప్ పెట్టి ఆమెని కన్విన్స్ చేసి ఆమెని తిరిగి తమ బేచ్‌లోకి తెచ్చుకున్నారు. గూగుల్ బజ్‌లో వచ్చిన కామెంట్ల గొడవ వల్ల ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ బేచ్ నుంచి బయటకి వెళ్ళిపోయింది.

  ఒక అమ్మాయి తమ బేచ్ నుంచి తప్పుకుందనే కోపంతో భరద్వాజ మళ్ళీ నా మీద వదిన-మరిది పేరడీలు వ్రాస్తూ దాడులు చెయ్యడం మొదలుపెట్టాడు. చివరికి ఆ గొడవ భరద్వాజ వాళ్ళ అమ్మగారిని నేను తిట్టడం వరకు వెళ్ళింది.

  నా వదిన గారి మీద పేరడీలు వ్రాయడం ఎందుకు, వాళ్ళ అమ్మగారిని తిట్టించుకోవడం ఎందుకు, నేను తిట్టానని చెప్పి సానుభూతి కోరడం ఎందుకు?

  ఈ గొడవలలో నాకు సపోర్ట్ ఇచ్చిన ఏకైక మహిళా బ్లాగర్ నీహారిక గారు కావడం వల్ల ఆమె గురించి కూడా వాళ్ళు చాలా చెత్తగా వ్రాసారు. ప్రైవేట్ చాట్‌రూమ్‌లలో కూడా ఆమె గురించి చాలా చెత్తగా ప్రచారం చేశారు. వాళ్ళు మొదట దాడి చేసింది కత్తి మహేశ్ అనే దళితవాది మీద. వాళ్ళు కత్తి మహేశ్ గారిని ఏమీ చెయ్యలేకపోవడం వల్ల నా మీద & నీహారిక గారి మీద విరుచుకుపడ్డారు.

 100. నేను వ్రాసిన వెన్నెల దారి కథ యొక్క లింక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది.

  మగవాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడు మగాడు అని చెప్పి అతని కుటుంబ సభ్యులు అతన్ని జస్టిఫై చేస్తారు కానీ ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె కుటుంబ సభ్యులు ఆమెని జస్టిఫై చెయ్యరు ఈ సమాజంలో. అందుకే ఈ కథ చివరలో స్త్రీ అక్రమ సంబంధం ఉన్న తన భర్తని వదిలేసి మరిదితో వెళ్ళిపోతున్నట్టు వ్రాసాను. ఈ కథ యొక్క లింక్ ఇదే: http://streevimukti.stalin-mao.net.in/54227198

  అడవి బాపిరాజు గారు లేచిపోయినవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వ్రాస్తే నేను లేచిపోవడం తప్పు కాదు అనే వ్రాసాను. ఒక హిపోక్రైట్‌తో కాపురం చెయ్యలేక లేచిపోవడం అనేది పర్వర్షన్ ఎన్నటికీ కాదు.

 101. కల్పన గారు అయిదో గోడ కథ వ్రాసినప్పుడు కూడా మీరు ఇలాగే విమర్శించారు. ఆ కథలో అరవై ఏళ్ళ స్త్రీ భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తే మీరు ఏమని వాదించారో నాకు గుర్తుంది. ఆ అరవై ఏళ్ళ ఆవిడకి ఎలాగూ పిల్లలు ఉన్నారు కదా, ఆవిడ ఆ వయసులో పిల్లల దగ్గర ఉండకుండా రెండో పెళ్ళి చేసుకోవడం ఏమిటి అని విమర్శించారు.

  మగవాడు అరవై ఏళ్ళ వయసులో భార్య చనిపోయినా ముప్పై ఏళ్ళ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు. ఆడది అరవై ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తే అది మహిళాభ్యుదయం కాదని వాదిస్తారు. మగవాళ్ళకి ఉన్న హక్కులూ, అవకాశాలూ ఆడవాళ్ళకి ఉండకూడదు అని చెప్పడమే కదా మీరు మహిళాభ్యుదయం.

 102. ప్రస్తుతం నాకు ఒంట్లో బాగాలేదు. ఆహారం ఏమీ తినకుండా ట్రెక్కింగ్ చేశాను. కొండల మీదకి ఎక్కి దిగడం వల్ల ఒంట్లో నలత, నీరసం ఏర్పడింది. నొప్పులు తగ్గుతాయన్న ఆశతో ట్రైన్‌లో ఎసి పెట్టెలో పడుకుని వచ్చినా నొప్పులు తగ్గలేదు. అందుకే రాత్రి కామెంట్లు చదవకుండానే నిద్రపోయాను.

  రెండు రోజులు కొండలలో ట్రెక్కింగ్ చేసి నాలుగైదు రోజులు పడుకోవడం నేను ఇంతకు ముందు కూడా చేసినదే. అయినా వ్యక్తిగత విమర్శలన్నిటికీ సమాధానం చెప్పే టైమ్ నాకు లేదు.

 103. తెలిసికూడా తెలియనట్టు నటించకండి. మూడేళ్ళ క్రితం నేను మార్తాండ అనే పేరుతోనే బ్లాగుల్లోకి వచ్చానని అందరికీ తెలుసు.

  మార్తాండ పేరుతో పేరడీ వ్రాసి మార్తాండ ఎవరో నాకు తెలియదు అని అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు.

  (ముహమ్మద్ ప్రవక్త పేరు వ్రాయకుండా కలీముల్లాహ్ (One who hears the voice of Allah) అని వ్రాసి ఆ పేరుతో పేరడీ వ్రాసి కలీముల్లాహ్ ఎవరో నాకు తెలియదు, అది ఒక వ్యక్తి పేరు అనుకున్నాను అని సమాధానం చెపితే ముస్లింలు ఊరుకుంటారా?)

 104. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం గురించి చెత్తగా మాట్లాడడం సంస్కారం ఎన్నడూ అవ్వదు.

  ఒకవేళ మా పక్కింటివాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను అది తప్పు అని మాత్రమే చెప్పి వెళ్ళిపోతాను కానీ అతనికి అక్రమ సంబంధం ఉందని ఊరంతా ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందాలనుకోను.

  ఒకవేళ నేను పైశాచిక ఆనందం కోసం అలా ప్రచారం చేస్తే అది అక్రమ సంబంధం పెట్టుకోవడం కంటే పర్వర్షన్ అవుతుంది.

 105. “పద్మ గారు, మీ బేచ్‌వాళ్ళు వ్రాసిన పేరడీలు మా అన్నయ్య చదివాడు. అదృష్టం ఏమిటంటే మా వదిన గారు చదవకపోవడం వల్ల మీరు బతికిపోవడం.”

  మీ అన్నయ్య నీ కథలు కూడా చదివారా ప్రవీణ్? అవి మీ వదిన గారు బహుశా చదివి ఉండరు. అందుకే నువ్వు బ్రతికిపోయావ్

 106. విశేఖర్ గారూ తప్పుగా అనుకోకండి. పైన పద్మ గారి కామెంట్ లో మీరు ఇంత అసహనానికి గురవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆవిడ మీ తల్లి గారి గురించి ఏమీ అనలేదు కదా. అంటే మీరు సహించగలరా అని మాత్రమే అన్నారు. ఆ ప్రస్తావన తెచ్చినందుకు క్షమార్పణలు కూడా కోరారు. దానికి “నేను సహించను” అని చెప్పి ఆ ప్రస్తావన మరో సారి తీసుకు రావద్దని మీరు సున్నితంగా చెప్పి ఉండవచ్చు అని నా అభిప్రాయం. అంతే కానీ ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవవలసిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. చూసే వాళ్లకి ఇది మీరు ఆవిడతో వాదించడం ఇష్టం లేక తప్పించుకోడానికి చూపించిన సాకుగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు స్పందించిన తీరు అలా ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

 107. వాళ్ళు డైరెక్ట్‌గా నా పేరుతోనే పేరడీలు వ్రాసారు కానీ నా కథలలోని హీరోల పేరుతో ఎన్నడూ వ్రాయలేదు. ఆ పేరడీలు నన్ను టార్గెట్ చేస్తూ వ్రాసినవే అవుతాయి కానీ అవి కథలలోని హీరోలని టార్గెట్ చేస్తూ వ్రాసినవి ఎలా అవుతాయి? వాళ్ళు డైరెక్ట్‌గా నా పేరు ఉపయోగించి వ్రాసిన తరువాత కూడా వాళ్ళు పేరడీలు నా మీద వ్రాయలేదని అంటే ఎలా నమ్మగలను?

 108. విశేఖర్ గారు, ఈ కథ చదవండి: http://www.scribd.com/doc/77862821
  కల్పన గారు ఈ కథ వ్రాసినప్పుడు వీళ్ళందరూ ఆ కథని విమర్శించారు. స్త్రీ తన భర్త చనిపోతే పిల్లల పంచనే పడి ఉండాలనీ, రెండో పెళ్ళి చేసుకోకూడదనీ, అదే మహిళాభ్యుదయం అనీ వాదించారు. వీళ్ళు కొత్త ఐడియాలజీని స్వాగతిస్తారని ఎలా అనుకోవాలి? నేను నా కథలలో కూడా స్త్రీ రెండో పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తే స్త్రీకి పెళ్ళే జీవితం కాదు అని అంటూ విషయం డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు. అందుకే వాళ్ళ వాదనలని నేను అంగీకరించలేదు.

  కథలు నచ్చకపోతే నచ్చలేదని డైరెక్ట్‌గా చెప్పాలి కానీ పేరడీలు వ్రాసి వేధించడం మాత్రం అనాగరికమే అవుతుంది. అసలు విషయం డైవర్ట్ చేస్తూ ప్రశ్నలు అడిగితే రచయితకి సమాధానం చెప్పాలనిపించదు. సమాధానం చెప్పలేదని కక్ష గట్టి పేరడీలు రాశారు. అలా పేరడీలు వ్రాసి వేధించినా అది అనాగరికమే అవుతుంది.

 109. ప్రవీణ్, మీరిక్కడ ఒక విషయం స్పష్టం చెయ్యండి. మీరు ‘మీరు’ అని అంటున్నది శంకర్ గార్ని ఉద్దేశించా?

 110. “మీరు” అన్నది మీ బ్యాచ్‌ని ఉద్దేశించి.

  శాస్త్ర విజ్ఞానం బ్లాగ్‌లో నేను సమాధానం చెప్పకపోవడమే మేలు అనే నిర్ణయానికే వచ్చాను. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే మావోయిజం గురించి అడిగి, నేను సమాధానం చెప్పిన తరువాత నేనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నానని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరుగుతుందని తెలిసిన తరువాత నేను ఎందుకు సమాధానం చెప్పాలి?

  చైనాలో నాయకులు కేవలం ప్రైవేట్ ఆస్తి కోసం మార్కెట్ వ్యవస్థని పునరుద్ధరించారు అనే విషయం నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. అది capitalistic deviation అవుతుంది కానీ మార్క్సిజం యొక్క తప్పు కాదు. నా బ్లాగ్‌లో నేను వ్రాసిన ప్రతి విషయం చదివి దాని మీద జోక్‌లు వేసే వాళ్ళు “పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి” అనే సామెతలాగ మళ్ళీ దాని గురించే అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి?

  సమాధానం చెప్పిన ప్రశ్నలకే మళ్ళీ, మళ్ళీ సమాధానం చెపితే నన్ను పిచ్చోడని కూడా ప్రచారం చేస్తారు. సమాధానం చెప్పకపోతే తప్పించుకుంటున్నానని అంటారు. చర్చించడం లేదా సమాధానాలు అంగీకరించడం మీకు ఇష్తం లేనప్పుడు నాకు ప్రశ్నలు అడగడం ఎందుకు?

 111. ప్రవీణ్, మీరు మీ వదిన అన్నయ్య గార్ల గురించి ఇప్పటికే ఎక్కువ ప్రస్తావించారు. మీరు చెప్పదలుచుకున్నది చెప్పారు. మళ్ళీ అదే విషయం చెప్పనవసరం లేదు.

  మిత్రులు కూడా ప్రవీణ్ అన్నయ్య, వదిన గార్ల టాపిక్ ని వదిలెయ్యగలరని విజ్ఞప్తి.

 112. ప్రపీసస స్టైల్ ప్రశ్నలే నువ్వు కూడా అడిగావు.

  బొందలపాటి గారి బ్లాగ్‌లో స్త్రీల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతోంటే కేవలం సినిమాల వల్ల స్త్రీల వస్త్రధారణ మారిపోదు అని వ్రాసాను.

  మధ్యలో నువ్వు వచ్చి నన్ను కొండవీటి దొంగ సినిమాలోలాగ ముసుగేసుకుని ఫొటో ఎందుకు తియ్యించుకున్నావు అని అసందర్భమైన ప్రశ్న వేశావు. నేను ముఖానికి రుమాల కట్టుకున్నంత మాత్రాన అది సంప్రదాయం మారినట్టు కాదు. ఆడది చీరకట్టుకోవడం మానేసి సినిమాలోలాగ నిక్కర్ వేసుకుంటే అది సంప్రదాయం మారినట్టు అవుతుంది. ఈ విషయం నువ్వు తెలియక అడిగావనుకుని సమాధానం చెప్పాలా?

  ఒకవేళ నేను సమాధానం చెప్పినా సరే నేను ఒక సినిమా చూసి ముసుగు వేసుకున్నాను కనుక సినిమాలు చూసి ఆడవాళ్ళు నిక్కర్లు వేసుకుంటారు అనే కాన్సెప్ట్‌ని నేను అంగీకరించాలని వాదిస్తావు. ప్రపీససవాళ్ళు ఇలాగే వాదించారు కనుక, వాళ్ళ సమాధానాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కనుక ఆ స్టైల్‌లో నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేదు.

 113. శంకర్ గారూ, నాకసలు ప్రస్తావనే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో అక్కడే వివరించాను. చర్చ ముగించడానికి కారణాన్ని చాలా సంయమనంగా, సాధ్యమైనంత సున్నితంగా, గౌరవం ఇస్తూ తెలిపాను.

  ఎవరండీ చూసేవాళ్ళు? నాకు వ్యతిరేకంగా పేర్లు మార్చి విష ప్రచారం చేసేటప్పుడు ఏ కలుగులో ఉన్నారు ఈ చూసేవాళ్ళు? వైల్డ్ అని మీరు ముద్ర వేయవద్దు దయచేసి.

  చెప్పానుగా. కెలుకుడు ఎంత కురిపించినా అది నాకు అంటదు అని. మీరు మరో మార్గంలో అదే విషయాన్ని తెస్తున్నారా?

  మీరు మళ్ళీ ‘మీ తల్లిగారు’ అని అదే ప్రయత్నం చేయవద్దు. మీరు మళ్ళీ ఈ ప్రస్తావన తేవద్దు. నా సెంటిమెంటును గౌరవిస్తారా లేదా అని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాలా?

 114. నేను ‘మీరు’ అన్నది నన్ను అసందర్భమైన ప్రశ్నలు అడిగి విసిగించి నేను పిచ్చివాణ్ణని నిరూపించడానికి ప్రయత్నించడమే పనిగా పెట్టుకున్న బేచ్ గురించి.

  శంకర్ కూడా నాకు అవే ప్రశ్నలు అడిగాడు కాబట్టి “మీరు” అనే రిఫరెన్స్ ఉపయోగించాను.

 115. అవును ప్రవీణ్ నాకు అనుభవం ఉంది.

  వారికి నచ్చని భావాలు రాస్తే ఇష్టం వచినట్లు ఎగతాళీ చేస్తూ కామెంట్లు పెట్టడం, ఎగతాళి చేసిన వ్యాఖ్యలను తొలగిస్తే ‘అదుగో తిసేశాడు’ అని కాకి గోల చెయ్యడం, పైగా ‘ఇష్టం లేకపొతే మా కామెంట్లు తొలగించుకోవచ్చు’ అని సూచించి మరీ తీసేశాలా ప్రోత్సహించడం, తీరా తీసేశాక దాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా దూషిస్తూ బ్లాగ్ ఓపెన్ చెయ్యడం. ఇవి వీరి కుట్ర బుద్ధులు. ఇంకా చెప్పాలంటే ‘కెలుకుడు’ బుద్ధులు, కెలికే కార్యక్రమాన్ని గొప్పగా స్వీకరించడానికి వీళ్ళకి ఏ అభ్యంతరమూ ఉండదు.

  ఇదంతా వీళ్ళు చాలా కేలిక్యులెటెడ్ గా చేస్తారు. నా విషయంలో చేశారు కూడా.

  వీరి లక్ష్యం వారికి నచ్చని భావాలు బ్లాగుల్లో రాకుండా చెయ్యడం. మొదట కత్తిగారు బలయ్యారని మీతో పాటు ఇతర బ్లాగర్లు చెప్పగా తెలిసింది. ఆ తర్వాత మీరు. మీ తర్వాత నేను.

  నాకివన్నీ తెలియక మొదట్లో ఓపిగ్గా చెప్పాను. ఓపికగా వివరించడం కూడా వారికి నచ్చదు. ఎందుకంటే వారి లక్ష్యం చర్చంచి తెలుసుకోవడం కాదు. సాధ్యమైనంత కెలికి ఠారెత్తించి రాయకుండా తరిమెయ్యడం. అది నాకు కొద్ది రోజుల్లోనె అర్ధం అయింది. అభ్యుదయ భావాలను అణగదొక్కడానికి పాత ఛాందస భావాల సమర్ధకులు ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడేం అంటారు? మేము మొదట్లో బూతులు అన్నామా అంటారు? చెత్త రాసి దానికి ‘విమర్శ’ అని పేరుతో తామే సర్టిఫై చేస్తున్నారు. పాఠకుల్ని మళ్ళీ ఆ వాతావరణంలోకి ఎలాగూ తీసుకెళ్లలేం. అది వారికి అవకాశం. ఇప్పటి వాతావరణమేమో పూర్తిగా చెడిపోయి ఉంది. రెచ్చగొట్టబడిన మిత్రులూ అందులో పాత్రధారులుగా ఉన్నారు. దానితో కెలుకుడు గ్యాంగ్ కి సాపేక్షికంగా పని సులువవుతోంది.

  చర్చిస్తే మేమూ చర్చించే వాళ్లం కదా అని వీరు చెబుతున్న దానిలో నాకు చిత్త శుద్ది కనిపించలేదు. ఎందుకంటే వారు చెయ్యనిదే అది. అది చెయ్యకపోవడం వల్లనే చెత్త కామెంట్లు తొలగిస్తే, నెను తొలగిస్తేనే చెత్తలో పొర్లడం మొదలు పెట్టాం అని రుజువు చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కాని వారి కెలుకుడు బుద్ధి ఎక్కడికి పోతుంది. అదే కెలుకుడు మర్చిపోయి కురిపిస్తున్నారు. ఆ కెలుకుడు వారి నిజ స్వరూపం బట్టబయలు చేస్తున్న సంగతి వారూ గమనించని స్ధితికి చేరుకుంటారు. ఎంతకాలం నాటకాలు ఆడగలరు.

  కాని ఇది మన పని కాదు. మనపని బ్లాగుల్లో కొనసాగడం. కొనసాగుతూ అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చెయ్యడం. వారి కెలుకుడు పట్ల మన మౌనం వారినింకా రెచ్చగొడుతుంది. మొదట మర్యాదస్తులుగానే ఉన్నా పరోక్షంగా మర్యాదగా ప్రస్తావిస్తున్నట్లు నటిస్తూ ‘నాలాంటి వారి తల్లులను, ఇతర బంధువులను’ కూడా చర్చలోకి లాగడానికి ప్రయత్నిస్తారు. అది నా విషయంలో రుజువైంది. అటువంటి వాళ్ళను నేను మరింత ప్రోత్సహిస్తే నన్ను కూడా మీరిప్పుడున్న స్ధితికి చేర్చగలరు. వారి లక్ష్యం అదే.

  ఆ లక్ష్యాన్ని దెబ్బగొట్టాలంటే మనం చేయవలసింది ‘మీరు చేస్తున్నట్లుగా బూతుల్లోకి’ దిగడం కాదు. అలా చేయడం వారి లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. అభ్యుదయ భావజాలం ప్రచారం కారాదన్న వారి లక్ష్యం నెరవేరినట్లే. అది మీరు తప్పనిసరిగా గమనించాలి.

  పాత భావాలు, పాత సామాజిక విలువలపైన ఆధారపడి ఉన్న సామాజిక వ్యవస్ధలపైన ఆధారపడే ప్రభుత్వాలు తమ దోపిడీ, అవినీతి లను నిర్విఘ్నంగ కొనసాగిస్తాయి. వారి దోపిడికి అడ్డువచ్చే చోట పాత భావాలైన మత ఛాందసత్వం, కుల తత్వం లను రెచ్చగొట్టి మత కల్లోలాలు వైరుధ్యాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఆ కార్యక్రమాలకి మళ్ళిస్తారు. ఇక వారికి ఆధిపత్య వర్గాల ఆర్ధిక దోపిడినీ ప్రశ్నించి, తమ సమస్యలైన ‘ఆకలి, దరిద్రం, పేదరికం’ లాంటి సమస్యలపైన ఉద్యమాలు నిర్మించే అవకాశాలు రావు. అలా రాకుండా చేయడానికి ప్రభుత్వాలు మతం, కులం లాంటి పాత భూస్వామ్య భావజాలాన్ని కాపాడుతుంటారు.

  ‘ఆ, మా హిందువుల్ని అంటారా’ అని ఆవేశపడిపోయి గొడవలకి దిగే వారు కూడా ఆదిపత్య వర్గాల దోపిడీకి గురవుతూనె ఉంటారు. వారికా విషయం చెప్పినా ఆ ఆవేశంలో ఎక్కించుకోరు. వారు తెలుసుకునే వరకూ ఒక్కోసారి ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓపిక నశించి మనమూ అదే పద్ధతుల్లోకి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం అందుకే తలెత్తుంది. అది గ్రహించకుండా అదే ధోరణిలోకి వెళ్ళడం వల్ల మనం కూడా మన కర్తవ్యాలని మర్చిపోతాము. ఇతరులకు చెప్పగల నైతికి స్ధైర్యం కూడ కోల్పోవలసి ఉంటుంది.

  అందుకే సంయమనం అవసరం. వ్యక్తిగత అహాలకి ఇక్కడ తావులేదు. వ్యక్తిగత అహాలకు చోటిస్తే ఆదర్శ భావజాలం, దాని అమలు వెనకబడిపోతుంది.

 116. విశేఖర్ గారూ
  ప్రవీణ్ గారు ఏ నిజాన్ని గ్రహించేరో అని మీరన్నది నాకర్థం కాలేదు కానీ ఆయన నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా నేను ఇలా అడిగేనని తనకి తెలియను కూడా తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారని మాత్రం నాకు బాగానే అర్థం అవుతోంది.
  . అంటే నన్ను ప్రశ్న అడిగి నా జవాబుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి ఆయన నన్ను ఉద్దేశించి ఆ ప్రశ్న వేసిందెందుకో! నేను దానికి జవాబిచ్చిన తరువాత దాన్ని నిర్లక్ష్యపెట్టడం ఎందుకో! ఇప్పుడు అది నాకర్థం అవడం లేదు.
  ఆయన్ని అడగండి. నాకేదీ బ్లోగ్ లేదు. నేను ఆయన ప్రస్తావనని ఎప్పుడూ తెచ్చిన గుర్తు కూడా నాకు గుర్తు లేదు. ప్రవీణ్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడని కూడా నాకు కొద్దికాలం కిందటి వరకూ తెలిసేది కాదు ( ప్రవీణ్ గారూ ఇది మీ ఖ్యాతిని అవమానించడానికి రాయలేదు. మీరు చాలా పోప్యులర్ అని నాకీ మధ్య అర్థం అవుతోంది లెండి. కనుక దీని సరిగ్గానే అర్థం చేసుకోండి).
  మరి అటువంటప్పుడు ఆయన నా ఉనికి గురించి అన్ని సందేహాలని లేవనెత్తి ఇప్పుడు బూతంటే అర్థం ఏమిటని నన్నే ఎందుకు అడుగుతున్నారు? నేనేమైనా వాటిని ఎక్కడైనా ఉపయోగించేనా ? అసలు నేనన్న మనిషినే లేనన్న వ్యక్తి నన్ను ఆ పదానికి నిర్వచనం తెలిపమనడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? చదివినవాళ్ళకి నేను నిజంగా అలాంటి పదాలని ఉపయోగిస్తానేమో అన్న అనుమానం రాక తప్పదు. ఆయన నన్ను అలా ఎందుకు ప్రశ్నించేరా అని తెలుసుకోవడానికి నాకు మహా కుతూహలంగా ఉంది. మీ ఈ టపాకీ తనతో ఏ పాటి పరిచయం- అదీ ఎక్కడా కూడా లేనప్పుడు మరి ఆయన ఇక్కడ నన్ను సంబోధించి వేసిన ఈ ప్రశ్నకి అసలేదైనా సంబంధం ఉందా? ఆయనా నేనూ ఏ బ్లోగులోనైనా ఏ సందర్భంలోనైనా కలుసుకున్నామా ? కలిపి కామెంట్లు పెట్టేమా? నాకేదో చాలా కంన్ఫ్యూసన్ గా ఉంది. మధ్య ఆయన నన్నెందుకు ఈ సంబంధం లేని తాత్పర్యాలనీ, నిర్వచనాలనీ అర్థాలనీ అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు. మరి మీకేమయినా అర్థం కనుక అయితే దయచేసి కొంచం శ్రమపడి నాకు వివరించండి.
  ప్రవీణ్ గారిని కనుక్కుని నా ఈ సందేహాన్ని తీరుస్తారనే ఆశ

 117. ఇక మలక్ విషయములో జరిగినది నా అనుకోలు మాత్రమే. మిగిలిన బ్లాగర్ల పైగానే అతని మీద కూడా తన ప్రతాపాన్ని చూపబోయి దెబ్బ తిన్నాడు అని. ఇరువురు తిట్టుకోవడం మొదలు పెట్టిన తరువాత ఎవరు ముందు ఎవరు వెనుక అనే దానితో సంబందం లేకుండా.. చాలా జరుగుతాయి
  —————
  అందరూ చెప్పేది ఇదే .. ప్రవీణ్‌ గాడు పిచ్చోడైతే .. మలగ్గాడు వాడికన్నా పెద్ద పిచ్చి పట్టి ఊరిమీద తిరిగే ఊరకుక్క.
  పది మంది లఫూట్‌ గాళ్ళు వెంట ఉన్నారు కదా అని నేను పెద్ద రౌడీని అందర్నీ కెలుకుతాను అంటే ఇలాగే ఏదో ఒకరోజు పెళ్ళి జరగక మానదు.నా ఉద్దేశ్యంలో ఇది ఆరంభం మాత్రమే ,, ఇంకా వీడూ వీడి అనుచరులు చేసిన దురాగతాలూ బయటకివచ్చేరోజు త్వరలోనే ఉంది

 118. “తెలిసికూడా తెలియనట్టు నటించకండి. మూడేళ్ళ క్రితం నేను మార్తాండ అనే పేరుతోనే బ్లాగుల్లోకి వచ్చానని అందరికీ తెలుసు.”

  నువ్వు ఏ పేరుతో బ్లాగుల్లోకి వచ్చావో నీ తర్వాత బ్లాగుల్లోకి వచ్చిన వాళ్లకి ఎలా తెలుస్తుంది ప్రవీణ్? చాలా టపాలలో నువ్వు ISP ADMINISTRATOR, మార్తాండ, చెరశాల శర్మ, ప్రవీణ్ శర్మ, తెలుగు వెబ్ మీడియా ఇలా రకరకాల పేర్లతో కామెంట్లు పెడతావు. ఏది ముందో ఏది తర్వాతో ఎవరికి తెలుసు? నీ గురించి ప్రపంచానికి తెలిసే తీరాలి అనుకోవడం అమాయకత్వం ప్రవీణ్.

  “మార్తాండ పేరుతో పేరడీ వ్రాసి మార్తాండ ఎవరో నాకు తెలియదు అని అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు.”

  ఇది ఎవర్ని ఉద్దేశించి అన్నావు? ఒక వేళ నన్నే అయితే నీకిదే నా చివరి హెచ్చరిక. మార్తాండ పేరుతో పేరడీ ఎవరు రాశారు? నేను రాశానా? రాయడం నువ్వు చూశావా? మాట్లాడితే “మీరంతా” అంటావు. అంటే నీ భావాలు నచ్చని వాళ్ళంతా ఒకటే బ్యాచ్ అని నీ ఫీలింగా. మొన్నెప్పుడో నేనే ప్ర.పీ.స.స. పెట్టాను అన్నావు. అప్పుడూ నీకు చెప్పాను తెలియకుండా మాట్లాడకు అని. మళ్ళీ ఇప్పుడు. ఏం ప్రవీణ్ నేను నీ మీద పేరడీ రాస్తే చూడాలని ఉందా? ఉంటే ఆ ముక్క నేరుగా నాతొ చెప్పాలి గానీ ఇలా అర్థం పర్థం లేని వాగుడుతో నన్ను రెచ్చగొట్టడం ఎందుకు?

 119. “మగవాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడు మగాడు అని చెప్పి అతని కుటుంబ సభ్యులు అతన్ని జస్టిఫై చేస్తారు కానీ ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె కుటుంబ సభ్యులు ఆమెని జస్టిఫై చెయ్యరు ఈ సమాజంలో.”

  అక్రమ సంబంధం ఎవరు పెట్టుకున్నా తప్పే అని చెప్పడం మానేసి స్త్రీలు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా సమర్ధించాలి అనడం ఏం వాదం కిందకి వస్తుంది ప్రవీణ్?

 120. విజయ్ గారూ, మీకో విన్నపం.

  దయచేసి పేర్లు మాత్రమే ప్రస్తావించి మీరు చెప్పదలచినది చెప్పండి. ‘కెలుకుడు’ అని తమ లక్ష్యం ప్రకటించుకున్నవారిని అదే పేరుతో సంబోధించవచ్చు. ఇతర విశ్లెషణాలు రాకుండా చూడగలరు.

 121. ప్రవీణ్, తాను పేరడీలు పెట్టలేదని శంకర్ చెబుతున్నారు. దాన్ని మీరు స్వీకరించండి.

  లేదూ, ఆయన చెప్పినదానికి భిన్నమైన సాక్ష్యాలు ఉంటే ఆయనకి చూపండి.

  శంకర్ గారూ, ‘మీరు’ అంటే ఎవరన్నదీ ప్రవీణ్ చెప్పారు. అదొకసారి చూడండి.

  ఈ టెంప్లేట్ లో వ్యాఖ్య పెట్టిన సమయం ప్రాతిపదికన కామెంట్లు వరుసగా రావడం లేదు. దానివల్ల కమ్యూనికెషన్ గ్యాప్ వస్తున్నట్లు అనుమానంగా ఉంది.

 122. “నన్ను అసందర్భమైన ప్రశ్నలు అడిగి విసిగించి నేను పిచ్చివాణ్ణని నిరూపించడానికి ప్రయత్నించడమే పనిగా పెట్టుకున్న బేచ్ గురించి.”

  ప్రవీణ్ నేను అడిగిన ప్రశ్న అసంబద్ధం కాదు మొర్రో. ఆ విషయం చర్చ కొనసాగే కొద్దీ నీకే తెలుస్తుంది. నేను ఆ విషయం నిరూపిస్తాను అన్నా వినకుండా చర్చలోంచి వెళ్లి పోయావు. అక్కడ నేను నిన్ను ఆ ప్రశ్న అడిగింది చర్చకు సంబంధించి మాత్రమే. అంతే తప్ప నువ్వు పిచ్చివాడివో, కావో ఎవరికైనా నిరూపించాలనో, ఇంకోటో కాదు. అసలు అది నాకు అనవసరం కూడా.

 123. మా హిందువులని అంటారా అని వాళ్ళు విరుచుకుపడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లింలకి తమలో తమ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా హిందూ మతానికి వ్యతిరేకంగా మాత్రం సమైక్యంగానే ఉంటారు. కానీ హిందువులలో ఆ ఐక్యత ఎన్నడూ కనిపించలేదు. ఇండియాకీ, పాకిస్తాన్‌కీ మధ్య ఎంత వైరం ఉన్నా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా హిందువులలోని వివిధ కులాలు ఏకమైన సందర్భాలు ఎన్నడూ చూడలేదు. కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా సున్నీలూ, షియాలూ ఏకమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ వేర్పాటువాదులకి పాకిస్తాన్ మీద ఎంత ద్వేషం ఉన్నా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఇండియా సపోర్ట్ వాళ్ళు ఎన్నడూ కోరలేదు. మాకు ఇండియా సపోర్ట్ అవసరం లేదు అని బెలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పాలెస్తీనా అనే ఒక చిన్న ఇస్లామిక్ దేశానికి ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి (ఒక టర్కీ తప్ప). టర్కీ దేశం మాత్రమే సెక్యులరిజం పేరుతో అమెరికా సామ్రాజ్యవాదులకి మద్దతు ఇస్తోంది. ముస్లింలలో ఐక్యత అంత వరకు ఉన్నా హిందువులలో అది కూడా లేదు.

  మార్క్సిజానికి వ్యతిరేకమైన వైయుక్తికవాదం అనే సిద్ధాంతం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సిద్ధాంతం వ్యక్తి సమాజానికి అతీతుడనీ, సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖం అనీ ప్రబోధిస్తుంది. వైయుక్తికవాదులు కనీసం జాతి, మతం గురించి కూడా ఆలోచించరు. హిందువులలో రెగ్యులర్‌గా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు తక్కువ, మత గ్రంథాలు చదివేవాళ్ళు అంత కంటే తక్కువ. అయినా మతం పేరు చెప్పి ఇతరులని తిడుతున్నారంటే వాళ్ళు మతాన్ని కేవలం ఐడెంటిటీగా భావిస్తున్నారని అనుకోవాలి. సామాజిక జీవితం విషయానికొస్తే మత ఐడెంటిటీ ప్రదర్శించుకోవడం కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సమాజం గురించి ఆలోచించకుండా వైయుక్తికంగా జీవించేవాళ్ళు సమాజంలో తమ మతం మాత్రం ఐడెంటిటీ కలిగి ఉండాలనికోరుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

  మన రాష్ట్రంలోని చాలా గ్రామాలలో మత మార్పిడులు జరుగుతున్నా గ్రామస్తులు అభ్యంతరం చెప్పడం లేదు. చివరికి మా బంధువులలో కొందరు క్రైస్తవ మతంలోకి మారినా మేము అభ్యంతరం చెప్పలేదు. గ్రామీణ ప్రాంతాలలో పరమత సహనం ఉంది కానీ పట్టణ ప్రాంతాలలోని ఎడ్యుకేటెడ్ ఎలైట్ వాళ్ళు వ్రాసే బ్లాగుల్లోనే మత విద్వేషపూరితమైన వ్రాతలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన ఇండియాని ముస్లింలు అనేక వందల సంవత్సరాలు పరిపాలించినా మన ఇండియా పూర్తిగా ఇస్లామీకరణ చెందలేదు. కేవలం అరవై అయిదు సంవత్సరాల క్రితం ఏర్పడిన సెక్యులర్ పాలనతో ఇండియా క్రైస్తవీకరణ చెందుతుందని నేను అనుకోను కానీ క్రైస్తవీకరణ జరుగుతుందనుకుని క్రైస్తవ మతం మీద విరుచుకుపడేవాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. క్రైస్తవీకరణ జరుగుతోందని గొల్లు పెట్టేవాళ్ళే క్రైస్తవ మతం పేరుతో పాలెస్తీనా లాంటి దేశాల మీద దాడులు చేసే అమెరికా సామ్రాజ్యవాదులని సమర్థిస్తారు. గ్లోబలైజేషన్‌కి అమెరికాయే కేంద్రం అని వాళ్ళకి తెలుసు. మతం కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నప్పుడు మతం పేరుతో వేరేవాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు?

 124. పది మంది వెనుక ఉన్నారు కదా అని ఒక వ్యక్తి ఏమి చేసినా జస్టిఫై చెయ్యలేము. గ్రామాలలో చేతబడుల నెపంతో రేప్‌లు జరిగినప్పుడు పది మంది కాదు, వెయ్యి మంది ఆమోదంతో ఒక మహిళని రేప్ చేస్తారు. కొన్ని సార్లైతే గ్రామంలో ఉన్న పౌరులందరి ఆమోదంతోనే మహిళని రేప్ చేసి నగ్నంగా ఊరేగిస్తారు. అందరి ఆమోదం ఉంది కదా అని అనాగరికమైన పనులని జస్టిఫై చెయ్యలేము.

 125. అక్కడ నువ్వు పెట్టిన కామెంట్ ఇది. ఇందులో స్త్రీల వస్త్ర ధారణా గురించి మాట్లాడావా? సినిమాల వలన ప్రభావితమై ఆ స్టైల్ ని అనుకరించే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి నేను నీ కొండవీటి దొంగ ఫోటో యే ఉదహరించాను. పైగా కొండ వీటి దొంగ సినిమా స్ఫూర్తితోనే నువ్వు ముఖానికి గుడ్డ కట్టుకుని గుర్రం పక్కన ఫోటో దిగాను అని నువ్వే చెప్పావు.

  “సొల్లు కబుర్లెందుకు? కేవలం వ్యాపారం కోసం నిర్మించే సినిమాల వల్ల డ్రెస్ స్టైల్ మారదు అనే వాదనకి నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాను. ఎవడు ఎలా అనుకున్నా, ఏమి అనుకున్నా ఇది నిజం.”

  పైగా అక్కడి నీ నోటి దురుసు తనానికి ఇంకో సాక్ష్యం ఇదిగో.

  ““నేను నా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండి ఇన్ని రోజులు నేను డిజిపి వీడియో చూడలేదు. 24 గంటలూ బ్లాగుల్లోనే తినితొంగునే మీరు ఏమి చేశారు? వీడియో చూడకుండానే కొందరు డిజిపికి అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చేశారు.”

  అంటే అప్పటి వరకూ ఆ చర్చ చేస్తున్న వాళ్ళంతా ఏమనుకోవాలో నువ్వే చెప్పు ప్రవీణ్?

 126. అతను పేరడీలని ఓపెన్‌గానే జస్టిఫై చేస్తూ తాను జస్టిఫై చెయ్యడం లేదని చెపుతున్నాడు. అందుకే అతని ఆ పేరదీ బేచ్‌కి చెందిన వయ్క్తిగా పరిగణించాను. అంతే.

  ఉష్ట్ర పక్షి ఇసుకలో తల పెట్టి తనని ఎవరూ చూడడం లేదు అనుకునే సామెత గురించి తెలిసినదే కదా.

 127. బాబు విశెఖర్ గారు,

  కొత్తపాళి, నిహారిక, కృష్ణ, కత్తి, సత్యనారాయణశర్మ, స్కైబాబ, ప్రవీణ్, ఇక మారుపెర్లతొ బ్లాగులు పెట్టి మహిళ బ్లగర్లను కూడ తిట్టిన ఘన చరిత్ర కెలుకుడు బ్యాచ్‌‌ది. అదంతా చరిత్ర. వారివద్ద వేలకొద్ది స్క్రీన్ షాట్లు వుంటాయి.

  స్వామీ తమరు ఈ గోల విడవండి ఇంతకుముందు ఎవరో చెప్పినట్లు ” ప్రవీణ్ పిచ్చి కుక్క అయితే రౌడి ఒక ఊరకుక్క” . మీరు మీ వ్యాసాంగాలపైన దృష్టి పెట్టండి. వాళ్ళ రాతలను పట్టించుకోకండి.

 128. ప్రవీణ్,

  పాలస్తీనా ఇస్లామిక్ దేశం కాదు. అది అరబ్బు దేశం. అరబ్బు అన్నది జాతి గానే చూడాలి తప్ప మతం కాదు. అరబ్బుల మతం కూడా ఇస్లామే. పాలస్తీనాలో గాజా ప్రాంతంలో మాత్రమే హమాస్ అన్న ఇస్లామిక్ సంస్ధ ప్రభుత్వంలో ఉంది. వెస్ట్ బ్యాంక్ హమాస్ పాలనలో లేదు. అక్కడ ఇజ్రాయెల్ తో కుమ్మక్కయిన పాలస్తీనా అధారిటీ ప్రభుత్వం ఉంది. అది సెక్యులర్ ప్రభుత్వంగా చెప్పుకుంటోంది.

  భారత దేశం లో నివసిస్తున్న ప్రజల్లో జాతి ప్రాదిపదిక లేదు. అమెరికాకి ఇప్పుడు ఆధునిక కాలంలో వలసులు పెరిగి జాతి పరమైన పోలరైజేషన్ జరగనట్లే, భారత దేశానికి చాలా కాలం నుండీ వలసలు జరుగుతూ వచ్చాయి. దక్షీణాదిలో భాషల ప్రాతిపదికన పోలరైజేషన్ జరిగి ఒకే భాష వారు దాదాపు ఒకే చోట నివస్తిన్నందున భాషల పేరుతో జాతులని ప్రస్తావించుకుంటున్నారు గానీ నిజానికి దక్షీణాదిలో కూడా ప్రాచీన జాతులు గుండుగుత్తగా కొనసాగలేదు.

  జస్టిస్ మార్కండేయ్ కట్జుగారు ‘ది హిందూ’ లొ కొన్ని నెలల క్రితం ఒక ఆర్టికల్ రాశారు. భారత దేశంలో జాతుల ప్రాదిపదిక, ప్రాచీన జాతుల కొనసాగింపు అంశాలపపైన కొన్ని వివరాలు ఇచ్చారు. ‘ది హిందూ’ వెబ్ సైట్ కి వెళ్తే ఆయన వ్యాసం లింక్ కనపడవచ్చు.

  దక్షిణాదిలో ద్రవిడ జాతులు అని చెప్పుకుంటున్నప్పటికీ అవి ద్రవిడ జాతులు కాదనీ ద్రవిడ భాషలు మాట్లాడుతున్నవారు మాత్రమేననీ రొమిలా ధాపర్ గారు తాజా చరిత్ర రచనలో పేర్కొన్నారు. కట్జూ వివరణలో రొమిలాతో ఏకీభావం కనబరిచారు. భారత దేశంలో మొదటినుండీ భారత దేశంలో ఉంటూ వచ్చినవారు ఎవరని ఇప్పడు చూస్తే చెప్పలేమని ఆయన రాశారు. ఉత్తరాదిన బైటినుండి వచ్చిన ఆర్యులది ఆధిపత్యం అనీ, ద్రవిడులు ఈ దేశంలో మూలవాసులనీ చేస్తున్న వాదనలు సరికాదని ఆయన చెప్పారు. భారత దేశంలో ప్రాచీన కాలంలో ఉద్భవించి ఇప్పటివరకూ కొనసాగుతున్నవారిదే భారత దేశం అని చెప్పేపనైతే అడవుల్లో, కొండల్లో నివసిస్తున్న ఆదివాసులదే ఈ భారతదేశం అని ఆయన తెలిపాడు. దేశం బైటినుండి వలస వచ్చినవారితో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇక్కడే పుట్టి ఇక్కడే కొనసాగుతూ వచ్చినవారు వారేననీ ఇతరులందరూ ఏదో విధంగా కొన్ని వేల సంవత్సరాల నుండి వలస వచ్చినవారో లేదో వలస వచ్చినవారి సంతతులేననీ ఆయన వివరించాడు.

  ఆర్యులు దండెత్తారని చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. నిజానికి ఆర్య జాతి అన్నది ఏమీ లేదనీ, ఆర్యన్ భాష మాట్లాడేవారున్నారనీ, ఇండో-ఆర్యన్ భాషలు మాట్లాడేవారు మాత్రమే ఉన్నారనీ, వారే ప్రష్యా ప్రాంతం నుండి వలస వచ్చారనీ రొమిలా ధాపర్ తన తాజా చరిత్ర రచనలో వివరించారు. ‘ఆర్యులు దండేత్తారని చెప్పడం సరికాదనీ ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే వారు భారత దేశానికి వలస వచ్చి స్ధిరపడ్డారనీ, అలా స్ధిరపడుతున్న క్రమంలో అప్పటికే ఇక్కడ నివసిస్తున్నవారితో ఘర్షణలు జరిగి ఉడవచ్చు అని ఆమె తెలిపారు. ఆ ఘర్షణలనే దండెత్తడం గా చెబుతున్నారని ఆమె సూచించారు.

  మొత్తం మీద చూస్తే ఆదివాసులు తప్ప మిలినవారంతా వలస వచ్చారని తెలుస్తోంది. భారతీయుల మధ్య వైవిధ్యం ఇందువల్లనేనని తెలుస్తోంది. ఈ వైవిధ్యభరితమైన జీవన విధానాల నుండి వలస రావడం వలన వారి మధ్య చారిత్రాత్మక ఏకీభావన లేదని కట్జూ సూచించాడు. హిందూ మతం ద్వారా సంక్రమించిన కులాల దొంతరల వ్యవస్ధ హిందూ మతస్ధులను ఐక్యపరచడంలో సహజంగానే విఫలమైంది. ఆధ్యాత్మిక జీవన విధానంతో మెజారిటీ బ్రాడ్ గా మమేకమైనప్పటికీ జాతిపరమైన ఐక్యత వీరి మద్య లేకపోవడానికి ముఖ్య కారణం మెజారిటీ వలస వచ్చినవారే కావడం అని కట్జూ వివరించాడు. ఆయన వ్యాసం చదివితే ఆయన రాసిన దానిపై మరింత సమగ్రత వచ్చే అవకాశం ఉంది.

  చెప్పొచ్చేదేమంటే హిందూ మతం కింద ఆర్గనైజ్ అవుతూ ‘రెచ్చగొట్టబడిన సమయంలోనైనా’ ఇతర మతస్ధుల తో తగాదాలకు సిద్ధపడకపోవడం వెనుక ఈ చారిత్రక వైవిధ్యం, అనైక్యత కారణమని కట్జూ సూచించాడు. ‘ఇప్పుడు పూనుకుని వేల సంవత్సరాలనుండి వలస వచ్చినవారిని వెనక్కి పంపదలుచుకుంటే ఆదివాసులు తప్ప ఇంకెవరూ మిగలరు. వలస వచ్చినవారు ఒక్క ముస్లింలే కాదు. హిందూ మతం కింద ఉన్నవారు కూడ మెజారిటీ వలస వచ్చినవారే’ అని కట్జూ రాశాడు. ఇప్పుడు కట్జూ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్నారు.

 129. శంకర్.ఎస్ గారూ!
  ‘మందలింపు కి వ్యక్తిగత దూషణకి తేడా మీకు అర్థమయింది అనుకుంటాను.’ అన్నారు మీరు.

  ‘అర మెదడు కుంకా’ , ‘నా చేతిలో చచ్చావే నువ్వు’, ‘తోలు తీస్తా జాగ్రత్త’.. ఇవన్నీ కేవలం మందలింపులు. వ్యక్తిగత దాడి కిందకు ఏమాత్రం రావు. వ్యక్తిగతంగా దూషించడం కూడా కాదు. అంతేగా?

  మీ దృష్టిలో మందలింపులే ఈ స్థాయిలో ఉన్నాయంటే ఇక దూషణలు ఏ స్థాయిలో ఉంటాయో !

  ‘ఇంకా ఏం చెయ్యాలని మీరు ఆశిస్తున్నారు?’ అని అడిగారు.

  “‘మీ భావజాలం పై దాడిచేస్తే నేను అంగీకరిస్తానేమో కానీ మీ పై వ్యక్తిగత దాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఖండిస్తాను” అని ‘జనరల్’ గా చెప్పటం కాదు, ప్రస్తుతం విశేఖర్ పై కెలుకుడు గ్యాంగ్ వైఖరి విషయంలో… ఈ ప్రత్యేక సందర్భంలో దాన్ని నిర్దిష్టంగా చెప్పమని అడుగుతున్నాను.

  కెలుకుడు గ్యాంగ్ విశేఖర్ పై వ్యక్తిగత దాడి చేసిందని మీరు భావిస్తున్నారా? దాన్ని మీరు ఖండిస్తున్నారా? సూటిగా జవాబు చెప్పండి!

 130. శీను గారు, దాదాపు రెండూ గంటలనుండి టపా రాయడానికి ప్రయత్నిస్తున్నా. కాని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ రెండు ఆమోదించి టపా రాద్దామని అనుకునే లోపు మరో రెండు కనపడుతున్నాయి.

  మీ సలహా మేరకు తాత్కాలికంగా ఈ విషయం వదిలి టపాలు రాస్తాను. నేను రాయాలనుకున్నవి రాసి ఆ తర్వాత కామెంట్స్ జోలికి వస్తాను.

  మీరంతకుముందే ఈ హెచ్చరిక చేశారు. వ్యాఖ్యాతలకు ప్రధమ ప్రాధాన్యం ఇవాలని నేను భావించడం వల్ల మీ హెచ్చరికను అమలు చేయలేకపోయాను. ఆఫ్ కోర్స్. టపా రాస్తూ వ్యాఖ్యల ప్రచురణ ఆలస్యం ఐనా పోయేదేమీ లేదులెండి.

 131. నాకు ఒంట్లో బాగాలేదు. వ్యక్తిగత విమర్శలకి సమాధానం చెప్పే టైమ్ కూడా నాకు లేదు. మీరు వేరే వ్యాసాలు వ్రాస్తే నేను కూడా చదువుతాను.

 132. విశేఖర్ గారూ, నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రవీణ్ గారి గురించి అసలు ప్రస్థావించకపోయినా కానీ ఆయనకీ నాకు ఎటువంటి పరిచయం లేకపోయినప్పటికీ ఏదో నన్ను సంబోధిస్తూ ఒక కామెంట్ పెట్టేరు కదా, జవాబివ్వకపోతే మర్యాదగా ఉండదేమో అనుకుని ఒకటి కాక రెండు సమాధానాలు మరీ ఇచ్చేను. మరిప్పుడు చూస్తే ఆయన అందరికీ ఒకటికి పది జవాబులిచ్చి నా ప్రశ్నకి జవాబివ్వకుండా తనకి ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయేరే ! మరి నేనాయన కామెంటుని పట్టించుకుని మరీ సమాధానం రాసేనా లేదా? అవి రెండూ ( ప్రశ్నా, సమాధానం) out of context అనుకోండి. మరి ఇదేం మర్యాదంటారు?

 133. నేను ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెపుతున్నాను. నేను మలక్ కృష్ణవేణి చారి అనే పేరుని ఇంపర్సనేట్ చేస్తున్నాడని ఆరోపించిన మాట నిజమే. కృష్ణవేణి అనే వ్యక్తి నిజంగా కామెంట్ వ్రాసినా, ఆమె పేరుని ఇంకొకరు ఇంపర్సనేట్ చేసినా నేను గారు అని పిలవడం అనేది భాషలో అలవాటు ప్రకారం జరిగినదే. అంతే కానీ గారు అని పిలిచినంతమాత్రాన ఇంపర్ననేషన్ జరిగిందా, లేదా అనే విషయంలో అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. కనుక గారు అని పిలవడం తప్పు కాదు అనే నేను నమ్ముతున్నాను. ట్రైన్‌లో టిటి‌ఇతో గొడవ జరిగినా అతన్ని టిటి‌ఇ గారు అనే అంటాం కానీ ఒరేయ్ టిటి‌ఇ అని అనము. గారు అని పిలవడం మనకి అలవాటు వల్ల కావచ్చు, పది మంది ఉన్న చోట ఒరేయ్, రా అని పిలవకూడదు అనే భావన వల్ల కూడా కావచ్చు. సభా మర్యాద వల్ల గారు అని పిలిచినంతమాత్రాన గౌరవం ఉన్నట్టు కాదు. ఒక వ్యక్తిని గారు అని పిలిచి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తరువాత ఆ వ్యక్తి గురించి చెత్తగా మాట్లాడుకున్నవాళ్ళని కూడా చూశాను. వాళ్ళ కంటే గారు అని పిలవనివాళ్ళే నయం కదా. గారు అని పిలవడం, లేదా పిలవకపోవడం అనేది ఇష్యూ కాదు అనే అనుకోవాలి. నేను గారు అని పిలిచింది భాషలో అలవాటు ప్రకారమే. ఒకవేళ ఏకవచనం ఉపయోగించినా అది ఎందుకు ఉపయోగించావు అని అడుగుతారు. అటువంటప్పుడు గారు అని పిలిస్తే అభ్యంతరం చెప్పడం ఎందుకు?

 134. అయ్యా ప్రవీణ్ గారూ, మీరు నన్ను ఏకవచనంలో సంబోధించేరా కాదా అన్నది కాదు నేను అడిగింది. నేనంటూ ఒక మనిషిని లేనే లేనని మీరు కొన్ని నెలలు నిర్ధారించి డప్పు అంత గట్టిగా కొట్టిన తరువాత ఇప్పుడు మీరు హటాత్తుగా నా ఉనికి నాకుందని ఏ కారణం వల్లో నమ్మడం అన్నది ఆశ్చర్యం అని నేనంటునాను. మీకర్థం అయిందో లేక అర్థం చేసుకోలేదో అన్నది నాకింకా అనుమానమే. దయచేసి నా పాత రెండు కామెంట్లూ జాగ్రత్తగా చదవమని నా వినతి.
  అదీకాక మీరు నన్ను ఏకవచనంలో కనుక సంబోధిస్తే నేనూరుకుంటాననేనా మీ ఉద్దేశ్యం? దయచేసి అలాంటి పొరపాటు పనులు మాత్రం చేయకండి.

 135. ప్రవీణ్ గారూ మీతో మాట్లాడి ప్రయోజనం ఏదీ లేదన్న నమ్మకం నాకు కుదిరిందిప్పుడు. నేనడిగిందేమిటి? మీరు చెప్తున్న ఈ ఏకవచనాలూ బహువచనాలూ ఏమిటిక్కడ? I guess we are taliking at cross purposes here. So I might as well leave this here since you are in no frame of mind to even understand what I am saying.It was totally foolish in my part. I agree
  Nice of you having used a “garu” for a suffix. .

 136. “నా సెంటిమెంటును గౌరవిస్తారా లేదా అని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాలా?”

  విశేఖర్ గారూ నేను ఖచ్చితంగా మీ సెంటిమెంట్ ను గౌరవిస్తాను. కానీ ఆవిడ మిగిలిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పి ఉంటే బావుండేది అని నా అభిప్రాయం

 137. మనోహర్ గారూ పాపం మీ బాధ చూడలేకపోతున్నా. మీరు నాతొ ఏం చెప్పించదలిచారో, ఏం చెప్తే మీకు తృప్తి కలుగుతుందో ఇక్కడ రాస్తే దాన్ని యధాతధంగా కాపీ పేస్ట్ చేసేస్తా. సరేనా.

 138. శంకర్ గారూ, అనవసరంగా నా తల్లిగారిని చర్చలోకి లాగి తన పరిమితి దాటారు. కనుక ఇక ఏ ఇతర ప్రశ్నలకీ నేనిక ఎంటర్ టెయిన్ చెయ్యను.

  ఈ విషయం అక్కడే చెప్పాను. ఎందుకో మళ్ళీ మళ్ళీ మీరు నేను వద్దన్న అంశాల్ని చర్చించడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. రెచ్చగొట్టాలని చూస్తున్నట్లుగా తోస్తోంది. అది కాదని ఆశిస్తున్నా.

  నా తల్లిగారి ప్రసక్తి తెచ్చాక సదరు వ్యక్తి తెచ్చిన ఏ టాపిక్ నీ చర్చించదలచలేదు. ఈ విషయంలో ఇచే నా చివరి స్పందన.

 139. శంకర్. ఎస్ గారూ!

  మీరు ఘనంగా ప్రవచించిన స్టాండ్ నే విశేఖర్ గారి విషయంలో అప్లై చేసి నిర్దిష్టంగా చెప్పమంటే ఇంత అసహనం ఎందుకో మీకు? సరే.. మీ బాధ కూడా నాకు అర్థమైంది లెండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s