ఐదంతస్ధుల ఎత్తులో ‘అవర్ లేడీ ఆఫ్ గ్రేస్’ -ఫొటో


ఇదో వీధి బొమ్మ. ఐదంతస్ధుల ఎత్తు గల ఓ భవంతి గోడపైన గీసిన బొమ్మ ఇది. ఎ’షాప్ అనే సంస్ధకు చెందిన ఐదుగురు ఆర్టిస్టులు పదహారు రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ చిత్రాన్ని గీయడం అక్టోబరు 20 న పూర్తి చేశారు. కెనడా లోని క్వెబెక్ రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన మాంట్రియల్ లో ఈ బొమ్మ గీసారు.  ఈ బొమ్మ గీయడానికి కావలసిన సరంజామా సమకూర్చుకోవడానికి రెండు వారాలు పరిశోధన చేశామని ఆర్టిస్టులు చెప్పారు. ఏ బ్రష్ లతొ గీయాలి, ఏ పెయింట్లు వాడాలి, ఏ పాళ్ళలో వాడాలి తదితర అంశాల్ని నిర్ణయించుకోవడానికి వారా పరిశోధన చేయాల్సి వచ్చింది.

చిత్రాన్ని గీసిన ఫ్లూక్, డోర్యన్ డొడోసె, యాంటొనిన్ లాంబర్ట్, బ్రూనో లాద్బోర్న్, గ్యూల్యూం లు తమ బొమ్మ ముందు వరుసగా నిలబడి ఉండడం చూడవచ్చు. చెక్ ఆర్టిస్టు ఆల్ఫన్స్ మ్యుఛా గీసిన ప్రసిద్ధ చిత్రం ‘అవర్ లేడీ ఆఫ్ గ్రేస్’ బొమ్మ ఇన్స్‌పిరేషన్ తో గీసిన “Mother Nature-esque Madonna” ఈ బొమ్మ అని ఫ్లూక్ చెప్పాడు. 500 క్యాన్ల 50 రకాల రంగుల్ని వాడామని వారు తెలిపారు.

Our lady of grace

3 thoughts on “ఐదంతస్ధుల ఎత్తులో ‘అవర్ లేడీ ఆఫ్ గ్రేస్’ -ఫొటో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s