వ్యక్తిగత విద్వేష ప్రచారమే ‘కెబ్లాస’ లక్ష్యం, దయచేసి బ్లాగర్లందరూ ఇది చదవండి


బ్లాగింగ్ కి ఒక పేరు, కెలకడానికి ఒక పేరు. బూతులకి ఒక పేరు. బ్లాగింగ్ పేర్లతో కెలుకుడు ఉండదు. కెలుకుడు పేర్లతో బూతు ఉండదు. బూతులకి వాడే పేర్లతో బ్లాగింగ్, కెలుకుడులు ఉండవు. వీరంతా టెక్నీషియన్లు. పేర్లు, ఐ.పిలు లాంటివాటిలో జాగ్రత్తలు తీసుకోగలరు. ఆ ధైర్యంతోనే “కెలుకుడు పేర్ల కింద ఒక్క బూతు చూపండి చూద్దాం” అని తుంటరి సవాళ్ళు విసురుతారు.

కెలుకుడు గాళ్ళే బూతు గ్యాంగ్ అని శైలి ద్వారా, వే ఆఫ్ రియాక్షన్ ద్వారా, ఏకీకృత భావాల ద్వారా టెక్నికల్ నాలెడ్జి లేని నాలాంటి వారు తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం? కెలుకుడు గాళ్ళలోనే బూతు గాళ్ళూ ఉన్నారని ఆధారాలు చూపలేకపోవడమే మీ బలం. ఆ బలంలేనితనం ఉంది గదాని కెలుకుడు గ్యాంగ్ కెలుకుడిని, వారి అలియాస్ పేర్ల బూతుని వ్యతిరేకించకుండా ఉండలేం.

— — —

ఈ కెలుకుడు బ్యాచ్ ప్రత్యేకత మరొకటుంది. నా విషయంలో వెల్లడించుకున్నందున నేనది చెప్పగలను.

నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను. కాని వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించను. కెలుకుడు గ్యాంగేమో నాపైనే వ్యక్తిగత దాడి చేస్తారు. నా పేరు విశేఖర్ అయితే ‘విష శేఖర్’ అంటూ పచ్చి వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు. నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను. అన్నాను.

అప్పుడు కెలుకుడు గ్యాంగ్ యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. ఏమని? “మీకు ఇతరులని విమర్శించే హక్కు ఎలా ఉంటుందో, మాకు మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుంది” అని. ఎవరైనా “నీకు నన్ను విమర్శించే హక్కు ఎలా ఉందో నాకూ నిన్ను విమర్శించే హక్కు ఉంది” అంటారు. వీళ్ళు మాత్రం ‘(మమ్మల్ని విమర్శించకపోయినా) అమెరికా విధానాల్ని, హిందూ మత దురహంకార విధానాల్ని విమర్శిస్తే మాకు నిన్నే ద్వేషిస్తూ దుష్ప్రచారం చేసే హక్కు ఆటోమెటిక్ గా వస్తుంది’ అంటారు. కెలుకుడు గ్యాంగ్ కదా! (వక్కాణింపూ నాదే -విశేఖర్)

ఇది ఓ కెలుకుడు తెలివి. కెలుకుడు గ్యాంగు నాపైన ప్రయోగించిన నీచ నికృష్ట ‘కెలుకుడు’ తెలివి ఇది.

నేను రాసింది అమెరికా, దాని విదేశాంగ విధానం, హిందూ, ముస్లిం మత దురహంకారాలు, హిందూ మతంలో దళితుల అణచివేత ఈ అంశాలపైన. కాని కెలుకుడు గ్యాంగ్ రాతలన్నీ నాపైనే. నా రాతల పైన కాదు. నేనా రాతలు రాశాను గనక నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారు. విష శేఖర్ అంటారు. పేర్లు మార్చుకుని తిట్టడానికే బ్లాగులు పెడతారు. అన్నీ చేసి మేమేమన్నా బూతులు రాశామా అని ఆరిందల్లా అడుగుతారు? ఏమన్నా పొంతన ఉందా?

అమెరికా విదేశాంగ విధానం పైన నేను విమర్శ చేస్తే, ఆ విదేశాంగ విధానం ఎలా సరైందో చెప్పరు. హిందూ మతంలో దళితుల అణచివేతను ప్రశ్నిస్తే దళితుల అణచివేత ఎందుకు సరైందో చెప్పరు. హిందూ (ముస్లిం) మతోన్మాదాన్ని విమర్శిస్తే ఆ మతోన్మాదం ఎలా సరైందో చెప్పరు. కాని విధానాల పైన, ఉన్మాదం పైన విమర్శ చేసిన నా పైన మాత్రం వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు.

పైగా అమెరికా, హిందూ (ముస్లిం) మతోన్మాద విధానాలను నువ్వు విమర్శిస్తున్నావు గనక మేము నిన్ను వ్యక్తిగతంగా ద్వేషిస్తూ రాస్తాం. నువ్వు అమెరికా విదేశాంగ విధానాల్ని ద్వేషిస్తావు కనుక మేము నిన్నే ద్వేషిస్తాం అంటారు.

ప్రపంచం పైన అచ్చోసిన ఆంబోతులా పడి దాడులు చేస్తున్న అమెరికా విదేశీ విధానాలని విమర్సిస్తే వీళ్ళు నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారా? తిడతారా? అబద్ధాలు నాకు అంటగడతారా? ఏం నీతి ఇది? పైగా కెలుకుడు అందుకోసమె అని నిస్సిగ్గు సమర్ధనలు!

విధానాలని విమర్శించడం నా విధానం అయితే, తమకు నచ్చిన విధానాలను విమర్శిస్తున్న వ్యక్తులపైన ద్వేషం వెళ్లగక్కడం, వ్యక్తిగత వ్యతిరేక ప్రచారం చేయడం కెలుకుడు బ్యాచ్ ‘కెలుకుడు’ విధానం.

—- — —-

‘కెలుకుడు’ ముఠా సభ్యురాలైన పద్మ గారు ఇలాంటున్నారు, “నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడిదంతా (కెబ్లాస) reaction మాత్రమే. proactiveగా వాళ్ళు రాసిన ఒక్క పోస్ట్ చూపించండి.

ఇంతకంటే గొప్ప హిపోక్రసీ ఏమిటి? వ్యక్తిగత విద్వేషానికి ఇదో గొప్ప సమర్ధన. ఈ దెబ్బతో బూతులు కాని ద్వేష పూరిత ప్రచారానికంతటికీ ఆమోద ముద్ర పడిపోయింది. అక్కడికి బూతులు ఒక్కటే కూడనిది. మిగిలిన ఛండాలం అంతా సమర్ధించదగినది. కదా పద్మ గారు?

నేను వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా, మూకుమ్మడిగా నా పైన వ్యక్తిగత విద్వేషం వెళ్ళగక్కడం ప్రోయాక్టివ్ గా రాయడం కాదా? వ్యక్తిగత దాడులు ప్రారంభించేది మీ కెలుకుడు గ్యాంగ్ అందుకే మీరు ప్రోయాక్టివ్. అది కేవలం రియాక్షన్ కాదు.

మీ లక్ష్యం ఒక భావాజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం. దానికి ఎన్నికోదగిన మార్గం ఆ భావజాలం ఎలా సరికాదో చర్చించడం. కాని అందుకు మీరెంచుకున్న పద్ధతి వ్యక్తిగత కెలుకుడు. భావాజాలం పైన చర్చిస్తే అర్ధం ఉండేది. అటువంటి చర్చ ఇప్పటికీ అనేక అంశాలపై నా బ్లాగ్ లో నడుస్తోంది. అది కాదు మీరు చేసేది, చేస్తున్నది. మీరు చేస్తున్నది వ్యక్తిగత కెలుకుడు. అది కూడా విద్వేషపూరితమైన కెలుకుడు. ఒక భావాజాలం వ్యక్తం చేస్తున్నందుకు, ఆ భావజాలం మీకు ఇష్టం లేనందుకు, మీకు ఇష్టం లేని భావజాలం వ్యక్తం చేస్తున్న వ్యక్తులపైన వ్యక్తిగతంగా చేస్తున్న అమానవీయ కెలుకుడు.

‘ఒక్క బూతు చూపించండి’ అని సవాలు విసిరే పద్మ గారి లాంటి మర్యాదస్తులకు ఈ విద్వేష పూరిత కెలుకుడు ‘ఆమోదమే’. అదొక గొప్ప కార్యక్రమం వీళ్ళకి.

ఏళ్ళ తరబడి సాగిన ఈ విద్వేష పూరిత ప్రచారానికి ప్రవీణ్ తన పద్ధతిలో స్పందిస్తున్నాడు. ఆ పద్ధతికి నా మద్దతు లేదు. కాని అతను అనుభవించిన మానసిక వేదన, నిస్పృహ, మూకుమ్మడి వ్యక్తిగత దాడుల నుండి పెల్లుబుకిన నిస్సహాయత… వీటన్నింటికీ నా సానుభూతి కొనసాగుతుంది. ఇవి నేనూ అనుభవించాను. ఆ అనుభవంలో కూడా నేను మర్యాద కోల్పోలేదు. ఆ సందర్భంలో నేను ‘ప్రమోదవనం’ లో రాసిన ‘ఈ వ్యాఖ్య‘ చూడండి. దీన్ని ఆ మిత్రులు పోస్టుగా మలిచారు.

ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరుతున్నాను. అలా టార్చర్ కి గురి చేసిన ‘కెలుకుడు’ ఉరఫ్ ‘బూతు’ గ్యంగ్ దుర్మార్గాన్ని చూడాలని కోరుతున్నాను. ఆ టార్చర్ గాళ్ళని, ఆ కెలుకుడు గాళ్లని వ్యతిరేకించకుండా ప్రవీణ్ బూతుల్ని మాత్రమే వ్యతిరేకించడం సాధ్యంగాదని ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను.

6 thoughts on “వ్యక్తిగత విద్వేష ప్రచారమే ‘కెబ్లాస’ లక్ష్యం, దయచేసి బ్లాగర్లందరూ ఇది చదవండి

 1. పద్మ గారెందుకో స్పందించడం లేదు. బహుశా వారాంతపు విశ్రాంతిలో ఉన్నారేమో. సోమవారం స్పందిస్తారని ఆశిస్తున్నా.

 2. vishayam meeda charcha cheste meeru comment delete chestunnaru ani telisindi….why cant you publish their comment when they ask genuine questions on your subject knowledge…..even i do not believe in left parties….vaallu deshaniki pattina daridram…..

 3. శంకర్ గారికి,
  అదేమీ లేదు. విషయం పైన చర్చ చేస్తే కామెంట్ డిలిట్ చెయ్యడం జరగలేదు. నన్ను దూషిస్తూ దూషణలతో పాటు చర్చ చేస్తున్నట్లు ఫోజు పెడితే డిలిట్ చేసి ఉండవచ్చు. దూషణలు లేకుండా విషయంపైన కోపంగా రియాక్ట్ అయిన వారికి కూడా సమధానాలు ఇచ్చాను.

  నా నాలెడ్జి పైన ప్రశ్నలు వేశారా? మీకు ఎవరు చెప్పారోగాని కొత్త విషయాలు చెబుతున్నారు. నాకు సంపూర్ణ పరిజ్ఞానం లేదండీ. నాకు తెలిసిన విషయాలు నేను చెప్పగలను. తెలియకపోతే తెలియదని కూడా చాలామందికి చెప్పాను.

  నేను బ్లాగుల్లోకి వచ్చేటప్పటికే ఓ కలుషిత వాతావరణం ఇక్కడ ఏర్పడిపోయి ఉంది. అది నేను గమనించలేదు. అలాగే నా బ్లాగ్ దాటి నేను బైటికి వెళ్లలేదు. వెళ్ళినా తక్కువ. అంత సమయం నాకు లేదు. అందువల్ల ఈ వాతావరణం ఆరేడు నెలల దాకా కనీస స్ధాయిలో కూడా నాకు అర్ధం కాని పరిస్ధితి ఉంది. ప్రవీణ్ ని ఎవరు వీళ్ళు, ఎందుకిలా రాస్తున్నారు అనడిగినా అతను ఏమీ చెప్పలేదు. ప్రమోదవనంలో ఓ సారి కామెంటు రాశాను. ఆ వ్యాఖ్య తర్వాత మళ్ళీ వనాల జోలికి వెళ్ళలేదు.

  కాని నేను వ్యక్తం చేసిన భావాలు అప్పటికే కొంతమందికి ఉన్నాయి. అది సహజం. వారికి ఇతరులకూ మధ్య వాతావర్ణం బాగాలేని నేపధ్యంలో నేను వారిలో ఒకరిగా ఇతరుల భావించినట్లుగా నాకు తర్వాత అర్ధం అయింది. దానికి నేను బాధ్యుడ్ని కాలేను. విమర్శిస్తూ, ఎగతాళి చేసినవారికి కూడా మొదట ఓపిగ్గా చెప్పాను. ‘ఓపిగ్గా చేబితే వదిలేస్తామనుకున్నావా?’ అంటే అక్కడి నుండి తొలగించడం ప్రారంభించాను. తొలగించిన మొదటి కామెంటే అగ్రిగేటర్లో ప్రచురితం అయింది.

  నా బ్లాగ్ వారికి ఆ అగ్రిగేటర్ కి ఇచ్చాను. కనుక నా పోస్టులు, వ్యాఖ్యలు అందులో వస్తాయని తెలుసు కాని తొలగించింది కూడా వచ్చేసరికి మొదట కన్ఫ్యూస్ అయ్యాను.

  ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వ్యాఖ్యల్ని తొలగించవచ్చని వారు చెప్పెదాకా నాకూ తెలియదు. ‘విషయం పైన రాయండి. పద్దతిగా రాయండీ’ అని అడిగితే మేము రాసేది రాస్తాం కావాలంటే అది తొలగించే హక్కు నీకుంది అని రాశారు. అప్పుడే నాకు తెలిసింది డిలిట్ చెయ్యొచ్చని. దానికి ముందు కొద్దిమంది చాలా రిపిటీషన్స్ తో రాసినా వాటికి సమాధానాలిస్తూ సుదీర్ఘంగా సమాధానాలిస్తూ పోయాను. విషయం వివరించాలన్న ఉద్దేశ్యంతో అలా చేశాను. ఆ క్రమంలో కొంత చిరాకుగా అనిపించినా అది చంపుకుని సమాధానాలు ఇచ్చాను తప్ప విసుగు వ్యక్తీం చెయ్యలేదు. అలాంటిది నాతో విషయం చర్చిస్తే, అటువంటి వ్యాఖ్యలని తొలగించడం నేను ఎలా చేస్తాను? తొలగించడం మొదలు పెట్టిందే దూషించడం వల్ల. దానికంటె ముందు తొలగించిన కామెంట్లేవీ లేవు. సబ్జెక్ట్ పై రాసినా నేను తొలగించాను అనడం అబద్ధం.

  భారత దేశంలో లెఫ్ట్ పార్టీలను ప్రజల్లో చాలామంది నమ్మరు. ఆ సిద్ధాంతాలకి వారి నిజాయితీ రహిత ఆచరణ ద్వారా అపకీర్తి తెచ్చారు. ఆ విషయం నేను నా బ్లాగ్ లో చాలా సార్లు చెప్పాను. వారి తప్పులు సిద్ధాంతానికి చేరడమే ఇక్కడి విషాధం. వారి ఆచరణని చూసి సిద్ధాంతంపై ఒక నిర్ణయానికి వచ్చే బదులు ఆ సిద్ధాంతం నిజంగా ఏమి చెబుతుందో తెలుసుకుని ఆ తర్వాత వ్యతిరేకించడం ద్వేషించడం చేయవచ్చని నేను చెప్పదలుచుకున్నాను. సి.పి.ఐ, సి.పి.ఎం లాంటి పార్టీల రాజకీయాలు మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలని ఎప్పుడో వదిలేశాయని చెబుతున్న పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ గమనించి అ సిద్ధాంతంపై ఒక నిర్ణయానికి రావచ్చు. అఫ్ కోర్స్ అదొక చర్చ. మీకు ఓపిక ఉంటే నాతో చర్చించవచ్చు. దేశానికే కాదు మార్క్సిస్టు సిద్ధాంతానికే వారు దరిద్రం అని నేను చెప్పదలిచాను.

 4. శేఖర్ గారు,

  ఇంటర్‌నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లను గాని అశ్లీల చిత్రాలనుగాని ఎలా నియంత్రించలేమో తెలుగు బ్లాగులోకంలో ‘కెబ్లాస’ నూ నియంత్రించలేము. స్వీయనియంత్రన ఒక్కటే మార్గము. ఆ బ్లాగుగుంపు సభ్యులకు రూల్స్ & రెగ్యులేషన్స్ ఏమీ వుండవు.

  వివిధ సందర్భాలలో నాకు తెలిసిన ‘కెబ్లాస’ నియమనిబంధనలు…
  ౧. అమెరికాను ఎవరూ వ్యతిరేకించకూడదు. అవసరమైతే భారత దేశాన్ని అమెరికాలో కలుపుపోతేనే గాని భారతదేశంతో కూడిన అమేరికా ప్రపంచంలో గొప్పదేశంగా వుంటుందని వారి ఉవాచ.
  ౨. హిందూ మాతాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదు (అమేరికా తప్ప!).
  ౩. కమ్యూనిజం గురించి మాట్లాడకూడదు.
  ౪. నాస్తికత్వం అని ఎవరైనా అంటే విరుచుకు పడడమే.
  ౫. చైనా పాకిస్తానికి యుద్ధవిమానాలు అమ్మకూడాదు. అమెరికా అయితే పాకిస్తానికి అప్పులు సమకూర్చైనా అత్యాధునిక విమానాలు పాకిస్తానికి సమకూర్చినా ఫర్వాలేదు.
  ౬. నిత్యానందనైనా నిసిగ్గుగా సమర్థిస్తారుగాని సామాజిక కార్యకర్తలంటే గిట్టదు.

  ———————————
  “సి.పి.ఐ, సి.పి.ఎం లాంటి పార్టీల రాజకీయాలు మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలని ఎప్పుడో వదిలేశాయని చెబుతున్న పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి”

  > మరి మావోయిస్టు పార్టీ దృష్టిలో సి.పి.ఐ, సి.పి.ఎం, సి.పి.ఐ(ఎమ్‌ఎల్), న్యుడెమక్రసీ అన్ని కమ్యూనిస్ట్ పార్తీలే కావు, కేవలం మావోయిస్టు పార్టీనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అని వారి భావన. అది నిజమేనా?!

  చాలా సందర్భాలలో ముఖ్యంగా సి.పి.ఎం ని మీరు సందర్భరహితంగా టర్గెట్ చేయడం చాలా భాదాకరం. పార్టీ క్యాడర్/హోల్‌టైమర్స్/జనాదరణ పరంగా దేశంలో మిగతా వామపక్ష భావజాల పార్టీలకంటే సి.పి.ఎం పెద్ద పార్టీ భారతదేశంలో. జాతీయ/రాష్ట్ర నాయకత్వ స్థాయిలలో వున్న నాయకులందరూ చైతన్యంతో స్వలాభాలకోసం కాకుండా ప్రజాసేవ చేస్తున్న వారిని భూర్జువా పార్టీల గట్టున చేర్చడం అంటే మీరు భారతదేశంలో వామపక్ష భావజాల వ్యాప్తికి తూట్లు పొడుస్తున్నట్లే! పూర్వపు రష్యాలోనైనా, చైనాలోనైనా, మరేదేశంలోనైనా, పార్టీ పెద్దదయినప్పుడు లోయర్‌క్యాడర్లో పొరపాట్లు జరిగే అవకాశం వుంటుంది. కార్యకర్తలనే కాకుండా సానుభూతి పరుల పేర్లనూ గుర్తుపెట్టుకోగల చిన్న పార్టీలతో సరిపోల్చి, వారి సిధ్ధాంతంలో తప్పు వలనే మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలని వదిలేశారనడం సహేతుకం కాదు.

  భారతదేశంలో వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ సిధ్ధాంత కార్యక్రమాల అమలుపై వచ్చిన రకరకాల దారులు వెతుకుంటూ విడిపోయినవే తప్ప వ్యక్తిగత స్వలాభాలకోసం ఏర్పడినవి కావని మీకూ తెలుసు. అందువలన మీకు నచ్చని “కమ్యూనిస్ట్” ని బలపర్చక్కర్లేదు అలానే బహిరంగంగా అసందర్భంగా విమర్శించకుండా వుంటే మంచిది.

 5. వాసవ్య గారూ,

  మీ అవేదన అర్ధం అయింది. కొద్దొ గొప్పో కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నిబద్ధత ప్రకటిస్తున్న సి.పి.ఐ, సి.పి.ఎం లాంటి పార్టీలను విమర్శించడం భావ్యం కాదని మీరు చెప్పదలిచారు. అది కూడా ఆ సిద్ధాంత గురించి ఏవీ తెలియకుండా విమర్శలు సాగించేవారికి మద్దతు ఇచ్చే విధంగా కమ్యూనిస్టు పార్టీలను విమర్శించడం సరికాదని మీరు చెప్పదలిచారు.

  ఆ కోణంలో మీ విమర్శని స్వీకరిస్తున్నా. ఆ విధంగా చేయడం వల్ల కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అవగాహన లేరి వారి వద్ద ఆ సిద్ధాంత గౌరవం మసకబారవచ్చని అంగీకరిస్తున్నా.

  మరి కొన్ని అంశాలను మీ దృష్టికి తెస్తున్నా. కమ్యూనిస్టు పార్టీలు దృష్టి పెట్టవలసింది విప్లవం పైనే. దానికి ఎన్నికలు ఒక మార్గం మాత్రమే. కాని ఎన్నికలనే ప్రధాన మార్గంగా సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు చేసుకున్నాయి. ఎన్నికలలో సీట్ల కోసం దేశంలో ఉన్న దాదాపు అన్ని బూర్జువా, భూస్వామ్య పార్టీలతోనూ అవి జత కట్టాయి. ఒక ఎన్నికలో మిత్ర పార్టీగా ఉన్న పాలకవర్గ పార్టీని తరుపరి ఎన్నికలో ప్రధాన శత్రువుగా చూడడానికి కూడా అవి సిద్ధపడ్డాయి. ఒక ఎన్నికలో ప్రధాన శత్రువుగా ఉన్న పార్టీని మరుసటి ఎన్నికలో మిత్రుడిగా ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి.

  విప్లవం కోసం పాలకవర్గాలలో వైరుధ్యాలను ఉపయోగించుకునే ఎత్తుగడ సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల దృష్టిలో పాలక పార్టీల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకోవడంగా దిగజారిపోయింది. పాలక పార్టీల మధ్య వైరుధ్యాలు ఎన్నికలకు సంబంధించినంతవరకేననీ, ఎన్నికలు ముగిసాక తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం మిగిలిన ఐదు సంవత్సరాలు పరస్పరం సహకరించుకుంటాయన్న వాస్తవాన్ని మరుగుపరిచి ఐదేళ్ల కొకసారి వ్యక్తమయ్యే ఎన్నికల వైరుధ్యాలను పాలక వర్గాల అంతర్గత వైరుద్యాలుగా చిత్రీకరించి ఓ గొప్ప ఎత్తుగడను ఎన్నికల ఎత్తుగడల స్ధాయికి అవి దిగజార్చాయి. ఐదేళ్లపాటు కొనసాగే బూర్జువా, భూస్వామ్య వర్గాల ఐక్యతను ప్రస్తావించకుండా ఎన్నికల వైరుధ్యాలను విప్లవానికి ఉపయోగపెట్టుకోగల వైరుధ్యాలుగా ప్రమోట్ చేసి అవి సిద్ధాంతాన్ని రాద్ధాంతంగా కుదించివేశాయి.

  కళ్ళెదుట కనిపిస్తున్న శత్రువు చేతిలో మోసపోవడం కష్టం. కాని పక్కన ఎర్ర జెండా నీడన, సిద్ధాంతాల ముసుగులో ఉన్న మిత్రుడి చేతిలో మోసపోవడం చాలా తేలిక. భారత దేశంలో పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలు ఎర్ర జెండా ముసుగు వేసుకుని సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల్లో జొరబడడమే కాక ఆదిపత్యం వహించాయి కూడా. ఆ వర్గాల ఆధిపత్యాల చేతుల్లో ఉన్న సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు ఇక ఎంత మాత్రం అట్టడుగు వర్గాలైన కార్మికులు, రైతులు, కూలీలు తదితర శ్రామిక జనానికి ప్రాతినిధ్యం వహించజాలవని వారి ఆచరణ రుజువు చేస్తోంది.

  బెంగాల్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం కాంట్రాక్టర్ల వలన కాంట్రాక్టర్ల చేత పరిపాలిస్తున్నదని తొంభైల్లోనే సి.పి.ఎం ప్రభుత్వంలో ని మంత్రి ఒకరు రాజీనామా చేసాడు. (పేరు గుర్తు లేదు) బెంగాల్ లో ‘కమ్యూనిస్టు మాఫియా’ నడుస్తోందని సి.పి.ఎం నాయకులే ఆరోపించిన చరిత్ర ఉంది. పారిశ్రామికీరణ పేరుతో సింగూరు లో మూడు పంటలు తీసే భూముల్ని ఒక పంట, బీడు భూములుగా చూపిస్తూ టాటాకి అప్పజెప్పడానికి బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నించింది. రైతులు తిరగబడితే మావోయిస్టులు ఉన్నారని సాకు చూపి వారిపై కర్కోటక నిర్బంధం అమలు జరిపింది వామ పక్షాలే. నందీగ్రాం లో పార్టీ కార్యకర్తల చేత రైతుకూలిల పైన కాల్పులు జరిపించింద వామ పక్ష ప్రభుత్వమే. మలేషియా కంపెనీ వాడి కొసం నందిగ్రాంలో రక్తాన్ని పారించింది వామపక్ష ప్రభుత్వమే. కౌలు రైతులకిచ్చిన వాగ్దానాలను ఉల్లంఘింది వారి హక్కులను హరించింది వామ పక్ష ప్రభుత్వమే. నూతన ఆర్ధిక విధానాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని భారత ప్రభుత్వం కంటె ముందే జ్యోతిబసు ప్రకటించాడు. బెంగాల్ కి విదేశీ పెట్టుబడులు నిరభ్యంతరంగా రావచ్చనీ, తాము వ్యతిరేకించమనీ అమెరికా, యూరప్ లను పర్యటించి మరీ ఆయన బతిమాలిన సంగతి మీకు తెలుసునో లేదో. బెంగాల్ లో నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ ఆంధ్రలో వాటిని ఎలా వ్యతిరేకిస్తారు అనడిగిన చంద్రబాబు నాయుడికి వామ పక్షాలు చెప్పిన సమాధానం ఏమీ లేదు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సెజ్ లతో సహా అన్ని కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో అవే విధానాలను ఆ పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చాయి.

  ఈ విధానాలన్నీ ఆ పార్టీలు బూర్జువా, భూస్వామ్య వర్గాల చేత ఆక్రమించబడి ఉన్నదని రుజువు చేస్తున్నాయి. చెప్పడానికి సిద్ధాంతాలే తప్ప ఆచరణలో అవి ఎన్నడో ఒట్టిపోయాయి. బలవంతపు పద్ధతుల ద్వారా తప్ప దోపిడీ వర్గాల రాజ్యాంగ యంత్రాన్ని కూల్చలేమని మార్క్స్, లెనిన్ లాంటి మౌలిక సిద్ధాంత పరులు చెప్పిన ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఎన్నికల్నే ప్రధాన పోరాటంగా ఎన్నుకున్న సి.పి.ఐ, సి.పి.ఎం లు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ దేశంలో విప్లవాలను తెచ్చే పార్టీలు కావని అనేకసార్లు రుజువైంది.

  మీరన్నట్లు ‘చైతన్యంతో స్వలాభం కొసం కాకుండా ప్రజాసేవ చేస్తున్న వారు’ మాత్రమేనా ఈ దేశానికి కావలసింది? కమ్యూనిస్టు పార్టీల ఏకైక కర్తవ్యం విప్లవం కొసం కృషి చేసి రాజ్యాధికారాన్ని సాధించడమే. ఆ కృషిని ఎన్నికల్లో పోటి చేసి సాధించే ప్రభుత్వాధికార స్ధాయికి కుదించుకున్నాక ఇక సి.పి.ఐ, సి.పి.ఎం ల వల్ల దేశ ప్రజలకు ఒనగూరే విప్లవ ప్రయోజనాలు ఏమున్నాయి వాసవ్య గారూ?

  విప్లవాన్ని సాధించడానికి రక రకాల దారులు లేవు వాసవ్య గారూ, వాటిని వెతుక్కోవడానికి. మార్క్స్. లెనిన్ లు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పిన ‘బల ప్రయోగం’ తప్ప మరో దగ్గరి దారి విప్లవానికి లేదు. ‘అవసరమైతే సాయుధ పోరాటానికి దిగుతాము’ అని ప్రకటించుకునే సి.పి.ఎం పార్టీ ఎన్నడూ దానికి సంబంధించిన ఒక్క ముక్క ఆచరణనీ, చర్చనీ, అవగాహననీ ప్రకటించింది లేదు. ఆ ఒక్క ముక్క మాత్రం ఆ పార్టీ కార్యక్రమ గ్రంధాల పేజిల్లో నిక్షిప్తమై ఉన్నంత మాత్రాన అది రాజ్యాధికారం కోసం విప్లవ మార్గాన్ని పట్టిన పార్టీగా ఎన్నడూ రుజువు చేసుకోలేదు. పైగా అది నిర్మించవలసిన ప్రజా ఉద్యమాలను తానే కర్కశంగా అణచివేయడంలో రాటు దేలింది. ఇక సిద్ధాంతం ఎక్కడిదండీ ఎన్నడో చట్టుబండలైతేనూ?

  చిన్న పార్టీలా? రష్యాలో విప్లవం వచ్చేవరకూ ఆర్.ఎస్.డి.ఎల్.పి లో బోల్షివిక్కులు మైనారిటీలేనని మీరు ఎరుగుదురా? 1937 వరకూ మావో విప్లవ పంధా మైనారిటీలో ఉందనీ వాంగ్ మింగ్, లీ లీ సాన్ లాంటి అతివాద నాయకత్వం వల్ల తొంభై శాతం ఉద్యమం నష్టపోయిన చైనా కమ్యూనిస్టు పార్టీ మావో చైర్మన్ అయ్యాక రెండేళ్లలో మొత్తం ఉద్యమాన్ని రెండేళ్లలో కూడగట్టడమే కాక వరుస విజయాలతో విప్లవ రాజ్య స్ధాపనకు అప్రతిహతంగా సాగిపోయిన చరిత్రను మీరు ఎరుగరా? భారత దేశ కమ్యూనిస్టు పార్టీ పుట్టిన దగ్గర్నుండి ఇలా రివిజినిస్టు మోసాలుకు గురై చివరికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా మోసానికి గురైందని మీకు తెలియదా? ఆ మోసాల ఫలితంగానే ఈ నాడు కమ్యూనిస్టు పార్టీలు చీలికలు పేలికలై ఉన్నాయని గుర్తెరగాలి. ప్రారంభం నుండీ జరుగుతున్న మోసాలతో ఇంకా సరైన ఎత్తుగడలు రూపొందించుకోలేని బలహీనతల్లో చిన్నా చితకా విప్లవ పార్టీలుగా మిగిలాయి.

  చిన్నదా పెద్దదా కాదు సమస్య. సైద్ధాంతిక నిబద్ధత, విప్లవ సాధనా నిబద్ధత, దానికి తగిన ఎత్తుగడలు ఇవే కమ్యూనిస్టు పార్టీలకు కావలసింది. అవి సమకూరాక, సమర్ధవంతమైన నాయకత్వం, పంధా సమకూరాక పురోగమించడం పెద్ద సమస్య కాదు. కొన్ని పార్టీలు ప్రజలతో కూడ నడవలేని నడవలేని బలహీనతలతో కునారిల్లుతుంటే మరికొన్ని ప్రజలను విడిచి సాము చేస్తున్న పరిస్ధితిలో మిగిలి ఉన్నందునే ఇంకా విప్లవ కృషి వెనకడుగులో ఉంది. ఈ కృషిలో సి.పి.ఐ, సి.పి.ఎం లు లేవు వాసవ్య గారు. వారి ప్రయోజనాలు కార్మిక వర్గ ప్రయోజనాలకు ఎన్నడో సలాం కొట్టాయి.

 6. గతంలో వాసవ్య గారికీ, నాకూ మధ్య చర్చ జరిగింది. ఆయన ఎన్నడూ నా మీద వ్యక్తిగత దూషణలకి దిగలేదు కాబట్టి ఆ చర్చ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కేవలం మావోయిస్ట్ పార్టీని విమర్శిస్తూ వ్రాసారు కానీ నేను మావోయిస్ట్ పార్టీని సమర్థిస్తున్నందుకు నా మీద వ్యక్తిగత దూషణలు చెయ్యలేదు. అందుకే నేను దాని గురించి పట్టించుకోకుండా నా దారిన నేను వెళ్ళిపోయాను. కానీ కెలుకుడు గ్యాంగ్‌వాళ్ళు దారిన పోయే సత్యనారాయణ శర్మ గారినీ, స్కైబాబా గారినీ ఎందుకు కెలికినట్టు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s