‘తె.జా.అ.వా’ బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ ఎలా ఉంది?


“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ అమరుస్తున్నాను. ఈ టెంప్లేట్ తో ఎవైనా సమస్యలు తలెత్తితే మిత్రులు చెప్పగలరు. ఈ టెంప్లేట్ కూడా వర్డ్ ప్రెస్ వారు ఉచితంగా అందించినదే.

14 thoughts on “‘తె.జా.అ.వా’ బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ ఎలా ఉంది?

 1. ఈ టెంప్లేట్ మరీ సాదాసీదాగా ఉందనిపిస్తోంది. పైగా టాగ్ లైన్ సరిగా కనపడటం లేదు. అక్షరాల సైజు మరీ కొంచెం పెంచితే సౌకర్యంగా ఉంటుంది! ‘ఫాలోయర్స్ విడ్జెట్’ దీనిలో కూడా లేదుగా?

 2. వేణూ గారూ, ఈ టెంప్లేట్ కి మేగజైన్ లుక్ ఉంది. నేను రాస్తున్నది వార్తలు కనుక అదే సరైందని నాకు అనిపించింది. ఇదే టెంప్లేట్ ని డెవలప్ చేసి ఇంకొందరు వాడుతున్నారు. వారేలా చేశారో అర్ధం కాలేదు. మునుముందు దీనికికింకా అందం సమకూరే అవకాశాలు ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను.

  గత టెంప్లేట్ తో పోల్చి చూసుకుంటే రెండింటిలో ఏది బెటర్ లా కనిపిస్తోంది? సౌకర్యం తో కూడా కలుపుకుని.

 3. విశేఖర్ గారు ‘తె.జా.అ.వా’ బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ బాగుంది…ఇంకా కొంత మర్పులు చేస్తె బాగుంటుంది

 4. నిజమే, మ్యాగజీన్ లుక్ ఉంది. టిపికల్ బ్లాగులాగా అయితే లేదు. ఈ టెంప్లేట్ కూడా అసౌకర్యంగానే ఉంది. 🙂

  1) కొత్తగా రాసిన టపా ఏమిటో ప్రముఖంగా తెలియటం లేదు.
  2) బ్లాగ్ గణాంకాలు, బ్లాగ్ సందర్శకులు- రెంటితో తికమక! (ఈ రెండు విడ్జెట్స్ కీ తేడా ఏమిటో అర్థం కావటం లేదు).
  3) తాజా వ్యాఖ్యలు కనపడేలా విడ్జెట్ ఉంటే బాగుంటుంది ( ఇది పాత టెంప్లేట్ లో ఉండేది).
  4) చిన్న అక్షరాల సైజు, ఫాలోయర్స్ విడ్జెట్ లేకపోవటం గురించి చెప్పాను కదా?

 5. వేణుగారూ, మొదటి పాయింటు కరెక్టే, రెండోదీ కరెక్టే. సందర్శకులన్నది వ్యక్తుల సంఖ్య కాగా గణాంకాలు హిట్ ల సంఖ్య. హిట్స్ విడ్గెట్ కంటే సందర్శకుల విడ్గెత్ తాజాది. అందువలన ఎక్కువ తేడా కనిపిస్తోంది. సందర్శకుల విడ్గేట్ తీసేస్తాను. అది వేస్ట్.

  తాజా వ్యాఖ్య అవసరం లేదేమోనని తీసేసాను, దాని అవసరం అర్ధం కాక. సైజు గత టెంప్లేట్ కంటె ఎక్కువే కదా? ఐనా చూస్తాను. ఫాలోయర్స్ విడ్గెట్ అంటే ఈ మెయిల్ ఫాలోయర్స్ విడ్గేట్ మాత్రమే వర్డ్ ప్రెస్ ఇస్తోంది. అది కూడా ఫాలో కావడానికే తప్ప ఎవరు ఫాలో అవుతున్నదీ చూపడం లేదు. మీరు చెప్పింది ఉందేమో చూస్తాను. ఎందుకంటే ఈ మధ్య కొత్త విడ్గెట్ లు ప్రవేశపెట్టారనుకుంటా.

  కొత్త టపా ప్రముఖంగా కనిపించడం లేదు. స్టికీ పోస్ట్ అని ఏదో ఇచ్చాడు కాని అది ఎలాగో అర్ధం కాక వదిలేశా.అదొకసారి ట్రై చేస్తాను.

 6. ప్రజాపంధా లాగా ఎలా చెయ్యాలో తెలియదు డేవిడ్ గారూ. కనుక్కుని చెబుతాను. నేను స్క్రిబ్ డి కి మొదట అప్ లోడ్ చేసి ఆ తర్వాత బ్లాగ్ లొ పెడుతున్నా.

 7. వేణు గారూ అక్షరాలు చిన్నవని అంటున్నారు. కాని నాకిక్కడ పెద్దగానే ఉన్నాయి. అదొకసారి కన్ఫర్మ్ చెయ్యండి.

 8. వేణు గారూ,

  మీ బ్లాగ్ తో పోలిస్తే ఇక్కడి అక్షరాలు చిన్నవే. కాని సుజాత్ గారి బ్లాగ్ తో పోలిస్తే పెద్దవే. కదా?

  హోం పేజిలో పోస్టుల్లో చిన్న అక్షరాలున్నా, మొత్తం పోస్టు చూసినపుడు అక్షరాలు పెద్దవవుతున్నాయి. కదా?

  సందర్శకులు తీసేశాను. ఫాలోయర్స్ విడ్గెట్స్ లేదు. దానికోసం ‘నెట్ వర్క్ డ్ బ్లాగ్స్ విడ్గేట్’ పెట్టినా అది ఆకర్షించలేదు. తీసేశాను.

  టైటిల్ ఇప్పుడెలా ఉంది?

 9. విశేఖర్ గారూ,

  టైటిల్ బొమ్మ మార్చాక ఇప్పుడు ట్యాగ్ లైన్ అక్షరాలు బాగా కనపడుతున్నాయి. టైటిల్ తో పాటున్న హెడర్ సైజు (హైట్ , విడ్త్ ) ఇంకా పెంచే వీలుందేమో చూడండి. అలాగే హోంపేజీ లో అక్షరాలు కూడా కొంచెం పెద్దగా కనపడేలా చేయగలిగితే బాగుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s