అలియాస్ పేర్లు, నిక్ నేమ్స్ కూడా సొంత పేర్లే


ఇంటర్నెట్ కార్యకలాపాల్లో చాలామంది తమ సొంత పేర్లు (తల్లి దండ్రులు పెట్టిన పేర్లు) వాడరు. ఏదైనా తమకు ఇష్టమయిన పేరు పెట్టుకుంటారు. ఆ పేరు ద్వారా చలామణి అవుతారు. ఇంటర్నెట్ కి సంబంధించినంతవరకూ అలియాస్ పేర్లే సొంత పేర్లుగా చలామణీ అవుతాయి. అవి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కానప్పటికీ ఇంటర్నెట్ కి సంబంధించినంతవరకూ అలియాస్ పేర్లే వారికి సొంత పేర్లు.

ఒకే బ్లాగ్ లో రెండు పేర్లతో వ్యవహరించేవారు అవి రెండు తన పేర్లే అని చెప్పగలిగితే ఆ రెండూ వారికి సొంత పేర్లుగా అంగీకరించవచ్చు. రెండు మూడు బ్లాగ్ లు కలిగి ఉన్నవారు ఒక్కో బ్లాగ్ కి ఒక్కో పేరు ఉపయోగించుకోవచ్చు. వారిలో కొంతమంది ఆ బ్లాగ్ లన్ని తమవేనని చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. కాని అలా పెట్టుకున్న పేర్లను వారు ఏ పరిస్ధితుల్లోనూ దుర్వినియోగం చెయ్యరు. ఆ విధంగా వారు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు. అటువంటి పరిస్ధితుల్లో కూడా సదరు అలియాస్ పేర్లన్నీ సొంత పేర్లుగా అంగీకరించవచ్చు.

అయితే ఒక బ్లాగ్ లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచాక, మరొక బ్లాగ్ లో అందుకు భిన్నమైన భావాలు వ్యక్తం చేస్తే అది నిజాయితీ కిందికి రాదు. వారేదో చెప్పకూడని ప్రయోజనాల కోసం ఆ విధంగా చేస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాంటి కేసుల్లో రెండు మూడు పేర్లన్నీ ఆ వ్యక్తి సొంత పేర్లుగా అంగీకరంచలేము. ఒకరు ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ ఎవరినీ దూషించకుండా ఉన్నంతవరకూ ఇబ్బంది ఉండదు. కాని ఒక చర్చలో పాల్గొనేటపుడు మొదట ఒక పేరుతో వ్యాఖ్య రాసి, ఆ తర్వాత మరి కొన్ని పేర్లతో ఆ వ్యాఖ్యకి సమర్ధనగా వేరు వేరు కంప్యూటర్ల నుండి రాసినా అది సమర్ధనీయం కాదన్నది స్పష్టమే. కృత్రిమంగా తన వాదనకు మద్దతు సమకూర్చుకోవడం కిందికి అది వస్తుంది. కనుక అటువంటి పేర్లన్నీ సొంత పేర్లు కాజాలవు.

వివిధ భాషల్లో బ్లాగింగ్ చేసేవారు ఒక్కో భాషకి ఒక్కో పేరు పెట్టుకునే అవకాశం ఉంది. వీరు తమ అభిప్రాయాలను అన్ని భాషల బ్లాగుల్లోనే ఒకే విధంగా వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ ఆ పేర్లన్నీ తనవేనని చెప్పరు. ఎవరైనా మిత్రులు అనుకున్నవారికి చెప్పవచ్చు. వారి నిజాయితీ, వారి రాతల్లో స్పష్టం అవుతోంది కనుక ఆ రెండు పేర్లనూ ఇంటర్నెట్ లో ఆ వ్యక్తికి సొంత పేర్లుగా అంగీకరించవచ్చు. మరికొంతమంది తమ పేరులో రెండు మూడు పదాలు ఉన్నట్లయితే అందులో ఒక్కో పదాన్ని ఒక్కో సారి వినియోగిస్తుంటారు. లేదా వివిధ కాంబినేషన్లు ఉపయోగిస్తారు. కొంచెం పరిశీలిస్తే అవన్నీ ఒకరివేనని అర్ధం అవుతుంది. ఇలా రెండు మూడు పదాలున్న పేర్లు గలవారు తమ పదాలను దాచిపెట్టాలని అనుకోరు. అటువంటివారు వారు వివిధ సందర్భాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలను బట్టి స్క్రూటిని ఎదుర్కొవలసి రావచ్చు. స్క్రూటినీ లో అతని వైఖరి అతని నిజాయితీని వెల్లడిస్తుంది.

నేను కొన్ని పోస్టుల్లో కొంతమందిని దూషిస్తున్నాను. అందుకు కారణాలు కూడా చెబుతున్నాను. దూషణలో భాగంగా ‘సొంత పేర్లు’ చెప్పుకోలేని దౌర్భాగ్యులు అని రాస్తున్నాను. ఇక్కడ సొంత పేర్లు అంటె తల్లిదండ్రులు పెట్టిన పేర్లు అని నా అర్ధం కాదు. పైన వివరించిన అర్ధంలో మాత్రమే నేను ‘సొంత పేర్లు వాడలేని దౌర్భాగ్యులు’ అని అంటున్నానని పాఠకులు గమనించాలి.

చర్చకు అనుమతి ఉన్న చోట, వ్యాఖ్యలు తొలగించినపుడు ఎందుకు తొలగిస్తున్నదీ చెబుతున్న చోట దూషణలకి దిగడం, బూతులు రాయడం, ఇంకా చెప్పలేని రీతిలో ఛండాలంగా రాయడం దేన్ని సూచిస్తాయి? ఆ వ్యక్తులు మానసిక దౌర్బల్యాన్ని మాత్రమే సూచిస్తాయి. ఇలా దూషించేవారిలో కొంతమంది ఆవేశంలో రాసి ఆ తర్వాత ఆ ధోరణి కొనసాగించకపోవచ్చు. ఆ పద్ధతి కూడా ఎవరికీ ఉపయోగం కాదు కనక అది కూడా ఖండనార్హమే. అయితే మరోసారి దూషణ ఉండదు కనక వారు తాత్కాలిక మానసిక దౌర్బల్యం నుండి బైటికి వచ్చారని భావించవచ్చు.

అలా కాక దూషించడమే పనిగా పెట్టుకోవడం, ఒక భావాజాలానికి చెందిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారిని టార్గెట్ చెయ్యడం, అదే పనిగా బూతులు తిట్టడం, నెలల తరబడి ఇదే పనిగా పెట్టుకోవడం, తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం… ఇవన్నీ ఖచ్చితంగా మానసిక దౌర్బల్యానికి సంబంధించినవే. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్ కిందికి వస్తాయని ఒక సైక్రియార్టిస్టు చెప్పగా తెలిసింది. వీరిని మానసిక రోగులు అని భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. వూరుకునే కొద్దీ రెచ్చిపోవడం వీరి మరొక లక్షణంగా కనిపిస్తోంది. అందువల్ల అనివార్యంగా బహిరంగంగా ఎదుర్కోవలసిన పరిస్ధితి తలెత్తుతోంది. అలా ఎదుర్కొన్నప్పుడల్లా ఆ ధోరణిని సవరించుకోవచ్చని పరోక్షంగా సూచిస్తునే ఉన్నాను, ఫలితం ఉండకపోదా అని.

కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. ఇలా ముదిరిన వాళ్ళు ఇంకా ఉన్నా, వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళలా కనిపిస్తోంది. చచ్చు వాదనలన్నీ చేసి తమ మానసిక రోగాన్ని రోగం కాదని చెప్పడం కోసం కొన్ని తెలివైన వ్యాఖ్యానాలతో ప్రయత్నిస్తుంటారు. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే వీళ్ళు కూడా కుమార్.ఎన్ బాటలోకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు తమరోగాన్ని అణిచిపెట్టుకుని అవకాశం వచ్చినపుడు, రోగ ప్రకోపం జరిగినపుడు రోగ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. వీరు కూడా జాగ్రత్త పడి రోగం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ విషయం చిత్త శుద్ధితోనే చెబుతున్నా. గ్రహిస్తే బాగుపడతారు. లేదంటే…. మరింత మంది రోగుల్ని తయారు చేసినా చేస్తారు.

(అలియాస్, సొంత పేర్ల విషయంలో ఇక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలపైన ఆరోగ్యకరమైన చర్చ కోసం బ్లాగర్లను ఆహ్వానిస్తున్నాను -విశేఖర్)

7 thoughts on “అలియాస్ పేర్లు, నిక్ నేమ్స్ కూడా సొంత పేర్లే

  1. విశేఖర్ గారు, Rao పేరుతో కామెంట్లు వ్రాస్తున్న వ్యక్తి యొక్క ఐపి అడ్రెస్ ఇస్తారా. గత మూడేళ్ళలో ఆ పేరు ఎక్కడా చదవలేదు. అందుకే అది కౌంటర్ఫీట్ అని నా అనుమానం. ఓసారి ఈ లింక్ చదవండి: http://parnashaala.blogspot.com/2009/06/blog-post_1488.html పేర్లు మార్చి వ్రాయడం ఎప్పటి నుంచో ఉన్నదే.

  2. ప్రవీణ్, అవసరమైతే ఇస్తాను. నా బ్లాగ్ లో వ్యాఖ్యాత ఐ.పి బహిరంగం చేయడం సరికాదు కదా. మీ అనుమానం నాకూ వస్తే నేనే బహిరంగం చేస్తాను.

  3. “పేర్లు మార్చి వ్రాయడం ఎప్పటి నుంచో ఉన్నదే”

    ప్రవీణ్, పై వ్యాఖ్య పేర్లు మార్చి రాయడం సమర్ధిస్తున్నట్లుగా ఉంది. దాన్ని సరిచెయ్యి.

  4. ప్రవీణ్ మీరిచ్చిన లింక్ లో విషయం ఏమిటో నాకు మొదట అర్ధం కాలేదు. ఐ.పిలు చూసాక అర్ధం అయింది. మరీ వెంట వెంటనేనా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s