తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!


ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది.

కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా అభ్యంతరం తెలపడంతో నిర్ణయం చర్చలు కొనసాగాయి. హమీద్ కర్జాయ్ కి ఏమి చెప్పి శాంత పరిచారో తెలియదు గానీ ఆయన ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఓ వైపు తన ప్రభుత్వానికి కతార్ లో రాయబార కార్యాలయం ఉండగానే మరో వైపు తన ప్రభుత్వంపై పోరాడుతున్న తాలిబాన్ కి కార్యాలయం తెరుచుకోవడానికి అనుమతివ్వడం సబబు కాదని కర్జాయ్ అభ్యంతరం తెలిపాడు. ఒక దేశం నుంది ఒక రాయబార కార్యాలయం మాత్రమే ఉండవలసి ఉండగా తాలిబాన్ కార్యాలయం మరో రాయబార కార్యాలయంగా మారుతుందని హమిద్ కర్జాయ్ అమెరికా, కతార్ లకు అభ్యంతరం తెలిపాడు.

కార్యాలయం తెరవడంతో పాటు గ్వాంటనామో బే జైలులో ఉన్న తాలిబాన్ ఖైదీలు నలుగురిని కతార్ కి తరలించి వారిని గృహ నిర్భంధంలో ఉంచాలని కూడా గతంలో ఒప్పందంలో ఒక అంశంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి కూడా కర్జాయ్ అభ్యంతరం తెలిపాడు. ఇలా తాలిబాన్ ఖైదీలను కతార్ తరలించే ప్రతిపాదన ఇప్పుడు ఏమయ్యిందీ తెలియరాలేదు.

తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ ఒప్పందం సంగతి మంగళవారం విలేఖరులకు తెలిపాడు. తమ కార్యాలయం ఎప్పుడు ప్రారంభం అయ్యేదీ ఆయన చెప్పలేదు. ఈ కార్యాలయం అంతర్జాతీయ సమాజంతో చర్చలకు వినియోగిస్తామని ముజాహిద్ తెలిపాడు. కతార్ ప్రభుత్వంతోనూ, ఇతర సంబంధిత పార్టీలతోనూ చర్చలు జరిపాక కార్యాలయం తెరవడానికి ఒప్పందం కుదిరిందని ముజాహిద్ తెలిపాడు. అమెరికా, హమీద్ కర్జాయ్ లు ‘సంబంధిత పార్టీలు’ అయిందీ లేనిదీ వివరించలేదు.

ఆఫ్ఘనిస్ధాన్ లొ దురాక్రమణ యుద్ధం చేస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడం ముఖ్యమైన అంశంగా ఉంటూ వచ్చింది. ఆఫ్ఘన్ యుద్ధంలో ఎదురు దెబ్బలు తింటున్న అమెరికా, నాటో లకు (మంచి) తాలిబాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం కీలకాంశంగా మారింది. గతంలో అనేక సార్లు చర్చల పేరుతో అమెరికా మోసపోయింది. బూటకపు తాలిబాన్ నాయకులతో చర్చలు జరిపి ముఖ్యమైన ఆఫ్ఘన్ నాయకులను కర్జాయ్ కోల్పోయాడు. ఒక దశలో తాలిబాన్ తో చర్చలు జరిపే బదులు పాకిస్ధాన్ తోనే చర్చలు జరపడం మేలని ప్రకటించి పాకిస్ధాన్ ఆగ్రహానికి గురయ్యాడు.

పాకిస్ధాన్ మాత్రం ఆఫ్ఘనిస్ధాన్ భవిష్యత్తుకి సంబంధించి ఎటువంటి పధకం రూపొందించినప్పటికీ అందులో తనకు ప్రధాన పాత్ర ఉండాలని కోరుతోంది. పాకిస్ధాన్ పాత్రను సాధ్యమైనంత తక్కువ చేయడానికీ, వీలయితే అసలే లేకుండా చేయడానికీ అమెరికా అనేక ఎత్తులు వేస్తున్నది. ఇది గమనించిన పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధంలో అమెరికాకి సహకరించకుందా తలనొప్పులు తెచ్చిపెట్టడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య గత కొద్ది సంవత్సరాలుగా సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.

పాక్ జోక్యాన్ని నివారించడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ దేశం సహకారం లేకుండా తాలిబాన్ ను చర్చల బల్ల వద్దకు తేవడం సాధ్యం కాలేదు. పట్టుకున్నట్లు నాటకమాడుతూ తాలిబాన్ లోని హక్కాని గ్రూపు నాయకులు కొందరిని పాకిస్ధాన్, అమెరికాకి అప్పజెప్పాకే చర్చల వ్యవహారం ఊపందుకుంది. ఆఫ్ఘనిస్ధాన్ లో తమ పని ముగిసిందని అమెరికా చెప్పుకోవాలంటే అక్కడ స్ధిరత్వం నెలకొందని ప్రపంచానికీ, తన ప్రజలకూ అమెరికా చూపించవలసి ఉంటుంది. అది జరగకుండా ఆఫ్ఘనిస్ధాన్ లొ అమెరికా ఓడిపోయి ఇంటికి చేరుకుందన్న అపప్రధ దానికి మిగులుతుంది.

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ ను తనకు అనుకూలమైన రీతిలో, తన మర్యాదకూ గౌరవానికీ భంగం కలగకుండా ముగించడానికి అమెరికాకి ఈ చర్చల నాటకం అవసరం అయింది. దానిలో పాకిస్ధాన్ కూడా ఒక పాత్రధారి.  చర్చలలో పాక్ పాత్ర ఉంటున్న నేపధ్యంలో భవిష్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియా పాలకవర్గాల పాత్రకు మంగళం పాడవలసిన అవసరం రావచ్చు. అదే జరిగితే దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలలో ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధానికి సంబంధించి ఇండియాపై పాకిస్ధాన్ పైచేయి సాధించినట్లే.

12 thoughts on “తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

 1. ప్రపంచంలో ఇండియా, పాకిస్ధాన్ లే కాదు ఇంకా రెండొందల దేశాలున్నాయి. అక్కడకి మల్లేనే ఇండియా, పాకిస్ధాన్ లలో జనం నివసిస్తున్నారు. నువు ముందా విషయం తెలుసుకోవాలి సన్నాసీ.

  అవునోరే, పాకిస్ధాన్ అనగానె మీదంతా అదే ధోరణా? కనీసం మతం గురించి ఆలోచించినా ఆ మతానికి జనం ఉండాలి గదా? ఆ జనం అంతా మనుషులె కదా? మతం ఏదైనా మనుషులొక్కటే అని అన్ని మతాలు, నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా? అయినా ఈ పాకిస్ధాన్ భయం మిమ్మల్ని వదలదా? అమెరికాకి కూడా ఇవ్వని హోదాని పాకిస్ధాన్ కి ఇస్తున్నారే?

  చర్చిస్తున్న విషయం వదిలి నా మద్దతు పాకిస్ధాన్ కా ఇండియాకా అన్న అనుమానం ఎందుకు బడుద్ధాయ్?

  సన్నాసీ నీకు నీడే గతి. నీ బతుక్కి ఎప్పుడైనా సొంత పేరుతో, సొంత ఈమెయిల్ తో కామెంట్ చేశావా?

  నీ ఐ.పి కూడా ప్రకటిస్తాన్లే.

 2. మిస్టర్ విశేఖర్ పై వ్యాఖ్యలో మీరు అంత ఆవేశపడి సమాధానం ఇవ్వవలసిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు.

  “ప్రపంచంలో ఇండియా, పాకిస్ధాన్ లే కాదు ఇంకా రెండొందల దేశాలున్నాయి. అక్కడకి మల్లేనే ఇండియా, పాకిస్ధాన్ లలో జనం నివసిస్తున్నారు. నువు ముందా విషయం తెలుసుకోవాలి సన్నాసీ.”

  ఆయన మిమ్మల్ని ఏ విధంగానూ తిట్టలేదు. మీరు సన్నాసీ అని మర్యాద లేకుండా అనడం మీ కుసంస్కారాన్ని, అసహనాన్ని సూచిస్తోంది

  “అవునోరే, పాకిస్ధాన్ అనగానె మీదంతా అదే ధోరణా? కనీసం మతం గురించి ఆలోచించినా ఆ మతానికి జనం ఉండాలి గదా? ఆ జనం అంతా మనుషులె కదా? మతం ఏదైనా మనుషులొక్కటే అని అన్ని మతాలు, నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా? అయినా ఈ పాకిస్ధాన్ భయం మిమ్మల్ని వదలదా? అమెరికాకి కూడా ఇవ్వని హోదాని పాకిస్ధాన్ కి ఇస్తున్నారే?”

  “నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా?” ఓహో నీడను బట్టి మతం చెప్పెయగలరా మీరు?

  “చర్చిస్తున్న విషయం వదిలి నా మద్దతు పాకిస్ధాన్ కా ఇండియాకా అన్న అనుమానం ఎందుకు బడుద్ధాయ్?”

  చర్చ మీ బ్లాగులో కాబట్టి

  “సన్నాసీ నీకు నీడే గతి. నీ బతుక్కి ఎప్పుడైనా సొంత పేరుతో, సొంత ఈమెయిల్ తో కామెంట్ చేశావా?”

  నాకు తెలిసి చర్చలో ధైర్యంగా పాల్గోలేని వాళ్ళే అసహనానికి గురవుతారు. మీకు అభిప్రాయం ముఖ్యమా? లేక ఊరు, పేరు, జాతకం వగైరా కూడా కావాలా?

  “నీ ఐ.పి కూడా ప్రకటిస్తాన్లే.”

  ఇదేమి బెదిరింపు? ఐ.పి ప్రకటించి మీరేం పీకగలరో నాకు అర్థం కావటం లేదు.

 3. హై హై గారూ, ఒక పేరుతో తిట్టడం మరో పేరుతో చర్చ చేస్తున్నట్లు ఫోజు పెట్టడం వీరి లక్షణం. అందువల్ల ఈ పేరుతో తిట్టకపోయినా నా సమాధానం అలాగే ఉంటుంది.

  కుసంస్కారం గురించి మీ దగ్గర మరోసారి నేర్చుకుంటాన్లెండి.

  కాదా, నీడని బట్టి మనుషుల్ని గుర్తించవచ్చు. మీకు కూడా కుదురుతుంది. ఓ సారి ట్రై చెయ్యండి.

  చర్చ ఏ బ్లాగ్ లో ఐనా చర్చ విషయం వరకే పరిమితం కావాలి. వ్యక్తిగత దాడి చెయ్యకూడదు కదా హై హై గారూ. కుసంస్కారం లెసన్ లో ఈ భాగం మర్చిపోకండి.

  అభిప్రాయం ఏమి చెప్పారుట? సన్నాసులు వేసే ప్రశ్నల్లో అభిప్రాయాలు మీకు బాగానే కనిపిస్తున్నాయి. నా అభిప్రాయం నేరుగా చెప్పినా అవి మాత్రం కనిపించవు. కదా.

  అది బెదిరింపు కాదు. అతని కోరికని రియలైజ్ చేయబోతున్నానన్న సమాచారం.

  “పీకగలరో?” ఇదే మీ సంస్కారం?

  నాకు చిన్నప్పుడు గొడ్లను కాచిన అనుభవం ఉంది. అందువల్ల ‘హై హై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తోంది.

  మీ ఇతర కామెంట్లు దూషణలతో ఉన్నందున అవి ప్రచురించడం లేదు. సమాధానం ఇస్తూ ప్రచురిద్దామని ఆపా. ఇంతలోనే నా కామెంటు ఏమైంది అనడగడం ఏమిటి?

  ఇదే పద్ధతిలో ఉంటే మీ కామెంట్లు భవిష్యత్తులో కూడా ప్రచురించను. కామెంట్ పాలసీ చూడండి ఓ సారి.

 4. విశేఖర్ గారు, కేవలం మతాన్ని విమర్శించాల్సిన అవసరం మనకి లేదని చాలా సార్లు చెప్పాము. ఏ దేశంలోనైనా మతం ఊహాజనితమే కానీ వాస్తవం కాదు. అటువంటప్పుడు కేవలం మతాన్ని విమర్శించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇస్లామిక్ ఉగ్రవాదులని విమర్శించినా మనం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నామని అంటారు వాళ్ళు.

 5. ఏ దేశంలోనైనా మతం ఊహాజనితమే కానీ వాస్తవం కాదు. అందుకే చాలా దేశాలలో మతం మార్చుకోవడానికి అక్కడి చట్టాలు కూడా ఒప్పుకుంటాయి. జీవితంలో ఏదీ లేనివాళ్ళలాగ ఊహాజనితమైన మతాన్ని మాత్రమే పట్టుకుని ఇతరులపై దాడి చెయ్యడం ఎందుకు?

 6. “చర్చ ఏ బ్లాగ్ లో ఐనా చర్చ విషయం వరకే పరిమితం కావాలి. వ్యక్తిగత దాడి చెయ్యకూడదు కదా హై హై గారూ. కుసంస్కారం లెసన్ లో ఈ భాగం మర్చిపోకండి.”

  మరి మీరు మీ తాజా పోస్టులో చేసినదాన్ని ఏమంటారు విశేఖర్ గారూ ???????

 7. “నాకు చిన్నప్పుడు గొడ్లను కాచిన అనుభవం ఉంది. అందువల్ల ‘హై హై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తోంది.”

  తెలుస్తోంది. అన్నేల్ల సావాసం అనుకుంటా మీరూ వాటిలో ఒకటిగా మారినట్టున్నారు

 8. చెప్పా కదా హై హై గారూ, నాపై దాడికి వస్తే ఊరుకోను అని. అది దాడికి నా స్పందన. అది దాడా కదా అన్నది ఆయా సందర్భాలను బట్టి నిర్ణయం అవుతుంది. మీకు దాడిగా కనిపించనిది నాకు దాడిగానే కన్పించవచ్చు. వైస్ వెర్సా. నాకు దాడిగా కన్పిస్తె స్పందన ఆగదు. ఆ తర్వాత ఎప్పుడైనా అది దాడి కాదని నిజాయితితో కూడిన వ్యాఖ్యేననీ నాకు అనిపిస్తే నా దాడిని ఉపసంహరించుకోవడానికి వెనకాడను.

 9. హై, హై, ఇది కదా నీ బుద్ధి. నువ్వు కూడా వారిలో ఒకడివని ఈ వ్యాఖ్య చూపిస్తోంది.

  గొడ్లతో సావాసం చెయ్యకుండా వాటితో సేవలు చేయించుకోవడం కుదురుతుందా? గొడ్లతో సావాసం చెయ్యకుండా మానవ నాగరికత అసలు ఉండేదా? ఇప్పుడు నీలాంటి సన్నాసులు అనుభవిస్తున్న సకల సౌకర్యాలు వ్యవసాయం తర్వాతే. గొడ్లతో సావాసం లేకుండా మానవజాతికి వ్యవసాయమే లేదు. అంటే గొడ్లతో సావాసం లేకపోతే నువ్వూ లేవు, నీ బతుకూ లేదు.

  గొడ్లు అంటే బురద అనా నీ ఉద్దేశ్యం? ఆ బురదనుండె గదా మనం తినేవన్నీ వచ్చేది. గోమాత అని హిందువులు పూజించేది ఆ గొడ్డునే కదా, గోమాత మూత్రం కావాలి గాని నీలాంటి వారికి వాటి బురద చూస్తే మహా చిరాకేం? కుర్మావతారం, జాంబవంతుడు, హనుమంతుడు, వీళ్లంతా ఆ గొడ్లు, పశువులపైన మానవజాతి ఆధారపడి ఉందనడానిని చిహ్నాలు. తెలుసుకో.

  నీ పూర్వీకులు కూడా గొడ్లతో సావాసం లేకుండా బతుకు సాగించలేదు. నీ పూర్వీలులు లేకుండా నువ్వు లేవు. అంటే నీ అస్తిత్వాన్ని నువ్వు అవమానించుకుంటున్నావు. కనీసం ఆ విషయం నీకు అర్ధం కావాలని కోరుకుంటున్నా.

  గొడ్లతో సావాసాన్ని అవమానించావు చూడు. ఇంక ఏ మాత్రం నీకు గౌరవం ఇవ్వనవసరం లేదని అక్కడే డిసైడైపోయా.

 10. గొడ్లని ఇంత గౌరవించే మీకు మీరూ వాటిలో ఒకటి అయినట్టున్నారు అంటే మిమ్మల్ని కించపరిచినట్టు అనిపించిందా? ఇదేం ద్వంద వైఖరి విశే ఖరా

 11. అబ్బ ఏం తెలివితేటల్రా నీవి? (చప్పట్లు) చచ్చు తెలివితేటలు ఆపు. గొడ్లను నువ్వు గౌరవించకుంటేనే మేలు లాగుంది. ఇక ఆపు నీ వ్యాఖ్యలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s