డిజిపి వ్యాఖ్య, పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట -కత్తిరింపులు


జనవరి ఒకటో తారీఖున ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. సల్వార్ కమీజ్, చుడీదార్ లు కూడా డిజిపి కి అసభ్య వస్త్ర ధారణగా కనపడడం విపరీతం కాకపోతే ఏమిటి? నిజానికి చీర కంటే, లంగా ఓణి కంటే సల్వార్ కమీజ్ శరీరాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అరి చేతులు, అరి కాళ్ళు, తల తప్ప శరీరాన్నంతా చుడీదార్లు కప్పి ఉంచుతాయి. ఐనా ఆ డ్రస్సులు డిజిపి కి రెచ్చగొట్టేలా ఎలా కనపడ్డాయి? ఈ వ్యాస రచయిత్రి ప్రశ్నించినట్లు పిల్లలు, ముసలి వారు సెక్సీ డ్రస్ లు వేయడంవల్లే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయా? రాష్ట్రానికి అత్యున్నత పోలీసు అధికారి నుండి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన విభాగపు అధికారి నోటినుండి ఈ వ్యాఖ్యలు రావడం అత్యంత దురదృష్టకరం.

ఈ వ్యాఖ్యలకు మద్దతు రావడం మరొక విపరీతం. ఆయన ఉద్దేశ్యం మంచిదే అని వీరి వాదన. స్త్రీలపై జరిగే అత్యాచారాల పట్ల ఆశాస్త్రీయ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటె, దాన్ని వదిలి ఆయన ఉద్దేశ్యం మంచిదే అనడం ఏమిటి? ఆయన మొత్తం స్త్రీల వస్త్ర ధారణ పట్ల వెనుక బాటు భావాలు వ్యక్తం చేస్తున్న సంగతి వీరికి పట్టదా? పైన చెప్పినట్లు పోలీసు అత్యున్నత అధికారికి సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అవగహన ఉంటుందని అంతా ఆశిస్తారు. ప్రత్యేకంగా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల లాంటి సున్నిత సమస్యల పట్ల మరింత స్పష్టమైన అవగాహన ఉండాలి. అటువంటి సమగ్రత ఉంటేనే నేరాలను సమర్ధవంతంగా అరికట్టడానికి తగిన విధంగా మార్గదర్శకత్వం వహిస్తారు. ముస్లిం దేశాల్లో స్త్రీలపై అమలయ్యే మత ఛాందస విధానాల పట్ల వీరు కార్చేది మొసలి కన్నీరే కాబోలు!

DGP comment

3 thoughts on “డిజిపి వ్యాఖ్య, పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట -కత్తిరింపులు

  1. పత్రికలలో వచ్చినంత మాత్రాన కథనాలను నమ్మగలిగే పరిస్థతి లేదు. డి.జి.పి.గారు నిజంగా మహిళలు వేశ్యల మాదిరిగా దుస్తులు ధరించటం మానాలి అన్నారా? దీనికి వీడియో క్లిప్పింగ్ యేదయినా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉందా? పత్రికలవారే వార్తలను వండటంలో భాగంగా అతికించిన విశేషణమా యీ ‘వేశ్యల మాదిరి’ అన్న మాట? దీనికి జవాబు కావాలి.

  2. ‘వేశ్యల మాదిరి’ అన్నది డిజిపి వ్యాఖ్య అని రచయిత్రి అనలేదు శ్యామలరావుగారు. ఆవిడ, కెనడా పోలీసు అధికారి అలా అన్నాడని చెప్పారు. ఆయన అన్నది ‘లైక్ స్లట్స్’ అని. దానికి రచయిత్రి వేశ్యలమాదిరి అని అనువాదం చేశారు.

    డి.జి.పి వ్యాఖ్యలను అన్ని పత్రికలూ ప్రచురించాయి. ఆయన కూడా ఖండన ఇవ్వలేదు. కనుక ఆయన అన్నట్లే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s