బూతు బొమ్మలు, మత సంస్ధలు


(గమనిక: గురు గోల్వాల్కర్ వ్యక్తం చేసిన భావాలపైన నేను రాసిన పోస్టుకి ఇది మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్య. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడినందున పోస్టుగా మలిచాను. చర్చలో పాల్గొనవలసిందిగా ఇతర మిత్రులను ఆహ్వానిస్తున్నాను. ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మలని కేవలం బూతు బొమ్మలుగానూ, ఆడవాళ్ళని చెత్తగా చూపించడంగానూ ప్రవీణ్ పేర్కొన్నాడు. కళాకారులు చాలామంది అలా భావించరు. అలాగే మత విశ్వాసాలు గాయపడ్డాయని భావించబడినప్పుడు వివిధ మతస్ధులలో వచ్చిన ప్రతిస్పందనలలో తేడాలను ప్రవీణ్ ప్రస్తావించాడు. ఈ తేడాల ద్వారా మత విశ్వాసాలలోని గాఢతలలో తేడాలున్నాయని ఆయన చెబుతున్నాడు. రక్త సంబంధం కంటే విశ్వాసం గొప్పదా అని ప్రవీణ్ ప్రశ్నించాడు. ఇవన్నీ చర్చాంశాలని నేను భావించి చర్చకు పెడుతున్నాను.

అయితే ప్రవీణ్ వ్యాఖ్య అనగానే కొంతమంది బ్లాగర్లు, ఇతరులు ఎగతాళి చేస్తూ, కువిమర్శలతో సిద్ధం అయ్యే అవాంఛనీయ ధోరణి ఒకటి బ్లాగుల్లో ఏర్పడి ఉంది. అటువంటి వారికి ఇక్కడ స్ధానం లేదు. స్ధానం లేదని చెప్పినా వచ్చి తమ ధోరణి కొనసాగిస్తే తగిన సమాధానం ఇవ్వబడుతుంది. ప్రవీణ్ వ్యక్తం చేస్తున్న భావాలకు (ఆమాటకొస్తే ఏ బ్లాగర్ అయినా) తగిన విలువ ఇవ్వవలసి ఉంటుందనీ, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఒక బ్లాగర్ గౌరవాన్ని ఎవరూ కించపరచరాదనీ, అలా కించపరిచేవారిని బ్లాగర్లు దూరంగా పెట్టాలని ఈ పోస్టు ద్వారా నేను చెప్పదలిచాను. -విశేఖర్)

ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మలని నేను కూడా విమర్శించాను. ఆడవాళ్ళని చెత్తగా చూపించి డబ్బులు సంపాదించడమే తప్పు. ఇక్కడ దేవతల బొమ్మలని చెత్తగా వేశాడా, సాధారణ స్త్రీల బొమ్మలని చెత్తగా వేశాడా అనేది తరువాతి విషయం.

కానీ హిందూత్వ బ్లాగర్లు ఏమి చేశారంటే ఇక్కడ ఆడవాళ్ళ గురించి ఆలోచించలేదు. కేవలం దేవతల పేరు చెప్పి ఎం.ఎఫ్.హుస్సేన్‌నీ, కత్తి మహేశ్‌నీ తిడుతూ పోస్టులు వ్రాసారు. వీధుల్లో రోజూ గోడల మీద బూతు సినిమాల పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోరు కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మల గురించే ఎందుకు పట్టించుకున్నారు?

నరసరావుపేటకి చెందిన గోపీచంద్ గారి నాయకత్వాన ఇరవై ఏళ్ళ క్రిందట వెలసిన అశ్లీలత ప్రతిఘటన వేదిక ఇప్పుడు మూతపడిపోయింది. సినిమాలలోని బూతులని విమర్శించేవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ వేసిన బూతు బొమ్మలని మాత్రం విమర్శించడానికి ఉత్సాహం వచ్చింది, అది మతం పేరుతో.

ఒక దేశంలోని కొన్ని రాష్ట్రాలలోనే పబ్లిష్ అయ్యే ఒక స్థానిక పత్రికలో ముహమ్మద్ ప్రవక్త బాంబు ఉన్న తలపాగ వేసుకుంటున్నట్టు ఫొటోలు ముద్రించబడ్డాయని ప్రపంచ వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మల విషయంలో ఇండియాలో అన్ని పట్టణాలలోనూ అల్లర్లు ఎందుకు జరగలేదు? బికినీపై లక్ష్మీ దేవి బొమ్మ వేసినప్పుడు ఇండియాలో ఒక్క పట్టణంలో కూడా అల్లర్లు ఎందుకు జరగలేదు? హిందూ మతం ఏమీ ఇస్లాంలాగ బలమైన విశ్వాసం కాదు అని నేను అన్నది అందుకే.

మతం మీద అంత విశ్వాసం లేనివాళ్ళకి దేశభక్తి పేరుతో పాకిస్తాన్‌ని తిట్టడానికి ఉత్సాహం ఎందుకు ఉంటోందని అనేది ఆలోచించాల్సిన విషయమే. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే. 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ ప్రవక్త బంధువులైన ఉమైయా వంశస్తులు సింధూ నది తీర ప్రాంతాలని ఆక్రమించుకోవడం వల్ల ఇస్లాం మతం పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళందరూ మతాంతీకరణ చెందినవాళ్ళైనప్పుడు వాళ్ళని రక్త సంబంధం రీత్యా హిందువులు అనే అనుకోవాల్సి వస్తుంది.

మతం మీద అంత బలమైన విశ్వాసం లేని హిందువులు తమతో రక్త సంబంధం ఉన్న పాకిస్తానీ ముస్లింలని వేరు జాతిగా చూడడం ఎందుకు? రక్త సంబంధం కంటే విశ్వాసం గొప్పదా?

ఒకవేళ అలా అనుకున్నా హిందువులలో విశ్వాసం బలంగా లేకపోవడం సంగతి ఏమిటి? హిందువులలో విశ్వాసం బలంగా లేదని బికినీ మీద లక్ష్మీ దేవి ఫొటో లాంటి ఘటనలతోనే ఋజువైపోయింది కదా. ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు తమకి కావాలనుకుంటున్నది జాతా లేదా విశ్వాసమా? ఇదే ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు స్పష్టంగా చెప్పలేని విషయం.

24 thoughts on “బూతు బొమ్మలు, మత సంస్ధలు

 1. you are just expressing hate against RSS continuously-People read books about RSS never know RSS-once you go to shakha run in open ground near to you ,,,,you can understand the reality…till then you will be in darkness brother……………..
  never RSS disowned the relationship with pakistanis,everytime RSS said about akhanda bharat…to realize it we need to eliminate the elements spreading hate with help of china and American agenda….first we eliminate these hands within the country then only we understand better and realize the declared scientific fact of one DNA and one nation ,one race…..its possible …its all about fighting against the Chinese power mongering tendencies,Talibans and American crooked behaviour……

 2. కేవలం మతం మీద పడి ఏడవాల్సిన అవసరం మార్క్సిస్టులని లేదు. జెర్మనీ విషయంలోనే విమర్శ అనేది మత విమర్శతో ప్రారంభం కావాలని కార్ల్ మార్క్స్ అన్నాడు. అప్పట్లో ప్రష్యన్-జెర్మన్ చక్రవర్తులు తమకి ఇంద్రియాతీత శక్తులు ఉండేవని చెప్పుకునేవాళ్ళు. మన ఇండియాలో పాలక వర్గంవాళ్ళు తమకి ఇంద్రియాతీత శక్తులు ఉన్నాయని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. కనుక ఇండియాలో మతం అనేది పెద్ద ఇష్యూ కాదు.

 3. మనవాళ్ళు మార్క్సిస్టులు మతం మీద పడి ఏడుస్తున్నారని అంటోంటే హిందూ మతం అంత బలమైన విశ్వాసం కాదు అని చెప్పడానికి పై వ్యాసం వ్రాసాను. నేను 100% నాస్తికుణ్ణే కానీ కత్తి మహేశ్ గారిలాగ నాస్తికత్వమే ప్రపంచానికి డెస్టినేషన్ అనుకునే రకం కాదు.

 4. మూర్తి గారూ, మీ బ్లాగ్ చూశాను. మీరన్నట్లు “నిరంతరం విద్వేషం వ్యక్తం చేయడం” అంటే ఏమిటో మీ బ్లాగ్ చూస్తే అర్ధం అవుతుంది.

  మీరు ఇతర సంస్ధలను, వ్యక్తులను దూషించినట్లు నేను ఇతర సంస్ధలను, వ్యక్తులను ఎన్నడూ దూషించలేదు. నేను చేస్తున్నది విమర్శ తప్ప విద్వేష ప్రకటన కాదని మీరు గ్రహించాలి. నేను అర్.ఎస్.ఎస్ గురువు వ్యక్తం చేసిన భావాలను ప్రస్తావించి వాటి ఆధారంగా మాత్రమే విమర్శ చేశాను. వారు చెప్పని అంశాలని అంటగట్టి నేను విమర్శ చేయలేదు.

  మీరు చెబుతున్నది చిత్రంగా ఉంది. పుస్తకాలు చదివి ఆర్.ఎస్.ఎస్ గురించి ఎవరూ తెలుసుకోలేరని మీరంటున్నారు. అంటే ఆర్.ఎస్.ఎస్ తన పుస్తకాల ద్వారా చెబుతున్నదానికీ, ఆచరిస్తున్నదానికీ చాలా తేడా ఉంటుందనీ అందువల్ల ఆర్.ఎస్.ఎస్ గురించి తెలుసుకోవాలంటే శాఖ వద్దకు వెళ్ళాలనీ మీరంటున్నారు. అదే నిజమైతే ఆ సంస్ధకు ఉన్న పెద్ద లోపం ఇదే అవుతుంది. చూడబోతే ఆర్.ఎస్.ఎస్ భావాజలం గురించి, ఆ సంస్ధ సభ్యులు, లేదా అభిమానుల మధ్య కూడా పూర్తి ఏకీభావం లేనట్లు కనిపిస్తున్నది. మీరు చెబుతున్నదానికీ, గురు గోల్వాల్కర్ చెప్పినదానికీ తేడా ఎందుకు ఉంది? చెప్పగలరా?

  పాకిస్ధాన్ పైన నిరంతరం విద్వేషం వెళ్ళగక్కుతూ పాకిస్ధానీలను పరాయివారిగా ఆర్.ఎస్.ఎస్ భావించలేదు అని ఎలా అంటున్నారు? ఏ ఇద్దరు మనుషులకీ డి.ఎన్.ఎ ఒకేలా ఉండదు. అలాంటిది దేశం మొత్తం ఒకే డి.ఎన్.ఎ ఎలా ఉంటుందో మీరు చెప్పవలసి ఉంటుంది. చైనా ధోరణలకూ, తాలిబాన్ అమెరికాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఒక దేశం, ఒక జాతి, ఒక డి.ఎన్.ఎ సాధ్యమవడం ఏమిటో బొత్తిగా అర్ధం కాలేదు. ఊహలకి కూడా కొద్ది మేరకైనా వాస్తవాల ప్రాతిపదిక ఉండవద్దండీ?

 5. Our hatred is against those regressive elements who cover themselves with the garb of religion. మతం అనేది పెద్ద సమస్య కాదు కానీ మతం పేరుతో కర్మవాదం (fatalism) & దైవ నిర్ణయం (god’s will) లాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలని గ్లోరిఫై చేసేవాళ్ళని తీవ్రంగా విమర్శించాల్సిందే. RSS భావజాలంలో అభివృద్ధి నిరోధక అంశాలు చాలా ఉన్నాయి కానీ వాటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడదలచుకోలేదు. వాటి గురించి మాట్లాడాలంటే పేజిలకి పేజిలు వ్రాయాలి. జాతి అనే అంశంపై RSS యొక్క ప్రమాణం ఏమిటి అని RSSని ప్రశ్నించాను. ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళ ప్రమాణం అస్పష్టంగా ఉంది కాబట్టి.

 6. ఈ పోస్టుకు కామెంట్ రాద్దామని మొదలుపెట్టి, సైజు బాగా పెరిగి పోవడంతో నా బ్లాగులో పోస్టుగా ప్రచురించాను. వీలైతే ఓ సారి చూడగలరని మనవి.
  http://andamainacheekati.blogspot.com/2011/12/mf.html

 7. MF హుస్సేన్ వృత్తిపరమైన చిత్రకారుడని తెలుసు కానీ ఆ బొమ్మలు 1970లో వేసినవని మీరు చెప్పిన తరువాతే తెలిసింది. థాంక్స్.

 8. చీకటి గారు, మంచి పోస్ట్ వ్రాసారు. ఆ బొమ్మలని ఇరవై ఆరేళ్ళ పాటు హిందువులు చూశారనే విషయం మహేశ్ గారి బ్లాగ్‌లో చర్చ జరుగుతోన్న సమయంలో ఎవరూ వ్రాయలేదు. వ్రాసి ఉంటే హిందువుల హిపోక్రిసీ అప్పుడే బయటపడిపోయేది.

 9. 1970 లో గీసిన చిత్రాలలో నగ్నత్వాన్ని కనిపెట్టడానికి 26 సంవత్సరాలు పట్టిందన్నమాట! రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టబడిన వివాదాన్ని వీళ్ళంతా పులుముకుని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడంలో నిజాయితీ ఉన్నట్లు కనిపించడం లేదు.

  హుస్సేన్, తస్లీమా ల పట్ల వీరు చూపిస్తున్న తేడాలు వీరి అవకాశవాదాన్ని పట్టిస్తున్నాయి. తమ మతమే గొప్పదన్న దురహంకారానికి ఈ వివాదం మరొక రూపంగా కూడా కనిపిస్తోంది.

  ముఖ్య విషయం వెల్లడించారు చీకటిగారూ.

  (మీ బ్లాగ్ లో వ్యాఖ్య ప్రచురించడం నా వల్ల కాలేదు. అందువల్ల ఇక్కడే ప్రచురిస్తున్నాను -విశేఖర్)

 10. అవి 1970లో వేసిన బొమ్మలు అని గుర్తు చెయ్యకపోవడంలో మహేశ్ తప్పు కూడా ఉంది. అయినా మహేశ్‌కి క్షమాపణలు చెపుతూ ప్లస్‌లో పోస్ట్ వ్రాసాను. ఈ-మెయిల్ కూడా పంపాను. మహేశ్ చదువుతాడో, లేదో సందేహమే.
  https://plus.google.com/111113261980146074416/posts/fsHWCJ1sU7F

 11. టపా మొత్తం ప్రవీణ్ వ్యాఖ్యేనా ??? అయితే విశేఖర్ గారికి చప్పట్లు.

  శ్రీకాంత్ గారి బ్లాగ్ లో కూడా ప్రవీణ్ చేసిన ఒకటి రెండు వ్యాఖ్యలు , ప్రవీణ్ అలాంటి చక్కని టపాలు వ్రాయొచ్చు కదా అనిపించేలా ఉన్నాయి. ( మార్స్కిజం, మతం కి సంబంధించి బ్లాగు రచయిత కి, ప్రవీణ్ కి చక్కని చర్చ నడుస్తోంది. ఎవరు కరెక్టు అన్నది ఒక్క రోజులో తెలిసిపోయేది కాదు ) . ఇటువంటి సబ్జెక్టు లకి వ్యాఖ్యలని మించి ప్రాధాన్యత ఇవ్వడు ఎందుకో.

  ప్రవీణ్, మీ బజ్ టపా కూడా బావుంది. బజ్ లో కాక మీ అభిప్రాయాలు మీ బ్లాగ్ లో కూడా వ్రాస్తూ ఉంటె, వాటికి ఒక అర్ధం ఏర్పడగలదు.

 12. కదండీ మౌళి గారూ. నేనూ దాదాపు అదే చెప్పదలిచాను. ప్రవీణ్ ఈ విషయం గమనించాడో లేదో మరి.

  తరచుగా ప్రవీణ్ తన వ్యాఖ్యలని అడవిగాచిన వెన్నెల చేస్తుంటాడు. ‘ఈన గాచి నక్కల పాల్జేసినట్లు’ గా రాస్తుంటాడు. అది ప్రవీణ్ గ్రహించాలి. పదే పదే ఎగతాళి చేస్తున్నా, ఎక్కడ తన వ్యాఖ్యలను ఉంచవలసిందీ తాను గ్రహించలేకపోతున్నాడనిపిస్తుంది.

  తన వ్యాఖ్యలకీ జరుగుతున్న చర్చకీ దగ్గరి సంబంధం ఉండేలా ప్రవీణ్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి సంబంధం ఉన్నా అది పాఠకులకి వెంటనే అర్ధం అయ్యేదిగా ఉండకపోవడం వల్ల వెక్కిరింపు ఎదుర్కొంటున్నాడని నాకనిపిస్తుంది.

 13. శ్రీకాంత్ మార్క్సిజాన్ని మతంతో పోలుస్తూ చేసిన విమర్శలు చదివితే అతని బ్లాగ్‌లోనే ఒక పోస్ట్‌కీ, ఇంకో పోస్ట్‌కీ పొంతన ఉండదని అనిపిస్తుంది కదా. తన సొంత బ్లాగ్‌లోనే ఒకదానికొకటి పొంతన లేని విషయాలు వ్రాసేవాళ్ళకి నా వ్యాఖ్యలు ఎలా అర్థమవుతాయి?

 14. మతం ఎన్నడూ నిర్ణయాత్మక శక్తి కాదు అని నాకు ముందే తెలుసు కానీ మతవిశ్వాసుల వాదనలు అంత విచిత్రంగా ఉంటాయని మాత్రం ఊహించలేదు. అందుకే అక్కడ వ్యాఖ్యలు వ్రాసాను. సాధారణంగా మతవిశ్వాసుల మాటలకీ, ప్రవర్తనకీ మధ్య తేడా కనిపిస్తుంది. కానీ అతని మాటల్లో ఒక మాటకీ, ఇంకో మాటకీ మధ్య తేడా కనిపిస్తోంది. మతం నిర్ణయాత్మక శక్తి కానప్పుడు మతవిశ్వాసుల మాటలకీ, ప్రవర్తనకీ మధ్య తేడా ఉండడం సహజమే. కానీ ఒక మాటకీ, ఇంకో మాటకీ మధ్య తేడా కూడా చూపిస్తారని ఎవరు ఊహించగలరు?

 15. నా బ్లాగు లో మీకు విద్వేషాలు కనపడడం సహజమే ..నిజాలు అడిగినప్పుడు విద్వేషం లా కనపడితే ఆపం ఇంకా ఇయన నిజాలను చూడటం లేదని ఊరుకొంటాము…పుస్తకాలు రాసే వారి ని బట్టి భావాలు మారుతుంటాయి ,,,ఈ రోజులలో ఈనాడు లో సాక్షి లో విశేఖర్ బ్లాగు ల లో ఒకే నిజం ఎన్ని అబద్దాలుగా మారుతోందో చూసూనే ఉన్నాము …పుస్తకానికి నిజాలకు సంబందం కొంతమంది అవాస్తవ వాదుల వల్ల తప్పుడు రకాలు వచ్చాయంటున్నాను…మీరు గోల్వాల్కర్ రాసిన పాంచజన్య ను ఒక సారి పూర్తి గా చదవండి ….తరువాత షాఖ కు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి…ఎక్కడొ అసంపూర్తిగా వాక్యాల ను కత్తిరించి ద్వేషాన్ని నింఫడం అబద్దాలు రాస్తే పాపం ఇంకా కళ్ళు తెరిచి ప్రపంచం చూడని వారి సంఖ్యలో ఇంకా ఒకరున్నారని కళ్ళు తెరిపించే పని ని ఇంకా తీవ్రంగా చేస్తూ పోతాము అంతే

 16. “…ఎక్కడొ అసంపూర్తిగా వాక్యాల ను కత్తిరించి ద్వేషాన్ని నింఫడం అబద్దాలు రాస్తే…”

  మూర్తిగారూ, మీరు మీ బ్లాగ్ లో మీ ఇష్టం వచ్చిన విధంగా రాసే హక్కు మీకు ఉంటుంది. కాని ఇలా వ్యాఖ్యలు గానీ, వ్యాఖ్యలకు సమాధానాలు గాని మరొక బ్లాగ్ లో రాసేటప్పుడు ఒక పద్ధతి పాటించవలసి ఉంటుందని మీరు గమనించాలి.

  నేను గురు గోల్వాల్కర్ గారి పుస్తకం నుండి నేరుగా కోట్ చేసి రాసినా, అది మీకు అబద్ధం లాగా కనిపిస్తోందా? పోనీ నిజం ఏంటో మీరు రాయవలసింది. కనీసం అది కూడా మీకు తట్టలేదా? నేను అబద్ధం రాసానని తెలిసినపుడు నిజం ఏమిటో రాసి నేను రాసింది అబద్ధం అని రుజువు చెయ్యొచ్చని కూడా మీకు తట్టలేదా? ఆ పుస్తకం ఇపుడు చదివి అబద్ధం ఏదో, నిజం ఏదో తేల్చాలన్న సిన్సియారిటీ కూడా మీకా సిద్ధాంతం పట్ల లేదా? ద్వేషం నింపుతున్నాని మీరు దేన్ని ఉద్దేశించి చెబుతున్నారు? వివరించగలరా?

  గురు గోల్వాల్కర్ రాసిన అంశాలు ద్వేషం పుట్టించేలా ఉన్నాయని మీరు ఇంత త్వరగా అంగీకరిస్తారని నేను ఊహించలేకపోయాను. మీరు నిరంతరం దూషించే సెక్యులరిస్టులు చెబుతున్న విషయం అదే అనుకుంటాను. “కళ్లు తెరవడం” లాంటి తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? మీరు చేస్తున్న ఆరోపణలను సరిగ్గా వివరంగా నిరూపించగలరా మీరు? మీరు నమ్ముతున్న సిద్ధాంతానికి సంబంధించిన వాస్తవాలు ఇదిగో ఇలా ఉన్నాయని చెప్పగానే మీరు “ద్వేషం, అబద్ధాలు” అంటూ ఆధారం లేకుండా రాస్తున్నారు. ఇన్నాళ్ళూ ఇవేవీ తెలియకుండానే ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ వచ్చారా మీరు.

  అవాస్తవాదుల వల్ల పుస్తకాలకి నిజాలకి సంబంధం తప్పుడు రకాలుగా వచ్చాయా? ఏమిటండీ ఇది? మీరు వాస్తవ వాదులే కదా? ఆ పుస్తకం నుండి నేను ఉటంకించిన వాక్యాల వాస్తవ అర్ధం ఏమిటో మీరు చెప్పవచ్చుగదా, అర్ధం లేని ఆరోపణలు చేసే బదులు!

  గురు గొల్వాల్కర్ రాసిన పుస్తకంలో అసంపూర్తిగా వ్యాక్యం ఉంటే అది నేను కత్తిరించానా? అంటే ఆయనే పుస్తకంలో అసంపూర్తి వ్యాక్యాలు రాశారని చెబుతున్నారా? అది నా తప్పెలా అవుతుంది? పైగా “ఎక్కడో” అంటున్నారు? ఫలానా పుస్తకం నుండి ఉటంకించాను అని చెప్పినా “ఎక్కడో” అని ఎందుకంటున్నారు? మీకు తెలిసిన పాంచజన్య తప్ప గురు గోల్వాల్కర్ రాసిన మరే పుస్తకమూ పనికిరాదా? ఇతర పుస్తకాలనుండి ఆయన భావాలను గ్రహించగూడదా? ఆ విషయమైనా చెప్పండి.

  అసలు విషయం ఏమిటంటె, గురు గోల్వాల్కర్ ఇలా చెప్పారని మీకు తెలియదు. తీరా నేను ఉటంకించాక అవి మీకే భరించరానివి గా తోచాయి. ఒక విధంగా మిమ్మల్ని డిఫెన్సు లో పడేశాయి. అందుకే ఇవి రాసింది మొదలు అవన్నీ ఇప్పుడెందుకు అంటూ అడుగుతున్నారు? మీరేమో నేను చదివిన పుస్తకం కాకుండా పాంచజన్య చదవండి అనంటున్నారు. ఆ పుస్తకం నుండి కూడా ఇటువంటి వాక్యాలను ఉటంకించినా అప్పుడు కూడా మీరు ఇలాగే సంబంధం లేకుండా రాసి ఇంకో పుస్తకం చదవండి అంటారు. పైన రాజ శేఖర రాజు గారికి ఇచ్చిన సమాధానంలో పాంచజన్యం (బంచ్ ఆఫ్ ధాట్స్ కి ఇది తెలుగు అనువాదమని మీకు తెలుసనే భావిస్తున్నా) నుండి ఉటంకించిన వ్యాఖ్యలు ఇచ్చాను.

  మూర్తి గారూ, మీరు మరొకసారి మీ వ్యాఖ్యను చదివి మీరు రాయదలుచుకున్నది సరిగ్గా రాశారో లేదో చూడండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.

 17. మీరు ఉదహరించిన వాక్యా లు గురూజీ ఎన్నడు అనలేదు
  మీరు సాహిత్యనికేతన్ ప్రచురించిన పుస్తకాలను ఉదహరించండి
  కొంతమంది ద్వేషపరులు ఉటంకించిన పుస్త్కాలలోని వ్యాఖ్య లు కాదు
  మీరు గురూజి చెప్పిన పుర్తి బౌద్దిక్ ని చదివితే విషయం అర్థ మవుతుంది కాని సంధర్భం పుర్తి గా వివరించకుండా ఎక్కడో పేరగ్రాఫ్ లో మూల వ్యాఖ్య ల ను మీ భాషా ప్రావీణ్యాన్ని చొప్పిచ్చి వ్యాఖ్య లు చేస్తున్నారు..మీలాంటి వాల్లు చాలా మంది త్వరలో నే నిజా లు తెలుసుకొంటారు
  ప్రేమతో

 18. మీరు ఉదహరించిన వ్యాఖ్య ల సంధర్భం మీకు అర్థం కాలేదు అందుకే మిమ్మల్ని మరొక్క సారి పుస్తకం చదవమంటున్నా …మీరు అసలు పుస్తకాలు చదవకుండా ఏవొ గాలి పుస్తకాల లో వ్యాఖ్య లు చదివి అసలైన విష్యయ అనూభూతి ని కోల్పోతున్నారని నా బాధ అంతే…మీరు ఇలాగే సంధర్భం ఉధరించకుండా వ్యాఖ్య లు చేస్తే మీ ఆలోచన లు స్వతంత్రమైనవి కావని అర్థమవుతుంది

 19. మూర్తిగారూ, మీరు మళ్ళీ అదే పద్ధతిలో వ్యాఖ్యానించారు. నేను కోరుతున్నదేమంటే, నేను ఉద్దేశ్యపూర్వకంగా సందర్భం పూర్తిగా వివరించకపోతే, ఆ పని మీరు చెయ్యవచ్చుగదా? ఫలనా సందర్భంలో గురూజీ ఇలా అన్నారు. కాని అ సందర్భాన్ని విస్మరించి ఉటంకించడం వల్ల నెగిటివ్ అర్ధం వస్తోంది అని మీరు చెప్పండి. తద్వారా నేను పాఠకులను తప్పుదారి పట్టిస్తున్నట్లయితే మీరు సరైన దారి పట్టిస్తున్నట్లవుతుంది. నేను నా భాషా ప్రావీణ్యాన్ని చొప్పిస్తున్నానని పాఠకులకు అర్ధం అవుతుంది. ఆ పని మీరు చెయ్యగలిగితే నాకూ కొన్ని విషయాలు తెలుస్తాయి.

 20. మూర్తిగారూ, దయచేసి మీరు ఆ సందర్భాన్ని తెలియజెయ్యండి. తద్వారా సందర్భ రహితంగా ఉటంకించానని చెప్పండి. ఆ తర్వాత మాత్రమే సందర్భరహితంగా ఉటంకించానని అరోపించండి. అది చేయకుండా ఆర్బిట్రరీగా ఆరోపణలు చెయ్యడం భావ్యం కాదు.

  నా ఆలోచనలు స్వతంత్రమైనవే. మీకా అనుమానం అక్కర్లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s