‘భగవద్గీత’ పై నిషేధం, ఇస్కాన్ కార్యక్రమాల పరిమితికై రష్యన్ చర్చి ప్రయత్నాలు


రష్యాలోని సైబీరియా లో గల టామ్‌స్క్ నగరంలో ‘భగవద్గీత’ పై నిషేధం విధించడానికి కోర్టులో కేసు దాఖలు చేయడం వెనుక రష్యన్ ఆర్ధడాక్స్ చర్చి హస్తం ఉందని తెలుస్తోంది. ‘హరే కృష్ణ’ ఉద్యమం కార్యకలాపాలపైన పరిమితి విధించాలని రష్యన్ చర్చి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నదనీ, అందులో భాగంగానే ‘భగవద్గీత’ పుస్తకాన్ని నిషేధించాలంటూ కోర్టులో కేసు దాఖలయిందనీ ‘ది హిందూ’ పత్రిక వెల్లడించింది. ‘హరే కృష్ణ’ ఉద్యమం నియంతృత్వ స్వభావం గల సెక్ట్ గా చర్చి అభివర్ణించిందని ఆ పత్రిక తెలిపింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో టామ్‌స్క్ ప్రాంతంలో ఇస్కాన్ (International Society for Krishna Consciousness) కమ్యూనిటీ గ్రామ నిర్మాణనికి ఇస్కాన్ పూనుకోగా ఆ నిర్మాణాన్ని అధికారులు నిషేధించారు. ఏడు సంవత్సరాల క్రితం మధ్య మాస్కో లో ప్రార్ధనా మందిరం మరియు సాంస్కృతిక కేంద్ర నిర్మాణానికి ఇస్కాన్ పూనుకోగా దాని నిర్మాణాన్ని కూడా మాస్కో నగర ప్రభుత్వం అనుమతించలేదని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మాస్కో నగర శివార్లలో తమ కేంద్రాన్ని తెరుచుకోవడానికి ఇస్కాన్ కు అనుమతి లభించింది.

ఇస్కాన్ కు లక్ష మంది రష్యన్ అనుచరులు ఉన్నట్లుగా ఆ సంస్ధ చెప్పుకుంటుంది. వంద కంటే ఎక్కువగా వివిధ కమ్యూనిటీలలో తమ అనుచర గణం ఉన్నారని చెబుతుంది. కాని వాస్తవంలో ఆ సంఖ్య కేవలం కొన్ని వేలల్లో మాత్రమే ఉంటుందని ఆర్ధొడాక్స్ చర్చి చెబుతుంది.

రష్యా తరపున ఇండియాలో రాయబారిగా ఉన్న అలెక్జాండర్ కడకిన్ ఈ పరిణామం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కడకిన్ నలభై సంవత్సరాల క్రితం భారత్ లో రాయబారిగా పని చేయడం గమనార్హం. ఆ తర్వాత రెండవ సారి ఇండియాలో రాయబారిగా కడకిన్ పని చేస్తున్నాడు. భారత దేశానికీ, ఇతర ప్రపంచానికీ భగవద్గీతతో పాటు ఇతర మతాలకు చెందిన పవిత్ర గ్రంధాలన్నీ సమగ్రతకు గొప్ప వనరులుగా పని చేస్తున్నాయని కడకిన్ అభివర్ణించాడు. సెక్యులర్ భావాలకు వారసత్వం కలిగి ఉన్న టామ్‌స్క్ నగరంలో ఇటువంటి కేసు దాఖలు కావడం ఆశ్చర్యంగా ఉందని ఆయన తెలిపాడు.

15 thoughts on “‘భగవద్గీత’ పై నిషేధం, ఇస్కాన్ కార్యక్రమాల పరిమితికై రష్యన్ చర్చి ప్రయత్నాలు

 1. ఇండియాలో ఉంటే హిందువులే ఉండాలనే ఆర్.ఎస్.ఎస్. రకం వాదంలాగ ఉంది అక్కడి క్రైస్తవుల వాదం. భగవద్గీతని నిషేధిస్తే బైబిల్‌ని కూడా నిషేధించాలి కదా. బైబిల్‌లో యహోవా, ఏసు ప్రభువులిద్దరూ తాము ఇజ్రాయెలీయులకి మాత్రమే దేవుళ్ళమని చెప్పుకున్నారు. మరి రష్యన్‌లు కూడా యహోవా, ఏసు ప్రభువులని ఎందుకు నమ్ముతున్నట్టు?

 2. “‘హరే కృష్ణ’ ఉద్యమం నియంతృత్వ స్వభావం గల సెక్ట్ గా చర్చి అభివర్ణించిందని ఆ పత్రిక తెలిపింది.”

  విశేఖర్ గారూ,
  మీరు ఈ అంశంపై కాస్త సమగ్ర సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించండి. హరేకృష్ణ ఉద్యమం నియంతృత్వ స్వభావం కలది అంటే ఏ రూపంలో, ఏ సారంలో అనేది ఇక్కడ సరిగా అర్థం కావటం లేదు. క్రిస్టియానిటీకి మారు పేరుగా ఉన్న ప్రాంతాల్లో హరే కృష్ణ ఉద్యమం చొచ్చుకుపోతుండటమే దాని నియంతృత్వం అని అర్థం చేసుకోవాలా? లేక వేరే అర్థంలో ఇలా ఆరోపించారా అన్నది ఇక్కడ స్పష్టం కావడం లేదు.
  ప్రపంచమంతటా, మహారణ్యాల్లోని ఆదివాసుల్లోకి కూడా మత మార్పిడి రూపంలో చొచ్చుకుపోయిన చర్చ్, తమకు పట్టు ఉన్న ప్రాతంలో పర మత శాఖ ప్రవేశించడానికి అంగీకరించక పోవడమే ఈ ఆరోపణకు కారణమా? లేదా మరే కారణమైనా దీంట్లో ఉందా మీరే చెప్పాలి. స్పష్టం కానంత వరకు దీనిపై మనం సరైన అవగాహన చేసుకోలేమనుకుంటాను. వీలైతే మరిన్ని వివరాలు ఇవ్వండి.

 3. IDE CHURCH YOKKA NIJASWAROOPAM INDIA LO …. ఎడిట్

  వసంత్ గారూ, పోస్టుకి సంబంధించినది కానందున తొలగిస్తున్నాను. మరోలా భావించవద్దు.

 4. ‘నేను కూడా శర్మనే’ గారూ, నాకొక అనుమానం. “పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ లో కలిపి అఖండ భారత్ ఏర్పడాలనీ, ఇందులో ముస్లింలకు స్ధానం లేదనీ, వారు బైటి ప్రాంతాలనుండి ఇండియాకి (అఖండ భారత్ కి) వచ్చినవారు గనక వారు బైటికి వెళ్ళిపోవాలనీ” ఆర్.ఎస్.ఎస్ బోధిస్తుందని విన్నాను. ఇవన్నీ తప్పేనంటారా? ఆర్.ఎస్.ఎస్, ముస్లింలు భారత్ లో భాగం కాదని చెప్పడం లేదా? మరయితే ఆర్.ఎస్.ఎస్ ముస్లింలపై వ్యతిరేకత ఎందుకు కలిగి ఉంది? వివరించగలరా?

 5. విసెఖర్ గారు,

  “పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ లో కలిపి అఖండ భారత్ ఏర్పడాలనీ, ఇందులో ముస్లింలకు స్ధానం లేదనీ, వారు బైటి ప్రాంతాలనుండి ఇండియాకి (అఖండ భారత్ కి) వచ్చినవారు గనక వారు బైటికి వెళ్ళిపోవాలనీ” ఆర్.ఎస్.ఎస్ బోధిస్తుందని విన్నాను. విన్నాను అని అన్నారు . ఎక్కడ విన్నారో కొంచం చెప్తారా ??

 6. హిందువులూ, ముస్లింలూ వేర్వేరు జాతులకి చెందినవాళ్ళు అని వీర్ సావర్కర్ అన్నాడు. ముహమ్మద్ అలీ జిన్నాహ్ కూడా లాగే వాదించాడు. గ్రామీణ ప్రాంతాలలోని ముస్లింలలో ఎక్కువ మంది హిందూ మతం నుంచి మారినవాళ్ళేననే విషయం గ్రహించాలి. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో పూర్వికులు ఇస్లాం మతంలోకి మారిన హిందూ రాజపుత్ర కులస్తులు. అటువంటప్పుడు హిందువులూ, ముస్లింలూ వేర్వేరు జాతులవాళ్ళు ఎలా అవుతారు.

 7. కొన్ని సార్లు మతం జాతి ప్రాతిపదికన ఉంటుంది. కుర్దులు ఒకప్పుడు యజీదీ మతాన్ని నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళలో 90% మంది ఇస్లాం మతంలోకి మారిపోయారు. యూదులలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన సంతటికి చెందినవాళ్ళు. ఇతర మతాల నుంచి యూదు మతంలోకి మారినవాళ్ళ సంఖ్య తక్కువ. మన ఇండియా విషయానికొస్తే ఇక్కడి గ్రామీణ ప్రాంతాలలో ముస్లింలలో ఎక్కువ మంది హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారినవాళ్ళు కనుక ఇండియాలో మతం జాతి ప్రాతిపదికమైనదని అనుకోలేము.

 8. అవును. అది కొన్ని సార్లు మాత్రమే. ఆ కొన్నిసార్లు కూడా మతం పూర్తిగా జాతి ప్రాదికన ఉన్నదని చెప్పలేము.

 9. మతాన్ని జాతి ప్రాతిపదికన నిర్మించినా అది ఇతర జాతులకి విస్తరించదని అనుకోలేము. హిందూ మతాన్ని ఆర్యులు కనిపెట్టినా ఇస్కాన్‌వాళ్ళు దాన్ని విదేశాలకి తీసుకెళ్ళలేదా?

 10. ప్రవీన్ గారు మీరు విషయాన్ని దారి మల్లిస్తున్నారు. ప్రశ్న మరొకసారి “పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ లో కలిపి అఖండ భారత్ ఏర్పడాలనీ, ఇందులో ముస్లింలకు స్ధానం లేదనీ, వారు బైటి ప్రాంతాలనుండి ఇండియాకి (అఖండ భారత్ కి) వచ్చినవారు గనక వారు బైటికి వెళ్ళిపోవాలనీ” ఆర్.ఎస్.ఎస్ బోధిస్తుందని విన్నాను”

  RSS సిద్ధాంతాలకి బొధనలకి, వీర్ సావర్కర్ వాదించిన దానికి సంబందం ఎంటి? అసలు ఆయన ఇద్దరు వేరు వేరు జాతులు అని ఎక్కడ అన్నాడు ? పై వ్యాఖ్య ని ఎవరు ఎక్కడ ఎవరికి బొధించారు?

  విసెఖర్ గారు మీరు ఇంకా నా ప్రశ్న కి సమాధానం ఇవ్వలెదు!

 11. రమేష్ గారూ, మీకు సమాధానంగా ఓ పోస్టు రాస్తాను. మీకిచ్చే సమాధానం భవిష్యత్తులో నాకు అందుబాటులో ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s