‘పాపులిస్టు ముసుగు’ చించుకుని బైటికి వచ్చిన రాహుల్ గాంధీ


రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని బైట పెట్టుకున్నాడు. తాను ఇస్తున్న పాపులిస్టు నినాదాలు నిజానికి తన ముసుగు మాత్రమేననీ, వాస్తవంలో తన ఆలోచనలు ప్రజానుకూలం కాదని రుజువు చేసుకున్నాడు. దాదాపు నాలుగు కోట్ల కుటుంబాలను రోడ్లపాలు చేసే ‘రిటైల్ రంగంలో విదేశీ సూపర్ మార్కెట్ల’ నిర్ణయానికి బహిరంగంగా తన మద్దతు తెలిపాడు. రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే రైతులకే లాభం అని నచ్చ జెప్పడానికి కూడా సిద్ధపడ్దాడు. బహిరంగంగా ప్రజలకు అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులు జాబితాలో యువరాజా వారు కూడా చేరిపోయారు. ఇన్నాళ్లూ భారత దేశాన్ని తెలుసుకుంటానంటూ ఉత్తర ప్రదేశ్ గ్రామాలు చుట్టేస్తున్నట్లు నాటకాలాడిన రాహుల్ గాంధీ తన చర్యలన్నీ నాటకాలేనని తాజా ప్రకటనతో స్పష్టం చేశాడు.

భారత దేశంలో దాదాపు నాలుగు కోట్ల కుటుంబాలు రిటైల్ వ్యాపారం పైన ఆధారపడి ఉన్నాయి. వీరిలో తోపుడు బండ్ల వ్యాపారుల నుండి, తెల్లవారు ఝామునే గంపలకు కూరగాయలు ఎత్తుకుని పట్టణాల్లో వీధుల వెంట తిరిగి అమ్ముకునేవారి వద్దనుండి, చిన్న, మధ్య, ధనిక తరగతుల ప్రజానీకానికి ఎవరికి తగినట్లుగా వారికి సరిపడా రేట్లతో సరుకులు తెచ్చి అమ్మే చిన్న, మధ్య, పెద్ద రిటైల్ షాపుల వరకూ ఈ నాలుగు కోట్ల కుటుంబాలలో ఉన్నారు. చిన్న పట్టణాలనుండి నగరాల వరకూ చిన్న చిన్న షాపుల వాళ్ళు విస్తరించి ఉన్నారు. వీరంతా కుటుంబాలకు సరుకులు వారి వారి స్ధాయికి తగిన రేట్లలో సరఫరా చేస్తూ తద్వార వచ్చే ఆదాయలతో జీవనం గడిపుతుంటారు. వీరు కాక చిన్న, పెద్ద సూపర్ మార్కెట్లు కూడా పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు సరుకులు సరఫరా చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ షాపులన్నింటిలోనూ ప్రాసెసింగ్ శ్రమలు చేస్తూ ఆధారపడ్డవారు కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. వీరందర్నీ రోడ్డు పాలు చేస్తూ ఈ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు ప్రజలకు నష్టం అన్న సంగతి నాయకులు దాచి పెడుతున్నారు. మాయ మాటలు చెబుతున్నారు.

రైతులు నేరుగా అమ్ముకోవచ్చని చెప్పడమే తప్ప ఎలా అమ్మాలో వారు చెప్పడం లేదు. నేరుగా ఎవరికి అమ్మాలి? వాల్ మార్ట్ దేశంలోకి వస్తే వాడికి రైతులు నేరుగా ఎక్కడ అమ్ముతారు? వాల్ మార్ట్, కేరేఫర్, టెస్కో కంపెనీల వాళ్లు పల్లెలకు, పొలాలకు వచ్చి నేరుగా రైతుల వద్దనే వారి ఉత్పత్తులను కొనబోతున్నారా? ఈ విషయాలేవీ వారు చెప్పడం లేదు. ఊరికే రైతులకే లాభం నేరుగా అమ్ముకోవచ్చు అనే తప్ప అందులో వివరం లేదు, తవరం లేదు. అది నిజం కాదు కనకనే వివరం ఉండదు. ఐదు రోజుల మాస్ కాంటాక్టు కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లో పెట్టుకున్నాడు. ఇది నిజానికి ఎన్నికల కార్యక్రమం అయినా అది చెప్పకుండా రకరకాల పేర్లతో, జిమ్మిక్కులతో రాహుల్ గాంధీ భారత ప్రజల్లో స్ధానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు(ట). తన పర్యటనలో భాగంగా ఫర్రుక్కాబాద్ జిల్లాకి వచ్చిన రాహుల్ గాంధీ మొదటిసారిగా రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయానికి బహిరంగంగ మద్దతు ప్రకటించాడు.

అరవై శాతం కూరగాయలు కుళ్ళిపోతున్నాయని విదేశీ పెట్టుబడులొస్తే అవి కుళ్ళిపోకుండా కాపాడతాయని రాహుల్ గాంధీ చెబుతున్నాడు. అసలు మన రాజకీయనాయకులు విదేశీ పెట్టుబడులపైన సమస్త భారాలు వేయడం ద్వారా తమ చాతకాని తనాన్ని బైట పెట్టుకుంటున్నారని గ్రహించాలి. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతుల కూరగూయలు అరవై శాతం కుళ్ళిపోయేవారకే తాము దేశాన్ని అభివృద్ధి చేశామని వారు అంగీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ ముత్తాత, నాయనమ్మ, నాన్న లు అత్యధిక కాలం పాటు పాలించిన ఇండియాలో రైతుల కూరగాయలు ఇంకా అరవై శాతం ఎందుకు కుళ్ళిపోతున్నాయో సమాధానం చెప్పడం మాని కుళ్లిపోతున్నాయి కనక విదేశీ కంపెనీలను పిలుస్తాననడం వీరి దగుల్నాజీతనాన్నీ, దివాళాకోరుతనాన్నే నిరూపిస్తున్నది.

రైతులకు కావలసిన శీతల గిడ్డంగులు నిర్మించవద్దని ఎవరు వీరికి అడ్డుపడ్డారు? పాతిక లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో ఉన్నాయని రెండు రోజుల క్రితం ప్రతిపక్ష ఎం.పి ఎల్.కె.అద్వాని లోక్ సభలో సెలవిచ్చాడు. ఆ సంఖ్య వాస్తవానికి కోటి కోట్లు ఉంటుందని కూడా అంచనాలున్నాయి. ఇంత ధనాన్ని దేశాన్ని దాటడానికి అనుమతించి రైతుల కూరగాయలు కుళ్లిపోతున్నాయనీ, గిట్టుబాటుధరలు దక్కడం లేదనీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న మన రాజకీయ నాయకుల మోసాన్ని ప్రజలు గమనించాలి. ఈ మోసకారుల గుంపులో రాహుల్ గాంధీ ప్రవేశం కూడా ఆయన నోటిద్వారానే ధృవపడింది.

4 thoughts on “‘పాపులిస్టు ముసుగు’ చించుకుని బైటికి వచ్చిన రాహుల్ గాంధీ

  1. RAUL VINCI (RAHUL GANDI ) KE SWISS BANK LO TWO LAKS CROS VUNNAI…………….AYANA NALLA DANAM GURINCHI ENDUKU MATLADUTADU…… RETAIL MARKET LOKI FDI NI ANUMATI ISTE YEPUGA PERIGINA PANTA CHENU NU DUNNAPOTULAKU INCHINATTE……………

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s