దక్షిణ కర్ణాటకలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఎంగిలాకులపై దొర్లే ఆచారంలో బ్రాహ్మణులు కూడా పాటిస్తారని ‘ది హిందూ’ పత్రిక రాసిన దానిలో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ఆచారం “మోలె కుడియా” అన్న గిరిజన తెగకు చెందినవారే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని బిబిసి వార్తా సంస్ధ తెలిపింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కుక్కె సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రభుత్వం అనుమతించింది. దీన్ని రద్దు చేయాలని కొన్ని సంవత్సరాలుగా దళిత, బి.సి సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వినలేదు. మోలె కుడియా తెగ గిరిజనుల ఇష్టం మేరకే ఈ ఆచారాన్ని తొలగించడం లేదని గత సంవత్సరం బి.జె.పి ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్లుగా డెక్కన్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ప్రతి సంవత్సరం నవంబరు నెలాఖరున ఈ దురాచారం చోటు చేసుకుంటోంది.
గత సంవత్సరం ఈ ఆచారంలో అనేకమంది చదువుకున్న మధ్య తరగతి కుటుంబీకులు, రిటైర్డ్ జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా పాల్గొన్నారని డెక్కన్ హెరాల్డ్ తెలిపింది. వినడానికే అసహ్యంగానూ, వింతగానూ ఉన్న ఈ దురాచారాన్ని రద్దు చేయడానికి కర్ణాటక లోని బి.జె.పి ప్రభుత్వం ముందుకు రాకపోవడం మరో వింత. ఈ సంవత్సరం దేవాదాయ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన శివరాము ఆధ్వర్యంలోనే, బిసి సంఘాలు గత సంవత్సరం కూడా ఆచారం జరుగుతున్నపుడు గుడిముందు ఆందోళన చేశారు. ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బి.జె.పి ప్రభుత్వం పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.
దక్షిణ కర్నాటకలోనే మరో దురాచారం ఉందని డెక్కన్ హెరాల్డ్ పత్రికలో వ్యాఖ్య రాస్తూ డాక్టర్ జి.పి.నాయక్ తెలిపాడు. దాని ప్రకారం అగ్ర కులస్ధులు తమ గోళ్ళను కత్తిరించుకున్నాక వాటిని ఆ గోళ్ల ముక్కలని తింటారట. ఇది అగ్ర కులస్ధుల దురహంకారంతో పాటు, కింది కులస్ధుల వెనుకబాటుతనాన్ని కూడా ఎత్తి చూపుతోంది. కుల దురాచారాలని ఆమోదించే స్ధితిలోనే దళితులను ఉంచడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు ఇష్టపడడం ఎలా పరిగణించాలి?
నిజానికి ఇది బీ.జే.పీ యా మరో ప్రభుత్వమా అన్న దానితో సంబంధం లేకుండా జరుగుతున్నదే. ప్రస్తుతం అంటే బీ.జే.పీ ఉంది కానీ ఇదివరకూ కాంగ్రెసే ఉండేది కర్ణాటకలో. పార్టీ ఏదైనా ప్రజలలో బలంగా ఉన్న భావాలను వ్యతిరేకించడం పాలకులకు చేతకాని పనే అవుతోంది. అది దురాచారమైనా సరే, మూఢనమ్మకమైనా సారే.
మీకు ఖాప్ పంచాయితీల గురించి తెలుసనే అనుకుంటున్నాను. డిల్లీకి దగ్గరలో ఉన్న హర్యానా రాష్ట్రములో ఈ ఖాప్ పంచాయితీలు సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నాయని చెబితే బహుషా అది అతిషయోక్తి కాదనుకుంటా. వీరు ప్రేమికులను పరువు హత్యల పేరుతో చంపేయడం సంచలనం శృష్టించింది. అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు సరికదా, ఒక కాంగ్రెసు M.P అయితే ఈ ఖాప్ పంచాయితీలను సమర్ధించడం జరిగింది కూడా. అందరూ కలిసి దులపడముతో తరువాట చల్లగా జారుకున్నాడనుకోండి. ఇంతా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టాన్ని చేస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకుంది.
దీని మీద ఇదివరకూ నేను రాసిన వ్యాసాన్ని చూడండి..
కుల పంచాయితీల అకృత్యాలు – పరువు హత్యలు
అవును, ఇది బి.జె.పి, కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి ఇంకా ఇలాంటి పార్టీలు నడిపిన ప్రభుత్వాలన్నింటిలోనూ కొనసాగాయి, సాగుతున్నాయి. ఈ పార్టీలన్నీ ఇటువంటి దురాచారాలని కాపాడుకోవడంలో తమ ఓటు బ్యాంకులు వెతుక్కుంటున్నాయి.
BJP leader V S Acharya openly upheld that uncivilised tradition.
hmm…, why to take on every thing with governments..?
Can educate the people who participate in this uncivilized tradition right..?
ఇటువంటి సామాజిక దురాచారాలు సంఘంలో జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది గదండీ. ప్రభుత్వం వద్ద అనేక సాధనాలు అందుబాటులో ఉంటాయి. వివిధ క్లాసులకు సిలబస్ రూపొందించడంతో ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. మూఢనమ్మకాలు, కులం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయగల వనరులు ప్రభుత్వాలకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం తలచుకుంటే వాటిని ఉపయోగించుకుని ఇటువంటి దురాచారాలను పారద్రోలడం పెద్ద కష్టం కాదు.
కాని ప్రభుత్వాలకు ప్రజలు చైతన్యవంతం కావడం ఇష్టం ఉండదేమో. ప్రజలు చైతన్యవంతమైతే వారు ప్రభుత్వాల్లో ఉన్నవారికే ఎసరు తెస్తారు. అందుకే వాళ్ళు ఎల్లకాలం ప్రజల నమ్మకాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటారు.
మీరన్నట్లు చైతన్యవంతులు పూనుకుని దురాచారాలు రూపుమాపడానికి ప్రయత్నించవచ్చు. అలా పూనుకున్నందునే శివరాము దాడికి గురయ్యాడు.