అగ్రకుల పిల్లల పేరే పెట్టుకున్నాడని దళిత బాలుడిని చంపేశారు


భారత దేశంలో కుల దురహంకారం ఇంకా ఏ స్ధాయిలో కొనసాగుతున్నదో ఈ ఘటన పచ్చిగా చెబుతోంది. కుల పిచ్చికి ఉన్న రూపాలు ఇంకా పూర్తిగా ప్రచారం లోకి రాలేదేమోనని ఇటువంటి సంఘటనలు జరిగినపుడే తెలుస్తోంది. అగ్రకులస్ధుడికి ఉన్న ఇద్దరు పిల్లలకు ఏ పేర్లయితే ఉన్నాయో దళిత కులస్ధుడు కూడా పెట్టుకున్నాడు. పేర్లు మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా మార్చకపొవడంతో దళిత కులస్ధుడి పిల్లల్లో ఒకరిని చంపేశారు. (బి.బి.సి వార్త కోసం ఇక్కడ చూడండి).

ఉత్తర ప్రదేశ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. బస్తి జిల్లాలోని రాధౌపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన భారత దేశ ఆధునికత పైన అనుమానాలను బలపరుస్తోంది. దళిత తండ్రి రామ్ సూమర్ ఇద్దరు పిల్లలు పేర్లు నీరజ్ కుమార్, ధీరజ్ కుమార్ లు. ఇవే పేర్లు అదే గ్రామంలోని అగ్ర కులస్ధుడయిన జవహర్ ఛౌదరి కూడా తన ఇద్దరు పిల్లలకు పెట్టుకున్నాడు. తన పిల్లల పేర్లే దళిత పిల్లలకు ఉండడాన్ని జవహర్ ఛౌదరి భరించలేకపోయాడు.

పిల్లల పేర్లు మార్చాలని అనేక సార్లు దళిత కుటుంబాన్ని ఛౌదరి హెచ్చరించాడు. అయినా వారు వినలేదు. ఇష్టపడి పెట్టుకున పేర్లు మార్చాలనీ దానికి కులం సాధనంగా మారుతుందని బహుశా రామ్ సుమర్ ఊహించి ఉండడు. ఈ తగాదా ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

నవంబరు 22 తేదీన నీరజ్ రాత్రి భోజనం అయ్యాక మిత్రుడి ఇంట్లో టి.వి చూడడానికి వెళ్ళాడు. అలా వెళ్లిన నీరజ్ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత రోజు పొలాల్లో అతని శవమే దొరికింది. నీరజ్ ని ఊపిరాడకుండా చేసి చంపారని పోలీసులు చెబుతున్నారు. ఛౌదరి మాత్రం తానే పాపం ఎరుగనని చెబుతున్నాడు. తన కుటుంబాన్ని ఇరికించారని చెబుతున్నాడు. కారంచేడు, నీరుకొండ ఘటనలలో తానున్నానని ఏ అగ్ర కులస్ధుడు ముందుకొచ్చాడు గనక?

ఇప్పుడు ఛౌదురి పిల్లలు నీరజ్, ధీరజ్ లు ఊర్లో కనపడ్డం లేదు. వారు మిస్సింగ్ అని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఛౌదురి కుటుంబానికి చెందిన ఇద్దరు మిత్రులను అరెస్టు చేశారు. వారికి హత్యలో పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు.

విచిత్రం ఏమిటంటే ఈ వార్తను భారతీయ పత్రికలు, ఛానెళ్లు ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు డిసెంబరు 2 న బి.బి.సి సంస్ధ ఈ వార్తను ప్రకటించింది.

14 thoughts on “అగ్రకుల పిల్లల పేరే పెట్టుకున్నాడని దళిత బాలుడిని చంపేశారు

 1. భారతీయ పత్రికలు ఇలాంటి వార్తలు ఎందుకు వ్రాస్తాయి? గ్లోబలైజేషన్ లాంటి దోపిడీ విధానాలని సపోర్ట్ చేసే వార్తలు వ్రాస్తాయి లేదా ఫలానా సినిమా హీరోయిన్ ఫలానా హీరోతో ఎంత కాలం డేటింగ్ చేసింది లాంటి పనికిమాలిన కబుర్లు వ్రాస్తాయి.

 2. దళితులపైన అగ్రకులస్ధులు అత్యాచారం చేస్తే ఒకటీ, బి.సి కులస్ధులు చేస్తే మరొకటీ కాదు. కుల వైషమ్యం ఏ రెండు కులాల మధ్య ఉన్నా అది కుల వైషమ్యమే. ప్రతి కులానికి తమ కింద మరొక కులం ఉందనే సంతృప్తి ఇచ్చేలా కుల వ్యవస్ధ తీర్చి దిద్దబడింది. విషయం కులపరమైన అణిచివేతే తప్ప చౌదురి-దళితుడా, లేక బి.సి-దళితుడా అన్నది కాదు.

 3. వేరే పేర్లు లేనట్టు చిన్న చిన్న ఊర్లలో అవే పేర్లు మరీ ఇద్దరివి ఇద్దరికి (అవేం పేద్ద దేవుళ్ళ పేర్లూ కావు.) పెట్టుకోవడం ఏందో.. అట్లా పెట్టుకుంటే(ఇద్దరికి అంతకంటే ఎక్కువ పిల్లలకి) తర్వాత పెట్టుకున్న వారి పేర్లు మార్చాలని జీవో తీసుక రావాలి అధ్యచ్చా..

  ఇంకా ఎవడు చంపాడో తెల్వదు కాబట్టి జోకా …(చావుదరి కాకపోవచ్చు ) ….

 4. కులాలలో హెచ్చు తగ్గులు ఎక్కడ, ఏ పుస్తకం లో నిర్వచించారు ? .. నోరున్నవాడికి, పైసలున్న వాడికి, ధైర్యమున్న వారికి మిగతా అన్ని కులాలూ తక్కువవే.

 5. మానవ జాతి రంగు ఇది. చిన చేపను పెద చేప… నిన్నటి కోడలే అయిన అత్త, ఇవాల్టి తన కోడలిని వేధించుకుతింటున్న సంఘటనలెన్ని లేవు? మరో టపాలో B.C. మీద నిరూపణ కాని అగ్రవర్ణాల జులూం గురించి వ్రాశారు. ఇక్కడేమో అలాంటి తేలని విషయంలో అదే B.C. కులస్తుడు తన క్రిందివారిమీద చేసిన దురాగతం అని వ్రాశారు. పోలిసులా అనుమానితుణ్ణిగాక అతని బంధువులను అదుపులో తీసుకున్నారు. అంటే జవహర్ చౌధరిని ఇరకాటంలో పడేయడానికి అతని మీద ఏదన్నా కక్ష్య ఉన్నవారు చేసిన దురాగతం కూడా అయి ఉండవచ్చునేమో? దీనికీ “కులాల రంగు” పూసి జాతుల మధ్య దూరాని పెంచుతున్నారా లేక తగ్గిస్తున్నారా? Argument కొరకు కాదు, నిజా-నిజాల possibilities గురించి ఆలోచించమని మనవి…

 6. సత్యాన్వేషి గారూ ఆర్గ్యుమెంట్ పెడుతోంది మీరని నేను భావిస్తున్నాను. మీరేమో అదే మాట నన్నంటున్నారు. మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మళ్ళీ ఒకసారి చూడండి.

  అగ్రవర్ణాల జులుం అని నేనెక్కడ రాశాను? మీరు అర్ధం చేసుకున్నది నాకు అపాదిస్తున్నారు.

  మీ ప్రశ్నలకు నేరుగా అవును కాదు అని సమాధానం రాయడం కాకుండా వివరణతో రాశాను. గమనించగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s