వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం
తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది. వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు…