తానింకా సోషలిస్టునే అంటున్న గ్రీకు ప్రధాని -కార్టూన్

చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.…

లేని బాధ్యతను నెత్తినేసుకున్న అబ్దుల్ కలాం?

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తూ ఆయన, ప్రముఖంగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆదివారం ఏకంగా కుదంకుళం ప్లాంటు సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లపైన ఏర్పడిన భయాలను పారద్రోలే పనిలో అబ్దుల్ కలాం…

అబ్బే, ఇండియాకి ఆ హోదాం మేం ఇవ్వలేదు -పాక్ ప్రధాని గిలాని

భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు. “ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న…

సంక్షోభ పరిష్కారంలో జి20 వైఫల్యం, మరో మాంద్యానికి చేరువలో ప్రపంచం?

యూరో జోన్ రుణ సంక్షోభం రీత్యా సంక్షుభిత దేశాలకు సహాయం చేయడానికి జి20 దేశాలు ఏ చర్యా ప్రకటించలేదు. దానితో యూరప్ సంక్షోభ పరిష్కారానికి ఎమర్జింగ్ దేశాలు గానీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు గానీ సహాయం చేయడానికి సిద్ధంగా లేవన్న సంగతి ధృవపడింది. ఫలితంగా మరోసారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యం (రిసెషన్) లోకి జారుకుంటుందన్న అంచనాలు జోరందుకున్నాయి. గ్రీసులో రాజకీయ సంక్షోభం కొద్దిలో తప్పిపోయింది. వారం రోజుల క్రితం గ్రీసు కోసం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్…

డబ్బులు చెట్లకు కాయడం లేదు, పెట్రోల్ రేట్లు పెంచాల్సిందే -ప్రధాని

ప్రధాని మన్మోహన్ మరొకసారి తాను ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకిననీ నిరూపించుకున్నాడు. తనకు కావలసిందల్లా కార్పొరేట్ల ప్రయోజనాలు వారి బాగోగులేననీ వారి ప్రయోజనాల కోసం ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదనీ తన వ్యాఖ్యల ద్వరా నిరూపించుకున్నాడు. పెట్రోల్ ధరలు ప్రభుత్వం నియంత్రించడానికి వీలు లేదనీ పెట్రోల్ ఉత్పత్తుల ధరలను మార్కెట్ లో ఉండే కంపెనీలే నిర్ణయించాలి తప్ప ప్రభుత్వం కాదనీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫ్రాన్సులో కేన్స్ నగరంలో జరుగుతున్న జి20 సమావేశాలలో పాల్గొంటున్న ప్రధాని అక్కడే ఈ ప్రకటన…

పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…

ఇండియాకు ‘అత్యంత అనుకూల దేశం’ హోదా ఇవ్వడానికి పాకిస్ధాన్ వెనకడుగు?

ఈ వారం ప్రారంభంలో ఇండియాకు, పాకిస్ధాన్ ప్రకటించిన ‘అత్యంత అనుకూల దేశం’ (మోస్ట ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎన్) హోదా ను మళ్ళీ చిక్కులో పడింది. దేశీయంగా తలెత్తిన అభ్యంతరాలతో ఇండియాకు ఎమ్.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ శుక్రవారం తెలిపింది. ఎం.ఎఫ్.ఎన్ హోదా ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంభంధిత ప్రయోజనాలను ఇండియా పొందగలుగుతుంది. ఇండియా, పాకిస్ధాన్ కు ఎన్నడో…

‘గాలి’ కేసులో సి.బి.ఐ ముందు హాజరైన ‘జగన్’

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిపతి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సి.బి.ఐ కోర్టు ముందు హాజరయ్యాదు. హాద్రాబాద్ లో కోఠి సెంటర్ వద్ద ఉన్న సి.బి.ఐ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు హాజరయినట్లుగా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. గాలి జనార్ధనరెడ్డి పాల్పడిన అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించడం కోసం సి.బి.ఐ సమన్లు జారీ చేయడంతో జగన్ సి.బి.ఐ ముందు హాజరు కావలసి వచ్చింది. గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘ఓబులాపురం…

ఆర్ధిక సంక్షోభం దెబ్బకు కుప్పకూలనున్న గ్రీసు ప్రభుత్వం

గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా…

ఇండియాకు అత్య్దాధునిక ఎఫ్-35 జెట్ ఫైటర్ల అమ్మకానికి అమెరికా సిద్ధం

అత్యంత ఆధునికమైన జెట్ ఫైటర్ విమానాలను ఇండియాకు అమ్మడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో అమెరికా-ఇండియాల రక్షణ రంగ సహకారం గురించి వివరిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇండియా ఆసక్తి కనపరిచినట్లయితే లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే ‘ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్’ ను అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆరు నెలల క్రితమే అమెరికా అమ్మ జూపిన ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్…

యూరోజోన్ విచ్ఛిన్నం ప్రారంభం, గ్రీసును సాగనంపడానికి ప్రయత్నాలు

12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…