జమ్ము& కాశ్మీర్ లో సైనిక చట్టం ఉపసంహరణకు ప్రధాని, సి.ఎం సమావేశం
జమ్ము&కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల పాలిట మృత్యుపాశంగా మారిన “సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ – ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ)” ను కొన్ని జిల్లాలలో ఉపసంహరించుకునే విషయమై చర్చించడానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానితో సమావేశం అయ్యాడు. గత కొన్ని వారాలుగా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని భద్రతా పరిస్ధితులు మెరుగుపడిన జిల్లాలలో ఉపసంహరించాలని జమ్ము&కాశ్మీరు ముఖ్యమంత్రి వాదిస్తూ వచ్చాడు. సి.ఎం వాదనను సైనిక దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భద్రత రిత్యా చట్టం ఉపసంహరణ…