మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ‘కిషన్ జీ’ ఎన్‌కౌంటర్ లో మృతి

మావోయిస్టులతో చర్చలు అంటూనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి నాయకుడు కిషన్ జీ ని ఎన్‌కౌంటర్ లో చంపేసింది. బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ప్రభుత్వ బలగాల నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఎన్‌కౌంటర్ లో చనిపోయాడన్న వార్త వెలువడింది. మావోయిస్టు పార్టీలో నెం.2 గా పత్రికలు అభివర్ణిస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుండి తృటిలో తప్పించుకుపోయాడని పత్రికలు రాశాయి.…

పొదుపు విధానాలతో బాగా పడిపోయిన బ్రిటన్ల ఆదాయాలు

బడా బహుళజాతి కంపెనీలను సంక్షోభం నుండి బైటపడేయానికి ఇచ్చిన బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలు సదరు అప్పులు తీర్చడానికి ప్రజలపైనే భారం మోపుతూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల వల్ల బ్రిటన్ లో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయని ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) చేసిన సర్వేలో తేలింది. అదే సమయంలో సీనియర్ మేనేజర్ల వేతనాలు మాత్రం అనేక రెట్లు…

“డ్యాం 999” సినిమా ప్రదర్శనపై తమిళనాట నిషేధం

తమిళనాడు ప్రభుత్వం ‘డ్యాం 999′ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలనుండి సినిమా ప్రదర్శన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాడు. ముల్లైపెరియార్ డ్యాం ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మించారని డి.ఎం.కె పార్టీ అధిపతి కరుణానిధి ఆరోపించాడు. లోక్ సభలో బుధవారం డి.ఎం.కె ప్రతినిధులు సినిమాను నిషేధించాలని కోరారు. వైకో నాయకత్వంలోని ఎం.డి.ఎం.కె పార్టీ కూడా సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని కోరింది.…

శరద్ పవార్ కి ఏకంగా చెంప దెబ్బే

జార్జి బుష్ పైన ఓ ఇరాక్ విలేఖరి చెప్పి విసిరిన నాటినుండి “చెప్పు విసరడం” అన్నది ఒక పెద్ద నిరసన కార్యక్రమంగా ముందుకొచ్చింది. ఈ నిరసన రూపం ప్రపంచం అంతా శరవేగంగా వ్యాపించిందంటే అతిశయోక్తి కాదు. ‘ఆ బూటు సైజు ఫలనా’ అని వ్యాఖ్యానించి అదేమంత పెద్ద విషయం కాదంటూనే జార్జి బుష్షు సదరు విలేఖరిని జైలుకి పంపి కసి తీర్చుకున్నాడు. తాజాగా భారత వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏకంగా చెంప దెబ్బే తిని…

కెమెరా కంటికి చిక్కిన హెలికాప్టర్ క్రాష్ -ఫొటోలు

న్యూజిలాండ్ లో ఆక్లాండ్ నగరంలో బుధవారం జరిగిందీ ఘటన. వైడక్ట్ హార్బర్ వద్ద క్రిస్టమస్ ట్రీని నిలపడానికి హెలికాప్టర్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అది కూలిపోయింది. చుట్టూ జన సమ్మర్ధం ఉన్నప్పటికీ ఎవరికీ తీవ్ర గాయాలేవీ తగల్లేదని రాయిటర్స్ తెలిపింది. పైలట్ కూడా పెద్ద గాయాలు తగలకుండా బైటపడ్డాడట. ప్రవేటు వ్యక్తి కెమెరాలో బంధించగా అతని నుండి రాయిటర్స్ ఈ వీడియో సంపాదించింది.

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత షేర్ మార్కెట్లు, వెంటాడుతున్న మాంద్యం భయాలు

బుధవారం భారత షేర్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సోమవారం వరకూ వరుసగా ఎనిమిది రోజులు నష్టాలను ఎదుర్కొన్న షేర్లు మంగళవారం 0.75 శాతం లాభపడి ఇన్వేస్టర్లను ఆశలను కొద్దిగా చిగురింపజేసాయి. అయితే అది తాత్కాలికమేనన్న విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం భారత షేర్లు మళ్లీ ఘోరంగా పతనం అయ్యాయి. ఈ సారి రెండేళ్ల కనిష్ట స్ధాయిని తాకి ఇన్వెస్టర్లకు చెమటలు పుట్టించాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2.3 శాతం పతనం అయ్యాయి. అధిక…

2జి స్పెక్ట్రం కేసులో ఎవరు బయట, ఎవరు లోపల? -గ్రాఫిక్స్

2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి బుధవారం అనుకోని పరిణామం సంభవించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓ లు ఐదుగురికి బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో జైలులోనే ఉన్న మిగిలిన వారికి కూడా బెయిల్ ఆశలు పుడతాయని చెప్పవచ్చు. ఈ కేసులో హై ప్రొఫైల్ ముద్దాయిలయిన ఎ.రాజా, కనిమొళిలకు కూడా దొరకని బెయిల్ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓలకు దొరికింది. వీరు కాక జైలులో ఇంకా తొమ్మిది మంది ఉన్నారు. –…

పాకిస్ధాన్ కు కొత్త రాయబారి, పంత నెగ్గించుకున్న పాక్ మిలట్రీ

అమెరికాలో పాకిస్ధాన్ రాయబారిగా కొత్త వ్యక్తి నియమితులయ్యారు. పాకిస్ధాన్ మిలట్రీని కట్టడి చేయాలంటూ అమెరికా మిలట్రీ ఛీఫ్ కు మెమో రాశాడంటూ పాత రాయబారి హుస్సేన్ హక్కానీ పైన ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసిన సంగతి విదితమే. పాకిస్ధాన్, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి హుస్సేన్ హక్కానీ చాలా కృషి చేశాడనీ కావున ఆయన రాజీనామా ఆమోదం పొందక పోవచ్చనీ చేసిన ఊహాగానాలను పటా పంచలు చేస్తూ హక్కానీ రాజీనామాను పాకిస్ధాన్ ప్రభుత్వం ఆమోదించింది. పాకిస్ధాన్…

రికార్డు స్ధాయిలో రూపాయి పతనం

మంగళవారం రూపాయి రికార్డు స్ధాయిలో పతనం అయ్యింది. ఒక దశలో డాలరుకు రు.52.73 పై.ల విలువకు రూపాయి పతనం అయ్యింది. మంగళవారం వ్యాపార సమయం ముగిసే నాటికి అత్యల్ప స్ధాయి డాలరుకు రు.52.73 పై ల నుండి కొద్దిగా కోలుకుని డాలరుకు రు.52.32  పై.ల స్ధాయికి రూపాయి విలువ చేరుకుంది. అంటే సోమవారం ముగింపు డాలరుకు రు.52.16 పై.ల స్ధాయితో పోలిస్తే మంగళవారం రూపాయి 16 పైసల విలువ కోల్పోయింది. ముప్ఫై షేర్ల సెన్సెక్స్ మంగళవారం ఎనిమి…

ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్

అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని…

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ చిరస్మరణీయుడు -అద్భుతమైన కవిత

వాడ్ని గిరజాల జుట్టోడని వాళ్ళు తెగ ఆడిపోసుకున్నారు, అది తమ బర్బర ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ సంపద అన్నాడు.           సర్వ సేనానిగా ఉండి ఆఫ్ట్రాల్ కల్నల్ బిరుదేమిటన్నారు,           జనరల్ కంటే కల్నలే సిపాయిల్లో మమేకతకి సాధనమన్నాడు. రాజై రాజ దుస్తులొదిలి సైనిక దుస్తుల ధారణేమిటని వెక్కిరించారు, అది ‘ప్రపంచ పోలీసు’ పై సాయుధ ప్రతిఘటనా సంకేతమన్నాడు.           విదేశీ సభలకీ ఒంటె, టెంటు, మందీ, మార్బలాలు ఆటవికమన్నారు,           ఎడారి మూలవాసుల బిడారి వృత్తిపట్ల…

అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ

నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్…

నాలుగు రాష్త్రాలుగా ఉత్తర ప్రదేశ్ విభజనకు అసెంబ్లీ అంగీకారం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, తమ రాష్ట్రాన్ని పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ప్రకటించింది. చిన్న రాష్ట్రాలు…

పాకిస్ధాన్ ప్రభుత్వంతో పాక్ తాలిబాన్ చర్చలు

పాకిస్ధాన్ కి చెందిన తాలిబాన్, పాక్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతున్ననట్లుగా ఒక సీనియర్ తాలిబాన్ కమాండర్ ప్రకటించాడు. దక్షిణ వజీరిస్ధాన్ ప్రాంతంపైన చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. వజీరిస్ధాన్ చర్చలు సఫలం ఐతే చర్చలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తాలిబాన్ కమాండర్ తెలిపాడు. చర్చలు ఫలప్రదం కావడానికి తాలిబన్ అనేక డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఖైదీల విడుదల కూడా ఒకటని కమాండర్ తెలిపాడు. తెహరీక్-ఎ-తాలిబాన్ పాకిస్ధాన్ (టిటిపి)…