భారత మీడియా కంటికి సి.ఆర్.పి.ఎఫ్ ఇలానే కనపడుతుంది -కార్టూన్

భారత ‘సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన బలగాలు అడుగు పెట్టని రాష్ట్రం భారత దేశంలో లేదేమో. భారత దేశం లోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చడంవలన పేద గొప్ప తారతమ్యాలు తీవ్రం అవుతున్నాయి. కోట్లమంది జనానికి బ్రతుకు తెరువు చూపించక పోగా ఈ ప్రభుత్వాలు తమ బ్రతుకు తాము బతుకుతున్న ప్రజల జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు కావచ్చు,…

అమెరికాపై ప్రతీకార చర్యలు తీవ్రం చేసిన పాక్, అమెరికా సారీ

పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు…

నా బ్లాగ్ లో బూతులు రాస్తున్నవారి ఐ.పి నంబర్లు ఇవే

1) 82.28.154.58 2) 141.0.8.142 మొదటి ఐ.పి నెంబరు నుండి ఓ పది సార్లు బూతు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ ఐ.పి నెంబర్ ప్రాక్సీ కాకపోతే ఆ వ్యక్తి ఇంగ్లండ్ నుండి పోస్ట్ చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆ మధ్య వరకూ బ్లాగ్ ను పొగుడుతూ రాసి, ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టిన వ్యక్తే ఈ బూతులు కూడా రాస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. కాదేమో అని కూడా అనిపిస్తోంది. రెండో నెంబరు నుండి నాలు…

‘కిషన్ జీ’ అలియాస్ ‘మల్లోజుల కోటేశ్వరరావు’ గురించి మరిన్ని వివరాలు

పెద్దలు రాజశేఖర్ రాజు గారు ‘కిషన్ జీ’ గారి గురించి వివిధ పత్రికల వెబ్ సైట్లు అందించిన వివరాలను తన వ్యాఖ్య ద్వారా తెలియ జేశారు. ఆ వెబ్ సైట్ల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. రాజశేఖర రాజు గారికి కృతజ్ఞతలతో. జీవితమే ఒక పండుగ కావాలమ్మా! – కిషన్ జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011 లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’! http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1 గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011 కులాన్ని త్యజించిన కిషన్‌జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011 ‘కిషన్ జీ’ నియస్ https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011 బిటెక్…

అమెరికాపై పాకిస్ధాన్ ప్రతీకారం, అమెరికా సైనికులకు ఆహార, ఆయుధ సరఫరాలు బంద్

ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని…

సిరియా అద్దె విప్లవకారులకు ఫ్రాన్సు మిలట్రీ ట్రైనింగ్

సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా…

పాకిస్ధాన్ లోకి జొరబడి 14 మంది పాక్ సైనికుల్ని చంపిన అమెరికా సైన్యం

అమెరికా హెలికాప్టర్లు మరోసారి పాకిస్ధాన్ లోకి జొరబడ్డాయి. అంతటితో ఆగకుండా ఒక మిలట్రీ చెక్ పాయింటు పై దాడి చేసి అక్కడ ఉన్న 14 మంది పాకిస్ధాన్ సైనికుల్ని చంపేశాయి. ఘటనలో మరో నలుగురు గాయపడ్డాఅరు. ఈ మేరకు పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ అధికారులు పత్రికలకు సమాచారం అందించారు. దాడిలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారని స్ధానిక వార్తలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. సలాలా చెక్ పాయింట్ గా పిలిచే ఈ మిలట్రీ చెక్…

‘వాల్ మార్ట్’ స్టోర్ ని తగలబెడతా -ఉమా భారతి

వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…

‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?

(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్) ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను…

ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు

మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు…

చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు…

వారి శరీరమే ఓ కాన్వాస్ -ఫొటోలు

తమ శరీరాలనే కాన్వాస్ లు గా మలుచుకుని ప్రదర్శించే కళ బాడీ ఆర్ట్. ఈ బాడి ఆర్ట్ కి సంబంధించి నవంబరు 20 తేదీన వెనిజులా లోని కారకాస్ నగరంలో ప్రపంచ స్ధాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 18 దేశాలనుండి 50 కి పైగా కళాకారులు పాల్గొన్నారు. బాడీ ఆర్ట్ లో శరీరాలపై పెయింట్లు వేసుకోవడం, పచ్చ బట్లు పొడిపొంచుకోవడం దగ్గర్నుండి కేవలం ఆభరణాలు ధరించడం వరకూ ఉంటుంది. వివిధ ఊహా చిత్రాలనుండీ తమ తమ…

ఐ-ఫోన్ పాపాయి -కార్టూన్

సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కుతోంది. బొమ్మ, పాట, మాట, కదిలే బొమ్మ అన్నీ జేబులో ఒదిగిపోతున్నాయి. ప్రభుత్వాల విధానాలతో సమాచార విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేనా, కంప్యూటర్ల దగ్గర్నుండి ఐ ఫోన్ల వరకూ అన్నీ చిన్న పిల్లలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి. – –

‘కిషన్ జీ’ ఎన్‌కౌంటర్

మావోయిస్టులతో చర్చలు అంటూనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి నాయకుడు కిషన్ జీ ని ఎన్‌కౌంటర్ లో చంపేసింది. బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ప్రభుత్వ బలగాల నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఎన్‌కౌంటర్ లో చనిపోయాడన్న వార్త వెలువడింది. మావోయిస్టు పార్టీలో నెం.2 గా పత్రికలు అభివర్ణిస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుండి తృటిలో తప్పించుకుపోయాడని పత్రికలు రాశాయి.…