భారత మీడియా కంటికి సి.ఆర్.పి.ఎఫ్ ఇలానే కనపడుతుంది -కార్టూన్


భారత ‘సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన బలగాలు అడుగు పెట్టని రాష్ట్రం భారత దేశంలో లేదేమో. భారత దేశం లోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చడంవలన పేద గొప్ప తారతమ్యాలు తీవ్రం అవుతున్నాయి. కోట్లమంది జనానికి బ్రతుకు తెరువు చూపించక పోగా ఈ ప్రభుత్వాలు తమ బ్రతుకు తాము బతుకుతున్న ప్రజల జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు కావచ్చు, బాక్సైట్ తవ్వకాలు కావచ్చు, ఇనప ఖనిజం తవ్వకాలు కావచ్చు… అభివృద్ధి పేరుతో ప్రజల వద్ద భూముల్ని, వనరుల్ని లాక్కొని విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పజెపుతుండడంతో ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించడం నానాటికి అధికమవుతోంది.ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించే బదులు ప్రభుత్వాలు పోలీసులు, పారామిలట్రీ బలగాలు, చివరికి సైన్యాన్ని దించడానికి సైతం వెనకాడ్డం లేదు. అవి గ్రామాల్లో, అడవుల్లో జరుపుతున్న అకృత్యాలను లోకానికి తెలియజేయాల్సిన పత్రికలు, ఛానెళ్లు, ఇతర మీడియా సంస్ధలు బలగాలను శాంతి కాముకులుగా, అభివృద్ధి రక్షకలుగా చూపడానికి పోటీ పడుతున్నాయి. భారత మీడియా ప్రధానంగా ధనికుల పక్షపాతే గాని ప్రజల పక్షపాతి కాదని అనేక సార్లు నిరూపించుకుంది.

CRPF in Indian media's lense

ఫేస్ బుక్ నుండి సేకరించిన కార్టూన్ ఇది.

One thought on “భారత మీడియా కంటికి సి.ఆర్.పి.ఎఫ్ ఇలానే కనపడుతుంది -కార్టూన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s