నా బ్లాగ్ లో బూతులు రాస్తున్నవారి ఐ.పి నంబర్లు ఇవే


1) 82.28.154.58

2) 141.0.8.142

మొదటి ఐ.పి నెంబరు నుండి ఓ పది సార్లు బూతు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ ఐ.పి నెంబర్ ప్రాక్సీ కాకపోతే ఆ వ్యక్తి ఇంగ్లండ్ నుండి పోస్ట్ చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆ మధ్య వరకూ బ్లాగ్ ను పొగుడుతూ రాసి, ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టిన వ్యక్తే ఈ బూతులు కూడా రాస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. కాదేమో అని కూడా అనిపిస్తోంది.

రెండో నెంబరు నుండి నాలు గైదు సార్లు బూతులు రాశారు. ఇవి రెండూ ఒకరే రాస్తున్నారేమో తెలియదు. హర్యానాలోని బహదూర్ ఘర్ నుంది పోస్ట్ అవుతున్నట్లుగా ఐ.పి నంబర్ బట్టి అర్ధమవుతోంది. ఈ రెండు కాకుండా ఇంకా నాలుగైదు ఐ.పి నెంబర్లు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను పూర్తిగా తీసివేయడం వలన రాయలేకపోతున్నాను.

కాశ్మీరు, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్, ముస్లింలు తదితర విషయాలపై పోస్టులు రాసినపుడు వీళ్ళు బూతులు రాస్తున్నారు. కాశ్మీరు ప్రజల పోరాటం, ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల దురాక్రమణ వ్యతిరేక పోరాటం, పాకిస్ధాన్ అమెరికా వ్యతిరేకత లపై టపాలు రాసినపుడు వీళ్ళకి ‘బూతమ్మ వారు’ పూనుతుంది. బూతులు అంటే పచ్చి బూతులే. బూతులు మాట్లాడే అలవాటు ఉన్నవారు కూడా రాయడానికి సిగ్గుపడే బూతులు అవి. పరమత సహనం గల మతం అని హిందూయిజం గురించి గొప్పలు చెప్పుకునే హిందూ మతోన్మాదులే ఇటువంటి రాతలకు పూనుకుంటున్నారు.

ఇతరుల తల్లులనీ, చెల్లెళ్లనీ గౌరవించలేని వారు తమ తల్లులు, చెల్లెళ్ళపట్ల కూడా గౌరవంగా ఉండగలరా లేదా అన్నది అనుమానమే!

31 thoughts on “నా బ్లాగ్ లో బూతులు రాస్తున్నవారి ఐ.పి నంబర్లు ఇవే

 1. http://whois.domaintools.com/141.0.8.142 ఇది ఓ సారి చూడండి. మీరు చెప్పిన రెండో ఐపి అడ్రెస్ మొబైల్ బ్రౌజర్ ప్రాక్సీకి చెందినది. నా మొబైల్ ఫోన్ లో ఉన్న బ్రౌజర్ కూడా ఒపేరా మినీయే.

 2. కొన్ని మొబైల్ బ్రౌజర్లు వ్యక్తిగత సమాచారాన్ని హైడ్ చేస్తాయి. నేను సాధారణంగా ఫొటోలు తియ్యడానికి బయటకి వెళ్ళినప్పుడు మొబైల్ బ్రౌజర్ ఉపయోగిస్తాను. ట్రైన్ ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తాను. కానీ 24 గంటలు మొబైల్ ఫోన్ పట్టుకుని ఉండను. వ్యక్తిగత సమాచారాన్ని దాస్తూ బూతులు వ్రాయడానికి 24 గంటలూ మొబైల్ ఫోన్‌ని జేబులో పెట్టుకునేవాళ్ళు ఉంటారు.

 3. ప్రవీణ్, మీరు చెప్పిన లింక్ ఫాలో అయ్యాను. అక్కడ దొరికిన వివరాలను బట్టి ఆ వ్యక్తి అమెరికా లోని ఫాల్స్ చర్చ్ దగ్గర్నుండి బూతులు పోస్ట్ చేసినట్లు అర్ధం అవుతోంది. అంటే అతను అమెరికా నుండి బ్రౌజ్ చేస్తూ బహదూర్ ఘర్ ఐ.పి ని ప్రాక్సీ గా ఉపయోగించాడని భావించవచ్చా?

 4. అది కాదు. మొబైల్ ఫోన్‌లలో ఎక్కువగా ఒపేరా మిని అనే బ్రౌజర్ ఉపయోగిస్తారు. అందులోంచి చేస్తే ఒపేరా కంపెనీ యొక్క ఐపి అడ్రెస్ కనిపిస్తుంది. అందుకే అతని ఐపి అడ్రెస్ అమెరికా ఫాల్స్ చర్చ్ అని చూపించింది. కావాలంటే నేను కూడా ఫాల్స్ చర్చ్ ఐపి అడ్రెస్ చూపించేలా ఒక మెసేజ్ పోస్ట్ చెయ్యగలను. నా మొబైల్ ఫోన్‌లో ఉన్నది కూడా ఒపేరా మిని బ్రౌజరే. అయినా 24 గంటలు జేబులో మొబైల్ పెట్టుకుని ఎవరూ ఉండరు. అతను కేవలం మొబైల్ నుంచి వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నాడంటే కావాలని తప్పుడు ఐపి నంబర్లు చూపించే ఉద్దేశంతోనే పోస్ట్ చేస్తున్నాడని అర్థమవుతోంది.

 5. అందుకే కాబోలు. బూతులు కూడా ఇంగ్లీషు స్పెల్లింగ్ తో రాస్తున్నాడు. మొబైల్ లో తెలుగు టైపింగ్ ఇంకా రాలేదు కదా.
  అతనెవరో గానీ అతన్ని కన్న తల్లిదండ్రులకి నా సానుభూతి.

  కానీ ప్రవీణ్, ఒకటి చెప్పండి. మొబైల్ లో తెలుగు వెబ్ సైట్లు కనిపిస్తాయా? నా మొబైల్ (త్రిజి) లో చూడలేకపోతున్నాను.

 6. Hello…

  Mobiles does not have fixed IP addresses. They tend to change. The mobile proxies are fixed. So, tracking them based on IP address is not actually not a good idea.

  And, you can watch telugu websites too on mobile. It does not depend on your 3G or 2G network. It depends on browser compatibility and mobile OS support for characters.

  And yes, you can watch websites having content in Telugu.

  Chandu

 7. చందూ గారూ, మీ సమాచారానికి కృతజ్ఞతలు. నా మొబైల్ లో ఏండ్రాయిడ్ ఓ.ఎస్. తెలుగు ఫాంట్స్ కనపడడానికి ఏం చేయాలి చెప్పగలరా?

 8. You can view tamil and other unicode fonts in Android phones if you use Opera Mini browser which is available in Android Market. However, you need to do the following to see unicode fonts
  1. Type “config:” (exclude quotes) in the address bar and hit ‘Go’ . Configuration page will be displayed.
  2. Scroll down and look for ‘Use bitmap fonts for complex scripts’ and select ‘Yes’.
  3. Click ‘Save’.
  Close the browser and try webpage with tamil unicode font.

  http://www.google.com/support/forum/p/Android%20Market/thread?tid=11a50390b5f5d862&hl=en

  –vijay

 9. meeru extreme content post chesinappudu ilantivanne common.

  mee abiprayalanu prjala meeda ruddite, vallaku telsindi vallu mee meeda ruddutaaru, tappadu mari.

  for example, ee roju CRPF gurunchi raasaaru meeru, just copy chesaaremo teleedu. kaanee vaallu prajala cheta ennukobadina valla orders paatistunnaru. we trained them like that. adi valla tappu kaadu.

  meeru valla chetulaki raktam antinchaaru, adi chadivina vaallu meeku boothulu antistunnaru.

  meekoo boothulu raasevallaki pedda teda yemee ledemo.

  ee comment vunchutaraaa?

 10. config అని టైప్ చేస్తే గేలక్సీ పోప్‌లో అవ్వడం లేదు. ఇప్పుడే నేను తేలినీలాపురం నుంచి తిరిగొచ్చాను. తేలినీలాపురం దగ్గర ఉన్నప్పుడు సెల్ ఫోన్‌లో తెలుగు అవ్వకపోతే ఇంగ్లిష్‌లోనే టైప్ చేస్తూ గూగుల్ ప్లస్‌లోకి ఫొటోలు అప్‌లోడ్ చేశాను. హిందీ మాత్రం నా ఫోన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

 11. నేను ఒపేరా ఇన్‌స్టాల్ చేశాను. అందులో కూడా తెలుగు కనపడ్డం లేదు. హిందీ నాకు రాదు. అందువలన అది ప్రయత్నించలేదు. కాన్ఫిగ్ కమాండ్ కూడా పని చేయడం లేదు.

 12. నా ఫోన్ మోడల్ గేలక్సీ పోప్ 1559. నా ఫోన్‌లో హిందీ అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ తెలుగు అక్షరాలు కనిపించడం లేదు. config అని టైప్ చేస్తే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళిపోతోంది.

 13. బాగుంది. గేలాక్సీ ఏస్ అంటే అదేమన్నా చిల్లర కొట్టులో దొరికే వస్తువా ఒకటి ఉండగానే మరొకటి కొనెయ్యడానికి? ఏస్ నలభై ఐదు వేలని విన్నాను. ఎంత తెలుగు మీద ప్రేమ ఉన్నా… … …!

  నేను గెలాక్సీ ఎస్ – 2 వాడుతున్నా. కొని మూడు నెలలే అయ్యింది. ఇందులో ఒపెరా:కాన్ఫిగ్ కమాండ్ పని చేస్తోంది గానీ, సంబంధిత కమాండ్ లేదు.

 14. “config:” (without quotes) type cheyyali. malla okasari “configcolon” (without quotes),
  nadi galaxi 3, using “opera mini” version 6.5, OS android 2.2

  important point — wifi ki gani, gprs ki gani connect ayyaka “config:” type cheyyali

  hope this helps

 15. కెవిన్, సారీ. నేను చెప్పిన రేటు ‘గెలాక్సీ నోట్’ ది. గెలాక్సీ ఏస్ మీరు చెప్పినట్లు పదమూడు వేలే. అందులో తెలుగు ‘మల్టిలింగ్’ అప్లికేషన్ ద్వార యాక్టివేట్ అవుతోంది. కాని గెలాక్సీ ఎస్ టు లో మల్టిలింగ్ ఇన్‌స్టాల్ చేసినా తెలుగు యాక్టివేట్ కావడం లేదు. ఏస్ విషయం నేను నల్లమోతు శ్రీధర్ గారు యూ ట్యూప్ లో ఉంచిన వీడియో ద్వారా తెలుసుకున్నాను.

 16. ఒపెరా మినీ బ్రౌజర్లో ఉదాహరణకి thatstelugu.com టెస్ట్ చేయండి. తెలుగు అక్షరాల స్థానంలో బాక్సులు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎడ్రస్ బార్లో opera:config అని కొట్టండి. (ఒపెరా కోలన్ : కాన్ఫిగ్ ) ఎంటర్ నొక్కండి. పూర్తి ప్రిఫరెన్స్ ఆప్షన్లున్న పేజీ లోడవుతుంది. చివరిదాకా స్క్రాల్ చేయండి. చిట్ట చివర్లో బిట్ మ్యాప్ ఫాంట్స్ గురించి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని yes గా మార్చండి. (డిఫాల్ట్ గా ఇది no ఉంటుంది. ) తరవాత అదే పేజీలో కింద ఉండే save బటన్ నొక్కండి. ఇప్పుడు యునికోడ్ తెలుగు మీ బ్రౌజర్లో కనిపిస్తాయి. తిరిగి thatstelugu.com టెస్ట్ చేయండి.

  సూచన : ఒపెరా మొబైల్ బ్రౌజర్లలో ఒపెరా మొబైల్, ఒపెరా మినీ అనే రెండు వెర్షన్లున్నాయి. ఈ కమాండ్ ఒపెరా మినీ లోనే పనిచేస్తుంది. ఎందుకంటే ఒపెరా మినీ ద్వారా మనం చూసే వెబ్ పేజీలన్నీ ముందుగా ఒపెరా సర్వర్లోకి వెళ్లి మొబైల్ కి తగినట్టు రెండర్ అయి అప్పుడు లోడ్ అవుతాయి. మొబైల్ డైరెక్ట్ బ్రౌజర్. అందువల్ల ఈ స్క్రిప్ట్ ఆప్షన్ దాంట్లో పనిచేయదు.
  – వక్కలంక కిషోర్

 17. అదండీ సంగతి. వక్కలంక కిషోర్ గారూ, మీరు ఇచ్చిన టిప్ తో నా మొబైల్ లో తెలుగు చూడగలుగుతున్నాను.

  విషయం ఏమిటంటే, ఇప్పటివరకూ నేను ఒపెరా మొబైల్ వాడుతున్నాను. మినీ, మొబైల్ రెండు ఉన్నాయని తెలియక మొబైలే మిని అనుకుంటున్నాను.
  మీరు రెండూ ప్రస్తావించి తేడా చెప్పాక మిని డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేశాను.
  ఇప్పుడు తెలుగు కూడా నా మొబైల్ లో చూడగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది.
  మీకు ఎన్నో కృతజ్ఞతలు. రెండ్రోజుల నుండి ప్రయత్నించి విసిగి పోవడంతో మీ టిప్ పని చేశాక ఎంత సంతోషం వేసిందో చెప్పలేను. ఎడారిలో ఒయాసిస్సు లాగా అన్నమాట.

  బహుశా ప్రవీణ్ కి కూడా ఇదే సమస్యేనేమో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s