‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?


(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్)

maoist

ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు.

దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే.

ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను , అనుబందాలను వదులుకొని ప్రాణాలను తను నమ్మిన సిద్దాంతం కోసం ధార పోసిన నాయకుడు. విప్లవ పార్టీలకు వన్నె తెచ్చిన కిషన్ జి, విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి. విప్లవాల గడ్డ, కరీంనగర్ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. వెంకటయ్య, మధురమ్మల పుత్రుడు. ఇక్కడ పుట్టి, ఇక్కడి రాజకీయాలలో నాయకుడిగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన గొప్ప విప్లవానికి ఊపిరిలు ఊదిన కిషన్ జి. కర్కశ ప్రభుత్వాలకు బలి అయిపోయిన అరుణ తార, కొలకత్తా, పశ్చిమ మిడ్నాపూర్ లో చివరి శ్వాస.

ఎక్కడైతే నక్సల్ బరి పుట్టి పురుడు పోసుకుందో, అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి, ప్రభుత్వాల పన్నాగాలకు బలి అయిపోయిన పెద్ద అన్న.

ఇది బూటకపు ఎన్ కౌంటర్ల దేశం. అజాదు ను చంపుతారు. అవును, అయన నక్సల్, వెంటాడి వేటాడి చంపుతారు, హేమచంద్ర పాండే, ఒక జర్నలిస్ట్, ఈయనని కూడ చంపుతారు ఎందుకంటే ఆయనకి వీరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి. అయన ఇంట్లో నిషిద్ధ సాహిత్యం ఉంటుందిమ్ అట! పొరపాటు పడవద్దు బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది, మార్పును కోరుకునే సాహిత్యం గురించి మాత్రమె. కొన్నిరోజుల తరువాత సుప్రీం కోర్ట్ ఇది అన్యాయం అంటుంది, అది ఏ పత్రికా రాయదు, రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరుగదు.

గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడ ఇష్రత్ అనే విద్యార్దిని , ఆమెతో ఇంకా కొంత మందిని ఎన్కౌంటర్ చేస్తుంది, , ఉగ్రవాదులు అన్నారు కాని ఇపుడు ఇవే కోర్ట్లు కాదు వారిది బూటకపు ఎన్కౌంటర్ అంటుంది, షీలా శూద్ అనే సామాజిక కార్యకర్త, హక్కులు అడిగిన పాపానికి హత్య కావించ బడుతుంది. ఇపుడు లేటెస్ట్ గా జీతెన్ మరాండి, పాటలు పాడుకొని దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నందుకు ఆయనకు ఉరి శిక్ష..వెరసి ఇవి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఇక్కడ ఎవరినైనా చంపొచ్చు దానికి మావోఇస్ట్ అని పేరు పెట్టొచ్చు. ఇక్కడ రాసుకున్న రాజ్య , న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎవడిని పడితే వాడిని, ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అన్యాయంగా చంపొచ్చు.

నీచేతిలో తుపాకి ఉంటె దేశ రక్షణ, నాచేతిలో తుపాకి ఉంటె నేనొక నిషిద్ధం. ఇది ఈ దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం. దీనిని ప్రశ్నించే వాడు లేదు, ఉన్న కూడా వారు చాల మందికి అర్థం కారు. అభివ్రుది అనే ముసుగులో ఆదివాసీలను, అడవులను, బీద ప్రజలను దేశ సార్వ భౌమత్వాన్ని కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయ పార్టీలను ఎదిరించకూడదు.

ఆయనెవరో నేటి తరానికి తెలియకపోయి ఉండొచ్చు, చాల మంది తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నినాదాలకి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, మావోఇస్ట్, నక్సలైట్, పీపుల్స్ వార్, సాయుధ పోరాటం ఇలాంటివన్నీ వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్త పిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయి వాడు. ఇదీ రాజ్యం, రాజ్యానికి కొమ్ము కాసే, పార్లమెంటరీ భక్తులు వాడే భాష.

ఈ దేశ రాజకీయాలని ప్రజా పోరాట రూపం లో ప్రశ్నించిన వ్యక్తీ ఒక తెలంగాణ వాడు, ఇక్కడ జరిగిన అన్యాయానికి సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని నమ్మిన వ్యక్తీ. భారత రాజకీయాలలో కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమె న్యాయం చేకూరుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసీ ప్రజలను అణచి వేస్తున్నాయని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం, గొప్ప విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ.

మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జి 1956 లో జననం కరీంనగర్ పెద్దపల్లి లో జననం. 1948 తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట పటిమని చేత పుచ్చుకొని, 1969 తెలంగాణ ఉద్యమం అణచివేయబడిన తరువాత ప్రత్యామ్న్యా రాజకీయాల్లోకి ప్రవేశించిండు. నక్సలైట్ల ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం కూడా మొదలై, అణచివెతలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న చారిత్రాత్మక సందర్భంలో విప్లవోద్యమంలోకి ఉరికి చివరికి ఆ విప్లవోద్యమం కోసమే అమరుడైనాడు.

7 thoughts on “‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?

 1. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు

  విప్లవాలు, సాయుధపోరాటాలు తెలుగు నేలకి కొత్తకాదు. నాగలిపట్టె రైతన్న తుపాకి పట్టాలంటూ 60 ఏళ్ళ క్రితం మొదలైన తెలంగాణ రైతంగ సాయుధపోరాటం అగిపోయినా, చారుమజుందారు పిలుపునందుకోని తిరిగి అటు శ్రికాకుళంలో ఇటు తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు చెలరేగాయి. నిండు యవ్వన ప్రాయంలో ఈ ఉద్యమంలో దూకి గత ముడున్నర దశాబ్దాలుగా నేలకొరిగిన యువత ఐదు వేలకుపైచిలుకన్నది ఒక అంచనా. కేవలం 20ల సగటు వయసులో సామాజానికి చోదక శక్తి కావలసిన యువతను నష్టపోవడం ఆ సమాజానికే ఒక నష్టం ఐతే వారిని కన్న తల్లులకు అది తీరని గర్భశోకం. రాజకీయాలు తెలియకపోయినా, రహస్య జీవితంలో కన్న బిడ్డ భద్రతకోసం ఆరాటం, వాళ్ళ ఆచూకి కోసం నిర్భందం ఒకే సారి అనుభవించే తల్లులకు వారి మరణవార్త ఆశనిపాతం. తెలివైన పెద్ద కొఛుకు చక్కగ చదువుకుంటాడని నమ్మించి ఇల్లు దాటి, ఊరు దాటి ఆపై మధురమ్మ చేయిదాటిపోయాక ఆ ఇంటిపై జరిగే విధ్వంసం మధ్య కుటుంబం భయం నీడలో బతకాల్సి కావడం తల్లులందరి సహవేధన. తనకోడుకే పెద్ద నాయకుడై ఏందరినో కూడగడుతున్నాడని తెలియని అమాయకపు అమ్మ. ఎక్కడో అక్కడ కూలాసాగానే ఉంటాడని క్షణక్షణం ప్రార్థించే తల్లులకు బిడ్డల మరణవార్త శరాఘాతం. కొడుకు మరణవార్త తెలియని, తెలిసినా కొడుకు శవం చూడని తల్లులు కొందరూ.

 2. విశేఖర్ గారూ,
  మీకు వీలయితే కింది లింకులు అందరికీ తెలియడం కోసం పోస్ట్ చేయగలరు.

  జీవితమే ఒక పండుగ కావాలమ్మా! – కిషన్ జీ
  https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011

  లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’!
  http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1

  గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య
  https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011

  కులాన్ని త్యజించిన కిషన్‌జీ
  https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011

  ‘కిషన్ జీ’ నియస్
  https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011

  బిటెక్ కిషన్
  https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main4&more=2011/nov/25/main/main&date=11/25/2011

  ప్రజల్లోకి వచ్చి పోరాడండి
  https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit4&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011

 3. విశేఖర్ గారూ,
  తాజాగా దొరికిన సమాచార లింకులను కూడా ఇక్కడ చేరుస్తున్నాను. అభ్యంతరం లేకుంటే వీటిని కూడా ప్రచురించగలరు.

  మన కాలం వీరుడు…
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48280

  మావోయిస్టు ఉద్యమం -కిషన్‌జీ…!
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48279

  చరిత్ర నిర్మాత కిషన్ జీ
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012

  ఒక తరం ప్రతినిధి
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=5&ContentId=47744

  స్వార్థమా.. వర్ధిల్లు..!
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48014

  మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’
  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48015

  కాల్చారు.. కోశారు.. కడతేర్చారు!
  https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main1&more=2011/nov/27/main/main&date=11/27/2011

  కాల్చారు.. కోశారు.. కడతేర్చారు!
  https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main1&more=2011/nov/27/main/main&date=11/27/2011

 4. పింగ్‌బ్యాక్: చందమామ నుంచి జంగల్ మహల్ దాకా…. « తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు

 5. మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ పేరు వినగానే ఏదో తెలియని స్ఫూర్తి కలుగుతుంది. సుభాష్ చంద్రబోస్‌, చేగువేరా…ఇలా నమ్మిన సిద్ధాంతం లక్ష్యం కోసం చివరిదాకా అంకితమైన వీరుల్లాగే కిషన్‌జీ కూడా గొప్ప పోరాటయోధుడు. ఆ అమరవీరుడిగురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  అసదర్భమే ఐనా ఓ విషయం మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాను.

  మీడియాలో పనిచేసే నాకు…పనిలో భాగంగా ఓ సారి కిషన్‌జీతో ఫోన్‌లో మాట్లాడే అమూల్య అవకాశం వచ్చింది. అవకాశం సులభంగా వచ్చినా ఆయనతో మాట్లాడడం మాట్లాడ్డం మాత్రం అంత సులువుగా కుదర్లేదు. చాలా సేపు వెయిటింగ్ తర్వాత మొత్తానికి ఆయన ఫోన్‌ కలిసింది. మావోయిస్టు ఉద్యమం, మమతా బెనర్జీతో కలిశారనే సీపిఎం ఆరోపణలు ( అప్పటికి మమత అధికారంలోకి రాలేదు ) , ఎల్టీటీఈ ఉద్యమం , ఇలా అనేక విషయాలు చర్చించాము.

  నేటి యువతరాన్ని ఆకర్షించడంలో మావోయిస్టు ఉద్యమం ఎందుకు విఫలమైందనే నా ప్రశ్నకు ఆయన భిన్నంగా స్పందించారు. యువతరం మావోయిస్టు ఉద్యమానికి దూరం కాలేదని చెప్పారు. దోపిడీ, దౌర్జన్యం సాగినంత కాలం ఉద్యమం ప్రజలతోనే ఉంటుందనీ, ఏనాటికైనా ఈ దేశంలో ప్రజాతంత్ర విప్లవం విజయవతమై తీరుతుందని తేల్చిచెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s