ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు


మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు ముందే కిషన్ జీ ని పోలీసులు పట్టుకున్నారనీ, ఒక రోజంతా హింసించి ఆ తర్వాత కాల్చి చంపారనీ ఆయన ఆరోపించాడు.

కిషన్ జీ ఎన్‌కౌంటర్ లో చనిపోయాడని పోలీసులు ప్రకటించడానికి ఒక రోజు ముందు ‘కిషన్ జీ తృటిలో తప్పించుకు పోయాడంటూ’ పోలీసులు పత్రికలకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అందిన ఇరవై నాలుగ్గంటల్లోనే కిషన్ జీ ఎన్‌కౌంటర్ లో మరణించాడంటూ పత్రికలు, ఛానెళ్లు ప్రకటించాయి. కిషన్ జీ చుట్టూ నాలుగంచెల భద్రత ఉన్నదనీ దానిని ఛేదించుకుని వెళ్ళి ఆయన్ని చంపారనీ పోలీసులు తెలిపారు. అయితే నాలుగంచెల భద్రతలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలెవ్వరూ చనిపోయినట్లుగా పోలీసులు చెప్పలేదు. పోలీసుల అదుపులో మరికొంతమంది ఉన్నారని కూడా వర వర రావు ఆరోపిస్తున్నాడు.

జాతీయ మానవ హక్కుల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం కిషన్ జీ మరణానికి సంబంధించి పోలీసులపైన సెక్షన్ 302 కేసు నమోదు చేయాలని వరవర్రావు కోరాడు. హోమ్ సెక్రటరీ జి.డి.గౌతమ కు సమర్పించిన మెమొరాండంలో ఆయన ఈ విధంగా కోరాడు. ఇంకా నలుగురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని ఆయన చెప్పాడు. తనతో పాటు వచ్చిన కిషన్ జీ బంధువు దీపా రావు కు కిషన్ జీ విగత శరీరాన్ని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశాడు. కిషన్ జీ తల్లి కేన్సర్ రోగి అనీ, ఆమె తన కుమారుడ్ని చూడాలని కోరుతున్నదనీ కనుక కిషన్ జీ బాడీ ని కోల్ కతా కు తెచ్చి అక్కడినుండి హైద్రాబాద్ కు పంపిచాలని కోరాడు.

మావోయిస్టు పార్టీ నేతలు చర్చలు జరపాలని భావించినప్పటికీ మమత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనీ ఇక చర్చలు జరిగే అవకాశాలు లేవనీ వరవర రావు పేర్కొన్నాడు.

7 thoughts on “ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు

  1. ముమ్మాటికి యిది సర్కార్ హత్యే! కానీ దీనిని ఖండిస్తానికి ఉధ్యమం వెనక ప్రజలేరి. మమతకు ఎన్నికల్లో మావోలు సహకరించడం మరో చారిత్రిక తప్పిదంగా మిగిలిపోతుదనడంలో సందేహమే లేదు. ఒక్క ముక్కలో చెప్పలంటే “కుక్క కాటుకు చెప్పు దెబ్బ”

    మీరు చెప్పినట్లు, ప్రజలను ప్రేక్షకులుగా మిగిల్చే ఈ సాయిధపోరాట విధానం విడనాడితే గాని భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యయమానికి మంచిరోజులురావు.

  2. వాసవ్య గారూ మీ ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ ప్రయోగం నాకు అర్ధం కాలేదు.
    మావోయిస్టు పార్టీ పై స్ధాయిలో వారి పంధాపై అంతర్మధనం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా అది కిందివరకు వస్తున్న దాఖలాలు లేవు. బహుశా క్యాడర్ ను అతివాదంతో ఇన్నాళ్లూ ఎడ్యుకెట్ చేయడం వల్ల సవరణకు క్యాడర్ ని ఒప్పించలేకపోతున్నారేమో? మన ఊహగానాలు ఎలా ఉన్నా వారి త్యాగాలు మాత్రం విలువైనవే. అవి నిరర్ధకం కావడమే అసలు విషాధం.

  3. ఒక ఉత్తరం, సందేశం ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను , అనుబందాలను వదులుకొని ప్రాణాలను తను నమ్మిన సిద్దాంతం కోసం ధార పోసిన నాయకుడు. విప్లవ పార్టీలకు వన్నె తెచ్చిన కిషన్ జి,విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి. విప్లవాల గడ్డ, కరీంనగర్ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. వెంకటయ్య, మధురమ్మల పుత్రుడు. ఇక్కడ పుట్టి, ఇక్కడి రాజకీయాలలో నాయకుడిగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన గొప్ప విప్లవానికి ఊపిరిలు ఊదిన కిషన్ జి. కర్కశ ప్రభుత్వాలకు బలి అయిపోయిన అరుణ తార, కొలకత్తా, పశ్చిమ మిడ్నాపూర్ లో చివరి శ్వాస. , ఎక్కడైతే నక్సల్ బరి పుట్టి పురుడు పోసుకుందో, అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి, ప్రభుత్వాల పన్నాగాలకు బలి అయిపోయిన పెద్ద అన్న.

    ఇది బూటకపు ఎన్ కౌంటర్ల దేశం. అజాదు ను చంపుతారు అవును అయన నక్సల్, వెంటాడి వేటాడి చంపుతారు, హేమచంద్ర పాండే, ఒక జర్నలిస్ట్, ఈయనని కూడ చంపుతారు ఎందుకంటే ఆయనకి వీరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి. అయన ఇంట్లో నిషిద్ధ సాహిత్యం ఉంటుంది అట, పొరపాటు పడవద్దు బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది, మార్పును కోరుకునే సాహిత్యం గురించి మాత్రమె. కొన్నిరోజుల తరువాత సుప్రీం కోర్ట్ ఇది అన్యాయం అంటుంది, అది ఏ పత్రికా రాయదు, రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరుగదు. గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడ ఇష్రత్ అనే విద్యార్దిని , ఆమెతో ఇంకా కొంత మందిని ఎన్కౌంటర్ చేస్తుంది, , ఉగ్రవాదులు అన్నారు కాని ఇపుడు ఇవే కోర్ట్లు కాదు వారిది బూటకపు ఎన్కౌంటర్ అంటుంది, షీలా శూద్ అనే సామాజిక కార్యకర్త, హక్కులు అడిగిన పాపానికి హత్య కావించ బడుతుంది. ఇపుడు లేటెస్ట్ గా జీతెన్ మరాండి, పాటలు పాడుకొని దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నందుకు ఆయనకు ఉరి శిక్ష..వెరసి ఇవి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఇక్కడ ఎవరినైనా చంపొచ్చు దానికి మావోఇస్ట్ అని పేరు పెట్టొచ్చు. ఇక్కడ రాసుకున్న రాజ్య , న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎవడిని పడితే వాడిని, ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అన్యాయంగా చంపొచ్చు. నీచేతిలో తుపాకి ఉంటె దేశ రక్షణ, నాచేతిలో తుపాకి ఉంటె నేనొక నిషిద్ధం. ఇది ఈ దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం. దీనిని ప్రశ్నించే వాడు లేదు, ఉన్న కూడా వారు చాల మందికి అర్థం కారు. అభివ్రుది అనే ముసుగులో ఆదివాసీలను, అడవులను, బీద ప్రజలను దేశ సార్వ భౌమత్వాన్ని కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయ పార్టీలను ఎదిరించకూడదు.

    ఆయనెవరో నేటి తరానికి తెలియకపోయి ఉండొచ్చు, చాల మంది తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నినాదాలకి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, మావోఇస్ట్, నక్సలైట్, పీపుల్స్ వార్, సాయుధ పోరాటం ఇలాంటివన్నీ వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్త పిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయి వాడు, ఇది రాజ్యం, రాజ్యానికి కొమ్ము కాసే, పార్లమెంటరీ భక్తులు వాడే భాష. ఈ దేశ రాజకీయాలని ప్రజా పోరాట రూపం లో ప్రశ్నించిన వ్యక్తీ ఒక తెలంగాణ వాడు, ఇక్కడ జరిగిన అన్యాయానికి సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని నమ్మిన వ్యక్తీ. భారత రాజకీయాలలో కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమె న్యాయం చేకూరుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసీ ప్రజలను అణచి వేస్తున్నాయని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం, గొప్ప విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ. మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జి 1956 లో జననం కరీంనగర్ పెద్దపల్లి లో జననం. 1948 తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట పటిమని చేత పుచ్చుకొని, 1969 తెలంగాణ ఉద్యమం అణచివేయబడిన తరువాత ప్రత్యామ్న్యా రాజకీయాల్లోకి ప్రవేశించిండు. నక్సలైట్ల ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం కూడా మొదలై, అణచివెతలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న చారిత్రాత్మక సందర్భం.

  4. ఆంధ్ర ప్రదేశ్ లో విఫలమైన ఎత్తుగడలనే వెస్ట్ బెంగాల్లో అనుసరించటం మావోయిస్ట్ పార్టీ చేసిన తప్పు.
    మమతా బెనర్జీ రాజశేఖర రెడ్డి కన్నా స్పీడుగా ఉంది.
    మావోయిస్టులతో త్రుణమూల్ స్నేహం మూణ్ణాళ్ళ ముచ్చట అనుకున్నాను.
    కానీ.. ఒక రోజు ముచ్చట కూడా కాలేక పోయింది.
    కేవలం సి.పి.ఎం. ని గద్దె దించటం కోసం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మావోయిస్టులతో మమత చెలిమి చేసినట్లననిపిస్తుంది.
    అవసరం తీరాక వదిలించేసుకుంది.

  5. విశేఖర్ గారూ,
    మీకు వీలయితే కింది లింకులు అందరికీ తెలియడం కోసం పోస్ట్ చేయగలరు.

    జీవితమే ఒక పండుగ కావాలమ్మా! – కిషన్ జీ
    https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011

    లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’!
    http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1

    గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య
    https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011

    కులాన్ని త్యజించిన కిషన్‌జీ
    https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011

    ‘కిషన్ జీ’ నియస్
    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011

    బిటెక్ కిషన్
    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main4&more=2011/nov/25/main/main&date=11/25/2011

    ప్రజల్లోకి వచ్చి పోరాడండి
    https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit4&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011

  6. విశేఖర్ గారూ,
    తాజాగా దొరికిన సమాచార లింకులను కూడా ఇక్కడ చేరుస్తున్నాను. అభ్యంతరం లేకుంటే వీటిని కూడా ప్రచురించగలరు.

    మన కాలం వీరుడు…
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48280

    మావోయిస్టు ఉద్యమం -కిషన్‌జీ…!
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48279

    చరిత్ర నిర్మాత కిషన్ జీ
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012

    ఒక తరం ప్రతినిధి
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=5&ContentId=47744

    స్వార్థమా.. వర్ధిల్లు..!
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48014

    మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’
    http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48015

    కాల్చారు.. కోశారు.. కడతేర్చారు!
    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main1&more=2011/nov/27/main/main&date=11/27/2011

  7. పింగ్‌బ్యాక్: చందమామ నుంచి జంగల్ మహల్ దాకా…. « తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s