ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.
కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, తమ రాష్ట్రాన్ని పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ప్రకటించింది. చిన్న రాష్ట్రాలు పరిపాలనకు అనువుగా ఉంటాయని బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రభోధించాడని మాయావతి వాదిస్తోంది.
ఐతే మాయావతి విభజన వాదం ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి తదితర పార్టీలు వాదిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్లను ఓట్లుగా మరల్చుకోవడానికి మాయవతి విభజన ఎత్తు వేసిందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. సోమవారం తీర్మానాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదింపజేశారు.
సోమవారం, యు.పి ప్రతిపక్షాలు మాయావతి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని తలపెట్టాయి. సభాధ్యక్షుడు సభను నిరవధికంగా వాయిదా వేయడంతో అది సాధ్యపడలేదు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు గవర్నరుకు రిపోర్టు చేయాలని నిర్ణయించారు.
ఉత్తర ప్రదేశ్ ను విభజించాలంటె అందుకోసం రెండవ ఎస్.ఆర్.సి (స్టేట్ రీఆర్గనైజింగ్ కమిటీ) వేయాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అసలు యు.పి విభజనకు తాము అంగీకరించబోమనీ, కాంగ్రెస్ కూడా అంగీకరించకూడదనీ మాయావతి ఎన్నికల జిమ్మిక్కులకు కాంగ్రెస్ కూడా బలి కారాదనీ కొరుతోంది. సమాజ్వాదీ పార్టీ అయితే విభజనకు ప్రజలు సిద్ధంగా లేరని సూత్రీకరించింది.
తెలంగాణ రగిల్చిన చిచ్చును మాయావతి ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగిసంచుకుంటోందన్నది సుస్పష్టమే. ఎన్నికల ప్రయోజనాల కోసం కాన్షీరామ్ ప్రతిపాదించిన ‘బహుజన సిద్ధాంతాన్ని’ కూడా త్యజించి మాయావతి ‘సర్వజన సిద్ధాంతం’ అంటూ ప్రతిపాదించింది. సమాజంలో అగ్రవర్ణాలవారికి వ్యతిరేకంగా బహుజన కులాల వారు ఐక్యం అయ్యి అధికారం చేజిక్కించుకోవాలని కాన్షీరాం ప్రతిపాదించాడు. కాని మాయావతి అగ్రవర్ణాలుగా పరిగణింపబడే బ్రాహ్మణులతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ ను దానికి అడ్డు తెచ్చుకోవడం మాయావతికి తగని పని.
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఎత్తుగడలతోనే పని చేస్తుంది.
మాయావతి కూడా ఒక రాజకీయపార్టీ అధినేత్రే కదా!
ప్రజలలో సెంటిమెంట్ ఉన్నట్లయితే మాయావతి ఎత్తుగడ మంచి ఫలితాన్ని ఇవ్వొచ్చు.
బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి..
గురువు కాన్షీరాం ని మించిన శిష్యురాలు అనిపించుకుంది.
అంబేద్కర్ జపం అన్ని పార్టీలూ చేస్తున్నాయి.
జాతీయ మీడియా అగ్రకుల దురహంకారం తో మాయావతిపై వీలయినంత బురద చల్లుతుంటాయి.
అందుకే మాయావతి అవినీతిని బూతద్దంలో చూపెడుతుంటాయి.
విశేఖర్ గారు జోసెప్ స్టిగ్లిట్జ్ రాసిన “అమెరికా ఇప్పుడు టాప్ లో ఉన్న 1 శాతం ధనికులదే” ఆంగ్ల రచనకు మీరు చేసింది యధాతధ అనువాదమా?
బ్రహ్మణుడు మన పనివాడుగా ఉన్నా జాగ్రత వహించాలని మహత్మా జోతిబాపూలే సెలవిచ్చాడు..కాని బహెన్ జీ గారు qదికారం కోసం వారిని పక్కలోనే కూర్చోపెట్టుకుంటుంది….బహెన జీ గారు రాష్టాన్ని ఎటువైపు తిసుకెల్లదలచుకున్నదో వేచిచుడాలి.
డేవిడ్ గారూ, దాదాపు యధాతధ అనువాదమే. కొన్ని చోట్ల యధాతధ అనువాదం అర్ధ కాదు అని భావించి అర్ధం మారకుండా సొంత పదాలు వాడాను. ఐనప్పటికీ వ్యాసం అర్ధం కాలేదని కొంతమంది అన్నారు.
మాయావతి పై బురద జల్లడం నిజమే అయినా, ఆమె అవినీతి కూడా నిజమే.
దళిత ముఖ్యమంత్రిగా ఆవిడ పైన దళితులకు చేయవలసింది చాలా ఉంటుంది.
ఒక ముఖ్యమంత్రి భారత దేశ చట్టాల పరిధిలోనే దళితులకు ఎంతగా మేలు చేయవచ్చో నిరూపించగలిగిన అవకాశం మాయావతికి వచ్చింది.
కాని ఆమె దళితులకు చేస్తున్నది ఏమీ లేదు. కాకుంటే దళిత పెత్తందార్లను తయారు చేస్తోంది.
మాయావతి అవినీతిపరురాలు కాదు అని నేను చెప్పలేదు.
అవిడేమీ చంద్రమండలం నుండి ఊడి పడలేదు.
సోనియాగాంధి కూడా అవినీతిపరురాలని నేను అనుకుంటున్నాను.
కానీ.. జాతీయ మీడియాకి సోనియా గాంధి, యడ్యూరప్ప అవినీతి కన్నా మాయావతి అవినీతి ఎక్కువ కనిపిస్తుంది.
ఇక్కడ మనం జాతీయ మీడియా బయాస్ ని అర్ధం చేసుకోవాలి.
అవును రమణ గారూ, మాయావతికి సంబంధించి ఆ విషయంలో ఎవరికీ అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు.
మీరు రాసిన అంశాలకు నాది ఎడిషన్ మాత్రమే.
సోనియా గాంధి అవినీతిరురాలు కాకపోవడానికి అస్సలు అవకాశం లేదు.
దొరికినవాడు దొంగవుతున్నాడు. దొరకని వారు దొరలుగా చెలామణి అవుతున్నారు. అదే తేడా.
తప్పనిసరిగా మాయావతి విషయంలో బయాస్ ఉంటుంది. లేకపోతేనే వార్త.
జాతీయ మీడియా గ్లోబలైజేషన్ అనుకూల మీడియా. గ్లోబలైజేషన్ని బలంగా సమర్థించేవాళ్ళని తక్కువ అవినీతిపరులుగానూ, అంత బలంగా సమర్థించనివాళ్ళని ఎక్కువ అవినీతిపరులు గానూ చూపిస్తారు జాతీయ మీడియావాళ్ళు. MNCలు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ లాంటి నగరాలలోనే కార్యాలయాలు పెడతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ మాయావతి కూడా నరేంద్ర మోడీలాగ తన రాష్ట్ర రాజధానిలో MNC కార్యాలయాలు పెట్టించినా జాతీయ మీడియా ఆమెని కూడా పొగుడుతుంది, ఆమె చేసిన అవినీతిని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తుంది.
ఇక్కడ మీడియా బయాస్ ఒప్పుకోవాలంటే సదరు పెద్ద మనుషలకు నామోషీగా ఉంటుంది. తమ మనుసులోని కుళ్ళుని “అవినీతి వ్యతిరేకత” అనే అందమయిన పరదా తగిలించుకోక పొతే వాళ్ళు మనుగడ సాగించలేరు.
This is typical middle class morality. It is easier for them to claim they oppose Mayawati for her corruption than to expose their own hypocrital stance on caste.