కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -3


అక్టోబరు 15 తేదీనజరిగిన “ఆకుపై యూజీన్” ప్రదర్శనలో మంత్లీ రివ్యూపత్రిక ఎడిటర్ జాన్బెల్లమీ ఫాస్టర్పాల్గొని ప్రసంగించాడు. తన ప్రసంగంలో ఆమెరికాలో ఆదాయఅంతరాలపై ఆయన చెప్పిన కొన్నివివరాలు ఇలా ఉన్నాయి.

  • పైన ఉన్న ఒక శాతం మంది, అమెరికా మొత్తం ఆదాయంలో 25 శాతానికి సొంతదారులు.
  • పైన ఉన్న పది శాతం మంది, మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతానికి సొంతదారులు.
  • 1950, 1970 సం.ల మధ్య కాలంలో కింది 90 శాతం మంది సంపాదించిన ఒక్కొక్క డాలర్‌కుపైన ఉన్న 0.01 శాతం మంది 162 డాలర్ల చొప్పున సంపాదించారు.
  • 1990, 2002 సం.ల మధ్య కాలంలో కింది 90 శాతం మంది సంపాదించిన ఒక్కో డాలర్ కు, పైనఉన్న 0.01 శాతం మంది 18,000 డాలర్ల చొప్పున సంపాదించారు.
  • కింది 50 శాతం మంది (15 కోట్లు) సంపాదించిన మొత్తాన్ని ఫోర్బ్స్400 జాబితాలోని 400 మంది సంపన్నులు సంపాదిస్తున్నారు.
  • ద్రవ్య సంపదకు వస్తే పైన ఉన్న ఒక శాతం మంది అమెరికన్లు, కింది 80 శాతం అమెరికన్ల కంటే నాలుగు రెట్లు సంపద కలిగి ఉన్నారు.
  • 2008 ఆర్ధిక సంక్షోభంలో బడా కార్పొరేట్లకు 16 ట్రిలియన్ డాలర్లకు పైగా బెయిలౌట్లు, సహాయం అందించారు.
  • అధికారికంగాఅమెరికా నిరుద్యోగం 9 శాతంకాగా వాస్తవంలో అది రెట్టింపు ఉంది.నల్లవారిలో 16 శాతం, లాటినోలలో 11 శాతం అధికారిక నిరుద్యోగం ఉంది.
  • ప్రపంచజనాభాలో (ఏడు బిలియన్లు) 2.4 బిలియన్లు (240 కోట్లు) మంది నిరుద్యోగులు, పాక్షిక నిరుద్యోగులు, ఆర్ధికంగా చురుకుగా లేనివారుగా ఉన్నారు.
  • ప్రపంచ కార్మికుల్లో 39 శాతం మంది రోజుకి 2 డాలర్లకంటే తక్కువ సంపాదిస్తున్నారు.

అక్టోబరు 28 నాటికి ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం ప్రపంచవ్యాపితంగా ఉన్న 2355 నగరాలకు వ్యాపించినట్లుగా నివేదికలు అందాయి.

డిమాండ్లు, లక్ష్యాలు

ప్రదర్శనలలోఅనేక రాజకీయ భావాలు గలవారు పాల్గొంటున్నారు. ప్రారంభంలో యువతీ, యువకుకేపరిమితమైన హాజరు క్రమంగా సమాజంలో అన్ని వర్గాలవారు హాజరు కావడంమొదలుపెట్టారు.  ఇంటర్నెట్ లో సామాజిక నెట్ వర్క్ వెబ్ సైట్లలో చురుకుగాఉండేది ప్రధానంగా యువతీ యువకులే అయినందున వారి సంఖ్య ఇప్పటికీ అధికంగానేఉంది. అన్ని మతాలవారు -ముస్లింలు, క్రిస్టియన్లు, యూదులు- ఉన్నారు. మతపరమైనసర్వీసులు కూడా కేంపులలో నిర్వహిస్తున్నారు. ఆర్ధికంగా కూడా పలువర్గాలవారు ఆందోళనలో పాల్గొంటున్నారు. చిత్రం ఏమిటంటే అందరికంటే ఉన్నత స్ధానంలోఉన్న ఒక శాతంకు చెందిన వారు కూడా, పెద్ద సంఖ్యలో కాకపోయినా, పాల్గొంటున్నారు. వారు తాము ఒక శాతం లోకి వస్తామని ప్లెకార్డులుప్రదర్శిస్తున్నారు. తమ వద్ద సరిపోయినంత సొమ్ము ఉందనీ ప్రజలపైన వేసే బదులుతమపైన పన్నులు వేసి ఖజానా నింపుకోవాలని ముందూ వెనకా ప్లెకార్డులుతగిలించుకుని ప్రదర్శిస్తున్నారు. అంటే ఒక శాతం ధనికులలో సైతం నిజాయితీగాఆలోచిస్తూ తమ సంపదలను ప్రజలకోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సందేశంవీరి ద్వారా అందుతోంది. ఆందోళనకారులలో గణనీయమైన సంఖ్యలో అంటే కనీసం ముప్ఫైశాతం వరకు డెమొక్రట్ పార్టీకి సానుభూతిపరులుగానూ, ఒబామాకు మద్దతుదారులుగానూఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అది కొద్ది మంది వామపక్ష భావాలు గలవారుఉన్నారు.

ఆందోళనకారులకు నిర్ధిష్ట డిమాండ్లంటూ ఏమీ లేకపోవడం ఆకుపైవాల్‌స్ట్రీట్ఉద్యమానికి ఉన్న లక్షణాలలో కొట్టుచ్చినట్లు కనిపిస్తుంది.కాని ఆందోళనకారులు దానినే తమ బలంగా చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం.వారి ఉద్యమ లక్స్యంపై అనుమానాలు ఇక్కడ మొదలవుతున్నాయి. “డిమాండ్లా? డిమాండ్లు పెట్టేది టెర్రరిస్టులు. మాకేమీ డిమాండ్లు లేవు” అని నిర్వాహకులువ్యాఖ్యానించినట్లుగా పత్రికలు తెలిపాయి. అక్టోబరు ప్రారంభంలో డిమాండ్లురూపొందించుకోవాలన్న లక్ష్యంతో డిమాండ్స్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసికొన్ని డిమాండ్లు రూపొందించినప్పటికీ వాటికి తగిన ప్రాచుర్యం ఇవ్వలేదు.స్ధానిక మరియు ఫెడరల్ ప్రభుత్వాలు నెరవేర్చవలసినవిగా చెబుతున్న డిమాండ్లు:పబ్లిక్ సెక్టార్ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి. యూనియన్స్ధాయి వేతనాలను వారికి చెల్లించాలి. అందరికీ ఉచిత ప్రభుత్వ రవాణాసౌకర్యాలు కల్పించాలి. యూనివర్సిటీ విద్యవరకూ ఉచితంగా అందించాలి.సౌకర్యవంతమైన ఆరోగ్య భద్రతా పధకాలు అమలు చేయాలి. శుభ్రమైన కాలుష్య రహితశక్తి వనరుల కోసం విస్తృతమైన పరిశోధనలు చేపట్టాలి. ఈ చర్యల కోసం మిలట్రీబడ్జెట్ సగం తగ్గించి, ధనికులపైన పన్నులు పెంచాలి… మొదలైనవి. వర్కింగ్గ్రూపు ప్రతి పక్షం రోజులకు సమావేశమై డిమాండ్లను సమీక్షించాలనినిర్ణయించుకున్నారు. అయితే ఈ డిమాండ్లేవీ తక్షణం నెరవేర్చగల డిమాండ్లుకావు. అసలీ డిమాండ్లు నెరవేర్చడం అంటే వాల్ స్ట్రీట్ కంపెనీలు లాభార్జనధ్యేయంగా పెట్టుకోవడం మర్చిపోయి ప్రజా సంక్షేమమే లక్ష్యంగాపెట్టుకున్నట్లే. ఇటువంటి డిమాండ్లతో కూడిన నాయకత్వం లేని ఉద్యమం ఏపరిష్కారాలతో ముగిసేను? అసలు పరిష్కారం కోరకపోవడమే ఉద్యమం లక్స్యంగాఅనుమానం తలెత్తితే అది తప్పేమీ కాదు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈడిమాండ్లు కేవలం ఒక ఉత్సాహవంతుడు ప్రతిపాదించినవేననీ, మొత్తం ఉద్యమం ఈడిమాండ్లను ఆమోదించలేదనీ వీరి వెబ్ సైట్ (occupywallst.org) చెబుతున్నది.ఎక్కడికక్కడ జనరల్ అసెంబ్లీ లను ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలనిఉద్యమ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జనరల్ అసెంబ్లీలో కూడా నిర్ధిష్టవ్యక్తులు సభ్యులుగా ఉంటూ నాయకత్వం వహిస్తారన్న నియమం ఏమీ లేదు. జనరల్అసెంబ్లీ సమావేశాలకు ఎవరైనా హాజరు కావచ్చు. తమ అభిప్రాయాలను, ప్రతిపాదనలనుచెప్పాలనుకుంటున్న ఎవరైనా హాజరు కావచ్చు. సమావేశంలో ఆమోదం పొందితే అవేమరుసటి రోజునుండీ అమలవుతాయి. ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం జరుగుతున్నజుకొట్టి పార్కులో ప్రతి రోజూ సాయంత్రం పూట జనరల్ అసెంబ్లీ సమావేశాలుజరుగుతున్నాయి. సమావేశాల్లో ఎవరు ముందు మాట్లాడాలి అన్న అంశంలో ఒకవిధానాన్ని వీరు పాటిస్తున్నామని చెబుతున్నారు. సమాజంలో ఎవరికైతే అవకాశాలుఅత్యంత తక్కువగా ఉన్నాయో ఆ వర్గం వారికి మొదట మాట్లాడే అవకాశం లభిస్తుందట.తద్వారా సమాజంలో తమకు ఉన్న అనుకూల అవకాశాలను తెల్లవాళ్ళుఅంగీకరిస్తున్నట్లుగా వీరు భాష్యం చెబుతున్నారు. నల్లవాళ్లు, ఇతర వర్ణాలవాళ్లు (కలర్), స్త్రీలు, లాంటి తక్కువ అవకాశాలు ఉన్నవారికి మొదటి అవకాశంవస్తుందనీ, తెల్లవాళ్ళు చివరికి మాత్రమే మాట్లాడతారనీ చెబుతున్నారు.

ధనవంతులు, వాణిజ్యవర్గాలు

బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు లాంటి కంపెనీల అధికారులు ఒకరిద్దరుతప్ప ఈ ఉద్యమానికి సానుకూలంగా స్పందించడం విశేషం. చాలామంది మద్దతుఇస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలు చేసినా పరోక్షంగా ప్రస్తావిస్తూ సలహాలుకూడా ఇస్తున్నారు. పాల్సన్ అండ్ కో అనే బడా హెడ్జ్ ఫండ్ సంస్ధవ్యవస్ధాపకుడు ఉద్యమం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశాడు. “అత్యంత గొప్పగావిజయవంతమైన మన వ్యాపారాలను వీరు చెడ్డదిగా ముద్ర వేస్తున్నారు” అనివిమర్శించాడు. “న్యూయార్క్ లో పైన ఉన్న ఒక శాతం మంది మొత్తం ఆదాయపుపన్నుల్లో 40 శాతం చెల్లిస్తున్నారు. నగర ప్రజలకూ, దెశ ప్రజలకూ పెద్దఎత్తున సదుపాయాలు సమకూరుస్తున్నారు” అని వ్యాఖ్యానించాడు. సిటీ గ్రూప్అధిపతి విక్రమ్ పండిట్, నిరసనకారుల సెంటిమెంట్లు పూర్తిగా అర్ధంచేసుకోదగ్గవేననీ వాల్ స్ట్రీట్, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందనీపేర్కొన్నాడు. నిరసనకారుల డిమాండ్లతో సానుభూతి వహిస్తున్నట్లుగాపేర్కొన్నాడు.

మరో ద్రవ్య వ్యాపార సంస్ధ టోటల్ రిటర్న్ ఫండ్ప్రపంచంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్ధ. దాని అధిపతి బిల్ గ్రాస్, “99 శాతం చేత వర్గపోరాటమా? అవున్లెండి. 30 సంవత్సరాలపాటు గుళ్లను ఎదుర్కొనిఇప్పుడు ఎదురుతిరిగారు. చూద్దాం” అన్నాడు. పిమ్ కో సంస్ధ సి.ఇ.ఓ లలో ఒకరుమహమ్మద్ ఎల్-ఎరియన్, “కంపెనీల మనుషులు వాల్ స్ట్రీట్ ఉద్యమం ఏం చెబుతున్నదీవినవలసిన అవసరం ఉంది” అన్నాడు. జెఫ్ ఇమ్మెల్ట్ ప్రపంచ ప్రఖ్యాతఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ రియాక్టర్ల తయారీదారు జనరల్ ఎలెక్ట్రిక్సంస్ధకు అధిపతి. ఆయన, “ప్రజలు సహజంగానే కోపంతో ఉన్నారు. వారి సమస్యలనుఅర్ధం చేసుకుని సానుభూతితో ఉండాలి. జరుగుతున్న పరిణామాల పట్ల వారు గొప్పగాఏమీ భావించడం లేదు మరి” అన్నాడు. రే డేలియో, ప్రపంచంలో అతిపెద్ద హెడ్జ్ఫండ్ అయిన బ్రిడ్జివాటర్ అసోసియేట్స్సంస్ధ వ్యవస్ధాపకుడు. ఆయననైపుణ్యంతో కూడిన చర్చలు జరపలేకపోవడమే ఇప్పటి నెం. వన్ సమస్య. వారినిరాశా, నిస్పృహలను అర్ధం చేసుకోగలను. వారి డైలమాను అర్ధం చేసుకుంటాను.వారి అసంతృప్తిని కూడా అర్ధం చేసుకుంటాను” అని వ్యాఖ్యానించాడు. హాలీవుడ్సినీ నటీ నటులు అప్పుడప్పుడూ ఉద్యమ శిబిరాలను సందర్శించి ఉత్సాహరచడం ఒకకార్యక్రమంగా పెట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో పాటు యూరప్దేశాల ప్రభుత్వాధిపతులు కూడా అనేకమంది ఆకుపైఉద్యమానికి మద్దతు పలికారు.

లండన్ నగరంలో ప్రఖ్యాతి చెందిన సెయింట్ పాల్స్ కేధెడ్రల్ అనేపెద్ద చారిత్రక భవంతి వద్ద ఉద్యమం ప్రారంబించారు. ఈ భవనాన్ని రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇంతవరకు మూయనే లేదట. అలాంటిది ఈ ఉద్యమం ప్రారంభం అయ్యాకఉద్యమకారులను వెళ్లగొట్టడానికి రెండు మూడు రోజులు కేధెడ్రల్ ను మూసినట్లుగావార్తా సంస్ధలు పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి. కొన్ని పత్రికలుఅక్కడి పరిణామాలను ప్రతి గంటకొకసారి కవర్ చేస్తూ వార్తలు ప్రచురించాయి.పోలీసులను ఉపయోగించి సెయింట్ కేధెడ్రెల్ వద్ద ఉన్న ఉద్యమకారులనువెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ముగ్గురు మతసంబంధిత ఫాదర్ లు తమ తమ పదవులకి రాజీనామా చేసారు. ఈ రాజీనామాలు పెద్దవార్తలయ్యాయి. రాజీనామా చేసినవారు త్యాగమూర్తులయ్యారు. ఇటువంటి రాజీనామాలుఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో చూస్తూనే ఉన్నాం.

ప్రారంభంలోఉద్యమానికి జార్జ్ సోరోస్అనే అమెరికన్ బిలియనీర్ మద్దతు ఉందని పత్రికలురాశాయి. రాయిటర్స్ లాంటి పత్రికలు జార్జి సొరోసే దగ్గరుండినడిపిస్తున్నట్లుగా వార్తలు రాసింది. కాని జార్జి సోరోస్ తనకు ఉద్యమానికిఎటువంటి మద్దతు లేదని ప్రకటించాడు. అయితే జార్జి సొరోస్ కొన్ని ఎన్జీఓసంస్ధలను నిర్వహిస్తున్నాడు. అవి ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమంలో కీలకపాత్రపోషిస్తున్న విషయం కూడా బహిరంగ రహస్యంగా మారింది. మరికొందరు ధనికుల పేర్లుకూడా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని, పోషిస్తున్నారాని వార్తలువచ్చినప్పటికీ ఆ వార్తలకు పశ్చిమదేశాల కార్పొరేట్ పత్రికలు, ఛానెళ్లలో చోటుసంపాదించుకోలేకపోతున్నాయి.. పచ్చి మితవాద పత్రిక, వాల్ స్ట్రీట్ కంపెనీలకుఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా మద్దతు ఇచ్చే ఫాక్స్ న్యూస్ లాంటి ఛానెళ్ళుఉద్యమం పట్ల వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. ఇళ్లులేనివారినీ, రోడ్లపక్కనివాసం ఉండేవారినీ గంటకు పది డాలర్లు చొప్పున చెల్లించి జుకొట్టి పార్కులోకూర్చోబెడుతున్నారనీ, టీచర్ల సంఘం అని చెప్పి ఇల్లిల్లూ తిరిగి డొనేషన్లువసూలు చేస్తూ ఆ సొమ్ముని ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమానికి తరలిస్తున్నారనీవార్తలు ప్రచారం చేస్తున్నాయి. జుకొట్టి పార్కులో నిత్యం అన్నపానీయాలులభిస్తుండడంతో ఉద్యమంతో సంబంధం లేనివారు, అడుక్కునేవారు వచ్చిచేరుతున్నారనీ, వారిని ఎప్పటికప్పుడు గుర్తించి పంపించివేస్తున్నామని ఉద్యమనిర్వాహకులు ప్రకటించినమాట కూడా వాస్తవమే.

తెరవెనుక ఉన్నది ఎవరు?

ఉద్యమం మొదలైనా ఈ ప్రశ్న సహజంగానే ఉదయించాలి. కాని ఉద్యమాలనువిశ్లేషణాత్మకంగా పరిశీలిస్తున్నవారికి తప్ప వేరొకరికి ఈ అనుమానం రాకపోవడంసాధారణమైంది. అకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం తలవని తలంపుగా అకస్మాత్తుగాఊడిపడిందిగా కనపడుతోంది. అసలు ఏం జరుగుతున్నదో ఆర్ధం చేసుకునే లోపే అదుగో, అమెరికా అంతా వ్యాపించిందిఅని రాసేశారు. ఎవరు నాయకులు అన్నదానికిసమాధానంగా మాది నాయకత్వం లేని ఉద్యమంఅన్నారు. డిమాండ్లు ఏమిటి అనడిగితే, ‘ఛీ టెర్రరిస్టులకి కదా డిమాండ్లు ఉండేదిఅంటున్నారు. నాయకత్వం లేకుండానిర్ధిష్ట డిమాండ్ లేకుండా ఒక ఉద్యమం రెండు వారాల్లో ప్రపంచం అంతావ్యాపించడం సాధ్యమయ్యే పనేనా? ప్రపంచం అంతా కాకపోయినా రెండు ఖండాలకు, అమెరికా యూరప్ లకు, వ్యాపించడం సాధ్యమయ్యేపనేనా? అందునా పెట్టుబదిదారీవ్యవస్ధ బాగా ముదిరిపోయి ఉన్న దేశాల్లో వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాటం, రోజులు, వారాల్లో కనీసం నెలల్లోనైనా వ్యాపించి అభివృద్ధి చెందడం సాధ్యమయ్యేపనేనా?

గత ఆరు దశాబ్దాలుగా కార్మికవర్గ పోరాటాలని విజయవంతంగాఅణివేయడమే కాకుండా యూనియన్ల నాయకత్వాన్ని కూడా బ్యూరోక్రటైజ్ చేసి తమలోకలుపుకోగలిగిన అమెరికా, యూరప్ ల పెట్టుబడిదారీ పాలకవర్గాలు అంత తేలికగాఆకుపై వాల్ స్ట్రీట్ఉద్యమాన్ని అనుమతించాయా? ప్రపంచవ్యాపితంగా లెక్కకుమిక్కిలిగా వేగుల్ని నియమించుకుని, వందల సైనిక స్ధావరాలు నెలకొల్పుకునిప్రపంచవ్యాపితంగా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అక్కడికి పరిగెత్తగల మందీమార్బలం ఉన్న అమెరికా పాలకవర్గాలు అంత తేలికగా, అంత త్వరగా ఆకుపై వాల్స్ట్రీట్ఉద్యమవ్యాప్తికి అనుమతించారా? ఇంతకుముందు ఎవరికీ తెలియనికెనడాలోని యాడ్ బస్టర్స్ అనే సంస్ధ, స్పెయిన్ లోని ఇండిగ్నిడోస్ సంస్ధ, ఇంటర్నెట్ లో తప్ప మరో చోటు ఎరుగని -కనీసం వ్యక్తులు ఎవరో కూడా తెలియని-ఎనోనిమస్ సంస్ధ మూడూ కలిసి ప్రారంభిస్తే ఇంత పెద్ద ఉద్యమం రోజుల్లో పుట్టిఅభివృద్ధి చెందడం సాధ్యమవుతుందా?

ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే దానికంటే ముందుగాప్రపంచంలో తిరుగుబాట్లను వ్యాపారంగా మలచడంలో అద్భుతంగా సఫలీకృతమైన OTPOR, CANVAS అనే పేరుగల ఎన్.జి.ఓ సంస్ధల గురించి తెలుసుకోవలసి ఉంది. కెనడా నుండిగ్లోబల్ రీసర్చ్అనే సంస్ధను మైఖేల్ ఛోసుడోవ్‌స్కీ నిర్వహిస్తున్నాడు.ఈయన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఒక వెబ్ సైట్ నడుపుతున్నాడు.ప్రపంచవ్యాపితంగా ఉన్న ఎన్.జి.ఓ సంస్ధల కార్యకలాపాలపైన విస్తృత అధ్యయనంచేశాడు. ఆయన చెప్పిన వివరాలు, అరబ్ ఉద్యమాల నుండి అమెరికా ఆకుపై వాల్స్ట్రీట్ఉద్యమం వరకూ ఎన్.జి.ఒ సంస్ధలు నిర్వహించిన పాత్రపైన కళ్ళు తిరిగేవిషయాలను వెల్లడించాడు.

గత ముప్ఫై సంవత్సరాల కాలంలో యూరోప్ లో వివిధ పేర్లతో రాజకీయ పార్టీలను కూడాకార్పొరెట్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాయని మైఖేల్ ఛోసుడోవ్‌స్కీఅభిప్రాయపడుతున్నాడు. ఇరాక్, ఇరాన్, లిబియా, సూడాన్ తదితర దేశాలపైన రోగ్స్టేట్స్గా ముద్రవేసి లేనిపోని అబద్ధాలు, వక్రభాష్యాలు విస్తృతంగాప్రచారం చేయడం ద్వారా ఆ దేశాలకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని లేదాసమ్మతిని కార్పొరేట్ కంపెనీలు తయారు చేయగలిగాయి. ఆ సమ్మతి ని వివిధ దేశాలప్రభుత్వాల నుండే గాక ప్రపంచ ప్రజానీకం నుండి కూడా సంపాదించుకుని దేశాలపైనదురాక్రమణ యుద్ధానికి తెగబడ్డాయి నాటో దేశాలు. ఈ విధంగా కార్పొరేట్కంపెనీలు సమ్మతిని తయారు చేసుకున్నట్లుగానే అసమ్మతిని కూడా తయారుచేసుకున్నాయని చోసుడోవ్‌స్కీ చెప్పిన మాటల్లో నిజం ఉంది. ముఖ్యంగా రెండోప్రపంచయుద్ధం అనంతరం యూరప్ లో తలెత్తిన వామపక్ష భావాజాలాన్ని విజయవంతంగాపక్కదారి పట్టించడం లోనూ, నిర్వీర్యం చేయడంలోనూ కార్పొరేట్ కంపెనీలు, వారివేగులు చాలా మేరకు సఫలీకృతం అయ్యారు. అనేక ప్రగతిశీల ఉద్యమాలు క్రమంగాకార్పొరేట్ కబంధ హస్తాలలోకి ఇష్టపూర్వకంగానే చేరిపోయాయి. “స్వేచ్ఛామార్కెట్ వ్యవస్ధ (నయా ఉదారవాదం) నిజానికి వామపక్షాల ఏకాభిప్రాయం”ఛోసుడోవ్‌స్కీ అభివర్ణిస్తున్నాడు. ఫ్రాన్సులో సోషలిస్టు పార్టీగానీ, బ్రిటన్ లో లేబర్ పార్టీగానీ, జర్మనీ లో సోషల్ డెమొక్రట్స్ గానీ, లేదాఫ్రాన్సు జర్మనీలలోని గ్రీన్ పార్టీలు గానీ అన్నీ కూడా ప్రగతిశీల ఉద్యమాలనుపక్కదారి పట్టించడం ద్వారా ఉద్భవించిన రాజీ పూర్వక రాజకీయా పార్టీలే కావడంగమనార్హం.

అమెరికాలో బైపార్టిసన్ షిప్అనే పదబంధం తరచూ వినిపిస్తుంది. అమెరికా హౌస్ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో గానీ, సెనేట్ లో గానీ రిపబ్లికన్ లకూ, డెమొక్రట్లకూ మధ్య విభేధాలు తీవ్ర స్ధాయిలో ఉత్పన్నమయ్యి కొన్ని బిల్లులుఆమోదం పొందడం కష్టంగా మారుతుంది. ఏ పార్టీకీ తగిన మెజారిటీ లేనప్పుడుఇటువంటి పరిస్ధితి తరచుగా తలెత్తుతుంది. అటువంటప్పుడు తరచుగా బై పార్టీసన్షిప్అనే అస్త్రాన్ని బైటికి తీస్తాయి అమెరికా పాలకవర్గాలు. అంటే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను రూపొందించి మధ్యేమార్గంగా సమస్యపరిష్కారానికి కృషి చేయడం అన్నమాట. ఇది కూడా నిజానికి చట్ట సభల సభ్యులఅభిప్రాయాలను సానుకులంగా మలుచుకోవడం కిందికే వస్తుంది. హౌస్ ఆఫ్ కాంగ్రెస్ఉన్న రాజకీయ విభేధాల ఫలితంగానే బైపార్టీషన్ పరిష్కారం ఎంచుకున్నట్లుకనిపిస్తున్నప్పటికీ అది వాస్తవంగా కార్పొరేట్ వర్గాలు తెరవెనుక ప్రయత్నాలుచేయడం వల్లనే అటువంటి రాజీలు కుదుర్చుకుని అంతిమంగా కార్పొరేట్లప్రయోజనాలు అటంకం కలగకుండా సభ్యులు చూస్తున్నారు. ప్రధాన కార్పొరేట్లాబీయింగ్ గ్రూపులు ఇరు పార్టీలలో కూడా గణనీయమైన పలుకుబడి కలిగి ఉండడం వలనఇది సాధ్యమవుతున్నది.

అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ – కాంగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్” (ఎ.ఎఫ్.ఎల్-సి.ఐ.ఓ) కూడా అమెరికాలో వాలంటరీ ఆర్గనైజేషన్ లేదా ఎన్.జి.ఓసంస్ధగా 1955లోనే ఏర్పడింది. ఎ.ఎఫ్.ఎల్, సి.ఐ.ఓ అనే సంస్ధల విలీనం ద్వారాఏర్పడిన ఈ సంస్ధ కార్మిక వర్గ పోరాటాలకు ప్రత్యామ్నాయంగా అవతరించి చివరికికార్మిక పోరాటాలను బలహీన పరచడంలో సఫలం కాగలిగింది. ఎ.ఎఫ్.ఎల్-సి.ఐ.ఓ కుపోషకులు కార్పొరేట్ కంపెనీలే కావడం గమనార్హం. అమెరికాలో సంఘటిత కార్మికయూనియన్ల నాయకులు క్రమం తప్పకుండా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక‘ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం -డబ్ల్యూ.ఇ.ఎఫ్) సమావేశాలకు హాజరవుతారు. వారువ్యాపారస్ధుల రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై వారి పధకాలలో భాగస్వామ్యంవహిస్తారు. పై స్ధాయిలో జరిగే ఈ వ్యవహారాలకు భిన్నంగా కింది స్ధాయిలోవర్కర్లు ఎప్పటికప్పుడు యూనియన్లను తమ ప్రయోజనాలకు అనుగుణంగామార్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే అనేకచోట్ల కింది స్ధాయిలో కార్మిక వర్గ సమ్మెలు, ఆందోళనలు బద్దలవుతుంటాయి. ఇవిసంఘటిత రూపం తీసుకోకుండా యూనియన్ల అగ్ర నాయకత్వం జాగ్రత్తవహించడంతోనిర్ణయాత్మక రూపానికి కార్మికవర్గపోరాటాలు రాలేకపోతున్నాయి.

ప్రపంచం నిండా విస్తరించిన అనేక ఫౌండేషన్లను కార్పొరేట్ కంపెనీలునియంత్రిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అనేకపెద్ద, చిన్న ఎన్.జి.ఓ సంస్ధలు పౌర సమాజ సంస్ధలుగా కార్యకలాపాలునిర్వహిస్తున్నాయి. ఆర్ధిక సామాజీక వ్యవస్ధకు వ్యతిరేకంగా జరిగే నిరసనఉద్యమాలలో కూడా ఈ పౌర సమాజ సంస్ధలు పెద్ద ఎత్తున కార్యకలాపాలను చురుకుగానిర్వహిస్తున్నాయి. ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమంతో సహా అనేక ఉద్యమాలనునిర్వహించే సంస్ధలన్నీ కూడా తమ ఆర్ధిక వనరులను ప్రవేటు కార్పొరేట్సంస్ధలనుండే పొందుతున్నాయి. ప్రజలనుండి డొనేషన్లు వసూలు చేస్తున్నట్లుగాఫోజులు పెడుతున్నప్పటికీ ఆ నిధులు వీరికి సరిపోయే అవకాశమే లేదు.

ఉద్యమాలకు నిధులు సమకూర్చిపెడుతున్న కార్పొరేట్ ఫౌండేషన్లలో ఫోర్డ్ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, మెక్ ఆర్ధర్ ఫౌండేషన్, టైడ్స్ ఫౌండేషన్తదితర బడా కార్పొరేట్ కంపెనీల ఫౌండేషన్లు ఉన్నాయి. 1990 ల కాలంలో తలెత్తినప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలు వాల్ స్ట్రీట్ కంపెనీలను, రాక్ రెల్లర్, ఎట్ఆల్ లాంటి సంస్ధల టెక్సాస్ ఆయిల్ కంపెనీలనూ తీవ్రంగా వ్యతిరేకించాయి.అయినప్పటికీ ఫోర్డ్, రాక్ ఫెల్లర్, ఎట్ ఆల్ కంపెనీల ఫౌండేషన్లు, ఛారిటీసంస్ధలు సంవత్సరాల తరబడి ప్రగతిశీల పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలకు, పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీల వ్యతిరేకులయిన పర్యావరణ వాదులకు ఉదారంగా నిధులుసమకూర్చాయి. తద్వారా ఆయా ఉద్యమాల అంతిమ ఫలితం తమ కనుసన్నల్లోనే ఉండే విధంగాకార్పొరేట్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

గత దశాబ్దకాలంలో వివిధ దేశాల్లో వివిధ రంగుల పేర్లతో ఉద్యమాలు తలెత్తాయి. ఈఉద్యమాలు తలెత్తడానికి అమెరికాకి చెందిన “నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ‘ (ఎన్.ఎ.డి), ‘ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇనిస్టిట్యూట్ (ఐ.ఆర్.ఐ), ఫ్రీడంహౌస్ (ఎఫ్.హెచ్) లాంటి ఎన్.జి.ఓ సంస్ధలు వళ్ళు వంచి పనిచేశాయి. పూర్తిమద్దతు ఇచ్చి ప్రోత్సహించాయి. అవసరమైన నిధులను సమకూర్చిపెట్టాయి. ఈజిప్టుప్రజాస్వామిక ఉద్యమంలో కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల (పౌర సమాజసంస్ధలు) పాత్ర గణనీయంగానే ఉంది. కిఫాయా‘ (ఇక చాలు!) ఏప్రిల్ 6 యువజనఉద్యమంసంస్ధలు ఈజిప్టు ఉద్యమంలో ప్రముఖంగా పాలు పంచుకున్నాయి. ఈ సంస్ధలకుఅమెరికానుండి పని చేసే ఛారిటీలు, ఫౌండేషన్లు నిధులు అందించి మద్దతుతెలిపాయి. అదే కాకుండా వీటికి అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ (స్టేట్డిపార్ట్‌మెంట్) అనుమతి కూడా ఉన్నదని గ్లోబల్ రీసెర్చ్సంస్ధవెల్లడించింది. అసమ్మతిని ఈ సంస్ధలు ఒక క్రతువులాగా మార్చివేశాయని గ్లోబల్రీసెర్చ్ సంస్ధ వెల్లడించింది. మతపరమైన తంతులాగ జరిగే ఈ నిరసనలకు పెద్దఎత్తున మీడియా కవరేజి కూడా దొరుకుంది. కార్పొరేట్ వార్తా సంస్ధలు, టి.వీఛానెళ్ళు, ఇంటర్నెట్ లలో కూడా ఇవి ప్రచారం పొందేలా ఖచ్చితమైన పధకాలురూపొందించబడతాయి.

ఫ్రీడం హౌస్” సంస్ధ ఆధ్వర్యంలో ముబారక్ వ్యతిరేక ఉద్యమకారులు, అసమ్మతివాదులు మే 2008 నెలలో అమెరికా సందర్శించిన ఫొటోను పీపుల్ అన్‌లైక్అస్అనే వెబ్ సైట్ గత అక్టోబర్ 14 తేదీన ప్రచురించింది. అప్పటి సెక్రటరీఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ను వీరు కలుసుకున్న ఫొటోలను సదరు వెబ్ సైట్ప్రచురించింది. రైస్ తో పాటు వీరు వైట్ హౌస్ కి జాతీయ భద్రతా సలాహారుగాఉన్న స్టీఫెన్ హాడ్లీ ని కూడా కలిసిన విషయాన్ని ఆ వెబ్ సైట్ వెల్లడించింది.సరిగ్గా సంవత్సరం తర్వాత అంటే మే 28, 2009 తేదీన, రైస్ ను కలిసిన ఈజిప్టుఅసమ్మతి బృందమేమారిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ను కలిసినఫొటోను కూడా వెబ్ సైట్ ప్రచురించింది. అంటే అమెరికా సామ్రాజ్యవాదపాలకవర్గాలు ఒకవైపు ముబారక్ నియంతృత్వాన్ని, అతని అత్యాచారాలతో సహాసమర్ధిస్తూనే మరొక వైపు అతనికి వ్యతిరేకంగా తలెత్తిన ప్రతిపక్ష శక్తులనూ, అసమ్మతికి కూడా మద్దతు ఇస్తూ వచ్చిందని గమనించవలసి ఉంది. హోస్నీ ముబారక్నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం ఆరంభంలో జరిగినప్రజాస్వామిక శాంతియుత తిరుగుబాటులో ప్రముఖపాత్ర పోషించిన సంస్ధల నాయకులనుదాదాపు మూడు సంవత్సరాల క్రితం నుండే అమెరికా సంబంధం పెట్టుకున్నదనిదీనిద్వారా అర్ధం అవుతున్నది. ఈజిప్టు, ట్యునీషియాలలో ఉద్యమాలుతలెత్తినపుడు, నియంతలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అమెరికా వేగుసంస్ధ సి.ఐ.ఏ పసికట్టడంలో విఫలమయ్యిందని కార్పొరేట్ పత్రికా సంస్ధలు, కొన్ని స్వతంత్ర సంస్ధలు కూడా వార్తా విశ్లేషణలు ప్రచురించాయి. శక్తివంతమైనగూఢచార సంస్ధగా పేరొ పొందిన ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ సైతం అరబ్ప్రజల్లో అలజడిని పసికట్టలేక పోయాయని అనేక రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈవిశ్లేషణల్లో కొన్ని నిజాయితీ విశ్లేషణలు ఉన్నప్పటికీ కార్పొరేట్విశ్లేషణలు నిజానికి తిరుగుబాట్లలో పాల్గొన్న సంస్ధలతో అమెరికాకు సంబంధంలేదని ఒక ఎలిబీ సృష్టించుకోవడానికి జరిగిన విశ్లేషణలా అని ఇప్పుడుఅనుమానించవలసి వస్తోంది.

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s