సౌమ్య రేప్‌ కేసు నిందితుడికి మరణ శిక్ష


soumya_train_rape_caseతమిళనాడులో ఇరవై మూడేళ్ళ స్త్రీని రేప్ చేసి హత్య చేసిన నేరానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. గత ఫిబ్రవరి నెలలో నిందితుడు వేగంగా పోతున్నరైలు నుండి బాధితురాలు సౌమ్యను తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన సౌమ్యపై రైలు పట్టాలపైనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ముప్ఫై ఏళ్ల నిందితుడు గోవింద చామి అత్యంత క్రూరమైన పద్ధతిలో నేరాలకు పాల్పడ్డాడనీ, ఏ మాత్రం దయకు పాత్రుడు కాడని జడ్జి రవీంద్రబాబు తీర్పు చెపుతూ పేర్కొన్నాడు. అత్యంత క్రూరంగా, దారుణంగా బాధితురాలిపైన నేరానికి పాల్పడ్డాడని జడ్జి పేర్కొన్నాడు. మరణ శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా నిందితుడికి విధించాడు. ఇతర సెక్షన్ల క్రింద కఠిన కారాగార శిక్షను కూడా జడ్జి విధించాడు.govindhacha

అక్టోబరు 31 న నిందితుడు దోషిగా తేలినట్లుగా కోర్టు ప్రకటించింది. ఐ.పి.సి సెక్షన్ 302 (హత్య), 376 (రేప్), 394 (దొంగతనానికి పాల్పడుతూ లేదా దొంగతనానికి ప్రయత్నిస్తూ గాయపరచడం), 397 (దొంగతనం లేదా దోపిడీకి పాల్పడుతూ చావు సంభవించేలా లేదా తీవ్రంగా గాయపరిచేలా చేయడం), 447 (నేరపూరిత చొరబాటు)  కింద శిక్షలు విధించబడ్డాయి.

ఫిబ్రవరి ఒకటిన మహిళల కంపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉన్న సౌమ్యపైన గోవింద దాడి చేసాడు. వల్లతోల్ నగర్ స్టేషన్ దాటిన వెంటనే రైలు నుండి బాధిత మహిళను కిందికి తోసివేశాడు. ఆ తర్వాత రైలు పట్టాలవైపుకి తీసుకెళ్ళి గాయపడిన స్ధితిలోనే ఆమెపైన క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సౌమ్య ఫిబ్రవరి 6 తేదీన మరణించింది.

నిందుతుడు నేరాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నాడని ప్రాసిక్యూషన్ వాదించింది. తమిళనాడులో 2004, 2008 మధ్య ఎనిమిది నేరాలకు పాల్పడ్డట్టుగా సాక్ష్యాలు సమర్పించింది.

నేరం జరిగిన పది నెలల్లోనే శిక్ష పడడం గొప్పవిషయం.

13 thoughts on “సౌమ్య రేప్‌ కేసు నిందితుడికి మరణ శిక్ష

 1. శ్యామలరావుగారు, ఏం జరిగిందో తెలియదు గానీ, సౌమ్య కేసు పై రాసిన పోస్టు స్ధానంలో విజయ్ మాల్యా పోస్టు వచ్చి చేరింది. అంటే పాత పోస్టు స్ధానంలో కొత్త పోస్టు అప్ డేట్ అయ్యింది. కాని మీ, నా వ్యాఖ్య లు అలానే ఉండిపోయాయి.

  సౌమ్య పోస్టుని వెతికి పట్టుకుని మళ్ళీ కొత్త పోస్టుగా వేశాను. ఆ వ్యాఖ్యలను కూడా ఇక్కడికి మార్చడానికి కుదురుతుందో లేదో ప్రయత్నిస్తాను.

  Posted by visekhar | నవంబరు 11, 2011, 8:04 సాయంత్రము | edit

 2. anni kesulu intha thondaraga thelithe nerastulu thappinchukodaniki chattanni addupettukuni escape avadaniki veelundadu anni kesulu ilage theliste e rajakeeyanayakudu e donga vedava e nerastudu thappu cheyyadaniki bhayapadathadu thanks to judiciary

 3. బాగుంది. నా వ్యాఖ్యలని నేను ఆశువుగా వ్రాసాను. మళ్ళీ పునశ్చ హరిః ఓం అనేంత తీరిక ఓపిక నాకు లేవని మనవి.

 4. మీరు భయపడిన కోరిక నేను కోరలేదు లెండి.
  కాని, అక్కడి నుండి వ్యాఖ్యల్ని ఇక్కడికి తేవడం ఎలాగో నాకు అర్ధం కాలేదు.
  జరిగిన పొరబాటుకి క్షంతవ్యుడ్ని.

 5. అవును కదండీ, అందుకే కోర్టులన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మారాలని ఓ గొంతెమ్మ కోరిక కోరాను.

 6. తాడిగడప శ్యామలరావు గారు మీ వ్యాఖ్యను ఇక్కడికి మార్చటం తేలికే. మీరు మళ్ళి వ్రాయవలసిన పనిలేదు. లిక్కర్ కింగులో వచ్చిన వ్యాఖ్యను కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యటమే…మీ వ్యాఖ్య ఇక్కడుంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో స్వతంత్రించి ఇక్కడ వచ్చేటట్లు చెస్తున్నాను. ఏమి అనుకోకండి.

  తాడిగడప శ్యామలరావు గారి వ్యాఖ్య:
  —————————————————————————————————————————————
  “శిక్ష పడింది సరే!
  ఇంకా యెంత తతంగం ఉంది.
  ఈ శిక్షపై రకరకాల అప్పీళ్ళు చేస్తారు ముద్దాయి తరపువారు.
  సుప్రీం కోర్టు దాకా అప్పీళ్ళు సడుస్తాయి.
  మరణ శిక్ష క్రూరాతిక్రూరం అని మానవహక్కుల సంఘాల వాళ్ళు నానా యాగీ చేస్తారు.
  దేశవ్యాప్తంగా చర్చ రేగుతుంది.
  అసలు మరణ శిక్షను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచే తొలగించి తీరాలని మేధావి వర్గాలు గోలగోల చేస్తారు.
  ఈ లోపల ముద్దాయి పైన కుట్ర జరిగిందనీ అతడూ సాక్షాత్తూ గౌతమబుధ్ధుడికే గురుత్వం వహించగల మహాత్ముడనీ ప్రచారం ఊపందుకుంటుంది.
  సామాన్యులలో కూడా తగినంత సానుభూతి కలిగేలా మీడియా అతి కూడా తోడ్పడుతుంది.
  చివరకు యెన్నో యేళ్ళ తరువాత మరణశిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేస్తుంది.
  మళ్ళా యాగీ మొదలవుతుంది మరణశిక్ష మానవత్వానికే కళంకం అని.
  ఘనత వహించిన ముద్దాయిగారు చేసేది లేక న్యాయవాదుల సలహా మేరకు రాష్ట్రపతికి ‘క్షమాభిక్ష’ కోసం విజ్ఞప్తి చేసుకుంటాడు.
  పది యేళ్ళకో పాతికేళ్ళకో అది తిరస్కరించబడుతుంది.
  మరొక నాలుగైదు యేళ్ళకి ఉరికి తేదీ ఖరారు చేయబడుతుంది.
  ఒకవేళ ఇంకా అప్పటికి ముద్దాయి వయఃప్రభావం కారణంగా సహజమరణం పొందకపోతే అతడిని ఉరతీయవచ్చు.
  వచ్చు అనటం యెందుకంటే అతడు సంపూర్ణారోగయంతో ఉండాలిగా మరి అతడిని ఉరి తీయాలంటే!
  అదీ సంగతి.
  ముద్దాయి మరణశిక్ష నిలిచి పోయే మరో దారి కూడా ఉంది.
  అతడు భయంకరమైన తీవ్రవాది అని ఋజువైతే అతడిని పెళ్ళికొడుకులా యావజ్జీవం మేపడం తప్ప మన ప్రభుత్వం చచ్చినా ఉరితీసే సాహసం చేయదు.

  POSTED BY తాడిగడప శ్యామలరావు | నవంబరు 11, 2011, 3:33 సాయంత్రము
  ————————————————————————————————————————————

 7. రాధాక్రిష్ణగారూ, నా తరపున కూడా మీకు కృతజ్ఞతలు. నా కంప్యూటర్ లో నేను ఎప్పుడూ లాగిన్ అయ్యే ఉంటాను. అందువలన వేరొకరిగా కామెంట్ రాయడం కుదరదు. లాగౌట్ ఐనా సరే, కామెంటు కాపి చేసి పోస్ట్ చెస్తే లాగిన్ అయి నిరాకరిస్తోంది.

 8. పైన శ్యామలరావు గారి వ్యాఖ్యకు నేను ఇచ్చిన సమాధానం ఇది:
  ————————————————————–

  శ్యామలరావు గారూ మీ ఆవేదన న్యాయమైనది.
  మరణ శిక్ష వేశాక, అది తప్పని తేలితే, సరిదిద్దు కోవడానికి వీలుండదన్నది మానవ హక్కుల సంఘాల వాదన.
  అదీ కాక శిక్ష అన్నది నిందుతులను లేదా దోషులను సంస్కరించేదిగా ఉండాలి తప్ప దోషుల్ని నిర్మూలించేదిగా ఉండకూడదన్నది వారి వాదన.
  నిజం కూడా అదేనేమో కదా?
  న్యాయ వ్యవస్ధల లక్ష్యాన్ని (సంఘ సంస్కరణ) బట్టి చూసినా అది మరణ శిక్ష వలన చేకూరదు.
  వందకు పైగా దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయని విన్నాను.
  మీరు చెప్పింది మన న్యాయవ్యవస్ధ వైఫల్యం తప్ప మొత్తంగా న్యాయ వ్యవస్ధ వైఫల్యం కాదు కదా.
  మన న్యాయ వ్యవస్ధ వైఫల్యం వేరు, మరణ శిక్షలను రద్దు చేయాలన్న వాదనలు వేరు.
  రెండింటినీ వేరు వేరుగా చర్చించాల్సిన విషయాలని నాకనిపిస్తోంది.

 9. నా సమాధానానికి శ్యామలరావు గారు మళ్ళీ ప్రతి వ్యాఖ్య చేశారు. అది ఇదే:
  —————————————————————————-

  మీ పేరు బహుశః వి.శేఖర్ గారు అనుకుంటాను. మీ ప్రతిస్పందనలో కూడా ఆలోచించదగిన విషయాలున్నాయి. మరణశిక్ష పొరపాటని తేలితే దిద్దుకోవటానికి వీలు దొరకదు. చాలా నిజం. ఒప్పుకోవలసిందే.

  చేయని నేరాలకు కారాగారంలో మగ్గుతున్న అమాయకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వారి ప్రాణాలు పోలేదు. కాని వారి పరువు ప్రతిష్టలు పోయాయి. వారి విలువైన వృత్తివ్యాపారాలు పోయాయి. వారి అమూల్యమైన జీవనకాలం బలంతంగా వ్యర్ధం చేయబడింది. నిజానికి వారి ఉనికి వారికే అసహ్యం అనిపింవే పరిస్థితిలో ప్రాణమున్న బొమ్మల్లాగానో, మానవమృగాల్లాగానో బ్రతికించి ఉంచబడ్డారు. పైగా ఆ కాలం అంతా వారి మాటకు యేమీ విలువ యివ్వకుండా వారిని యధాశక్తి సంస్కరించే కార్యక్రమం కూడా క్రూరంగా అమలు జరిగింది. సరే, యిటుంవంటి ఒక వ్యక్తి నిర్దోషి అని అదృష్టవశాత్తు నిరూపించబడితే, అప్పుడు నాశనమైన అతని జీవనసర్వస్వం తిరిగి వెనక్కు వచ్చేస్తున్నదా?

  అలాగు జైలుశిక్షకూడా పొరపాటని తేలితే దిద్దుకోవటానికి వీలు దొరకని శిక్ష అని తేలటంలేదా? సారీ చెప్పి (పోనీ కాస్త నష్టపరిహారంకూడా యిచ్చి) నరప్రపంచంలోకి వదిలేస్తే ఆ మానవమాత్రప్రాణికి గౌరవనీయమైన జీవితం దొరుకుతుందా? ప్రభుత్వాలూ, కోర్టులూ అటువంటి యేర్పాటు చేయగలవా? జైలు శిక్షకూ ఉరిశిక్షకూ వేరువేరు వాదనలెందుకు? పొరబాటున జైలుశిక్ష అవకాశం కన్నా పొరబాటున ఉరిశిక్ష అవకాశం స్వల్పాతిస్వల్పం.

  పిచ్చికుక్కలాంటి ప్రమాదకరవ్యక్తుల మానవహక్కులగురించి కలవరించటంలో సవ్యత నాకు కనిపించటంలేదు. అటువంటివారికి నిజానికి యే యావజ్జీవమో అని ఒక శిక్షవేసి దానిని 14 సంవత్సరాలతో సరిపుచ్చి (అలా 14సం. రూలు యేమీలేదని సుప్రీంకోర్టువారి తీర్పు ఒకటుందని గుర్తు) ఆ పైన యేవో పైరవీల పుణ్యమా అని హఠాత్తుగా సత్ప్రవర్తన అనే అసహ్యకరమైన మిషమీద యే గాంధీజయంతికో ఆగష్టు పదహేను పండక్కో వదిలేస్తుంటే సమాజం పరస్థితి యేమిటి? ఇక కుటుంబాన్నో, పదికుటుంబాలనో భీకరంగా నరికిచంపిన వీరుడికి మరణశిక్ష వేయరాదన్న గొప్ప కారణంగా యావజ్జీవ శిక్ష వేసి చివరికి నాలుగైదు యేళ్ళకి వాడిని పూలదండలువేసి వదిలిపెట్టితే అతడు సమాజానికి మరెంత హాని చేస్తాడో తట్టదా యెవరికీ? అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన పాపఅనికి స్వస్తిశ్రీ కోర్టువారు, స్వస్తిశ్రీ దొరతనంవారు కలిసి క్రూరమరణశిక్ష విధిస్తున్నట్లు తేలటంలేదా? మానవహక్కుల గురించి గోల పెట్టేవారికి మాత్రం యీ ప్రమాదకర వ్యక్తుల హక్కుల పవిత్రత యితర సామాన్యజనానికి కూడా మానవహక్కులున్నాయన్న విషయం పూర్తిగా విస్మరించేంత గొప్పవి!

  ఇదంతా మన న్యాయవ్యవస్థ వైఫల్యం మాత్రమేకాదు. మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం కూడా కదా? అందుకే నిస్సిగ్గుగా హంతకులను పరామర్శించటానికి రాజకీయనాయకులు జైళ్ళని పావనం చేస్తుంటారు! దొరతనం తమవారి చేతులో ఉంటే హాయిగా విడిపించుతూ ఉంటారు లొసుగుల ఆధారంగా!

  ప్రజలమానప్రాణాలకు రక్ష ఉండాలంటే మరణశిక్షలు తప్పకుండా ఉండాలి. అమలు చేయాలి కూడా.

  మరణశిక్షను రద్దుచేసిన అనేక దేశాల్లో వ్వవస్థ బలంగా ఉందా లేదా? ఈ శిక్ష పడ్డవాళ్ళు కూడా సులభాతి సలభంగా నాగరిక ప్రపంచంలోకి రొమ్ములు విరుచుకుంటూ వచ్చేయగలుగుతున్నారా?

  శిక్షల ఉద్దేశ్యం సంస్కరించటం ఒక్కటే కాదు. సమాజాన్ని ప్రమాదకరమైన నేరాలు నేరస్థలునుండి రక్షించటం కూడా? కాదంటారా?

 10. శ్యామలరావుగారి ప్రతి వ్యాఖ్యకు నేను మళ్ళీ మరో వ్యాఖ్య జత కలిపాను. అది ఇదే:
  ———————————————————————————–

  నేరాలు, శిక్షలు గురించి మాట్లాడుకుంటున్నాం గనక న్యాయ వ్యవస్ధ వైఫల్యం అన్నాను గానీ, నిజానికి మీరన్నట్లు, ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజికార్ధిక వ్యవస్ధ నేరస్ధుల పుట్టుకను గ్యారంటీ చేస్తోంది.
  వ్యవస్ధ నేరాలకు ప్రాణం పోస్తున్నపుడు కేవలం వ్యక్తులని నేరాలకు ఏకైక భాధ్యులుగా చేయలేం. అందుకే సంస్కరణల గురించి మాట్లాడుకోవడం.
  మీరన్నట్లు వ్యవస్ధ బలంగా ఉంటే నేరాలకు అవకాశం తగ్గుతుంది. అంటే వ్యవస్ధలోని ప్రతి ఒక్కరి జీవనానికి, అది కూడా గౌరవపూరితమైన జీవనానికి అవకాశం ఉన్నపుడు నేరాలు తగ్గుతాయి.
  వ్యవస్ధ లోని వివిధ అంగాలు, విద్య దగ్గర్నుండి సంస్కృతి వరకూ, ఆరోగ్యకరంగా ఉన్నపుడు నేరాల అవకాశం తగ్గుతుంది.
  ఇవన్నీ అమలు చేయవలసింది, రాజకీయ వ్యవస్ధ.
  కాని రాజకీయ వ్యవస్ధ నేరస్ధులతో నిండిపోవడంతో వారు నేరాలు జరగకుండా విద్యా, సాంస్కృతిక రంగాలను తీర్చిదిద్దడం జరగని పని.
  నిజాయితిగా చెప్పుకుంటే, వ్యవస్ధ మార్చుకోవడం ఒకటే మనకు కనిపిస్తున్న పరిష్కారం. అది మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఉంది.

 11. మొత్తం మీద రాధాకృష్ణగారి సూచనను అనుసరించి అక్కడి వ్యాఖ్యలను యధాస్ధానానికి తెచ్చేసాను. మరొకసారి ఆర్.కె గారికి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s