ఫ్యూడల్ రాజుల కాలం పోయి, ‘ప్రజాస్వామ్య’ రాజుల కాలం వచ్చింది. ఇద్దరూ రాజులే కనుక రోం నగరం తగలబడుతున్నపుడు ఇద్దరూ ఫిడేలే వాయిస్తున్నారు. ప్రజల పట్లా, వారి సమస్యల పట్లా అప్పటి రాజు దృక్పధం ఎలా ఉన్నదో, ఇప్పటి రాజుల దృక్పధం కూడా అలానే ఏడుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ ధనికులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకే రాజు వద్ద అగ్ర స్ధానం. వారికోసమే రాజ్యాలూ, రాజ్యపాలనానూ. అప్పటికీ, ఇప్పటికీ ఆకలి, దరిద్రం, కరువూ అన్నీ ప్రజల సొత్తే. ఇటలీ విషయంలో అప్పుడు “నీరో” ఐతే ఇప్పుడు “సిల్వియో బెర్లుస్కోని.” రుణ సంక్షొభంతో అల్లాడుతున్న ఇటలీ ప్రజానీకానికి ప్రధాని బెర్లుస్కోని ఏమీ చేయకపోగా కోతలు, వాతలు అమలు చేస్తున్నాడు.
–