ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని మెజారిటీ కోల్పోవడంతో రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ దశలో సహాయం కోసం యూరప్, ఐ.ఎం.ఎఫ్ వంక చూస్తోంది. జి20 సమావేశాల్లో ఇ.యు, అమెరికా, ఎమర్జింగ్ దేశాలు, ఐ.ఎం.ఎఫ్ లు అన్నీ కలిసినా యూరప్ సమస్యకు చిల్లులు పడిన లైఫ్ బోట్ మాత్రమే సహాయంగా పంపగలిగాయి.
–