ఆర్ధిక మాంద్యానికి (రిసెషన్) చేరువలో ఇంగ్లండు


యూరప్‌లో అతి పెద్ద ద్రవ్య మార్కెట్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బ్రిటన్ ఆర్ధిక మాంద్యం కు చేరువలో ఉందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. మూడో క్వార్టర్ (జులై, ఆగస్ఠు, సెప్టెంబరు)లో ఆర్ధిక వృద్ధి అనుకున్నదాని కంటె మెరుగ్గానే ఉన్నప్పటికీ నాలుగో క్వార్టర్ లో అది బాగా క్షీణించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ మంగళవారం విశ్లేషించింది. యూరోజోన్ రుణ సంక్షోభం ఇంకా శాంతించకపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ పై చూపుతున్నదని ఆ సంస్ధ విశ్లేషించింది.

మూడో క్వార్టర్ లో బ్రిటన్ జిడిపి 0.5 శాతం వృద్ధి చెందింది. అర శాతం జిడిపి వృద్ధినే అంచనాలకు మించి వృద్ధి చెందిందనీ, వృద్ధి బలంగా ఉందనీ వ్యాఖ్యానించడాన్ని బట్టి పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఎటువంటి స్ధితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. చైనా నమోదు చేస్తున్న 9.5 శాతం వృద్ధి, ఇండియా నమోదు చేసిన 7.6 శాతం వృద్ధిలతో పోలిస్తే ఇంగ్లండు వృద్ధి ఎక్కడో సుదూరాన ఉన్నప్పటికీ అర శాతం పెరుగుదలను సైతం శక్తివంతమైన వృద్ధిగా సంతోషపడవలసిన పరిస్ధితి దాపురించింది.

బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో ప్రజలపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో తీవ్రమైన కోతలను బ్రిటన్ కన్జర్వేటివ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దానితో వినియోగం తగ్గిపోయి ఉత్పత్తి తగ్గిపోవడంతో అది మొత్తంగా జిడిపి తగ్గిపోవడానికి దారి తీస్తోంది. అంటే బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ పొదుపు విధానాల వలన కుదించుకుపోతున్నది. రెండు క్వార్టర్ల పాటు వరుసగా నెగిటివ్ ఆర్ధిక వృద్ధి నమోదు చేసినట్లయితే ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యం (రిసెషన్) లోకి జారినట్లుగా పేర్కొంటారు.

మూడో క్వార్టర్ లో వృద్ధి శక్తివంతంగా ఉందని చెబుతున్నప్పటికీ అక్టోబరు నెలలో పారిశ్రామిక వృద్ధిని సూచించే పి.ఎం.ఐ సూచి బాగా పడిపోయిందనీ, జూన్ 2009 తర్వాత ఇంత తక్కువ నమోదు కావడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. జూన్ 2009 లో బ్రిటన్ రిసెషన్ లో ఉండడం గమనార్హం. బ్రిటన్ రెండవ క్వార్టర్ (మే, జూన్, జులై) లో కేవలం 0.1 శాతం వృద్ధి చెందింది. జపాన్ భూకంపం, సునామీల వలన సరఫరా గొలుసు దెబ్బతినడం వలన ఆర్ధిక వృద్ధి పడిపోయిందని విశ్లేషకులు అప్పట్లో పేర్కొన్నారు. మళ్ళీ అదే రేటు నాలుగో క్వార్టర్ లో నమోదు కావచ్చని అనుమానిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకు, తాజాగా కొత్త ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ పధకం మంజూరు చేయడానికి నిర్ణయించుకున్నట్లుగ తెలిసింది. 75 బిలియన్ పౌండ్ల మేరకు ఆర్ధిక వ్యవస్ధలో చొప్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. యూరో సంక్షోభం బ్రిటన్ ను మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మార్కేట్ విశ్లేషకులు, కంపెనీలు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరాయి.

యూరో జోన్ దేశాలు గత వారం గ్రీసు సంక్షోభంపై కుదుర్చుకున్న ఒప్పందాన్ని తమ దేశంలో రిఫరెండంకు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంతో, అది ఆమోదం పొందుతుందో లేదో అన్న అనుమానంతో మార్కెట్లు పెద్దగా స్తంభించడం లేదని భావిస్తున్నారు. నిరుద్యోగం పదిహేడు నెలల గరిష్ట స్ధాయికి చేరుకోవడంతో ఉద్యోగ భద్రత పెద్ద సమస్యగా ముందుకొచ్చింది. పొదుపు చర్యలను ఆపాలని ప్రజలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం వినే పరిష్దితిలేదు. బ్రిటన్ మాంద్యం తలెత్తినట్లయితే అది అక్కడితో ఆగబోదు. ప్రపంచంలో న్యూయార్క్ తర్వాత రెండో పెద్ద ద్రవ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన లండన్ లో మాంద్యం ప్రపంచవ్యాపితంగా ప్రభావమ్ చూపక మానదు.

4 thoughts on “ఆర్ధిక మాంద్యానికి (రిసెషన్) చేరువలో ఇంగ్లండు

 1. we cant compare growth rates between emerging economies and staturated economies.

  if you observe carefully, europe economy has never grown more then 2% even in most favourable conditions, but that 2% means quite a lot as these are bigger economies when compared other countries.

  even for india or china, it would not be possible to grow around 10% once they become stabilised economies, you can find the same trend for us, where 4% is considered a big.

 2. నిజమే. పోలిక తగినది కాదు. కాని మీరు చెప్పిన కోణంలో పోల్చకూడదని చెప్పలేము. స్ధిర ఆర్ధిక వ్యవస్ధలు అని మీరు చెప్పినది వాస్తవం కాదు. ఇంకా చెప్పాలంటే అమెరికా, యూరప్ లతో పోల్చితే ఇండియా, చైనాల ఆర్ధిక వ్యవస్ధలే సాపేక్షికంగా స్ధిరంగా ఉన్నాయి. అమెరికా, యూరప్ లను రుణ సంక్షోభాలు వెంటాడుతుండగా, స్లో గ్రోత్ వల్ల అమెరికా మాంద్యంలోకి వెళ్తుందని అంతా భయపడుతున్నారు. అసలు ఇప్పటికే అవి మాంద్యంలో ఉన్నాయని కూడా కొందరు (అమెరికన్ ఎకనమిస్ట్ నౌరుబి) ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. కనుక అమెరికా, యూరప్ లు స్ధిర ఆర్ధిక వ్యవస్ధలని చెప్పలేము.

  పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు అన్న మీ వాదన కూడ చైనా విషయంలో అతకడం లేదు. గత సంవత్సరం చైనా జిడిపి $5.9 ట్రిలియన్లు. ఇంగ్లండు జిడిపి $2.25 ట్రిలియన్లు. కాని చైనా వృద్ధి 9 శాతం పైనే ఉంటే, ఇంగ్లండ్ వృద్ధి 1, 2 శాతం మధ్య ఉంది. మీ వివరణలో ఇది అతకదు కదా. ఇండియా జి.డి.పి $1.63 ట్రిలియన్లు. అంటే మీరు చెప్పిన ఆస్ట్రేలియా, హాలండ్, బెల్జియం లాంటి సాచురేటెడ్ ఎకానమీల కంటే ఎక్కువ జిడిపి. కాని వీటి వృద్ధి ఇండియా కంటే చాలా తక్కువ. కాబట్టి ఆర్ధిక వ్యవస్ధల సైజు దృష్ట్యా పోల్చలేము అనడానికి వీలు కాకుండా ఉంది.

  మీరు రాసిన మొదటి వాక్యం మీరే దృష్టితో రాశారో కాని అది అర్ధవంతంగా ఉంది. ఎలాగంటే: అమెరికా, యూరప్ లు పూర్తిగా మార్కెట్ ఎకానమీలు. ఇండియా, చైనాలు అలా కాదు. పబ్లిక్ సెక్టార్ అక్కడ ఇంకా గణనీయంగా ఉంది. రెగ్యులేషన్స్ సంబంధించి ఈ రెండు గ్రూపుల ఆర్ధిక వ్యవస్ధల మధ్య తేడా ఉంది. మోడుస్ ఆపరేండి లో తేడా అది. రెండింటినీ పోల్చలేకపోవడానికి అదే ప్రధాన కారణం.

  అయితే, విశాల దృక్పధంతో చూసినప్పుడు ఆర్ధిక పరిస్ధితులను బ్రాడ్ గా పోల్చవచ్చు.

 3. VISEKHAR gaaru,

  You really didn’t understand what KRISHA was saying? Because you seem to have broad understanding of many things.

  Western Europe , Japan, Australia, NZ, US and Canada are developed economies hence the growth rates tend to be pretty low even in a favourable year. China’s GDP is big by virtue of its size. But when you compare with the per capita, it is still an emerging economy like India.

  It is extreemly rare that any of the developed economies grow by 4% for long (except when preceded by a recession). If they really grow like China and India, then the resources in this world deplete to a zero pretty soon.

  Becasue in 30 years China per capita would be $70,000.00 and US would be around $700,000.00 ..if both of them grew by 9.5%.

  The growth rate comparison is not correct. Regards

 4. పావని గారు, పోలీక తగినది కాదని చెప్పాను కదా. స్పెసిఫిక్స్ జోలికి వెళ్ళకుండా జనరల్ గా చూసినపుడు లేదా బ్రాడ్ గా చూసినప్పుడు పోల్చవచ్చన్నది నా అభిప్రాయం. జనరాలిటీ దృష్ట్యా పోల్చవచ్చనీ, పర్టిక్యులారిటీ దృష్ట్యా పోల్చలేమనీ నేను చెప్పదలిచాను.
  ఉదాహరణకి అమెరికా జిడిపి వృద్ధి రేట్లను పోల్చలేము కానీ జిడిపిలను పోల్చవచ్చు. అమెరికాని అభివృద్ధి చెందిన దేశమనీ, ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పడం కూడా పోల్చిచూసి చెబుతున్నదే. అమెరికా పరిపక్వమైన పెట్టుబడిదారీ మార్కెట్ ఎకానమీ, ఇండియా మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధలు అయినా తలసరి ఆదాయాన్ని పోల్చుతాము. అమెరికా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వనరులను సొంత చేసే అవకాశం ఉందనీ, ఇండియాకి ఇండియాది వనరులను కూడా సొంతం చేసుకోలేని దౌర్భాగ్యం అని తెలిసినా జిడిపిలను పోల్చి అమెరికా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అనీ, ఇండియా పది లేదా పదకొండవ స్ధానంలో ఉందనీ చెబుతాం. ఇవన్నీ పోలికలే. ఈ కోణంలోంచి పోల్చగలం అని నా భావన.

  “Because you seem to have broad understanding of many things.” –దీని అర్ధం (భాషా సమస్య కాదు) నాకు తట్టడం లేదు.

  వృద్ధి రేటు పోలిక సరైంది కాదనడంలో మీతో నాకేమీ విభేదం లేదు. కాకుంటే నేను మరొక కోణంలోంచి మరొక అంశం గురించి చెబుతున్నాను అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s