బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?

బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తెరాస తరపున నిలబడిన సిటింగ్ ఎం.ఎల్.ఎ పోచారం శ్రీనివాసులు దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించినట్లుగా ఫలితం ప్రకటించారు. పోచారం ఎన్నిక అందరూ ఊహించినదే కాగా, శ్రీనివాస్ గౌడ్ కు వచ్చిన ఓట్ల సంఖ్య మాత్రం ఎవరూ ఊహించినవి కావడమే ఇప్పుడు వార్తగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తాము గెలిచిన పది స్ధానాలకు తెలంగాణ ఉద్యమంలో…

ఒబామా దర్శకత్వంలో యాక్షన్ ధ్రిల్లర్: ‘ఇరాన్ కాన్స్పిరసీ’ -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -2

ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1

ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు…

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు

“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి…

బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు

తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన మూడు రోజుల రైల్ రోకో పిలుపు మేరకు మొదటిరోజు శనివారం నాడు రైల్ రోకో విజయవంతంగా జరిగింది. శుక్రవారం రోజే తెలంగాణ జిల్లాలన్నింటా మూడు వందల మంది వరకూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో 2300 వరకూ అరెస్టు చేశామని ఐ.జి.అనూరాధ తెలిపింది. ముందస్తు అరెస్టులు ఇంకా కొనసాగుతాయని తెలిపింది. పట్టాలపై కూర్చున్నవారిపైన రైల్వే యాక్టు కింద అరెస్టు చేసి రిమాండ్…

యూరప్ రుణ సంక్షోభాన్ని ప్రపంచానికి అంటించొద్దు -అమెరికా తదితరులు

శుక్రవారం, జి20 గ్రూపు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రధాన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపు సమావేశాల సందర్భంగా యూరప్ రుణ సంక్షోభం పరిష్కరించే బాధ్యతను ప్రపంచ దేశాలపై వేయడానికి యూరప్ దేశాలు (ఇ.యు) చేసిన ప్రయత్నాన్ని అమెరికా తదితర దేశాలు తిప్పికొట్టాయి. యూరప్ రుణ సంక్షోభాన్ని యూరప్ దేశాలే పరిష్కరించుకోవాలనీ, ప్రపంచానికి అంటించాలనుకోవడం సరికాదని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వాదించాయి. యూరప్ రుణ సంక్షోభం…

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప అరెస్టుకు రంగం సిద్ధం

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక లోకాయుక్త కోర్టు కొట్టివేసింది. దీనితో యెడ్యూరప్ప అరెస్టు ఖాయమయ్యింది. బెంగుళూరులోని లోకాయుక్త ప్రత్యేక కోర్టు శనివారం యెడ్యూరప్ప బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేసింది. దరిమిలా బి.జె.పి కేంద్ర నాయకత్వం సమావేశమై యెడ్యూరప్ప అరెస్టు విషయమై ఏం చేయాలన్నదీ చర్చిస్తున్నట్లుగా వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములను డీ నోటిఫై చెయ్యడంలో యెడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డాడని యెడ్యూరప్ప అభియోగాలు…

మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…

అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ

ఈ సారి ఇరాన్ ప్రభుత్వం నేరుగా అమెరికా గడ్డపైనే సౌదీ అరేబియా రాయబారి హత్యకు కుట్ర చేసింది. అందుకు విచిత్రంగా మెక్సికో ‘హిట్ మేన్’ (ఖచ్చితంగా చెబితే కిరాయి గూండా) ను ఇరాన్ కాంట్రాక్టుకు మాట్లాడుకుంది. కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడాడని అమెరికా చెబుతున్న వ్యక్తి, డ్రగ్స్ కేసుల్లో సి.ఐ.ఎ కి ఇన్‌ఫార్మర్ అన్న విషయం కూడా మరిచిపోయి అమెరికా గొప్ప కుట్రను బైటపెట్టాయి. ఇరాన్ కుట్రకు శిక్షగా అమెరికా తాజాగా మరికొన్ని ఆంక్షలను ఇరాన్ పైన…

సామాజికంగా, జీవ శాస్త్ర పరంగా “జాతి” నిర్వచనం

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, పౌర హక్కుల కార్యకర్త, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పైన బుధవారం ఢిల్లీలో దాడి జరిగింది. శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన లకు చెందిన సభ్యులు ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని పత్రికలు నిర్ధారించాయి. ఒకరు దాడి జరిగినపుడే పట్టుబడగా, మిగిలిన ఇద్దరు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఎందుకు లొంగిపోతున్నారని విలేఖరులు ప్రశ్నిస్తే “మేము చట్టాన్ని ఉల్లంఘించాము. అది నేరం. కనుక లొంగిపోతున్నాం” అని చెప్పారు.…

హర్యానాలో టెర్రర్ కుట్ర విఫలం

హార్యానా రాష్ట్రం, అంబాలాలో పార్క్ చేసి ఉన్న కారు నుండి పోలీసులు డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్ధాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలలో భాగంగా ఇది వెల్లడి కాకపోవడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పందించారని పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టెర్రరిస్టు పేలుళ్ళు జరగకుండా తప్పించుకున్నట్లైంది. సమాచారం అందుకున్నాక ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇరువురూ ఉమ్మడిగా పార్కింగ్ చేసి ఉన్న బ్లూ ఇండికా కారును తనిఖీ చేశారు. “ఐదు డిటోనేటర్లు, రెండు టైమర్…

ఇప్పుడు, తెలంగాణ పరిష్కారం కోసం రెండో ఎస్సార్సీ వేయడం అంటే……

ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రెండో ఎస్.ఆర్.సి వేయడం అంటే, నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడమే. —–సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ – (ఇంతకీ గాడిద ఎవరు చెప్మా!!!) — —